3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

*విధి అంటే ఏమిటి?*

 🙏 *శుభోదయం* 🙏 


*విధి అంటే ఏమిటి?*

 

*విధి అంటే కర్తవ్యం...,*

*చేయవలసిన పని....*


విధి రాత, బ్రహ్మరాత, తల రాత, నుదుటి రాత అనడం మనం వింటూ ఉంటాము..

 

మనం చేసే పనిని బ్రహ్మ మన నుదుటిన రాస్తాడా??

 

కాదు, మన రాతను మనమే రాసుకుంటాము...

 

*ఎలా?*

 

విశ్వ నియమాలను అనుసరించి, 


1. *యత్భావం తత్భవతి -* మన ఆలోచనా విధానం ఎలా ఉంటుందో, మన కర్మలు, కర్మ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి .. 


2. *మనం ఏమి ఇస్తే, అదే తిరిగి వస్తుంది...*

మనం ఇతరులకు మంచి చేస్తే, మనకు మంచి జీవితం ఉంటుంది.. 

మంచి జీవితం అంటే మన తలరాత, విధి రాత బాగున్నట్టే కదా.... 

చెడు చేస్తే, చెడు ఫలితాలే ఉంటాయి...


చెడు అలవాట్లకు బానిసై, ఆరోగ్యంగా ఉండాలని ఎలా కోరుకోగలము?  


నిప్పును ముట్టుకుని, అది మనలను కాల్చగూడదు అంటే కాలకుండా ఉంటుందా?? 

ఇదీ అంతే....


మనం ఇంతకు ముందు చేసిన కర్మల ఫలితాలే, వాటి కర్తవ్య నిర్వహణలో భాగంగా ముందుకు వస్తాయి...  


అదే విధిరాత, తలరాత, నుదుటి రాత, బ్రహ్మ రాత అని పేర్లతో పిలుచుకుంటాము... 

 

అందుకే, 


*వీలైనంత వరకు సాటిమనిషికి సహాయం చేయడం అనేది అలవరచుకోవాలి....*


*సత్యాన్నే మాట్లాడాలి.. ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి...* 


*సత్యంవద ధర్మంచర అనేది వేద వాక్కు...*

 

*విశ్వ నియమాలను అనుసరించి మన జీవితాలను మలచుకుంటే, విధిరాత, తలరాత అన్నీ బాగుంటాయి....*


*ఆ విశ్వ నియమాలను అధిగమించి నడుచుకుంటే, తిప్పలు తప్పవు.... బాధలు, కష్టాలు తప్పవు...*


*జీవితంలో మనం చేసే మంచి - చెడు మాత్రమే విధి రాతగా భవిష్యత్తుగా మన ముందుకు రాబోతుంది అని అర్థం చేసుకోవాలి..*



*సర్వే జనా సుఖినోభవంతు* 


🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: