27, జనవరి 2026, మంగళవారం

వినయాంజలి

 🌹వినయాంజలి 🌹


నిరతమీ సంసార  నీరధిన్ బడి యీది 

           వపువు పై యాశను వదల లేక

తేలుచున్ మునుగుచున్ దీరమున్  గనలేక

           ప్రాణ ప్రయాణముల్ బ్రతుకు నందు

శతసంఖ్య లోర్చితిన్ సర్వేశ్వరా ! యీశ !

          చాలు మిథ్యాసౌఖ్య సతత భ్రమలు

నిత్య సౌఖ్యమ్మది నెనరుతో  నా కిమ్ము

          రక్షించి నిరతమ్ము రాగమునను

బ్రతుకు భ్రమలను పోగొట్టి సతము నాకు 

ముక్తి నొసగుమ దివ్యానురక్తి చూపి 

పరమపావన శంకరా ! భసిత దేహ !

పార్వతీనాథ ! వేడెద పాహి ! పాహి !


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: