4, ఫిబ్రవరి 2023, శనివారం

సద్బోధ

 .


                        *సద్బోధ*

                        ➖➖➖


*ఎవరు భగవంతుని యొక్క దివ్యమైన జన్మనూ, కర్మనూ యథార్థంగా తెలుసుకుంటున్నారో అట్టివారు మరణానంతరం ఆయననే పొందుతున్నారు.*


*అనురాగం, భయం, క్రోధం విడిచిన వారూ, ఆయన యందే లగ్నమై ఉన్న మనస్సు కల అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సుచే పవిత్రులై భగవంతుని స్వరూపమును పొందియున్నారు.*


*ఆధ్యాత్మిక అనుభవం నిత్యజీవితంలోని అనుభవాలకు దూరంగా ఎక్కడో లేదు. మన నిత్యజీవన విధానం ఆధ్యాత్మికతతో కలిసి ఉన్నది.*


*అయితే ఆ రెంటినీ జత చేసేవి ఆదర్శం పట్ల భక్తి, ప్రార్థనలే. ఈ ప్రార్థన ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తితో కూడుకుని ఉండరాదు.*


*ప్రార్థన అవగాహనతో కూడుకుని ఉండి మన అజ్ఞానాన్ని తొలగించేదిగా ఉండాలి. హృదయ వైఖరిని గ్రహిస్తూ మనస్సుని శుద్ధి చేసేందుకు ఉపక్రమించాలి.*


*పవిత్ర హృదయాన్ని పొందగలగడం కన్నా అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది. అటువంటి హృదయం దర్పణంలా ప్రకాశిస్తూ మనలను ప్రతిబింబింపజేస్తుంది.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                      


          లోకాః సమస్తాః సుఖినోభవన్తు!

కామెంట్‌లు లేవు: