20, జనవరి 2024, శనివారం

తృటి

 మనం అప్పుడప్పుడు వింటుంటాం.. పత్రికలలో చదువుతుంటాం.. 


" *తృటి* లో తప్పిన ప్రమాదం "  అని.. అసలీ *తృటి* అంటే ఏమిటి? 


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం అంటే రెప్ప పాటుకాలం (నిముషం కాదు..)

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

12 కష్టాలు = ఒక నిముషం 

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణు కు ఒక పూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


వేల సంవత్సరాల క్రితమే కాలాన్ని ఇంత సూక్ష్మంగా, స్థూలంగా విభజన చేసిన మన పూర్వీకుల విజ్ఞానాన్ని తెలుసుకుందాం.. భావి తరాలకు తెలుపుదాం.. 


*సర్వేజనా సుఖినోభవంతు!*

రావమ్మా! మహాలక్ష్మి..

 https://youtu.be/NEYkuragDo8?si=-4aN-eLsD2rSk9aA


శ్రీభారత్ వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు 🌹రావమ్మా! మహాలక్ష్మి.. రావమ్మా! సంక్రాంతి సొగసులన్నీ కలబోసిన ఈ అందమైన పాటను మధ్య మధ్యలో ఆలపిస్తూ సంక్రాంతి సంబరాలన్నిటిని మన కళ్లకు కట్టినట్టు ఈ ఎపిసోడ్ లో ఆవిష్కరించారు ప్రముఖ రచయిత్రి డా. కొండపల్లి నీహారిణి గారు. నాలుగు రోజుల ఈ పెద్ద పండుగ లోని సంస్కృతి వివరిస్తూ రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, ఎన్నెన్నో విశేషాల గురించి ఎంతో రమ్యంగా వివరించారు నీహారిణి గారు. సంక్రాంతి ఎంత గొప్ప పండుగో మరోసారి ఆమె మాటల్లో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

పిల్లలకి ఇక ఇలా నేర్పించండి

 🌹🙏🏻🇮🇳

పిల్లలకి ఇక ఇలా నేర్పించండి

శ్రీరామ నామావళి

*A to Z*


A - అయోధ్య రామ

B - భార్గవ రామ

C - చిన్మయ రామ

D- దశరధ రామ

E - ఈశ్వర రామ

F - ఫల్గుణ రామ

G - గుణాత్మక రామ

H - హనుమత రామ

I -  ఇనయ రామ

J - జగదభి రామ

K - కౌసల్య రామ

L - లక్ష్మణ రామ

M - మర్యాద రామ

N - నరహరి రామ

O -  ఓంకార రామ

P - పురుషోత్తమ రామ

Q - కుశలవ రామ

R - రఘుకుల రామ

S - సీతా రామ

T - తారక రామ

U - ఉదాత్త రామ

V - వసిష్ఠ రామ

W - వైకుంఠ రామ

X - జితేంద్ర రామ

Y - యోగిత రామ

Z - జనహిత రామ

Jai Shrï Sïthä Räm

🚩🚩🚩🚩🚩

త్రిఫలా చూర్ణం

 త్రిఫలా చూర్ణం - ఉపయోగాలు .


 * శిరోవ్యాధులకు - 


        త్రిఫలా చూర్ణం 30 గ్రా , పటికబెల్లం చూర్ణం 30 గ్రా కలిపి బధ్రపరచుకోవాలి. రొజూ 2 పూటలా పూటకు 10 గ్రా చొప్పున మోతాదుగా సేవిస్తూ ఉంటే తలలో పుట్టే వంద రకాల శిరోవ్యాదులు హరించి పోతాయి.


 * మూర్చ - అపస్మారం -


      త్రిఫల చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా ఒక టీ స్పూన్ తేనే కలుపుకుని రోజు సాయంత్ర సమయాలలో సేవిస్తూ ఉంటే క్రమంగా మూర్ఛ వ్యాధులు నయం అవుతాయి.


 * కామెర్లు - ఉబ్బస రోగం . -


      

       ఉదయం పూట త్రిఫలా చూర్ణం కషాయం పెట్టి ఒక ఔన్స్ కషాయంలో ఒక టీ స్పూన్ అల్లంరసం , రెండున్నర గ్రాముల బెల్లం కలిపి సేవించాలి . రాత్రిపూట త్రిఫలా చూర్ణం , అతిమధురం సమంగా కలిపి ఆ చూర్ణాన్ని 5 గ్రా మోతాదుగా మంచినీళ్ళతో వేసుకోవాలి. ఈ విధంగా రెండు వారాలపాటు ఈ ఔషధాన్ని సేవిస్తే మూర్చలు, దగ్గులు , కామెర్లు, ఉబ్బసం హరించి పొతాయి.


 * కడుపు నొప్పుల కోరకు - 


       త్రిఫలా చూర్ణం , అతిమధుర చూర్ణం , ఇప్పచెక్క చూర్ణం సమంగా కలుపుకుని పూటకు అర టీ స్పూన్ మోతాదుగా రెండు పూటలా నెయ్యి కలుపుకుని సేవిస్తూ ఉంటే కడుపులో వచ్చే అన్ని రకాల నొప్పులు అదృశ్యం అవుతాయి.


 * విరేచనాలు కొరకు - 


       త్రిఫలా చూర్ణం , కాచు చూర్ణం సమభాగాలు గా కలిపి పూటకు 1 టీ స్పూన్ మోతాదుగా మజ్జిగతో గాని , తేనెతో కాని రెండు పూటలా సేవిస్తూ ఉంటే రక్తం , జిగట, అజీర్ణ , నీళ్ల విరేచనాలు అన్ని కట్టుకుంటాయి. కాచు అనేది పచారి షాపుల్లో దొరుకును.


 * అతిమూత్ర వ్యాదికి - 


      త్రిఫలా చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా పావు గ్లాస్ మంచి నీళ్లలో కలిపి రొజూ పడుకునే ముందు తాగుతూ ఉంటే మూత్రంలో చక్కర తగ్గిపోయి అతిమూత్రం అరికట్టబడును.


 * శరీరం ఉబ్బు - 


       50 గ్రా త్రిఫలా కషాయంలో రెండు గ్రా గో మూత్ర శిలాజిత్ భస్మం కలిపి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఇంత అసాధ్యం ఐన ఉబ్బురోగం హరించి పొతుంది.


 * కామెర్ల వ్యాధి నివారణ - 


        10 గ్రా త్రిఫల రసంలో కొంచం తేనే కలిపి రెండుపూటలా ఇస్తూ ఉంటే కామెర్ల వ్యాధి హరించును.


 * పైత్య రోగాలు - 


       ప్రతిరోజూ 2 పూటలా అర టీ స్పూన్ త్రిఫలా చూర్ణం లో ఒక టీ స్పూన్ తేనే కలిపి సకల పైత్య రోగాలు హరించి పొతాయి.


 * యోని దుర్వాసన కొరకు - 


       త్రిఫల కషాయంలో ప్రతిరోజు మూడు పూటలా స్త్రీలు తమ యోనిని కడుగుతూ ఉంటే భోజనంలో తీపి పదార్దాలు కొంచం ఎక్కువుగా తింటూ ఉంటే యోని దుర్గంధం హరించిపొయి భర్తకు ఇష్టులవుతారు.


 * దగ్గుల కొరకు - 


       త్రిఫలా చూర్ణం , శోంటి , పిప్పిళ్ళు , మిరియాలు కలిపిన దానిని త్రికటుక చూర్ణం అంటారు. ఈ రెండు చుర్ణాలని కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే పొడిదగ్గు , నసదగ్గు, కళ్ళే దగ్గు, కళ్లెలో రక్తం పడే దగ్గు ఇలా అన్ని రకాల దగ్గులు అంతం అయిపోతాయి. 


            పైన చెప్పిన శొంటి , పిప్పిళ్ళు , మిరియాలు త్రిఫలా చూర్ణం తో కలిపే ముందు విడివిడిగా దొరగా వేయించుకొని చూర్ణం చేసుకొవాలి .


  కంటి మసకలకు - 


   

     త్రిఫల చూర్ణం 30 గ్రా , మూడు లీటర్ల మంచి నీళ్లతో కలిపి ఒక లీటరు నీరు మిగిలేవరకు సన్నని సెగ మీద మరిగించి వడపోసి ఆ లీటరు కషాయంలో అర లీటరు పాలు , పావు కిలొ నెయ్యి కలిపి పొయ్యి మీద పెట్టి నెయ్యి మాత్రం మిగిలేవరకు మరిగించాలి. ఈ నెయ్యిని ప్రతిరోజు రెండు పూటలా పూటకు ఉసిరికాయంత మోతాదుగా తింటూ ఉంటే కంటి మసకలు తగ్గిపొయి దృష్టి పెరుగుతుంది.


  * సిగిరెట్లు తాగడం వలన వచ్చే నోటి దుర్వాసన -


       త్రిఫలా చూర్ణం , సన్నజాజి ఆకులు సమంగా కలిపి మంచినీళ్ళలో వేసి సగానికి మరిగించి కషాయం కాచి ఆ కషాయం తో రోజుకీ రెండు మూడు సార్లు పుక్కిలిస్తూ ఉంటే పొగ త్రాగటం వలన వచ్చే నోటి దుర్వాసన పొతుంది.


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

రామాయణం‌

 రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో

 

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..


1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?

= వాల్మీకి.


2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?

= నారదుడు.


3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?

= తమసా నది.


4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?

=24,000.


5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?

=కుశలవులు.


6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

=సరయూ నది.


7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?

=కోసల రాజ్యం.


8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?

=సుమంత్రుడు.


9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?

=కౌసల్య, సుమిత్ర, కైకేయి.


10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?

=పుత్రకామేష్ఠి.


11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?

= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.


12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?

=జాంబవంతుడు.


13. వాలి ఎవరి అంశతో జన్మించెను?

= దేవేంద్రుడు.


14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?

=హనుమంతుడు.


15. కౌసల్య కుమారుని పేరేమిటి?

=శ్రీరాముడు.


16. భరతుని తల్లి పేరేమిటి?

=కైకేయి.


17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?

=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.


18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?

=వసిష్ఠుడు.


19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?

=16 సంవత్సరములు.


20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?

=మారీచ, సుబాహులు.


21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?

=బల-అతిబల.


22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?

=సిద్ధాశ్రమం.


23. తాటక భర్త పేరేమిటి?

=సుందుడు.


24. తాటకను శపించిన మహర్షి ఎవరు?

=అగస్త్యుడు.


25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?

=భగీరథుడు.


26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?

=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.


27. అహల్య భర్త ఎవరు?

=గౌతమ మహర్షి.


28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?

=శతానందుడు.


29. సీత ఎవరికి జన్మించెను?

=నాగటి చాలున జనకునికి దొరికెను.


30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?

=దేవరాతుడు.


31. శివధనుస్సును తయారు చేసినదెవరు?

=విశ్వకర్మ.


32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?

=మాండవి, శృతకీర్తి.


33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?

=జనకుడు.


34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?

=కుశధ్వజుడు.


35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?

=వైష్ణవ ధనుస్సు.


36. భరతుని మేనమామ పేరు ఏమిటి?

=యుధాజిత్తు.


37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?

=మంధర.


38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?

=గిరివ్రజపురం, మేనమామ యింట.


39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?

=శృంగిబేరపురం.


40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?

=గారచెట్టు.


41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?

=భారద్వాజ ముని.


42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?

=మాల్యవతీ.


43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?

=తైలద్రోణములో.


44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?

=జాబాలి.


45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?

=నందిగ్రామము.


46. అత్రిమహాముని భార్య ఎవరు?

=అనసూయ.


47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?

=విరాధుడు.


48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?

=అగస్త్యుడు.


49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?

=గోదావరి.


50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?

=శూర్ఫణఖ.


51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?

=జనస్థానము.


52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?

=మారీచుడు.


53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?

=బంగారులేడి.


54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?

=జటాయువు.


55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?

=దక్షిణపు దిక్కు.


56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?

=కబంధుని.


57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?

=మతంగ వనం, పంపానదీ.


58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?

=ఋష్యమూక పర్వతం.


59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?

=హనుమంతుడు.


60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?

=అగ్ని సాక్షిగా.


61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?

=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.


62. సుగ్రీవుని భార్య పేరు?

=రుమ.


63. వాలి భార్యపేరు?

=తార.


64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?

=కిష్కింధ.


65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?

=మాయావి.


66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?

=దుందుభి.


67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?

=మతంగముని.


68. వాలి కుమారుని పేరేమిటి?

=అంగదుడు.


69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?

=ఏడు.


70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?

=ప్రసవణగిరి.


71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=వినతుడు.


72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=అంగదుడు.


73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?

=మామగారు, తార తండ్రి.


74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=శతబలుడు.


75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? 

=మాసం (ఒక నెల).


76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?

=దక్షిణ దిక్కు.


77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?

=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.


78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?

=స్వయంప్రభ.


79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?

=సంపాతి.


80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?

=పుంజికస్థల.


81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?

=మహేంద్రపర్వతము.


82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?

=మైనాకుడు.


83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?

=సురస.


84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?

=సింహిక.


85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?

=నూరు యోజనములు.


86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?

=లంబ పర్వతం.


87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?

=అశోక వనం.


88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?

=పన్నెండు


89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?

=త్రిజట.


90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?

=రామ కథ.


91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?

=చూడామణి.


92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?

=ఎనభై వేలమంది.


93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?

=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.


94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?

=విభీషణుడు.


95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?

=మధువనం.


96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?

=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.


97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?

=ఆలింగన సౌభాగ్యం.


98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?

=నలుడు


99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?

=నికుంభిల.


100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?

=అగస్త్యుడు.


101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?

=ఇంద్రుడు.


102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?

=మాతలి.


103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?

=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!


104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?

=హనుమంతుడు.


105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?

=శత్రుంజయం.


106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?

=స్వయంగా తన భవనమునే యిచ్చెను.


107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?

=బ్రహ్మ.


108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?

=తన మెడలోని ముత్యాలహారం.

ఇంకేం కావాలి

 ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు...


అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు, బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ఇద్దరినీ చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమయ్యాడు


పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది గానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు, ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని పూజారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు, 


ఇప్పుడు సమయం అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు...


మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు, పూజారి రావడం, అభిషేకం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అన్నీ అయిపోయాయి...


స్వామి దక్షిణ తీసుకోండి అని తలా వేయిరూపాయలు బయటకు తీశారు, ఆయన హుండీలో వేయమని సైగ చేశాడు.


యూనిట్ వాళ్లు టిఫిన్ తెచ్చి ఇచ్చారు ఇద్దరూ ఆ గుడి ఆవరణలోనే కూర్చుని తినడానికి వెళ్తూ పూజారిని ఆహ్వానించారు, నేను తినేశాను మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించాడు, కాఫీ అయినా తాగండి అన్నారు, ఆ పూజారి మంచినీళ్ళు కూడా తాగను అనేశాడు, 


మీరు మమ్మల్ని గుర్తించారా అని అడిగారు భరణి గారు కాస్త అహంతో...


ఆ పూజారి పేర్లతో సహా చెప్పాడు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఆశ్చర్యంతో "స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు హుండీలో వేయమన్నారు, టిఫిన్ ఇస్తే తీసుకోలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఎందుకు, కారణం తెలుసుకోవచ్చా" అని అడిగారు 


అప్పుడాయన "సార్ నాకోక ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి ఈ జీవితానికి" అని వెళ్ళిపోయాడు... 


ఆ సందర్భాన్ని అప్పుడే భరణి గారు 

"మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది" అని వర్ణించారు...


ఎవరి దగ్గరా ఏదీ ఆశించకపోతే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికీ, ఆక్షణం ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు అన్నంత గొప్పగా కనిపించాడు ఆ పూజారి వాళ్ళిద్దరి కళ్ళకి, సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషీ మహారాజే గురూజీ...


ఆశించడం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది

ఎవరి నుంచీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్పుడే లైఫ్ లో తృప్తి దొరుకుతుంది, ప్రశాంతత నీలో కొలువుంటుంది...


ఈ సంఘటనను వెంటనే భరణి గారు

ఓ పాటలా ఇలా రాశాడు... 


"మాసెడ్డ మంచోడు దేవుడు 

మాసెడ్డ మంచోడు దేవుడు...

నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు

మాసెడ్డ మంచోడు దేవుడు...

అస్సలడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు

మాసెడ్డ మంచోడు దేవుడు..."


                      ~ విశ్వ టాకీస్  ~


సేకరణ 👆

Panchanag


 

రామో విగ్రహవాన్ ధర్మః

 

రామో విగ్రహవాన్ ధర్మః
ధర్మానికి ఒక రూపం ఇస్తే అది శ్రీరామచంద్రుల వారి వలె  ఉంటుందని అన్నారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుని జన్మస్థలం అయిన అయోధ్యలో జరుగబోవు బాల రాముని విగ్రహప్రతిష్ఠతో లోకంలో అందరి హృదయాలలో ధర్మ చింతన కలగాలని అభిలషిస్తూ
విగ్రహ ప్రతిష్ట శుభాకాంక్షలు తెలుపుతున్నది

బ్రోవుము శోక నాశనా

 ఉత్పలమాల

ఎందరు భక్తులో తనివి దీరక స్తోత్రము జేసి గొల్చి రిం
కెందరు పుణ్యులో జనిరొకే పథమందు నమేయ దీక్షతో ,
మందుడ నిట్టి యోగ్యతణు మాత్రము లేదు, దయాళు వీవు, నా
బంధములన్ని మాపి నను భక్తి పథోన్ముఖు  జేయుమా ప్రభో.🙏🙏
🙏🌷🙏🌷🙏🌷🙏🌷

ఉత్పలమాల

చెల్వపు పూల మాలికల జేర్చితి నీ కొరకై ప్రభో, సదా
కొల్వగ నాకు చిత్తమున కొల్లలుగా కలిగించు భక్తి, నే
గెల్వగ లేనయా భవము, క్లేశము బాపగ వేడుకొందు, నీ
పిల్పుకు వేచి యుండెడి పిపీలికు బ్రోవుము శోక నాశనా.  🙏🙏
🙏🌷🙏🌷🙏🌷🙏🌷

శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః   🙏🙏🙏🙏
శ్రీ రామ జయ రామ జయ జయ రామ     🙏🙏🙏🙏
శ్రీ రామ జయం  

శిరస్సువంచి ఆమోదిద్దాం!

 మన మనస్సు
మనలను మోసం చేయడం
మొదలెట్టక ముందే,
మన రచనలను ఆపేద్దాం!

వయస్సుతోపాటే వచ్చే చాంచల్యాన్ని
సవినయంగా శిరస్సువంచి ఆమోదిద్దాం!

అన్ని అవయవాలలాగే మెదడుకూడా
అవిశ్రాంత శ్రమతో అలసిపోయి విశ్రాంతి కోరుతుంది!

మనం రాసే పుల్లా-పుడకా కవిత్వాలు
తలకుమాసిన కధలు రాకపోతే
జనాలేమీ బెంగెట్టుకోరు!

కవన కాలుష్యం, కధా శకలాలు తగ్గాయని
గొప్ప ఊరట చెందుతారు!

మన తరం అడ్డు తొలిగితే, మన వెనక
ఆగిపోయిన కలాలు కొత్త ఊపిరితో
జవసత్వాలతో కొత్త సృష్టి  చేస్తాయేమో!
అందుకేమనం పేజీలను, వేదికలను ఖాళీ చేయాలి!

'నేనొక్కడిని ఆగిపోతే 'అని మహాకవి అన్నాడంటే
అది ఆయనకే చెల్లుబాటు!మనబోంట్లందరంకూడ
ఆగమంటే నగుబాటుతప్ప మనకు ఏమీ మిగలదు!

మనం రాసిందాంట్లో, చేసిందాంట్లో
ఒక్క ముక్కపనికొచ్చినా మానవాళి
జాగ్రత్తగా భద్ర పరుచుకుంటుంది!

ఆవిషయం నిస్పాక్షికంగా
అవలోకనం చేసుకుంటే
మనకే తెలుస్తుంది!!
            *

                    -సత్య భాస్కర్ ఆత్కూరు

విలువైన బహుమతులు

 తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు---//-

మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మాత్రమే అని  మనము గ్రహించ గలము...

మనము బాల్యం లో ఉన్నప్పుడు, అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మనతో సన్నిహితముగ ఆడుకున్న వారే.

ప్రతిరోజూ, మనము ఒకరిని ఒకరు వెంబడిస్తూ & సందడిగా ఉల్లాసంగా గడిపాము & కలిసి మంచి బాల్యాన్ని గడిపాము.

పెద్దయ్యాక, మనము మన స్వంత కుటుంబాలను కలిగిన తరువాత , మన స్వంత ప్రత్యేక జీవితాలను గడుపుతాము & సాధారణంగా అరుదుగా కలుసుకుంటాము. మనందరినీ కనెక్ట్ చేసే ఏకైక లింక్ మన తల్లిదండ్రులు.

మనం వృద్ధాప్యం సమీపించే సమయానికి  అప్పటికే మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారు మరియు మన చుట్టూ ఉన్న బంధువుల సంఖ్య  తగ్గిపోతుంది, అప్పుడే మనకు క్రమంగా ఆప్యాయత విలువ తెలుస్తుంది.

నేను ఇటీవల ఇంటర్నెట్‌లో ఒక వీడియోను చూశాను, అందులో 101 ఏళ్ల అన్నయ్య తన దూరపు 96 ఏళ్ల చెల్లెల్ని చూడటానికి వెళ్లాడు. కొంత సమయం గడిపిన తర్వాత ఇద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, చెల్లెలు తన అన్న కారుని వెంబడించి, తన సోదరుడికి కొంత డబ్బు ఇచ్చి, తినడానికి ఏదైనా మంచిది కొనుక్కోమని కోరింది. ఆమె మాటలు చెప్పడం పూర్తికాకముందే ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇంత వృద్ధాప్యంలో కూడా అన్నదమ్ములు మరియు అక్కాచెల్లెళ్లు ఉండటం నిజంగా చాలా అదృష్టమే...

అవును, ఈ లోకంలో మనకు రక్తసంబంధం ఉన్న వ్యక్తిని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది.

మీరు పెద్దవారైనప్పుడు & మీ తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్లిపోయినప్పుడు, మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఈ ప్రపంచంలో మనకు అత్యంత సన్నిహితులవుతారు

స్నేహితులు దూరంగా వెళ్లిపోవచ్చు, పిల్లలు పెరిగి ఎగిరి పోవచ్చు కానీ మీ పక్కన మీ జీవితభాగస్వామి తప్ప, మీ జీవితపు చివరి అంకాన్ని పూర్తి చేయడానికి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మాత్రమే  వుంటారు

మనము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఒకచోట చేరడం చాలా ఆనందంగా వుంటుంది

వారితో కలిసిమేలిసి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భయపడం. మనము వృద్ధాప్యానికి చేరుకున్న తరుణంలో దయచేసి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెల్ల తో కరుణ మరియు దయతో ఉండండి.

గతంలో ఏది జరిగినప్పటికీ ఏది ఏమైనఅయినప్పటికీ, అన్నదమ్ములు అక్కాచెల్లెలళ్లు మరింత సహనంతో మరియు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి.

అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ల మధ్య విడదీయలేని ముడి లేదు. తొలగించలేని కవచం లేదు.
ఎప్పుడూ పాత చేదు సంగతులజోలికి వెళ్లకూడదు లేదా పాత పగ ద్వేషం పెట్టుకోకూడదు. ఎక్కువగా పరస్పర ఆధారపడటం & పరస్పర ప్రేమతో, సంబంధాలు మెరుగవుతాయి

ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు----------

నవగ్రహా పురాణం🪐 . 142వ అధ్యాయం

 నవగ్రహా పురాణం🪐  
.               142వ అధ్యాయం

పురాణ పఠనం ప్రారంభం
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

బుధగ్రహ మహిమ - 1

"ప్రియంగు గులికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ! సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ !!”

నిర్వికల్పానంద రాగయుక్తంగా బుధ స్తోత్రం పఠించి , అరమూసిన కళ్ళు తెరిచి , శిష్యుల వైపు చూశాడు. వాళ్ళ ముఖాలు కుతూహలాన్నీ , ఉత్కంఠనూ ప్రతిబింబిస్తున్న అద్దాల్లా ఉన్నాయి.

"బుధుడు బుద్ధినీ , ప్రజ్ఞనూ , యుక్తినీ ప్రసాదించే గ్రహం. గణితశాస్త్ర జ్ఞానాన్నీ , కావ్యరచనా శక్తినీ అనుగ్రహించే బుధుడు 'లిపి'కి అధిపతి. ఆయన కారకత్వాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రజ్ఞకూ , బుద్ధికీ , జ్ఞానానికీ మన కథనాన్ని పరిమితం చేసి చెప్పుకుందాం. బుధగ్రహ అనుగ్రహంతో అశేష ప్రజ్ఞా పాటవాలనూ , అఖండమైన జ్ఞానాన్నీ పొందిన మహానుభావులలో 'పాణిని' అగ్రగణ్యుడు. భారత జాతికి ఆయన 'పాణినీయం' అనే మహత్తరమైన వ్యాకరణ గ్రంథాన్ని అందించాడు. అది ఎనిమిది అధ్యాయాల గ్రంథం. ఆ కారణంగా ఆ వ్యాకరణ గ్రంథాన్ని 'అష్టాధ్యాయి' అని కూడా అంటారు..."

"గురువు గారూ , పతంజలి మహర్షి భాష్యం రచించింది ఆ వ్యాకరణ గ్రంథానికి కదూ ?" విమలానందుడు అడిగాడు.

*"అవును , నాయనా ! పాణినీయ వ్యాకరణానికి పతంజలి వ్రాసిన భాష్యాన్ని 'మహాభాష్యం' అంటారు. ప్రపంచంలోని ఏ భాషకూ లేని సంపూర్ణమైన , శాస్త్రీయమైన , తర్కబద్ధమైన వ్యాకరణం 'పాణినీయం' ఒక్కటే అంటారు భాషావేత్తలు. పాణినీయం కేవలం వ్యాకరణం మాత్రమే కాదనీ , నిర్దుష్టమైన , సమగ్రమైన భాషా శాస్త్రమనీ అంటారు. అనన్య సామాన్యమైన ఆ మహాగ్రంథాన్ని రచించిన మహామేథావి పాణిని బాల్యంలో 'మహామొద్దు'. ఎంత 'మొద్దు' అంటే , ఎంతో మంది ఆచార్యులు అతడిని స్వీకరించడానికి నిరాకరించారు ! పాటలీపుత్ర నగరానికి సమీపంలోని 'శాలాతుర' అనే గ్రామంలో పాణిని జన్మించాడు. విద్యాభ్యాసానికి యోగ్యమైన వయసు వచ్చి , చాలా మంది గురువుల నిరాదరణకు గురి అయిన అనంతరం , యవ్వనదశలోకి అడుగు పెడుతున్న పాణిని , తనను ఆదరించే గురువును అన్వేషిస్తూ పాటలీపుత్రం చేరుకున్నాడు. ఆ నగరంలో 'వర్షాచార్యుడు' అనే పండితుడు గురుకుల విద్యాలయం నిర్వహిస్తున్నాడనీ , అజ్ఞానిని విజ్ఞానిగా రూపొందించగలిగిన శక్తి కలిగిన విద్యా వేత్త అనీ తెలుసుకున్నాడు. వర్షాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. విద్యార్జన పట్ల తనకున్న తీవ్రమైన ఆసక్తినీ , గురువు లభించని దురదృష్టాన్నీ వర్షాచార్యుడికి విన్నవించి , తనను శిష్యుడిగా స్వీకరించి విద్యాదానం చేయమని అర్థించాడు. పాణిని దయనీయ స్థితిని గ్రహించిన వర్షాచార్యుడు జాలిపడ్డాడు. అతనిలో వ్యక్తమవుతున్న తీవ్రమైన ఇచ్ఛ అతన్ని విద్యావంతుడిగా చేస్తుందన్న నమ్మకంతో వర్షాచార్యుడు పాణినిని శిష్యుడిగా స్వీకరించి , విద్యాబోధన ప్రారంభించాడు.

“అయితే - తన నమ్మకం వమ్ముకానుందని వర్షాచార్యుడు అచిరకాలంలోనే గ్రహించాడు. పాణినిలో ధారణశక్తీ , జ్ఞాపకశక్తీ - రెండూ లేవని అర్ధం చేసుకున్నాడాయన. గురుకులంలోని బాల విద్యార్థుల స్థాయిని కూడా పాణిని అందుకోలేకపోయాడు. కాలం గడిచిపోతోంది. ఋతువులు మారుతున్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పాణిని స్థాయి యథాపూర్వంగానే ఉన్నా కూడా వర్షాచార్యుడు అతన్ని ఆశ్రమంలో ఉండనిచ్చాడు.   అందుకు కారణాలు రెండు: పాణినిలో ఉన్న అనన్యసామాన్యమైన గురుభక్తి. విద్యాభ్యాసం కోసం నిర్విరామంగా అతను పడుతున్న ప్రయాస. వృధా ప్రయాసతో పాణిని జీవితంలో అమూల్యమైన కాలం కూడా వృధా అయిపోతోందని నిశ్చయించుకున్న వర్షాచార్యుడు ఒకనాడు పాణినిని తన ఏకాంత సమ్ముఖానికి పిలిపించుకున్నాడు...” నిర్వికల్పానంద కథనాన్ని కొనసాగించాడు.

పాణిని గురువుగారి పాదాలకు నమస్కరించి , చేతులు కట్టుకుని వినయంగా నిలుచున్నాడు. వర్షాచార్యుడు పాణిని ముఖంలోకి తదేకంగా చూశాడు.

"పాణినీ , విద్య చాలా విలువైంది. కాలం విద్యకన్నా విలువైంది. మానవ జీవితానికి ఉన్న కాలపరిమితి స్వల్పమే ! ఎంత శ్రమించినా నీకు విద్యాగంధం అంటదని నేను నిర్ధారణగా తెలుసుకొన్నాను. నువ్వు కూడా ఈ పాటికి గ్రహించే ఉండాలి ! నువ్వు విద్యాలాభాన్ని పొందలేకపోతున్నావు. అమూల్యమైన కాలాన్ని నష్టపోతున్నావు !"

"చిత్తం ! కాల నష్టం జరిగినా నేను విచారించను గురువు గారూ ! నాకు విద్య కావాలి !" పాణిని వినయంగా అన్నాడు.

"నాకు తెలుసు పాణినీ ! వృధా కాలయాపనతో జీవితకాలం వ్యర్థం కాకూడదు ! విద్య ఉన్నా లేకున్నా మనిషి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి ! లోకంలోకి వెళ్ళు ! ఏదైనా వృత్తిని స్వీకరించి , జీవించు !" వర్షాచార్యుడు సానుభూతితో అన్నాడు.

"గురువుగారూ..." పాణిని కంఠస్వరంలో విచారం ధ్వనించింది.

"నీ కన్నా వయసులో చిన్నవాళ్లైన విద్యార్థుల అవహేళనకు నువ్వు అనుక్షణమూ గురి అవుతున్నావు. నిన్ను విద్యావంతుడిని చేయలేకపోతున్నానన్న అపఖ్యాతికి నేనూ గురి అవుతున్నాను. చేయగలిగిన పనిని చేస్తూ , జీవించు ! నా గురుకుల వాసం నుండి రేపే నిన్ను విడుదల చేస్తున్నాను !" వర్షాచార్యుడు తన నిర్ణయాన్ని వెల్లడించి , అవతలకి నడిచాడు.

తన కళ్ళను కప్పేస్తున్న కన్నీటి తెరల గుండా పాణిని , కక్ష్యలోంచీ వెళ్ళిపోతున్న గురువుగారిని చూస్తూ ఉండిపోయాడు.

**********

"స్వామీ ! పాణినిని వెళ్ళిపొమ్మంటూంటే నేను విన్నాను. కడుపున పుట్టిన పుత్రుడికన్నా మిన్నగా పాణిని మనిద్దర్నీ గౌరవిస్తున్నాడు. ఆరాధిస్తున్నాడు ! మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు కదా ?" వర్షాచార్యుల సతీమణి ఆ నాటి రాత్రి భర్తతో అంది.

"నిరక్షరకుక్షిగా జీవించేలా ఆ బ్రహ్మ పాణిని నుదుటి మీద రాసినట్టున్నాడు. వాడికి విద్యను గ్రహించే శక్తి లేదు. గ్రహించిన విద్యను మేధస్సులో నిక్షిప్తం చేసుకునే శక్తీ లేదు. అను నిత్యమూ పాణినిని అవహేళన చేసే సహపాఠుల మీదా , ఎంత బోధించినా అందిపుచ్చుకోలేని పాణిని మీదా నాకు ఆగ్రహం కలుగుతూనే ఉంది. అది వాంఛనీయం కాదు ! రేపు భోజనం పెట్టి , కొంత దారి బత్తెం ఇచ్చి పాణిని పంపించివేయి !" వర్షాచార్యుడు నిష్కర్షగా అన్నాడు.

సూర్యోదయం అయింది. వర్షాచార్యులు విద్యార్థులకు పాఠం చెప్తున్నారు. పాణిని నెమ్మదిగా ఆయన్ను సమీపించాడు. విచార భారంతో ఆయనకు కడసారి పాదాభివందనం చేశాడు.

"విచారించకు నాయనా ! శరీర పోషణ ప్రాథమిక కర్తవ్యం. ఏది సాధించాలన్నా మనిషికి ఉన్న సాధనం శరీరమే. విద్య మీద మమకారాన్ని విసర్జించి , ఏదైనా స్వయం ఉపాధి చూసుకో ! సుఖీభవ !" వర్షాచార్యులు దీవించారు.

నీళ్ళు నిండుతున్న కళ్ళతో సహవిద్యార్థులకు మౌనంగా వీడ్కోలు పలికి , పాణిని గురుపత్ని ఉండే ఆశ్రమ అంతర్భాగం వైపు అడుగులు వేశాడు.

**********

అశ్రుధారలతో తన పాదాలను తడుపుతున్న పాణినిని గురుపత్ని రెండు చేతులతో లేవనెత్తి , వాత్సల్యంతో అతని కళ్ళల్లోకి చూసింది. చెమ్మగిల్లుతున్న తన నేత్రాలను నిర్లక్ష్యం చేస్తూ , పాణిని కన్నీటిని ప్రేమగా తుడిచింది.

“నాయనా ! గురువుగారి నిర్ణయాన్ని అపార్థం చేసుకోవద్దు. చదువు నేర్చుకోవడంలో అశక్తత నీది. నేర్పించడంలో అశక్తత నా పతి దేవులది !" అందామె ఓదార్పుగా.

"వర్షాచార్య మహోపాధ్యాయులు అనుగ్రహించలేకపోతే , ఇంకెవరు నాకు విద్య అనుగ్రహించగలరు మాతా ?" పాణిని దుఃఖాన్ని దిగమింగుతూ అన్నాడు.

“వర్షాచార్య మహోపాధ్యాయులను మించిన మహా మహోపాధ్యాయుడు ఉన్నాడు , పాణినీ !" గురుపత్ని చిరునవ్వుతో అంది.

"మాతా !”

"నాలుగు వేదాలూ ; శిక్ష , వ్యాకరణమూ , ఛందస్సూ , నిరుక్తమూ , జ్యోతిషమూ , కల్పమూ అనబడే ఆరు అంగాలూ ; మీమాంస , న్యాయ , శబ్దశాస్త్రాలూ , పురాణమూ , ధర్మశాస్త్రమూ , ఆయుర్వేదమూ , ధనుర్వేదమూ , అర్థశాస్త్రమూ - అనే అష్టాదశ విద్యలనూ నిర్మించిన విశ్వగురువు ఉన్నాడు. పాణినీ ! ఆ విశ్వగురువు ఎవరో కాదు పరమశివుడు ! హిమాలయ ప్రాంతానికి వెళ్ళు ! తపస్సు చేసి , ఆ జగద్గురువును ప్రసన్నం చేసుకో ! విద్యను వరంగా అర్ధించు !"
 
👆 సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.

భాగవతము

 పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
ద్వితీయ స్కంధము

రామ! గుణాభిరామ! దినరాజ కులోంబుధి సోమ! తోయద
శ్యామ! దశాననప్రబలసైన్య విరామ! సురారి గోత్ర సు
త్రామ! సుబాహు బాహుబల దర్ప తమః పటు తీవ్ర ధామ! ని
ష్కామ! కుభృల్ల లామ! గరకంఠ సతీ నుత నామ! రాఘవా!

శ్రీరామా! నీగుణాలన్నీ చాలా మనోహరములయినవయ్యా! సూర్యదేవుని కులం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడవు నీవు. నీలమేఘం వంటి మేనిఛాయతో అలరారుతూ ఉంటావు. పదితలల రక్కసుని పిక్కటిల్లిన బలం కల సేనలను రూపుమాపినవాడవు. దేవతల పగవారు అనే కొండలకు ఇంద్రుడవు. సుబాహువు ఆనే రాక్షసుని బాహువుల బలం వలన కలిగిన పొగరు ఒక చీకటి అయితే దానికి నీవు సూర్యుడవు. నీకు ఏ కోరికలూ లేవు. భూమిని పాలించేవారిలో మేలుబంతి అయినవాడవు. పరమేశ్వరుని యిల్లాలు పార్వతీదేవి నీ నామాన్ని నిరంతరమూ జపిస్తూ ఉంటుంది. రఘువంశం నీ వలన మహిమను పొందిందయ్యా.

సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.

🚩శ్రీ వివేకానందస్వామి🚩 . 🚩జీవిత గాథ🚩 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . భాగం 153

 చారిత్రాత్మక కథాస్రవంతి🌹
.   ఓం నమో భగవతే రామకృష్ణాయ

.       🚩శ్రీ వివేకానందస్వామి🚩
.                🚩జీవిత గాథ🚩   
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
.                    భాగం 153

చికాగో బయలుదేరడానికి ముందు ఒక వారం స్వామీజీ సత్వరంగా పనిచేయవలసి వచ్చింది. ఆగస్టు 27వ తేదీ ఆదివారం నాడు ఆయన అన్నిస్క్వామ్‌లోని ఒక చర్చ్‌లో ఉపన్యసించారు. "భారత దేశానికి తక్షణ ఆవశ్యకత సాంకేతిక విద్యే కాని, మతం కాదు" అనే అంశాన్ని ఆ ప్రసంగంలో నొక్కివక్కాణించారు. ఆ ప్రసంగం ఉద్వేగమూ, ఉప్పొంగే కార్యతత్పరతలతో నిండిపోయింది.

అది విన్న శ్రోతలు కూడా ఆ ఉద్వేగానికి స్పందించి, అటువంటి విద్యను తక్షణమే అమలుపరచే కళాశాలను భారతదేశంలో స్థాపించడానికి నిధులు వసూలు చేయనారంభించారట! స్వామీజీ గురించీ, అన్నిస్క్వామ్‌లో ఆయన గడపిన రోజుల గురించి శ్రీమతి రైట్ దీర్ఘమయిన వివరణ ఇచ్చారు.....

""ఆయన సామాన్యంగా మోకాలు దిగువ దాకా వచ్చే పొడవైన కాషాయపు అంగీ ధరించేవారు. ఫాదరీలు ధరించే మాదిరిగా అది ఉంది. పొడవైన, మందమయిన ఒక కాషాయ వస్త్రాన్ని నడుముకు బిగించుకొనేవారు. కాళ్లను కాస్త ఈడుస్తూ నడుస్తూన్నట్లుగా కనిపించినా ఆయన నడకలో ఒక ప్రత్యేక ఠీవి ఉంది. పైకెత్తిన తల, తిన్నని మెడ, సునిశిత దృక్కులూ ఆయనకు ఒక అధికారిక వైఖరిని కల్పించాయి.

అంతేకాదు ఆయనను దాటుకొంటూ వెళ్లే ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆగి ఆయనను చూడకుండా ఉండలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఆయన మెల్లగా నడుస్తారు. ఆయనలో తొందరో, వేగమో కనిపించదు. ఆయన విశాల నేత్రాలు కొన్ని సమయాలలో నిప్పులు వర్షిస్తాయి.

'ప్రశాంతంగా కూర్చునివున్న ఆయన కొన్ని సమయాలలో తల పైకెత్తి దృష్టిని పైకప్పుకేసి త్రిప్పి 'శివ శివ' అనడం కద్దు. ఆయన ఉద్వేగం అగ్నిపర్వతపు లావాలా వ్యాపించి అక్కడున్న అందరినీ మాడ్చివేసేదిగా ఉండేది.

చిత్రకారులు తదేకంగా చూస్తూ ఆయన చిత్రాన్ని గీయనారంభించారు.

"ఈ లోకంలో సత్యం అంటూ ఏదైనా ఉందీ అంటే అది ఆధ్యాత్మిక జీవితం మాత్రమే అంటూ ఆయన శిక్షణ పొందినట్లుగా అనిపించింది. భగవంతుని పట్ల ప్రేమ, మనిషి పట్ల ప్రేమ ఇవే సత్యమని ఆయన నమ్మకం."

ఈ విధంగా సాగుతుంది శ్రీమతి రైట్ దీర్ఘవివరణ. డబ్బు విషయంలో స్వామీజీ అనాసక్తతను గురించి ఆమె ప్రత్యేకంగా ఇలా వ్యాఖ్యానించింది:

“ఎవరైనా స్వామీజీకి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు, వారు తమ కేదో కీడు తలపెట్టినట్లు వైదొలగేవారు. 'ఆహా! సరిపడినంత కష్టాలను నేను అనుభవించాను. వాటిలో నన్ను ఎక్కువగా పరీక్షించింది ఏదో తెలుసా? డబ్బును -పదిలపరచడమే' అంటూ పిల్లవాడిలా ఆయన చెప్పేవారు.

 డబ్బు లేకుండా ఏమీ చేయలేం అనే స్థితిలో కూడా ఆయన డబ్బును తిరస్కరించడం మేం నమ్మలేక పోయాం. డబ్బు పట్ల ఒక వ్యక్తి ఇంత అనాసక్తతతో ఉండగలరా అనే ఆలోచన ఆయన వెళ్లిపోయిన చాలా రోజుల దాకా మా మనస్సులలో పాదుకుపోయింది. "🙏

సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్

వేమన పద్యాలు -- 9

 వేమన పద్యములు🌹
.             అర్థము - తాత్పర్యము
.                      Part - 4
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

💥వేమన పద్యాలు-- 7
      
అంగ మేడ బుట్టె లింగమెక్కడ బుట్టె
ఎంగి లేడ బుట్టి యేకమాయె
ఎంగి లెంగి లనుచు నెగ్గులు పడనేల
విశ్వదాభిరామ రామ వినుర వేమా !

🌹తాత్పర్యము --
ఎంగిలి ఎంగిలి అంటుంటారు.
ఎక్కడ ఎంగిలి ?
సృష్టిలో ప్రతీదీ ఎంగిలితో కూడినదే.
పంచభూతాలు ఎంగిలితో ఉండవా ?
ఈ ఎంగిలి ఎక్కడ పుట్టినది ?
అంతా ఎంగిలి మంగలమే.
తత్వాన్ని అర్థం చేసుకోవాలి.

💥వేమన పద్యాలు -- 8

అంగమ్మాలినవాడు దాత యగునా యైదారు గొడ్డేరులున్
గంగా నర్మద సింధు గౌతమగునా గంగెద్దు కాభరణముల్
శృంగారించిన శంభుతేజి యగునా క్షీరాబ్దిలో నెప్పుడున్
కొంగన్ముంచిన రాజహంస యగునా గోరాజ వేమాహ్వయా

🌹తాత్పర్యము --
దాత శరీరధారియే కదా !
నదులలోని నీరు గంగానదీ తుల్యము కాదు గదా !
దేని గొప్పతనము దానిదే !
గంగిరెద్దుకి ఆభరణములు తగిలించి ఎంత అలంకరించినా శివుని వాహనము వృషభము కాలేదు కదా !
పాలసముద్రములో కొంగను తీసుకెళ్ళి ఎంతసేపు ముంచినా అది రాజహంస కాలేదు గదా!

💥వేమన పద్యాలు -- 9
      
అంగ యోగములును ఆరుమతంబులు
మూడు యోగములను మొనయరాదు
కడమ యోగమునను కల్గును మోక్షంబు
విశ్వదాభిరామ రామ వినుర వేమా !

🌹తాత్పర్యము --
అష్టాంగయోగాలు , ఎన్ని మతములు , జ్ఞాన సిద్ధి వైరాగ్యము ఎన్ని ఉన్నను తపశ్శక్తితో మోక్షప్రాప్తికి మానవుడు పరితపించవలెను.

పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి
సర్వేజనా సుఖినోభవంతు

సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.

భాగవతము

పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
ద్వితీయ స్కంధము

రామ! గుణాభిరామ! దినరాజ కులోంబుధి సోమ! తోయద
శ్యామ! దశాననప్రబలసైన్య విరామ! సురారి గోత్ర సు
త్రామ! సుబాహు బాహుబల దర్ప తమః పటు తీవ్ర ధామ! ని
ష్కామ! కుభృల్ల లామ! గరకంఠ సతీ నుత నామ! రాఘవా!

శ్రీరామా! నీగుణాలన్నీ చాలా మనోహరములయినవయ్యా! సూర్యదేవుని కులం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడవు నీవు. నీలమేఘం వంటి మేనిఛాయతో అలరారుతూ ఉంటావు. పదితలల రక్కసుని పిక్కటిల్లిన బలం కల సేనలను రూపుమాపినవాడవు. దేవతల పగవారు అనే కొండలకు ఇంద్రుడవు. సుబాహువు ఆనే రాక్షసుని బాహువుల బలం వలన కలిగిన పొగరు ఒక చీకటి అయితే దానికి నీవు సూర్యుడవు. నీకు ఏ కోరికలూ లేవు. భూమిని పాలించేవారిలో మేలుబంతి అయినవాడవు. పరమేశ్వరుని యిల్లాలు పార్వతీదేవి నీ నామాన్ని నిరంతరమూ జపిస్తూ ఉంటుంది. రఘువంశం నీ వలన మహిమను పొందిందయ్యా.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*20-01-2024 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. సోదరుల సహాయంతో నూతన  కార్యక్రమాలకు  శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుం. కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంభందించి కీలక సమాచారం సేకరిస్తారు.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్థులతో అకారణ వివాదాలు  ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది.

---------------------------------------

మిధునం


నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు  గతం కంటే మంచి లాభాలు అందుతాయి.

---------------------------------------

కర్కాటకం


కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు  నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

---------------------------------------

సింహం


వృత్తి, వ్యాపారాలలో  ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు  చర్చిస్తారు.

---------------------------------------

కన్య


ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.  గృహంలో  శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా  అభివృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో  స్ధిరాస్తి  ఒప్పందాలు చేసుకుంటారు.

---------------------------------------

తుల


వ్యాపారస్థులకు ప్రభుత్వ సంభంధిత ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన  పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ బాధ్యతలు  పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. బంధు మిత్రులతో  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

వృశ్చికం


నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.  ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. 

---------------------------------------

ధనస్సు


ఉద్యోగుల  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో  విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.

---------------------------------------

మకరం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

---------------------------------------

కుంభం


ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

---------------------------------------

మీనం


వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. బందు వర్గంతో మాటపట్టింపులుంటాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀