13, జులై 2023, గురువారం

సత్సంగ ప్రారంభ భజన

 ॐ          సత్సంగ ప్రారంభ భజన 


    దివ్య జీవన సంఘ సత్సంగంలో ప్రారంభ భజన ద్వారా సంకీర్తనని 

    ఆ సంఘ స్థాపకులు పూజ్యశ్రీ శివానందస్వామి ఏర్పాటు చేశారు. 

    ఈ ఆడియోలో ఆ భజనని,     

    వారి ప్రియశిష్యులూ - వారి అనంతరం నాలుగున్నర దశాబ్దాల కాలం, 

    దివ్యజీవన సంఘం అధ్యక్షులుగా మనందరికీ మార్గదర్శకులూ అయిన 

    పూజ్యశ్రీ చిదానంద స్వామి పాడుతూ పాడిస్తూ అందించారు.  

    మనం ఆ భజనని, ఈ దిగువ ఇవ్వబడిన పాఠాన్ని చూస్తూ, ఆడియోతో అనుసరిద్దాం. గొప్ప అనుభూతి పొందుదాం, 

 

        మూడుసార్లు ఓంకారం


జై గణేశ జై గణేశ 

జై గణేశ పాహిమాం 

శ్రీ గణేశ శ్రీ గణేశ 

శ్రీ గణేశ రక్షమాం 


శరవణభవ శరవణభవ 

శరవణభవ పాహిమాం 

సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య 

సుబ్రహ్మణ్య రక్షమాం 


శరవణభవ శరవణభవ 

శరవణభవ పాహిమాం 

కార్తికేయ కార్తికేయ  

కార్తికేయ రక్షమాం 


జై సరస్వతి జై సరస్వతి 

జై సరస్వతి పాహిమాం 

శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి 

శ్రీ సరస్వతి రక్షమాంమ్ 


జయగురు శివగురు హరిగురు రాం 

జగద్గురు పరంగురు సద్గురు శ్యాం 


ఓం ఆదిగురు అద్వైతగురు ఆనందగురు ఓం 

చిద్గురు చిద్ఘనగురు చిన్మయగురు ఓం 


హరేరామ హరేరామ రామరామ హరేహరే 

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే 


హరేరామ హరేరామ రామరామ హరేహరే 

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే 


నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ 

నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ 


ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 


ఓం నమో భగవతే వాసుదేవాయ 

ఓం నమో భగవతే వాసుదేవాయ 


ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ పాహిమాం 

హనూమన్త హనూమన్త హనూమన్త రక్షమాం 


దత్తత్రాయ దత్తత్రాయ దత్తత్రాయ పాహిమాం 

దత్తగురు దత్తగురు దత్తగురు రక్షమాం


శివానంద శివానంద శివానంద పాహిమాం 

శివానంద శివానంద శివానంద రక్షమాం 


గంగారాణి  గంగారాణి గంగారాణి పాహిమాం 

భాగిరథీ  భాగిరథీ భాగిరథీ రక్షమాం 


ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తి పాహిమాం 

బ్రహ్మశక్తి విష్ణుశక్తి శివశక్తి రక్షమాం 


ఓం ఆదిశక్తి మహాశక్తి పరాశక్తి పాహిమాం 

ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి రక్షమాం 


రాజరాజేశ్వరి  రాజరాజేశ్వరి 

రాజరాజేశ్వరి పాహిమాం 

త్రిపురసుందరి  త్రిపురసుందరి 

త్రిపురసుందరి రక్షమాం 


ఓం తత్సత్  ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం 

ఓం శాంతి  ఓం శాంతి ఓం శాంతి ఓం 


                         =x=x=x=

Photos


























 


 

Cow milk abhishakam


 








 


 


 

 


ప్రకాశం గారి వర్ధంతి

 శాలువా నాకెందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి : 

 

నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజుకు మూడు రూపాయలు లేక, వాటి కోసం తన ఊరుకు 25 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ బావ గారింటికి కాలి నడకన బయల్దేరాడు. 


తీరా చేసి బావ గారింటికి వెడితే 'నా దగ్గర మాత్రం ఎక్కుడ ఉన్నాయిరా' అన్నాడా బావ గారు. చేసేదేముం దనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు, ఆ కుఱ్ఱాడు. 


ఆ పరిస్థితికి తల్లడిల్లి పోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడు రూపాయల ఫీజు కట్టింది.  


ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కా మొక్కీలు తిని తన కిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి, అక్కడితో తృప్తి పడక 

ఇంగ్లండ్ పోయి, బారిష్టరయ్యి, మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజులలోనే (1917-18 నాటికే) రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో, కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరు నగధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశంపంతులు 🙏


గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి, జాతీయ ఉద్యమంలోకి ఉరికాడు.  


తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్ గా ఎంతోమందిని 

జైళ్ళ నుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజల కోసం తాను స్వచ్చందంగా జైలు శిక్షను అనుభవించాడు. 


గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం 'స్వరాజ్య' పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు.  


అదే గాంధీజీ, కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే, గాంధీజీని సైతం నిలదీశాడు.  


సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు, తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు.  


ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు (1953) తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు.


దురాశాపరుల మూలంగానూ, అప్పటి శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలం గానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు, వ్యతిరేకంగా ఓటు వేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్ కు వెడదామని బ్రతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించాడు.  కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాడు.  


శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు. 


తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు.  సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాడు.  


బెజవాడలో కాటన్ దొర కట్టిన బ్యారేజి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే, అప్పటి  కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే, రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బ్యారేజిను బాగు చేయించి నిలబెట్టాడు. 


ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా, ఆ లోటును సరిదిద్దాడు.  


అందుకే ప్రజలందరూ ఆ బ్యారేజ్ ను, ఆయన పేరునే ప్రకాశం బ్యారేజ్ గా పిలుచుకుంటున్నారు.  రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా, దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు.


అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు.  


తనను శాలువతో సత్కరిస్తే 'ఈ శాలువ నాకెందుకురా! ఆ డబ్బుతో అరటి పళ్ళు కొని తెస్తే ఓ పూట గడిచేది కదురా!!' అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థం  చేసుకోవచ్చు..


ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహా నాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా, ఆయన అధికారం కోసం ప్రాకులాడలేదు. 85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండు టెండలో వడ దెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని తెలుగు పౌరుషాన్ని పై లోకాలకు తీసుకుపోయిన "ఆంధ్రకేసరి"  టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్సులు..

🙏🙏🙏🙏🙏


ఈరోజు ప్రకాశం గారి వర్ధంతి

వీలయితే మీ పిల్లలతో చదివించండి ఇలాంటి నిస్వార్థ పరులు పుట్టిన పవిత్రభూమి మన భారత భూమి అని చెప్పండి..!!!

మహాభారత యుద్ధ నియమాలు :

 మహాభారత యుద్ధ నియమాలు :-


యుద్ధానికి ముందు భీష్ముని మార్గదర్శకత్వంలో ఇరు సైన్యాద్యక్షులు ధర్మయుద్ధ నియమాలను విధించారు. ఈనియమాలు

సూర్యోదయం తోనే యుద్ధం మొదలుపెట్టి, సూర్యాస్తమయంతో విరమించాలి.


ఒకవీరునితో ఒకేవీరుడు తలపడాలి, అనేకమంది కలసి ఒకేవీరునితో పోరాడరాదు.


రథికులు రథికులతో, ఆశ్వికులు ఆశ్వికులతో, గజబలం గజబలంతో, పదాతులు పదాతులతో మాత్రమే యుద్ధం సాగించాలి.


యుద్ధవాయిద్యాలు మ్రోగించే వారిని చంపరాదు

వాగ్యుద్ధం కోరేవారిపై శస్త్రాలను సంధించరాదు

అలసినవారిని, గాయపడినవారిని, పారిపోతున్నవారిని, యుధ్ధంలో పాల్గొనని మనుషి లేదా జంతువును చంపరాదు.


శరణువేడినవారిని వధింపరాదు, అయితే శరణార్ధి యుద్ధ ఖైదీగా బానిసగా వుంటాడు.


యుద్ధనియమాలని తు.చ తప్పక పాటించాలి.

అయితే ఇంచుమించు ఈ యుద్ధనియమాలన్నిటినీ ఇరుపక్షాలు ఒక్కసారైనా ఉల్లంఘించాయి.


#కురుక్షేత్రం లో #మహారథి లు కొందరు వీరులు పాల్గొన్నారు

మహారథి లు అతిరది కి 12 రేట్లు ఎక్కువ వీరు ఏక కాలంలో

7, 20000 సైన్యం తో యుద్ధం చేయగలరు

వాళ్ళు #భీష్ముడు నిజానికి ఇతనితో పోరాడే వీరుడు లేడు ఆ యుద్ధంలో స్వయంగా శ్రీకృష్ణుడే ఒప్పుకుంటాడు తన గురువు పరుశరాముడిని ఓడించాడు (ఇతడు #అతిమహారథి కి సమానంగా యుద్ధం చేయగలుగుతాడు )మిగిలినవారు అంత మహారథి లు వారే

అర్జునుడు ద్రోణుడు కర్ణుడు కృష్ణుడు భీముడు అశ్వద్ధామ భగదత్తుడు శల్యుడు కృపాచార్యుడు సాత్యకి బలరాముడు విదురుడు జరాసంధుడు కంసుడు వీరంత మహా భారతంలో #మహారథి లు

#అతిమహారథి మహా భరత సమయానికి ఒకడే వున్నాడు

అతడే పరుశరాముడు ఇతను మహారథి కి 12 రేట్లు ఎక్కువ

ఏకకాలంలో 86,40000 వీరులతో యుద్ధం చేయగలడు ఇతడు కురుక్షేత్రం లో యుద్ధం చేయలేడు ఆ సమయానికి ఇతను జీవన్ బ్రహ్మఐక్య స్థితిలో వున్నాడు ఇతడు చాలా వీరులకు గురువు మాత్రమే

#వ్యూహాలు:-


యుద్ధ సమయంలో ఇరు పక్షాలూ తమ తమ సేనలను వివిధ వ్యూహాలలో సమాయత్తం చేసుకొన్నాయి. ఆ రోజు యుద్ధంలో సాధించ దలచిన లక్ష్యానికి అనుగుణంగాను, ఎదుటి పక్షం బలాబలాలను ఎదుర్కోవడానికి వీలుగాను ఈ వ్యూహాలు పన్నినట్లు అనిపిస్తుంది. ఈ వ్యూహాల పేర్లు ఆ వ్యూహాల స్వరూపానికి అనుగుణంగా జంతువులు లేదా వస్తువుల పేర్లతో ఉన్నట్లున్నాయి.


వ్యూహ రచన గురించి "డాక్టర్‌ #యల్లాప్రగడ_మల్లికార్జునరావు" ఇలా రాశాడు.


విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని వ్యూహ శాస్త్రనిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను, ఎదటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి.


మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు, పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు.


అచలం అంటే పర్వతం, అచల వ్యూహమన్నప్పుడు ఒకచోట ఒక క్రమపద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువును ఎదుర్కొంటుంది,


మకర వ్యూహంలో మకరం అంటే మొసలి, మొసలి నోరుభాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహన్ని రూపుదిద్దుతారు.


కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మవ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికీ దెబ్బతగలకుండా మిగిలిన సైనిక భాగాలన్ని రక్షక కవచంలాగా ఉంటాయి.


శ్యేనం అంటే డేగ, డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రుసైన్యాన్ని చిత్తు చేయటానికి ఈ వ్యూహాన్ని వాడతారు.


క్రౌంచ పక్షి ముక్కు చాలా ధృడంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించటమంటే శత్రువు ఎంతో కష్టానికి గురికావలసి వస్తుంది.


పద్మవ్యూహం ఇందులో సైన్యాన్ని 7 వలయాలుగా ఒక క్రమ పధ్ధతి లో అమరుస్తారు. లోపలికి ప్రవేశించడానికి వీలుగా ఒకేఒక మార్గం ఉంటుంది అని ఒక అంచనా. ఈ మార్గం గుండా ప్రవేశించి లోపలికి వెళుతూ శత్రు సంహారం చేస్తూ గమ్యాన్ని చేరుకుంటారు.


వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను #శుక్రనీతిలో గమనించవచ్చు. నదులు, అడవులు, దుర్గాలు, తదితర ప్రాంతాలలో తమ సేనకు ఏదైనా ముప్పు వాటిల్లబోతుంది అని సేనాపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చెయ్యడం జరుగుతుండేది. సైన్యం ప్రయాణిస్తున్నపుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు మొసలినోరు భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగను పోలిన శ్యేన వ్యూహాన్ని పన్నేవారు. శ్యేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చెయ్యటానికి #సూచీ వ్యూహాన్ని పన్నేవారు.


అగ్రభాగాన కాక, వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే #శకటం (బండి) లాగా వ్యూహారచన చేసేవారు. ముందూ వెనుకా కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే ♦వజ్ర వ్యూహాన్ని అలా కూడా కాక నాలుగువైపుల నుండి శత్రువులు దాడి చేయబోతున్నారనుకున్నప్పుడు 🎆చక్రవ్యూహమూ భద్రం, వ్యాళం అనే పేర్లున్న వ్యూహాలను కానీ పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండగా, మరికొన్ని తమను తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవిగా ఉంటాయి. వ్యూహాలకు అందులో వుండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికికానీ శత్రువును నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి కానీ, వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పటానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగంచే 🎺వాద్య పరికరాలను ఉపయోగించటం, రథానికున్న 🚩ధ్వజాలు, 🏳జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేస్తుండేవారు. ఇలా వ్యూహారచనా విన్యాసాలు సమరకళలో ఆనాడు ఎంతో ప్రాధాన్యం వహిస్తుండేవి.


1వ రోజు


పాండవ వ్యూహం - వజ్ర వ్యూహం

కౌరవ వ్యూహం - సర్వతోముఖ వ్యూహం


#విశేషాలు:- కృష్ణుడు అర్జునునకు గీతోపదేశం చేశాడు. భీష్ముడు దావానలంలా విజృంభించాడు. అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే అతనిని కాస్త నిలునరించ గలిగారు. ఆరోజు పాండవులు చింతా క్రాంతులయ్యారు.


2వ రోజు:-


పాండవుల వ్యూహం - క్రౌంచ వ్యూహం

కౌరవుల వ్యూహం - త్రికూట వ్యూహం


#విశేషాలు :-అర్జునుడు భీష్ముని తీవ్రంగా బాధించాడు. భీముడు విజృంభించి కళింగ సేనను కల్లోల పరచాడు. అభిమన్యుని ధాటికి తట్టుకోవడం భీష్మ ద్రోణులకు కూడా సాధ్యం కాలేదు.


3వరోజు:-


పాండవ వ్యూహం - అర్ధచంద్ర వ్యూహం

కౌరవుల వ్యూహం - గరుడ వ్యూహం


#విశేషాలు :- భీష్ముని దాడితో క్రోధుడైన అర్జునుడు చెలరేగి కౌరవ సేనను దావానలంలా దహించాడు.


4వ రోజు :-


పాండవ వ్యూహం - ?

కౌరవుల వ్యూహం - ?


#విశేషాలు :- అభిమన్యుడు, భీముడు విజృంభించారు. తొమ్మండుగురు కౌరవ సోదరులు భీముని చేత హతులయ్యారు. ఘటోత్కచుని మాయాయుద్ధంతో కౌరవసేన కకావికలయ్యింది.


5వ రోజు :-


పాండవ వ్యూహం - శ్యేన వ్యూహం

కౌరవుల వ్యూహం - మకర వ్యూహం


#విశేషాలు :- పాండవుల పక్షంలో భీముడు, అభిమన్యుడు, అర్జునుడు చెలరేగిపోయారు. కౌరవుల పక్షంలో భీష్ముడు, భూరిశ్రవుడు విజృంభించారు. విజయం ఎటూ కాకుండా పోయింది. భూరిశ్రవుని చేత సాత్యకి కొడుకులు పదిమంది మరణించారు. అర్జునుడు పాతికవేల రథికులను నిర్జించాడు.


6వ రోజు :-


పాండవ వ్యూహం - మకర వ్యూహం

కౌరవుల వ్యూహం - క్రౌంచ వ్యూహం


#విశేషాలు :- భీముడు, పాండవుల కొడుకులు ఐదుగురూ కౌరవులను ముప్పుతిప్పలు పెట్టించారు. ద్రుపదుడు, ద్రోణుడు తలపడ్డారు. నకులుడి కొడుకు శతానీకుడు అద్భుతంగా యుద్ధం చేశాడు.


7వ రోజు :-


పాండవ వ్యూహం - క్రౌంచ వ్యూహం

కౌరవుల వ్యూహం - మండల వ్యూహం


#విశేషాలు :- కౌరవులలో భీష్ముడు, పాండవులలో భీమార్జునులు అద్భుతంగా యుద్ధం చేశారు. భగదత్తుడు ఘటోత్కచుని తరిమేశాడు. సాత్యకి అలంబసుడిని తరిమేశాడు. ధర్మరాజు ధాటికి శ్రుతాయువు పారిపోయాడు. సుశర్మ అర్జునుడిని ఢీకొన్నాడు.


8వ రోజు :-


పాండవ వ్యూహం - శృంగాటక వ్యూహం

కౌరవుల వ్యూహం - కూర్మ వ్యూహం


#విశేషాలు :- భీముడి చేత 12 మంది కౌరవ సోదరులు మరణించారు. ఘటోత్కచుని తమ్ముడు ఇరావంతుడు అలంబసునిచేత మరణించాడు. అర్జునుని తీవ్రత కొనసాగింది.


వ రోజు :-


పాండవ వ్యూహం - ?

కౌరవుల వ్యూహం - సర్వతోభద్ర వ్యూహం


#విశేషాలు :- భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు తేజోహీనుడయ్యాడు. ఇక లాభం లేదని కృష్ణుడే స్వయంగా చక్రధారియై భీష్మునిపైకి లంఘించాడు. అర్జునుడు బ్రతిమాలగా కృష్ణుడు వెనక్కి తగ్గాడు. భీష్ముని చంపడం సాధ్యం కాదనుకొన్న పాండవులు ఆ రాత్రి భీష్ముని ప్రార్థించారు. పాండవులు శిఖండిని అడ్డుపెట్టుకొని యుద్ధం చేస్తే తనకు యుద్ధోత్సాహం నశిస్తుందని భీష్ముడు సలహా ఇచ్చాడు.


10వ రోజు :-


పాండవ వ్యూహం - ?

కౌరవుల వ్యూహం - ?


#విశేషాలు:- భీష్ముడు, అర్జునుడు, శిఖండి, ధర్మరాజు విజృంభించారు. శిఖండి ఎదురుపడినప్పుడల్లా భీష్ముడు వేరేవైపు వెళ్ళసాగాడు. ధర్మరాజు పరాక్రమానికి ద్రోణుడు నిలువలేకపోయాడు. అర్జునుడి శరపరంపరకు భీష్ముడు కూలిపోయాడు. అంపశయ్యపై విశ్రమించాడు.


11వ రోజు :-


పాండవ వ్యూహం - క్రౌంచ వ్యూహం

కౌరవుల వ్యూహం - శకట వ్యూహం


#విశేషాలు:- కౌరవ సేనాపతిగా ద్రోణుడున్నాడు. కర్ణుడు #మొదటిసారి యుద్ధరంగంలో ప్రవేశించాడు. ద్రోణుడు ధర్మరాజును పట్టుకోబోయే సమయంలో అర్జునుడు అడ్డం పడ్డాడు. మరుసటిరోజు అర్జునుని రణరంగంనుండి దూరంగా తీసుకెళ్ళాలని త్రిగర్త దేశాధీశుడు సుశర్మతో కలిసి పన్నాగం పన్నారు.


12వ రోజు :-


పాండవ వ్యూహం - మండలార్ధ వ్యూహం

కౌరవుల వ్యూహం - గరుడ వ్యూహం


#విశేషాలు:- సంశప్తకులను ఓడించి కృష్ణార్జునులు యుద్ధంలోకి తిరిగి వచ్చారు. భగదత్తుని వైష్ణవాస్త్రం కృష్ణునివల్ల వ్యర్ధమయింది. అర్జునుడు భగదత్తుని వధించాడు. కర్ణార్జునులు తొలి ద్వంద్వయుద్ధం చేశారు. మరునాడు అర్జునుని ఇంకా దూరంగా తీసుకెళ్ళాలని, తిరిగి రానీయమని సంశప్తకులు మాట యిచ్చారు.


13వ రోజు :-


పాండవ వ్యూహం - సాధారణ వ్యూహం

కౌరవుల వ్యూహం - పద్మ (చక్ర) వ్యూహం (తమ్మి మొగ్గరము)


#విశేషాలు:- ద్రోణాచార్యుడు 🍥పద్మవ్యూహం పన్నాడు. పద్మ వ్యూహాన్ని ఛేదించి అభిమన్యుడు కాలాగ్నిలా చెలరేగిపోయాడు. కర్ణుడు పారిపోయాడు. తక్కిన పాండవులను జయద్రధుడు వ్యూహ ద్వారంలో ఆపేశాడు. ఒంటరియైన అభిమన్యుడు ఏడుమార్లు తనను చుట్టుముట్టినవారిని మట్టి కరిపించారు. ఎనిమిదవ సారి అభిమన్యుని అన్నివైపులనుండి చుట్టుముట్టి వెనుకనుండి నిల్లు విరిచి అతనిని చంపేశారు. మరునాడు సూర్యాస్తమయంలోపు సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతిన పూనాడు.


14వ రోజు :-


పాండవ వ్యూహం - ?

కౌరవుల వ్యూహం - శకటవ్యూహం + పద్మవ్యూహం + సూచీవ్యూహం


#విశేషాలు:- ద్రోణుని వ్యూహ రచన సైంధవుని రక్షించడం కోసం చేయబడింది. అయినా అర్జునుడు అందరినీ జయించి తృటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. శ్రుతాయుధుడు, కృతవర్మాదులు, విందానువిందులు అర్జునునిచేత మరణించారు. ఘటోత్కచుడు అలంబసుడిని, హలాయుధుడిని వధించాడు. దుర్మర్షణుడు, దుర్మధుడు, శత్రుంజయుడు వంటివారు భీమునిచేత చచ్చారు. సాత్యకి భూరిశ్రవుని చంపాడు. చివరకు అర్జునుడు సైంధవుని చంపి తన ప్రతిన నెరవేర్చుకొన్నాడు. రాత్రి పూట జరిగిన యుద్ధంలో ఘటోత్కచుడు పెట్రేగిపోయాడు. అర్జునుని చంపడానికి దాచుకొన్న #శక్తి ని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుని కడతేర్చాడు.


15వ రోజు :-


పాండవ వ్యూహం -

కౌరవుల వ్యూహం -


#విశేషాలు :- ద్రోణార్జునుల ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడలేదు. చివరకు "అశ్వత్థామ" (అనే ఏనుగు) మరణించినట్లు ప్రకటించగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ధృష్ష్టద్యుమ్నుడు ద్రోణుని శిరసు తెగనరికాడు. దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ దివ్యాస్త్రాలు కృష్ణార్జునుల శక్తియుక్తులవలన వృధా అయ్యాయి. వేదవ్యాసుడు అర్జునునికి పరమేశ్వర మహిమను విశదీకరించాడు.


16వ రోజు :-


పాండవ వ్యూహం - అర్ధచంద్ర వ్యూహం

కౌరవుల వ్యూహం - మకర వ్యూహం


#విశేషాలు :- అశ్వత్థామ సూచనపై దుర్యోధనుడు కౌరవ సైన్యాధిపతిగా కర్ణుని నియమించాడు. భీముడు క్షేమధూర్తిని వధించాడు. ప్రతివింధ్యుడు చిత్రసేనుని చంపేశాడు. భీముడు అశ్వత్థామతోను, కర్ణుడు నకులునితోను, అర్జునుడు సుశర్మతోను ద్వంద్వ యుద్ధాలు చేశారు. ధర్మరాజు సుయోధనుని మూర్ఛిల్ల చేశాడు. అర్జునుడూ, కర్ణుడూ ఎదురి పక్షాలను గగ్గోలు పెట్టించారు. మరునాడు పాండవులను అంతం చేస్తానని కర్ణుడు దిగాలుగా ఉన్న దుర్యోధనునికి మాట యిచ్చాడు.


17వ రోజు :-


పాండవ వ్యూహం - దుర్జయ వ్యూహం

కౌరవుల వ్యూహం - ?


#విశేషాలు :- దుర్యోధనుని ప్రార్థననంగీకరించి కర్ణునికి సారథ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడి పరుష వ్యంగ్య వచనాలకు కర్ణుడు నొచ్చుకొన్నాడు. కర్ణుడూ, కర్ణుని కొడుకులూ చెలరేగి పాండవ సైన్యాన్ని కాలరాచేశారు. కర్ణుడు ధర్మరాజుని పట్టుకొని పరుషంగా అవమానించి వదిలేశాడు. భీముడు దుశ్శాసనుని వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు. కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం ప్రళయ సమానంగా సాగింది. కర్ణుని సర్పముఖాస్త్రం విఫలమయ్యింది. కర్ణుని రథం భూమిలో దిగబడినపుడు అర్జునుడు #అంజలికం అనే దివ్యాస్త్రంతో అతని తల నరికేశాడు. ధర్మరాజు చాలా సంతోషించాడు.


18వ రోజు :-


పాండవ వ్యూహం - త్రిశూల వ్యూహం

కౌరవుల వ్యూహం - సర్వతోభద్ర వ్యూహం


#విశేషాలు:- దుర్యోధనుని కోరికతో కౌరవ సేనాధిపతిగా శల్యుడు ఉన్నాడు. భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టసాగారు. యుధిష్ఠిరుని చేత శల్యుడు హతుడయ్యాడు. సహదేవుడు గాంధారసైన్యాన్ని ఊచకోత కోసేశాడు. శకునిని చంపేశాడు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ పారిపోయారు. దుర్యోధనుడు పరిసరారణ్యాలకుపోయి ఒక జలాశయంలో దాగున్నాడు. ధర్మరాజు వచ్చి మాటాడిన పరుషవాక్యాలతో దుర్యోధనుడు భీమునితో గదాయుద్ధానికి సిద్ధుడయ్యాడు. భీముడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టి అక్కడవదిలేసి వెళ్ళారు. తరువాత అర్జునుని కపికేతనం, దివ్యాస్త్రాలు అదృశ్యమయ్యాయి. రథం భస్మమైపోయింది. అశ్వత్థామ సుయోధనుని కలిసి #అపాండవం చేస్తానని మాట యిచ్చాడు. (తరువాతి కథ "సౌప్తిక పర్వం"లో ఉంది.)


#యుద్ధ_కార్యక్రమం:-


కురుక్షేత్ర యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది. యుద్ధం పగటిపూట మాత్రమే జరిగేది, సూర్యాస్తమయం కాగానే పోరాటాన్ని అపేసేవారు. కురుక్షేత్రం వద్ద గల ఒక విశాల ప్రదేశంలో సైన్యాలు తలపడ్డాయి. ద్వంద్వయుద్ధాలతో పాటు మూకుమ్మడి దాడులు కూడా ప్రతీ రోజూ జరిగే యుద్ధంలో భాగంగా ఉండేవి. రోజువారీ పోరులో విజేతలెవరో, విజితులెవరో నిర్ణయించేది ఆక్రమించుకున్న భూభాగాలు కావు, మృత కళేబరాల సంఖ్య మాత్రమే. మరణం సంభవించేదాకా జరిగే ఈ రణంలో జీవించి ఉన్నవాడే విజేత..

పురుషుడు ఎలా వుండాలి?*

 *పురుషుడు ఎలా వుండాలి?*

                ➖➖➖✍️



*స్త్రీఎలా ఉండాలోఅనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో   కూడా        ధర్మశాస్త్రం చెప్పింది.  ఎందుచేతో ఈ పద్యం   జన బాహుళ్యం లోకి  రాలేదు!*


*కార్యేషు యోగీ, కరణేషు దక్షః,  రూపేచ కృష్ణః , క్షమయాతు రామః,    భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః* *(కామందక నీతిశాస్త్రం)*


*1.  కార్యేషు యోగీ :*

*పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి!*


*2.  కరణేషు దక్షః :*

*కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనం తో వ్యవహరించాలి. సమర్ధుడైఉండాలి.*


*3.  రూపేచ కృష్ణః:*

*రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.*


*4.  క్షమయా తు రామః:*

*ఓర్పులో శ్రీ రామునిలాగా ఉండాలి.  పితృ వాక్య పరిపాలకుడైన శ్రీరాముని   వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.*


*5.  భోజ్యేషు తృప్తః:*

*భార్య/తల్లి వండినదాన్ని   సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.*


*6.  సుఖ దుఃఖ మిత్రం:*

*సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగాఉండాలి.మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.*


*ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు      ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడ బడతాడు.*✍️️                                                        

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 115*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 115*


చాణక్యుని మాతామహుల వంశ గోత్రము శ్రీవత్సము. మాతమహులకు పుత్రసంతానము లేనందున వారికి దౌహిత్రుడైన చాణక్యుడు పిండప్రధాన తర్పణాది శ్రాద్ధ విధులకు అధికారి అయ్యాడు. ఆ కారణం చేత మాతమహుల గోత్రనామములతో 'వాత్సాయనుడు' అనే పేరుతో కామసూత్రాలను గ్రంథస్తం చేశాడు చాణక్యుడు. 


శ్లోll 


నమో ధర్మార్థ కామేభ్య స్తత్కామేభ్యో నమో నమః 

త్రివర్గ మోక్ష కామెభ్యో అమితం నమః 


ధర్మము, అర్థము, కామము అనేవి 'మూడుపురుషార్థములు'. ఈ పురుషార్థములకూ, వీటిని కోరుకునే వారికీ నమస్కారములు. ఈ మూడింటిని త్రివర్గములందురు. వీటిని అనుసరించి మోక్షము కోరువారికీ, అలాగే వీటిలోని ఏ పురుషార్ధమునందూ ఏ కోరికా లేని వారికి నమస్కారం. 


సృష్టిలోని ప్రతి జీవికీ మూడు దశలుంటాయి. అవి పుట్టడం. వృధ్ధి చెందడం. నశించడం. వీటినీ సృష్టి, స్థితి, లయ ములంటారు. ఇందులో మొదటిది సృష్టి. దీనికి మూలము కామము. విశ్వములోని ఏ జీవి అయినా కామము ద్వారానే తన జాతిని సృష్టించుకుంటుంది. మైధునక్రియ జరపకుండా జీవిపుట్టుక అసాధ్యం. ఏ జీవి అయినా వాటి వాటి పద్ధతుల ద్వారా మైధునక్రియ చేత తమ (కుటుంబాలను) సంతానాలను కని వృద్ధి చేసుకుంటాయి. నశిస్తాయి. మళ్లీ జన్మిస్తుంటాయి. 


మానవులు కూడా మైధునక్రియ ద్వారానే సంతానాన్ని పొందుతారు. కుటుంబాలను, వంశాలను అభివృద్ధి చేసుకుంటారు. అదే వరుసక్రమంలో పుట్టేవారు పుడుతుంటే పోయ్యేవారు పోతుంటారు. అయితే ఇతర జీవులకంటే భిన్నంగా మానవులకి ధర్మము, అర్థములని మరో రెండు విధులు కామమునకు తోడు అయ్యాయి. మానవుడు బుద్ధిజీవి. ఆలోచనా జ్ఞానం కలిగినవాడు. కనుకనే మోక్షమార్గములను గ్రహించి సత్వరమోక్షమునకు అర్హుడయ్యాడు. మిగతా జీవులకు ఈ అవకాశం లేదు. ధర్మమును పాటిస్తూ, అర్థమును గౌరవిస్తూ, వంశాభివృద్ధికోసమే కామమును ఆశించేవాడే ఉత్తమపురుషుడు. కనుకనే ధర్మార్థ కామములను పురుషార్ధములు అన్నారు. 


ధర్మమును ప్రవచిస్తూ వేదకాలం నాటినుండీ ఎన్నో గ్రంథములు వెలువడినాయి. అర్ధముపై గూడా మానవులకి తగినన్ని గ్రంథములు వచ్చివున్నవి. కానీ ఆరోగ్యవంతమైన, ఆచరణ సాధ్యనీయమైన కామము గూర్చి తగినన్ని గ్రంథములు లేవు. 'కామము పాపము కాదు. అది ధర్మము. శరీరావసరము' దేహానికి ఆహారము వలనే, జీవుడికి ప్రాణం వలనే, ప్రతిజీవికీ కామము అవసరము. దానిని సక్రమముగా ఆచరించాలి. అలా ఆచరించడమే ధర్మము. 


ధర్మము వలన మరణానంతరం ఉత్తమగతులు, పుణ్యలోక నివాసాలు, చివరికి మోక్షము లభిస్తాయి. అర్థము వలన సౌఖ్యానుభవము, పుణ్యకార్యములు, దానధర్మములు చేసే అవకాశం లభించి తద్వారా పుణ్యం లభిస్తుంది. కామము వలన శారీరక, మానసిక సుఖానుభూతి, సంతానప్రాప్తి చేకూరుతుంది. 


ఈ మూడింటికీ సృష్టికర్త అయిన బ్రహ్మ తొలుత ఈ శాస్త్రమును రచించాడు. ఈ శాస్త్రమునందు మూడు భాగములు ఉన్నాయి. దీనిలో....


🔸మొదటి భాగమైన ధర్మముని విడిగా 'మనుధర్మశాస్త్రము' (మనుస్మృతి) పేరిట స్వాయంభువ మనవు శాస్త్రమును రచించాడు. 


🔸రెండవ భాగమైన అర్థమును విడదీసి బృహస్పతి దానిని ప్రత్యేక గ్రంథముగా రచించాడు. 


🔸మూడవదైన 'కామము'ను శివుడి కింకరుడైన నందీశ్వరుడు వెయ్యి అధ్యాయములతో కామసూత్రములను రూపొందించాడు. 


ఆ తదనంతర కాలంలో ఉద్దాలక మహర్షి కుమారుడైన ఔద్దాలకుడు కామసూత్రాలను సంక్షిప్తం చేస్తూ అయిదువందల అధ్యాయాలతో రూపొందించాడు. ఆ తదనంతరం బభ్రుకుమారుడైన భాభ్రవ్యుబు నూటయాభై అధ్యాయాలతో సాధారణ, సంప్రయోగిగా, కన్యాసంప్రయుక్తక, భార్య, పారదారిక, వైశిక, ఔపనిషదిక అనుపేర్లు గల ఏడు అధికరణాలతో సంక్షిప్తీకరించాడు. 


అనంతరం కాలంలో పాటలీపుత్ర నివాసి అయిన దత్తకాచార్యుడు ఆ నగరంలోని వేశ్యల అభ్యర్థన మేరకు ఆరవ అధికరణమైన, 'వైశికము'ను ప్రత్యేక గ్రంథంగా రాశాడు. దత్తకాచార్యునిలాగే సువర్ణనాభుడు, ఘోటక ముఖుడు, గోనర్థీయుడు, గోణికాపుత్రుడు, కుచుమారుడు, చారాయణుడు అనువారలు భాభ్రవుని కామశాస్త్రంలోని మిగతా ఆరు అధికరణాలనూ విడివిడిగా వారి వారి అభిప్రాయాలను జోడిస్తూ గ్రంథాలు రాశారు. కాలక్రమంలో ఈ గ్రంథాలన్నీ నశించిపోయి బాభ్రవుని కామశాస్త్రము కనుమరుగైపోయింది. 


కాలక్రమంలో అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత "వాత్సాయన కామసూత్రాలు" పేరిట చాణక్యుడు గ్రంథ రచనకు పూనుకున్నాడు. బాభ్రవ్యుడు రచించిన కామసూత్రాలు పెద్దవిగా ఉండి చదవడానికి అనువుగా, అనుకూలంగా లేకపోవడం చేత ఆ గ్రంథంలోని అన్ని అంశాలనూ, అధికరణాలనూ సంక్షిప్తం చేస్తూ ఏడు అధికరణాలతో గ్రంధాన్ని రాశాడు చాణుక్యుడు. 


మొదటి అధికరణం -  సాధికారికరణం 

రెండవ అధికరణం - సాంప్రయోగితం 

మూడవ అధికరణం - కన్యాసంప్రయుక్తం 

నాలుగవ అధికరణం - భార్యాధికరణం

ఐదవ అధికరణం - పారదారికాధికరణం 

ఆరవ అధికరణం - నైశికం 

ఏడవ అధికరణం - ఔపనిషది కాధికరణం


మొత్తం ఏడు అధికరణాలతో, ముప్పయ్యారు అధ్యాయాలు అరవైనాలుగు ప్రకరాణాలు గల వాత్సాయన కామసూత్రాలు వెయ్యి శ్లోకాలతో గ్రంథస్తం చేశాడు చాణక్యుడు. వివాహానంతరం స్త్రీలకి అనేక కారణాలచేత కామశాస్త్రాన్ని చదివేందుకు అవకాశం లభించదని, కనుక వివాహానికి పూర్వమే కన్యగా వుండగానే స్త్రీలు కామశాస్త్రాన్ని అభ్యశించే అర్హత కూడా స్త్రీలకి వుందని పేర్కొన్నాడు చాణక్యుడు.


ఏది ఏమైతేనేం, కనుమరుగైపోయిన కామశాస్త్రానికి మళ్లీ జీవం పోశాడు చాణక్యుడు. అతడు గ్రంథస్తం చేసిన 'వాత్సాయన కామసూత్రాలు' మానవజాతి ఉన్నంతవరకూ చరిత్రలో సుస్థిరమై నిలుస్తాయి. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సంస్కృత సూక్తులు

 🔷🔷🔥🔥🔷🔷


*సంస్కృత సూక్తులు - మూల శ్లోకాలు*


🔷🔥 🔷

శత నిష్కో ధనాఢ్యశ్చ

శత గ్రామేణ భూపతిః 

శతాశ్వః క్షత్రియో రాజా

*శత శ్లోకేన పండితః*


🔥వంద నిష్కలు (బంగారు నాణెములు) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.


🔷🔥🔷


విద్వత్త్వం చ నృపత్వం చ

నైవ తుల్యం కదాచన

స్వ దేశే పూజ్యతే రాజా

*విద్వాన్ సర్వత్ర పూజ్యతే*


🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.


🔷🔥 🔷


శతం విహాయ భోక్తవ్యం

సహస్రం స్నాన మాచ రేత్

లక్షం విహాయ దాతవ్యం

*కోటిం త్యక్త్వా హరిం భజేత్*


🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.


🔷🔥 🔷


అతి దానాత్ హత: కర్ణ:

అతి లోభాత్ సుయోధన:

అతి కామాత్ దశగ్రీవో

*అతి సర్వత్ర వర్జయేత్*


( ఇది మరోవిధంగా కూడా ఉంది)


🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి.ఎప్పుడూఅతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.


🔷🔥 🔷


సత్యాను సారిణీ లక్ష్మీ

కీర్తిః త్యాగాను సారిణీ

అభ్యాసానుసారిణీ విద్యా

*బుద్ధీ కర్మానుసారిణీ*


🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !


🔷🔥🔷


న నిర్మితో వై నచ దృష్ట పూర్వో

న శ్రూయతే హేమమయం కురంగమ్ 

తథాఽపి తృష్ణా రఘునందనస్య

*వినాశకాలే విపరీత బుద్ధిః*


🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.


🔷🔥 🔷


ఋణ కర్తా పితా శత్రుః 

మాతా చ వ్యభిచారిణీ

భార్యా రూపవతీ శత్రుః 

*పుత్రశ్శత్రు రపండితః*


🔥 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.


🔷🔥 🔷


ఆత్మ బుద్ధిః సుఖం చైవ

గురు బుద్ధిర్విశేషతః 

పర బుద్ధి ర్వినాశాయ

*స్త్రీ బుద్ధీ ప్రళయాంతకః*


🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !



🔷🔥 🔷


ముఖం పద్మ దళాకారం

వచ శ్చందన శీతలం

హృదయం కర్తరీ తుల్యం

*అతి వినయం ధూర్త లక్షణమ్*


🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా. 


🔷🔥 🔷


సిద్ధ మన్నం ఫలం పక్వం

నారీ ప్రథమ యౌవ్వనం

కాలక్షేపం నకర్తవ్యం

*ఆలస్యం అమృతం విషమ్*

అధైర్యము నొందరు.

 .   

                  _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*వరమసిధారా, తరుతల వాసో*

*వరమిహ భిక్షా,వరముపవాసః*

*వరమపి ఘోరే నరకే పతనం*

*న చ ధన గర్విత బాంధవ శరణమ్*


తా॥

ధనగర్వంతో మిడిసిపడే బంధువులను ఆశ్రయించటం కంటే?, కత్తి అంచు మీద నడవటం, చెట్టు నీడలో నివసించటం, బిచ్చమెత్తుకోవటం, నిరాహారియై ఉండటం , చివరకు నరకంలో పడటమైనా శ్రేష్ఠం.


---------------------------------------------


𝕝𝕝శ్లోకం𝕝𝕝


ఛిన్నాపి రోహతి తరు: క్షీణోప్యుప చీయతే పునశ్చంద్రః౹

ఇతి విమృశంతః సంతఃసంతవ్యంతే న తే విపదా||


తా॥

చెట్లను కొట్టివేసిన మరల చిగురించుచున్నవి.క్షీణ చంద్రుడు మరల పూర్ణిమ నాటికి 

పరిపూర్ణుడగుచున్నాడు. ఇట్టి ఉదాహరణలు చూచిన ఆపదలు కలకాలముండవని 

తెలియుచున్నది కదా! కావుననే సత్పురుషులెన్నడును ఆపదసమయములందు అధైర్యము నొందరు.

కామిక ఏకాదశి*

 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏


               *_నేటి విశేషం_*


              *కామిక ఏకాదశి*


ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. 

ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. 

శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు.


శ్రీహరిని ఆరాధించటం, తులసీ దళాలతో పూజ చేయటం, వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి  ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి.


*కామిక ఏకాదశి మహత్యం - వ్రత కథ*

ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణున్ని " ఆషాఢ మాసములో కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని" కోరగా, దానికి ఆ వాసుదేవుడు సంతోషించినవాడై "ఓ రాజా! ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్య కార్యమే, ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మ దేవుడిని ఇలా అడిగాడు. 

" ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. 

ఆ రోజునకు అధిదేవత ఎవరు, వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయుంచి తెలపండి" అని కోరాడు. 


దానికి బ్రహ్మ బదులిస్తూ " నా ప్రియమైన కుమారుడా! మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెద. 

ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. 

ఈ ఏకాదశి  మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది, 

శంఖ, చక్ర గదాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు, శ్రీధరుడు, హరి, విష్ణు, మాధవుడు మరియు మధుసూధనుడు అనే పేర్లతో పిలవబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. 


కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం ...

కాశీలో గంగ స్నానం కన్నా,

హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా,

సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, 

సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, 

గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమి రోజు - సోమవారం, గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ అని చెబుతారు...


కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ మరియు గ్రాసములతో  కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. 


గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. 

ఏకాదశి రోజులు స్వచ్చమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. 


నారదా! ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు." కామిక ఏకాదశి రోజు ఉపవసించినవారు, సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు.


" ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. 

ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. 

కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. 

కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు, అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. 

తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. 


ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము, బంగారం, వెండి దానం చేస్తే వచ్చే దాని కన్నా ఎక్కువ. 

తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి, ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు , వజ్రాలు, నీలం మరియు గోమధికములతో పూజించినదానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు.  

లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించివేస్తుంది. 


కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి.

తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ల పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. 

ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో, వారు శాశ్వతముగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు. 

కామిక ఏకాదశికి బ్రహ్మ హత్యా పాతకాన్ని, భ్రూణ హత్యా పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. 

" అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా" శ్రీకృష్ణుడు ధర్మరాజు తో చెప్పెను...


             *_🌿శుభంభూయాత్🌿_*

     🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

ఛందోప్రయోగ రహస్యాలను



శుభోదయం🙏

శతకాలు లోకాలోకన ముకురాలు సత్సందేశప్రదాలు.సకలశ్రేయోదాయకాలు. వినండి

పెమ్మయగారి సింగన పద్యం!


తన ఉనికికి భద్రత ముఖ్యం!


మచ్చికలేనిచోట,ననుమానము వచ్చినచోట,మెండుగా

కుచ్చితులున్నచోట,విద్యకు

న్మెచ్చనిచోట,రాజుకరుణింపనిచోట,గుణాఢ్యులున్నచో

నచ్చట మోసమండ్రు సుగుణాకర!పెమ్మయసింగధీమణీ!!


  లోకాలోకనం చేత పండిన అనుభవంతో కొందరు హితోపదేశపూర్వకమైన శతకాలువ్రాశారు.అందులో ప్రముఖమైనది పెమ్మయ సింగయగారి శతకమొకటి.

       మానవుడు తానెక్కడభద్రంగా ఉండగలనో చక్కగా ఆలోచించుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసికోవాలి. ఉద్యోగం విషయంలో మరీముఖ్యంగా ఆలోచించవలసినవిషయాలివి.

       తనకు పరిచయం లేనిచోట,అనుమానాస్పదమైనచోట,కుట్రదారులున్నచోట,సద్గుణవంతులు లేనిచోట,అధికారియే అపకారియైనచోట,తనవిద్సకుమెప్పులేనిచోట,సజ్జనులుండరాదు.

     ఉంటే,ప్రమాదం!!!🙏🌷🌷🙏🙏🙏🌷🪸🪸🌷🌷🌷🌷🪸🌷



 గ ణా ల తో తం టా!


క:మగణంబు గదియ రగణము

    వగవక కృతి మొదట నిల్పు వానికి,

    " మరణం",

     బగు; నిక్కమండ్రు ;మడియడె,

     అగుననియిడి, తొల్లి, టేంకణాదిత్యుఁ

      డనిన్;


             అనియొక అపప్రధ ప్రచారంలో ఉంది."కావ్యారంభంలో, మగణం తరవాత రగణం ఉపయోగించి పద్యంచెప్పరాదట!" ఒకవేళచెపితే, కృతికర్తకు మరణం సంభవిస్తుందట!

నిజమా?అంటే, నిజమే నంటున్నారు.

ఉదాహరణంగా "నన్నె చోడకవిని" పేర్కొంటున్నారు.

                 శివకవిశేఖరుడగు నన్నెచోడమహాకవి,"కుమారసంభవమను"-12ఆశ్వాసముల మహాగ్రంధమును

రచియించి తనగురువైన జంగమ మల్లిఖార్జునునకు అంకిత మిచ్చాడు.(ఇతడొక చోడవంశమునకు దెందిన మాండలిక ప్రభువు.)

ఆగ్రంధం కావ్యారంభపద్యంగా" స్రగ్ధరా"-

వృత్తమును వ్రాశాడు.దానికి లక్షణం,

మ-ర-త-న-త- త-గ-అనేగణాలు.పద్యంకావాలా?ఇదిగో చిత్తగించండి!

స్ర:శ్రీవాణీంద్రామరేంద్రార్చిత మకుటమణిశ్రేణిధామాంఘ్రి

జాతోద్యత్కేసరుండాశ్రితజనలషితాశేష

వస్తుప్రదుం డా

దేవాధీశుండు నిత్యోదితుఁడజుడుమహా

దేవుఁడాద్యుండు విశ్వై

కా వాసుండెప్పుడున్ మాకభిమతములుప్రీతాత్ముఁడై యిచ్చుగాతన్;


కుమారసంభవం-మొదటిపద్యం!


భావము: బ్రహ్మేంద్రాది దేవతల కిరీటములయందలి మణిగణ కాంతులచే నర్చింపఁబడు పాదములుగలవాడును,సకలజనుల అభీష్ఠములనొసగు వాడును,నిత్యప్రకాశి ,యు,ఆద్యుడునుయగు విశ్వాకారియు,నగు మహాదేవుడు, ప్రేమతో మాకోరికలుదీర్చుగాక!-అని;


       సరే ప్రస్తుతమునకు వస్తాను.ఈపద్యంలో మగణం తర్వాత రగణం ఉపయోగింపబడింది.తత్కారణంగా నన్నెచోడునకు మరణం సంభవించిందట!

                   చరిత్ర కూడా ఈనిజాన్ని ధృవపరిచింది.పల్లవరాజులతోయుధ్ధంలో నన్నెచోడుడు మరణించాడని సాక్ష్యం గా నాటి చరిత్రను పెద్దలు ధృవపరచినారు.


    

                  తస్మాత్ యువకవులారా!

ఇలాంటి ఛందోప్రయోగ రహస్యాలనుగూడా పెద్దలనుండి తెలిసికొని పద్యాలల్లండి!

         "శుభంభూయాత్"


                              స్వస్తి!🌷🌷🙏🙏

శివాలయంలో శివ సేవ*

 *శివాలయంలో శివ సేవ*



✳️ మనలో చాలామంది భక్తులు ఆలయాలకు వెళ్తుంటారు. రోజూ, లేక వారానికోసారి, ఏదైనా పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం మాత్రం చేసుకుని తిరిగి వచ్చేస్తుంటారు. ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటారు. ఏవైనా విశేష ఆర్జిత సేవలు జరిపించుకుంటారు. అవకాశాన్ని బట్టి సమీపంలో ఉన్న ఇతర ఆలయాలను, సందర్శనీయ స్థలాలను దర్శిస్తారు. క్షేత్రంలో నిద్రచేస్తారు. కానీ మనం ఆలయాలకు వెళ్లి ఇంకా ఎన్నో సేవలు స్వయంగా ఆచరించి అక్షయమైన ఫలితాలను, *శివాలయం నిర్మాణం చేస్తే.. నిర్వహణ చేస్తే.. పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయసేవ ద్వారా పొందవచ్చు.*


👉 *అటువంటి కొన్ని సేవలు.. వాటి ఫలితాలు ఇవి....*


꧁┉┅━❀🔯❀━┅┉꧂



 *దూరం నుండి దర్శిస్తే చాలు...* 


🕉️ అల్లంత దూరంలో ఆలయశిఖరం కనిపిస్తే చాలు. అమాంతం మన రెండు చేతులు ఒకదానికొకటి కలిసి నమస్కరిస్తాయి. అదే మన చిన్ననాటి నుండి మన పెద్దలు మనకు నేర్పిన ధర్మం. దాని వలన మనకు కలిగే ఫలితం ఏంటో తెలుసా? 


*దూరతః శిఖరం దృష్ట్వా నమస్కుర్యాచ్ఛివాలయమ్ ।*

*సప్తజన్మకృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి ||*


✅👉 దూరం నుండి ఆలయశిఖరాన్ని దర్శించిన వెంటనే నమస్కరించాలి. అలా చేస్తే ఏడుజన్మలలో తాను చేసిన పాపాలనుండి వెంటనే విముక్తుడౌతాడు. రెండుచేతులు జోడించిన వెంటనే మనలోని అహంకారం తొలగి దైవసాక్షాత్కారం కోరి మనస్సు పరితపిస్తుంది. అప్పుడే మనం ఆ దైవాన్ని దర్శించేందుకు పరిపూర్ణమైన యోగ్యత సంపాదించుకున్నవాళ్లమౌతాం.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *ఆలయపరిసరాల్ని పరిశుభ్రం చేస్తే....*


*పశ్యన్ పరిహరన్ జంతూన్ మార్జన్యా మృదుసూక్ష్మయా!* 

*శనైస్పమ్మార్జనం కుర్యాత్ చాంద్రాయణఫలం లభేత్ ॥*


🛕 పరిశుభ్రమైన మనసు ఉంటేనే పరమేశ్వరుని దర్శనం లభిస్తుందని భావించే మనం.. మరి భగవంతుని నిలయమైన శివాలయానికి వెళ్లి అక్కడ అపరిశుభ్రంగా ఉంటే... ఆలయంలో పశువులు తిరుగుతుంటే.. మనమేం చేయాలి? అప్పుడు భక్తులు అక్కడ ప్రాణులు, పశువులను కొట్టకుండా.. చప్పట్లు చరుస్తూ నోటితో అరుస్తూ వాటిని బయటకు పంపి ఆ పరిసరాన్ని మెత్తటి మార్జని(చీపురు)తో పరిశుభ్రం చేయాలి. అలా చేస్తే గొప్పదైన *చాంద్రాయణవ్రతం ఆచరించిన ఫలితం* కలుగుతుందని శివధర్మశాస్త్రం చెప్పింది.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *ఆవుపేడతో అలికి ముగ్గులు పెడితే....* 


👉 ఆవుపేడ లక్ష్మీ నిలయంగా భావిస్తాం మనం. పైగా ఆవుపేడలో అనేక సూక్ష్మక్రిములను నశింపజేసే శక్తి ఉంటుంది. అందుకే ఆలయాన్ని శుభ్రంగా ఆవుపేడతో అలికితే కూడా ఎంతో గొప్ప ఫలితం ఉంది. ఆ ఆవుపేడను మంచి ఆవుల నుండీ సేకరించాలి. లేదా తన ఇంటినుంచి తీసుకురావాలి. లేదా పవిత్రమైన చోటునుండి తేవచ్చు. ఆ గోమయాన్ని కూడా పైభాగం, కిందభాగం వదిలి మధ్యలో శుద్ధం, మలినం కాని ఆవుపేడనే తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటి గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే... *తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు.* చక్కగా రంగవల్లులు (ముగ్గులు) తీర్చిదిద్ది పంచరంగులతో అలంకరిస్తే చాలా చక్కగా ఉంటుంది. అలా చేస్తే చేసిన వారు..వారి కుటుంబసభ్యులతో సహా సిరిసంపదలతో తులతూగుతారు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *రంగు రంగుల పూలమాలలతో అలంకరిస్తే...*  


✅👉 ఆకయం తోరణాలకు, గోడలకు, కొన్ని మండపాలు, స్తంభాలను పూలతో అలంకరించడం ఒక గొప్పసేవ. అలా చేస్తే... *ఆ మనిషి రుద్రలోకం చేరతాడని చెప్పబడింది.* 


*యావద్ధస్తా భవే ద్భూమిః సమన్తా దుపశోభితా* 

*తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే*


✅👉 శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా.. అందంగా తీర్చిదిద్దినా..ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతోంది. అలాగే... శివపూజా కైంకర్యాల కోసం పుష్పవనాలను పాదుగొల్పినా.. రకరకాలైన పూల చెట్లను నాటి వాటిని సంరక్షించినా అదికూడా పుష్పకైంకర్యం లెక్కలోకే వస్తుంది కనుక భక్తులు ఈ ప్రయత్నం కూడా చేయాలి.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *నీటితో కడిగి.. అద్దంలా తుడిచి....* 


👉 ఆలయాన్ని నీటితో కడిగితే ఆ ప్రాంతమంతా పరిశుద్ధమౌతుంది. అటువంటి ఆలయాన్ని కడిగే నీటిని మాత్రం వడగట్టి తీసుకోవాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. 


*యః కుర్యాత్ సర్వకార్యాణి వస్త్రపూతేన వారిణా।*

*స ముని స్స మహాసాధు స్వ యోగీ స శివం వ్రజేత్ ॥* 


✅👉 వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసినవారు సజ్జనులు. అతడు యోగియై శివుని చేరుకుంటాడు. అలాగే శివాలయం నేలను అద్దంలా తుడవాలి. ఎంతలా అంటే నేలపై తన ప్రతిబింబం కనపడేంతగా.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *శివరూపాలను చిత్రిస్తే...* 


✅👉 మనం ఆలయ గోపురాలపై అనేక శిల్పాలు చూస్తుంటాం. అలాగే ప్రాచీన ఆలయాల్లో అనేక శివరూపాలు చిత్రించి ఉంటాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో లేపాక్షి, తమిళనాడులోని మధురై దేవాలయం పై భాగంలో తలెత్తి చూస్తే అనేక దేవుళ్ల చిత్రాలు గమనించే ఉంటారు. అలా మనం కూడా ఆలయాల్లో దేవుడి చిత్రాలు చిత్రింపచేయడం ఒక కర్తవ్యంగా నెరవేర్చాలి.        దీని వలన కలిగే ఫలితం ఇది.


*యావంతి రుద్రరూపాణి స్వరూపాణ్యపి లేఖయేత్ ।* 

*తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే ॥*


చిత్రకారులను రప్పించి వారితో శివాలయంలో వేదపురాణాలలో పేర్కొనబడిన శివుని అవతారాలు, లీలలకు సంబంధించిన చిత్రాలు వేయించాలి. అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో గొప్పగా ప్రకాశిస్తారు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *ఆలోచించి ఆచరిస్తే అనేక సేవలు*


✅👉 *ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు గుక్కెడు మంచినీళ్లు ఇచ్చి ఉపచరించడం, వారి వసతి కోసం చలువపందిళ్లు వేయించడం, వారికి సమయానికి ఇంత ప్రసాదం పంచడం, తోటి భక్తులకు కావాల్సిన సాయం అడిగి చేయడం, వాహనం మోయడం, రథం లాగడం, ముఖ్యంగా క్షేత్ర మర్యాద తెలుసుకోవడం, పాటించడం, తెలుసుకున్నదానిని నలుగురు భక్తులకూ తెలియజెప్పడం ఇలా ఎన్నో సేవలను భక్తులు ఆచరించవచ్చు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂

 *వెల్ల వేయించి..  దీపాలు వెలిగించి...* 


*సుధావిలిప్తం యః కుర్యాత్ సర్వయత్నైశ్శివాలయమ్ ।* 

*తావత్పుణ్యం భవేత్ సోపి యావదాయతనే కృతే ॥* 


✅👉 శివాలయానికి, ప్రాకారం గోడలకు సుధాకర్మ (సున్నం పూయించడం) చేయించిన వారికి ఆలయనిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం విడువకుండా, పాలవంటి తెల్లసున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించినా అతడికి శివలోకవాసపుణ్యం లభిస్తుంది. అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం, గుగ్గిలంతో ధూపం వేయడం కూడా ఆలయసేవలో భాగాలే.


✅👉 ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించడం, దానికి కావలసిన వత్తులు, తైలం మొదలైన ద్రవ్యాలను సిద్ధం చేసి అందించడం, మొదలైన సేవలు ఆ వంశంలోని పిల్లలకు చక్కటి విద్య లభించడానికి ముఖ్యమైన సేవలు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂

*సర్వే జనాః సుఖినోభవంతు*

Wooden temple


 

Wonderful art


 

గత కర్మల దారాలతో

 శ్లోకం:☝️

*సుఖస్య దుఃఖస్య న కోపి దాతా*

 *పరో దదాతీతి కుబుద్ధిరేషా ।*

*అహం కరోమీతి వృథాభిమానః*

 *స్వకర్మసూత్రగ్రథితో హి లోకః ॥*

 - రామాయణం


భావం: మనకు సుఖదుఃఖాలు ఎవరూ ఇవ్వరు. వేరొకరు మనకు ఇస్తారు అనే ఆలోచన కూడా తప్పు. "నేను చేస్తున్నాను" అనే అహంకారం వ్యర్థం. జీవులందరూ తమ గత కర్మల దారాలతో కట్టుబడి ఉన్నారు. (కైకేయి మంథరలను నిషాదరాజు గుహుడు నిందించినప్పుడు శ్రీరాముని సమాధానం)🙏