3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

కళా తపస్వి

 కళా తపస్వి కనుమరుగయ్యారు


సినిమా పరిశ్రమలో ఒక తరం వారాంతా మహా ప్రస్థానానికి ఒకరి తరువాత ఒకరు వెళ్ళి పోతున్నారు..


సంతోషంగా సాగనంపడం, కడ సారి ఆత్మ నమస్కారం చేసుకోవడం, ఆత్మీయమైన జ్ఞాపకాలు తవ్వుకోవడం తప్పా నిజం చెప్పాలంటే ఇవన్నీ హాయిగా ఒప్పుకోవలసిన ప్రస్థానాలే..


అయన్ని నేను  విజయవాడలో శంకరాభరణం సినిమా విజయోత్సవం లో లక్ష్మీ టాకీస్ దగ్గర చూశాను.  ఆ సినిమా విడుదల అయ్యిన ఓ 50 రోజుల్లో ఆయనకి ప్రజలు జరిపిన సత్కారాలు సన్మానాల ముందుమిగతా బిరుదులు పురస్కారాలన్నీ తీసికట్టే..!


అలాంటి గొప్ప అభిమానం సినిమా రంగం ద్వారా సాధించిన విశ్వ నాథ్ గారు నిజంగా కళా తపస్వే.!!


వారితో పాటు ఆ సినిమా తీసిన నిర్మాతలకి కూడా అంత గౌవురవం దక్కింది..కానీ వారు మాత్రం విశ్వనాథ్ గారికే ఆ గవురవం కట్టబెట్టారు.


ఇంక సిరివెన్నెల తోడయ్యకా వారి సినిమాలలో పాటలు సినిమా ప్రపంచంలో  పరుగాపక పయనించవే తలపుల నావా కెరటాలకి తలవంచితే తరుగదు తోవా..మది కోరిన మధుసీమలను వరించేసారు ..ఇద్దరూ 

 ఆమని కై ఎదురు చూస్తూ ఆగిపోకుండా  నలు దిక్కుల  యతి రాజుకి జతి స్వరమిచ్చిన కళా తపస్వి..

అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా అనుకుంటూ 

నిదురించిన తెలుగు జాతికే కాక యావత్ ప్రపంచానికి ఆ నటరాజు నాట్యాలను వెన్నెల తిన్నెలలో గాన మధురిమలు అద్ది మరీ చూపించిన ఆయన్ని

కళా తపస్వి అనడంలో సార్ధక నామ దీయుడే గా మరి.

చాగంటి కోటేశ్వరరావు గారు తమ ప్రవచనాల్లో ఈయన గురించి ప్రస్తావించారు అంటేనే అర్థం చేసుకోవచ్చు.


అలాంటి వారికి మరణం కేవలం శరీరానికే కానీ.. వారి కళాత్మకమైన ఆత్మకి కానే కాదు.


ఒక ఆత్మీయ నమస్కారం చేసుకుంటూ ఆయన సినిమాలలో పాటలు వింటూ పని చేసుకోవడం నిజంగా ఒక అందమైన అనుభవం.

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: