🙏ఆశ్వీయుజ మాసంలో
ఈశ్వరునికి అన్నాభిషేకం..!!🙏
🌿అన్నం పరబ్రహ్మ స్వరూపం.
సమస్త ప్రాణికోటి అన్నజీవులు. వాటివాటికి తగిన ఆహారం లభించకపోతే ఎక్కువ రోజులు జీవించలేవు. అందుచేత అన్నదానం చేసేవారిని అన్నదాతా! సుఖీభవా ! అని ఆశీర్వదిస్తారు.
🌸అన్నాన్ని సృష్టించి మనకు ప్రసాదించే వరప్రదాతగా శివపురాణాలు ఈశ్వరుని కీర్తిస్తున్నాయి.
🌿అన్నాన్ని నిందించరాదని
శివస్వరూపమని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. ఏది జీవుల ప్రాణాలను నిలబెడుతున్పదో , ఏది లేకపోతే ప్రాణాలు పోతున్నాయో
అది పరబ్రహ్మ స్వరూపం.
అన్నం బ్రహ్మం అని
వివరిస్తున్నాయి పురాణాలు.
🌸అలాటి అన్నం యొక్క మహాత్యాన్ని,విశిష్టత ను తెలిపేది ఆశ్వీయుజ పౌర్ణమి నాడు
కాశీ అన్నపూర్ణాదేవి అన్నాన్ని బిక్షగా పెట్టి ఈశ్వరుని దోషాన్ని తొలగించిన రోజు ఈ ఆశ్వీయుజ పౌర్ణమి తిధినాడే.
🌿దక్షునిచే శపించబడిన చంద్రుడు ఈశ్వరుని కరుణతో
తన కళలను తిరిగి పొంది సంపూర్ణంగా ప్రకాశించిన రోజు కూడా
యీ పౌర్ణమి రోజునే.
🌸ఆశ్వీయుజ మాస పౌర్ణమినాడు
ఈశ్వరునికి ఆన్నాభిషేక ఉత్సవం వైభవంగా జరుపుతారు. ఆనాడే
చంద్రుడు ఆన్నాభిషేకం జరిపాడని పురాణ కధలు వివరిస్తున్నాయి.
ఒకానొక కాలంలో అన్నదానాలకు
చిదంబరం ప్రసిధ్ధిపొందిన క్షేత్రం.
🌿చిదంబరం ఆలయంలో అనునిత్యం ఈశ్వరునికి అన్నాభిషేకం
జరిగేది. ఆదిశంకరులు
ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చిన సమయంలో అన్నాకర్షణయంత్రం ప్రతిష్టించినట్లు చెప్తారు.
అందువలన తిల్లైనాధుని దర్శనంతో ఎవరి గృహంలోనూ అన్నానికి కొఱత వుండదు అని అంటారు.
🌸అన్నమయకోశమైన యీ దేహానికి అన్నమే ఆధారం. ఒక్కొక్క
అన్నపు మెతుకు ఒక్కొక్క
శివలింగ రూపం. ఉన్నతమైన యీ అన్నాన్ని ఈశ్వరునికి నివేదించే
ఉత్సవం ఆశ్వీయుజ పౌర్ణమి నాడు జరుగుతుంది.
🌿ఆశ్వీయుజ మాసంలోనే అన్నాభిషేకం
జరగడానికి మరో కారణం కూడా పెద్దవారు చెప్తారు.
ఆశ్వీయుజమాసం వానలు కురిసే కాలం. పెద్ద పెద్ద తుఫానులు, వరదలు ఏర్పడే కాలం. అందువలన ఇళ్ళు కోల్పోయినవారంతా ఆ
శివాలయాలలో తల దాచుకునేవారు.
ఊరంతటికి అక్కడే వంటలు చేసి వినియోగించేవారు.
🌸అటువంటి సమయంలో
జీవులకి ఆహారం సమకూరుస్తున్న పరమశివునికి ముందుగా భక్తితో నివేదించి తర్వాత
ప్రసాదంగా ఆ ఆహారం తీసుకునేవారు. అభిషేకాన్నము మిగిలిపోతే పారవేయకుండా నీళ్ళలో కలిపేవారు.
ఇందువలన జలచరాలకు కూడా
ఆహారం లభించి ప్రాణాలు నిల్పుకునేవి. భూసారం బలపడి ప్రకృతి వనరులు చక్కని పంటలనిచ్చేవి.
🌿అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి 70 రకాల ద్రవ్యాలతో అభిషేకించ వచ్చని ఆగమాలు వివరిస్తున్నాయి.
వాటిలో శివాంశమైన అన్నాభిషేకం చేయడం వలన ఆహారానికి కరువు ఏర్పడదు.
🌸అన్నదోషాలవంటివి తొలగి పోతాయని పురాణ గ్రంధాలు వివరిస్తున్నాయి.
పంచభూతాత్మకుడైన పరమేశ్వరునికి పంచభూతాల ద్వారా సృష్టించబడిన
అన్నంతో అభిషేకం చేసినప్పుడు ఆయన పరమానంద
భరితుడవుతున్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి.
🌿మనిషి ప్రధాన సమస్యయైన ఆకలి బాధను తొలగించే మహోన్నత సేవ అన్నదానం. భగవంతుని పేర అన్నదానాన్ని జరపడమే యీ ఆశ్వీయుజ అన్నాభిషేకం.
🌸ఆశ్వయుజ అన్నాభిషేకం
చేసిన వారి కుటుంబాలకి
సకల సౌభాగ్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి.
🌿పూర్ణకళలతో ప్రకాశించే
చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి శక్తి వంతమైన తన
కాంతి ప్రసరింపచేసినందున
మానవుల మనోబలం , బుధ్ధిశక్తి పెరిగి
కార్యాలన్నీ సక్రమంగా సిధ్ధిస్తాయి.
🌸అభిషేకానికి మరొక విశిష్టత వున్నది. ఏ అభిషేకమైనా ఆ అలంకరణలో 24 నిముషాలు మాత్రం వుండాలని ఆగమ విధి. కొన్ని ప్రాంతాలలో 48 నిముషాలు వుంటుంది. ఆ అలంకరణ ఎక్కువ సమయం వుండకూడదు.
🌿అన్నాభిషేక అలంకారం మాత్రం ఒక గంటా, గంటన్నర మాత్రం వుండవచ్చు.
ఇదే అన్నాభిషేక విశిష్టత.
ఎక్కువ సమయం ఈశ్వరుని
దేహం మీద వున్న అన్నం
ఉత్కృష్టమైన ప్రసాదంగా
మారుతుంది.
🌸ఇందువలన యీ ప్రసాదం
భుజించిన , శారీరక రుగ్మతలు గుణమౌతాయి, దేహకాంతి
ఏర్పడుతుంది. సంతానం
లేని వారికి సంతాన భాగ్యం
కలిగుతుందని భక్తులు
ధృఢంగా నమ్ముతారు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి