.
*సద్బోధ*
➖➖➖
*ఒక చిన్న పిల్లవాడు సంతలో తప్పిపోయాడు. వాళ్ళ అమ్మ కోసం వెతుకుతాడు. భయంతో అటూ ఇటూ పరిగెత్తుతాడు. "అమ్మా, మమ్మీ!" అంటూ అరుస్తాడు.*
*అయితే తల్లి కూడా తప్పిపోయిన బిడ్డ కోసం వెతుకుతుంది. ఎప్పుడైతే పిల్లవాడు తనకు చిక్కుతాడో ఆ తల్లి బిడ్డను తన చేతుల్లోకి ప్రేమతో తీసుకుంటుంది, ఒడిలో ఉంచుతుంది.*
*పిల్లవాడు కూడా ఏడుపు ఆపి తల్లి ఒడిలో ఉన్నానన్న దైర్యంతో అప్పటి వరకు ఉన్న భయం నుండి విముక్తి పొందుతాడు.*
*మనము కూడా ఆ పిల్లవాడి మాదిరి సంసారం అనే సంతలో పడి దైవము నుండి తప్పిపోయిన వారిమే!*
*కనుక తేరుకుని కాస్త బిగ్గరగా పిలవండి, తలవండి, ప్రార్ధించండి, స్మరించండి, భజించండి, ధ్యానించండి, సేవించండి.*
*సంసారములో ఉండినా ఎల్లపుడూ దైవపు ఆలోచనలలో మాత్రమే నిమగ్నమై ఉండండి. దారి తప్పిపోయామని బాధ పడుతూ కూర్చుంటే మార్గం దొరకదు. గమ్యం చేరుకోలేము. భగవంతుడు కూడా మన పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. పిలిచినంతనే పరుగెత్తుకు వచ్చి తన అక్కున చేర్చుకుంటాడు. భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇదే మార్గం.*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷
లోకాః సమస్తాః సుఖినోభవన్తు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి