3, జనవరి 2023, మంగళవారం

చిదంబరం - కుంచితపాదం

 చిదంబరం - కుంచితపాదం


పరమాచార్య స్వామివారు సిద్ధి పొందే సంవత్సరం ముందు వారి తొంబైల చివర్లలో జరిగిన సంఘటన ఇది. మహాస్వామి వారు అక్కడ ఉన్న శిష్యులతో చిదంబరంలో ఉన్న శ్రీనటరాజ స్వామి గుడికి వెళ్ళాలని, స్వామి దర్శనం చేసుకోకావలని ఉందని చెప్పేవారు. చిదంబరం అలయముకు సంబధించిన వివిధ మొక్కల వేర్లతో చేయబడిన ఒక చిన్న మాల వంటి "కుంచితపాదం" గురించి చెప్పేవారు (ఇక్కడున్న చిత్రంలో స్వామివారు తలమీద దరించి ఉన్నది చూడవచ్చును).


చిదంబరం వెళ్ళిన వాళ్ళకు దీనిగురించి బాగా తెలిసిఉంటుంది. ‘కుంచితపాదము’ను దర్శిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగములు అన్ని నయం అవుతాయని, మోక్షం ప్రసాదింబడుతుందని అందరి విశ్వాసము.


స్వామివారి మాటలు విన్న శిష్యులు విచారంతో కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు అక్కడికి పోవుట దాదాపుగా అసాధ్యము. అంతదూరం స్వామిని తీసుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు. ఆశ్చర్యకరంగా స్వామివారు ఆ మాటలన్న మరుసటి రోజు ఉదయమున చిదంబరం దేవస్థానం నుండి కొందరు దీక్షితర్లు వచ్చారు.


థిల్లై నటరాజ స్వామివారి ప్రసాదమును, ‘కుంచితపాదము’ను తీసుకొని శ్రీ మఠానికి వచ్చారు. మహాస్వామి వారిని దర్శించాలని, చిదంబరం నుండి తీసుకు వచ్చిన ప్రసాదములను శ్రీ వారికి ఇవ్వాలని శిష్యులకు తెలియచేసారు.


ఆ మాటలు విని శిష్యులు చాలా సంతోషించారు. వెంటనే స్వామి దగ్గరకు వెళ్లి చిదంబరం ఆలయ దీక్షితర్లు తమ దర్శననికి ఎదురుచూస్తున్నారు అని తెలియజేసారు. వెంటనే స్వామి వారి అనుమతితో ప్రసాదములు తీసుకువచ్చారు. మహాస్వామి వారు వెంటనే ‘కుంచితపాదము’ను తీసుకుని తమ తల పైన పెట్టుకున్నారు. నటరాజ స్వామిని స్తుతిస్తూ వారిని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇది.


ఈ చిత్రపటం చూసినంత మాత్రం చేత అన్ని రోగములు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇందులో పరమౌషధమైన ‘కుంచితపాదము’, ఆది వైద్యుడైన సాక్షాత్ ధన్వంతరి స్వారుపము ‘పరమాచార్య స్వామి’ వారు ఉన్నారు.


స్వామి వారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యాలతో ప్రశాంతముగా జీవించుగాక!!!


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: