3, జనవరి 2023, మంగళవారం

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి.

 వీరు నేడు కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి. 


వీరే పూర్వాశ్రమంలో.... సాహిత్య, అవధాన, ఆశు కవితా, భువనవిజయ సామ్రాజ్యాలలో సమ్రాట్ గా వెలిగిన డాక్టర్ శ్రీ ప్రసాదరాయ కులపతిగారు.   గుంటూరు హిందూ కాలేజ్ కులపతి/ Principal గా,  తెలుగు ఉపన్యాసకులుగా విద్యార్థులను సన్మార్గంలో నడిపిన గురుదేవులు.


 మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యోగాభ్యాసం,వ్యాయామం, ముష్టియుద్ధం, వెయిట్ లిఫ్టింగ్, అవధానం, ఆశుకవిత్వం... ఇలా బహువిద్యలలో అసమాన ప్రతిభామూర్తులైన దివ్య దీప్తులు వీరు. 


ఇంతటి బహుముఖ ప్రజ్ఞా జ్ఞాన ఘనులైన పీఠాధిపతులు భారతదేశంలోనే  వీరు తప్ప ఇంకెవరూ లేరన్నది పెద్దలమాట !!  


వీరి ధారణ, సాధన అనన్య సామాన్యం. కొన్ని వేల పద్యాలు, శ్లోకాలు వీరి మస్తిష్కం లో నిక్షిప్తమై ఉంటాయి. వీరు అనేక దేవతల మంత్రాలను కొన్ని కోట్ల పర్యాయములు  ఉపాసించారు. 


వీరి ఉఛ్వాస నిశ్వాసలే మంత్రములు... మంత్రములే వీరి ఉఛ్వాస నిశ్వాసములు... 


వీరిని చూస్తేనే? నడిచి వచ్చే మంత్రాధిదేవతలా.. తరలివచ్చే పూర్వమహాకవి సమూహముగా అనిపిస్తుంది...  


వీరి పూర్వీకులూ అంతటి వారే! వీరి ముత్తాత శ్రీ పోతరాజు రామకవి. వీరు 20 కళలలో నిష్ణాతులు. సుప్రసిద్ధ కొప్పరపు సోదర కవులకు వీరే అవధాన గురువరేణ్యులు. కులపతి గారి పితామహ వంశం పోతరాజు వారు, మాతామహ వంశం కొప్పరపు వారు. 


రెండు వంశములలో పూర్వులంతా మహా మంత్రులు,దండనాథులు, దివానులు, గ్రామాధికారులు, మహాకవులు.అందుకే?   అటు కవిత్వము, ఇటు వ్యాయామము   రెండింటి పట్ల ఆకర్షణ, అనురాగం, సాధన, ప్రజ్ఞ సహజసిద్ధంగా వీరికి వచ్చాయి. 


వీటి సాధనలో వీరు ఎంచుకున్నది ఉపాసనా మార్గం. ఇందుకే,  ఆ విద్యలు రక్తనిష్ఠమై,హృదయ కంజాతస్థమైనాయి.


 బహుశా! తిక్కన, పెద్దన, తిమ్మరసు వంటి మహనీయులు  ఈ కుటుంబాలకు ప్రేరణ అయిఉంటారు. తిక్కన కుటుంబీకులు దండనాధులుగా, మహా మంత్రులుగా, గ్రామాధికారులుగా చరిత్ర ప్రసిద్ధులు. 


అల్లసాని పెద్దన శ్రీకృష్ణ దేవరాయలకు యుద్ధవ్యూహం, రణతంత్రంలో గురు దేవులుగా ఉండేవారు. 


ఇక,  తిమ్మరసు వారిది  ఇక్కడి కొండవీడు ప్రాంతం నుండే వెళ్లిన కుటుంబం. రాయలవారి కుటుంబాలకు తండ్రి, గురువు, దైవము... అన్నీ తిమ్మరసు వారే అన్నది చరిత్ర లిఖితము.


 ఇలా... ప్రసాదరాయ కులపతి గారి వంశాలపై వీరందరి ప్రభావం  తప్పక ఉంటుంది. 


కులపతి గారు  మొట్టమొదటి అవధానం తన 15వ ఏట  కొప్పరం లోనే చేశారు. ప్రఖ్యాత కొప్పరపు కవుల తమ్ముడు బుచ్చిరామయ్య గారి అధ్యక్షతలో జరిగింది. అలా మొదలైన వారి అవధానం అప్రతిహతంగా సాగింది.


 కులపతి గారి గురుదేవులు శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు. వారి సూచనతో కులపతి గారు అవధానాలకు  స్వస్తి చెప్పి,  తెలుగులో M. A., Phd సంపూర్ణం చేశారు.  


మహాకవి పోతన్న భాగవతం పై వీరి పరిశోధన జరిగింది. ఆ ఆశుకవితా ధోరణి ని, ఆ  అవధాన విద్యామూలమైన ధారణను భువన విజయాలలో ప్రదర్శించి, పద్యానికి పట్టాభిషేకం చేశారు. 


2002లో సన్యసించి, కుర్తాళ పీఠాధిపతులయ్యారు. పూర్వం శ్రీ మౌనస్వామి, శ్రీ విమలానంద భారతి, శ్రీ త్రివిక్రమ రామానంద భారతి, శ్రీ శివ చిదానంద భారతి వంటి   మహితాత్ములు అధిపతులు గా ఉన్న శ్రీ సిద్ధేశ్వరీ పీఠానికి వీరు నేడు అలంకృతులయ్యారు.


తమిళనాడులో తెలుగు స్వామి మౌనస్వామి 1916లో స్థాపించిన ఈ సిద్ధేశ్వరీ పీఠం.. నేటి  శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి ఏలుబడిలో.... ఆధ్యాత్మిక, సారస్వత , సంగీత సమలంకృతమై వేయి వెన్నెలలతో మేటి పీఠంగా  వెలుగులీనుతోంది...  


   తిక్కన, పోతన, శ్రీనాథుడు,  శ్రీ కావ్యకంఠ గణపతిముని, తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదర కవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటి... మహా ఔపదేశిక, సహజ కవులే ప్రసాదరాయ కులపతి గారి కవన, ఉపాసనా జీవనానికి ప్రభావ మూర్తులు.


 అవధాన, ఆశుకవిత్వం తో పాటు ఎన్నో మహాద్భుతమైన రచనలు చేసిన మహాకవి, మహా మనీషి, మహితాత్ముడు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి. 


" కులపతి.. కులపతి.. మహాకవి దళపతి 'అని కీర్తిగాంచిన ఈ మహనీయునికి, మహా మంత్ర స్వరూపంగా  భాసించే ఈ స్వాములవారికిి అక్షర సుమములతో అర్చన చేస్తున్నాను -


రోజుకు వెయ్యి నేల దండీలు, రెండు వేల బస్కీలు తీసేవారు. ఇనుప కడ్డీలను ఒంచేవారు. పెద్దపెద్ద రాళ్లను ఎత్తి పడేసేవారు. కొన్ని గంటలపాటు ఒకే యోగాసనంలో ఉండేవారు. ఇక యోగ సాధన అసామాన్యం. కొప్పరపు కవుల తర్వాత వీరంతటి వేగంగా పద్యాలు చెప్పే నేర్పుకలవారు లేనేలేరు. వారు పుస్తకాలు చదివి, 60 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ కొన్నివేల పద్యాలు, శ్లోకాలు వారి రసనాగ్రంపై నాట్యం చేస్తూ ఉంటాయి. 10వ తరగతి నుండి Phd. వరకూ వారే అగ్రస్థానం సాధించారు. 19 ఏళ్లకే కాలేజీలో  Tutor అయ్యారు.  ఇక వారిది కఠోరమైన మంత్రసాధన. ఇంతటి ప్రతిభ, శక్తి, సాధన, పట్టుదల ఉన్న ఈ స్వామివారిని మనం దర్శించుకోవడం, వారు ఉన్న కాలంలోనే మనమూ ఉండడం మహద్భాగ్యం... అని, నా  భావన..


 నమస్కారములతో

కర్కోటకుడు - మంచివాడు

 కర్కోటకుడు - మంచివాడు


శ్రీమఠంతో చిరకాలంగా సంబంధం ఉన్న ఒక భక్తుడు. ఒకసారి పరమాచార్య స్వామివారితో మాట్లాడుతుండగా మరొక వ్యక్తి గురించి నింద చేస్తూ సంభాషించే అవకాశం లభించింది. “ఆ వ్యక్తి పరమ కర్కోటకుడు!” అని అన్నాడు.


ఒక నిముషం తరువాత స్వామివారు, “అతను మంచివాడు అని అంటున్నావా?” అని అడిగారు.


స్వామివారి మాటలు ఆ భక్తునికి అర్థం కాలేదు. “అతణ్ణి నేను భయంకరమైన విషం కలిగిన కర్కోటకుడు అని అన్నాను. . .”


“నీకు ప్రాతఃస్మరణ శ్లోకం తెలుసా?” అని అడిగారు స్వామివారు.


కర్కోటకస్య నాగస్య దమయన్త్యా నలస్య చ,

ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనమ్.


“కర్కోటక నాగుడు, దమయంతి, నల, ఋతుపర్ణుడు - వీరిని తలచినంతనే పాపాలు పోతాయి. వారందరూ అంతటి పుణ్యవంతులు”


అప్పటిదాకా దూషించిన ఆ భక్తుడు ఇప్పుడు సంకటంలో పడ్డాడు. అంటే ఇప్పటిదాకా అతని గురించి చెడుగా మాట్లాడాలి అనుకున్నప్పటికీ చెడుగా మాట్లాడలేదు అన్నమాట.


“నువ్వే అతడు మంచివాడు అని చెబుతున్నావు. అవును కదా?”

పరమాచార్య స్వామివారి దృష్టిలో అందరూ మంచివారే. అద్వైత ప్రతిష్టాపనాచార్యులైన శంకరులు అధిష్టించిన పీఠానికి పీఠాధిపతులు కదా మన స్వామివారు!


--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అయ్యప్పస్వామి

 అయ్యప్పస్వామి కాల్పనిక దైవమా? లేక నిజంగానే హిందూధర్మంలోని దైవమా?


అయ్యప్పస్వామి ఉనికి మీద, పుట్టుకమీద ఎన్నో అనుమానాలు, అపహాస్యాలు మన హిందువులలోనే చాలామందికి ఉన్నాయి.  ఇప్పుడు బైరి నరేష్, రాజేష్ ల మూలంగా వచ్చిన వివాదం కారణంగా అయ్యప్పస్వామి భక్తులంతా ఏకమయ్యారు. హిందూ ధర్మంలో అయ్యప్పస్వామి ఉనికి గురించి చర్చించడానికి ఇది సరైన సమయం.


మన హిందూ వాజ్ఞ్మయం మొత్తం వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఆగమాల మీద ఆధారపడి ఉంది. గ్రామదేవతలనుంచి నిరాకారపరబ్రహ్మ 

వరకు ఏ దేవతలను ఏయే మంత్రాలతో ఏవిధంగా ఏసమయంలో ఎలాంటి ద్రవ్యాలతో పూజలు, హోమాలు చేయాలో వీటిలో వివరంగా ఉంటుంది. దేవతలను మంత్రాలను వేదోక్తం, పురాణోక్తం అని రెండు రకాలుగా విభజన చేయాలి. అగ్ని, గణపతి, సుబ్రమణ్యం, సూర్యుడు, విష్ణువు, శివుడు, లక్ష్మీ, దుర్గ, రుద్ర, గౌరీ, సరస్వతి, బ్రహ్మ,  ఇంద్రాది దిక్పాలకులు, నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, పితృ దేవతలు, వాస్తు, భూమి, సర్ప, గరుడ, గోవు లాంటి ప్రధాన దేవతల గురించి వేదమంత్రాలు ఉంటాయి. శ్రీ విద్య లాంటి కొన్ని పురాణోక్త మహావిద్యల గురించి కూడా వేదోపనిషత్తులలో వివరణ ఉంది.


పురాణోక్త దేవతలను గురించి చెప్పబడిన మంత్రోపాసనలకు పురాణాలతోపాటు విడిగా తంత్రాలు, కల్పాలు ఉన్నాయి. ఇలాంటి మంత్రాలు సప్తకోటి అంటే ఏడుకోట్లు ఉన్నాయని దాదాపుగా ప్రతి పురాణంలో వేదవ్యాసులు చెప్పారు. ఈ ఏడుకోట్ల మంత్రాలు పరమశివుని పంచముఖాలనుంచి వ్యక్తం కాగా కొన్నింటికి దక్షణామూర్తి ఋషిగా, కొన్నింటికి హయగ్రీవస్వామి ఋషిగా, మిగిలిన వాటిని ఆనందభైరవుడు ఋషిగా ఉండి దర్శించారు.


 దక్షిణామూర్తి, హయగ్రీవస్వామి బోధించిన మార్గం దక్షిణాచారం, సమయాచారం అని, ఆనందభైరవుడు బోధించిన మార్గం వామాచారం అని ప్రసిద్ధి పొందాయి. వామాచారం బ్రాహ్మణులకు నిషేధం అని వాటిలో చెప్పారు. అలాగే వామాచారం పాటించేవారు తులసి, గంగలను వదిలేయాలని చెప్పారు. ఇక అందరికీ ఆమోదయోగ్యమైన దక్షిణాచారం లేదా సమయాచారాన్ని ఆరు ఆమ్నాయాలుగా విభజించారు. వీటిని షడామ్నాయ మంత్రాలు అంటారు. వేదంలో చెప్పిన మృత్యుంజయ, గాయత్రీ లాంటి సమస్త దేవతలకు తాంత్రిక బీజాక్షరమంత్రాలు వీటిలో చెప్పారు. వాసుదేవ ద్వాదశాక్షరి, శివపంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, కాళీ, తార , శ్రీ విద్య  లాంటి మహామంత్రాలు, దశమహావిద్యలు ఈషడామ్నాయాలలో భాగమే. 


వేదంలో చెప్పబడని చండీ, కాళీ, తార లాంటి దేవతామంత్రాలు కూడా షడామ్నాయాలలో కనబడతాయి. వీటిలో భాగంగా శాస్తా మంత్రం కూడా కనబడుతోంది. ఈ మంత్ర అంగన్యాస కరన్యాసాలలో  శాస్తా, హరిహరపుత్ర, మహాశాస్తా, ధర్మశాస్తా, మహాశాస్త్రీ అనే పేర్లతో అయ్యప్పస్వామి మంత్రోపాసన గురించి ఉంది. ఈ మంత్రానికి బ్రహ్మ ఋషి అని చెప్పారు.


దీనితో పాటు ప్రసిద్ధ లలితా సమస్రనామం చెప్పిన బ్రహ్మాండపురాణం, లలితోపాఖ్యానంలో హయగ్రీవస్వామి అగస్త్య మహర్షికి ప్రాయశ్చిత్తకర్మల గురించి చెబుతూ "లక్ష్మీః సరస్వతీ గౌరీ చండికా త్రిపురాంబికా, భైరవో భైరవీ కాళీ మహాశాస్త్రీచ మాతరః" అంటూ లక్ష్మీ, సరస్వతి, గౌరి, చండిక, త్రిపురాంబిక, భైరవ, భైరవి, కాళీలతో పాటు మహాశాస్త్రీ అంటూ అయ్యప్పస్వామిని కూడా పూజించాలంటారు. ఈ లలితోపాఖ్యానంలోనే మహామాయ గురించి చెబుతూ మన్మథుడిని సైతం భస్మం చేసిన పరమశివుడు మహామాయ ప్రభావం వల్ల జగన్మోహిని అవతారం చూసి మోహానికి గురైన కారణంగా హరిహరపుత్ర జననం జరిగిందని స్పష్టంగా ఉంది. 


సహ్యాద్రి నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమ కనుమలలో అనేక ప్రాచీన దేవాలయాలను పరశురాముడు ప్రతిష్ట చేశారు. పోర్చుగీస్, టిప్పుసుల్తాన్, బ్రిటీష్ వాళ్ల దాడుల్లో వీటిలో ఎక్కువ శాతం ధ్వంసమై దోపిడీకి గురై దశాబ్దాల తరబడి ఆదరణ లేకుండా పోయాయి. స్వాతంత్ర్యం తరువాత ఈపరిస్థితి కొంత మారిన కారణంగా తిరిగి అయ్యప్పస్వామి దేవస్థానం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ స్వామి మీద ఒక సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు తోడు కావడంతో దక్షిణాదిలో స్వామిమాలధారులు విపరీతంగా పెరిగారు. షిర్డీసాయి సినిమా కూడా దాదాపు ఇదే సమయంలో రావడం వల్ల కొంతమంది సనాతన వాదులు సాయిబాబాలాగా అయ్యప్పస్వామి కూడా ఈమధ్య కాలంలో పుట్టించిన దేవుడని అపోహ పడుతున్నారు.


దీనికి సినిమా వాళ్ళు సృష్టించిన వావరు స్వామి, మకరజ్యోతి గురించి కల్పనలే కారణం. వావరు స్వామి సెక్యులర్ రైటర్స్ సృష్టించిన కథ. అరుణాచలంలో ఏటా కొండమీద వెలిగించే అఖండ దీపం లాంటిదే మకరజ్యోతి. దీన్ని అర్థం చేసుకుంటే అయ్యప్పస్వామి గురించి ఎలాంటి అనుమానాలు అపోహలు ఉండవు.

- స్వామి శరణం

బ్రాహ్మణిజం

 #ఇది బ్రాహ్మణిజం అంటే.. (పూర్తిగా చదవండి, అర్దం చేసుకోండి, గౌరవించండి, కుదిరితే పాటించండి.

ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.

ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.

వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ? దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ? అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి. ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

★ పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.

★ తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.

★ ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.

★ పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.

★ నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.

★ ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.

★ ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.

★ కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.

★ చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.

★ ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.

★ చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.

★ విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.

★ ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.

★ గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.

★ విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.

★ బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.

★ మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.

★ తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.

★ ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.

★ అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.

★ భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.

★ అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.

బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.

మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్వంతో ఒక్క మాట అనే నైతిక హక్కు ఎవరికీ లేదు.

జై శ్రీరామ్.

చిదంబరం - కుంచితపాదం

 చిదంబరం - కుంచితపాదం


పరమాచార్య స్వామివారు సిద్ధి పొందే సంవత్సరం ముందు వారి తొంబైల చివర్లలో జరిగిన సంఘటన ఇది. మహాస్వామి వారు అక్కడ ఉన్న శిష్యులతో చిదంబరంలో ఉన్న శ్రీనటరాజ స్వామి గుడికి వెళ్ళాలని, స్వామి దర్శనం చేసుకోకావలని ఉందని చెప్పేవారు. చిదంబరం అలయముకు సంబధించిన వివిధ మొక్కల వేర్లతో చేయబడిన ఒక చిన్న మాల వంటి "కుంచితపాదం" గురించి చెప్పేవారు (ఇక్కడున్న చిత్రంలో స్వామివారు తలమీద దరించి ఉన్నది చూడవచ్చును).


చిదంబరం వెళ్ళిన వాళ్ళకు దీనిగురించి బాగా తెలిసిఉంటుంది. ‘కుంచితపాదము’ను దర్శిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగములు అన్ని నయం అవుతాయని, మోక్షం ప్రసాదింబడుతుందని అందరి విశ్వాసము.


స్వామివారి మాటలు విన్న శిష్యులు విచారంతో కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు అక్కడికి పోవుట దాదాపుగా అసాధ్యము. అంతదూరం స్వామిని తీసుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు. ఆశ్చర్యకరంగా స్వామివారు ఆ మాటలన్న మరుసటి రోజు ఉదయమున చిదంబరం దేవస్థానం నుండి కొందరు దీక్షితర్లు వచ్చారు.


థిల్లై నటరాజ స్వామివారి ప్రసాదమును, ‘కుంచితపాదము’ను తీసుకొని శ్రీ మఠానికి వచ్చారు. మహాస్వామి వారిని దర్శించాలని, చిదంబరం నుండి తీసుకు వచ్చిన ప్రసాదములను శ్రీ వారికి ఇవ్వాలని శిష్యులకు తెలియచేసారు.


ఆ మాటలు విని శిష్యులు చాలా సంతోషించారు. వెంటనే స్వామి దగ్గరకు వెళ్లి చిదంబరం ఆలయ దీక్షితర్లు తమ దర్శననికి ఎదురుచూస్తున్నారు అని తెలియజేసారు. వెంటనే స్వామి వారి అనుమతితో ప్రసాదములు తీసుకువచ్చారు. మహాస్వామి వారు వెంటనే ‘కుంచితపాదము’ను తీసుకుని తమ తల పైన పెట్టుకున్నారు. నటరాజ స్వామిని స్తుతిస్తూ వారిని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇది.


ఈ చిత్రపటం చూసినంత మాత్రం చేత అన్ని రోగములు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇందులో పరమౌషధమైన ‘కుంచితపాదము’, ఆది వైద్యుడైన సాక్షాత్ ధన్వంతరి స్వారుపము ‘పరమాచార్య స్వామి’ వారు ఉన్నారు.


స్వామి వారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యాలతో ప్రశాంతముగా జీవించుగాక!!!


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అంతరార్ధం

 శివ శివా..రామ రామా..అనడంలో అంతరార్ధం తెలుసా మీకు ?

ఏదైనా తప్పు జరిగినప్పుడు,

చూడకూడనిది చూసినప్పుడు

శివ శివా, రామరామా,

శ్రీరామా అని అనుకోవటంలో ఆంతర్యం ఏమిటి?

అసలిది ఎప్పటి నుంచి అలవాటైంది?

అనే విషయాన్ని గురించి..వివరించే కథా సందర్భం.

శివమహాపురాణం రుద్రసంహిత ఇరవైనాలుగో అధ్యాయంలో ..ఈ కథాసందర్భం కనిపిస్తుంది.

శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు.

ఆ స్వామి అరణ్యవాసం చేస్తున్నప్పుడు రావణవధ అనే దైవకార్యం కోసం సీతాపహరణ జరిగింది. అప్పుడు రాముడు, ఆయనను వెన్నంటి ఉన్న తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరూ ఆ అడవుల్లో సీతకోసం అడుగడుగునా వెతుకుతూ ముందుకు వెళ్లసాగారు. సీతను వెతికే సమయంలో రామచంద్రుడిని అమితమైన దుఃఖం ఆవరించింది. అలాంటి స్థితిలో ఉన్న రాముడిని లక్ష్మణుడిని లోకసంచారం చేస్తూ ఆకాశమార్గాన వెళుతున్న శివుడు, పార్వతీదేవి చూశారు.

కట్టుకున్న భార్య కోసం రాముడు విలపిస్తున్న

తీరు సతీదేవికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.

భార్య కోసం భర్త నిజంగా ఇంత వేదనను అనుభవిస్తాడా?

పురుషులు స్త్రీల విషయంలో అందులోనూ

భార్య విషయంలో ఇంతగా మమకారాన్ని కలిగి ఉంటారా? అనే సందేహాలు ఆమెకు కలిగాయి. అదే విషయాన్ని గురించి శివుడిని సతీదేవి అడిగింది. అప్పుడు శివుడామెకు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడని,

ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎలా పాటించాలో ఆయనకు బాగా తెలుసునని,

ఒక భర్తగా భార్యను ప్రేమించటంలోనూ, ఆరాధించటంలోనూ రాముడిని మించిన వారు మరొకరు లేరని వివరించాడు. అయినా సతీదేవికి ఆ విషయం అంతగా మనసుకు ఎక్కలేదు. రామచంద్రుడు ఆనందానికి దూరమై దేహకాంతి తగ్గి దుఃఖభారంతో అడుగులు ముందుకేయటం ఇవన్నీ నటన అని భ్రమించింది. అందుకే మళ్లీ ఆ పరమేశ్వరి శివుడిని రాముడి గురించి అడుగుతూ రాముడి ప్రవర్తన మీద తమకు నమ్మకం కలగటం లేదని అనుమతిస్తే, తాను స్వయంగా శ్రీరామచంద్రుడిని పరీక్షించి నిగ్గు తేల్చాలనుకొంటున్నట్లు చెప్పింది. శివుడు చిరునవ్వు నవ్వి ఎవరు ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా ఏకపత్నీవ్రతం విషయంలో రాముడిదే గెలుపవుతుందని అన్నాడు. సతీదేవిని వెళ్లి రాముడిని పరీక్షించమని చెప్పి

ఆయనొక మర్రిచెట్టు కిందకు వెళ్లాడు. సీత రూపంలో సతీదేవి వెంటనే సీతామాతలాగా రూపం మార్చుకొని సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్మణులకు కనిపించే మార్గంలో వారికెదురుగా నడుచుకొంటూ రాసాగింది. శ్రీరాముడు భార్య భ్రమలో ఉండి తనను సమీపిస్తాడని, తననే భార్యగా అనుకొని సంతోషంతో పొంగిపోతాడని ఆమె అనుకొంది. కానీ సీతగా రూపం మార్చుకొన్న సతీదేవి సమీపానికి వచ్చేసరికి శ్రీరాముడు శివ శివా అంటూ శివ నామస్మరణం చేస్తూ పక్కకు తప్పుకొని వెళ్లిపోయాడు.

లక్ష్మణుడు ఆయననే అనుసరించాడు.

రాముడి గురించి శివుడు చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని అలా సతీదేవి గ్రహించింది.

భార్య మీద ప్రేమానురాగాలు ఏ మేరకుండాలో,

భ్రమలు ఆకర్షణలకు దూరంగా వాస్తవమైన ప్రేమ అనేది ఎలా ఉంటుందో ఇలా రాముడి పాత్ర చిత్రణం ద్వారా శివమహాపురాణం వివరిస్తోంది.

అంతేకాక పరస్త్రీ తన ఎదురుగా ఆకర్షించే రూపంలో వచ్చినప్పుడు రాముడు శివశివా అనటంవల్ల

శివనామం పాపహరణమని,

అది రాముడికి కూడా ఎంతో ఇష్టమైనదని స్పష్టమవుతోంది.

అలాగే శివుడికి రామచంద్రుడి వ్యక్తిత్వం మీద ఎంత నమ్మకమో తెలుస్తుంది.

అందుకే రామనామం శివుడికి ఇష్టమైంది.

పురాణకాలం నుంచి ఇలా చూడకూడనివి చూసినప్పుడు లేదా పాపం అని అనిపించినప్పుడు శివ శివా, రామ రామా అని అనుకోవటం ఓ అలవాటుగా వస్తోందని

ఈ పురాణ కథవల్ల తెలుస్తోంది.


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది

 ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది??


ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పుపట్టిన కత్తితో ఏ సైనికుడు యుద్ధం చేయలేడు.అందుకే యుద్ధానికి వెళ్లేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి. అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా..జీవిత పరమర్థాన్ని తెలుసుకోవాలన్నా , సాధనమైన శరీరాన్ని అందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రాచీన రుషులు మనకు అందించిన మార్గమే సదాచారం.


ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు. ఆయన తన చివరి రోజుల్లో… భగవంతుడిని ప్రార్థిస్తూ, తాను మరల పుడితే భారత దేశంలో పుట్టాలని కోరుకున్నాడట. అయితే ఈనాటి ఇంగ్లీష్ ఎడ్యుకెటేడ్ ఆధునిక మేధావులు, సెక్యులర్ వాదులు , మార్క్స్ మేకాలే వాదులు మాత్రం పుణ్యభూమి భారత్ విలువ తెలియక ఇప్పటికి మన దేశాన్ని నిందిస్తున్నారు. మాక్స్ ముల్లర్ భారత్ లో పుట్టాలని కోరుకోవడానికి ప్రధాన కారణం సదాచార పూర్ణమైన భారతీయ జీవన విధానం. మానవుడు నిద్రలేవడంతోనే అతని దైనందిన జీవితం ఆరంభమౌతుంది. సదాచారంలో మొదటి అంశం నిద్రలేవటం.


నిద్ర ఎప్పుడు లేవాలి..?


ఈ విషయంలో మన ధర్మ శాస్త్రాలు, వైద్యశాస్త్రం ఏం చెప్పాయి..?

నిద్ర లేచే విషయంలో హిందు ధర్మ శాస్త్రాలు, వైద్య శాస్త్రం కూడా ఒకే మాటగా “బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత” అని, అలాగే “బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితం” అని పేర్కొన్నాయి. ఆయురారోగ్యాలతోపాటు ధర్మాచరణకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ ధర్మ గ్రంథాలు తెలిపాయి.


సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రమంటారు. దీనికి ముందున్నదే బ్రాహ్మీ ముహూర్తం. అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం. ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింపగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. దీనిని ఆదాన సమయం అంటారు.


మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు శిథిలత నిచ్చు సమయం. ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాల శక్తులు సన్నగిల్లుతాయి. దేహం విశ్రాంతి కోరుకుంటుంది. దీనిని విసర్గ సమయం అంటారు. ఆదాన సమయంలో నిద్రపోవటం, విసర్గ సమయంలో మెలకువగా ఉండటం శారీరకంగానూ, మానసికంగానూ అనారోగ్యకరమైంది. దీంతో బుద్ది చురుకుదనం కోల్పోతుంది. లౌకిక వ్యవహారాలకే ప్రాధాన్యత నిచ్చేవారు ఈ వత్యాసం గుర్తించలేరు. ఇలాంటి వారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింప చేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు. అందుకే ఇలాంటి వారికి అవసరమైన శాంతస్థితి చేకూరదు. దీంతో వీరు నిజమైన సుఖ శాంతులకు దూరం అవుతారు. ఈ ప్రవృత్తిని నిశాచర ప్రవృత్తిగా పిలుస్తారు.


వేకువ జామునే నిద్ర లేచే విషయంలో పసిపిల్లలే సదాచారపరులు. చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తాన్నే నిద్రలేస్తారు. వాళ్లను నిద్రలేపుతారు. పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం. బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు సకల పుష్పాలు…ఈ ముహూర్తంలోనే పరిమళాలు వేదజల్లుతాయి. అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ది కూడా వికసించి ఉత్తమ సమాలోచనలు పొందుతుంది. అందుకే ఇది బ్రాహ్మీ ముహూర్తం అయ్యింది. బ్రాహ్మీ అంటే సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్లు తుడుచుకోవాలి. కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్లకు హఠాత్తుగా వెలుగు చూపటం దోషం. అందుకై ఇలా చన్నీటితో తుడుచుకోవాలి.


ఆ తర్వాత ‘సముద్ర వసనే దేవి! పర్వత స్తనమండలే, విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే’ అని భూదేవికి నమస్కరించిన తర్వాతే పాదం భూమిపై మోపే ఆచారం మన పెద్దలది. మన దైనిందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము. కాబట్టే మనకు తిండిని ప్రసాదించే, జీవితాంతం మనలను భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకొని నెత్తిన కాలు పెట్టుటం కనీస కర్తవ్యం. కాలు తగిలితే సారీ చెప్పుకొనే నాగరికతను చూస్తున్న మనం…భూదేవిని క్షమించమని ప్రార్థనను చేయలేమా?


నిద్రలేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతోంది. నిద్రలేవగానే శ్రోతియుని , గుణ సంపన్నుని, గోవును, అగ్నిని, సోమయాజిలాంటి వారినే చూడాలని, పాపిష్ఠివారిని, అమంగళకర వ్యక్తులను చూడతగనది అంటారు. ఇలా అనడంలో నిద్రలేచిన వెంటనే చేసే దర్శనం ఆరోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఎప్పుడైన ప్రమాదం జరగగానే ఛీ..నిద్రలేస్తూ ఎవరి మొగం చూచానో అనుకోవడం మనం చూస్తాం. చాలా మంది నిద్రలేవగానే అరచేతిని చూచుకొంటారు.


కరాగ్రే వసతే లక్ష్మీ-కరమధ్యే సరస్వతీ! కరమూలే స్థితో బ్రహ్మా- ప్రభాతే కరదర్శనం!! అనేది ఆర్ష వ్యాక్యం. అరచేతి అగ్రభాగం లక్ష్మీస్థానం. మధ్యభాగం సరస్వతి స్థానం. కరమూల బ్రహ్మ లేదా గోవింద స్థానం. కాబట్టే ఉదయం లేవగానే అరచేతిని చూచుకొంటారు. అరచేతిలో శ్రీరామ వ్రాసి కన్నుల కద్దుకొవడం కొందరు చేస్తారు. నిద్రలేవనగానే ఏ విధంగానైన దర్శనం అయ్యేటట్లు చేసుకోవడం మంచిది.


దైవ ప్రార్థన తర్వాత ముఖం, కాళ్లు చేతులు కడుగుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. అనంతరం జలపానం చేయాలి. ప్రాతఃకాల జలపానం ఎంతో ఆరోగ్యప్రదం. రాత్రి నిద్రకు ముందు రాగి, వెండి , కంచు లేదంటే మట్టి పాత్రలో మంచినీరుంచి ప్రాతః కాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది. వాత పిత్తశ్లేష్ఠు, ప్రకోపాలు తొలగటమేకాక హృద్రోగం, కాస, శ్యాస, క్షయ, అస్మరీ..మూత్రంలో రాళ్లు, గ్రహణీ….రక్త విరేచనాలు, అతిసార, అతి మూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమిస్తాయి. అంతేకాక సంతోషం, బలం, ఆయుర్వృద్ధి, వీర్యవృద్ధి,ఆరోగ్యం కలుగుతాయి. జలపానం చేశాక కొంత సేపు నడవడం మలబద్దకాన్ని పొగడుతుంది.


బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతః స్మరణ కర్త్యవంగా మన పెద్దలు చెప్పారు. ప్రాతఃస్మరణతో పుణ్యము, సంస్కారం, చేకూరుతాయి. ఇష్టదైవాలతోపాటు, మహనీయులను, పుణ్యతీర్థాలను స్మరించటం, మహనీయుల జీవిత విశిష్టతను తెలుసుకొని ఆచరణలో వారిని ఆదర్శంగా స్వీకరించడం జీవితానికి ధన్యత.

విషపూరిత అలవాట్లు*

*మనల్ని నాశనం చేసే 5 విషపూరిత అలవాట్లు*
........................................................

1 . *వాయిదా వేయడం* ( procrastination )

2 . *ఫిర్యాదు చేయడం* ( complaining )

3 . *అతిగా ఆలోచించడం* ( overthing )

4 . *పోల్చుకోవడం* ( comparison )

5 .*(సేఫ్  జోన్లో) ఉండాలనుకోవడం* ( staying comfort zone )

............*వాయిదా వేయడం ..........*

ఏవేవో చేయాలనుకుంటాం . జీవితానికి లక్ష్యాలు పెట్టుకుంటాం . కానీ వాటిని రేపు ,, ఎల్లుండి,,,వారం ,,, సంవత్సరం అని వాయిదా వేసుకుంటూ వుంటాం ..పుణ్యకాలం కాస్తా వెళ్లిపోయాక... చేసేదేముండదు ఇక . 

................*కంప్లైంట్స్ చెయ్యడం..........*

ఇదో దరిద్రపు అలవాటు . మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం 
ఎదుటి వారి మీదనో,,ఇంకేదో మీదనో కంప్లైంట్స్ చేస్తాం ..ఈ భూమ్మీద ఎవ్వరూ కరెక్ట్ కాదు...ఇంకా perfect మనిషి పుట్టలేదు.
మనలోని ఏదైతే లోపమో,, అవలక్షణమో ,,వాసనో ,,, అసమర్థతో వుంటే అది బయటి వాళ్ల మీద కంప్లైంట్స్ గా మారుస్తాం

..........*అతిగా ఆలోచించడం..........*

ఆలోచించేకీ ఏమీ లేనప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నట్టు నాకు బొత్తిగా అర్థం కాదు...ఒక సమస్య అతిగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుంది అంటే భూమ్మీద మనుషులందరూ పనీ పాటా వదిలేసి కేవలం ఆలోచిస్తూ కూర్చొని వుండేవాళ్ళు...ఈ భూమ్మీద నువ్వో గెస్టువి మాత్రమే..కాబట్టి నీ బుర్రకి అతిగా పనిపెట్టకు..

......... *పోల్చుకోవడం* ...............

ఇదో పనికిమాలిన అలవాటు . సూది చేసే పని గునపం చెయ్యలేదు..గునపం చేసే పని సూది చెయ్యలేదు...దేని 
ప్రత్యేకత దానిదే...మల్లెపూలు వచ్చే సువాసన గులాబీలు ఇవ్వలేవు . గులాబీలు ఇచ్చే సువాసన మల్లెలు ఇవ్వలేవు..దేని 
ప్రత్యేకత దానిదే...టాయిలెట్లు కడిగే వాని ప్రత్యేకత వానిదే,,విమానం నడిపే వాని ప్రత్యేకత వానిదే.....కాబట్టి మీ జీవితంలో ఎవ్వరితోనూ మిమ్మల్ని పోల్చుకొకండి....ఈ భూమ్మీద మీకు మీరు మాత్రమే ప్రత్యేకం ..అలాగే ఎవరికి వారు ప్రత్యేకమే...

............ *సేఫ్ జోన్లో* ఉండాలనుకోవడం...........

భూమ్మీద చాలా మంది ఇంత డబ్బులు వుంటే సేఫ్ గా ఉంటామనో,,ఇన్ని ఆస్తులు వుంటే సేఫ్ గా ఉంటామనో
లేకపోతే ఫలానా జాగా లో వుంటే సేఫ్ గా వుంటామనో అనుకుంటారు...ముందు మీరు నిద్రలో నుండి మేల్కొవాలి..
అలాంటివేమీ లేవు...సేఫ్ జోన్లో వుండి నేర్చుకునేది ఏమీ వుండదు..
ఆ యుద్ధం చేసే వాడు గెలుస్తాడు... ఆడే వాడు గెలుస్తాడు..
*సేఫ్ గా ఉండాలనుకునే వాడు జీవితంలో ఏ పాఠాన్నీ నేర్చుకోలేడు..*

🙏................................🙏