2, అక్టోబర్ 2021, శనివారం

విమర్శలు సహజం:-

 -:విమర్శలు సహజం:-

మనం పది మంది లో మాట్లాడాలంటే సహజంగానే భయపడతాం. మన అభిప్రాయాలు తప్పైతే నగుబాటు పాలవుతామని ఒక భయం మనను నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఐతే మనం బిడియం వలననో, భయం వలననో మన మనసులో ఉన్న మాట చెప్పలేక పోవడం, అదే విషయం ఇతరులు చెప్పినపుడు వారికి అభినందనలు రావడంతో మనం అయ్యో ఈ విషయం నేనే చెప్పి ఉంటే ఆ అభినందనలు నాకే వచ్చేవి కదా అని ఫీల్ కావడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.

అందుకే,

👉🏿 ఎవరో ఏదో అంటారని మీ అభిప్రాయాలను చెప్పకుండా ఆపవద్దు.

👉🏿 మీరు మాట్లాడాలని అనుకున్న విషయాన్ని ఇతరులను కించపరిచేది, నష్టపరిచేది ఐతే తప్ప నిర్భయంగా మాట్లాడండి.

👉🏿 ప్రతీ పనిని అందరూ అభినందించాలని అనుకోవద్దు.

👉🏿సద్విమర్శలను స్వీకరించాలి.లోపాలను సరిదిద్దుకోవాలి.

👉🏿దుర్విమర్షలను వదిలి వేయాలి.

👉🏿 మిమ్మల్ని ఒకరు విమర్శిస్తున్నారంటే మిమ్మల్ని వారు గుర్తించినట్లే. అందుకే వారు మీకు సమయం కేటాయిస్తున్నారు.

👉🏿 ఇతరుల విమర్శలకు మీరు భయపడితే మీరు గుంపులో ఒకరిగా మిగిలిపోవడానికి సిద్ధ పడ్డట్లే.

   అందుకే విమర్శలకు భయపడకుండా ముందుకు సాగిపో.

భారత మాజీ ప్రధాని నిజాయితీ.

 కంట నీరు తెప్పించే సాక్షాత్ భారత మాజీ ప్రధాని నిజాయితీ.


లాల్‌బహదూర్‌ శాస్ర్తీ దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు.

కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్ర్తీగారు) మీద వొత్తిడి చేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులు చేసి ఒక ఫియట్‌కారు కొన్నారు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శ్రీ శాస్ర్తీగారు మరణించారు.

ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట.

దేశవ్యాప్తంగా శాస్ర్తీగారి అభిమానులు,ఆయన భార్య శ్రీమతి లలితాశాస్ర్తీగారికి మనీఆర్డర్ చేశారట,రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట.

మరో సందర్భంలో, లాల్‌బహదూర్‌శాస్ర్తీ ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణశాస్ర్తీ అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవారు,

ఆ సంస్థవారు హరికృష్ణశాస్ర్తీకి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్ర్తీ మరుసటిరోజు, లాల్‌బహదూర్‌శాస్ర్తీగారికి ఈ విషయం తెలిపారు,

ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేను ఊహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయం చేయండని నా దగ్గరకు వస్తారు, నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దానిని ఎలా అర్ధం చేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు.

పాలకుల యొక్క నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి, నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి వీలు లేదు’’ అన్నారట.

అటువంటి వ్యక్తిత్వాన్ని నేటి వ్యవస్థలో చూస్తామా ?

దేశ ప్రధాని కాకముందు లాల్‌బహదూర్‌శాస్ర్తీగారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచారు, దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీఅయ్యారు, అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు, శాస్ర్తీగారు వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్ర్తీ’గారికి సొంత ఇల్లులేదు కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు,శాస్ర్తీగారికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు.

ఆ విషయాన్ని శాస్ర్తీగారి భార్య లలితా శాస్ర్తీగారితో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్ళకు ‘స్వంత ఇల్లు’ అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట.

రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్ర్తీగారికి ఈ విషయం తెలిసింది, ఆయన చాలా బాధపడ్డారు.

తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు, మనం ప్రజాప్రతినిధులం, ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం, నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను, మీరుకూడా వాపసు ఇచ్చేయండి లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి’’అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట.

జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు. దేశ ప్రధాని ఐన లాల్‌బహదూర్‌శాస్ర్తీ

ఇలాంటి వ్యక్తిత్వాలే జాతిని నిర్మించేది. TODAY HIS BIRTHDAY, Happy birthday 

✍......

Source :Google

 




For two hours every morning and evening, both the platforms 1 and 2 of the railway station turn into a #coaching class for young people who are aspirants for the #civil services: The Indian Administrative Service, the state civil service, multiple bank examinations, even entry to the IITs and IIMs. It all began in 2002-03 when a small group of students started coming to Sasaram railway station to study. Now the Sasaram railway station study groups have become an institution. Senior students — both those who have been successful and those who have not — come to the station to coach younger boys in what has become a ritual over the years. 

The reason is : Sasaram station has electricity 24X7. And the power never goes. Mostly, the boys are from Rohtas, the district in Bihar that is hit by Left wing insurgency. In many villages, either there is no power or the electricity is only intermittent. These boys see a government job as the end of their struggles and take advantage of the well lit station to sit under the light

సంస్కృత మహాభాగవతం

 *2.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదియవ అధ్యాయము*


*లౌకిక - పారలౌకిక సౌఖ్యములన్నియును నిస్సారములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*10.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*యద్యధర్మరతః సంగాదసతాం వాజితేంద్రియః|*


*కామాత్మా కృపణో లుబ్ధః స్త్రైణో భూతవిహింసకః॥12603॥*


 *10.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*పశూనవిధినాఽఽలభ్య ప్రేతభూతగణాన్ యజన్|*


*నరకానవశో జంతుర్గత్వా యాత్యుల్బణం తమః॥12604॥*


మానవుడు దుష్టసాంగత్యము చేత అధర్మనిరతుడై, ఇంద్రియసుఖములకు వశుడై విశృంఖలముగా ప్రవర్తించును. ధనాశాపరుడై, లుబ్ధుడు, స్త్రీలోలుడు ఐన అతడు దుష్టజనుల ప్రోద్బలముచే విచక్షణ లేకుండా పశువులను హింసించుచుండును. భూతప్రేతములను ఉపాసించును. తాను చేసిన దుష్కర్మల ఫలితముగా ఘోరాంధకారమయమైన నరకమున ప్రవేశించును.


 *10.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*కర్మాణి దుఃఖోదర్కాణి కుర్వన్ దేహేన తైః పునః|*


*దేహమాభజతే తత్ర కిం సుఖం మర్త్యధర్మిణః॥12605॥*


సకామకర్మలఫలము దుఃఖమే. దేహాత్మభావముగల జీవుడు అహంకారమమకారములలో తగుల్కొని, దుఃఖకారకములైన కర్మలను పదేపదే ఆచరించుచు మరల దేహమును (జన్మము) పొందుచుండును. అట్లు జననమరణ చక్రములో పరిభ్రమించుచుండువానికి (మరణశీలునకు) ఇంక సుఖమెక్కడిది?


 *10.30 (ముప్పదియవ శ్లోకము)*


*లోకానాం లోకపాలానాం మద్భయం కల్పజీవినామ్|*


*బ్రహ్మణోఽపి భయం మత్తో ద్విపరార్ధపరాయుషః॥12606॥*


లోకములయొక్క లోకపాలురయొక్క ఆయుఃప్రమాణము కేవలము ఒక కల్పమువరకే పరిమితమైయుండును. వారును నాకు భయపడుచుందురు. బ్రహ్మయొక్క ఆయుఃప్రమాణము రెండుపరార్ధముల వరకే యుండును. అంత దీర్ఘాయువు గల ఆ బ్రహ్మదేవుడుగూడ నాకు భయపడు చుండును. ఇక సామాన్యమానవుల విషయము చెప్పనేల?


 *10.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*గుణాః సృజంతి కర్మాణి గుణోఽనుసృజతే గుణాన్|*


*జీవస్తు గుణసంయుక్తో భుంక్తే కర్మఫలాన్యసౌ॥12607॥*


 *10.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యావత్స్యాద్గుణవైషమ్యం తావన్నానాత్వమాత్మనః|*


*నానాత్వమాత్మనో యావత్పారతంత్ర్యం తదైవ హి॥12608॥*


సత్త్వరజస్తమోగుణములు ఇంద్రియములను కర్మలయందు ప్రేరేపించును.ఇంద్రియములు కర్మలను ఆచరించును. జీవుడు అజ్ఞానవశమున సత్త్వాది గుణములను, ఇంద్రియములను తన స్వరూపములుగా భావించును. తద్ద్వారా ఆ కర్మలతో సంబంధము ఏర్పడుటవలన సుఖదుఃఖములను అనుభవించును. గుణవైషమ్యము ఉన్నంతవఱకు (అనగా శరీరాదులయందు 'నేను, నాది' అను అభిమానము ఉన్నంత వఱకు) ఆత్మయొక్క ఏకత్వము అనుభవమునకు రాదు. నానాత్వభ్రమ తొలగిపోదు. అజ్ఞానమూలకమైన ఈ భ్రమ నివృత్తికానంతవరకు జీవుడు పరతంత్రుడే యగును.


 *10.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*యావదస్యాస్వతంత్రత్వం తావదీశ్వరతో భయమ్|*


*య ఏతత్సముపాసీరంస్తే ముహ్యంతి శుచార్పితాః॥12609॥*


జీవుడు ఈ విధముగా పరతంత్రుడుగా ఉన్నంతవరకు పరమేశ్వరుడనైన నా వలన భయము ఉండియే తీరును. లేశమాత్రసుఖముగా కన్పించు అధికమైన సంసారభయమును నేను కల్పించుచునే యుందును. ఇట్లు గుణప్రేరితములైన కర్మలయందు నిరతుడగుటవలన జీవునకు శోకమోహములు ప్రాప్తించుచునేయుండును.


 *10.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*కాల ఆత్మాగమో లోకః స్వభావో ధర్మ ఏవ చ|*


*ఇతి మాం బహుధా ప్రాహుర్గుణవ్యతికరే సతి॥12610॥*


ఉద్ధవా! మాయకు సంబంధించిన త్రిగుణములయందు సంక్షోభము ఏర్పడినప్పుడు వ్యావహారికముగా అది అనేక రూపములలో భాసిల్లును. కాలము, జీవుడు, వేదములు, లోకము, స్వభావము, ధర్మము - ఇవి అన్నియును నా స్వరూపములే. వీటియందు నానాత్వభావమును కలిగియుండక వీటిని అన్నింటిని నా రూపములుగనే చూడవలెను.


*ఉద్ధవ ఉవాచ*


 *10.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*గుణేషు వర్తమానోఽపి దేహజేష్వనపావృతః|*


*గుణైర్న బధ్యతే దేహీ బధ్యతే వా కథం విభో॥12611॥*


*ఉద్ధవుడు పలికెను* ప్రభూ! ఈ జీవుడు దేహమునుండి ఏర్పడిన త్రిగుణములయందు ఉన్నప్పటికిని అతడు వాటినుండి ముక్తుడై జీవనమును ఎట్లు కొనసాగింపగలడు? గుణములచే బాధితుడు కాకుండ ఎట్లుండును? గుణములచే బద్ధుడు ఐనవాడు ఎట్లుండును?


 *10.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*కథం వర్తేత విహరేత్కైర్వా జ్ఞాయేత లక్షణైః|*


*కిం భుంజీతోఽత విసృజేచ్ఛయీతాసీత యాతి వా॥12612॥*


బద్ధుడు లేక ముక్తుడు ఐన పురుషుడు ఎట్లు ప్రవర్తించును? ఎట్లు సంచరించును? ఏ లక్షణములను బట్టి అతనిని గుర్తింపవచ్చును? అతడు ఎట్లు భుజించును? మలమూత్రాదులను ఎట్లు త్యజించును? ఎట్లు శయనించును? ఎట్లు కూర్చుండును? ఎట్లు నడచును?


 *10.37 (ముప్పది ఏ శ్లోకము)*


*ఏతదచ్యుత మే బ్రూహి ప్రశ్నం ప్రశ్నవిదాం వర|*


*నిత్యముక్తో నిత్యబద్ధః ఏక ఏవేతి మే భ్రమః॥12613॥*


అచ్యుతా! ఈ ప్రశ్నల ఆంతర్యమును ఎరిగిన సమర్థుడవు నీవు. ఒకే ఆత్మ నిత్యబద్ధమెట్లగును? నిత్యముక్తమెట్లగును? ఈ విషయమున నేను భ్రమపడుచున్నాను. కావున వీటిని విశదపరచి నా భ్రమను తొలగింపుము.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే దశమోఽధ్యాయః (10)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *లౌకిక - పారలౌకిక సుఖములన్నియును నిస్సారములు* అను పదియవ అధ్యాయము (10)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*429వ నామ మంత్రము* 2.10.2021


*ఓం నిస్సీమ మహిమ్నే నమః*


*ఓం నిస్సీమ మహిమాయై నమః* (అనికూడా అనవచ్చును)


హద్దులులేని అనంతమైన మహిమ గలిగిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిస్సీమమహిమా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం నిస్సీమ మహిమ్నే నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులను ఆ తల్లి, అపారమైన కృపాకటాక్షవీక్షణములతో శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు గలిగినవారిగా అనుగ్రహించును.


దేవీ ప్రకాశ స్వరూపము మనస్సీమను అతిక్రమించిన మహిమగలిగినది. ఆ తల్లి *ఉద్యద్భానుసహస్రాభా* యని అనబడినది. అనగా ఉదయించు వేలాది సూర్యుల కాంతి సమూహములతో (అనంతకోటి సూర్యకిరణసమూహములతో) విరాజిల్లుచున్నది. ఆ తల్లి మహిమలు కూడా అపారమై, హద్దులులేని ప్రభావము గలిగినవి. అనంత కోటి జీవరాశులను తన అపారమైన ప్రాభవంబుతో పాలించుచున్నది. ఆ తల్లి చతుష్షష్టికోటి కోటి యోగి గణసేవితయై, తన మహిమలను చూపుచున్నది. ఇందుగలవందు లేవని సందేహము వలదన్నట్లు అమ్మ మహిమలు ఎల్లెడల గ్రామగ్రామాన, వివిధ వనసీమలయందు, కొండలలోను, కోనలలోను, అన్నిదిశలయందును అన్ని రూపములలోను, తానే, తన మహిమలే ఈ జగత్తును రక్షించుచున్నట్లు భావింపబడుచున్నది. ఆతల్లి ఆది మధ్యాంతరహితురాలు. ఆదిపరాశక్తి. సృష్టికి పూర్వము, స్థితియందును, లయమునకనంతరము అప్పుడు ఇప్పుడు అనక ఎల్లప్పుడు సర్వవ్యాపి. పంచకృత్యపరాయణత్వముతో మహిమలకు హద్దులే లేవనునట్లు భాసిల్లుచున్నది. నవావరణ పూజయందు *మహిమాసిద్ధి* యని అష్టసిద్ధులలో ఒకటిగా చెప్పబడుచున్నది. ఆ తల్లి మనసులకందని మహిమాన్వితమైనది. ఆ తల్లి మహిమలకు ఆకాశము సైతము హద్దులు కాలేకపోయినవి. అందుచేతనే ఆ తల్లి *నిస్సీమ మహిమా* యని అనబడినది.


ఆ తల్లికి నమస్కరించునపుడు *ఓం నిస్సీమ మహిమ్నే నమః* అని యనవలెను.


*ఓం నిస్సీమ మహిమాయై నమః* అనికూడా అనుచు ఆ తల్లికి నమస్కరింపవచ్చును.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

అమ్మవారి చీరెను భక్తులు ధరించవచ్చా?



*అమ్మవారి చీరెను భక్తులు ధరించవచ్చా?* 


 సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అలంకరింప చేసిన చీరె(శేష) వస్త్రాన్ని భక్తులు(మహిళలు) ధరించవచ్చా..? 

అందులో లాభాలేంటి ? 

పాటించాల్సిన నియమాలేంటి? 

ఈ విషయాలను తెలుసు కుందాము. 


👉శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరి ఉంటారు. పురుషులకంటే ఎక్కువగా మహిళలు ఆ దేవాలయాలకు క్యూ కడుతుంటారు.


👉పూలు, కుంకుమ, గాజులు, చీరె, రవికెలను కానుకలుగా సమర్పిస్తుంటారు. ఆ చీరెను విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి అలంకరింప చేయమని పూజారులకు చెబుతుంటారు.


👉ఆ తరువాత ఇలాంటి చీరెలను ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తుంటారు. ఆ చీరె దక్కితే చాలని చాలా మంది భక్తులు వేలంలో కొనుక్కుంటుంటారు.


👉అయితే అసలు అమ్మవారి చీరె(శేష వస్త్రం)ను సాధారణ మహిళలు ధరించవచ్చా ? 

అనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. అమ్మవారి చీరెలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి.


👉కానీ, ధరించినప్పుడు పాటించాల్సిన నియమాలేమిటి? 

ఎంత సంతోషంగా వేలం పాటలో సొంతం చేసుకుంటామో.. ఆ చీరెను ధరించినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఆ మహిళలు ఉండాలి. 

అందుకు కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి.


👉అమ్మవారి శేష వస్త్రాన్ని ధరించే ముందు తిథి – వర్జ్యం చూసుకుని “శుక్రవారం” రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి.


👉ఈ చీరెను ధరించినంత సేపు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. రాత్రి సమయాల్లో ఈ చీరెను ధరించ కూడదు. ఆ చీరెను ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి వుంటుంది.


👉అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలా కాకుండా నియమాలను పాటించకపోతే, ఫలితం ఉండదు. ఆ పవిత్రత మనకు దక్కదు.


ఇది సేకరణ 🙏🙏🙏🙏🙏

విద్యారంగంలో ప్రపంచంలోనే నెం.1

 ఫిన్లాండ్ దేశం విద్యారంగంలో  ప్రపంచంలోనే నెం.1 స్థాయిలో ఉంది అంత గోప్పేమి?

ఇక్కడి “ప్రతి పాయింటు”ను గమనిస్తే ఆ సామర్థ్యం ఎలా సాధ్యమైందో అర్థమౌవుతుంది. 

చదవండి..... 

•🍒 7ఏండ్లు నిండాక పిల్లలు స్కూల్లో చేరుతారు. ఇక్కడిలాగా 2.5 సం.లకే పిల్లలకు టార్చర్ మొదలవదు

• 🍒చిన్నప్పటినుండి తన ప్రతి కదలికనుండి పిల్లలు నేర్చుకొంటూనే ఉంటారు 

• 🍒7వ సం. నుండి 10వ సం. వరకు 50% స్కూల్లోను 50% సెలవుల్లోను గడుపుతాడు

• 🍒స్కూల్ టైమింగ్ తక్కువ. సంగీతం, కళలు & ఆటలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది

• 🍒స్కూల్లలో, విద్యార్థులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకొనేందుకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడి ఉంటాయి 

• 🍒13 సం. వరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ల గొడవే లేదు. కాబట్టి విద్యార్థుల మీద పోటీ పడాలనే వత్తిడి ఉండదు

• 🍒తల్లితండ్రులకు తమ పిల్లల ప్రోగ్రెస్ తెలుసుకోవాలనే కోరిక ఉంటే, దరఖాస్తు చేసుకోవచ్చు

• 🍒ఇంటి పని ఇవ్వరు. తమకు నచ్చిన సబ్జెక్టులో ఇంటిపని చేసుకోవచ్చు

• 🍒ప్రతి స్కూల్లో ఒక డాక్టర్ నివసిస్తాడు. విద్యార్థుల ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తాడు

• 🍒ఒక స్కూల్లో 600 మించి విద్యార్థులను అనుమతించరు

• 🍒ప్రైవేటు స్కూల్లుండవు. అన్నీ ప్రభుత్వ స్కూల్లే. విద్య విషయంలో నాణ్యతను ఖచ్చితంగా పాటిస్తారు

• 🍒ఫిన్లాండ్ లో 99% విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు

• 🍒పరీక్షలు నిర్వహించని దేశాలనుండి వచ్చిన విద్యార్థుల్లో పోటీలలో బాగా రాణించే గుణం ఉంటుంది

• 🍒ఇది ఎలా సాధ్యం? ఐక్యరాజ్యసమితి ఈ విషయంగా పరిశోధించింది

• 🍒ప్రపంచంలోని విద్యార్థులందరిలోకి ఫిన్లాండ్ దేశ విద్యార్థులే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయంగా ఫిన్లాండ్ ప్రథమ స్థానం

• 🍒ఫిన్లాండ్ విద్యావ్యవస్థ గురించి తెలుసుకొనేందుకు ప్రపంచంలోని అన్నిదేశాల విద్యావేత్తలు అక్కడకి క్యూ కట్టారు

• 🍒56 దేశాలనుండి 1500 మంది ప్రతి సం. ఫిన్లాండ్ కు వెళుతున్నారు

• 🍒అధిక మొత్తం విదేశి మారకం విద్యారంగ పర్యాటకులనుండే వస్తుంది

• 🍒ఫిన్లాండ్ లో టీచర్ ఉద్యోగం అంటే ఇక్కడి IAS or IPS తో సమానం

• 🍒ఫిన్లాండ్ లో చట్టాలు, విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర “ఉపాధ్యాయులదే” !!!!!!!

• 🍒దేశంలోని ప్రతి మూడో విద్యార్ధి ఉపాధ్యాయుడు కావాలనుకొంటాడు. కానీ అదంత సులభం కాదు

•🍒 విద్యలో బాగా రాణించేవారికే ఆ అవకాశం ఉంటుంది

• 🍒వారికి 5సం. ఉపాధ్యాయ శిక్షణ, 6నెలలు సైన్యంలోను, ఒక సం. స్కూల్లో ట్రైనింగ్ ఉంటుంది. చట్ట్టాలు, విధానాల రూపకల్పన, స్వయం రక్షణ, ప్రథమ చికిస్థ, అగ్నిమాపక దళంలోను 6నెలలపాటు శిక్షణ. మొత్తం 7సం.ల శిక్షణ


అన్నింటికంటే  ముఖ్యవిషయం  ఫిన్లాండ్  పాఠశాలల్లో  "భగవద్గీత"ను  నేర్పుతున్నారు.


🍎దయచేసి చదివిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి

ఓ బాపూ మమ్మల్ని క్షమించవూ!....

 ఓ బాపూ మమ్మల్ని క్షమించవూ!....


నీ ఆశయాలకు తిలోదకాలిచ్చాం

నీ వాసించిన రామ రాజ్యాన్ని తేలేకున్నాం

అహింసను ఆమడ దూరంలో పెట్టి

హింసే పరమావధిగా జీవిస్తున్నాం

సత్యవ్రతాన్ని ఎ పుడో మరచి

అసత్యమే జీవనంగా జీవిస్తున్నాం

ధర్మాన్ని ఒంటి పాదంపై నడిపిస్తూ

అధర్మం తో ఎద్చేచ్చగా సంచరిస్తున్నాం

నీతిని నిఘంటువు ల్లోంచి తొలగించి

అవినీతి అడ్డాగా జగతిని మార్చేసాం

న్యాయానికి నిలువనీడ లేకుండా చేశాం

శాంతి అన్న పదానికి అర్ధాన్నీ మార్చేశాం

ఐకమత్యా నికి నెలవు కరువయ్యేలా చేశాం

వెరసి అవినీతి,అసత్యం,అధర్మం,హింసా

దౌర్జన్యాల తో జీవితాన్ని వెళ్ళదీస్తున్నామ్

అభద్రతా భావంతో అనునిత్యం

బ్రతికేస్తూ ఉన్నాం!

అదేమంటే!?.... భయబ్రాంతుల తో

విషాదకర,నిషా దృశ్యా లుగా

ఈ జగతిని మార్చేస్తు న్నామ్

అదేమంటే!?...ఏడాది కోమారు

నీ చిత్ర పటానికి, నీ శిలావిగ్రహానికి

సుమహారాల్నీ సమర్పిస్తూ!...

కాదంటే కరెన్సీ పై సైతం నీ రూపాన్ని

ముద్రిస్తూ నీ పై కపట భక్తినీ

ప్రదర్శిస్తున్నం

ఇంతగా నిను ఏమార్చి, నీ ఆశయాలకు తూట్లు పొడిచి

సమయానుకూలంగా రంగులు మారుస్తూ ఊసర వెల్లులై జీవించే

మమ్ము మన్నించవా ఓ బాపూ!

నీత్యాగ గుణాన్ని మేము

స్వార్ధపరత్వానికి పరా కాష్ఠ గా

వాడుకున్నం

మారిన కాలంలో మారిన మనుషుల మై అందర్నీ ఏమారుస్తూ హాయిగా

జీవితాన్ని వెళ్లదీస్తు న్నం

అందుకే!... ఓ బాపూ!

సదా మము మన్నించవూ!?.....


దోస పాటి.సత్యనారాయణ మూర్తి.

సామర్లకోట

9866631877

ధ్వజస్తంభం

 *ధ్వజస్తంభం అనే పేరు ఎందుకు వచ్చింది ? మనం తెలుసుకోవలసిన విషయం*


***


ప్రతిరోజూ మనం మయూరధ్వజుడ్ని చూస్తుంటాము.  

కానీ అతను ఎవరో చాలామందికి తెలియదు.  

అతడి ప్రాశస్త్యం తెలియదు. అలాంటి వారికోసం ఈ కథ.


కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు సింహాసనం అధిష్టిస్తాడు. ఆ ఆనందం లో గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని తలచి విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు. శ్రీకృష్ణుడు ధర్మజునికి దాతృత్వం అంటే ఎలా ఉంటుందో పాఠం చెప్పాలని భావించి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను ఓడించి సామ్రాజ్య విస్తరణ చెయ్యమని 

సలహా ఇస్తాడు. ధర్మరాజు అంగీకరించి అశ్వమేధయాగం చేసి యాగాశ్వాన్ని దేశం మీదకి పంపిస్తాడు. దాని వెంట నకుల సహదేవులను సేనలతో సహా పంపిస్తాడు.  

ఏ రాజు అయితే అశ్వాన్ని బంధిస్తాడో ఆ రాజును ఓడించి రాజ్యం వశపరుచుకోవడం ఈ యాగం యొక్క లక్ష్యం.  

అలాకాకుండా అశ్వం ఒక రాజ్యం లోకి ప్రవేశించగానే 

ఆ రాజు లొంగి పోయి సామంతానికి ఒప్పుకుంటే 

పేచీయే లేదు.


ఆ విధంగా ఆ అశ్వం మణిపుర రాజ్యం చేరుతుంది.  

ఆ రాజ్య అధినేత మయూరధ్వజుడు. గొప్ప బలశాలి.  

అతని కుమారుడు తామ్రధ్వజుడు మరింత గొప్ప 

పరాక్రమవంతుడు. తామ్రధ్వజుడు యాగాశ్వాన్ని 

బంధిస్తాడు. అతనితో యుద్ధం చేసిన నకుల సహదేవులు ఓడిపోయారు. వెంటనే భీమార్జునులు కూడా వచ్చి 

యుద్ధం చేస్తారు. వారిని కూడా ఓడించి బంధిస్తాడు 

తామ్రధ్వజుడు.


దాంతో మయూరధ్వజుడు ని యుద్ధం లో ఓడించడం కష్టమని గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మరాజు తో కలిసి మాయోపాయంతో మయూరధ్వజుని ఓడించాలని వృద్ధ బ్రాహ్మణుల వేషాల్లో మణిపురం వెళ్తారు. "దానం కావాలి" అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. "ఏమి కావాలో కోరుకోండి విప్రోత్తములారా" అడుగుతాడు మయూరధ్వజుడు.


"మహారాజా... మేము నీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఈ బ్రాహ్మణుని సుతుడిని పట్టుకుని చంపపోయింది. బాలుడిని వదలమని మేము ప్రార్ధించగా మయూరధ్వజుని శరీరం లో సగభాగం కోసి తెచ్చినట్లయితే 

ఈ బాలుడిని విడిచిపెడతాను అన్నది. కనుక మీ శరీరంలో సగభాగం కావాలి. అది కూడా నీ భార్యా పిల్లలే నీ శరీరాన్ని కోసి ఇవ్వాలి" అన్నాడు శ్రీకృష్ణుడు.


మయూరధ్వజుడు చిరునవ్వు నవ్వి "అలాగే విప్రులారా" అని పడుకుని తనను రెండు భాగాలుగా కొయ్యమని భార్యను, తామ్రధ్వజుడ్ని ఆదేశిస్తాడు. ఆ మాట విని ధర్మజుడు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. భార్య కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుని ఎడమ కంటినుంచి నీరు కారింది. వెంటనే శ్రీకృష్ణుడు "నువ్వు బాధపడుతూ దానం చేస్తున్నావు. కనుక మాకు వద్దు" అన్నాడు.


అందుకు మయూరధ్వజుడు "మహానుభావా... అది బాధ కాదు. కుడి వైపు శరీరం దానానికి ఉపయోగపడుతున్నది. నాకు ఆ అదృష్టం లేదు అని ఎడమ వైపు శరీరం బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అన్నాడు.


మయూరధ్వజుడి త్యాగానికి, దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు, ధర్మజుడు తమ నిజరూపాలను చూపించి మయూరధ్వజుడ్ని అనుగ్రహించారు. "మయూరధ్వజా.. 

నీ దానగుణం నిరుపమానం. ఏదైనా వరం కోరుకో"  

అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు మయూరధ్వజుడు 

"మహాత్మా. నా శరీరం నశించినా సరే.. నా ఆత్మ 

పరోపకారార్ధం ఉపయోగపడేలా అనునిత్యం నీ ముందు 

ఉండేలా వరం ఇవ్వు" అంటాడు.


అప్పుడు శ్రీకృష్ణుడు "తధాస్తు...నేటినుంచి ప్రతి 

దేవాలయం ముందు నీపేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి.  

నిన్ను దర్శించి నీ చుట్టూ ప్రదక్షణం చేసిన తరువాతే 

భక్తులు తమ ఇష్టదైవాలను దర్శిస్తారు. అలాంటి భక్తుల 

కోరికలే నేను తీరుస్తాను. నీ ముందు దీపం వెలిగించిన 

తరువాతే నా ముందు దీపం వెలిగిస్తారు." అని వరం 

ఇచ్చాడు.


గుడి లోకి వెళ్ళినపుడు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి, ప్రదక్షణలు చేసిన తరువాత చేసుకున్న దైవదర్శనమే నిజమైన దర్సనంగా అప్పటినుంచి ఆచారంగా స్ధిరపడ్డది. దేవుడు లేని దేవాలయం ఉండొచ్చు కానీ ధ్వజస్తంభం 

లేని దేవాలయం మాత్రం ఉండదు. ఇది జైమినీభారతం 

లోని గాథ.


@@@


ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?


ప్రజలసొమ్ము ను ఇష్టారాజ్యంగా దానధర్మాలకు ఉపయోగించకూడదు. కేవలం కీర్తికాంక్ష తో దానాలు చెయ్యకూడదు.


ఆడినమాట తప్పకూడదు. ప్రాణం పోతుందని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి.


ఇలాంటి నీతి కథలు పిల్లలకు బోధిస్తే వారు విలువలు నేర్చుకుని వారి బుద్ధికుశలత ధ్వజస్తంభం లా నిటారుగా నిలబడుతుంది. ప్రతిఒక్కరూ పూజిస్తారు.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పరివర్తన..*


"అయ్యా..స్వామికి ఒక ఆవును ఇద్దామనుకుంటున్నాను..ఎప్పుడు తీసుకొని రమ్మంటావు.."? అని నిన్న ఆదివారం ఉదయం యానాది అని పిలువబడే అతను అడిగాడు.."వచ్చే వారం తీసుకొని రా.." అన్నాను..సరే అని వెళ్ళిపోయాడు..అతనిని చూస్తే..ఒకప్పుడు తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడ్డాడు ఇతను అనే ఆలోచనే రాదు..


2014 లో సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం నుంచి ఆ యువకుడిని, అతని తల్లిదండ్రులు అతి కష్టమ్మీద శ్రీ స్వామివారి మందిరం వద్దకు తీసుకొని వచ్చారు..అతి కష్టమ్మీద అని ఎందుకు అన్నానంటే..ఆ యువకుడు ఒక పట్టాన ఓ ప్రక్క నిలవడం లేదు..చూపు ఎటో ఉంది..మనిషి ప్రవర్తన తేడాగా ఉంది..తనలో తానే మాట్లాడుకుంటూ..ఉన్నట్టుండి పరుగెట్టేవాడు..పట్టుకోవడం కూడా కష్టం..పోనీ చిన్నపిల్లవాడా అంటే కాదు..సుమారు ముప్పై సంవత్సరాల వయసు..పెళ్లి కూడా జరిగి నాలుగైదు సంవత్సరాల కాలం గడిచి పోయింది..


అతని పేరు కోడిపల్లి యానాది..వృత్తి గొర్రెల పెంపకం..చిన్నతనం నుంచీ తల్లిదండ్రులకు చేదోడు వాదోడు గా వుండేవాడు..కొద్దిగా బిడియస్తుడే గానీ..నెమ్మదస్తుడు..ఎటువంటి వివాదాల్లోకి వెళ్లే మనస్తత్వం కాదు..తన పనేమిటో..తానేమిటో..అన్నట్లుగా వుండేవాడు..వయసు వచ్చిన తరువాత తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు..మూడేళ్ల పాటు సంసారం ఏ ఇబ్బందీ లేకుండా సాగిపోయింది..ఇద్దరు పిల్లలు కూడా కలిగారు..ఉన్నట్టుండి అతనికి ఏమైయిందో తెలీదు..ఒక్కసారిగా యానాది ప్రవర్తనే మారిపోయింది..మానసికంగా మనిషి కుంగిపోతున్నాడు..పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు..

భార్యా..తల్లిదండ్రులు..యానాది లో వచ్చిన మార్పు చూసి తల్లడిల్లిపోయారు..


అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత..శ్రీ స్వామివారి మందిరం వద్దకు తీసుకొచ్చారు..శ్రీ స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేయించారు..మొదటి రెండు మూడు రోజులూ తల్లీ తండ్రీ..భార్యా..ఇలా ఎవరో ఒకరు యానాది ని పట్టుకొని ప్రదక్షిణాలు చేయించే పరిస్థితి..కానీ నాలుగో రోజు గడిచేసరికి..తన పాటికి తానే శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు..తనలో తాను మాట్లాడుకోవడం తగ్గి పోయింది..మార్పు స్పష్టంగా కనబడ సాగింది..


అతనిని మేమూ చాలా కుతూహలంగా గమనించసాగాము..మాకూ కూడా యానాదిలో వస్తున్న మార్పు ఆశ్చర్యం కలిగించసాగింది.."అయ్యా..మా అబ్బాయి యానాదిని ఇక్కడికి తీసుకొచ్చి..ఆ స్వామి సమాధి చుట్టూ త్రిప్పుతుంటే..వాడిలో చాలా మార్పు కనబడుతోంది.. మేము మండలం రోజుల పాటు వాడిని ఇక్కడే ఉంచాలని అనుకుంటున్నాము..మా పాటికి మేము వంట చేసుకుంటాము..కాకుంటే మా సామాను పెట్టుకోవడానికి ఒక చిన్న గది ఇప్పించండి.."అన్నారు..సరే అని ఒక చిన్న గది కేటాయించాము..అందులో వుండసాగారు..


మరో వారం రోజులు గడిచాయి..యానాది ఒక క్రమ పద్దతి ప్రకారం ప్రదక్షిణాలు చేయడం..శ్రీ స్వామివారి దీపారాధన కోసం నూనె తీసుకొచ్చి అర్చకులకు ఇవ్వడం..ఇతర ఉపాలయాల్లో కూడా ప్రదక్షిణాలు చేసి రావడం..తల్లిదండ్రులతో అప్పుడప్పుడూ మాట్లాడటం..పిల్లలను దగ్గరకు తీసుకోవటం..చేయసాగాడు..మనిషి లో గుణాత్మక మార్పు వచ్చేసింది..చిత్రమేమిటంటే..శ్రీ స్వామివారి మందిరం లో ఉన్న అర్చకులకే కాదు..ఇతర సిబ్బంది కి.. అందరికీ...యానాది ప్రీతిపాత్రుడిగా మారడం..అట్లని అతనేమీ అతి చనువు తీసుకొని ప్రవర్తించడం లేదు..


మండలం రోజులు పూర్తయ్యేదాకా యానాది శ్రీ స్వామివారి మందిరం వద్దే వున్నాడు..యానాది మళ్లీ మామూలు మనిషిగా మారాడు..తనకు వచ్చిన ఇబ్బందిని తీర్చిన శ్రీ స్వామివారిని యానాది మర్చిపోలేదు..తన గ్రామానికి వెళ్లి తన వ్యాపకం తాను చేసుకుంటూ...తాను సంపాదించిన ప్రతి రూపాయ లో కొంత శాతం శ్రీ స్వామివారి వద్ద అన్నదానానికి కేటాయించసాగాడు..ఇప్పటికీ అదే పద్దతి కొనసాగిస్తున్నాడు..గొర్రెలు కాచుకుని జీవనం సాగించే యానాదికి అన్నదానమంటే అత్యంత ఇష్టం.."అన్నమొక్కటే కదయ్యా మనచేత "ఇక చాలు"..అని అనిపించేది.." అంటాడు నవ్వుతూ..తనకు ఏ కష్టం వచ్చినా..నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వచ్చి మ్రొక్కుకొని వెళుతూ ఉంటాడు..


అత్యంత మితంగా మాట్లాడే యానాది మనసంతా శ్రీ దత్తాత్రేయ స్వామివారే నిండి పోయి వున్నారు..అదే అతనికి శ్రీరామరక్ష..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523 114..సెల్..94402 66380 & 99089 73699).