3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

పాక శాస్త్ర పాండిత్యం

 పాక శాస్త్ర పాండిత్యం...

పరమాచార్య వారు వేద వేదాంగాలు, ఉపనిషత్తులకు భాష్యం చెప్పడమే కాదు.పాక శాస్రం లో కూడా మెళుకువలు తెలిసిన వారు.

ఒకమారు ఒక వ్యక్తి ఒక మూట కర్ర పెండలాన్ని తెచ్చి శంకర మఠం లో ఇచ్చాడు. దాన్ని కూరగా వండారు. నోట్లో పెట్టుకుంటే దురద పుట్టేసరికి దాన్ని అందరు పక్కన పెట్టేసారు.విషయం

స్వామి వారి దాకా  వెళ్ళింది. వారు వంటాయనను పిలిపించారు.

వంటవాడు "నేను ఈ కూర ముక్కలను బియ్యం కడిగిన నీటిలో బాగా కడిగి, చింతపండు రసాన్ని బాగా ఉడికించిన తరువాత కూరను మెత్తగా వండాను. ఏమైందో ఏమో. కూర పాడైంది."అన్నాడు భయం గా..

స్వామి "కర్ర పెండలం ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా అరటి దూట ముక్కలు వేస్తె దురద పుట్టదు."అన్నారు.

మరునాడు ఈ విధంగా కూర వండితే కూర అద్భుతం గా కుదిరి అందరు లొట్టలేసుకుంటూ తిన్నారు.

మరొక రోజు వంట గదిలో ఉన్న ఇంగువ సరిపోదని వంటాయిన సూచించాడు. అది తెలిసి స్వామి వారు సులభ పరిస్కారం సూచించారు.

"పప్పు వేయిస్తున్నడే ఇంగువ కలిపేసెయ్. ఆ పప్పులను సాంబార్,రసం దేనిలో కలిపినా ఇంగువ వాసన వస్తూనే ఉంటుంది. ఇంగువ ఖర్చు మిగులుతుంది."అన్నారు 

***  తక్కువ ఖర్చుతో వంటను రుచిగా ఎలా వండాలో స్వామి వారికి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు.

కామెంట్‌లు లేవు: