21, అక్టోబర్ 2024, సోమవారం

Panchaag


 

రాయల రాజనీతి చతురత!



రాయల రాజనీతి చతురత!


*ఆయతికానికీకు మమ*

       *రాలయముఖ్యము లాతఁ డర్థతృ*

*ష్ణాయుతుఁడై నిజోర్వి నగు* 

        *నష్టికిఁ దద్ధనముం దొరల్చి రా*

*జాయతనంబుఁ జేర్చు మఱి*

         *యట్టి దపథ్యము దాన నొంటిఁ గాఁ*

*డే యధికారి గావలయు*

         *నించుక తిన్నను వాఁడె రూపఱున్* 

        _(ఆముక్తమాల్యద:4-218)_


ఈ పద్యము శ్రీకృష్ణదేవరాయలవారు

రచించిన ఆముక్తమాల్యద కావ్యములో

యామునాచార్యుని రాజనీతి బోధ

సందర్భములోనిది..


_"ఆయతికాడు"_ - ఆదాయ-ఆర్థిక శాఖాధికారికి/ప్రభుత్వానికి_ _(Revenue department) ఎప్పుడూ_

_దేవాలయాదాయవ్యయవ్యవస్థపై అధికారమీయరాదు.. తన అసమర్థతచేత, పన్నులు వసూలుచేయలేకపోవుటయో, వ్యయము నియమించలేక నష్టములు వాటిల్లితేనో, లేక ధనార్జనతృష్ణచేతనో..ఆ ఆయతికాడు తన తప్పు కాచుకోవడానికి దేవాలయాదాయములను రాజకోశాగారమునకు తరలిస్తాడు..అలా దేవాలయాదాయములు రాజకోశాగారములను చేరుట ఎప్పటికీ మంచిది కాదు.. వాటిపై అధికారము ప్రత్యేకముగ ఏ ఇతరశాఖకూ సంబంధములేనివానికే ఈయాలి.. అటువంటివాడు ఆ దేవాలయాదాయములలో ఏ కొంచెమో తన స్వప్రయోజనానికి వాడుకున్నా ఆ పాపము చేత వాడే నశిస్తాడు.. కాని దేవాలయవ్యవస్థ బలహీనము కాదు.._

*దేవద్రవ్యోపజీవీ చ*

*స భవే దపబాహుకః*

*దేవద్రవ్యం స్వయం యేన*

*భుక్తం స తు సదా భవేత్*

*రసజ్ఞా విధురః కుబ్జః*

*కణ్డూ సర్వాఙ్గదుఃఖితః*� 


అని శివధర్మోత్తరపురాణ వచనము


శ్రీకృష్ణదేవరాయలవారు..

నన్నయమహర్షి చెప్పినట్లు

_"ఆదిరాజనిభుడు"_


ఆ చక్రవర్తి నేర్వని విద్యలేదు..

అభ్యసించని శాస్త్రము లేదు..

ప్రకటించని పరాక్రమములేదు..


వింధ్యపర్వతశ్రేణినుంచి 

హిందూమహాసముద్రపర్యంతము

సువిశాలసామ్రాజ్యములో

ఎన్నెన్ని దేవాలయములనో

పునరుద్ధరించి .. పోషించి

ప్రజాసంక్షేమకరముగ పరిపాలించిన

మహాప్రభువు..

ప్రపంచచరిత్రలో ఇటువంటి

చక్కవర్తి మరొకడు లేడు..


ఆ మహానుభావుడన్ని 

దేవాలయములనెలా 

పరిరక్షించినాడో..

ఆయనయే ఆముక్తమాల్యద

యామునాచార్యుని రాజనీతిబోధ

సందర్భమున పై పద్యములో

ఆదేశించినాడు..


ఈ పద్యములో..

దేవాదాయపరిరక్షణలో

రాయలవారి దూరదృష్టి..

సూక్ష్మరాజనీతి వివేచన..

విశాలదృక్పథము..

ప్రభుత్వకర్తవ్యము

అన్నీ ప్రతిఫలిస్తాయి..


ఈ నాడా సూత్రమును

పాటింపక దేశమున 

దేవాదాయవ్యవస్థ 

స్వార్థపరులైన రాజకీయనాయకులచేతిలో

ఛిన్నాభిన్నమైనది..


మంచిరోజులకొఱకాశించుటకన్న

మనము చేయగలిగినది లేదు...


సాంప్రతి సురేంద్రనాధ్.

52. " మహాదర్శనము

 52. " మహాదర్శనము " -- యాభై రెండవ భాగము--ఉపనిషత్తు యొక్క అర్థము


52. యాభై రెండవ భాగము-- ఉపనిషత్తు యొక్క అర్థము 



         యాజ్ఞవల్క్యునికి బ్రాహ్మణమును రాయుటకు ఆదిత్యుని అనుమతి అయినది . వెనుకటి వలెనే , అది అతని నిత్య కర్మలలో ఒకటయినది . ఎప్పటి వలెనే కాత్యాయని కూడా పతి సేవనూ , వేదపురుషుని సేవనూ చేస్తూ ఉన్నది . ఆ బ్రాహ్మణము నూరు అధ్యాయముల పరిమితి యున్నది అని అది శతపథ బ్రాహ్మణమైనది . 


         బ్రాహ్మణమును రాయుచున్నపుడు ఒక దినము గార్గి వచ్చినారు . ఆమె బుడిలుల శిష్యుడైన వాచక్నువు కూతురు . తండ్రికి ఒకతే సంతానమగుట చేత ఆమెను చాలా ప్రేమాభిమానములతో పెంచినారు . వాచక్నువు , కూతురు వివాహము చేసుకొని వెళ్ళిపోతే తన ఇంటిలో దీపము పెట్టువారు లేకపోయెదరని కూతురును కొడుకు వలెనే పెంచినారు . సకాలములో ఉపనయనము చేసి , ముఖ్యముగా బ్రహ్మవిద్యను కూడా బోధించినారు . గార్గి కూడా ఎందుకో అందరి వలెనే వివాహము చేసుకొని సంసారములో ఉండుట వద్దనుకున్నది . తండ్రి అనుమతితో బ్రహ్మవాదిని అయినది . ఆమె లక్షణవతి. అయిననూ జనులు ఆమె కఠోర తపస్సునే మెచ్చుకొన్నారు . సాంప్రదాయము , శాస్త్రముల పేరుతో ఆమెకు ఇబ్బందులు కలిగించలేదు . విద్వద్వర్గములో ఆమెకు గణ్యమైన స్థానముండినది . విదేహపు ఆశ్రమములలో నైతే నేమి , చుట్టుముట్ల ఆశ్రమములలో నైతేనేమి , ఆమెకు తగిన గౌరవము లభించెడిది . ఆమెయొక్క శాస్త్ర నిష్ట , ప్రవచనములు , విచక్షణ , అగాధమగు అనుభవమును చూచి ఆమెను అందరూ పూజిస్తారు . 


       గార్గి అంటే జరత్కారు వంశపు అరుణి కి ఎంతో మెచ్చికోలు. " నువ్వు సరస్వతీ దేవి యొక్క అపరావతారమమ్మా ! " అని పొగడేవాడు . ఆమె నమస్కారము చేయుటకు వస్తే లేచి నిలబడి ఆదరముగా ఆహ్వానించేవాడు. విదగ్ధ శాకల్యుడైతే , " ఏమి చేయుట ? ఈమె మగ ప్రాణి . దానిని ఆడ దేహములో పెట్టి అన్యాయము చేసినాడు ఈశ్వరుడు ! ఎన్ని చెప్పినా , ఆడదానికి కర్మాధికారమెక్కడిది ? కర్మము లేనిదే బ్రహ్మ విచారమెలాగ పూర్ణమగును ? " అన్ననూ ఆమె అంటే అపార గౌరవము చూపించేవాడు . 


        విదేహపు రాజాస్థానములో ఆమెకు ప్రథమ వర్గపు విద్వత్పదవి . ఆమెకు ’ అభినవ సరస్వతి ’ యను బిరుదు నివ్వవలెనని వెనుకటి మహారాజు ప్రతిపాదన చేసినారు . ఆమె అది విని నవ్వేసింది . " మేము అద్వైతులము . జ్ఞాన దృష్టితో ఆత్మ ఆత్మకూ భేదము లేదు అనెడివారము . మేము బిరుదును ఒప్పుకున్న దినమే మా అద్వైతమునకు తర్పణము వదలినట్లవుతుంది " అని గౌరవముగా తిరస్కరించినది . అప్పటినుండీ ఆమె పైన గౌరవము ఇంకా ఎక్కువయినది . 


        గార్గి యాజ్ఞవల్క్యుని చూచుటకు వచ్చినది . అప్పుడు దేవరాతుడు ఇంట్లో లేడు . ఆలంబిని ఆమెను ఆహ్వానించి కొడుకు వద్దకు పిలుచుకొని వెళ్ళింది . యాజ్ఞవల్క్యునికి కూడా గార్గి వచ్చిందని సంతోషమయినది . తన విలేఖన కర్మను ఒక ఘడియ పక్కన పెట్టి ఆమె వైపుకు తిరిగినాడు . " దయచేసి అర్ఘ్య పాద్యాదులను స్వీకరించవలెను " అని ప్రార్థించినాడు . 


గార్గి నవ్వుతూ అంది , " మేము స్త్రీలము. మాకు మధుపర్కాధికారము లేదు "


        " నిజమే . మధుపర్కాధికారము స్త్రీలకు లేదు . కానీ తమరు బ్రహ్మవాదినులు. తమ దేహములో అగ్ని ఉండనే ఉన్నాడు . కాబట్టి అగ్ని తృప్తికని మేము అర్పించు అర్ఘ్యపాద్యాదులను తమరు స్వీకరించకుండుట ఎక్కడి న్యాయము ? "


        " తమరు నన్ను ధర్మ శృంఖలతో కట్టేసినారే . అగ్ని తృప్తికని తమరు అర్పించినది నిరాకరించుటకు మాకు అధికారము లేదు , నిజమే . కాబట్టి నేను స్వీకరించవలసినదే , కానివ్వండి . " 


        గార్గికి కాత్యాయని అర్ఘ్యపాద్య ఆచమనీయ అల్పాహారములను అందించినది . ఆమె అవన్నీ స్వీకరించి సమాహితురాలై కూర్చున్నది . " యాజ్ఞవల్క్యా , తమరు కొత్త వేదమును పొందిన సంగతి నాకు తెలుసు. ఈ మధ్య దానితో పాటు ఉపనిషత్తు కూడా ఉందని తెలిసింది . దానికోసమే వచ్చినాను . లౌకికముగా ఇంకొక కారణము ముడిపడు నట్లుండెను . కానీ దానిని నేను పట్టించు కోలేదు . " 


" లౌకిక కారణమేమిటని అడుగవచ్చునా ? "


        " దానికేమి ? రాజ భవనము వారు మిమ్ములను అక్కడికి పిలుచుకు వెళ్ళుటకు నన్ను దర్విగా ఉపయోగించు కోవాలనుకున్నారు . నేనన్నాను : " మహారాజులు లోకానికి మాత్రమే పెద్దవారు . లోకానికన్నా గొప్పది ఒకటుందని దానివైపుకు తిరిగినవారిని మహారాజువారే స్వయముగా వెళ్ళి చూచుట వలన , జనులకు బ్రహ్మవిద్యపై ఆదరము పెరుగును. వారు తమ దగ్గరికి వస్తే తిరుపెము కోసము వచ్చినట్లవుతుంది . కాబట్టి బ్రహ్మజ్ఞానులను తిరుపెపు వారి అంతస్తుకు తెచ్చుట నా వల్ల కాదు " అని నిక్కచ్చిగా చెప్పినాను . మహారాజు మామాటను ఒప్పుకున్నట్లే కనబడుతుంది . వారు వచ్చినా రావచ్చు. " 


       మాటలు అటు ఇటూ తిరిగి ఉపనిషత్తు వైపుకు వచ్చినాయి . " ఈశావాస్యమిదం సర్వ యత్కించ జగత్యాం జగత్ " అనునది మొదటి మంత్రపు మొదటి అర్థము . గార్గి దానిని బహు మెచ్చుకున్నది . ఆ మంత్ర భాగమును కొన్ని సార్లు తానే చెప్పుకున్నది . " అయితే యాజ్ఞవల్క్యా , తమరి ఈ ఉపనిషత్తుకు ఈశావాస్యమిదం సర్వ అనునదే నిష్ఠయా ? " ( ఆధారమా ?)


" కాదు , మొదటి రెండు మంత్రములూ చేరితే నిష్ఠ. "


" అలాగయితే తమరే ఒక అర్థము చెప్పండి " 


       " ఈ జగత్తులోనున్న సర్వులలోనూ ఈశ్వరుడున్నాడు . వాడు తప్ప ఎవరూ ఏమీ చేయలేరు . కాబట్టి ఏమి కావలసిననూ వాడినే అడగండి . అతడు కాని వేరొకడి నుండి దానిని పొందవలెను అనుకోవద్దు . " 


" ఇక్కడ అంత అర్థమున్నదా ? "


" ఇది మంత్రము . ఇది ఉన్నది అలౌకిక భాషలో . కాబట్టి ఇలాగే అర్థము చెప్పవలెను . " 


" సరే , రెండవ మంత్రము ? " 


        " అదికూడా అంతే , అలౌకిక భాష నుండీ లౌకిక భాషకు పరివర్తనము చేయునపుడు అర్థమును మాత్రమే గమనములో ఉంచుకోవలెను కదా ? కాబట్టి ఇలాగ అర్థము చెప్పెదను : ఈశ్వరుడు అన్నిటా ఉన్నాడనుకొని , శాస్త్ర విహితములైన కర్మములనే , అవి యజ్ఞమగునట్లు చేయుచూ ఆయుష్షు పూర్తియగు వరకూ జీవించవలెను . మధ్యలో , చచ్చిపోయిన చాలు కదా , నాకింకనూ చావు ఎప్పటికి వచ్చునో అని ఏడుస్తూ కూర్చోరాదు . ఎందుకంటే , ఈశ్వరుడు అన్నిటిలోనూ ఉన్నపుడు శోకమెందుకు ? మోహమెందుకు ? ఇలాగ కాక వేరే దారే లేదు . ఇలాగ కాక అంటే , చేసే కర్మలన్నీ యజ్ఞమగునట్లు చేస్తూ ఉంటే కర్మ లోపమగు సంభవమే లేదు . అదీకాక, కర్మము యజ్ఞమైన తరువాత , అది జగద్భాండారమునకు ఇచ్చిన కానుక అవుతుంది . మరి అది లోపమెలా అవుతుంది ? " 


" అవును. కర్మ చేస్తూ ఉంటేనే జీవితము అనునదే మీ అర్థమైతే , కర్మాధికారము లేనివారి మాటేమిటి ? "


        " దేవి గార్గి అంత కాతరము చెంద పనిలేదు . ఈ జగత్తులోనున్న సర్వములోనూ ఈశ్వరుడున్నాడన్న తరువాత , స్త్రీలలో లేడా ? కాబట్టి కర్మాధికారము లేనివారికి కూడా శృతి ఒక మార్గమును కల్పించినది . "


" అదేమిటో చెప్పండి , వింటాను . " 


        " కర్మాధికారము లేనివారు యజ్ఞములను గురించి చెప్పు మంత్రములను పారాయణ చేసిన చాలు . కర్మాధికారము లేనివారు ఇలాగ మంత్ర కర్మను చేసియే తీరవలెను . తప్పించుకొనుటకు లేదు . " 


       " అలాగయిన , స్త్రీలు అనిపించుకున్న మేము ఇప్పుడు అశ్వ మేధమును గురించిన పాఠము చదివినాము అనుకోండి , మాకు అశ్వమేధపు ఫలము వస్తుందా ? " 


       " తప్పక వస్తుంది . అదీకాక, అశ్వమేధము వంటి శ్రేష్ఠతమమైన కర్మము ఇంకోటి లేదు . మీకు నా మాటలో నమ్మకము లేనిచో , మీరు ఒకసారి అధ్యయనము చేసి చూడండి . " 


        " ఇది సరియైన సమాధానము . చేసి చూడండి అన్న తరువాత ఇక మాట్లాడుటకేమున్నది ? చేస్తాను . ఏ దినము ఆరంభించవలెను ? అని అడుగుట ఒకటే మిగిలింది . " 


" ఇది సరిగ్గా అన్నారు . నేను చెప్పిన విధముగా చేయండి . నేను చెప్పిన ఫలము వస్తే ఒప్పుకోండి, సరేనా కాదా ? "


" సరే " 


        " ఇప్పుడొచ్చినది ఒక మహా యజ్ఞపు సంగతి కదా ? దాని ఫలమేమిటని అడిగెదరా ? అశ్వమేధాది యాగములను చేసినవారికి శరీరమూ అంతఃకరణమూ శుద్ధమగును . శుద్ధ శరీరాంతఃకరణములున్న వారికి కర్మ కాండలో చెప్పియున్న దేవతలందరూ దేహములో ఉన్నది తెలియును . " 


" అలాగయిన చెప్పండి , ఎప్పుడు ఆరంభించేది ? " 


" నేను మీకు గురువును కాను . మీ గురువు గారిని అడగండి . వారు చెప్పిన దినము ఆరంభించండి . " 


        ఈ మాట ముగుస్తుండగా ఆలంబిని గబ గబా వచ్చినది . ఆమె ముఖములో కనిపిస్తున్న గాబరా చూచి కొడుకు , " ఏమిటమ్మా , ఏమైనది ? " అని అడిగినాడు. 


       ఆలంబిని చెప్పింది : " వైశంపాయనులకు దేహస్థితి క్షీణించినదంట. రెండు మూడు దినములనుండీ వస్తున్న జ్వరము ఇప్పుడు ఇంకా ఎక్కువైనదంట. "


" ఈ వార్తను తెచ్చినదెవరు ? "


       " మనిషి వచ్చినాడు . మీ తండ్రిగారేమో బండి కట్టించుకొని వెళ్ళిపోయినారు . నీకు చెప్పమన్నారు. ఏమి చేయవలెనో నీకు తెలుసంట. " 


         యాజ్ఞవల్క్యుడు వార్త విని కొంచము కలత చెందినాడు . ఎడమ కన్ను అదిరి , వైశంపాయనుల ఆశ్రమములో అంతా సుఖముగా లేదు అని సూచించినది . అక్కడికి వెళ్ళవలెనని నిర్ణయించుకొని లేచి నిలుచున్నాడు . 


       " గార్గి దేవి క్షమించవలెను. ఎంతైనా నాకది గురుస్థానము . ఈ చివరి కాలములో నేను అక్కడ లేకపోతే పాపభాగిని అవుతాను . ఈ బ్రాహ్మణపు పని కొంతకాలము వేచి యుండవలసినది . కానీ ఇవన్నీ మనచేతిలో లేవు . కాబట్టి ఈశ్వరుడు చేయించినట్లు అవనీ అని వాడి పైన భారము వేసి , మనము చేయు పనిని శ్రద్ధతో చేయుటయే మన పని ! అనుమతి అయితే వెళ్ళి వస్తాను , " అని చేతులు జోడించినాడు . 


        గార్గి కూడా లేస్తున్న యాజ్ఞవల్క్యుని తోపాటూ తానూ లేచింది ." వైశంపాయనులు మన విద్వద్వరేణ్యులలో ఒకరు. గురుస్థానము లేకున్ననూ ఈ అంత్య కాలములో వెళ్ళి వారి దర్శనము చేసుకొనుట తమవంటి విద్వాంసుల కర్తవ్యము . దానిపైన గురుస్థానము . ఇక ఆలోచించవలసినదేమీ లేదు. నేను మరొక దినము వచ్చి తమరిని చూచెదను. తమరి ఉపనిషత్తు , దానికన్నా తమరు చేయు భాష్యము బహు స్వారస్యముగా నున్నది . త్వరలోనే నేనుకూడా వస్తాను. వారి ఆశ్రమమునకు నేను కూడా రావలెను. కానీ ఇంటికి వెళ్ళి వచ్చి చూచెదను. " అని అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళినది. 


ఆలంబిని , " బండి కట్టించవలెనా ? " అన్నది .


         " పరుగిడే బండి నడచే నాకన్నా త్వరగా వెళ్ళగలదు అన్నది నాకు తెలుసు. అయినా పెద్దవారికి అస్వస్థమన్న తరువాత తక్షణమే వెళ్ళవలెను. కాబట్టి నేను ముందు వెళతాను. వెనుకనుండీ బండిని అయినంత వేగముగా పంపించు. నువ్వూ కాత్యాయినీ ఇక్కడే ఇంటిలోనే ఉండి అగ్నిని చూచుకొని ఉండండి. నేనూ , తండ్రిగారూ ఈ దినము వచ్చుట ఆలస్యమైతే , రేపుకూడా స్నానపు వేళకు రాకపోతే , మీరు కాచుకోవద్దు. " అని ఉత్తరీయముతో పాటు ఇంకొక వస్త్రమును తీసుకొని వెళ్ళిపోయినాడు. 


       యాజ్ఞవల్క్యుడు ఆశ్రమమును చేరు వేళకు అక్కడ పెద్ద ఏడుపు వినిపించింది. ఎవరో, " తాళుకోండి , వారికి వినిపించకూడదు " అని ఆపుటకు ప్రయత్నిస్తున్నారు. 


        వైశంపాయనులకు జ్వరము విపరీతమై అపస్మారక స్థితి వస్తున్నది. వారు బతుకుతారను ఆశ పోయి నిరాశ నిండిపోయినది. అది తెలిసి కూడా కొంతసేపయినది. స్థితి దారుణముగా ఉన్నదని తెలియగానే అంతవరకూ వారి సేవ చేస్తూ ఉన్న కదంబిని లేచి పతికి పాదాభివందనము చేసి, వెళ్ళిపోయినది. ఇంకొక గడియలో పక్క గదిలో ఏదో పడినట్లాయెను. ఏమిటా శబ్దమని వెళ్ళి చూడగా కదంబిని దేవి జీవపక్షి ఎగిరిపోయి ఉండినది. పద్మాసనములో కూర్చొని ఉన్న వారి దేహము కిందికి వాలి పడిఉన్నది. 


        యాజ్ఞవల్క్యుడు వచ్చినది చూచి అందరూ వారికి దారి వదలినారు . అతడు వెళ్ళి గురువుల పక్కన కూర్చున్నాడు. వారికి అతి తాపము నిస్తున్న జ్వరము ఈతనిని చూచి బెదరి పారిపోయినదా అన్నట్టు అరక్షణములోనే విడిచింది. దాని గుర్తుగా శరీరమంతా స్నానము చేసినట్లు చెమటలు పట్టినాయి. ఇంకొక ఘడియ లోపలే వారు లేచి కూర్చొని శుద్ధాచమనము చేసినారు. 


       అక్కడ భార్య లేకపోవుటను చూచి ’ తానేదీ ? " అని అడిగినారు. చుట్టు ఉన్నవారు విధిలేక, జరిగినది చెప్పినారు. వైశంపాయనులు తల ఊపి, " సరిపోయినది. నా మార్గము నిర్విఘ్నమైనది " అని వృద్ధ శిష్యునొకడిని పిలచి , " ఆశ్రమము మీది. మీరు కావలసిన వాడిని ఎంచుకొని ఆతని యాజమాన్యములో ఉండండి" అని చెప్పి యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగినారు. 


        " యాజ్ఞవల్క్యా, నువ్వు ఇప్పుడు వచ్చినది చాలా మంచిదైనది. నాకిక ఆజ్ఞనివ్వు. నువ్వు దైవానుగ్రహ సంపన్నుడవు. నన్ను ఉండమని బలవంతము చేయవద్దు. చావూ బ్రతుకూ మావంటి వారికి ఒకటే ! ఇదిగో పితరులు వచ్చి పిలుస్తున్నారు. పోయివస్తాను , శం సర్వేభ్యః " అన్నారు. 


వారు కనులు మూసుకున్నారు. ఇంకొక ఘడియలోపలే దేహము చల్లబడింది.  

Janardhana Sharma

సనాతన ధర్మం అంటే ఏమిటి?*

 *సనాతన ధర్మం అంటే ఏమిటి?*

           *ఎందుకు నాశనం చేయాలి?*

                 



సనాతన ధర్మంను నాశనం చేయడానికి నాటి ‘గజని మహ్మద్, ఘోరీ మహ్మద్’ నుండి మొదలు పెడితే నేటి  ’ఉదయనిది స్టాలిన్‘ వరకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు.


అసలు సనాతన ధర్మం అంటే ఏంటి..?

ఎందుకు నాశనం చేయాలి..?


మనిషి పుట్టుకతో ఏ జ్ఞానం లేని ఒక తెల్లకాగితం లాంటి వాడు.  మనిషి ‘జీవితంలో నేర్చుకోవాలిసింది జ్ఞానం. పాటించాల్సింది ధర్మం!’ 


ఈ విషయం చెప్పే ఏకైక ధర్మం సనాతన ధర్మం..!


ఈ ధర్మంకు ‘వేదం ప్రమాణం!’ 

వేదం అంటే జ్ఞానం (సైన్స్).

వేదం ప్రకారం భగవంతుడిని ఆరాధించడానికి రెండే విధానాలు ఉన్నాయి…

1). బ్రహ్మ యజ్ఞం (సంధ్యా వందనం):- చీకటికి, వెలుగుకు మధ్య ఉన్న సంధి కాలంలో ‘గాయత్రి మంత్రం ద్వారా భగవంతుడిని ఆరాధించడం!’


2). దేవ యజ్ఞం :- అగ్నిలో దేశవాళి ఆవు నెయ్యి వేసి వాతావరణమును శుద్ధి చేయడం.


ఇక వేదంలో సమస్త శాస్త్రజ్ఞానం ఉంటుంది.


మనిషి ఉభయ సంధ్యల్లో గాయత్రి మంత్రం చదివితే ఆరోగ్యంగా, నిజాయితీగా ఉంటాడు.

 కాబట్టి  మనిషిని రోగాల పాలు చేయాలంటే, మనిషిని దుర్మార్గుడిగా మార్చాలంటే సనాతన ధర్మంను నాశనం చేయాల్సిందే! 


సనాతన ధర్మంలో చెప్పిన ‘యజ్ఞాలు చేయడం బద్దకించిన వారి కోసం.. మన ఋషులు.. దేవుడి ప్రతిమ ముందు మూడు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి, కర్పూరంతో హారతిని ఇస్తూ ‘ఆరోగ్యంగా ఉండే విధానం వాడుకలోకి తెచ్చారు.


దేవుడికి ‘తమలపాకులతో తాంబులం ఇచ్చి.. అవి తిని జీర్ణశక్తిని పెంచుకునే అలవాటు చేశారు!


అలాగే సంవత్సరం మొత్తం ఏదో ఒక పండుగ రూపంలో  ‘రావి, మర్రి, బిల్వ, తులసి, మామిడి లాంటి ఆకులను వాడే ఆరోగ్యకరమైన పద్ధతి కూడా అలవాటు’ చేశారు.


ఇలా ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటే మెడికల్ మాఫియా వాళ్లకు చాలా నష్టం! అందుకే సనాతన ధర్మంను నాశనం చేయాలి!


2019 లో వచ్చిన కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో శవాల గుట్టలు ఏర్పడుతుంటే.. సనాతన ధర్మ విధానాల వల్ల  మన భారతదేశంలో మరణాలు లేక మెడికల్ మాఫియా వాళ్లు లాభాలు పొందలేక పోయారు! 

అందుకే సనాతన ధర్మంను నాశనం చేయాలి!


వేదంకు  ‘శిక్ష, వ్యాకరణం, చందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పము’ అని 6 అంగాలు ఉంటాయి.


గ్రహగతులను సరిగ్గా లెక్కగట్టే శాస్త్రం జ్యోతిష్యం.

దీన్ని వాడుక లోకి   తేవడానికి మన ఋషులు గ్రహగతుల వల్ల భవిష్యత్ కూడా చెప్పొచ్చు అని చెప్పారు. 


అందుకే  వేదాంగాల్లో జ్యోతిష్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 

ఆ జ్యోతిష్య శాస్త్రం వల్ల.. ఏ టెలిస్కోప్ సహాయం లేకుండా గ్రహాగతులు, గ్రహణాల కాలాలు సరిగ్గా లెక్కగడుతున్నారు.


ఇంత advanced టెక్నాలజీ ఉన్న ధర్మం కాబట్టి సనాతన ధర్మంను నాశనం చేయాలి.


అందుకే  జ్యోతిష్యం గురించి మీడియాలో, సినిమాలలో దుష్ప్రచారం మొదలుపెట్టారు. 


వేదం నుండి  ‘ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, స్థాపత్య వేదం అని 4 ఉపవేదాలు’ మన ఋషులు రాసారు.


ఇందులో మనిషి యొక్క రోగాలకు చికిత్స చేసే ఆయుర్వేదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.


 కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వాత అక్కడ నివసించే మయన్ నాగరికులను(రావణాసురుడు, బలి చక్రవర్తి వంశస్థులు) నాశనం చేసి క్రిస్టియన్ మత ప్రచారం చేయడానికి క్రిస్టియన్ మిషనరీలు chicken pox వైరస్ ను పూసిన దుప్పట్లను సేవ రూపంలో పంచి పెట్టాయి. 

ఆ దుప్పట్లు వాడి *వ్యాధిగ్రస్తులైన వారికి వైద్యం కావాలంటే మతం మారాలి* అని నియమం పెట్టారు.. *మయన్ లకు ఆయుర్వేదం తెలియకపోవడంతో చాలా మంది మతం మారారు. మతం మారని వారు మరణించారు. 


ఇదే పద్ధతిని భారతదేశంలో కూడా క్రిస్టియన్ మిషనరీలు ప్రయత్నం చేసాయి..   కాని  ‘భారతీయులకు ఆయుర్వేదం తెలియడం వల్ల ఆ తెల్ల కుక్కల పన్నాగం వీగిపోయింది.


 భారతదేశంకు సనాతన ధర్మం ఇలా రక్షణగా ఉంది కాబట్టి సనాతన ధర్మంను నాశనం చేయాలి!


ఉదయం లేచాక  ’వేప, ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేయడం  సనాతన ధర్మం ఆచారం! 

 దాని వల్ల దంత సమస్యలు రావు..

 సనాతన ధర్మం అంటే వెనుకబాటు తనం అని ప్రచారం చేసి...Thermo plastic తో తయారు చేసిన tooth brush, దంతాలను నాశనం చేసే tooth paste ను వాడుకలోకి తేవడం వల్ల .. నేడు విపరీతమైన  దంత సమస్యలతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతేంది.


‘సనాతన ధర్మంలోని ఒక్క ఆచారంను నాశనం చేస్తేనే కోట్ల  రూపాయల వ్యాపారం జరిగితే.. సనాతన ధర్మంను పూర్తిగా నాశనం చేస్తే లక్షల కోట్లు సంపాదించొచ్చు’ అని దుర్మార్గుల ఆలోచన!


సనాతన ధర్మంలో వేదం నుండి మన ఋషులు యోగాసనాలు అలవాటు చేశారు.


యోగసనాల ద్వారా శరీరంలో ప్రతి అవయవంను ఉత్తేజం చేసి మనిషిని ఆరోగ్యంగా ఉంచొచ్చు!

చేతి వేళ్ళ ముద్రల ద్వారా మనిషిలోని రోగాలకు చికిత్స చేసే విధానం కూడా సనాతన ధర్మంలో ఉంది.


నేటికీ  ఏ స్కానింగ్ లో కూడా మనిషి శరీరంలో కనబడని షట్ చక్రాల గురించి సనాతన ధర్మం చెప్పింది. 


*మూలాధార, స్వాదిష్టాన,

మణిపూరక, అనాహత, విషుద్ధ, ఆజ్ఞ, సహస్ర* అని ఈ 7 చక్రాలను ఉత్తేజం చేయడం ద్వారా రోగాలకు చికిత్స చేయడం కూడా సనాతన ధర్మంలో ఉంది.


నేడు సమాజంలో కోట్ల మంది గుండె జబ్బుల పాలు అవుతుంటే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది.


సనాతన ధర్మం అనుసరించి *అనాహత చక్రం ఉత్తేజం చెందించి మనిషి గుండె జబ్బులకు దూరం అయితే కోట్ల వ్యాపారం నష్టం!

అలాగే *విషుద్ధ చక్రం ఉత్తేజం చేసి మనిషి థైరాయిడ్ సమస్యకు దూరం అయితే కోట్ల రూపాయలు మెడికల్ మాఫియాకు నష్టం!


సనాతన ధర్మంలోని *ధ్యానం ద్వారా మానసిక రోగాలకు మనిషి దూరం అయితే…


సైకాలజీ వ్యాధిగ్రస్తుల రూపంలో జరిగే కోట్ల వ్యాపారం ఉండదు..!

అందుకే సనాతన ధర్మంను నాశనం చేయాలి!


జీవి జన్మించాక మరణిస్తాడు.. *మరణించాక మళ్ళీ జన్మిస్తాడు* ..

మనిషి జన్మ దొరకడం అదృష్టం..!

*ఈ జన్మలోనే మోక్షం కోసం ప్రయత్నం చేయాలి, భగవంతుడిని చేరుకోవాలి  అని.. సనాతన ధర్మం చెప్తుంది.!

ఈ ధర్మం అనుసరించడం వల్ల మనిషి ధర్మాత్ముడు  అవుతాడు.


కాని మనిషి జన్మ    దుఃఖ హేతువు అని చెప్తూ, *భగవంతుడు, పునర్జన్మ అంటూ ఏమీ ఉండవు అని బౌద్ధ, జైన మతాలు మనుషులను మూర్ఖులుగా చేయడం ప్రారంభించాయి. 

బౌద్ధ మతంలోని *చేరవాదం నుండి ఏర్పడిన క్రిస్టియన్ మతం* అయితే నేరుగా.. *పాపం చేస్తేనే మనిషి పుడతాడు.. మనిషి పాపం చేయాలి.. పాపానికి శిక్ష భగవంతుడు అనుభవిస్తాడు* అని *మనిషిని వావి వరుసలు లేని ఒక జంతువుగా మార్చడం మొదలు పెట్టారు* .. 


అందుకే *పెళ్ళికి ముందే శృంగారం, living together, పెళ్లి అయిన వెంటనే విడాకులు లాంటి జంతు ప్రవృత్తిని* అలవాటు అయ్యాయి..


 *సనాతన ధర్మంలో స్త్రీని దేవతగా పూజిస్తుంటే* .. ముస్లిం, క్రిస్టియన్ మతాలు.. *స్త్రీ అంటే వ్యవసాయ భూమి అని, పురుషుడు దున్ని పంట (పిల్లలు) పండించాలి* అని చెప్తుంటాయి.


దాని ఫలితంగా *నగ్న చిత్రాలు, పోర్న్ సినిమాలు, అత్యాచారాలు పెరిగాయి.* 


 *సనాతన ధర్మంను అనుసరించి మనిషి మహాత్ముడు అయి, స్త్రీని గౌరవించడం మొదలుపెడితే* ..

 *పోర్న్ సినిమాల ద్వారా కోట్ల వ్యాపారం నష్టం* .. 


అలాగే *అత్యాచారాలు జరగకపోతే మహిళా రక్షణ కోసం తీసుకు వచ్చే కొత్త టెక్నాలజీ అవసరం లేక కోట్ల రూపాయల నష్టం* 


అందుకే కోట్ల వ్యాపారం జరగాలంటే *మనిషిని జంతువుగా మార్చే మతాలకు ప్రచారం చేయాలి* .. సనాతన ధర్మంను నాశనం చేయాలి!


సనాతన ధర్మంలో  మనుస్మృతి 

అనే న్యాయశాస్త్రం వేదం(జ్ఞానం)  మొత్తం చదివితే బ్రాహ్మణుడిగా.. గురువుగా ఉన్నత స్థానంలో ఉండాలి.


వేదం *సగం చదివితే క్షత్రియ, వైశ్యులుగా ఉండి పరిపాలన, వ్యాపారాలు చేస్తూ సమాజంలో రెండు, మూడు* స్థానాల్లో ఉండాలి..

 

ఏ జ్ఞానం చదవని వాడు శూద్రుడిగా చేతి వృత్తులు నిర్వహిస్తూ అట్టడుగు స్థాయిలో ఉండాలి.


ఇంత గొప్ప న్యాయంను మనుషులు అందరూ అనుసరించి గొప్పవారు అయితే.. న్యాయ సమస్యలు అంటూ ఉండవు..

కులాల పేరుతో మనుషులను విభజించి ఓట్లు అడిగే అవకాశం ఉండదు* .. *కుల రిజర్వేషన్లతో మనుషులను విడగొట్టే అవకాశం* ఉండదు..


అందుకే సనాతన ధర్మంను నాశనం చేయాలి..!


అందుకే *సనాతన ధర్మం చెప్పిన గొప్ప న్యాయవ్యవస్థను వక్రీకరించి* ..

శూద్రులు వేదం(జ్ఞానం) ను ద్వేషించే విధంగా* చేశారు.


వేదం బోధించే *గురువులను (బ్రాహ్మణులను) ద్వేషించే విధంగా* చేశారు..


జ్ఞానం(వేదం) వద్దు అని .. *అజ్ఞానంలోనే ఉండి పోయి కులాల కోసం కొట్టుకునే మూర్ఖులుగా* తయారు చేశారు. 


సనాతన ధర్మంలో ఋషులకు *DNA, GENES గురించి తెలుసు* కాబట్టి..  *ఒకే గోత్రం ఉన్న దగ్గరి సంబంధాల వారు వివాహం చేసుకొని జన్యు సంబంధ రోగాలు రాకుండా గోత్ర వ్యవస్థను* ప్రవేశ పెడితే..

 ఏ జ్ఞానం లేని మూర్ఖులు *ఇష్టరీతిన పెళ్లిళ్లు చేసుకుంటూ అవయవాల లోపంగా పిల్లలను కంటూ జంతువుల్లా బ్రతుకుతూ సనాతన ధర్మంను ద్వేషించడం మొదలు పెట్టారు* ..


 *న్యాయం, ధర్మం, నీతి, నియమం, వావి, వరుస, వర్ణం, గోత్రం* ఇవన్నీ మనిషికి అవసరమైన గొప్ప కట్టుబాట్లు..


కాని మనిషిని జంతువుగా మార్చే మతాలు..

 *ఉన్నది ఒక్క జీవితం.. జంతువులా వావి వరుసలు లేకుండా బ్రతకమని* చెప్తున్నాయి..


ఆ మత ప్రచారాలు జరిగి.. *మనిషి జంతువులా మారి, మనిషి రోగాలతో అవస్థలు పడి  కోట్ల వ్యాపారం జరగాలంటే సనాతన ధర్మంను నాశనం చేయాలి..!


మనిషి వావి వరుసలు లేకుండా *స్త్రీని అనుభవించే వస్తువుగా చూస్తేనే.. స్త్రీ శరీరంతో పోర్న్ సినిమాలు తీసి కోట్లు సంపాదించొచ్చు* .. *స్త్రీ శరీరంతో  SEX Rocket లు తయారు చేసి కోట్ల రూపాయలు వ్యాపారం చేయొచ్చు* ..


నేటి కాలంలో *మనిషి సనాతన ధర్మంను చాలా వరకు వదిలేయడం వల్లే* .. నేడు ప్రపంచంలోఅనారోగ్యం, అన్యాయం, అత్యాచారాలు, హత్యలు, అవినీతి, అక్రమాలు* జరుగుతున్నాయి..

 *విలువలు లేని రాజకీయాలు, ప్రకృతిని నాశనం చేసే వ్యాపారాలు తయారు అయ్యాయి* ..


దుర్మార్గులందరూ *మీడియా ద్వారా, సినిమాల ద్వారా, పుస్తకాల ద్వారా, రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా సనాతన ధర్మంను పూర్తిగా నాశనం చేసి మనిషిని జంతువుగా మార్చాలని* ప్రయత్నం చేస్తున్నారు..!


కాని మనిషి *వేదం చదివి జ్ఞానం పొందాలని, సత్యర్థప్రకాష్ చదివి సత్యం తెలుసుకొని* .. *సనాతన ధర్మంను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ* ...

జై సనాతన ధర్మం 🚩🚩🚩🕉️🕉️🕉️ -సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖

జ్వరము లక్షణాలు

 జ్వరము లక్షణాలు - నివారణా యోగాలు .


    శరీరం వణుకుట, పెదవులు , నోరు ఆరిపోవుట, నిద్రపట్టకపోవుట, తుమ్ము రాకుండా ఉండటం, తల ఇతర భాగాలు నొప్పులుగా ఉండటం, నోటికి రుచి తెలియకపోవటం , మలబద్దకం, కడుపునొప్పి, కడుపుబ్బరం, ఆవులింతలు ఇటువంటి లక్షణాలు అన్నియు వాతం వలన కలుగు జ్వర లక్షణాలు .


     బాగా వొళ్ళు కాలుట, అతిసారం, సరిగ్గా నిద్రపట్టకపొవుట, వాంతులు , నోటిలో పుండుపడుట, నోరు చేదుగా ఉండటం, మూర్చ, తాపము , దాహము , మలమూత్రాలు, కళ్లు పచ్చగా ఉండటం వంటి లక్షణాలు అన్నియు పిత్త సంబంధ జ్వర లక్షణాలు .


     శరీరం బాగా చలిగా ఉండటం, సోమరితనం, నోరు తియ్యగా ఉండటం , చర్మం పాలిపోవుట , మూత్రం తెల్లగా రావటం, శరీరం బిగుసుకుపోయినట్టు ఉండటం, పొట్ట, శరీరం బరువుగా ఉండటం , అతినిద్ర, మలము కొద్దిగా వచ్చుట, నోటిలో ఎక్కువ నీరు ఊరట, మూత్రం ఎక్కువుగా రావటం, వాంతులు , అరుచి , జీర్ణం కాకుండా ఉండటం, దగ్గు, జలుబు , కళ్లు తెల్లగా ఉండటం ఈ లక్షణాలు అన్నియు కఫ సంబంధ జ్వర లక్షణాలు .


         పైన చెప్పిన విధముగా జ్వరం వచ్చినపుడు లక్షణాన్నిబట్టి దేని సంబంధమైన జ్వరమో నిర్ణయించుకొని దానికి తగ్గ ఔషథాన్ని నిర్ణయించుకుని వాడవలెను.


 నివారణా యోగాలు -


 * తిప్పతీగ , మోడి , శొంటి మూడు సమాన బాగాలుగా తీసుకుని కషాయం చేసుకుని సేవిస్తున్న వాతజ్వరం నశించును.


 * దురదగొండి వేర్లు, పర్పాటకం, ప్రేంఖనం , నేలవేము , అడ్డసరం, కటుకరోహిణి వీటి కషాయం ఎక్కువుగా చక్కర కలిపి తీసుకుంటే దాహము , రక్తపిత్తం, జ్వరం, తాపం నివారిస్తాయి.


 * పర్పాటకం , చందనం,వట్టివేళ్ళు , ధనియాలు వీటి కషాయం తీసుకుంటే పైత్య జ్వరం వెంటనే నివారణ అగును.


 * వాము , వస, శొంటి, పిప్పళ్లు , నల్ల జీలకర్ర సమాన చూర్ణాలను తీసుకుని కలిపి కొంచం నీరు కలిపి శరీరానికి మర్దన చేయుచున్న టైఫాయిడ్ జ్వరములో వచ్చు శరీరపు మంటలు తగ్గును.


 * బెత్తెడు వేపచెక్క దంచి గ్లాసున్నర నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు లోపలికి ఇచ్చి పడుకోపెట్టి లొపలికి గాలి చొరబడకుండా నిండగా దుప్పట్లు కప్పవలెను. లోపల అంత చెమట పట్టి జ్వరం తగ్గును. ఈ విధముగా మూడుపూటలా చేయుచున్న అన్నిరకాల జ్వరాలు నశించును.


 * నిమ్మకాయ రసంలో పంచదార కలిపి తాగించుచున్న జ్వరం వల్ల వచ్చు తాపం తగ్గును.


 * కృష్ణ తులసి ఆకులు 50 గ్రాములు , మిరియాలు 10 గ్రాములు రెండూ కలిపి నూరి బటాణిగింజ అంత మాత్రలు చేసి పూటకి ఒక మాత్ర చొప్పున ఇచ్చి వేడి నీరు తాగించవలెను . చలిజ్వరం నందు పూటకి రెండు మాత్రలు చొప్పున ఇవ్వవలెను. దీనివలన సాధారణ జ్వరములు, మలేరియా జ్వరములు కూడా నశించును.


 * గుంటగలగరాకు జ్వరం ఉన్నవారు కొంచం కొంచం నమిలి మింగుచున్న జ్వరం తగ్గును.


 * రావిచెట్టు ఆకులు 5 , మారేడు ఆకులు 15 , తులసి ఆకులు 45 ఈ వస్తువులను మెత్తగా నూరి అర లీటరు నీళ్లలో కలిపి కషాయం కాచి పావులీటరులో సగం వచ్చేంత వరకు మరిగించి దింపి వడపోసుకొని ఉంచుకుని గంట గంటకు 10ml చొప్పున తాగించుచున్న రెండు రోజుల్లొ టైఫాయిడ్ జ్వరం నశించును.


 * గుంటగలగర చిగుళ్లు 7 , మిరియాలు 7 కలిపి నూరి ఒక్క మోతాదుగా రోజూ రెండుపూటలా ఇచ్చుచుండిన యెడల చలిజ్వరం తగ్గును.


 * 5 తులసి ఆకులు , 5 మిరియపు గింజలు కలిపి నూరి 60ml నీరు , 15ml తేనె కలిపి భోజనానికి గంట ముందుగా ఉదయం , సాయంత్రం కలిపి ఇచ్చుచుండిన టైఫాయిడ్ జ్వరం తగ్గాక వచ్చు బలహీనత నివారించబడును.


 * వరిపేలాలు చూర్ణం చేసి కషాయం పెట్టి ఆ కషాయంలో కొంచం పటికబెల్లం పొడి కలిపి తాగించున్న పైత్యం వలన వచ్చు జ్వరం తగ్గును.


 * గోధుమల కషాయం లో పటికబెల్లం పొడి కలిపి తాగించుచున్న పైత్యజ్వరం నశించును.


      జ్వరం తగ్గుటకు పథ్యం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. సరైన పథ్యమును పాటిస్తూ ఔషధాలను తీసుకొనుచున్న ఎటువంటి జ్వరం అయినా నశించును.


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

సోమవారం*🕉️ 🌹 *21, అక్టోబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🕉️ *సోమవారం*🕉️

🌹 *21, అక్టోబర్, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*


*తిథి    : పంచమి* రా 02.29 వరకు ఉపరి *షష్ఠి*

*వారం:సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం  : రోహిణి* ఉ 06.50 

*మృగశిర* రా 05.51తె వరకు.


*యోగం  : వరీయాన్* ఉ 11.11 వరకు ఉపరి *పరిఘ*

*కరణం  : కౌలువ* మ 03.17 *తైతుల* రా 02.29 ఉపరి *గరజి* 


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 12.00 సా 03.30 - 05.00*

అమృత కాలం  :*రా 09.25 - 10.57*

అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.15*


*వర్జ్యం         :  మ 12.12 - 01.24*

*దుర్ముహూర్తం  : మ 12.15 - 01.02 & 02.35 - 03.22*

*రాహు కాలం : ఉ 07.29 - 08.57*

గుళికకాళం      : *మ 01.19 - 02.47*

యమగండం    : *ఉ 10.24 - 11.52*

సూర్యరాశి : *తుల* 

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 06.01*

సూర్యాస్తమయం :*సా 05.42*

*ప్రయాణశూల  : తూర్పుదిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 06.01 - 08.22*

సంగవ కాలం    :      *08.22 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.02*

అపరాహ్న కాలం:*మ 01.02 - 03.22*

*ఆబ్ధికం తిధి : ఆశ్వీజ బహుళ పంచమి*

సాయంకాలం  :  *సా 03.22 - 05.42*

ప్రదోష కాలం   :  *సా 05.42 - 08.10*

రాత్రి కాలం     :  *రా 08.10 - 11.27*

నిశీధి కాలం      :*రా 11.27 - 12.17*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.23 - 05.12*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


     🕉️ *శ్రీ శివ తాండవ స్తోత్రం*🕉️


సహస్ర లోచన ప్రభృత్య శేషలేఖ శేఖర

ప్రసూన ధూళి ధోరణీ విధూస రాంఘ్రి పీఠభూః 

భుజంగ రాజమాలయా నిబద్ధ జాటజూటక

శ్రియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః


🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

ఆశ్వీయుజ మాసంలో

 🙏ఆశ్వీయుజ మాసంలో

ఈశ్వరునికి అన్నాభిషేకం..!!🙏

    


🌿అన్నం పరబ్రహ్మ స్వరూపం.

సమస్త ప్రాణికోటి అన్నజీవులు. వాటివాటికి తగిన ఆహారం లభించకపోతే ఎక్కువ రోజులు జీవించలేవు. అందుచేత అన్నదానం చేసేవారిని అన్నదాతా!  సుఖీభవా ! అని ఆశీర్వదిస్తారు. 


🌸అన్నాన్ని సృష్టించి మనకు ప్రసాదించే వరప్రదాతగా శివపురాణాలు  ఈశ్వరుని కీర్తిస్తున్నాయి.  


🌿అన్నాన్ని  నిందించరాదని

శివస్వరూపమని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. ఏది జీవుల ప్రాణాలను నిలబెడుతున్పదో , ఏది లేకపోతే ప్రాణాలు పోతున్నాయో

అది పరబ్రహ్మ స్వరూపం.

అన్నం బ్రహ్మం  అని

వివరిస్తున్నాయి పురాణాలు.


🌸అలాటి అన్నం యొక్క మహాత్యాన్ని,విశిష్టత ను తెలిపేది ఆశ్వీయుజ పౌర్ణమి నాడు

కాశీ అన్నపూర్ణాదేవి అన్నాన్ని బిక్షగా పెట్టి  ఈశ్వరుని దోషాన్ని తొలగించిన రోజు ఈ ఆశ్వీయుజ పౌర్ణమి తిధినాడే.


🌿దక్షునిచే శపించబడిన చంద్రుడు ఈశ్వరుని కరుణతో

తన కళలను తిరిగి పొంది సంపూర్ణంగా ప్రకాశించిన రోజు కూడా

యీ పౌర్ణమి రోజునే.


🌸ఆశ్వీయుజ మాస పౌర్ణమినాడు

ఈశ్వరునికి ఆన్నాభిషేక ఉత్సవం వైభవంగా జరుపుతారు. ఆనాడే

చంద్రుడు ఆన్నాభిషేకం జరిపాడని పురాణ కధలు వివరిస్తున్నాయి.


ఒకానొక కాలంలో అన్నదానాలకు

చిదంబరం ప్రసిధ్ధిపొందిన క్షేత్రం.


🌿చిదంబరం ఆలయంలో అనునిత్యం ఈశ్వరునికి అన్నాభిషేకం 

జరిగేది. ఆదిశంకరులు

ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చిన సమయంలో అన్నాకర్షణయంత్రం ప్రతిష్టించినట్లు చెప్తారు.

అందువలన తిల్లైనాధుని దర్శనంతో ఎవరి గృహంలోనూ  అన్నానికి కొఱత వుండదు అని  అంటారు.


🌸అన్నమయకోశమైన యీ దేహానికి అన్నమే ఆధారం. ఒక్కొక్క

అన్నపు మెతుకు  ఒక్కొక్క

శివలింగ రూపం. ఉన్నతమైన యీ అన్నాన్ని ఈశ్వరునికి నివేదించే

ఉత్సవం ఆశ్వీయుజ పౌర్ణమి నాడు జరుగుతుంది.


🌿ఆశ్వీయుజ మాసంలోనే అన్నాభిషేకం

జరగడానికి మరో కారణం కూడా పెద్దవారు చెప్తారు.

ఆశ్వీయుజమాసం వానలు కురిసే కాలం. పెద్ద పెద్ద తుఫానులు, వరదలు ఏర్పడే కాలం. అందువలన ఇళ్ళు కోల్పోయినవారంతా ఆ 

శివాలయాలలో తల దాచుకునేవారు.

ఊరంతటికి అక్కడే వంటలు చేసి వినియోగించేవారు.


🌸అటువంటి  సమయంలో

జీవులకి ఆహారం సమకూరుస్తున్న పరమశివునికి ముందుగా భక్తితో నివేదించి తర్వాత

ప్రసాదంగా  ఆ ఆహారం తీసుకునేవారు. అభిషేకాన్నము మిగిలిపోతే పారవేయకుండా నీళ్ళలో కలిపేవారు.

ఇందువలన జలచరాలకు కూడా

ఆహారం లభించి ప్రాణాలు నిల్పుకునేవి.  భూసారం బలపడి ప్రకృతి వనరులు చక్కని పంటలనిచ్చేవి.


🌿అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి  70 రకాల  ద్రవ్యాలతో అభిషేకించ వచ్చని ఆగమాలు వివరిస్తున్నాయి.

వాటిలో శివాంశమైన అన్నాభిషేకం  చేయడం వలన ఆహారానికి కరువు ఏర్పడదు.


🌸అన్నదోషాలవంటివి తొలగి పోతాయని పురాణ గ్రంధాలు వివరిస్తున్నాయి.

పంచభూతాత్మకుడైన  పరమేశ్వరునికి పంచభూతాల ద్వారా సృష్టించబడిన 

అన్నంతో అభిషేకం చేసినప్పుడు ఆయన పరమానంద

భరితుడవుతున్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి.


🌿మనిషి ప్రధాన సమస్యయైన ఆకలి బాధను తొలగించే మహోన్నత సేవ అన్నదానం. భగవంతుని పేర అన్నదానాన్ని జరపడమే యీ ఆశ్వీయుజ అన్నాభిషేకం.


🌸ఆశ్వయుజ అన్నాభిషేకం

చేసిన వారి కుటుంబాలకి

సకల సౌభాగ్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి.


🌿పూర్ణకళలతో ప్రకాశించే

చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి శక్తి వంతమైన తన 

కాంతి ప్రసరింపచేసినందున

మానవుల మనోబలం , బుధ్ధిశక్తి  పెరిగి

కార్యాలన్నీ సక్రమంగా సిధ్ధిస్తాయి.


🌸అభిషేకానికి మరొక విశిష్టత వున్నది. ఏ అభిషేకమైనా  ఆ అలంకరణలో 24 నిముషాలు మాత్రం వుండాలని ఆగమ విధి. కొన్ని ప్రాంతాలలో 48 నిముషాలు  వుంటుంది. ఆ అలంకరణ ఎక్కువ సమయం వుండకూడదు.


🌿అన్నాభిషేక అలంకారం మాత్రం ఒక గంటా, గంటన్నర మాత్రం వుండవచ్చు.

ఇదే అన్నాభిషేక విశిష్టత.

ఎక్కువ సమయం ఈశ్వరుని

దేహం మీద వున్న అన్నం

ఉత్కృష్టమైన ప్రసాదంగా

మారుతుంది. 


🌸ఇందువలన యీ ప్రసాదం

భుజించిన ,  శారీరక రుగ్మతలు గుణమౌతాయి, దేహకాంతి

ఏర్పడుతుంది. సంతానం

లేని వారికి సంతాన భాగ్యం

కలిగుతుందని భక్తులు

ధృఢంగా నమ్ముతారు....

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - ఆశ్వయుజ మాసం - కృష్ణ పక్షం - పంచమి - రోహిణీ & మృగశిర -‌‌ ఇందు వాసరే* (21.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*