*శ్రీ హరి స్తుతి 87*
*కం.గగనంబున గరుడునిపై*
*జగమంతయు తిరుగుచుండె సర్వ రక్షకుడై*
*అగణితమగు సురలెల్లర*
*విగతులుగా చేయబూని విశ్వము నందున్*
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
*శ్రీ హరి స్తుతి 87*
*కం.గగనంబున గరుడునిపై*
*జగమంతయు తిరుగుచుండె సర్వ రక్షకుడై*
*అగణితమగు సురలెల్లర*
*విగతులుగా చేయబూని విశ్వము నందున్*
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
శ్రీశంకరాచార్య విరచిత
**నిర్వాణ షట్కము**
శ్లో. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం 01
తే. ఘనత గల్గిన చిత్తమ్ము మనసు కాను
అరయ బుద్ధిని గాను నే నహము కాను
చెవులు కన్నులు నాసిక జిహ్వ కాను
అవని వ్యో మాగ్ని వాయువు నరయ కాను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 01
శ్లో. న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుః న వా పంచకోశః
న వాక్పాణిపాదం న చోపస్థపాయుః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం 02
తే. ప్రాణ సంజ్ఞను భావింప కాను నేను
పంచ వాయువు లరయంగ నెంచ కాను
రక్త రస మాంస మేదాస్థి యుక్త మైన
సప్తధాతువులను గాను సంభ్రమముగ
పంచకోశాధివాస సంపత్తి గాను
కర చరణ మాట లేమియు న్నరయ కాను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 02
శ్లో. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం 03
తే. అరయ ద్వేషానురాగ విహారి గాను
మోహలోభంబులును కూడ మొదలు లేవు
మరియు ధర్మార్థ కామముల్ మహిత ముక్తి
యేవియును లేవు నాకు నే నేమి కాను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 03
శ్లో. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం 04
తే. ఎన్నగా పుణ్య పాపంబు లేవి లేవు
సుఖము దుఃఖము లనునవి చూడ లేవు
తీర్థ మఖములు మంత్రముల్ తెలియ లేవు
అనుభవమ్మది లేదు నా కనుభవించ
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 04
శ్లో. న మే మృత్యుశంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం 05
తే. చనెడుభయమది లేదింక జాతిలేదు
జనని జనకులు మరి లేరు జన్మలేదు
కాను బంధువు నరయంగ కాను సఖుడ
కాను నే శిష్యుడను మరి కాను గురువు
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 05
శ్లో. అహం నిర్వికల్పో నిరాకార రూపః
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం
సదామే సమత్వం న ముక్తిర్న బంధః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం 06
తే. లేదు రూపమ్ము చూడగన్ లేదు మార్పు
ఇల ప్రదేశమ్ము లందు సర్వేంద్రియముల
వ్యాప్తి చెందియు ననయమ్ము వరలు చుందు,
నరయ సమదృష్టి నుందు నే నన్నిటందు
ముక్తి బంధమ్ము లవిలేవు రక్తి లేదు
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 06
✍️గోపాలుని మధుసూదన రావు🙏
*శ్రీ హరి స్తుతి 85*
*కం.నమ్మకముగ చేరినచో*
*వమ్మును కానీయడెపుడు భక్తులమదికిన్*
*అమ్మను కూడిన విష్ణువు*
*రమ్మని పిలిపించుకొనును ప్రాణుల నెల్లన్*
*శ్రీ హరి స్తుతి 86*
*కం.హరినామంబును మరువక*
*నిరతముగ నిలుపు కొనుము నిర్మల మదిలో*
*పరదైవము లేడనుకొని* *కరములు జోడించినాను కైవల్యముకై*
🙏సర్వేజనాః సుఖినోభవంతు🙏
🌺 శుభోదయం 🌺
🏵️ నేటిపెద్దలమాట 🏵️
దీపం నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది.
గొప్ప వ్యక్తిత్వం గల వారు మౌనంగానే ఉంటారు.వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపుతాయి.
🌺 నేటిమంచిమాట 🌺
సాయంచేసే గుణంలోని పరమార్ధాన్ని గ్రహించి ఇతరులకు సహాయపడితే మనకు అంతులేని ఆత్మ సంతృప్తి మిగులుతుంది*
🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 27 - 01 - 2026,
వారం ... భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *నవమి* సా4.53 వరకు,
నక్షత్రం : *భరణి* ఉ9.28 వరకు
యోగం : *శుక్లం* రా1.59 వరకు
కరణం : *కౌలువ* సా4.53 వరకు,
తదుపరి *తైతుల* తె3.43 వరకు,
వర్జ్యం : *రా8.38 - 10.08*
దుర్ముహూర్తము : *ఉ8.52 - 9.36*
మరల *రా10.56 - 11.47*
అమృతకాలం : *తె58.35 నుండి*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.49,
*_నేటి విశేషం_*
*నేడు మాఘ శుక్ల నవమి / మధ్వనవమిగా ప్రసిద్ధం*
*మధ్వనవమి విశిష్టత*
భారతీయ దర్శనాల్లో ముఖ్యమైన మూడు సిద్ధాంతాలలో ఒకటి ద్వైత సిద్ధాంతం.
ద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ధర్మమూర్తి, పూర్ణప్రజ్ఞులు శ్రీమధ్వాచార్యులు, ఆయన ఉడుపిలోని అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుకు భాష్యం చెబుతూ, దేవతలు కురిపించిన పుష్పవృష్టిలో అంతర్థానమై బదరికాశ్రమాన్ని చేరిన రోజు మధ్వ నవమి.
త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం.. శ్రీమధ్వాచార్యులు. ఆయన ఆశ్వయుజ విజయదశమినాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపివద్ద పాజక గ్రామంలో జన్మించారు.
మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట, వేదవతిలుగా పేర్కొన్నారు.
ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.
పనెనండో ఏట అచ్యుతప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు.
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాలవైపు ఆసక్తిచూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు.
చిన్నవయసులోనే సకల శాస్తజ్ఞ్రానం సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు.
ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యేమార్గానికి చిహ్నంగా శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.
గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు.
రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్యాచార్యులవారే. శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు. వారి చివరియాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది.
ఆ తిరిగిరాని పయనమే మధ్వానవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది.
ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశ వ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జీవుడు వేరు, బ్రహ్మము వేరు, జీవుడు మిథ్య కాదు, అలాగే జడ జగత్తు కూడా మిథ్యకాదు, ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం.
భక్తి ఒక్కటే ముక్తిదాయకం, అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి.
మధ్వాచార్యుడు ఆసేతుసీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు, దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణ్భక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.
జగత్తు మాయ మాత్రమే, జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే.
పరమాత్మ సర్వస్వతంత్రుడు, జీవాత్మ అస్వంతంత్రుడు, జీవోత్తముడు ఆచార్యుడు, ధర్మమార్గంలో ఆచార్యుల అనుగ్రహం సంపాదించి, అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తిముక్తావళి మధ్వులకు శిరోధార్యం.
మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు.
మధ్వాచార్యుడు, హనుమంతుడు మరి భీముడు అనంతరము వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు.
తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాశాడు. ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశాడు.
తర్కంతోపాటు 37 గ్రంథాలను రచించాడు, మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు.
వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు.
ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని మాత్నే తీరం సమీపంలో మునిగిపోతున్న ఓడను రక్షించగా, ఓడలోని ముఖ్య నావికుడు భక్త్భివంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహూకరించాడు.
శ్రీమహావిష్ణువుయొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు, ఆ స్తోత్రమే తరువాత కాలంలో 3ద్వాదశస్తోత్రంగా పిలువబడింది, ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధిచేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది.
ఆ విగ్రహానే్న 800 సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు.
తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా వున్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతనికి దర్శనం అనుగ్రహించాడు.
ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు, మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించాడు.
యుక్తవయస్సులో కన్యకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం.
జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతారు, సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడిమీద ఆధారపడి వుంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
పరబ్రహ్మ ఒక్కడే, అతను విష్ణువు అని ప్రబోధించాడు, మధ్వ మతతత్వానికి వనె్నతెస్తున్న ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు పెజావర, పుత్తిగె, పాలిమార్, ఆడనూరు, సోధె, కవియూరు, శిరూరు, కృష్ణాపురం మఠాలు. సంప్రదాయాలకు, మతపరమైన ఆచారాలకు, ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.
పురందరదాసు, కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావటంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు.
మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్యసమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాసభగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏
పంచ పాత్ర అంటే ఒక పాత్ర కాదు.
ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి.
మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.
మొదటిది అర్ఘ్య పాత్ర: భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర
రెండవది పాద్య పాత్ర: ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర
మూడవది ఆచమనీయ పాత్ర: ఇది భగవంతుని కి పుక్కిలించడానికి సమర్పించే శుద్దోదకం నింపిన పాత్ర.
నాలుగవది స్నాన పాత్ర: ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న పాత్ర
ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర
ఇవి పంచ పాత్రలు..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి.
ఇంకా సర్వార్థ జల పాత్ర- ఇది మన చేతులు మరియు,ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర.
హిందూధర్మ సాంప్రదాయాలు ఆచరిద్దాం - పాటిద్దాం.
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*633 వ రోజు*
అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము
యజ్ఞములకు మూలము
భీష్ముడు " ధర్మనందనా ! ఒకసారి వ్యాసుడి కుమారుడైన శుకుడు గోవుకు సమానమైనది ఈ లోకంలో మరేదీ లేదు. యాగములకు మూలకారణం గోవు. ప్రారంభంలో ఆవులకు కొమ్ములు లేవు. బ్రహ్మదేవుడు " గోవులు పరమపవిత్రములు. యజ్ఞముకు గోవులు మిక్కిలి అవశ్యము. గోవును చూసినంతనే దురితములు తొలగి పోతాయి. ఎవరైతే గోవును పూజిస్తారో వారు స్వర్గసౌఖ్యములు పొందగలరు. కుమారా ! ఆవు ఔషదులకు నిలయము. గోవు పంచితమును ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవుపేడతో కలిపి మూడు దినములు సేవించిన సకలరోగములు నశిస్తాయి. తరువాత మూడు దినములు ఉపవాసము చేసి ఆవుగిట్టలతో తొక్కించిన యవలతో కాచిన గంజి సేవించిన తేజోవంతులు ఔతారు. ఈ విధంగా సేవించి దేవతలు రాక్షసులను గెలిచారు. ఆవునెయ్యిని సేవించడం వలన ఉదాత్తుడు ఔతాడు. ఆవు నెయ్యిని దానం చేసిన ఎంతో పుణ్యము వస్తుంది. ప్రతి రోజు ఆచమనం చేసి గోవుల మధ్య గోమతి మంత్రం జపించిన అంతఃకరణ శుద్ధి బాహ్య శుద్ధి ఏర్పడుతుంది. ఈ గోమతి మంత్రమును అగ్ని కార్యము, గోవులసమక్షము, బ్రాహ్మణుల ఎదుట చదివిన కోరిన కోరికలు సిద్ధిస్తాయి. అందు వలన గోవును మించిన వస్తువు ఈ లోకములో లేదు " చెప్పాడు. ధర్మనందనా విన్నావు కదా ! గోవుల మాహాత్మ్యము " అని భీష్ముడు చెప్పాడు.
గోలోకము
ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! ఈ మూడు లోకములకు బ్రహ్మదేవుడు అధిపతి. బ్రహ్మలోకమును గోలోకము అంటారట ఎందుకు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సు చేసాడు. అమృత రూపిణి కామరూపి అయిన సురభి అనే కన్యని మానస పుత్రిగా సృష్టించాడు. ఆమెతో పాటు మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు ఆ కన్యను చూసి మోహించి ఆమె కొరకు పరితపించ సాగాడు. అది చూసిన బ్రహ్మ "మార్తోభవ " (నీ పరితాపము ఉపశమించు కాక) అని దీవించాడు. అతడికి మార్తాండుడు అని పేరు పెట్టి అతడికి సురభిని ఇచ్చి వివాహము జరిపించి " మీ రిరువురికి పుట్టిన సంతానం యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయి " అని చెప్పాడు. వారిరువురికి గోవులు సంతానంగా జన్మించాయి. ఆ గోవులు కూడా మానవులకు, దేవతలకు కోరినవి ఇస్తూ వారి చేత పూజలు అందు కుంటున్నాయి " అని భీష్ముడు చెప్పాడు.
సురభి మార్తాండుడు
ధర్మరాజు " పితామహా ! సురభి మార్తాండులకు కలిగిన సంతానం గురించి వివరించండి " అని అడిగాడు. ధర్మనందనా ! ముందుగా సురభి మార్తాండులకు పదకొండు మంది ఉద్భవించారు. వారే బ్రాహ్మణులకు మూల పురుషులు. వారే ఏకాదశ రుద్రులు. వారి పేర్లు అజపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కాపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ ఏకాదశరుద్రులను లోకమంతా పూజించారు. ఏకాదశ రుద్రుల తరువాత గోసమూహం పుట్టింది. ఆ ఆవుల ముఖంలో కొమ్ములలో నాలుకలో ఇంద్రుడు, మలద్వారము మూత్రములో వాయుదేవుడు, మూపురంలో శివుడు, పాదాలలో దేవతలు, కడుపులో అగ్నిదేవుడు, ఆవుపాల పొదుగులో సరస్వతి, ఆవు పేడలో లక్ష్మీదేవి, ఆవు పంచితంలో కీర్తి, రక్తంలో చంద్రుడు కొలువై ఉన్నారు. గోవు హృదయంలో భగుడు అనే దేవత, పాలలో బ్రహ్మదేవుడు, వెంట్రుకలలో అనుష్ఠానములు, తోకలో యమధర్మరాజు, ఆవు కన్నులలో సూర్యుడు, చర్మములో తపస్సు, తేజము అధిష్ఠాన దేవతలుగా ఉన్నారు. ఆవు కాళ్ళలో ఉన్న కీళ్ళలో సిద్ధులు కొలువై ఉన్నారు. సమస్త దేవతలకు ఆలవాలమైన గోవు మాహాత్మ్యము ఏమని వర్ణింపగలము.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
🕉 మన గుడి : నెం 1370
⚜ తమిళనాడు : కంచి
⚜ శ్రీ అష్టభూజాకార- శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం
💠 కాంచీపురం దేవాలయాల భూమి, దీనిలో శివ, విష్ణు, శక్తి దేవాలయాలు మరియు పవిత్ర పరిసరాలుతో కాంచీపురం భారతదేశంలోని "దేవాలయ మహానగరం" అని చెప్పబడింది.
💠 కంచి ఒక దేవాలయల పట్టణం,
ఇక్కడ 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో 15 దివ్య దేశాలు ఒక్క కంచి నగరం చుట్టుపక్కలలోనే ఉన్నాయి.
💠 ఈ ఆలయం కాంచీపురంలోని 14 దివ్య దేశాలలో ఒకటి.
ఈ ఆలయం విష్ణువు ను పొందడానికి బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశంగా, అలాగే బ్రహ్మ విష్ణువును పూజించిన 4 ప్రదేశాలలో ఒకటిగా భావిస్తారు.
💠 కాంచీపురంలోని ఆ నాలుగు ఆలయాలలో ఈ ఆలయం ఒకటి, వీటిలో యథోత్కరి పెరుమాళ్ ఆలయం, దీపప్రకాశ పెరుమాళ్ ఆలయం మరియు వరదరాజ పెరుమాళ్ ఆలయం ఉన్నాయి, ఇవన్నీ బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశాలుగా పురాణాలతో ముడిపడి ఉన్నాయి.
💠 హిందూ పురాణాల ప్రకారం, ఒకసారి బ్రహ్మ భార్య సరస్వతి మరియు లక్ష్మి మధ్య ఆధిపత్యం గురించి వాదన జరిగింది.
వారు దేవతల రాజు ఇంద్రుడి వద్దకు వెళ్లారు.
ఇంద్రుడు లక్ష్మిని ఉన్నతంగా తీర్పు ఇచ్చాడు మరియు అతని వాదనతో సరస్వతి సంతృప్తి చెందలేదు, సరస్వతి తన భర్త బ్రహ్మ వద్దకు వెళ్లింది. అతను లక్ష్మిని కూడా ఉన్నతంగా ఎంచుకున్నాడు.
💠 సరస్వతి ఈ నిర్ణయంతో అసంతృప్తి చెంది బ్రహ్మ నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
💠 బ్రహ్మదేవుడు భూమిపై విగ్రహారాధనతో ఇతర దేవతల వలె తనను గౌరవించలేదని బాధపడ్డాడు మరియు తన కోరికను నెరవేర్చుకోవడానికి ఒక గొప్ప యజ్ఞాన్ని శ్రీమహావిష్ణువు కోసం నిర్వహించాడు.
💠 బ్రహ్మ విష్ణువును ప్రార్థిస్తూ తీవ్రమైన తపస్సు చేసి అశ్వమేథ యజ్ఞం చేశాడు.
సాధారణంగా భార్యలతో కలిసి చేసే యజ్ఞాన్ని బ్రహ్మ సరస్వతి దేవి లేకుండా చేశారు.
💠 బ్రహ్మ అశ్వమేధ యాగం నిర్వహించడానికి ప్రయత్నించినప్పుడు, సరస్వతి తన రాక్షసులను విధ్వంసం చేయడానికి పంపింది.
ఆమె యాగస్థలమైన యాగశాలను నాశనం చేయడానికి ఒక పెద్ద సర్పాన్ని కూడా పంపింది.
అప్పుడు విష్ణువు తన 8 చేతుల్లో 8 వేర్వేరు ఆయుధాలను ధరించి అష్టభుజ పెరుమాళ్‌గా కనిపించి, యాగాన్ని రక్షించేటప్పుడు సర్పాన్ని చంపాడు.
ప్రస్తుతం ఆలయం ఉన్న చోట ఇది జరిగిందని చెబుతారు.
💠 ఈ స్థలంలోని పెరుమాళ్‌ను 'అష్టభూజంగ పెరుమాళ్' అని పిలుస్తారు మరియు అతను ఎనిమిది చేతులతో (అష్ట - ఎనిమిది) కనిపిస్తాడు.
అతడిని ఆదికేశవ పెరుమాళ్ అని కూడా అంటారు మరియు అతను చక్రం, ఖడ్గం, ఒక పుష్పం మరియు బాణం అతని నాలుగు కుడి చేతులపై మరియు (శంఖం), విల్లు, కవచం మరియు గధ ఉన్నాయి
💠 పెరుమాళ్ ఈ ప్రదేశంలోనే రాక్షసుల నుండి తల్లి భూమాదేవిని రక్షించాడు.
అందుకే, ఇల్లు కట్టుకోవడానికి లేదా వ్యవసాయం చేయడానికి భూమిని కొనుగోలు చేసేవారు లేదా ఇళ్ళు కట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ భూమి స్థలాలను సంపన్న ప్రదేశంగా మార్చమని పెరుమాళ్ను ప్రార్థిస్తారు.
⚜ ఆలయ చరిత్ర
💠 పూర్వజన్మలో మహాసందుడు అని ఒక యోగి ఈ జన్మలో ఒక ఏనుగుగా పుట్టి పూర్వజన్మ స్మృతి కలిగి మోక్ష సాధనకై కంచికి వెళ్లి వరదరాజ పెరుమాళ్ను పూజించమని మృకండు మహర్షి ఏనుగుకు సలహా ఇచ్చాడు.
💠 ఆ ఏనుగు అష్టభుజ పెరుమాళ్ ఆలయానికి వచ్చి ప్రతిరోజూ 14,000 పుష్పాలను పూజించడం ప్రారంభించింది.
ఒకరోజు తగినంత పుష్పాలు లభించకపోవడంతో, సమీపంలోని చెరువు నుండి పూలు కోయడం ప్రారంభించి, మొసలి చేతిలో చిక్కుకుంది.
గతంలో గజేంద్రుడిని రక్షించినట్లుగా శ్రీ మన్నారాయణమూర్తి మొసలి తన 'సుదర్శన చక్రం' ఉపయోగించి మొసలి నోటి నుండి గజేంద్ర అనే ఏనుగును రక్షించాడు.
అతను ఇక్కడ ఏనుగుకు మోక్షం ఇచ్చాడు.
💠 అష్టభూజాకార పెరుమాళ్ భార్య పుష్పకవల్లి తాయార్ కు ప్రత్యేక ఆలయం ఉంది.
మందిరం ముందు భాగంలో శుక్రవారం మండపం అనే నాలుగు స్తంభాల హాలు ఉంది.
పెరుమాళ్ ను పూజించే ముందు, ముందుగా తాయార్ ను పూజించడం ఆచారం.
ఆ ప్రాంగణంలో, రెండు సర్పాల పడగల కింద కూర్చున్న వరాహ పెరుమాళ్ కు ఒక మందిరం ఉంది.
💠 ఆలయంలో హనుమంతుడు, ఆళ్వారులు, ఆండాళ్, సుదర్శన చక్రం మరియు శరభకు అంకితం చేయబడిన మరిన్ని మందిరాలు ఉన్నాయి.
ఆలయ చెరువు అయిన గజేంద్ర పుష్కరణి ప్రవేశ గోపురం వెలుపల ఉంది.
💠 బ్రహ్మోత్సవం ఇక్కడ తమిళ నెల చిత్తిరై (ఏప్రిల్-మే)లో జరుపుకుంటారు, వైకుంఠ ఏకాదశిని మార్గశి (డిసెంబర్-జనవరి) సమయంలో జరుపుకుంటారు. గజేంద్ర మోక్ష కార్యక్రమం తమిళ నెల ఆది (జూలై-ఆగస్టు)లో కూడా ఒక పండుగగా జరుపుకుంటారు.
శ్రీరామ నవమి, శ్రీ కృష్ణ జయంతి, నవరాత్రి, దీపావళి, పొంగల్ మొదలైన ఇతర పండుగలు కూడా ఇక్కడ సంప్రదాయం ప్రకారం జరుపుకుంటారు.
రచన
©️ Santosh Kumar
🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *కేచిదజ్ఞానతో నష్టాః*
*కేచిన్నష్టాః ప్రమాదతః* ।
*కేచిజ్జ్ఞానావలేపేన*
*కేచిన్నష్టైస్తు నాశితాః* ॥
*- సుభాషితరత్నభాణ్డాగారః -*
*తా𝕝𝕝 కొందరు *అజ్ఞానంవల్ల* నాశనమైనారు.....
*కొందరు పొరపాటున* నాశనమైనారు....
*కొందరు గర్వంతో* నాశనం అయితే,
*కొందరు నాశనమైన వారిచేత నష్టపోయారు* .... 🧘♂️🙏
✍️💐🌹🌸🙏
ಸುಭಾಷಿತ . ೩೨೪ .
ಶರದಿ ನ ವರ್ಷತಿ ಗರ್ಜತಿ ವರ್ಷಾಸು ವರ್ಷತಿ ನಿಃಸ್ವನೋ ಮೇಘಃ | ನೀಚೋ ವದತಿ ಕುರುತೇ ನ ವದತಿ ಸುಜನಃ ಕರೋತ್ಯೇವ ||
ಶರದೃತುವಿನ ಮೋಡಗಳು ಗುಡುಗುತ್ತವೆ , ಮಳೆ ಸುರಿಸುವುದಿಲ್ಲ , ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಶಬ್ದಮಾಡದೆ ಮಳೆ ಸುರಿಸುತ್ತದೆ . ಅದೇ ರೀತಿ ನೀಚನು ಮಾತನಾಡುತ್ತಾನೆ , ನಡೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ . ಸತ್ಪುರುಷನು ಮಾತನಾಡದೆ ಕಾರ್ಯ ಮಾಡುತ್ತಾನೆ .
ಸುಭಾಷಿತರತ್ನಭಾಂಡಾಗಾರ .
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
*నక్షత్ర స్తోత్ర మాలిక - 26 వ రోజు.*
*నక్షత్రం*_*ఉత్తరాభాద్ర*
*అధిపతి*_*శని*
*ఆరాధించాల్సిన దైవం*_ *అహిర్బుధ్న్యుడు (రుద్రుడు/శివుడు)*
*ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, మరియు శని దోష నివారణ, మానసిక ప్రశాంతత, మోక్షం కోరుకునే వారు పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం*.
🙏*శరభేశాష్టకం*🙏
*శ్రీ శివ ఉవాచ"*
*శృణు దేవి మహాగుహ్యం పరం పుణ్యవివర్ధనం*.
*శరభేశాష్టకం మంత్రం వక్ష్యామి తవ తత్త్వతః* ॥
*ఋషిన్యాసాదికం యత్తత్సర్వపూర్వవదాచరేత్*.
*ధ్యానభేదం విశేషేణ వక్ష్యామ్యహమతః శివే* ॥
*ధ్యానం*
*జ్వలనకుటిలకేశం సూర్యచంద్రాగ్నినేత్రం*
*నిశితతరనఖాగ్రోద్ధూతహేమాభదేహమ్* ।
*శరభమథ మునీంద్రైః సేవ్యమానం సితాంగం*
*ప్రణతభయవినాశం భావయేత్పక్షిరాజమ్* ॥
*అథ స్తోత్రం*
*దేవాదిదేవాయ జగన్మయాయ శివాయ నాలీకనిభాననాయ* ।
*శర్వాయ భీమాయ శరాధిపాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ* ॥ 1 ॥
*హరాయ భీమాయ హరిప్రియాయ భవాయ శాంతాయ పరాత్పరాయ* ।
*మృడాయ రుద్రాయ విలోచనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ* ॥ 2 ॥
*శీతాంశుచూడాయ దిగంబరాయ సృష్టిస్థితిధ్వంసనకారణాయ* ।
*జటాకలాపాయ జితేంద్రియాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ* ॥ 3 ॥
*కలంకకంఠాయ భవాంతకాయ కపాలశూలాత్తకరాంబుజాయ* ।
*భుజంగభూషాయ పురాంతకాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ* ॥ 4 ॥
*శమాదిషట్కాయ యమాంతకాయ యమాదియోగాష్టకసిద్ధిదాయ* ।
*ఉమాధినాథాయ పురాతనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ* ॥ 5 ॥
*ఘృణాదిపాశాష్టకవర్జితాయ ఖిలీకృతాస్మత్పథి పూర్వగాయ* ।
*గుణాదిహీనాయ గుణత్రయాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ* ॥ 6 ॥
*కాలాయ వేదామృతకందలాయ కల్యాణకౌతూహలకారణాయ* ।
*స్థూలాయ సూక్ష్మాయ స్వరూపగాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ* ॥ 7 ॥
*పంచాననాయానిలభాస్కరాయ పంచాశదర్ణాద్యపరాక్షయాయ* ।
*పంచాక్షరేశాయ జగద్ధితాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ* ॥ 8 ॥
*ఇతి శ్రీ శరభేశాష్టకమ్* ॥
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️
*🌷మంగళవారం 27 జనవరి 2026🌷*
_*మాఘ పురాణం - 9వ*
_*అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*27వ తేదీ మంగళవారం*
*వేకువఝామున*
*చదువు కొనుటకు*
``
మాఘ పురాణంలోని తొమ్మిదవ అధ్యాయం, గంగానది పవిత్రత, దాని జలాల శక్తి గురించి వివరిస్తుంది.
భగవంతుడి నుండి వచ్చిన గంగానది అన్ని పాపాలను తొలగిస్తుందని, దానిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ అధ్యాయం గంగానది ప్రాముఖ్యత, దాని జలాల శక్తిని తెలియజేస్తుంది.
*గంగా జలం మహిమ*```
ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివ మహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మొదటగా శ్రీరామచంద్రుడు రావణుని సంహరించుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి, వారధి దాటి రావణుని సంహరించెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి, మహా బలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలు దేరే ముందు శివని పూజ చేసియే యుద్ధ రంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి. కనుక, పూజలలో శివపూజ పవిత్రమైనది.
అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా, గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినదియు, శివుని శిరస్సు నుండి ప్రవహించు నట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగా జలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని, “గంగ గంగ గంగ” అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగా జలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక, మాఘమాసములో గంగ స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను..
కొంత కాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్ని రోజులకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను, బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి, మోహించి, అతనిని సమీపించి చుట్టు ముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా, ఆ విద్యార్థియూ, మీరుకూడ పిశాచులగుదురుకాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి, అందరిని బాధించి, ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి.
కొంతకాలమునకు ఒక సిద్దుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లి దండ్రులు, తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగి పోవునని చెప్పగా వారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి.
ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్మ్యమే కారణము.
మాఘమాస నందు చేయు నదీ స్నానము మానవులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పవిత్రమైనది.
ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానము అచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేక పోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించు చుండిరి.
ఆ దృశ్యమును చూచి మండి పడుచు ‘తపస్వివై యుండి కూడా యిలా కామ తృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాక!’ అని విశ్వామిత్రుని, పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు.
విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము”, అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది, గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను.
పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*మాఘపురాణం తొమ్మిదవ* *అధ్యాయము సంపూర్ణము*
*🌷సేకరణ🌷*
*న్యాయపతి నరసింహారావు*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 12*
*కంపాతీరచరాణాం కరుణాకోరకితదృష్టిపాతానామ్ ।*
*కేళీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానామ్ ||*
*భావము :*
*అమ్మా, నా మనసు ఒక క్రీడా స్థలము. కంపానదీ తీరములో ఉన్న ఆ క్రీడా స్థలములో దయాసముద్రురాలవైన నీవు చిద్విలాసముగా సర్వత్ర విహరిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
ఈ రోజు పంచాంగం 27.01.2026Tuesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష నవమి తిథి భౌమ వాసర భరణి నక్షత్రం శుక్ల యోగః బాలవ తదుపరి కౌలవ తదుపరి తైతుల కరణం.
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.
శ్రాద్ధ తిథి: నవమి
నమస్కారః , శుభోదయం
-------------------- భగవద్గీత. -------------------
ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే ।
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ।। 50 ।।
ప్రతిపదార్థ:
బుద్ధి-యుక్తః — జ్ఞాన సంపన్నుడవై; జహాతి — త్యజించుము; ఇహ — ఈ జన్మలో; ఉభే — రెంటినీ; సుకృత-దుష్కృతే — మంచి, చెడు కార్యములు; తస్మాత్ — కాబట్టి; యోగాయ — యోగము కొరకు; యుజ్యస్వ — గట్టిగా ప్రయత్నింపుము; యోగః — యోగ అంటే; కర్మసు కౌశలమ్ — నేర్పుతో పని చేసే కళ.
తాత్పర్యము :
వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి, నైపుణ్యంతో (సరియైన దృక్పథంతో) పని చేయటం అనే, యోగ అభ్యాసము చేయుము.
వివరణ:
తరచుగా, కర్మయోగ శాస్త్రం విన్న పిదప, జనులు ఒక సందేహం వ్యక్తం చేస్తారు; ఫలితాలపై ఆసక్తి/మమకారం వదిలేస్తే, వారి కార్యనిర్వహణ శక్తి తరిగిపొదా? అని. స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే మనపని లోని నాణ్యత ఏ మాత్రం తగ్గదని; పైగా, మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
తన చికిత్సా ప్రక్రియలో రోగులను కత్తితో కోసే ఒక చిత్తశుద్ధిగల శస్త్రచికిత్సా వైద్యుడిని ఉదాహరణగా పరిశీలిద్దాం. అతను తన విధిని సమత్వ బుద్ధితో నిర్వర్తిస్తాడు, రోగి బ్రతికినా లేదా ఒకవేళ మరణించినా అతను చలించడు. ఎందుకంటే, అతను తన ధర్మాన్ని నిస్వార్థంగా, తన శక్తి మేర, ఫలితంపై మమకారం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి, ఒకవేళ శస్త్రచికిత్స ప్రక్రియలో రోగి మరణించినా ఆయనకు హత్య చేసిన అపరాధ భావన రాదు. కానీ, అదే వైద్యుడి ఏకైక బిడ్డకి శస్త్రచికిత్స చేయవలసి వస్తే, అతనికి ఆ పని చేసే ధైర్యం ఉండదు. ఫలితముపై ఉన్న మమకారం వల్ల శస్త్రచికిత్స సరిగా చేయలేనేమో అని భయం ఉంటుంది, కాబట్టి వేరొక వైద్యుడిని ఆశ్రయిస్తాడు. ఫలితములపై ఉన్న మమకారం మన నైపుణ్యాన్ని పెంచదు; పైగా మన సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది, అని దీని ద్వారా మనకు తెలుస్తున్నది. దీనికి బదులుగా, మమకారము/బంధము లేకుండా పని చేస్తే, భయం, ఆందోళన, చికాకు, ఉద్విగ్నత లేదా గాభరా లేకుండా మన గరిష్ఠ నైపుణ్య సామర్థ్యంతో పని చేయవచ్చు.
అదే విధంగా, అర్జునుడి స్వంత ఉదాహరణ కూడా ఫలితములపై మమకారం విడిచిపెడితే అది తన సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావం ఏమీ చూపదని తేటపరచుతున్నది. భగవద్గీత వినక ముందు, అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేయగోరాడు. శ్రీ కృష్ణుడి ద్వారా భగవద్గీత విన్న తరువాత, అతను భగవంతుని పట్ల కర్తవ్యంగా, శ్రీ కృష్ణుడి ప్రీతి కోసం యుద్ధం చేసాడు. అతను అప్పటికీ వీర యోధుడే; కానీ తన అంతర్గత దృక్పథం/ప్రేరణ మారిపోయింది. తన కర్తవ్యాన్ని మమకార బంధాలు లేకుండా చేయటం అనేది అతన్ని ఏమీ తక్కువ సామర్థ్యం కలవాడిని చేయలేదు. నిజానికి దానికి విరుద్ధంగా, అతను మరింత ఉత్సాహంతో పోరాడాడు ఎందుకంటే తన పని ఇప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవ అయిపోయింది.