3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

*విధి అంటే ఏమిటి?*

 🙏 *శుభోదయం* 🙏 


*విధి అంటే ఏమిటి?*

 

*విధి అంటే కర్తవ్యం...,*

*చేయవలసిన పని....*


విధి రాత, బ్రహ్మరాత, తల రాత, నుదుటి రాత అనడం మనం వింటూ ఉంటాము..

 

మనం చేసే పనిని బ్రహ్మ మన నుదుటిన రాస్తాడా??

 

కాదు, మన రాతను మనమే రాసుకుంటాము...

 

*ఎలా?*

 

విశ్వ నియమాలను అనుసరించి, 


1. *యత్భావం తత్భవతి -* మన ఆలోచనా విధానం ఎలా ఉంటుందో, మన కర్మలు, కర్మ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి .. 


2. *మనం ఏమి ఇస్తే, అదే తిరిగి వస్తుంది...*

మనం ఇతరులకు మంచి చేస్తే, మనకు మంచి జీవితం ఉంటుంది.. 

మంచి జీవితం అంటే మన తలరాత, విధి రాత బాగున్నట్టే కదా.... 

చెడు చేస్తే, చెడు ఫలితాలే ఉంటాయి...


చెడు అలవాట్లకు బానిసై, ఆరోగ్యంగా ఉండాలని ఎలా కోరుకోగలము?  


నిప్పును ముట్టుకుని, అది మనలను కాల్చగూడదు అంటే కాలకుండా ఉంటుందా?? 

ఇదీ అంతే....


మనం ఇంతకు ముందు చేసిన కర్మల ఫలితాలే, వాటి కర్తవ్య నిర్వహణలో భాగంగా ముందుకు వస్తాయి...  


అదే విధిరాత, తలరాత, నుదుటి రాత, బ్రహ్మ రాత అని పేర్లతో పిలుచుకుంటాము... 

 

అందుకే, 


*వీలైనంత వరకు సాటిమనిషికి సహాయం చేయడం అనేది అలవరచుకోవాలి....*


*సత్యాన్నే మాట్లాడాలి.. ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి...* 


*సత్యంవద ధర్మంచర అనేది వేద వాక్కు...*

 

*విశ్వ నియమాలను అనుసరించి మన జీవితాలను మలచుకుంటే, విధిరాత, తలరాత అన్నీ బాగుంటాయి....*


*ఆ విశ్వ నియమాలను అధిగమించి నడుచుకుంటే, తిప్పలు తప్పవు.... బాధలు, కష్టాలు తప్పవు...*


*జీవితంలో మనం చేసే మంచి - చెడు మాత్రమే విధి రాతగా భవిష్యత్తుగా మన ముందుకు రాబోతుంది అని అర్థం చేసుకోవాలి..*



*సర్వే జనా సుఖినోభవంతు* 


🙏🙏🙏🙏🙏🙏🙏

అమృతం గమయ

 https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v


🌸 అమృతం గమయ 🌸


సాన్నిధ్య సత్సంగలో శ్రీగురు బోధ సారాంశం


*అమృత  బోధ*


నిరంతరం నన్ను ధ్యానించేవారికి నేను ప్రక్కనే ఉంటాను. నా స్పర్శ వారికి తెలుస్తుంది. 

         -------భగవద్గీత.



నీవు వర్తమానంలో ఎదుర్కొంటున్న పరిస్థితులని సృష్టించుకున్నది నీవే అని తెలుసుకో. నీ జీవితంలోని పూర్వ పరిస్థితులలో దోషపూరిత నడవడిక, సత్యదూరమైన తీవ్ర ఆలోచన తరంగాలు, అజ్ఞానంతో చేసే ప్రకృతి విరుద్ధ కర్మలు ఈ వర్తమాన పరిస్థితులకు కారణమని గ్రహించు. నీవు మారాలి. నీకోసం నీవు మారాలి. నేనో, ఇంకెవరో చెప్తున్నారని మారనవసరం లేదు. ఎవరో చెప్తే నేను మారేది ఏంటి అనే అహంకారాన్ని వదిలిపెట్టండి. నేనేం మారనవసరం లేదు మీరే మారండి అంటూ ఎదుటివాళ్లు చెప్పే జ్ఞానాన్ని కనీసం పరిశీలన కూడా చేయకుండా అహంకార ప్రవృత్తితో జీవిస్తూ ఉంటే ఇంక కష్టాలు ఎలా తొలగుతాయి?


కష్టాలతో బాధపడుతూ నీవు సాధారణంగా ఇలా అనుకుంటావు: “పరమాత్ముడు నాకెందుకిలా చేశాడు?”   ఎంత అజ్ఞానం? ఎంత అమాయకత్వం? పరమాత్ముడు మనకి వాటిని ఏమాత్రం కలుగజేయలేదని వెంటనే తెలుసుకో. నీకు, నీ పనులకి నీవే బాధ్యత వహించాలి. నీవు ఒక గోడని గుద్దితే, ఆ గోడ నీకు కష్టం కలిగించాలనుకోదు; కాని నువ్వు నీ చేతిని విరగగొట్టుకోవచ్చు. ఇంత చేసి అజ్ఞానంతో తెలివి తక్కువ తనంతో గోడమీద ఆరోపణ చేస్తే ఫలితం ఉంటుందా?  వివేకాన్ని కలిగి ఉండు.


నేను ఎల్లప్పుడు ధ్యానిస్తున్నా, పూజిస్తున్నా "నన్ను అసలు పట్టించుకోవట్లేదు. కష్టాలన్నీ నాకే వస్తున్నాయి" అని బాధపడేవారు మీలో అనేకమంది ఉన్నారు. 


నిజానికి మీరు ధ్యానిస్తున్నది ఎవరిని? కోరికలని అమితంగా ప్రేమిస్తున్నారు. అందుకే పరమాత్ముడి స్పర్శ తెలియడంలేదు. 


అమ్మని మనం ఎన్నో అడుగుతాం. అన్నీ ఇస్తుందా! ఇవ్వదు. ఎందుకంటే! నీకు ఏది మంచిదో చూసి అది మాత్రమే నీకు ఇస్తుంది. నిన్ను నవమాసాలు మోసి కని పెంచిన అమ్మే నీకు ఏది మంచిదో చూసి ఇస్తుంటే! నీ పుట్టుక కి కారణమైన ఆ పరమాత్ముడికి తెలియదా నీకు ఎప్పుడు ఏది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో! అందుకే నువ్వు కోరింది కాకుండా నీకు తగింది ఏదో, నీకు ఏది మంచిదో చూసి అది ఇస్తాడు. 


నేను విషం త్రాగుతాను అంటే అమ్మ ఊరుకుంటుందా! త్రాగితే చస్తావ్ అని ఆ రూపంలో ఉండేది మరేదో నిన్ను ఏమార్చి ఇస్తుంది. ఇవ్వడం మాములే. కానీ నీకు మేలు చేసేదే కదా ఇస్తుంది. అలాగే పరమాత్ముడు కూడా నీకు మేలు చేసేది మాత్రమే ఇస్తాడు.


క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।

స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి


కోరికవల్ల క్రోధం పుడుతుంది. క్రోధం వల్ల సమ్మోహం, సమ్మోహం వల్ల స్మృతి( జ్ఞాపకశక్తి) చెదురుతుంది. స్మృతి చెదిరితే బుద్ది నశిస్తుంది. బుద్ది నశిస్తే వివేకజ్ఞానం కోల్పోతారు అన్నాడు భగవానుడు. 


ఒకపక్క కోరిక మీద ఉన్న వ్యామోహం వలన క్రోధం పెరిగి విచక్షణ కోల్పోయి కష్టాలని కొని తెచ్చుకుని, మరొకపక్క నిన్నే నిరంతరం ధ్యానిస్తుంటే, నిన్నే తలుస్తుంటే అన్ని కష్టాలు నాకే ఇస్తున్నావు అంటారు తప్పించి తమలో ఉన్న లోపం చూడడంలేదు.  నిజానికి ఇక్కడ మీరు పరమాత్ముడి ధ్యానంలో లేరు. నిరంతరం కోరికల ధ్యానంలో ఉన్నారు. ఎంతటి అజ్ఞానం?  ఎంతటి బుద్ధిహీనత? 


మీరు ఏది కోల్పోలేదు. వచ్చింది గుర్తించడం లేదు. తెలుసుకోండి.


ఈ సత్య జ్ఞానాన్ని గ్రహించి అనన్య భక్తి చేత సమర్పణ బుద్ధితో పరమాత్ముని సేవించండి - అది ధ్యానమైనా, పూజ ఐనా, కర్మ ఐనా, జ్ఞానమైనా, మంత్రమైనా, తంత్రమైనా, మరి ఏదైనా, చివరికి లౌకిక కర్మ ఐనా -  అప్పుడు పరమాత్ముడి దివ్య స్పర్శ అనుభవమవుతుంది. - సత్ చిత్.


అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్


భగవద్గీత  - రాజవిద్యా రాజ గుహ్య యోగం - 22 వ శ్లోకం


సదా నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో ఏకాగ్రమై  నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను.

సత్యము

 🙏 *శుభోదయం* 🙏


*సత్యము...*


*సత్యము అనే పదము సత్ నుంచి వచ్చింది..*

 

*సత్ అంటే ఉనికి .. ఉన్నది... ఎప్పటికీ ఉండేది... శాశ్వత మైనది...*


*చిత్ అంటే ఎరుక.. తెలివి,... స్పృహ...*


*స్పృహతో, ఎరుకతో నిత్యమూ శాశ్వతమైన సత్యములో ఉండటమే మనిషి జీవన విధానం... అదే  ధర్మము...* 


*సత్యమైనది ఏదో అదే ధర్మము...*


*సత్యం వద ధర్మం చర... అనేది వేదవాక్కు...*


*అసత్యపు జీవితం పేకమేడ లాంటిది...*

 *ఎప్పటికైనా కూలిపోతుంది...* 


*అసత్యపు జీవితం మాయా ప్రపంచం...*


*అందంగా ఉంటుంది...*


*ఆకర్షిస్తూ ఉంటుంది..* 


*తాత్కాలిక ఆనందమే లభిస్తుంది...*


*ఒక్కసారి ఆ ప్రపంచంలో అడుగు పెడితే అది ఒక ఊబి...*  


*అభిమన్యుడు పద్మవ్యూహం లోకి వెళ్ళినట్లే...*

*బయటకు రావడం చాలా కష్టం...*


*సత్యమే శాశ్వతం...*

 

*సత్యమే శివతత్వం....*


*సత్యమే నేను (పరమాత్మ)...*


*సత్యమే నేను..(జీవాత్మ)...*


*సత్యమే శాశ్వతమైన ఆనందం...*


*ఆ ఆనందాన్ని ఎరుకతో అనుభూతి చెందడమే నన్ను నేను తెలుసుకోవడం.....*


*సత్యాన్ని పట్టుకుని ఉండడమే నిర్వికల్ప సమాధి స్థితి....*


🙏🙏🙏🙏🙏

భగవద్గీత

 భగవద్గీత


 ఈరోజు అనగా పిబ్రవరి 01 బుధవారం భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను మరియు విష్ణు సహస్రనామాల్ని పారాయణం చేయండి.*


*భగవద్గీత పారాయణ ఫలం*


‘గీత’ అనే పదం హద్దును లేక రీతిని సూచిస్తుంది. ‘గీత’ హద్దును సూచిస్తే, మహాభారతంలోని ‘గీత’ రీతిని సూచిం చింది. శివగీత, బ్రహ్మగీత, గణశగీత, హనుమద్గీత, దేవీగీత, వశిష్టగీత, పరాశర గీతా ఇలా ఎన్నో గీత గ్రంథాలున్నప్పటికీ మహాభారతంలోని ‘భగవద్గీత’ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గీతను అర్జునుడికి బోధించి కర్తవ్యాన్ని సూచించాడు. భగవంతుని ప్రతిరూపమే గీత. ధర్మస్థాపన చేసేందుకు దోహద పడింది.


గీత కర్మయోగంలో ఆరంభమై భక్తిశరణాగతిలో అంతమవుతుంది. భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందు కంటే మానవుని నిత్యజీవితంలోని ఎన్నో సమస్యలకు సమాధానాలు భగవద్గీతలో లభిస్తాయి. పరిష్కార మార్గాలు దొరుకుతాయి. గీత ఏ మతాన్ని ఏ సంప్రదాయాల్ని కాదనదు అన్ని మతాలవారూ, సంప్రదాయాల వారూ భగవ ద్గీతను ఆదరిస్తున్నారు. విశ్వమానవ కల్యాణం కొరకు సమస్త ప్రాణికోటికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన తత్త్వాజ్ఞానా మృతమే భగవద్గీత. 700 వందల శ్లోకాలతో 18 అధ్యాయాలలో పొందుపరచబడినది.


భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు.


మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్‌ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును.


‘క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం’ లో శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత పదమూడవ అధ్యాయంలో మానవ శరీరం ఏ విధంగా ఆవిర్భవించింది. దాని ప్రాముఖ్యత, లక్షణాలు గురించి వివరంగా పేర్కొన్నారు. సత్వ, రజ, తమో గుణాల ప్రాబల్యం వలన మానవుని, నడవడిలోని మార్పులు, వాని ప్రవృత్తులు, శరీర స్పందన గురించి విశదంగా వ్యాఖ్యానించారు.

మానవుని జీవిత నడవడికి భగవద్గీత భగవంతుడు ప్రసాదించిన ఒక అద్భుతమైన సందేశం.


మూఢుని మోహాన్ని పోగొట్టి కర్తవ్యపరాయణుని చేస్తుంది. గీతలో కర్మ, జ్ఞాన, భక్తి మూడు విషయాలు కనబడు తుంటాయి. కర్మ సాత్విక, రాజసిక, తామసికమని మూడు విధాలని గీత చెప్పింది. కర్మ ఎప్పటికీ వదలరాదు. ప్రతి ఒక్కరూ కర్మ చేయాల్సిందే. అది కర్తవ్యబుద్ధితో చేస్తుండాలి. ‘కర్మణ వాధికారస్తే మా ఫలేషు కదాచన’ కర్మ చేయడం నీ విధి. దాని ఫలితాన్ని ఇచ్చేది మరొక శక్తి. జ్ఞానం లేని కర్మ వ్యర్థమే. భక్తి లేకపోతే జ్ఞానం అలవడదు. ”సర్వధర్మాన్‌ పరిత్యజ్య” అన్ని ధర్మాలు వదలి తనను మాత్రమే శరణు పొందమని భగవానుడు చెప్పాడు. నిత్తనైమిత్తిక సమస్త ధర్మాల కంటే కర్మలకంటె భగవశ్చరణాగతి ఎన్నో రేట్లు అధిక ఫలం కలిగిస్తుంది. భగవానుని గీత ధర్మమిది.

గీత భగవద్వాణి అగుటవలన వేదరుక్కులతో సమానం. ఇది ఉపనిషత్సారము, అద్వితీయము. భగవద్గీత శ్రీకృష్ణభగవానుని ముఖారవిందం నుండి స్రవించిన దివ్యామృతం.

భగవద్గీత ధర్మాల యొక్క సముదాయమని స్వామి వివేకానందుడు అంటే, వినోభాభావె నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతగా ఉపయోగపడింది అనగా, తిలక్‌ ప్రపంచ సాహిత్యమంతటిలోనూ గీతకు దీటు రాగల గ్రంథం వేరొకటిలేదు. అది మనుషులను పరమానంద పదవికి కొనిపోగల అపూర్వసాధనం అని … ఇలా ఎందరో మహానుభావులు గీత గురించి వ్యాఖ్యానించారు.

భ గవద్గీతా కించి దధీతా గంగాజల లవకణికా పేత సకృదపియేన మురారి సమర్చా క్రియతేత స్వయమ్యో పినచర్చా” అని ఆదిశంకర భగవద్పాదులు భగవద్గీతా ప్రశస్త్యాన్ని వివరించాడు.


గీతను భగవానుడు మార్గశిర శుక్ల ఏకాదశినాడు. అర్జునునికి ఉపదేశించినాడు. కాన ఆనాడే గీతాజయంతిని జరుపుతున్నారు.

గీతామృతాన్ని మనం గ్రోలి ధన్యులమవుదాం!

‘రసస్రవంతి-కావ్యసుధ


పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే


సమస్త గ్రంథాల సారం వేదం. వేదసారం ఉపనిషత్తు. ఉపనిషత్సారాంశం గీత. గీత సారాంశం భగవంతుని శరణాగతి. అనన్యభావంతో శరణు పొందినవానికి సమస్త పాపాలనుండి రక్షింపబడి భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు. హృషీకేశుడైన శ్రీకృష్ణపరమాత్ముడు యుద్ధరంగంలో చేసిన బోధామృతమే భగవద్గీత. ‘గీ’ అంటే త్యాగం. ‘త’ అంటే తత్వజ్ఞానం. త్యాగాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వివరించేది. లోకంలో కర్మ మార్గం, భక్తిమార్గం, జ్ఞానమార్గాలను అవలంబించే ఆధ్యాత్మికవేత్తలు ఈ క్షేత్రంలో ఉన్నారు.


మోక్షం పొందడానికి కర్మ, జ్ఞాన, భక్తి, యోగ మార్గాలనే నాలుగు ద్వారాలగుండా ఏ ద్వారంనుంచైనా వెళ్లి ముక్తిసౌధంలోకి చేరుకోవచ్చు. ఎక్కడెక్కడి నదులన్నీ సముద్రం చేరునట్లు, ఈ మార్గములన్నియు, జీవుని కైవల్యధామానికి చేరుస్తాయి. చిత్తము తమోగుణంతో కూడిన వాసనలతో నిండిపోయి, కఠినశిల వలె ఉన్నంత వరకు, ఎన్ని పూజలు, హోమాలు, ఉపవాసాలు ఉన్నా, భగవంతుని గాంచలేరు. కొన్ని వేల యుగాలలో చేసిన ఫలితాన్ని సులభంగా పొందే మార్గం భగవద్భక్తి.


పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన మహాభారతంలోని భగవద్గీతకు ప్రత్యేక స్థానముంది. భగవద్గీతలోని అక్షరాలకు అనంత శక్తి ఉంది. భగవద్గీత కేవలం భక్తి బోధనే కాదు. హిందూ

సంస్కృతి వికాసానికి మూలాధారాలు అందులో ఉన్నాయి.


ధర్మక్షేత్రం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలోని పాండవులకు, కౌరవులకు మధ్య జరుగునున్న భీకర సంగ్రామం. ధర్మానికి, అధర్మానికి అనాదిగా అవిరామంగా జరుగుతున్న పోరాటం. ఆ పరిస్థితుల్లో పార్థుడే కాదు, ఎవరున్నా, అంతర్మథనానికి లోను కావలసిందే. పార్థుని సందేహాలకు ఇచ్చిన సమాధానమే ఈ గీతాసారం.

నిరాశా నిస్పృహలతో అచేతనావస్థలో ఉన్న పార్థునికి కర్తవ్య బోధ చేసి శ్రీకృష్ణుడు అతనిని యుద్ధోన్ముఖుని కావించాడు. ధర్మసంస్థాపన కోసం బోధించిన ఈ గీత నేటి తరాన్ని కూడా అంతే సమర్థంగా కర్తవ్యోన్ముఖుల్ని చేయగలదు. అనేక సంశయాలకు దారి చూపగల జ్ఞానసంపత్తి ఇది. ఈ జ్ఞాన సంద్రాన్ని మధించిన వారెందరో, మహానుభావులు, విద్యావేత్తలు, తాత్వికులు, వేదాంతులు తమ తమ పరిధిలో వారి అవగాహన ప్రస్ఫుటంగా వివరించారు.

ఇది భారతీయులకే కాక, యావత్ప్రపంచానికీ మహా ప్రసాదం. ఇహపరాలకు, ప్రాపంచిక, ఆధ్యాత్మికాలకు సంబంధించిన అనేక అంశాలు, పండు వొలచినట్లుగా, తర్కబద్ధంగా సుబోధంగా వివరించారు.


గీత అంటే భగవద్గీతే కాదు, వశిష్ట గీత, హంసగీత, భ్రమరగీత, శ్రుతిగీత, బ్రాహ్మణ గీత – ఇలా దాదాపు 18 గీతలున్నాయి. గీత శబ్దం వినబడగానే భగవద్గీత ఒక్కటే మన కళ్లముందు ప్రత్యక్షమయ్యేది.


నేను యుద్ధం చేయను. బంధువులు, తాతలు, అన్నగార్లు, మేనమామలు, వీరిని చంపి రాజ్యాన్ని పాలించాలి. అందుకే నాకీ రాజ్యం వద్దన్నాడు అర్జునుడు. యుద్ధం ఎందుకు చేయాలో గీతలో చక్కగా విడమర్చి చెప్పాడు శ్రీకృష్ణుడు. నీ విద్యుక్తధర్మాన్ని నీవు నెరవేర్చు. అది కర్మ చేయడం కన్నా గొప్పది. గీత భౌతిక అజ్ఞానంనుండి వుద్ధరించడమే పరమతత్వం.


ప్రతి ఒక్కరు కర్మలపై ఆశ లేకుండా కర్మలు చేస్తూ వాటిపైన ఆసక్తి చూపాలి. అపుడే మానవుడు అభివృద్ధి చెందుతాడు. జడపదార్థం కంటే ఇంద్రియాలు ఉత్తమం. ఇద్రియాలకంటే మనసు ఉత్తమం. మనసుకంటే ఆత్మ ఉత్తమమైనది. అందుకే మనిషి తాను చేయలదలచిన పని, ఆత్మసాక్షిగా చేయాలి. ఆత్మను ఒప్పిస్తే అన్నిటినీ ఒప్పించినట్లే. ప్రతిఫలాపేక్ష లేకుండా మనము పని చేయడమే మన ధర్మం.


భగవద్గీతలో జ్ఞాన కర్మ మార్గాలలో ఏది విశిష్టమైనది అనేదానికి ఎంతటి జ్ఞాని అయినా కర్మలుచేయక తప్పదని కర్మలు చేస్తే ప్రతిఫలాపేక్ష లేకంఉడా చేస్తే దోషం ఉండదని సమన్వయం కనిపిస్తుంది. భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు ఉంది. ఒక్కొక్క అధ్యాయ మహత్తు చెప్పడానికి ఒక్కొక్క కథ ఉంది. భగవద్గీతలో 100 శ్లోకాల దాకా సంజయాదుల ప్రశ్నోత్తరాలు, వర్ణనలు, విమర్శలు ఉన్నాయి. గీత మొదటి ఐదు అధ్యాయాలు తన ముఖంగాను, తరువాత వచ్చే 10 అధ్యాయాలు 10 భుజాలుగాను, 16వ అధ్యాయం ఉదరంగాను, 17, 18 అధ్యాయాలు తన రెండు పాదాలుగాను ఉంటాయని శ్రీమహావిష్ణువు చెప్పాడు. భగవద్గీతలో ఒక అధ్యాయమైనా పారాయణం చేయాలి. కనీసం ఒక శ్లోకమైనా త్రికరణ శుద్ధిగా పఠించాలి.


*పారాయణం అనంతరం మీ పేరు, చిరునామా ఫోన్ నంబర్ మా వాట్సాప్ నెంబర్ +919700722711 కు మెసేజ్ చేయగలరు.*

స్వామి వివేకానంద స్ఫూర్తి

 *_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Feb 1._*


 **స్వామి వివేకానంద స్ఫూర్తి* ..*రోజుకో సూక్తి - ఫిబ్రవరి 1* 

 

*దీరులై ఉండండి,* 

*ఆత్మస్థైర్యంతో పని చెయ్యండి,*

*మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే*,*

*పిరికిపందలు ఆత్మస్థైర్యం లేనివారు రోజు మరణిస్తారు* .


बने रहें,

आत्मविश्वास से काम लें,

इंसान सिर्फ एक बार मरता है*,*

बिना संयम के कायर रोज मरते हैं।


stay tuned,

Work with confidence,

Man dies only once*,*

Cowards die every day without self-control.


 __1901 సంవత్సరం మార్చి31వ తేదీన స్వామి వివేకానంద టాక పర్యటనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మనము పుట్టిన హిందూ మతం సనాతన ధర్మము గురించి_ .. _ఆ సమయంలో ఇచ్చిన ఉపన్యాసం._ 


 *అంశం* : *మనము పుట్టిన* *హిందూ మతం గురించి*  ...


 – *స్వామి వివేకానంద*.


Part-5

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*అనాది ఆచారానికి వివరణ..*


*(ముప్పై ఐదవ రోజు)*


ఋతుక్రమం అనేది స్త్రీలకు సర్వసాధారణ ప్రక్రియ అని చెపుతూ శ్రీ స్వామివారు..


"తల్లీ ఈ ఆచారాలను పెద్దలు ఊరికే పెట్టలేదమ్మా..ప్రతి ఆచారానికి ఒక సహేతుకమైన వివరణ ఉంటుంది..అది చెపుతాను శ్రద్ధగా వినండి..ఇందాక మీరు అపవిత్రం అన్నారు గదా..అది ఎందువల్ల వచ్చింది?..మల మూత్ర విసర్జన తరువాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోమని చెప్పినట్లుగా.. ఈ బహిష్టు సమయంలో కూడా చెడు రక్తం విసర్జించబడుతుంది కాబట్టి..అప్పుడు ఆ స్ర్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక..ఎక్కువ విశ్రాంతి కలుగ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని పెట్టారు..అలాగే.. ఆ సమయంలో దైవ విగ్రహాలు స్పృశించటం..దైవారాధన గదిలోకి..అదేనమ్మా పూజా గృహం లోకి ప్రవేశించడం నిషేధించారు..ఆ మూడురోజులూ పిల్లలకు భర్తకు దూరంగా వుండమని కూడా చెప్పారు..ఆ మలినమైన శరీరం దుర్వాసన ఇతరులకు సోకకుండా ఉంటుందని ఆ ఏర్పాటు చేశారు..పసిపాపలను, దైవాన్ని అపవిత్రం చేయగూడదనే ఆ నియమం పెట్టారు..శిరస్సు ద్వారా..నోటి ద్వారా..చెవి, ముక్కు, కళ్ల ద్వారా ప్రాణం పోయిందనుకో..అది ఊర్ధ్వ లోకాల ద్వారా పోయినట్లు..నాభి క్రింద రంధ్రాల ద్వారా ప్రాణం పోతే..అది అధో లోకాల ద్వారా వెళ్లిందని అర్ధం.."


"అమ్మా!..ఒక విషయం గుర్తుపెట్టుకో..భగవన్నామోచ్చారణ అనేది అగ్ని లాటిది..అది నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి..అలా చేయగా చేయగా..ఆ అగ్ని మన మనసునూ..శరీరాన్ని పుటం పెట్టిన బంగారంగా మార్చి..ఏ మలినమూ అంటకుండా చేస్తుంది..ఆ భగవన్నామోచ్చారణానికి ఒక ప్రదేశం..ఒక బహిష్టు..ఒక అపవిత్రత అనేవి లేవు గాక లేవు!..అందుచేతే సద్గురువులు కోటి జపం..నామకోటి వ్రాయడం లాంటి నియమాలు పెట్టి..ఆ భగవంతుడి నామోచ్చారణకు ఈ శరీరాన్ని అలవాటు చేయమంటారు.."


"ఇప్పుడర్ధమైందా తల్లీ!..నీవు నీ సాధారణ పనులు చూసుకో..నాకు ఆహారం ఎవరిచేతనైనా ఇప్పించు..నేను స్వీకరిస్తాను..నిరంతర నామోచ్చారణ అనే సూర్యడు వెలుగుతుండగా..ఇక అపవిత్రం అనే చీకటి ఎక్కడుందమ్మా?..నీ మానసిక జపం నీవు చేసుకుంటూ వుండు!..ఇక పూజ గదిలోకి నీవు ఎలాగూ వెళ్లవు.. ఇందుకోసం నేను మాలకొండ వెళ్ళవలసిన అగత్యం లేదు..శ్రీధరరావు గారూ మీరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి.." అన్నారు..


శ్రీ స్వామివారి వివరణతో ఆ ముగ్గురికీ సందేహాలు తొలగిపోయాయి..శ్రీ స్వామివారు కూడా తన బసకు వెళ్లి..ధ్యానం చేసుకోసాగారు.. శ్రీ స్వామివారు ధ్యానం చేసుకుంటున్న గది మీద..వందలాది రామచిలుకలు వచ్చి వాలాయి..


బొగ్గవరపు చిన మీరాశెట్టి గారి దంపతులు కూడా..వారం లో మూడురోజుల పాటు..శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బాగుచేయించే పనిలో మొగలిచెర్ల వచ్చి పోతున్నారు...ఆశ్రమ నిర్మాణానికి సరిపడా స్థలం చదును చేయించడం పూర్తి అయింది.. 


అది నవంబరు నెల చివరి రోజులు..శ్రీ స్వామివారు మొగలిచెర్ల లోని శ్రీధరరావు గారింటికి వచ్చి రమారమి ఇరవై రోజులు దాటిపోయాయి..చలి కూడా బాగా పెరిగింది..అంత చలిలోనూ శ్రీ స్వామివారు తెల్లవారుఝామున లేచి దిగంబరంగా ఆవరణలో తిరగడం మానలేదు..వారి ఇంటిలో ఉన్న ప్రతిరోజూ ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి ఉపదేశం ఇవ్వడం జరిగిపోతూ ఉన్నది..శ్రీ స్వామివారి బోధ పూర్తి అయిన తరువాత..ప్రభావతి శ్రీధరరావు గార్లు..శ్రీ స్వామివారు చెప్పిన విషయాల గురించి తర్కించుకోవటం అలవాటుగా మారింది..


శ్రీధరరావు దంపతులు శ్రీ స్వామివారి ఉపదేశాలను శ్రద్ధగా వినడం అలవాటు చేసుకున్నారు..తమ పూర్వపుణ్యం కొద్దీ..ఇటువంటి మహానుభావుడు తమ ఇంట్లో అడుగుపెట్టాడనీ..ఈ మందిర నిర్మాణం పూర్తి అయ్యేవరకూ ఇక్కడే బస చేస్తారు కనుక..మరిన్ని మహాద్భుత విషయాలను తెలుసుకొని తరించవచ్చనీ..భావించారాదంపతులు..


కానీ...


దైవ లీలలు మరోలా ఉంటాయి..


శ్రీ స్వామివారు ఆశ్రమ స్థలానికి తరలి వెళ్లడం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

భగవద్గీత - భక్తియోగం - 17వ శ్లోకం

 https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v


🌸 అమృతం గమయ 🌸


*భక్తుల ముఖ్యలక్షణం* 

 

మనం నిత్యం తెలుసుకుంటున్నటువంటి *భక్తుల ముఖ్యలక్షణాలు* అన్నీ కూడా మనకు శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చినటువంటి సందేశాల ద్వారా మనకు అందించినటువంటి వరాలు. భగవద్గీత పట్టణం చేసిన వాళ్ళందరికీ ఈ పదాలు  తెలిసి ఉంటాయి.


*న హృష్యతి - న ద్వేష్టి* 

*న శోచతి - న కాంక్షతి* 

ఈ నాలుగు పదాలు మనకు భగవద్గీత  ద్వాదశోధ్యాయం భక్తి యోగం 17వ శ్లోకంలో కనిపిస్తాయి. ఇప్పుడు వాటి అర్థాన్ని చూద్దాం.


కోరికలు తీరితే, అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సంతోషం. అదే హృష్యతి. 


అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా, నష్టం కలిగినా  కలిగేది శోకం. అదే శోచతి.


మనకి ఎవరైనా అపకారం చేస్తే అతడిపై ద్వేషం. అదే ద్వేష్ఠి. 


మనకు లేనిదాన్ని కోరుకుంటే కాంక్ష, అదే కాంక్షతి. 


ఈ హృష్యతి, శోచతి, ద్వేష్టి, కాంక్షతి - ఈ లక్షణాలన్నీ సామాన్యులకే గాని భక్తులకు ఉండవు. ఉండకూడదు. ఉంటే అతడు భక్తుడు కాడు. 


మనం సామాన్యులుగా ఉన్నంతకాలం ఈ లక్షణాలు మనలను వదలవు. ఎప్పుడైతే మనం భగవంతుని వైపుకు మరలి, భగవంతునితో సంబంధ బాంధవ్యం ఏర్పరచుకుంటామో, ఆ క్షణం నుండే ఈ అవలక్షణాల నుండి మనకు విముక్తి లభిస్తుంది.  అప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోవటమో, బాధతో విలవిలలాడి పోవటమో, ద్వేషంతో కుతకుతలాడటమో, కోరికలతో వేగిపోవటమో ఉండదు. భగవంతునితో బంధం పెంచుకుంటే  పరితృప్తి - సంతృప్తి.


అలాగే మనం ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నంత కాలం సంతోషం, దుఃఖం, ద్వేషం, కాంక్ష - వీటితో సతమతమౌతూ ఉండాలి. ఒక్కసారిగా ఈ ప్రపంచంతో సంబంధం వదులుకొని పరమాత్మతో సంబంధం పెట్టుకున్నామా? - ఆ క్షణం నుండే మనం ఈ అన్ని అవలక్షణాల నుండి - అంటే కోరికలు (కాంక్ష), దుఃఖం (శోచతి), సంతోషం (హృష్యతి), ద్వేషం (ద్వేష్టి) అనే వాటినుండి విముక్తులమవుతాం. భగవత్ సాన్నిధ్యంలో ఆనందిస్తాం.

దీనికోసం ప్రపంచాన్ని నిషేధించక్కర్లేదు. భగవత్ సాన్నిధ్యంలో, ప్రపంచంలో ఉంటూ నిర్వహించవలసిన విద్యుక్త ధర్మాలను ఆచరిస్తూ సత్య జ్ఞానముతో కర్మలని ఆచరించగలిగేటువంటి పరిపుష్టి లభిస్తుంది.


ఈ లక్షణాలను అలవాటు చేసుకోవడానికి సాధన చేయండి.


-- సత్ చిత్


యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |

శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్య: స మే ప్రియ: 


భగవద్గీత - భక్తియోగం -  17వ శ్లోకం


ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధ పడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధ పడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ-అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం

 🙏 నమస్కారం అండి 🙏


🌹 శుభోదయం 🌹


🔥ఓం నారాయణ.         ఆదినారాయణ🔥


భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం


320. శ్రీ స్వామివారి ఆశీర్వాదం పొందిన మెగాస్టార్ చిరంజీవి.


            మన భారత దేశంలో గోవులను ప్రేమించడం పూజించడం ఒక ఆచారంగా వుండేది. పూర్వం రోజులలో ప్రతి ఇంట్లో గోవులు వుండేవి. అందరూ ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి నే, ఉపయోగించేవారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో తెల్ల జాతి పశువులును కుటుంబం సభ్యుల వలే ప్రేమించేవారు. సరైన పశువైద్య సౌకర్యం లేక అనేక పశువులు వ్యాధుల బారిన పడుతుంటే ఆ రైతులందరు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చేవారు. పశువులు కనపడకపోతే, శ్రీ స్వామి దగ్గరకు వస్తే వాటి క్షేమ సమాచారం ఆ చూకీ చెప్పేవారు, అది తెలుసుకొని వెళ్ళి వాటిని తెచ్చుకునేవారు.అవి ఎక్కడ వుంది, ఎలా వుంది కూడా కళ్ళ తో చూసి నట్లుగా చెప్పేవారు. వారు చెప్పిన విధంగా జరిగేది.


                   పశువులకు వ్యాధులు వచ్చినప్పుడు మంత్రించి దారాలు ఇచ్చి ఆ పశువుల మెడలో కట్టమనే వారు. వేలు ముద్రలు వేసిన చీటీలు ఇచ్చి పశువుల కొట్టంలో కట్టి సాంబ్రాణి ధూపం వేయ మనేవారు. కొన్ని సందర్భాలలో వారే స్వయంగా వెళ్ళి పశువులను త్రాకే వారు. ఇసుక మంత్రించి చల్లేవారు. పశువులు బాధతో ప్రార్థిస్తే ఎక్కడున్నా వెళ్ళి కౄర మృగాల నుండి, తీవ్రమైన వ్యాధుల నుండి కాపాడిన శ్రీ స్వామివారి జీవ కారుణ్యం ఏ మాటలతో వర్ణించగలం..? మాటలలో వర్ణించలేము. ఆ నోరులేని మూగ జీవులను కాపాడే దైవంగా ఆనాటి ప్రజలు శ్రీ స్వామివారిని కీర్తించేవారు. శ్రీ స్వామివారిని తలచుకొని వస్తుంటేనే వాటికున్న జబ్బులు తగ్గి పోయేవి. అటువంటి దయామయులైన శ్రీ స్వామివారికి ఆ మూగ జీవాల ఆక్రందన తెలుస్తుంది అందుకే ఎక్కడైన అవి కష్టంలో వుంటే వెతుక్కుంటూ వెళ్ళి  ప్రమాదం నుండి రక్షించేవారు.


              ఒకరోజు నెల్లూరు పతేఖాన్ పేటలో ఒక ఇంట్లో ఆవు మూడు రోజులు నుండి ప్రసవవేదన అనుభవిస్తూ వుంది. ఆ యజమాని కొణిదెల వెంకట్రావు చాలా బాధ పడుతున్నాడు. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంటులో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఒంగోలు నుండి నెల్లూరుకి బదిలీ అయి కొత్తగా వచ్చారు. అతనికి అక్కడ పరిచయాలు అంతగా లేవు. ప్రతిరోజు గోసేవ చేసుకుంటూ వుండే ఆ ఇంటి ఇల్లాలు అంజనీ దేవి అంతగా బాధ పడుతున్న గోవుని చూసి కలత చెందారు. ఏమి చేయ లేక తన ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామిని ప్రార్ధించింది.


              ఆ రోజు ఆ యింటి వైపుగా ఒక పెద్దాయిన వచ్చాడు. ఆ మూగ జీవికి ఆత్మ బందువుగా వచ్చి పలకరించి పరిచయం చేసుకుని లోపలికి వచ్చి భరించలేని ప్రసవ వేదన పడుతున్న ఆ గోమాత ఆక్రందన విన్నాడు. తన హస్త స్పర్శతో నేనున్నాను నీ సుఖ ప్రసవానికి ఏర్పడిన ఆటంకం నివృత్తి చేస్తున్నానని ధైర్యాన్ని ఇచ్చి ప్రేమతో దాని శరీరం అంతా నిమిరారు. దానికి  వేదన నుండి విముక్తి లభించింది. కొద్ది నిమిషాలలోసుఖంగా ప్రసవించింది. అందరూ సంతోషించారు వెంకట్రావు శ్రీ స్వామివారిని బిక్ష స్వీకరించమని అడిగాడు. శ్రీ స్వామివారు సున్నితంగా  తిరస్కరించి బయలు దేరారు. రెండు అడుగులు వేసారు అప్పుడు ఒక సంఘటన జరిగింది.

భిక్షువులా వున్న ఆ సాధుపుంగువుడు వచ్చిన పని అయి పోయింది కాబట్టి తిరుగు ప్రయాణంలో, ఆ ఇంటి నుండి వెళ్ళి పోతూ అక్కడ మెట్ల మీద కూర్చున్న వారి పెద్దబ్బాయి వైపు చూసారు. అతన్ని చూసి ఒక్క నిమిషం ఆగి పరీక్షగా చూసాడు. ఆ అబ్బాయి లేచి గౌరవం గా నిలబడ్డాడు. శ్రీ స్వామివారు వాళ్ళ నాన్న వైపు చూసి అయ్యా నేడు మెట్ల మీద కూర్చున్న ఈ అబ్బాయి మెట్టు మెట్టు ఎక్కి ఉన్నత శిఖరాన్ని చేరుకుంటాడు కదయ్యా అన్నారు. ఆ సమయంలో ఆ మాటలు వెంకటరావు అంతగా పట్టించుకోలేదు. ధన్యవాదాలు తెలుపుకుని పయనమై వెళుతున్న ఆ మహనీయుని చూస్తూ గుమ్మంలో నిలబడ్డాడు. ఆ అబ్బాయి లోపలికి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు.


             అప్పుడు  బయటకు వచ్చి, ఆ పెద్దాయన  గురించి విచారిస్తే వారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు అని తెలిసింది. తమ ఇంటికి వచ్చి, మా గోవుకు ప్రాణభిక్ష పెట్టారు. వారిని ఈ జన్మలో మరిచి పోలేను అని మనసులో కృతజ్ఞతా పూర్వకమైన నమస్సులు తెలుపుకున్నాడు.


               ఆ అబ్బాయి పేరు శివ శంకర వర ప్రసాదు అప్పుడు  నర్సాపురంలో B.com డిగ్రీ చదువుతున్నాడు.తండ్రి ఉద్యోగ రీత్యా నెల్లూరులో ఉండటం వలన అప్పుడప్పుడు వచ్చి వెళ్తువుంటాడుు. తల్లి అంజనాదేవి అంటే అతనికి చాలా ఇష్టం.గోవు పడే బాధను తగ్గించిన ఆమహానుబావుని చూసి ఏదైనా భిక్ష సమర్పించాలని శ్రీీ స్వామివారి కోసం భిక్ష సిద్ధంచేస్తుంటే ఇంట్లో వున్న అమ్మకి ఆయన వెళ్ళి పోయారు అనే వార్త చెప్పాడు.


            చిన్నప్పటి నుండి ఎవరైనా మాట్లాడుతూ వుంటే అది విని ఇమిటేట్ చేయడం, వాళ్ల లాగా నటించడం అతనికి అలవాటు బహుశా అదే నేడు అతను మహత్తరమైన నటుడిగా చేయడానికి మూలం అయివుండవచ్చు. అంతర్గతంగా, సహజ సిద్ధంగా ఆ లక్షణాలు ఉండటం చాలా విశేషం. ఆరోజు సరదాగా వాళ్ళ అమ్మతో శ్రీ స్వామివారు చెప్పిన మాటలను అమ్మా నీకొడుకు మెట్టు మెట్టు ఎక్కి శిఖరాన్ని చేరుకుంటాడని అని వాళ్ళ అమ్మకి స్వామిలా మాట్లాడి వినిపించాడు.


              అంతలో బయటకు వెళ్ళిన వాళ్ళ నాన్న  వచ్చాడు. ఆ వచ్చిన పెద్దాయిన ఎవరో పూర్తి వివరాలు కనుక్కున్నారు. ఎక్సైజు డిపార్ట్మెంటులో కానిస్టేబుల్ గా చేస్తున్న అతనికి శ్రీ స్వామివారి గురించి ఇన్వెస్టిగేషన్ పెద్ద కష్టం కాలేదు. వారు గుండం వేసుకుని గొలగమూడిలో వుంటారని, భక్తులు ఆయనను వెంకయ్య స్వామి అంటారని మంచి చెడులు చెప్పడమే కాకుండా పశువులకు జబ్బులు వచ్చినా గొర్రెలు, మేకలు, గేదెలు ఏవి తప్పి పోయినా స్వామి దగ్గరకు వెళ్తే వాటి సంగతి చెప్తారని వారు చెప్పింది జరుగుతుందని వచ్చి చెప్పారు.


           తల్లి కొడుకుల ముఖంలో ఆనందం తాండవించింది. ఒక సత్పురుషుడు దీవించిన దీవెన వృధాగా పోదు. ఆ పుణ్యపురుషుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అని కొడుకును తాను కూడా ఆశీర్వదించింది. తల్లి కొడుకులు శ్రీ స్వామివారికి వెంటనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తరువాత వెంకట్రావు అంజనీ దేవి దంపతులు వెళ్ళి గొలగమూడిలో శ్రీ స్వామివారిని దర్శించుకుని కృష్టజ్ఞతలు తెలియ చేసారు. ఆ విధముగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి అనుగ్రహాంతో ఆనాటి శివ శంకర వర ప్రసాద్ నేడు చిరంజీవిగా కోట్లాది మంది అభిమానుల హృదయ శిఖరాలు అధిరోహించి విశ్వ విఖ్యాత నటుడయ్యాడు.


            ఆనాడు శ్రీ స్వామివారి చూపులకు చిక్కిన చిరంజీవి మెట్టు మెట్టు ఎక్కి స్వయం కృషితో జీవితంలో ఉన్నత శిఖరాలను చేరు కోవడంలో శ్రీ స్వామివారి ఆశీస్సులు వుండటం అతని పూర్వ జన్మ సుకృతం.


🔥ఓం నారాయణ.         ఆదినారాయణ🔥


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీసాయినాథ ప్రబోధామృతము పారాయణ.*


రచన:- శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు


                *క్రొత్తయుగానికి క్రొత్తమతం*


చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే వెనుకటి భక్తులు ద్వేష అసూయల వలన పాము, కప్పలుగా ఎలా జన్మించారో వివరించారు. వెనుకటి తమ స్నేహితులు ద్వేషాలవలన ఈ జన్మలో రెండు మేకలుగా ఎలా జన్మించారో చెప్పారు. ఇలానే ఇంకెందరి గురించో చెప్పి హిందూ బౌద్ధ, జైన ధర్మాలకు కొమ్మయనదగిన పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవపరచారు. వేదమంత్రం మరచిన దక్షిణాది బ్రాహ్మణులకు వేదమంత్రం గుర్తుచేశారు. 


ఇతర వివరములకు శ్రీసాయినాథ ప్రబోధామృతము అను  గ్రంథ మును(పరమ పూజ్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విరచిత) పరిశీలించ గలరు.

online లో చూచుటకు... https://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Sainathaprabodhamruthamu&intropage=0 

*ఓం సాయి రాం......జై సాయి మాస్టర్*

కోరికలకు అధీనంలో ఉన్నవారు

 శ్లోకం:☝

*ఆశాయాః యే దాసాః*

 *తే దాసాః సర్వలోకస్య |*

*ఆశా యేషాం దాసీ*

 *తేషాం దాసాయతే లోకః ||*


భావం: కోరికలకు అధీనంలో ఉన్నవారు (ఆశకు బానిసలు) మొత్తం ప్రపంచానికి దాసులుగా ఉంటారు. కానీ, ఆశ ఎవరి అధీనంలో ఉంటుందో లోకమంతా వారికి దాసోహం అంటుంది.🙏

ఆశ్రిత్ ఆలయ

 *ఆశ్రిత్ ఆలయ దర్శన యాత్ర* 

 *ఆశ్రిత్ గ్రూప్* (8977908825)


*నవగ్రహ మండపం విశిష్టత....*                                                                                                    


ప్రతి శివాలయంలో ఈశాన్యంలో కనపడుతుంది నవగ్రహ మండపం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితాలను ప్రభావితం చేసే సూర్య, చంద్ర, అంగారక, బుధ, గురు, శుక్ర, శని, రాహువు మరియు కేతువులు కొలువై ఉండే స్థలం.

పుట్టిన దగ్గర నుండి మరణించే దాకా మానవ జీవితాలో సంభవించే ఉద్దానపతనాలకు ఈ గ్రహాలే కారణం  అంటుంది జ్యోతిష్యశాస్త్రం. ఆ ఎత్తుపల్లాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మన జాతక చక్రంలో గ్రహాలు ఉన్న స్థానాల  ఆధారంగా ఒక అంచనాకు వస్తారు జ్యోతిష్కులు. ఏయే గ్రహాలు అననుకూలంగా ఉన్నాయో చూసి వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడానికి నిర్ణయించిన శాంతులు, అభిషేకాలు, దానాలు, ప్రదక్షణాలను తెలుపుతారు.



మనందరం జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణంగా నవగ్రహాలకు ప్రదక్షణలు చేసిన వాళ్ళమే.ప్రదక్షణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను పరీక్షగా చూసి ఉన్నామా ? తొమ్మిది గ్రహాలూ ఏ విధంగా ఉన్నాయి,  ఏయే దిక్కులను చూస్తున్నాయి, వారి వాహనాలు ఆయుధాలు ఏమిటి అన్న విషయాలను గమనించామా ?

ఇప్పటి దాకా చూడక పోతే ఇక ముందు చూడండి. ఎన్నో అరుదైన విషయాలు తెలుస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం చుట్టుపక్కల మరియు చెన్నై చుట్టుపక్కల నవగ్రహ ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఆ ఆలయాలలో పరమశివుడే ఆయా గ్రహాల పూజలు అందుకొంటారు. కానీ నవగ్రహ మండపంలో తొమ్మిది గ్రహాలే ఉండి భక్తుల అభిషేకాలు,పూజలు స్వీకరిస్తుంటారు.

నేను స్వయంగా సందర్శించిన కొన్ని ఆలయాలలో ఉన్న నవగ్రహ మండప విశేషాలను అందరితో పంచుకొందామన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాస్తున్నాను.


*తిరువారూరు :*

🍁🌸🌺🍁🌸

 తమిళనాడులోని అతి పెద్ద ఆలయాలలో ఒకటి. సంగీత త్రిమూర్తులుగా కీర్తించే శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితార్, శ్రీ శ్యామశాస్త్రి ల జన్మస్థలం. శ్రీ త్యాగరాజ స్వామి   ఆలయంలో ఉన్నన్ని పరివార దేవతల సన్నిధులు వేరెక్కడా కనపడవు. ఒక్క వినాయక విగ్రహాలే వంద దాకా ఉంటాయి. ప్రతి నిత్యం ప్రదోష పూజలు జరుగుతాయి.

ఆలయానికున్న మూడు ప్రాకారాలలో మొదటి ప్రాకారంలో ఉంటుంది నవగ్రహ మండపం.

సహజంగా సూర్యుడు, శుక్రుడు తూర్పు, చంద్ర, శని పడమర, బుధ, గురు ఉత్తరం, అంగారక, రాహు కేతువులు దక్షిణ దిశలను చూస్తుంటారు. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ ఒక వరుసలో పడమర దిశను   అంటే   గర్భాలయం లోని శ్రీ త్యాగరాజస్వామి ని చూస్తుంటాయి.హస్త, చిత్త నక్షత్ర జన్ములకు పరిహార క్షేత్రం తిరువారూరు.

తిరువారూరు కు తంజావూరు, కుంభకోణం, చిదంబరం,చెన్నై నుండి నేరుగా చేరుకోడానికి బస్సు రైలు సౌకర్యం లభిస్తుంది. తప్పక సందర్శించవలసిన ఆలయాలలో ఒకటి.



*మైలాడుతురై  (మాయవరం):*

🍁🌸🌺🍁🌸

   పట్టణంలోని శ్రీ మయూరనాథ స్వామి కోవెల కారణంగా  ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. నెమలి రూపంలో పార్వతీదేవి సర్వేశ్వరుని గురించి తపస్సు చేసి సాక్షత్కారం పొందినట్లుగా ఆలయ గాధ చెబుతోంది. విశేష ఆలయం. ఈ క్షేత్రంలోని నవగ్రహ మండపంలో శనీశ్వరుడు తల మీద అగ్ని శిఖలతో దర్శనమిస్తారు. జ్వాలాశని గా పిలిచే ఈయనకు అభిషేకాలు జరిపిస్తే ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది అని చెబుతారు.

ఇలాంటి శని రూపం మరో ఆలయంలో కనపడదు.

మైలాడుతురై కి చెన్నై, మధురై, తంజావూరు, కుంభకోణం, చిదంబరం నుండి నేరుగా రైలు, బస్సు మార్గాలలో సులభంగా చేరుకోవచ్చును.

తిరుక్కొల్లిక్కాడు   : తిరువారూరు కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుక్కొల్లిక్కాడు శ్రీ అగ్నీశ్వర స్వామి ఆలయం ఒక విశేష నిర్మాణం.  శని భగవాన్ ప్రత్యేక సన్నిధిలో అనుగ్రహ మూర్తిగా దర్శనమిస్తారు. శనివారాలు ఉమ్మెత్త పూలతో అర్చన చేయడం వలన ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చును అంటారు.

గ్రహ సంబంధిత అభిషేకాలు, అర్చనలు గర్భాలయంలో కొలువైన శ్రీ అగ్నీశ్వర స్వామికే చేస్తారు. నవగ్రహ మండపంలోని నవగ్రహాలు అసహజ పద్దతిలో ఒకదానికి ఒకటి ఎదురు బొదురుగా కొలువై ఉంటాయి. శ్రీ అగ్నీశ్వరస్వామే భక్తులకు వాటి తరుపున ఉపశమనం కలిగించడం వలన పనిలేక నవగ్రహాలు కబుర్లు చెప్పుకొంటున్నాయి అని హాస్యమాడుతుంటారు స్థానికులు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారి పరిహార క్షేత్రం.



*విలంకుళం :*

🍁🌸🌺🍁🌸

 తంజావూరు కు డెబ్భై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విలంకుళం శ్రీ అక్షయపురీశ్వర స్వామి వారు కొలువైన దివ్య క్షేత్రం. సోదరుడు యమునితో జరిగిన ఒక వివాద సందర్బంగా శనీశ్వరుని కాలు విరిగిందట. ఈ క్షేత్రంలో పరమేశ్వరుని అనుగ్రహంతో సరైనదట. ఈ కారణంగా విలంకుళం శని పరిహార క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. భార్యలైన మందాదేవి మరియు జ్యేష్టాదేవి లతో కలిసి కళ్యాణ శనీశ్వరునిగా కొలువైన ఈయనకు నువ్వుల నూనెతో ఎనిమిది పర్యాయాలు అభిషేకం జరిపితే అర్ధాష్టమ, ఏలినాటి, జన్మ శని ప్రభావం తొలగిపోతుంది అన్నది స్థానిక విశ్వాసం. శనివారాలు పెద్ద సంఖ్యలో భక్తులు అభిషేకాలు జరిపించుకోడానికి వస్తుంటారు. సూర్యభగవానుడు మరో ఉపాలయంలో దర్శనమిస్తారు. 

అన్ని కోర్కెలను నెరవేర్చే శ్రీ అక్షయ పురీశ్వర స్వామి, కళ్యాణ శని మరియు ఆదిత్యుడు కొలువైనందున వేరుగా నవగ్రహ మండపం ఉండదు. నవగ్రహ మండపం లేని అతి తక్కువ ఆలయాలలో ఇదొకటి.

దేవీ పట్టిణం : రామేశ్వరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సాగర తీర క్షేత్ర గాధ  రామాయణంతో ముడిపడి ఉండటం విశేషం. సీతాదేవిని రావణాసురుని చెర నుండి విడిపించడానికి లంకను చేరటానికి వారధి నిర్మించడానికి ముందు శ్రీ రాముడు వానర సేనతో ఇక్కడకి వచ్చారట. సముద్రం తీరాన తొమ్మిది శిలలను నవగ్రహ రూపాలుగా ప్రతిష్టించి పూజలు జరిపించారట. శ్రీ సౌందర్య నాయకీ సమెత శ్రీ తిలకేశ్వర స్వామి, శ్రీ అష్టభుజ దుర్గాదేవి ఆలయంలో కొలువై ఉంటారు. సముద్రంలో ఉన్న నవగ్రహ శిలలకు, అష్టభుజ దుర్గాదేవికి అర్చనలు జరిపించుకొంటే అన్ని గ్రహబాధలు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు.

దేవీ పట్టిణం పితృకార్యాలకు ప్రసిద్ధి. ఇలా సముద్రం కొలువైన  రూపు లేని శిలలుగా నవ గ్రహాలు  పూజలు అందుకొనే క్షేత్రం దేవీ పట్టిణం ఒక్కటే !

తెందురి పెరై : పావన తమిరబారాణి నదీతీరంలో నెలకొన్న తెందురిపెరై శైవులకు దర్శనీయమైన నవ కైలాసాలలోను, వైష్ణవులకు పూజ్యనీయమైన నవ తిరుపతులలోనూ స్థానం పొందిన స్థలం. పెరుమాళ్ కోవెల వైష్ణవ సంప్రదాయం ప్రకారం సూర్య క్షేత్రం. దగ్గరలోనే ఉన్న శ్రీ శివగామీ సమేత  శ్రీ కైలాస నాథర్ కొలువైన ఆలయం బుధ పరిహార క్షేత్రం. ఇక్కడి నవగ్రహ మండపంలో సూర్యుడు ఏడు, చంద్రుడు పది, శుక్రుడు మరియు గురువు ఎనిమిది అశ్వాలు పూంచిన రధాలలో ఉపస్థితులై దర్శనం ఇవ్వడం అరుదైన విషయం. ఇలా మరెక్కడా కనపడదు.

తిరువణ్ణామలై  : స్మరిస్తే చాలు ఇహపర సుఖాలను అనుగ్రహించే పవిత్ర నామం అరుణాచలేశ్వర. ఈ దివ్య క్షేత్రంలో అయ్యన్ కుళం పుష్కరణి దగ్గర ఉన్న శ్రీ అరుణగిరినాథర్ లింగం శ్రీ మహావిష్ణు ప్రతిష్టగా చెబుతారు. ఈ ఆలయంలోని నవగ్రహ మండపంలో నవగ్రహాలు తమ భార్యలతో సహా తమతమ వాహనాల మీద కూర్చొని దర్శనమివ్వడం అత్యంత అరుదైనది  పేర్కొనవచ్చును.  వివాహం కానివారు, సంతానం లేనివారు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ నవగ్రహ పూజలు జరిపించుకొంటుంటారు.


*తిరుకుళందై (పెరుంకుళం):*

🍁🌸🌺🍁🌸


 తమిరబారాణి నదీ తీరంలో నెలకొన్న శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో మరియు నవ తిరుపతులలో శని క్షేత్రంగా పెరుంకుళం ప్రసిద్ధి. శ్రీదేవి మరియు శ్రీ వెంకట వాసన్ పెరుమాళ్ స్థానిక భంగిమలో దర్శనమిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఇది శని పరిహార క్షేత్రం. ఒక వైష్ణవ ఆలయంలో నవగ్రహ మండపం నెలకొని ఉండటం అరుదైన విషయం.  నవగ్రహలతో పాటు ప్రత్యేక సన్నిధిలో కొలువైన శ్రీ శని భగవానుకు జాతకరీత్యా శని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నవారు ప్రత్యేక పూజలు జరిపించుకొంటుంటారు. పెరుంకులం తెందురిపెరై కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

మధురై : శ్రీ మీనాక్షీ సమేత సోమసుందరేశ్వర స్వామి కొలువైన మధురై ఎన్నో విశేష ఆలయాలకు పుట్టినిల్లు. వాటిల్లో ఒకటి శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల ఒకటి. శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి. శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ అళగర్ పెరుమాళ్ గర్భాలయంలో ఉపస్థిత భంగిమలో నిలువెత్తు రూపంలో నయనమనోహరంగా దర్శనమిస్తారు.  మధురై రైల్వే స్టేషన్ కి సమీపంలో ఉన్న ఆలయంలో కూడా నవగ్రహ మండపం కనిపించడం ఒక ప్రత్యేకత. నియమంగా నవగ్రహ పూజలు నిర్వహిస్తారు.

ఇలా ఎన్నో ప్రత్యేక విశేష రూపాలలో  నవగ్రహలు కొలువైన మండపాలను తమిళనాడులోని పెక్కు పురాతన చారిత్రక ఆలయాల్లో దర్శించుకోవచ్చును.

ఆదిత్యాయ సోమాయ మంగళాయ భుధాయచ!గురు శుక్ర శనిభేష్య రాహవే కేతవే నమః!

🍁🌸🌺🍁🌸🌺🍁

*మీ.. ఆశ్రిత్ గ్రూప్*

అమృతం గమయ

 🌸 అమృతం గమయ 🌸


*అమృత జ్ఞానం - ఆత్మజ్ఞానం*


ఇక్కడ ప్రతిరోజూ తెల్లవారుతోంది. పగలు వెళ్ళిపోతోంది. రాత్రి మొదలవుతోంది. రాత్రి తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతోంది. పగలు తిరగడం, రాత్రుళ్ళు పడుకోవడం. ఎన్నాళ్ళిలా? 

ప్రతిరోజూ తిన్నదే తింటున్నాం. 

తాగిందే తాగుతున్నాం. తిరిగిన వీధుల్లోనే తిరుగుతున్నాం. 

అదే మంచం ఎక్కి దుప్పటి కప్పుకుని పడుకుంటున్నాం. రోజూ అదే తిండి. అదే నీరు. అదే మంచం. అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు. దుఃఖం తొలగడమూ లేదు. 

ఏమాత్రం అర్దంకాని ఈ పగలు, రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి? ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది. ఇందులో అంత ఆశ్చర్యపడాల్సింది మాత్రం ఏముంది. ఇక్కడ పుట్టే ప్రతిదీ ఒకనాటికి తప్పక నశిస్తుంది. 


నిత్యం కొందరు జన్మించడం మరికొందరు మరణించడం అనేది లోకంలో కనిపిస్తున్నదే. మరి ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి? ఈ ఆరాటం దేనికి? నాలో ఏర్పడి ఉన్న ఈ “నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా నాకు ఎక్కడినుంచి వచ్చింది? ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని ఒక ప్రక్క తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను. 


చాలా డబ్బు సంపాదించాలి. దాన్ని భద్రంగా దాచుకోవాలి. అందరికంటే పెద్దవాణ్ణి అయిపోవాలి అని. ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి.


నా దుష్ట తెలివితేటలతో జీవితమంతా శ్రమించి ఎంత సంపాదించినా మరణంతో అదంతా ఇక్కడ వదిలెయ్యాల్సిందే గదా. ఇక్కడ వదిలెయ్యాల్సిన దానికోసం నేనెందుకు ఇంత ఆరాటపడుతూ, ఆయాసపడుతూ సంపాదిస్తున్నాను? 


అలా అని ఎందుకనుకోవాలి ఇదంతా నా వారి కోసం గదా అనుకుందామనుకుంటే! నా వారు అనేదానికి ముందే నేను ఉండి ఉండాలి కదా! నేను లేకుండా నా వారు అనేవారు ఎక్కడనుంచి వస్తారు. ఆ “నేను” అంటే ఎవరు. అసలు “నేను” అనేది నాలో దేనిని? ఇలా నేనెవరో నాకే అర్ధం కానప్పుడు ఇక నావారు అనేదంతా ఏంటి? పిచ్చి మోహం కాకపోతే! నావారు సంగతి సరే! అసలు నేనెవరివాడిని? నన్ను మా వాడు అనుకున్నవాళ్ళు ఇప్పుడెక్కడ ఉన్నారు? వారు లేరు. కొన్నాళ్ళ తర్వాత నేను ఉండను. ఇక నా వాళ్ళు అనుకునేవాళ్ళు మాత్రం ఇక్కడెన్నాళ్ళు ఉంటారు. 


ఈ నేను నాది అనుకునేదంతా ఒక నాటికి కాలం చేతిలో మింగబడబోయేదే గదా.


నిన్నటి వరకు పెద్ద వీరుడు, శూరుడు, ధనవంతుడు అనిపించుకున్నవాడు నేడు విగత జీవుడై పాడెమీద నిస్తేజంగా వెల్లికిలా పడుకుని మౌనంగా స్మశానానికి పయనమయిపోతున్నాడు. 


అక్కడ గుప్పెడు బూడిదగా మారి మట్టిలో కలిసిపోతున్నాడు. 


ఈ శరీరాల యొక్క అంతిమ సత్యం గుప్పెడు బూడిదే కదా.


ఈ మాత్రం దానికి ఇక్కడ ఇంతటి మోహం, ఇంతటి స్వార్ధం, ఇంతటి దుఃఖమా? ఇదంతా ఎంతటి బాధాకరం. 


ఇది బహు విచిత్రంగానూ, అయోమయంగానూ ఉంది. కాసేపు ఇదంతా ప్రక్కన పెడితే...


మరి ఇక్కడ జీవించి ఉన్న కాలంలో దేన్ని పొందితే ఈ జీవితం ముగిశాక కూడా అది నాతోపాటే వస్తుంది? 


అలాంటిదేదయినా అసలు ఇక్కడ ఉందా? 


అలాంటిది ఏదో ఒకటి ఇక్కడ తప్పక ఉండే ఉండవచ్చు. 


అలా కాకపోతేగనక ఈ జన్మించడం అనే శ్రమ నాకు ఎందుకు ఉంటుంది. 


ఏదో ఒక ప్రయోజనం ఇక్కడ ఉండి ఉన్నందునే బహుశ నేను ఇక్కడ జన్మించి ఉంటాను. 


అయితే అది ఏదో సంపాదన పిచ్చిలో పడి పొర్లాడుతున్న ఇప్పటి నా దుష్ట బుద్ధికి తెలియడంలేదు. 


కానీ అది నేను తప్పక తెలుసుకోవాలి. 


ఎలా తెలుసుకోవాలి? 


బహుశ అది తెలిసిన మహాత్ములను నేను తెలుసుకోగలిగితే అప్పుడు ఆ సత్యాన్ని వారిద్వారా నేను తెలుసుకోవచ్చు. 


సర్వం ఎరిగినవారు ఈ లోకాలలో ఎక్కడో ఒకచోట తప్పక ఉండే ఉంటారు. 


ఎలాగయినా సరే అది ఎంతటి శ్రమ అయినా సరే నా ఈ జీవితం మొత్తం కరిగిపోయినా సరే ఈ శరీరం కూలిపోయేలోపల ఆ మహాత్ములను నేను తప్పక చేరుకుంటాను. 


కాబట్టి ఇప్పటినుంచి ఇక నా పని వారిని గుర్తించడమే.


వారిని గుర్తించి వారిని ప్రార్ధించి వారినుంచి తెలుసుకోవాల్సిన ఆ సత్యాన్ని తెలుసుకుంటాను. 


ఆ తర్వాత మిగిలిన జీవితమంతా అది పొందే ప్రయత్నం చేస్తాను. 


ఒకవేళ ఈ జన్మలోనే గనక ఇది జరక్కపోతే నేను మళ్ళీ మళ్ళీ ఈ లోకాలలోకి శరీరాలతో రావలసి ఉంటుంది. 


అయితే ఇప్పటిలా ఈ మానవదేహాన్ని తర్వాత రాబోవు జన్మలలో కూడా నేను పొందగలను అనే నమ్మకం ఏముంది? 


ఏ పశు, పక్షి, కీటకం లాంటి దేహాలు గనక నేను పొందితే ఇక అప్పుడు నా పరిస్థితి ఏంటి? 


ఆ దేహాలు లోకంలో అందరికీ తిరస్కారమైనవే కదా!


ఆ దేహాలతో నన్నెవరు దగ్గరకు రానిస్తారు? 


అప్పుడు ఇక ఆ దేహాలతో నాకు ముక్తి ఎలా లభిస్తుంది. 


కాబట్టి ఇప్పటివరకూ వృధా అయిన కాలం ఏదో వృధా అయింది. 


ఇక ఇప్పటినుంచి ఒక్క క్షణం కూడా ఆలస్యంగాని, వృధాగాని కానివ్వకుండా జ్ఞానులకొరకు తీవ్ర ప్రయత్నం చేస్తాను అనుకుంటూ తనలో ఒక దృడ సంకల్పాన్ని ఏర్పరచుకుని మహాత్ముల కొరకు లోకాన్ని జల్లెడ పడుతున్నాడు. 


శాశ్వతమయిన ఆత్మ శాంతి కొరకు లోకం అంతా అలా మాసిన బట్టలతోనే మహాత్ముల కొరకు గాలిస్తూ తిరుగుతూనే ఉన్నాడు. 


ఎక్కడయినా ఎవరయినా పెడితే అంత తింటున్నాడు.


లేకుంటే మార్గమధ్యంలోని పంట కాలువలలోకి దిగి గుక్కెడు నీళ్ళు గొంతులో పోసుకుని శక్తిని కూడదీసుకుంటూ మళ్ళీ మహాత్ముల కొరకు అన్వేషిస్తూ తిరుగుతున్నాడు. 


మానవుడు దేనికొరకు తీవ్రమయిన ప్రయత్నం చేస్తే అతడు దాన్ని తప్పక పొందుతాడు అనేది సృష్టి ప్రారంభంలో సృష్టికర్త ఏర్పరచిన ఒక నియతి. 


అందువల్ల అతడి మహాప్రయత్నం అనే తీవ్ర అన్వేషణ ఫలించి అతడి ప్రశ్నలకు సమాదానం చెప్పగలిగే గురువు ఒకనాటికి అతడికి లభిస్తున్నాడు. 


అలా అతడికి లభించిన గురువు అతడి దుఃఖం మొత్తం తొలగించడానికి చెప్పే జ్ఞానమే ఆత్మ జ్ఞానం. 


ఆత్మ స్వరూపులయిన తామందరూ ఈ ఆత్మ జ్ఞానం మీదే మనస్సు పూర్తిగా పెట్టి ఆచరణలోకి దిగవలసి ఉంటుంది.


*ప్రశాంతంగా, ఆనందంగా ఉండండి. సత్యజ్ఞానం కలిగి ధర్మయుత కర్మ చేయండి. నేను మీతో ఉన్నాను - సత్ చిత్*

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*ఋతుక్రమం..ఊర్ధ్వ, అధో లోకాల వివరణ..*


*(ముప్పై నాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు ఏదో ముఖ్యమైన విషయం గురించి వివరించబోతున్నారని శ్రీధరరావు దంపతులకు, సత్యనారాయణమ్మ గారికీ అర్ధమైంది..


"స్త్రీలైనా..పురుషులైనా..పశుపక్ష్యాదులైనా.. క్రిమికీటకాలైనా..శరీరధారణ ఉన్న ప్రతి జీవికీ..ఆకలి దప్పులు.. నిద్ర, మైధునం.. ఋతుక్రమం..సంతానోత్పత్తి..మల, మూత్ర, స్వేద, కఫ, అపానవాయు విసర్జన అన్నది తప్పనిసరిగా ఉంటుంది..వీటిలో ఏ ఒక్క ధర్మాన్నీ..ఏ జీవీ తప్పించుకోలేదు..ఏ ఒక్కటి సరిగ్గా జరుగాకపోయినా..ఆ జీవి అనారోగ్యం పాలు కావటమో.. లేదా ఏదో లోపంతో బాధపడటమో జరుగుతుంది..అవునా?..ఇక మానవమాత్రుల విషయానికి వస్తే..స్త్రీలకు బహిష్టు అనేది సహజమైన శారీరిక ధర్మం!..మల మూత్ర విసర్జన..శరీరానికి చెమట పట్టటం..జలుబు చేస్తే..ముక్కులోంచి చీమిడి రావడం..దగ్గు వచ్చినప్పుడు కళ్ళే రావడం..ఎంత సహజమో..ఇదీ అంతే సహజం!..అవన్నీ అపవిత్రం కానప్పుడు..ఇది అపవిత్రం ఎలా అవుతుంది?..మానవ శరీరం ఒక మహా అద్భుత లోకం.." అంటూ అనర్గళంగా చెపుతూ ఒక్కక్షణం ఆగి ..ప్రభావతి గట్టి వైపు చూసి..


"తల్లీ!..అసలు సప్త సముద్రాలు..పోనీ పద్నాలుగు లోకాలు అంటే ఏమిటో చెప్పమ్మా.." అని అడిగారు..


"నాయనా!..ఇలా గబుక్కున చెప్పమంటే చెప్పలేను కానీ..భూమి క్రింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలనీ..భూమికి పైన..స్వర్గలోక, సువర్ణలోక, భువర్ణలోక, సత్యలోక, తపోలోక, బ్రహ్మలోక..ఇలా చెపుతారు..వాటి క్రమం ఎలా ఉంటుందో గుర్తులేదు..చదివి చాలా రోజులైంది.." అన్నారు ప్రభావతి గారు..


"అవునమ్మా..అలానే చెపుతారు..అయితే అవన్నీ మనిషి శరీరం లోనే ఉన్నాయి తల్లీ బాగా ఆలోచిస్తే..సప్త సముద్రాలు అంటే..లవణ, క్షీర, రక్త, స్వేద, జీర్ణకోసం లోని ఆమ్లాలు..నోటిలోని లాలాజలం ఇలా చెప్పుకోవచ్చు..అలాగే నీవు చెప్పిన ఊర్ధ్వ, అధో లోకాలకు కూడా మానవదేహమే నిలయం..మాలాంటి యోగులు, మనో నేత్రాలతో..యోగసిద్ధితో చూస్తాము వాటిని..మేము చెపితే సత్యమని నమ్మి, చిత్తశుద్ధితో ఆలోచిస్తే తప్ప తెలుసుకోలేరు మీరు!.."


"చూడు తల్లీ!..శరీరాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తే..నాభి అనేది భూలోక స్థానం..అటు పైలోకాలకు, ఇటు క్రింది లోకాలకు నాభి ఆధారభూతం..నాభి నుండి క్రింది భాగం..ఆకలి దప్పులకు.. జీర్ణకోశానికి, ప్రాణీ జన్మస్థానానికి..మల మూత్ర విసర్జనకు..ప్రాణీ కదలికలకు..సృష్టి కార్యానికి ఆధారం..ఉదాహరణకు..మీరు ఏ రైల్లోనో..బస్సులోనో ప్రయాణం చేస్తున్నారు..లేదా ఎక్కడో ఒకచోట ముఖ్యమైన పనిలో ఉంటారు..హఠాత్తుగా మల మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది..అవకాశం లేదనుకోండి..అప్పుడేం చేస్తారు?..ఒక గంట పాటో.. అరగంట పాటో..లేదా మీరు ఆపుకోగలిగినంత సేపు ఆపుకుంటారు..అవునా?..అంటే..నీ శరీరం లోనే ఒక మరుగుదొడ్డి ఉంది..నీ వెంటే మోసుకుపోతున్నావు..మళ్లీ అవకాశం రాగానే..విసర్జిస్తారు..శరీరం లోని ఆ భాగం ఖాళీ అవుతుంది..ఒక క్రమబద్ధమైన ఏర్పాటు శరీరం లో వుండన్నమాట!..అవగతం అవుతోందా?..అందుకే నాభి నుండి క్రింది భాగాలను అధోలోకాలు అనవచ్చు..ప్రతి ప్రాణీ పుట్టుకా అధోలోకాల నుండే జరుగుతుంది..అలాగే ఈ బహిష్టు కూడా..శరీరం లోపల తయారవుతున్న మకిలి..అవసరమైన మంచి రక్తం నీలోనే ఉంచబడి..చెడు రక్తం బహిష్టు రూపం లో బైటకు వెళ్ళిపోతుంది..దానికి రకరకాల పేర్లు పెట్టి..ఇంటికి దూరంగా ఉంటారు.."


"ఇక ఊర్ధ్వ లోకాలు..నాభి పై స్థానాలు..రక్తప్రసరణకు ఆధారమైన గుండె..నాడీమండలం..ఆలోచనకు మెదడు..శిరస్సు..రుచులు ఆస్వాదించే నాలుక..మాట్లాడటానికి నోరు..ధ్వనిని గ్రహించే చెవులు..దృష్టి తెలుసుకునే కళ్ళు.. ఇవి..వీటినే ఊర్ధ్వలోకాలుగా భావించండి..నీ ఆలోచన సక్రమంగా ధర్మబద్ధంగా వుంటే..నీ శరీరం ధర్మమార్గంలో పయనిస్తుంది..అవి వక్రంగా వుంటే..జీవితమే గతి తప్పుతుంది.."


"యోగులు ఇంద్రియ నిగ్రహం..రాజయోగం..గుహ్యప్రదేశం నుండి..మూలాధారం మొదలు సహస్రారం వరకూ కొనసాగిస్తారు..అంటే జీవి అధోలోకం నుండి..నాభి దాటి..ఊర్ధ్వలోకాలను తెలుసుకొని..ఆత్మజ్యోతిని దర్శించటం అన్నమాట!..ఇది మానవ దేహం లోనే ఉన్న ఊర్హ్వ అధోలోకాల గురించి క్లుప్తంగా ఇస్తున్న వివరణ.." 


"ఇక అసలు విషయానికి వద్దాము..పెద్దలు ఏ ఆచారాన్నీ అనవసరంగా పెట్టరు.. ప్రతి దానికీ ఒక సహేతుకమైన కారణం ఉంటుంది..అదేమిటో వివరిస్తాను..శ్రద్ధగా వినండి.." అన్నారు..


శ్రీ స్వామివారు చెప్పబోయే వివరణ కోసం ఆతృతగా ఎదురుచూడసాగారు ఆ ముగ్గురూ..


ఋతుక్రమం..ఆచారం..మరింత వివరణ.. రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీ మాతా స్వరూపము

 🙏 *శుభోదయం* 🙏 


*ప్రకృతి అంటే శ్రీ మాతా స్వరూపము..*


*ప్రపంచంలోని మిగతా అన్ని జీవ జంతుజాలాలు ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాయి..ఒక్క మనిషి తప్ప...*


*ప్రకృతితో మమేకం కావడం అంటే అమ్మతో కలిసి ఉండటం . అమ్మ ఒడిలో ఉండటం...*

 

*పిల్లవాడు అమ్మ ఒడిలో ఎంత భద్రతను పొందుతాడు?*


*అమ్మ ఒడిలో ఉండటం అంటే భద్రంగా ఉండటమే...* 


*అమ్మ ఒడిలో ఉండటం అంటే మనఃశాంతితో జీవించడమే...* 


*అమ్మ ఒడిలో ఉండటం అంటే ఏ చీకూ చింతా లేకుండా ఉండటమే....* 


*అమ్మ ఒడిలో ఉండటం అంటే కష్టం అనే మాటకు తావు లేకుండా ఆనందంగా ఉండటమే...* 


*కానీ, ఈ సృష్టిలోని ప్రతి జీవజాలం పైవన్నీ పొందుతున్నాయి... ఒక్క మనిషి తప్ప...*


*ఒక్క మనిషికే భద్రత లేదు, మనఃశాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, ఎప్పుడూ ఏదో ఆరాటం ... జీవన పోరాటం....*

 

*మిగతా జీవాలకు లేని ఆరాటం, పోరాటం మనిషికి మాత్రమే ఎందుకు?*


*వివేకం అనే ఒక్క ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉన్నందుకు మాత్రమే మనిషికి ఈ జీవన పోరాటం...*

 

*జీవిత పరమార్థాన్ని తెలుసుకుని, కర్మ చక్రంనుంచి ముక్తిని సాధించడానికి, జీవన్ముక్తి పొందడానికి మనిషికి వివేకం అనే లక్షణాన్ని ఇస్తే, అవివేకిగా మారి, ఈ ప్రకృతినే విధ్వంసం చేసే స్థితికి దిగ జారాడు....*


*ప్రకృతి మనకు ఆహారాన్ని అందించి, బ్రతకడానికి చోటిస్తే, ఆ తల్లికే చోటు లేకుండా చేస్తున్నాడు...*


*కన్న తల్లినే అంగట్లో సరుకుగా మార్చేశాడు...*

 

*తల్లి పాలతో వ్యాపారం చేసే స్థాయికి దిగజారాడు...*


*తన స్థాయిని మరచిపోయి బ్రతుకుతున్నాడు...* 


*పైగా సుఖం, శాంతి, ఆనందం వెతుక్కుంటూ పరుగులు పెడుతున్నాడు....*

 

*దీనికి పరిష్కారం ఎక్కడ? ఎలా?*


*మనిషి మనిషిగా జీవిస్తే చాలు, అదే గొప్ప పరిష్కారం...,*

 


*తెలివైన వాడుగా నిరూపించుకునే ప్రయత్నంలోనే ఈ విధ్వంసం అంతా...*


*ఆ తెలివిని అమ్మను, శ్రీ మాతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తే, పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తే అంతా ఆనందమే ... అంతా సుఖమే.... అంతా శాంతి మాత్రమే ...*


*మనమే పాడు చేసుకుని, మళ్ళీ మనమే దాన్ని వెతుక్కుంటున్నాము ...* 


*ఈ సృష్టిలో ఉన్నది ఆనందం ఒక్కటే.....*


*ఆనందమే అమ్మప్రేమ... ప్రకృతిని ప్రేమిస్తే, బాధ్యతతో వ్యవహరిస్తే అమ్మప్రేమ ఎప్పుడూ మన వెంటే, మన తోటే..* 


🙏🙏🙏🙏🙏🙏🙏

కళా తపస్వి

 కళా తపస్వి కనుమరుగయ్యారు


సినిమా పరిశ్రమలో ఒక తరం వారాంతా మహా ప్రస్థానానికి ఒకరి తరువాత ఒకరు వెళ్ళి పోతున్నారు..


సంతోషంగా సాగనంపడం, కడ సారి ఆత్మ నమస్కారం చేసుకోవడం, ఆత్మీయమైన జ్ఞాపకాలు తవ్వుకోవడం తప్పా నిజం చెప్పాలంటే ఇవన్నీ హాయిగా ఒప్పుకోవలసిన ప్రస్థానాలే..


అయన్ని నేను  విజయవాడలో శంకరాభరణం సినిమా విజయోత్సవం లో లక్ష్మీ టాకీస్ దగ్గర చూశాను.  ఆ సినిమా విడుదల అయ్యిన ఓ 50 రోజుల్లో ఆయనకి ప్రజలు జరిపిన సత్కారాలు సన్మానాల ముందుమిగతా బిరుదులు పురస్కారాలన్నీ తీసికట్టే..!


అలాంటి గొప్ప అభిమానం సినిమా రంగం ద్వారా సాధించిన విశ్వ నాథ్ గారు నిజంగా కళా తపస్వే.!!


వారితో పాటు ఆ సినిమా తీసిన నిర్మాతలకి కూడా అంత గౌవురవం దక్కింది..కానీ వారు మాత్రం విశ్వనాథ్ గారికే ఆ గవురవం కట్టబెట్టారు.


ఇంక సిరివెన్నెల తోడయ్యకా వారి సినిమాలలో పాటలు సినిమా ప్రపంచంలో  పరుగాపక పయనించవే తలపుల నావా కెరటాలకి తలవంచితే తరుగదు తోవా..మది కోరిన మధుసీమలను వరించేసారు ..ఇద్దరూ 

 ఆమని కై ఎదురు చూస్తూ ఆగిపోకుండా  నలు దిక్కుల  యతి రాజుకి జతి స్వరమిచ్చిన కళా తపస్వి..

అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా అనుకుంటూ 

నిదురించిన తెలుగు జాతికే కాక యావత్ ప్రపంచానికి ఆ నటరాజు నాట్యాలను వెన్నెల తిన్నెలలో గాన మధురిమలు అద్ది మరీ చూపించిన ఆయన్ని

కళా తపస్వి అనడంలో సార్ధక నామ దీయుడే గా మరి.

చాగంటి కోటేశ్వరరావు గారు తమ ప్రవచనాల్లో ఈయన గురించి ప్రస్తావించారు అంటేనే అర్థం చేసుకోవచ్చు.


అలాంటి వారికి మరణం కేవలం శరీరానికే కానీ.. వారి కళాత్మకమైన ఆత్మకి కానే కాదు.


ఒక ఆత్మీయ నమస్కారం చేసుకుంటూ ఆయన సినిమాలలో పాటలు వింటూ పని చేసుకోవడం నిజంగా ఒక అందమైన అనుభవం.

🙏🙏🙏

ఐకమత్యంతో

 శ్లోకం:☝️

*బహూనాం చైవ సత్వానాం*

 *సమవాయో రిపుంజయః ।*

*వర్షాధారాధరో మేఘః*

 *తృణైరపి నివార్యతే ॥*

  - చాణక్య నీతి - 14.4


భావం: గడ్డితో కట్టిన గుడిసె కూడా కుండపోత వర్షాన్ని ఆపేసినట్టు, చాలా మంది సంఘటితమై ఐకమత్యంతో ఉంటే ఎలాంటి శత్రువునైనా జయించగలరు.

పక్కలో మూత్రం పోయకుండా నివారించే అద్భుత యోగం

 7 రోజుల్లో పిల్లలు పక్కలో మూత్రం పోయకుండా నివారించే అద్భుత యోగం  - 


      ప్రతినిత్యం రాత్రి పడుకునే సమయంలో 125 ml పాలల్లో చిటికెడు ఆవాల పొడి కలిపి తాగించుచున్న 7 రోజుల్లో  చిన్నపిల్లలు పక్కలో మూత్రం పోయుట ఆగిపోవును .


  గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

సద్బోధ

 .


                        *సద్బోధ*

                         ➖➖➖

*ఒక చిన్న పిల్లవాడు సంతలో తప్పిపోయాడు. వాళ్ళ అమ్మ కోసం వెతుకుతాడు. భయంతో అటూ ఇటూ పరిగెత్తుతాడు. "అమ్మా, మమ్మీ!" అంటూ అరుస్తాడు.* 


*అయితే తల్లి కూడా తప్పిపోయిన బిడ్డ కోసం వెతుకుతుంది. ఎప్పుడైతే పిల్లవాడు తనకు చిక్కుతాడో ఆ తల్లి బిడ్డను తన చేతుల్లోకి ప్రేమతో తీసుకుంటుంది, ఒడిలో ఉంచుతుంది.*


*పిల్లవాడు కూడా ఏడుపు ఆపి తల్లి ఒడిలో ఉన్నానన్న దైర్యంతో అప్పటి వరకు ఉన్న భయం నుండి విముక్తి పొందుతాడు.*


*మనము కూడా ఆ పిల్లవాడి మాదిరి సంసారం అనే సంతలో పడి దైవము నుండి తప్పిపోయిన వారిమే!*


*కనుక తేరుకుని కాస్త బిగ్గరగా పిలవండి, తలవండి, ప్రార్ధించండి, స్మరించండి, భజించండి, ధ్యానించండి, సేవించండి.* 


*సంసారములో ఉండినా ఎల్లపుడూ దైవపు ఆలోచనలలో మాత్రమే నిమగ్నమై ఉండండి. దారి తప్పిపోయామని బాధ పడుతూ కూర్చుంటే మార్గం దొరకదు. గమ్యం చేరుకోలేము. భగవంతుడు కూడా మన పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. పిలిచినంతనే పరుగెత్తుకు వచ్చి తన అక్కున చేర్చుకుంటాడు. భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇదే మార్గం.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                             🌷


           లోకాః సమస్తాః సుఖినోభవన్తు!

వట్టి చేతులతో పోరాదు

 వీరి వద్దకు వట్టి చేతులతో పోరాదు


కొందరి దగ్గరకు పోయేసమయంలో

రిక్తహస్తాలతో(వట్టిచేతులతో) పోరాదు.

ఈ శ్లోకంలో చూడండి.


అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ

రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుమ్



అగ్నిహోత్రము దగ్గరకు - గృహమునకు - పంట పొలమునకు -

గర్భవతి చెంతకు - వృద్ధ బాలకుల చూచుటకు - రాజు, దేవుని, 

గురువును దర్శించుటకు - వట్టిచేతులతో పోరాదు.

పాక శాస్త్ర పాండిత్యం

 పాక శాస్త్ర పాండిత్యం...

పరమాచార్య వారు వేద వేదాంగాలు, ఉపనిషత్తులకు భాష్యం చెప్పడమే కాదు.పాక శాస్రం లో కూడా మెళుకువలు తెలిసిన వారు.

ఒకమారు ఒక వ్యక్తి ఒక మూట కర్ర పెండలాన్ని తెచ్చి శంకర మఠం లో ఇచ్చాడు. దాన్ని కూరగా వండారు. నోట్లో పెట్టుకుంటే దురద పుట్టేసరికి దాన్ని అందరు పక్కన పెట్టేసారు.విషయం

స్వామి వారి దాకా  వెళ్ళింది. వారు వంటాయనను పిలిపించారు.

వంటవాడు "నేను ఈ కూర ముక్కలను బియ్యం కడిగిన నీటిలో బాగా కడిగి, చింతపండు రసాన్ని బాగా ఉడికించిన తరువాత కూరను మెత్తగా వండాను. ఏమైందో ఏమో. కూర పాడైంది."అన్నాడు భయం గా..

స్వామి "కర్ర పెండలం ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా అరటి దూట ముక్కలు వేస్తె దురద పుట్టదు."అన్నారు.

మరునాడు ఈ విధంగా కూర వండితే కూర అద్భుతం గా కుదిరి అందరు లొట్టలేసుకుంటూ తిన్నారు.

మరొక రోజు వంట గదిలో ఉన్న ఇంగువ సరిపోదని వంటాయిన సూచించాడు. అది తెలిసి స్వామి వారు సులభ పరిస్కారం సూచించారు.

"పప్పు వేయిస్తున్నడే ఇంగువ కలిపేసెయ్. ఆ పప్పులను సాంబార్,రసం దేనిలో కలిపినా ఇంగువ వాసన వస్తూనే ఉంటుంది. ఇంగువ ఖర్చు మిగులుతుంది."అన్నారు 

***  తక్కువ ఖర్చుతో వంటను రుచిగా ఎలా వండాలో స్వామి వారికి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు.

భగవద్గీత

 🙏💐🌹🙌Establishment of Supreme Court Bench in AP for South India is our prime aim 🙌🌹💐👍

                                    

🌹భగవద్గీత🌹

             

రెండవ అధ్యాయము. సాంఖ్యయోగము నుండి 62 వ శ్లోకము. పదచ్ఛేద , టీకా , తాత్పర్య సహితముగా.


ధ్యాయతో విషయాన్ పుంసః

సంగస్తేషూపజాయతే l

సంగాత్ సంజాయతే కామః

కామాత్ క్రోధోఽభిజాయతే ll(62)

                     

విషయాన్ = శబ్దాది విషయములను ;

ధ్యాయతః = చింతన చేయుచుండునట్టి ;

పుంసః = పురుషునకు ;

తేషు = ఆ (శబ్దాది) విషయము లందు ;

సంగః = ఆసక్తి ;

ఉపజాయతే = ఏర్పడును ;

సంగాత్ = ఆసక్తివలన ;

కామః = కామము (విషయవాంఛ) ;

సంజాయతే = ఉత్పన్నమగును ;

కామాత్ = కోరికవలన (ఆ కోరికతీరనప్పుడు) ;

క్రోధః = కోపము ;

అభిజాయతే = కలుగును .


తాత్పర్యము :- విషయచింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును . ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును . ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. (62)

  

       ఆత్మీయులందరికి శుభ శుభోదయం

               Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy 

Advocate AP High Court Amaravathi