2, నవంబర్ 2022, బుధవారం

Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 61 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


‘నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటివరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయ్యాయి. ఇంతకుముందు తొంభైతొమ్మిది యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటానని చెప్పలేను అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదని చెప్పడం ఎలా కుదురదు. ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పడము కూడా కష్టమే. నేను మూడురకములుగా మాత్రము ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు నన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తే నాకు చాలా ఆనందముగా ఉన్నది. నీవు వటువువి నేను చక్రవర్తిని నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. నీకు ఏమి కావాలో కోరుకో’.

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో

కరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమొ కాక ఏమడిగెదో దాత్రీసురేంద్రోత్తమా!

ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి ? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిస్తాను’ అన్నాడు. వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. నాకు నీవు ఇవ్వగలిగినది ఏమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చానని అంటే నేను బ్రహ్మానందమును పొందుతాను ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు.

బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములను జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితే అది ఇస్తాను’ అన్నాడు.

వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు

గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

‘అవన్నీ ఇస్తానంటావేమిటి? నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు. బలిచక్రవర్తి

ఓ వటువా! ఇదిగో బంగారుపాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ! బంగారుచెంబుతో నీళ్ళు పొయ్యి. ఈ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొంగిపోతూ నీళ్ళు పట్టుకువద్దామని లోపలి వెళుతున్నది. ఈలోగా బ్రహ్మచారి బంగారుపాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చి రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట ఇచ్చావా? అని అడిగాడు. బలిచక్రవర్తి ‘ ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగితే ఇస్తానన్నాను’ అన్నాడు. శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. నీజోలికి రాలేడు. నీతో యుద్ధం చేయకుండా నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును తీసుకుని ఇంద్రునకు ఇస్తాడు. మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాటచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.

వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు

జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప !

శుక్రాచార్యుల వారు రాక్షసనీతి చెప్పారు. దానిని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దాని వలన పాపం రాదు. మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగుకూడా ఇవ్వకు ఇస్తే ప్రమాదం ఆయనను నమ్మకు’ అన్నాడు.

బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు! లక్ష్మీనాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.

ఆదిన్ శ్రీసతి కొప్పుపై, దనువుపై, నంసోత్తరీయంబుపై

బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే ?

‘ఆయన చేయి లక్ష్మీఅమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు. ఒక్కొక్క సారి ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతున్నది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై.

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!

‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా!

నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాటపోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను ఆ జాబితాలో చేరను. నేను దానం చేస్తాను’ అన్నాడు. శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం త్రాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేసాను. ఇవాళ నువ్వు గురువు మాటకాదన్నావు. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు!’ అని శపించాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

ఆదివారంసెలవువద్దు

 💥#ఆదివారంసెలవువద్దు💥


ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం! 

ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం మీకోసం. 

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | 


సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||


స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |


న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||


💥తాత్పర్యం:


మాంసం తినడం..! 

మద్యం తాగడం..!

స్త్రీతో సాంగత్యం..! 

క్షవరం చేసుకోవటం..!

తలకు నూనె పెట్టుకోవడం..!


ఇలాంటివి ఆదివారం నాడు  నిషేధించారు, 

కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! 

ఈ కర్మలు చేసినవాడు  జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు, అని నొక్కి చెప్పారు మన పెద్దలు. దరిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం, ఒక్కటే కాదు.. 

కుటుంబ సౌఖ్యం లేకపోవటం..

ఆనారోగ్యం కూడా..!!


ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, 

తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!


ఎందుకంటే.. 

అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. 

సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! 

సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!


అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!


ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!


ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు..


అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! 

చేస్తున్నాము..!!


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ..

ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!


అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు..

మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!! ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!


పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! 

ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. 

ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. 

మద్యాన్ని తాగేవారు కాదు..!!


కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!


ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.!

ఇప్పటికైనా కళ్ళు తెరవండి.!

విదేశీ సంస్కృతిని విడనాడండి.!

స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి..!


యోగ చేయండి.!

ప్రాణాయామం చేయండి.! 

సూర్య నమస్కారాలు చేయండి.!  

సూర్యోపాసన చేయండి.!! 

ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి..!!


ఈ టపా కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! 

కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!


ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.🙏🌞

విష్ణు స్వరూపం ఉసిరికాయ

 🙏🌺 *విష్ణు స్వరూపం ఉసిరికాయ* 🌺🙏


🌺కార్తీక మాసం అనగానే దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం… వంటి నియమాలెన్నో గుర్తుకువస్తాయి. కానీ మన పెద్దలు ఈ నియమాలన్నింటికీ ఉసిరిని కూడా జోడించారు. ఉసిరి కాయ మీద వత్తిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటి ఆచరణలు మంచివని సూచించారు. మన ఆరోగ్యానికీ, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతా మూర్తులుగా భావించి కొలవడం మన ఆచారాలలోని గొప్ప విషయం. అందుకనే అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు.🌺


 🌺క్షీరసాగరమథనం తరువాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయనీ, అదే ఉసిరి చెట్టుగా మారిందినీ ఓ నమ్మకం. సకల వ్యాధులనూ నివారించి దీర్ఘాయువుని ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోల్చడం సహేతుకంగానే తోస్తుంది. ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు! ఆయుర్వేదంలో ఆరు రుచులన పేర్కొంటారు అవి… మధురం (తీపి), ఆమ్లం (పులుపు), కషాయం (వగరు), లవణం (ఉప్పదనం), కటువు (కారం), తిక్తం (చేదు). ఏ ఆహారపదార్థలోనైనా వీటిలో రెండో, మూడో, నాలుగో రుచులు కనిపిస్తే గొప్ప కానీ ఉసిరిలోని అద్బుతం ఏమిటంటే ఉప్పదనం తప్ప మిగతా అయిదు రుచులూ కనిపిస్తాయి. ముఖ్యంగా ఆమ్ల గుణం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆమలకము లేదా ఆమ్లా అని పిలుచుకోవడం కద్దు. పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒకే ఒక్క లవణాన్ని కూడా చేర్చి అన్నంలో కలుపుకుని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని స్వీకరించేవారు మన పెద్దలు.🌺


🌺ఇక కార్తీక మాసంలోనే ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత అన్నదానికి కూడా బోలెడు కారణాలు కనిపిస్తాయి. చలి విజృంభించే కార్తీక మాసాన కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ పరిహరింపబడతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం. ఉసిరిలోని విటమిన్‌ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే, అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి.🌺


🌺అందుకే కార్తీక మాసం యావత్తూ ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశినాడు ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటారు (ధాత్రి అంటే ఉసిరి). ఉసిరిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా కొలుచుకుంటారు హైందవులు. అలాంటి ఉసిరి కాయలు, కొమ్మలు, చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు. ఉసిరిని సేవిస్తారు. అప్పటి వరకూ కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్న ఉసరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో, పచ్చటి కాండంతో శక్తిమంతంగా ఉండి సకల ఆరోగ్యాలనూ ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటుంది.🌺


 🎶 *స్వరం : గౌతమి*🎙️

విప్లవాత్మక ఆవిష్కరణ

 *🤣భార్య కోపం వలన ఇంటి నుండి బయటకు పోవలసి వచ్చింది, దానివలన  మానవాళికి విప్లవాత్మక ఆవిష్కరణ జరిగింది :-*


*👍ఈ సంఘటన 2004లో జరిగింది. ప్రస్తుతం, గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఆ సమయంలో అమెరికాలో కెరీర్‌ను పెంపొందించు కోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒకసారి అతని పరిచయస్థుల్లో ఒకరు అతనిని తన ఇంటికి భోజనానికి పిలిచారు. సుందర్ తన భార్యతో కలిసి వెళ్లాల్సి రావడంతో భార్యతో కలిసి ప్లాన్ వేశాడు. తను  ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి ఆఫీస్ అయ్యాక నేరుగా ఆహ్వానం పలికిన ఇంటికి భోజనానికి వెళతానని సుందర్ చెప్పాడు. ఇంటి నుంచి నేరుగా అక్కడికి చేరుకోవాలని భార్యను కోరాడు. భార్య ఇంటి నుండి నేరుగా డిన్నర్‌కి వెళ్లాలి మరియు సుందర్ పిచాయ్ ఆఫీసు నుండి నేరుగా భోజనానికి చేరుకోవాలి.*


*రాత్రి 8 గంటలకు విందు కార్యక్రమం. సుందర్ పిచాయ్ భార్య అంజలి తన కారులో రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు భోజనానికి హోస్ట్ ఇంటికి చేరుకుంది. సుందర్ పిచాయ్ కూడా ఆఫీస్ నుండి బయల్దేరి  వెళ్లిపోయాడు, కానీ అతను మార్గమధ్యంలో దారి తప్పిపోయాడు. అతను  అక్కడికి చేరుకునేసరికి దాదాపు 10 గంటలైంది. అప్పటికే  పిచాయ్  భార్య అక్కడి నుంచి రాత్రి భోజనం చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు పిచాయ్‌ సాహిబ్‌ పరిస్థితి విషమంగా మారింది. కారణం, అమెరికన్లు సమయపాలన పాటించడం వల్ల విందు ఆచారాలన్నీ పూర్తయ్యాయి. సుందర్ పరిస్థితి విషమంగా అయింది.  అయితే హోస్ట్ పిచాయ్ రాకకు ఘన స్వాగతం పలికి గుడ్ బై చెప్పారు*


*అక్కడి నుంచి ఏమీ తినకుండానే సుందర్ పిచాయ్ తన ఇంటికి వెళ్లాడు. అతను ఇంటికి చేరుకోగానే భార్య అంజలి చిరాకుపడి అతనితో గొడవ పెట్టుకుంది, కారణం, అతను సమయానికి విందుకు  చేరుకోలేదు మరియు అతని భార్య అవమానించబడింది. అంజలి  మానసిక స్థితిని చూసిన సుందర్ పిచాయ్ మళ్లీ ఆఫీసుకు తిరిగి వెళ్ళడం  సముచితం అనుకున్నాడు. (భార్య కోపంతో ఇంట్లోకి రానివ్వలేదని కొందరు అంటున్నారు)*


*ఏమైనా సరే, ఇప్పుడు సుందర్ తిరిగి ఆఫీసుకు చేరుకున్నాడు మరియు రాత్రంతా అక్కడే గడిపాడు. రాత్రంతా ఇలాగే ఆలోచిస్తూనే ఉన్నాడు - నాలాగే   రోజూ చాలా మంది దారి తప్పి పోయే అవకాశం ఉంది.  అదే విషయం రాత్రంతా ఆలోచిస్తూ, మ్యాప్ జేబులో పెట్టుకుని, దిక్కు కరెక్టుగా ఉంటే తను దారి తప్పేవాడిని కాదని అనుకున్నాడు.*


*మరుసటి రోజు ఉదయం సుందర్ పిచాయ్ తన టీమ్ మొత్తానికి ఫోన్ చేసి మ్యాప్ తయారు చేయాలనే ఆలోచనను అందరి ముందు ఉంచాడు. ఈ ఆలోచన విన్న టీమ్ చేతులు ఎత్తేసింది. టీమ్ అతని ఆలోచనను నమ్మలేదు, కానీ దాదాపు రెండు రోజుల పాటు టీమ్‌తో నిరంతరం సమావేశాలు నిర్వహించి, ప్రజలకు మార్గం చూపే ఉత్పత్తి(App)ని రూపొందించమని వారిని ఒప్పించాడు.*


*సుందర్ పిచాయ్ మరియు అతని బృందం కష్టపడి 2005లో గూగుల్ మ్యాప్‌ని తయారు చేసి అమెరికాలో ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదే 2006లో ఇంగ్లండ్‌లో, 2008లో భారత్‌లో లాంచ్‌ చేశారు.. ఇప్పుడు వారు రూపొందించిన మ్యాప్‌లు యావత్ ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపే పని చేస్తున్నాయని ఇప్పటికే మీకు తెలుసు. ఒక స్టడీ  ప్రకారం, మొత్తం ప్రపంచంలోని ప్రతి ఏడవ వ్యక్తి Google Mapsని ఉపయోగిస్తున్నారు.*


*కథ పెద్దది ఉంది కదా! ఇది నిజంగా జరిగిన సంఘటన.* 


 *కాబట్టి కొన్నిసార్లు మీ భార్య మీపై కోపం తెచ్చుకోవచ్చు.  చింతించకండి. ఆ కోపంలో భవిష్యత్తులో ఏదో ఒక చారిత్రక ఆవిష్కరణ దాగి ఉందని ఎవరికి తెలుసు.*

👏👏👍👍🙏🙏💐💐

సుందర్ పిచైయ్ టెక్స్ట్ మెమరీ నుండి

*(న్యూస్ మీడియా)* .

లక్ష్మీదేవి చెట్టు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.* 

               🌷🌷🌷

అందుకే ఆ చెట్టుకు పండిన కాయను *‘శ్రీఫలము’* అని పిలుస్తారు. 


సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. ●


అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.●


మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి●●● దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. ●


మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. ●


ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.●


అందుకే 


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!


త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!


అని

తలుస్తాము.


దళములు దళములుగా ఉన్నవాటినే కోసి 

పూజ చేస్తారు. 


ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.


అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. 

అది మూడు, 

తొమ్మిది కూడా ఉంటాయి. ●


పుష్పములను 


పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. 


కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా 

ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. ◆


మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.●


అందులో 

మారేడు దళము ఒకటి.●


మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె 

శివలింగమునకు తగిలితే 

ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.◆


అందుకే 

ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, 

పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా●●●


మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. ●


శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.◆


‘బాల్యం, 

యౌవనం, 

కౌమారం 

ఈ మూడింటిని నీవు చూస్తావు’ 


అని ఆశీర్వదిస్తాడుట.◆


కాబట్టి 


ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. ◆


శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.●


మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే●●● జ్ఞానం సిద్ధిస్తుంది.


ఇంత శక్తి కలిగినది కాబట్టే 


దానికి "శ్రీసూక్తం"లో


‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’ 


(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక) 


అని 


చెప్తాము.


మనిషికి మూడు గుణములు, 

మూడు అవస్థలు ఉంటాయి.●

నాల్గవదానిలోకి వెళ్ళడు. 

నాల్గవది తురీయము.●


తురీయమే జ్ఞానావస్థ.◆


అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.◆


మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 


మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ●


ఇంట్లో మారేడు చెట్టు ఉంటె >>

ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా>> అపారమయిన సిద్ధి కలుగుతుంది.◆


యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు 

ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి >>పీట వేసి >>ఆయనను అక్కడ కూర్చోపెట్టి >>

భోజనం పెడితే >>

అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.◆


శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.●


మారేడు చెట్టు అంత గొప్పది.◆


మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.●


అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.◆


‘మా-రేడు’ 


తెలుగులో 

రాజు ప్రకృతి, 

రేడు వికృతి. ◆


మారేడు అంటే మా రాజు. ◆


ఆ చెట్టు పరిపాలకురాలు.●

అన్నిటినీ 

ఇవ్వగలదు.◆


ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.◆


అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.◆


ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా >>>

మారేడు 

పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. ●


అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.◆


అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా >>మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.●


అందులో

1●మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,


2● రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,


3● మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. ●


ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.◆◆◆


*సేకరణ: వాట్సాప్ పోస్ట్.*

భక్తకవి బమ్మెర పోతన*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

🚩 *భక్తకవి బమ్మెర పోతన* 🚩

                    🌷🌷🌷

♦️భోజనం వడ్డించమని

అడిగాడు పోతన

తన భార్యతో.


♦️ఆమె చోద్యంగా చూస్తూ

‘అదేమిటండీ!

ఇప్పుడే కదండీ

భోజనం చేసి వెళ్లారు.

మళ్లీ భోజనం అంటున్నారు?

మళ్లీ అప్పుడే ఆకలయిందా’

అని నవ్వుతూ అడిగింది

ఆ సాధ్వీమణి.


♦️దిగ్భ్రమ చెందాడు పోతన.

ఇదేమిటి?

ఈవిడ ఇలా చెబుతోంది

అని విస్మయంగా చూశాడు

భార్య వైపు.


♦️‘నేను భోంచేశానా?’

అని అడిగాడు.

‘అవును.

కూర్చుని ఒక పద్యం

కాబోలు వ్రాశారు.

ఆపైన నేను భోజనం

చేయమంటే చేశారు.

మీరు తిన్న తర్వాత

అలవాటు ప్రకారం,

నేను మీరు తిన్న

విస్తరిలోనే భోం చేశాను’ అంది.


♦️‘ఏదీ నువ్వు తిన్న విస్తరి?’

‘బైట తొట్లో వేశాను’

అంది ఇల్లాలు.

బయటికి వచ్చి

కుప్పతొట్లో చూశాడు.

అప్పుడే ఒక కుక్క

ఆ విస్తరిని నోటిలోకి

లాక్కుని దొరకకుండా

పరుగెత్తి పోయింది.


♦️ఇంట్లోకి వచ్చి కూర్చుని

తను వ్రాస్తున్న చోట

కూర్చుని చూశాడు.


అక్కడ ఒక త్రాటియాకుపైన-


♥️"అలవైకుంఠ పురంబులో

నగరిలో

నామూల సౌధంబు దాపల

మందార వనాంతరామృత

సరః ప్రాంతేందు

కాంతోపలోత్పల

పర్యంక

రమావినోదియగు

నాపన్న ప్రపన్నుండు

విహ్వల నాగేంద్రము

పాహిపాహి యన

కుయ్యాలించి సంరంభియై"


♦️మొసలితో

యుద్ధం చేస్తూ శక్తులుడిగి

చేష్టలు కోల్పోయిన

నాగేంద్రము (గజశ్రేష్ఠుడు)

ఈ జగత్తును ఎవరు

సృష్టించి పరిరక్షిస్తుంటారో

వారు కాపాడాలి అని


♥️‘ఎవ్వనిచే జనించు’

‘జగమెవ్వని లోపల

నుండు లీనమై’

అని అర్థిస్తుంది, ప్రార్థిస్తుంది,


అపుడు


♥️‘అల వైకుంఠ నగరంలో,

సౌధంలో మూలన

మందార వనామృత

సౌరభంలో

రమాదేవితో క్రీడిస్తున్న

ఆపద్బాంధవుడైన

శ్రీమహావిష్ణువుకు

ఆ గజేంద్రం యొక్క

మొర వినిపించి,

వెంటనే పూనుకుని

ఉన్నపళాన

ఆపద్రక్షకుడు

ఉపక్రమించినవాడై రక్షణకు!...


♦️దిగ్భ్రమతో

పోతన కళ్ల వెంట ఆనందభాష్పాలు! ఆనందాతిరేకం!


అంతలోనే దుఃఖాతిరేకం!

పరుగు పరుగున వచ్చి

దిగ్భ్రమతో నిశ్చేష్టుడయిన

భర్త పోతనను చూసి

కుదుపుతూ

‘స్వామీ స్వామీ!’

అని పిలిచింది

ఆ పతివ్రతామతల్లి.


♦️తేరుకుని ఆమె భుజంపై

తలవాల్చి మళ్లీ

అమిత రోదనకు గురయ్యాడు పోతన.


♦️కాసేపు అతడిని దుఃఖింపనిచ్చి,

ఆపైన ఓదారుస్తూ

‘ఏం జరిగింది నాథా!

ఎందుకంతగా

దుఃఖిస్తున్నారు’

అని అడిగింది ఇల్లాలు.


‘♦️శ్రీరామచంద్రుడు!

శ్రీరాముని దర్శనభాగ్యం పొందావు నువ్వు!

అనంత భాగ్యరాలివి!

ధన్యాత్మవు.

నాకా భాగ్యం కలుగలేదు’

అని చెపుతూ ఉన్నాడు పోతన.

ఏడుస్తూ ఉన్నాడు.


♦️‘అవునా స్వామీ!

నిజమా!

ఇంతక్రితం వచ్చి వ్రాసి,

భోజనం చేసి వెళ్లినవారు

సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన

శ్రీరామచంద్రమూర్తియా?


♦️అవును దేవీ!

ఇది శ్రీరాములవారు

తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం! విను’ అని

ఆ పద్యాన్ని వెక్కిళ్ల

మధ్యనే పాడుతూ,

చెపుతూ, ఏడుస్తూ

‘చూడు -

నువ్వు భగవంతుడి దర్శనం పొందావు -

వారు వ్రాస్తున్నది చూశావు,

నీ స్వహస్తాలతో

భోజనం పెట్టావు -

వారి స్పర్శనం పొందావు!

నాకేదీ ఆ భాగ్యం?

ఆ స్వామి తిన్న ఎంగిలాకును

ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా!’

అని మళ్లీ ఏడుస్తూ

తీవ్ర ఆవేదనకు గురయ్యాడు

పోతనామాత్యుడు.


♦️‘స్వామీ!

మీరు తీవ్రమైన దుఃఖంతో

ఆవేదన చెందుతున్నారు.

శ్రీరామచంద్రమూర్తి

మీ రూపంలో వచ్చి,

మీరు వ్రాసినట్లుగా వ్రాసి,

మీరు తిన్నట్లుగా తిని,

నాకు మహద్భాగ్యమైన అవకాశం ఇచ్చారు.

మీరే తానై స్వామివారు వస్తే,

మళ్లా మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తారేం?


♦️ఇంత గొప్ప

‘మహా భాగవత కావ్యాన్ని’ తెనిగిస్తున్న

మీ అపూర్వమైన

పాండిత్యం చూసి,

ఆనందం పట్టలేక,

మీ రచనలో

తానూ పాలుపంచుకోవాలని నిశ్చయించుకుని,

మీకు భ్రమ కలిగించి

బయటకు పంపి,

తాను మీ రూపంలో వచ్చి,

‘తనను గురించి తానే’

గొప్పగా వ్రాసుకున్నాడు.

ఇంత మహాభాగ్యులు మీరు.

మీరు తెనిగిస్తున్న

శ్రీ ‘మహాభాగవతం’ ఆచంద్రార్కం

ప్రసిద్ధ పొందుతుంది.


♦️మీ రాముడు

మీ లోపల ఆత్మారాముడై ఉన్నాడు.

దుఃఖం మాని,

ప్రశాంతంగా కూర్చుని ధ్యానమగ్నులుకండి!

మీకే అర్థం అవుతుంది’ అంది.


♦️వెంటనే

ధ్యానమగ్నులయ్యారు పోతనామాత్యులు.

తన ధ్యాసను

భ్రూమధ్యంలో నిలిపి,

తన ఉచ్ఛ్వాసనిశ్వాసలను

తదేకంగా గమనిస్తూ

అంతర్ముఖుడయాడు.


తన హృదయ కుహరంలో

కొలువైవున్న

ఆత్మారాముడిని చూసి

పరమానంద భరితుడయ్యాడు

‘రామదాసు’లాగా ! -


♥️శ్రీరామ జయరామ జయజయరామ !!


(ఈ కధ మనందరిలో

భక్తిని కలిగించాలని ప్రార్ధిస్తూ...) 


సేకరణ: వాట్సాప్ పోస్ట్. 


♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

శుద్ధ చైతన్య స్వరూపుడైన శ్రీమన్నారాయణ

 శ్లోకం:☝️

*నారాయణం నమస్యామి*

  *మోహాంధతిమిరాపహం l*

*ప్రకాశం ప్రకాశ్యానాం*

  *శుద్ధబుద్ధస్వరూపిణం ll*


భావం: అన్నిటికీ సాక్షి, అన్నిటినీ ప్రకాశింపచేసేవాడు, మోహమనే చిమ్మ చీకటిని దూరంచేసేవాడు, శుద్ధ చైతన్య స్వరూపుడైన శ్రీమన్నారాయణనికి నమస్కరించుచున్నాను.🙏

12 రోజుల లో 9జ్యోతిర్లింగాలను దర్శించుట

 సొంతంగా 12 రోజుల లో 9జ్యోతిర్లింగాలను దర్శించుట ఎలా?

ఓం నమో గణాధి పతయే నమః ఓం నమః శివాయ

ఈ క్రింద తెలిపిన ప్లాన్ వీలైనంత తక్కువ ఖర్చు తో జ్యోతిర్లింగ దర్శనం కోసం వ్రాయబడినది. శివ భక్తులకు సాయ పడుదామన్న ఆశ తో ఈ ప్లాన్ వ్రాసాను. ప్లాను లో వున్న రైళ్లు ప్రతి రోజు నడిచేవి. విరామం లేకుండా ప్రయాణం కొందరికి కష్టం. మీకు అనువైన ప్రయాణించే ప్లాన్ చేసుకోగలరు. మీకు అనువైనట్టు ప్లాన్ చేసుకుంటారని రైల్వే స్టేషన్ కోడ్స్ ని () లోపల వ్రాసాను. కొన్ని కొత్త స్పెషల్ రైళ్లు ఉండొచ్చు, ప్లాన్ చేసినప్పుడు చూసుకోగలరు. ఒక్కోసారి రైలు లేట్ కావొచ్చు అది కూడా అలోచించి ప్లాన్ చేసుకో గలరు. గుడి లో శివాష్టోత్తరం లేక మీకు అవసరమైన మంత్రాలు చదవండి, లేక శివ నామం స్మరించండి. అభిషేకం కొరకు రాగి లేదా వెండి పాత్ర తీసుకు వెళ్ళండి. ఈ ప్లాన్ గుడి లో ఉంటే ఇతర భక్తులకు కూడా ఉపయోగ పడును. దయ చేసి ఈ ప్లాన్ గుడి లో నే ఉంచ గలరు. నేను మీ వంటి ఒక శివ భక్తుడిని. నేను టూర్ ఆపరేటర్ ను కాను. ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి. శీఘ్రమేవ శివ దర్శన ప్రాప్తిరస్తు.

1వ రోజు: బేగంపేట్ (BMT) లో రాత్రి 9:00 కి ట్రైన్ # 57549 ఔరంగాబాడ్ పాసెంజర్ (ఈ రైలు లో స్లీపర్ క్లాస్ భోగిలు ఒకటి లేదా రెండు వున్నాయి) ఎక్కి మరుసటి రోజు పొద్దున్న 6:30 కి పర్లీ (PRLI) రైల్వే స్టేషన్ లో దిగండి. ఈ ట్రైన్ పాసెంజర్ కాబట్టి లేట్ కావొచ్చు. OR మీరు విజయవాడ (BZA) నుంచి యాత్ర ప్రారంభిస్తుంటే, ట్రైన్# 17206 కాకినాడ సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి లేదా ట్రైన్# 17208 విజయవాడ లో సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ పొద్దున్న10.30 కి ఎక్కి, పర్లీ (PRLI) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:05 కి దిగండి (ప్రయాణ సమయము 13 గంటలు). హైదరాబాద్ లో బయలుదేరు వారు 17206, 17208 రైళ్లు సికింద్రాబాద్ లో కూడా ఎక్కొచ్చు (ప్రయాణ సమయము7 గంటలు).

2వ రోజు: పర్లీ(PRLI) రైల్వే స్టేషన్ నుండి బైజనాథ్ గుడి 3KMs దూరం లో వుంది. స్టేషన్ బైట ఆటోలు దొరుకును. ఉదయం బైద్యనాథ్ జ్యోతిర్లింగ[1] దర్శనం చేసుకున్న పిమ్మట బస్సు లో పర్భానీ (PBN) (67KMs) రైల్వే స్టేషన్ కి 10:30 AM లోగ చేరుకొని ట్రైన్# 12715 స్చఖండ్ ఎక్ష్ప్రెస్స్ 10.37 AM ఎక్కండి లేదా ట్రైన్# 17618 తపోవన్ ఎక్ష్ప్రెస్స్ 11.17 AM కి ఎక్కండి. ఔరంగాబాద్ (AWB) రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 2:30 PM కి దిగి ఔరంగాబాద్ సెంట్రల్ బస్టాండ్ కి వెళ్ళండి (3 KMs) ఆటోలు కలవు. ఔరంగాబాద్ బస్టాండ్ లో గ్రిశ్నేశ్వర్ వెళ్లే బస్సు ఎక్కి గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించండి (30 KMs). గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగ గుడి దెగ్గర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి (ఇక్కడ నుంచి ఎల్లోరా గుహ లు1KM దూరం లో వుంది, ఈ గుహలను పూర్తి గా చూడాలంటే ఒక రోజు పడ్తుంది). గ్రిశ్నేశ్వర్ నుండి ఔరంగాబాద్ బస్సు స్టాండ్ కి చేరుకొండి.

3 వ రోజు: ఔరంగాబాద్ బస్సు స్టాండు లో నాశిక్ బస్సు ఎక్కండి. నాశిక్ బస్టాండ్ (దూరం 187 కిలోమీటర్లు) ప్రయాణ సమయం 5 గంటలు. నాశిక్ బస్సు స్టాండ్ లో త్రియంబక్ కి వెళ్లే బస్సు ఎక్కి (దూరం 30 కిలోమీటర్లు) త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం[3] దర్శించుకోండి (రాత్రి 9:00 PM వరకు గుడి తెరచి ఉంటుంది) దర్శనం తరువాత, గోదావరి ఆవిర్భవించిన క్షేత్రం దర్శించండి. గుడి దెగ్గర రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.

4 వ రోజు: పొద్దున్నే 06:00 AM బయలుదేరి నాశిక్ బస్సు స్టాండ్ చేరుకోండి. 07:00 గంటలకు నాశిక్ బస్సు స్టాండ్ లో మంచర్ వెళ్లే గవర్నమెంట్ బస్సు (ప్రైవేట్ బస్సు ఎక్కితే లేట్ అవుతుంది) ఎక్కి మంచర్ బస్సు స్టాండ్ లో 11:00 AM కి దిగండి (దూరం 150 KMs). మంచర్ బస్టాండ్ లో భీమా శంకర్ బస్సు ఎక్కి భీమశంకర్ (61KMs, 2hours) లో భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని [4] దర్శించుకొండి (బస్సు స్టాండ్ దెగ్గర లో నే గుడి వున్నది). మధ్యాహ్నం 2:00 PM కి భీమశంకర్ బస్టాండ్ లో పూణే బస్సు ఎక్కి పూణే (PUNE) రైల్వే స్టేషన్ కి చేరుకొండి (110 KMs, 3 hours). రాత్రి7:50PM కి ట్రైన్# 11090 పూణే భగత్ కి కోతి ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి. ఒక వేళారోజు గురువారం ఐతే డైరెక్ట్ సోమనాథ్ ట్రైన్ రాత్రి 7:50 PM ట్రైన్# 11088 పూణే వెరావల్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.

5 వ రోజు: అహ్మదాబాద్ (ADI) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న7:45AM కి దిగి ట్రైన్# 11464 జబల్పూర్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 8:15AM కి లేదా ట్రైన్#19119 అహ్మదాబాద్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 10:40 AMఎక్కి వెరావల్(VRL) రైల్వే స్టేషన్ లో సాయంత్రం5:35PM కి లేదా 7:30PM కి దిగండి. అక్కడ బల్క తీర్థ్ దర్శించి, ప్రభాస్ తీర్థ్ త్రివేణి సంగమం లో స్నానం చేసి సోమనాథ్ జ్యోతిర్లింగ[5] దర్శనం చేసుకుని ట్రైన్# 19251 సోమనాథ్ ఒక ఎక్ష్ప్రెస్స్ వెరావల్ లో రాత్రి 11:10 కి ఎక్కండి.

6 వ రోజు: ద్వారకా (DWK) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:10 AM కి దిగి, ద్వారకాధీశ్ దర్శనం, నాగేశ్వర జ్యోతిర్లింగ [6] దర్శనం చేసుకుని ట్రైన్# 19006 (సౌరాష్ట్ర మెయిల్) మధ్యాహ్నం 1:00 PM కి ద్వారకా స్టేషన్ లో ఎక్కండి. {(optional) లేదా ఒక రోజు ద్వారకా లో నే ఉండి ద్వారకాధీశ్ గుడి, ఆది శంకరాచార్య మఠం, భేట ద్వారకా, భద్కేశ్వర్ మహాదేవ్ గుడి, గోపి తలాబ్, గోమతి నది దర్శించండి.}

7 వ రోజు: వడోదర(BRC) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:48 AM కి దిగి, ట్రైన్# 12961 అవంతిక ఎక్ష్ప్రెస్స్ రాత్రి 1:10 AM కి ఎక్కండి. ఈ రెండు రైళ్ళకి కి మధ్య సమయం ఇంచు మించు 20 నిముషాలు. రైలు దొరకదు అనుకుంటే మీరు వెళ్లే రోజు వున్న వీక్లీ రైలు లేదా స్పెషల్ రైలు చూసుకోండి లేదా వడోదర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి. మరుసటి రోజు రాత్రి 9:50 PM కి ట్రైన్# 19309 GNC ఇండోర్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.

8-9 వ రోజు: ఉజ్జయిని (UJN) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 4:00 AM కి దిగి బడే గణేష్ జి కా మందిర్ ఎదురుగా వున్న సత్రం లో రూమ్ తీస్కోండి. శిప్రా నది లో స్నానం చేసి మహాకాళేశ్వర జ్యోతిర్లింగ[7] దర్శనం చేస్కోండి. సత్రం లో రూమ్, హాల్, డార్మిటరీ + ఉచిత భోజనం (సత్రం లో వున్న వారికి మాత్రమే) ఉంటుంది. ఉజ్జయిని లో మహాకాళేశ్వరునికి భస్మ హారతి చూడ దలిచిన వారు పొద్దున్న 10:00 AM కి టెంపుల్ కౌంటర్ లో మీ ఫోటో ID కార్డు గ్జిరోస్ కాపీ ఇస్తే రేపు పొద్దున్న 4:00 AM కి జరగబోయే భస్మ హారతి కి పెర్మిషనిస్తారు. ఆన్లైన్ బుకింగ్ నెల రోజుల ముందు చేసుకోవాలి. ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడి దెగ్గర ఉజ్జయిని దర్శన్ బస్సెక్కండి (టికెట్ వెల ఇంచుమించు 50 రూపాయలు) రెండు ట్రిప్పులు పొద్దున్న ఇంచుమించు 8:00 AM కి మధ్యాహ్నం ఇంచుమించు 2:00 PM కి మొదలవుతుంది, అది ఎక్కితే స్థానికంగా వున్న గుళ్లను చూడవొచ్చు. భర్తృహరి గుహలు, సాందీపని ఆశ్రమం శ్రీకృష్ణ పరమాత్ముడు విద్యనభ్యసించిన ఆశ్రమం, శక్తిపీఠం (అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి) ఆటో వాడు చాలా తీసుకుంటాడు. తరువాత ఓంకారేశ్వర (135 kms) బస్సుఎక్కి, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ[8] దర్శనం చేసుకోండి. పక్కనే వున్న స్వామి గజానన ఆశ్రమం లో రూమ్ తీసుకోండి. స్వామి గజానన ఆశ్రమం లోవిశాల మైన రూంలు చాలా తక్కువ ధరకి దొరుకుతాయి + చాలా నీట్ గా ఉంటాయి + ఆశ్రమం లో వున్న వారికీ ఉచితంగా భోజనం పెడతారు లేదా ఐదు రూపాయలు తీసుకుంటారు ముందే టోకెన్ తీసుకోవాలి.

10 వ రోజు: పొద్దున్నే నర్మదా నది లో స్నానం చేసి మళ్ళి వీలయితే ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి ఖండ్వా (70KMs) బస్సు ఎక్కి ఖండ్వా (KNW) రైల్వే స్టేషన్ కి ప్రొద్దున్న 10:00 AM లోపల చేరుకొండి. అక్కడ ట్రైన్# 11093 మహానగర ఎక్ష్ప్రెస్స్ లేదా ట్రైన్# 12167 లోకమాన్య తిలక్ టెర్మినస్ వారణాసి సూపర్ ఎక్ష్ప్రెస్స్ ప్రొద్దున్న 10:00AM కి ఎక్కండి.

11 వ రోజు: వారణాసి (కాశి) (BSB) రైల్వే స్టేషన్ కి పొద్దున్న 3:45 AM కి చేరుకొండి. కాశి లో గోదోలియా చౌక్ దెగ్గర రూమ్ లేదా డార్మిటరీ తీస్కొని ఫ్రెష్ ఐ కాశి విశ్వేశ్వర జ్యోతిర్లింగ[9] దర్శనం చేసుకోండి, తరువాత కాశి విశాలాక్షి శక్తిపీఠ దర్శనం చేసుకోండి, తరువాత తిల్ బండేశ్వర్ శివ లింగాన్ని (బెంగాలీ తొల దెగ్గర వుంది) దర్శించుకోండి. తిల్ బండేశ్వర్ శివలింగం సంవత్సరానికి ఒక నువ్వుల గింజంత పెరుగుతుంది, ఇక్కడ తెలుగు పూజారి వుంటారు(ఈ శివ లింగాన్ని దర్శించిన వారు కాశీ లో అన్ని శివ లింగాలు దర్శించినట్టే). వారాహి మాత ఆలయం పొద్దున్న ఎనిమిది వరకే తెరచి ఉంటుంది. మృత్యుమ్ జయ మహాదేవ్ గుడికి వెళ్లి అక్కడ బావి లో నీరు తాగండి. కాల భైరవుని కూడా దర్శించుకోండి. ముఖ్యమైనది మధ్యాహ్నం 12:00 నుంచి 12:10 వరకు మణికర్ణికా ఘాట్ లో సంకల్పం చెప్పుకుని స్నానం చెయ్యాలి. ఆ సమయం లో స్నానం చేస్తే లోకం లో వున్న సకల నదులలో స్నానం చేసిన దాని కంటే ఉత్తమం (చాగంటి కోటేశ్వర్ రావు గారి ప్రవచనం). రామేశ్వరం లోని శివ లింగానికి అభిషేకం కొరకు వేరుగా ఒక పాత్ర లో గంగ జలం తీసుకో గలరు. కాశి అన్నపూర్ణ మాత మందిరం లో ఉచిత భోజనానికి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుని రుచికరమైన తెలుగు భోజనం చేయగలరు. అదే టోకెన్తో (టోకెన్ లేకుండా కూడా అన్నం వడ్డిస్తారు టోకెన్ తప్పని సరి కాదు) భోజనం రెండు బిల్డింగులు లో పెడతారు ఒకటి గుడి దెగ్గర (లైన్ ఉండొచ్చు) ఇంకొకటి గుడి గేట్ నెంబర్ (ఏమిటో గుర్తులేదు కనుక్కోగలరు) దెగ్గర లైన్ ఉండదు. మీకు ఇష్టమైతే వారికి అన్నదానానికి కొంత నగదు ఇవ్వగలరు (ఎవ్వరు అడగరు మీ ఇష్టం). కాశి లో అన్నదానం చేయడం అదృష్టం. మీరు ఒకరి భోజనానికి సరిపోయే నగదు కూడా ఇవ్వొచ్చు. కాశి లో ఒకరికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం ఉంటుంది (చాగంటి కోటేశ్వరావు గారి ప్రవచనం). సాయంత్రం 5:00 PM కి సికింద్రాబాద్ (SC) రైల్వే స్టేషన్ వెళ్ళుటకు ట్రైన్# 12792 సికింద్రాబాద్ ఎక్ష్ప్రెస్స్ వారణాసి రైల్వే స్టేషన్ ఎక్కండి లేదా విజయవాడ వెళ్ళుటకు ట్రైన్# 12296 సంఘ మిత్ర ఎక్ష్ప్రెస్స్ ముఘల్ సారాయి (MGS) రైల్వే స్టేషన్ లో రాత్రి 11:27 PM కి ఎక్కండి. మీరు ప్రయాగ లో స్నానం చేయ్యాలంటే వారణాసి నుండి ప్రయాగ (రైలు లో ప్రయాణ సమయం 3:30 గంటలు) ముందుగా వేరే రైలు లో చేరుకొని అలాహాబాద్ రైల్వే స్టేషన్(ALD) (ప్రయాగ) లో స్నానం చేసి రాత్రి 8:40 PM కి హైదరాబాద్ వెళ్లే అదే రైలు 12792 సికింద్రాబాద్ ఎక్ష్ప్రెస్స్ అలాహాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్కండి.

12 వ రోజు: సికింద్రాబాద్ కి రాత్రి 10:00 PM కి చేరుకొండి లేదా విజయవాడ కి ప్రొద్దున్న 6:05 AM కి చేరుకొండి.