సీసమాలిక:
*సూత్రధారులు* లేక శోకించె నటనమ్ము
నటనసూత్రము నేర్పు నాథుడేడి?
*స్వాతిముత్యము* వంటి సంస్కృతీ విలువల
సందడించగ నేడు సాధువేడి?
*సిరిసిరిమువ్వ* ల చెలిమి జేయగ ధాటి
నడుము బిగించెడు నాథుడేడి?
*స్వర్ణకమల* దీప్తి *సాగరసంగమ*
ముల *స్వయంకృషి* బర్వు పురుషుడేడి?
సినిమాల రంగాన *సిరివెన్నెల* ను బూచి
తిమిరాల బోగొట్టు తేజమేది?
*శంకరాభరణపు* సమ్మోహరాగాల
*శ్రుతిలయల* ను గూర్చు ప్రోఢ యేడి?
తే.గీ.
ఇన్ని హంగుల భంగుల నెన్నదగిన
పూర్ణుడై నిలచు *కళాప్రపూర్ణు* డఱుగ
లేడు లేడెట గన సాటి లేడు లేడు
విశ్వనాథుని సరిజోడు విశ్వమందు
*~శ్రీశర్మద*
*+91 8333844664*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి