🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 52*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ*
*పురాం భేత్తు శ్చిత్తప్రశమరస విద్రావణఫలే |*
*ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే*
*తవాకర్ణాకృష్ట స్మరశరవిలాసం కలయతః ‖*
పర్వతములకు రాజైన హిమవంతుని వంశమనే సిగకు పూమొగ్గ అయిన దేవీ, ధ్యాన సమయంలో నా హృదయ కమలంలో ప్రత్యక్షమై చూపిస్తున్న నీ నేత్రాలు బాణములకు కూర్చిన ఈకల వంటి కనురెప్ప వెండ్రుకలతో అలరారుతూ, చెవులవరకూ విస్తరించినవై, పరమశివుని చిత్త ప్రశాంతతను భంగపరచటమే లక్ష్యంగా వుండి, కొసల వరకు లాగబడిన మన్మథుని చెరకు విల్లు యొక్క సొగసును తలదన్నుచున్నట్లుగా వున్నవి.
ఇక్కడ అమ్మవారు తన శృంగార రస విలాసమును అభివ్యక్తీకరిస్తూ, తన *చలన్మీనాభ లోచనములతో* శివుని ధ్యానభంగము చేయుచుండగా, ఆమెకు సహాయపడుటకై మన్మథుడు తన పంచ పుష్ప బాణములతో ఆయనను సమ్మోహనపరుస్తున్నాడు అని అమ్మవారి నేత్ర సౌందర్యమును గురించి చెప్తున్నారు.
మన్మధుని పంచ పుష్ప బాణాలు ఇవి
అరవిందము (తెల్ల కలువ), అశోకము, చూత (మామిడి), నవమల్లిక, నీలోత్పలము (నల్లకలువ).
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి