24, నవంబర్ 2021, బుధవారం

శ్రీరమణీయం* *-(242)*_

 _*శ్రీరమణీయం* *-(242)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"నాకు సంభవించే కష్టసుఖాల్లో భగవంతుని జోక్యం ఉంటుందా ? లేదా !?"*_


_*నీకు జీవితాన్ని, కర్మలను అందించటం మినహా నీ కష్టసుఖాల్లో భగవంతుని జోక్యంలేదు. జీవితాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకుంటే ఏవి అవసరాలో, ఏవి కోరికలో మనకు తెలుస్తాయి. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవనం సాఫీగా సాగుతుంది. దైవం విషయంలో కూడా అతి కోరిక పనికిరాదు. అందుకే అప్పుచేసి తీర్థయాత్రలు చేయకూడదని పెద్దలు చెబుతారు. భార్యాపిల్లలను పోషించటం, వారికి సౌకర్యవంతమైన జీవనాన్ని అందివ్వటం మాత్రమే మన బాధ్యత. పక్కవాడ్ని చూసి అనుకరించటం సరికాదు. పాదాలకు పట్టీలు పెట్టుకోవాలనిపించవచ్చు కానీ బంగారు పట్టీలు కోరటం అశాంతికి కారణం. అసమానత లేనిదే సృష్టిలేదు. నీ కన్నా తక్కువ సుఖం, ఎక్కువ సుఖం పొందేవారు ఎప్పుడూ ఉంటారు. అసమానతలో ఉన్న సమానత్వాన్ని గుర్తిస్తే శాంతి వస్తుంది. కానీ మనం సమానత్వంలో కూడా అసమానతను వెతుకుతున్నాం. కరెన్సీ నోట్లు సృష్టించేది మనమే, దొంగనోట్లని సృష్టించేదీ మనమే. కోర్టులు, చట్టాలు, శిక్షలు కూడా మనవే. వీటిలో భగవంతుని ప్రమేయం ఏముంటుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'ఆలోచించేది ఎవరో తెలుసుకోవటమే ధ్యానం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

శ్రీ ఉమామహేశ్వరస్తోత్రమ్

 ॐ             श्री उमामहेश्वरस्तोत्रम्   

             శ్రీ ఉమామహేశ్వరస్తోత్రమ్ 

   Sree Uma Maheswara Stotram)   


              (श्रीमच्छंकरभगवतः कृतौ)   

           (శ్రీ శంకరాచార్య విరచితమ్)  

        (BY SREE AADI SANKARA)            


                                    శ్లోకం : 3     

                            SLOKAM : 3


नमः शिवाभ्यां वृषवाहनाभ्यां 

विरिञ्चिविष्ण्विन्द्रसुपूजिताभ्याम्।

विभूतिपाटीरविलेपनाभ्यां 

नमो नमः शंकरपार्वतीभ्याम् ।।3।। 


నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరిఞ్చివిష్ణ్విన్ద్ర సుపూజితాభ్యామ్ I 

విభూతిపాటీర విలేపనాభ్యాం 

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ৷৷3৷৷


మంగళమూర్తులూ, 

ఎద్దు వాహనముగా కలవారూ, 

బ్రహ్మ - విష్ణువు - ఇంద్రుడు మొదలగు వారిచే పూజింపబడువారరూ, 

విభూతి - చందనము పూసుకొన్నవారూ అగు 

పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు. 


Salutations to Lord Shiva and Goddess Shiva ! 

  - Who rides on the divine bull,

  - Who is worshipped by Vishnu, Brahma and Indra and 

  - Whose bodies are anointed with Sandal and holy ash,


    Salutations and salutations to Lord Sankara

and to that Goddess Parvathy. 


https://youtu.be/KSTB-amenYA


                    =x=x=x=           


    — రామాయణం శర్మ 

              భద్రాచలం