*సప్త వ్యసనాలు అంటే ఏమిటి?*
ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు.
ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే
*1.పరస్త్రీ వ్యామోహం – ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.
*2.జూదం .. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో)
*3.మద్యపానం – పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. (పురాతన కధలు అందరికీ వివరంగా తెలియక పోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు నేనూ ఇప్పుడు తెలుసుకోవాలి) నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే.
*4. వేట -- పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీ రామచంద్రుడికి దూరమయి రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. (ఇదివరకంటే కృర మృగాల (kroora - inscript లో ఎలా టైప్ చెయ్యాలో రాలేదు నాకు) బారినుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. ఈ రోజుల్లో మాత్రం ఇది , స్ధితి పరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా).ఆదిత్యయోగీ..
*5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం -- దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్దితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. (పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు...ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని....)
*6.కఠినంగా దండించటం -- దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.
ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది. (ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు).
*7.ఆఖరిది డబ్బు. కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి.
మంచీ చెడూ తెలుసుకుని మనుగడ సాగించటమే మనిషి జన్మకి సార్ధకత...
.
మనని మరొకరు మన్నించడం, క్షమించడం కాదు. 'ఎవరికి వారు ఆత్మ పరిశీలనతో తన తప్పును గ్రహించి, పశ్చాత్తాపంతో తనకు తానే మానసికంగా శిక్ష విధించుకుని, నూతన జీవితాన్ని ఆశ్రయించాలి. మనసే మన 'కర్మ'లకు మొదటి సాక్షి!'..
.
*భగవంతునికి - భక్తులు - అనే అర్హత ఎప్పుడు పొందగలము?*
భగవంతుని గుర్తించి మనము స్వీకరిస్తే ఆయన ఉంటాడు, కనబడుతాడు...
ఆయనను తిరస్కరిస్తే ఆయన ఉండడు, కాక కనబడడు కూడా....
హిరణ్యకశిపుడు హరి ఎక్కడా లేడన్నాడు, కనుక ఎక్కడా కనబడలేదు, అతనికి...
అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు విశ్వసించాడు...
కాబట్టి స్తంభము నుండి వెలిసి, ప్రహ్లాదుని విశ్వాసం సత్యమని నిరూపించాడు...
అంతే కానీ, హిరణ్య కశిపుని సవాలు ఎదుర్కోవడం కోసమని స్తంభములో ప్రవేశించడం కాదు...
అన్నిటా, అంతటా నిండి ఉన్నట్లే, ఆ స్తంభములో కూడా ఆయన ఎప్పుడూ ఉన్నాడు...
ఆ క్షణంలో తన ఉనికి ప్రదర్శించాడు, అంతే!...
సాధు సత్పురుషులు, మహర్షులు, ఆర్తితో ప్రార్ధించినపుడు, భగవంతుడు అవతరిస్తాడు...
*ఆయన కర్తవ్యాలు మూడు...!!!*
వేద రక్షణ,
ధర్మ రక్షణ,
భక్త రక్షణ...
నిశ్చలమైన విశ్వాసము, నిర్భయం, నిరహంకారం, సద్గుణం, ఇవి లేకుండా, ఆడంబరంగా పూజ చేస్తే, వ్యర్థమే... కాలము, శక్తీ, అన్నీ వృధా అవుతాయి...
ఇలాంటి సందర్భంలో మనము పవిత్ర గ్రంధాల నుండీ, పురాణముల నుండి, ఉపనిషత్తులనుండి, ప్రసంగాల నుండీ మనము పొందుతున్న లాభమేమిటి?...
వీటి మూలంగా మనమైనా బాగు పడ్డామా? లేక చదివితేనే పుణ్యము వస్తుంది, అనుకొంటే మనకన్నా ముందు టేబురికార్డులకు, మన సెల్లులకు ముందుగా పుణ్యం వస్తుంది, అవి నిత్యం పటిస్తున్నాయి కాబట్టి...
భగవంతుని దర్శన భాగ్యం పొందిన మనము ఎంతవరకు పురోగమించాము?
దర్శనమాత్రమునే పుణ్యము వస్తుంది, మోక్షానికి అర్హత వస్తుంది అనుకుంటే, మనకన్నా ముందు, నిత్యం ఆయన కోవెలలో ఉన్న చీమలకు, దోమలకు, కీటకాలకు వస్తుంది...
ఎందుకనగా అవి నిత్యం ఆయనను అంటిపెట్టుకుని ఉంటున్నాయి కాబట్టి...ఆదిత్యయోగీ..
ఆయన దగ్గర నుంచి పారమార్థిక జీవిత రహస్యం , తెలుసుకున్న దానికి నిదర్శనంగా మన జీవన సరళిలో ఏదైనా మంచి మార్పు కన పడాలి...
మనలోనుండి మధుర భాషణం, విజయ, పరాజయాలకు పొంగని, కృంగని ఆత్మ నిగ్రహం మనము ప్రదర్శించాలి...
ఇవన్నీ మన భక్తికి సంకేతాలు, లేశమైన అహంభావము లేకుండా, భగవంతుని శరణాగతి పొందాలి...
అప్పుడే మనము భక్తులు అని పించుకోగల అర్హత పొంద గలుగుతాము...
.
ప్రత్యయస్య పరచిత్త జ్ఞానమ్
ఇదే విధంగా సంయమం ద్వారా పరుల చిత్తమును అతీత జ్ఞానముతో పరిశీలించిన యోగికి పరుల చిత్త జ్ఞానము కూడా లభిస్తుంది. ప్రతి మనిషి ప్రవర్తన అతడి చిత్తముపై ఆధారపడి వుంటుంది.
ఒక మనిషి లాగా మరొకమనిషి ప్రవర్తించకపోవడానికి అతడి మనస్సులో పుట్టే
ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలనుబట్టే అతడి తీరు. ప్రవర్తన చర్యలు జరుగుతుంటాయి. ఇవి ఒక మనిషిని పోలి మరొక మనిషికి ఎప్పుడూ వుండవు. ఇందుచేతనే అనేక కోట్ల
మందిలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా గుర్తించ బడతారు.
ఈ చిత్త ప్రవృత్తులు ఆ వ్యక్తి ముఖ భావాలు, చూపులు, హావభావాల ద్వారా బహిర్గత మవుతుంటాయి. మనం ఒక మనిషిని చూస్తూనే అతడుచాలాకోపంగా వున్నాడని గ్రహించగలుగుతాము. అలాగే మరొకడి ముఖాన్ని బట్టి అతడు సంతోషంగా వున్నాడనో, దుఖ్కంతో వున్నాడనో గ్రహించగలుగుతాము.
మనకి ఇలాంటి గ్రహింపుకి కారణం ఆయా వ్యక్తుల హావభావాలు. ఈ హావభావాలనేవి
చిత్తములోని ఆలోచనలకి ప్రతిబింబాలుగా ప్రదర్శించబడుతాయి.ఆదిత్యయోగీ..
కనుక ఈ హావభావాలని బట్టి అతడి చిత్తములో ఎలాంటి భావాలు నెలకొని వున్నాయో సులభంగా గ్రహించగలము.అయితే మరికొందరుంటారు. వారి చిత్తములో ఎలాంటి సంఘర్షణలు జరుగుతున్నా హావభావాల ద్వారా బయటపడకుండా జాగ్రత్తపడతారు. నిండు కుండ తొణకదంటారే, అట్లా! అయినప్పటికే అలాంటి వారిని పలకరించినప్పుడు 'నాకేం. నేను బాగానే వున్నా' నంటూనే అప్రయత్నంగా సూక్ష్మంగా తమ హావభావాల ద్వారా చిత్త వృత్తిని ప్రదర్శిస్తారు. అప్పుడు మనం 'అతడలా అంటున్నాడు గానీ, మనస్సులో ఏదో వుంది' అనుకుంటాము. దీనినే చిత్తవృత్తి అంటారు.
సమాధి స్థితి పొందిన యోగికి సాధనకి పూర్వము నుండి తన చిత్త వృత్తుల తీరు స్వానుభవమే. అతడు యోగాభ్యాస సాధన ద్వారా చిత్త వృత్తులను వరుసగా జయిస్తూ సమాధి స్థితి పొందుతాడు.
అంటే అనేక భావాలకి ఆలవాలమైన తన చిత్తమును తన వశం చేసుకుంటాడు. అట్టి అనుభవజ్ఞానం తనకి వుండటం చేత, ఎట్టి కోరికలూ, వృత్తులూ లేక శూన్యంగా వున్న తన చిత్తమును పరచిత్తముతో సంయమం చేస్తాడు.
అంటే ఇతరులచిత్త స్థితిగతులను శూన్యంగావున్న తన చిత్తముద్వారావశం చేసుకున్నప్పుడు ఇతరులచిత్తము ఎలావుంది? అప్పుడే విషయం ఆలోచిస్తోంది? అది ప్రశాంతంగా వుందా? అలజడత్వస్థితిలో ఉందా? మట్టిముద్దలావుందా? అనేకసంఘర్షణలతో సతమతమవుతోందా?' అనేవిషయాలు తనకి లభించిన అతీంద్రియ జ్ఞానం ద్వారా తెల్సుకోగలుగుతాడు...
అయితే, ఈ పరచిత్త జ్ఞానము పరుల చిత్తము యొక్క స్థితి గతులను మాత్రమే గ్రహించగలదు.
అంటే ఆ వ్యక్తి చిత్తము సంతోషంగా వుందా? దుఃఖ్క పూరితమై వుందా? ఏదైనా సంఘర్షణలతో బాధింపబడుతోందా? లేక ఆలోచనారహితంగా జడత్వంలా వుందా? ఇలా ఆ వ్యక్తిచిత్తముఏస్వరూపాన్నిధరించివున్నదోమాత్రమేటయోగిచిత్తము గ్రహించగలుగుతుంది.
అంతేగానీ ఆ వ్యక్తి సంతోషము లేదా దుఃఖ్కమునకు కారణం ఏమిటో, ఆ చిత్తము ఏ విషయం గురించి ఆలోచించడం వల్ల అలాంటి చిత్త స్వరూపం కలిగిందో ఆ విషయం లేదా ఆ వస్తువు ఏమైవుంటుందో, దాన్ని గ్రహించే జ్ఞానం కలగదు. ఆ చింతన ఆ వ్యక్తికి మాత్రమే స్వంతం.
కేవలం ఆ వ్యక్తి చిత్తములో కలిగిన భావ స్వరూపాన్ని మాత్రమే యోగి చిత్త జ్ఞానము గ్రహించగలుగుతుంది.అనగా యోగి చిత్తమునకు వశమైనది ఆ వ్యక్తి చిత్తమే గానీ, ఆ చిత్త క్షోభకి కారణమైన విషయవస్తువు కాదు. కనుక ఆ వ్యక్తి చిత్తము యొక్క స్థితి గతి ఏవిధంగా వున్నదోనని మాత్రమే యోగి చిత్తము గ్రహించగలుగుతుంది..*
.