🙏 *శుభోదయం* 🙏
*ప్రకృతి అంటే శ్రీ మాతా స్వరూపము..*
*ప్రపంచంలోని మిగతా అన్ని జీవ జంతుజాలాలు ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాయి..ఒక్క మనిషి తప్ప...*
*ప్రకృతితో మమేకం కావడం అంటే అమ్మతో కలిసి ఉండటం . అమ్మ ఒడిలో ఉండటం...*
*పిల్లవాడు అమ్మ ఒడిలో ఎంత భద్రతను పొందుతాడు?*
*అమ్మ ఒడిలో ఉండటం అంటే భద్రంగా ఉండటమే...*
*అమ్మ ఒడిలో ఉండటం అంటే మనఃశాంతితో జీవించడమే...*
*అమ్మ ఒడిలో ఉండటం అంటే ఏ చీకూ చింతా లేకుండా ఉండటమే....*
*అమ్మ ఒడిలో ఉండటం అంటే కష్టం అనే మాటకు తావు లేకుండా ఆనందంగా ఉండటమే...*
*కానీ, ఈ సృష్టిలోని ప్రతి జీవజాలం పైవన్నీ పొందుతున్నాయి... ఒక్క మనిషి తప్ప...*
*ఒక్క మనిషికే భద్రత లేదు, మనఃశాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, ఎప్పుడూ ఏదో ఆరాటం ... జీవన పోరాటం....*
*మిగతా జీవాలకు లేని ఆరాటం, పోరాటం మనిషికి మాత్రమే ఎందుకు?*
*వివేకం అనే ఒక్క ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉన్నందుకు మాత్రమే మనిషికి ఈ జీవన పోరాటం...*
*జీవిత పరమార్థాన్ని తెలుసుకుని, కర్మ చక్రంనుంచి ముక్తిని సాధించడానికి, జీవన్ముక్తి పొందడానికి మనిషికి వివేకం అనే లక్షణాన్ని ఇస్తే, అవివేకిగా మారి, ఈ ప్రకృతినే విధ్వంసం చేసే స్థితికి దిగ జారాడు....*
*ప్రకృతి మనకు ఆహారాన్ని అందించి, బ్రతకడానికి చోటిస్తే, ఆ తల్లికే చోటు లేకుండా చేస్తున్నాడు...*
*కన్న తల్లినే అంగట్లో సరుకుగా మార్చేశాడు...*
*తల్లి పాలతో వ్యాపారం చేసే స్థాయికి దిగజారాడు...*
*తన స్థాయిని మరచిపోయి బ్రతుకుతున్నాడు...*
*పైగా సుఖం, శాంతి, ఆనందం వెతుక్కుంటూ పరుగులు పెడుతున్నాడు....*
*దీనికి పరిష్కారం ఎక్కడ? ఎలా?*
*మనిషి మనిషిగా జీవిస్తే చాలు, అదే గొప్ప పరిష్కారం...,*
*తెలివైన వాడుగా నిరూపించుకునే ప్రయత్నంలోనే ఈ విధ్వంసం అంతా...*
*ఆ తెలివిని అమ్మను, శ్రీ మాతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తే, పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తే అంతా ఆనందమే ... అంతా సుఖమే.... అంతా శాంతి మాత్రమే ...*
*మనమే పాడు చేసుకుని, మళ్ళీ మనమే దాన్ని వెతుక్కుంటున్నాము ...*
*ఈ సృష్టిలో ఉన్నది ఆనందం ఒక్కటే.....*
*ఆనందమే అమ్మప్రేమ... ప్రకృతిని ప్రేమిస్తే, బాధ్యతతో వ్యవహరిస్తే అమ్మప్రేమ ఎప్పుడూ మన వెంటే, మన తోటే..*
🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి