27, జనవరి 2026, మంగళవారం

*శ్రీ హరి స్తుతి 88*

 *శ్రీ హరి స్తుతి 88*


*గరుడుని పై విహరించుచు*

*ధరణంతయు చుట్టి నాడు  ధర్మము కొరకై* 

*మొరల విని యాలకించగ*

*కరములు జోడించినాము కైవల్యముకై*



*శ్రీ హరి స్తుతి 89*


*హరి కరుణామృత మందగ*

*నర జన్మమునందు  మనకు నాణ్యత పెరుగున్*

*గురువుల నాశ్రయమొందిన*

*పరమ పదమునందు చోటు పదిలంబయ్యెన్*

కామెంట్‌లు లేవు: