16, సెప్టెంబర్ 2023, శనివారం

Photo

దసరా కార్నివాల్*

 *జ్యోతి ఈవెంట్స్* వారి *దసరా కార్నివాల్* 


మన స్టాల్ హోల్డర్స్ అందరికీ సువర్ణ అవకాశం. అల్కాపురి పార్క్ యాజమాన్యం మనకి ఎగ్జిబిషన్ & సేల్ నిర్వహించడానికి అవకాశం కల్పించింది. 


సుమారుగా 50 స్టాల్స్ తో మనము ఎగ్జిబిషన్ అండ్ సేల్ నిర్వహించుకోవచ్చును.


దసరా పండుగని పురస్కరించుకుని ఈనెల ముందుగానే మనము సెప్టెంబర్ 30వ తేదీ మరియు అక్టోబర్ 1వ తేదీ ఎగ్జిబిషన్ అండ్ సేల్ నిర్వహించడానికి సంసిద్ధులైనాము.


ఈ రెండు రోజులు అందరికీ చక్కటి వ్యాపారము తప్పకుండా కలుగుతుంది. ఈ పార్కు నందు పెట్టుకున్న స్టాల్ హోల్డర్స్ అందరికీ కూడా ఎగ్జిబిషన్లోనే కాకుండా తర్వాత కూడా చాలాసార్లు బిజినెస్ జరగడం జరిగింది.


*స్టాలు ధర:-* ఒక్కరోజు అయితే ₹800, అదే రెండు రోజులకి బుక్ చేసుకుంటే ₹1400 మాత్రమే. జ్యోతి ఈవెంట్స్ లో మెంబర్షిప్ ఉన్నవారికి 10% రాయితీ.


*సంప్రదించగలరు:-*

*తంగిరాల జ్యోతి*

*7416223176*

*JYOTHI EVENTS*

అందముగా లేకున్నను


*కం*

అందముగా లేకున్నను

నందంబగు జగము మనకు నందించుటచే

డెందంబున తలిదండ్రుల

మందిరమమరించి కొలువ మాన్యము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తల్లిదండ్రులు అందంగా లేకపోయినప్పటికీ అందమైన ఈ ప్రపంచంలో బతికే అవకాశమిచ్చిన ఆ తల్లిదండ్రులకు గుండెలలో గుడికట్టుకొని పూజించడం ప్రతి ఒక్కరికీ మర్యాద అవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

*కం*

అందంబగు జగతి వెలుగు

లందించిన కన్నవారలపురూపసిరుల్.

తొందరపడి సంకటముల

నిందచగ నుండబోదు నిష్కృతి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అందమైన ఈ లోకంలో ని వెలుగులు నీకు అందించిన తల్లిదండ్రులు అపురూపమైన సిరులు. కష్టాలు కలిగిననూ తొందరపడి వారి ని నిందిస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి

 *తెలుగు వెలుగులో* 



*_ఆ స్వరసహస్రం.._*

*_విష్ణుసహస్రం..!_*



*_ఆమె.._*

నారద తుంబురులకు చెల్లెలు..

సిగలో విరిసే 

సరాగాల మల్లెలు..

*_పదం పలికితే విష్ణుపథం.._*

*_రాగమాలపిస్తే దేవరాగం.._*

గమకమైతే ముక్కంటికే నచ్చే 

నమకం చమకం..

*జతులు..*

*ఆమె ఇంటి సంగతులు..*

ఆ సంగతులు..

ఆమె..అమ్మ అడ్డాలనాడే సాధించిన పరిణితులు..!


*_ఆమె గళం..సుమంగళం.._*

ముక్కోటి దేవతలు 

కొలువుండిన పవిత్ర ప్రాంగణం

*కృతులు..కీర్తనలే బంధుగణం..*

అవే ఆమె ప్రాణం..

*_ఎమ్మెస్ సుబ్బులక్ష్మి.._*

స్త్రీ రూపు దాల్చిన అన్నమయ్య..

త్యాగయ్యే ఆమె పాట విని 

సేద తీరునయ్యా..!

ముత్తుస్వామి సైతం 

పరవశమొందడా ఏమి..?

పండితులు..పామరులే గాక

సాక్షాత్తు పండిట్టే పులకించి

ఆమెకు అరుదైన బిరుదులు

కట్టబెట్టినాడు..

ఆమె ఇందిరమ్మకే 

నచ్చిన ఇందీవర!


*స్వరమే కాదు స్వరూపమూ*

*అపురూపమే..*

ఆ కట్టు బొట్టు..

కచేరీలో కూర్చునే పట్టు..

తంబురా మీదొట్టు

కట్టిపడేసే కనికట్టు..

*పోతపోసిన భారతీయత..*

*అమ్మతనపు ఆప్యాయత..*

*_సంగీతానికే పరిపూర్ణత!_*


*_ఆమె స్వరాలు_* 

*_స్వర్గానికి దారులు.._*

*_తాదాత్మ్యతకు ద్వారాలు.._*

*_సాక్షాత్తు విష్ణుమూర్తికే అలంకారాలు.._*

ఎన్ని పాడినా..

ఇంకెన్ని ఆలపించినా

ఏడుకొండలపై మారుమోగే

వైకుంఠవాసునే మురిపించే..

భక్తకోటిని మైమరపించే *విష్ణుసహస్రం..*

*_కట్టిపడేసే సమ్మోహనాస్త్రం.._*

మహా విధ్వాంసులకే కష్టమనిపించే..

గంధర్వులకే క్లిష్టమనిపించే..

వినడానికి ఇష్టమనిపించే

ఓ అసాధ్యాన్ని 

సుసాధ్యం చేసిన..

సుబ్బులక్ష్మి స్వరం 

ఇప్పుడు అలంకరించి

ఉంటుంది స్వర్గధామం!




గంధర్వ గాత్రంతో తరాల శ్రోతలను మెప్పించిన

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి

జయంతి (16.09.1916) 

సందర్భంగా ప్రణామాలు..

🙏🏾🙏🏻🙏🏽🙏🙏🏻🙏🙏🏿

Panchaag


 

⚜ శ్రీ ఫనికేశ్వర్నాథ్ మందిర్

 🕉 మన గుడి : నెం 180





⚜ ఛత్తీస్‌గఢ్ : ఫణిగేశ్వర్


⚜ శ్రీ ఫనికేశ్వర్నాథ్ మందిర్ 



💠 ఫణికేశ్వర్ నాథ్ మహాదేవ్ యొక్క ప్రసిద్ధ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలోని ఫింగేశ్వర్‌లో ఉంది. 

ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు దాని రూపకల్పన మరియు కళాకృతి యొక్క అద్భుతమైన పనితనంతో నిండి ఉంది. 



💠 భోలే బాబా ఆస్థానానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు మరియు భోలే బాబా అందరి కోరికలను తీరుస్తాడు అని ఇక్కడి ప్రజల నమ్మకం.


💠 ఈ ప్రదేశంలో శ్రీ రాముడు అజ్ఞాతవాస సమయంలో ఈ మార్గం గుండా వెళ్ళాడు మరియు సీత మాత శివుడిని పూజించింది మరియు ఈ ఆలయంలో శివుని జలాన్ని అభిషేకించింది. అందువల్ల, వాటిని పంచకోసి ధామ్ అని కూడా పిలుస్తారు. నేటికీ, దసరా పండుగను గొప్ప వైభవంగా మరియు ప్రదర్శనతో జరుపుకుంటారు.

దీన్నే షాహి దసరా అంటారు. 


💠 దేవత అర్చన గొప్ప శాంతిభద్రతలతో నిర్వహిస్తారు. దసరా సమయంలో, రాజు గ్రామ దేవత యొక్క స్థానానికి వెళ్తాడు. 

ఈ శోభాయాత్రలో రాజుతోపాటు కొంత మంది పాత ఆయుధాలు తీసుకుంటారు. 

ఇది చూడదగినది. 

ఇక దసరా రోజు ఊరంతా పెళ్లికూతురులా ముస్తాబవుతుంది. ఈ ప్రదేశాన్ని చూస్తే భారీ జాతరలా కనిపిస్తుంది. 

ఈ దసరా చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం పోటెతుత్తారు.


💠 ఈ ఆలయాన్ని ఖజురహో టెంపుల్ ఆఫ్ ఫింగేశ్వర్ అని కూడా పిలుస్తారు.

 

💠 ఈ ఆలయం ముందు ఐదు శిఖరాలతో కూడిన చాలా ఎత్తైన భవనం ఉంది.

ఆలయం లోపల శ్రీరామ ,జానకి , స్వామి హనుమాన్ ఆలయాలు కలవు.


💠 ఈ ఆలయ ప్రాంగణంలో, అప్పటి రాజు నిర్మించిన భూమి లోపల రాజమహల్ కోట కనిపిస్తుంది. నీటితో నిండి ఉంది.  


💠 ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ అయిన రాజ మహల్ , ఆలయానికి కొంచెం దూరంలో, రాజ్ మహల్ శిథిలావస్థలో ఉంది, దీనిని కింగ్స్ కోర్ట్ అని పిలుస్తారు, ఇది మీకు పాత కాలాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ దసరా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.  


💠 ప్రతి సంవత్సరం శ్రావణ సోమవారం మరియు మహాశివరాత్రి నాడు ఇక్కడకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతారు.


💠 ఈ ఆలయం ఆరు నెలల రాత్రి కాలాల్లో మాత్రమే నిర్మించబడిందని కూడా నమ్ముతారు.

ఈ ఆలయంలో చాలా పురాతన విగ్రహాలు ఉంచబడ్డాయి, వాటిలో ప్రధానమైనవి చతుర్ముఖి గణేష్ మరియు భైరవ బాబా విగ్రహాలు. 

విగ్రహాలన్నీ భూమాత గర్భం నుంచి ఉద్భవించినట్లు తెలుస్తోంది.

ఆలయానికి

 ఆలయానికి వెళ్తున్నపుడు పాటించ వలసిన నియమాలు...!!

**


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿1. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

2. అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు

3. ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.

4. జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

5. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.



🌸6. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.

7. ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.

8. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.

9. దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.

10. ఒక చేత్తో దర్శనం చేయకూడదు.



🌿11. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.

12. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.

13. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.

14. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.

15. ఆలయ ఆస్తులను అపహరించకూడదు.



🌸16. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

17. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

18. మూల విరాట్‌ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.

19. ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

20. ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.



🌿21. గోపుర దర్శనం తప్పక చేయాలి.

22. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.

23. ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

24. మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు...స్వస్తి. 


              🌷శ్రీ మాత్రే నమః🌷

పర్వతములకు

 ఒకప్పుడు అనగా సృష్టి జరిగిన తొలి రోజులలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఆ రెక్కల సహాయంతో పక్షులవలె ఎగురుతూ అంతటా సంచరించేవి. అవి ఎక్కడ వాలితే అక్కడ సృష్టించబడిన జీవులన్నీ నశించిపోయేవి. అందువలన బ్రహ్మదేవుని అభ్యర్థనతో ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలన్నిటికే రెక్కలు నరికివేశాడు. దానితో పర్వతారన్నీ ఎక్కడివక్కడ స్థిరంగా ఉండిపోయాయి. అందుకే పర్వతములకు ఇంద్రుడంటే భయము.

Rubber strips


 

Modern flight


 

Engine types


 

Powerful


 

Floor mill


 

Differrncial


 

House clamp


 

Bhakti ksaatra dharmam


 

Making cap


 

Behind the scenes


 

Types of pump


 

Stainless steel big vessel making


 

Vinayak chaviti

























 

శ్రీరంగం

 భూలోక_వైకుంఠం శ్రీరంగం....శ్రీరంగం....


అద్భుతమైన ఏడు ప్రాకారాలు, ఇరవైకి పైగా గోపురాలు, ఆదిశేషునిపై విష్ణుమూర్తి శయనిస్తున్నట్లుగా ఉండే రూపం... ఇవన్నీ ఎక్కడోకాదు భక్తులు భూలోక వైకుంఠంగా పిలిచే శ్రీరంగంలోని అద్భుతమైన దృశ్యాలు. భక్తులను అనిర్వచనీయమైన భక్తిపారవశ్యంలోకి తీసుకెళ్లే శ్రీరంగం విశేషాలు ఇవి..


భూలోక వైకుంఠంగా ప్రసిద్ధినొందిన శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి కొలువై ఉన్నాడు. అతి పురాతన వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి. తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో కావేరి నది ఒడ్డున శ్రీరంగం పట్టణంలో ఈ ఆలయం ఉంది. ద్రావిడ శైలిలో నిర్మాణం జరుపుకున్న ఈ ఆలయంలో అడుగడుగునా భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారాన్ని రాజగోపురం (రాయల్‌ టెంపుల్‌ టవర్‌) అని పిలుస్తారు. ఇది 237 అడుగుల ఎత్తు ఉంటుంది. డిసెంబర్‌, జనవరి మాసాల్లో ఇక్కడ ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రెండు నెలల కాలంలో సుమారు పది లక్షల మంది భక్తులు శ్రీరంగనాథున్ని దర్శించుకుంటారు.


అంగ్‌కోర్‌వాట్‌ తరువాత అతి పెద్ద హిందూ దేవాలయంగా ఇది పేరుగాంచింది. ఈ ఆలయంలో 21 గోపురాలున్నాయి. 50 దేవతల విగ్రహాలు, వేయి స్తంభాల మండపం, చిన్న చిన్న నీటి కొలనులతో అతి సుందరంగా ఉంటుంది. హిందుయేతరులను రెండవ ప్రాకారం వరకు మాత్రమే అనుమతిస్తారు. రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పైభాగం విమానం ఆకృతిలో ఉంటుంది. దీనికి పూర్తిగా బంగారు తాపడం చేశారు. ఆదిశేషునిపై నిద్రిస్తున్నట్టుగా ఉండే రంగనాథస్వామిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. సాక్షాత్తు భగవంతున్ని చూసిన భావన కలుగుతుంది.

శ్రీరంగనాథుని ఆలయ పరిధిలోనే మరికొన్ని సన్నిధానాలు, ఉపసన్ని ధానాలున్నాయి. అందులో థాయార్‌ సన్నిధి, చక్రథజవార్‌ సన్నిధి, ఉదయ వార్‌(రామానుజర్‌ సన్నిధి), గరుడల్వార్‌ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, హయగ్రీవర్‌ సన్నిధి ఉన్నాయి.

అద్భుతమైన ప్రాకారాలు

కావేరీ నది ఒడ్డున 156 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం విస్తరించి ఉంది. భారతదేశంలో ఏడు ప్రాకారాలతో నిర్మితమైన గుడి ఇదొక్కటే. ఈ ఏడు ప్రాకారాలు యోగాలో ఏడు కేంద్రాలుగా వైష్ణవులు భావిస్తుంటారు.


7)గోపురాల్లోని ఏడవ ప్రాకారం అసంపూర్తిగా ఉంది. దీన్ని రాయగోపురం అని పిలుస్తారు. నిర్మాణం పూర్తయితే అద్భుతమైన కట్టడంగా నిలిచిపోతుంది. దీని ఎత్తు 50మీటర్లుగా ఉండే అవకాశం ఉంది.


6)ఇందులో నాలుగు గోపురాలుంటాయి. దానిలో తూర్పువైపున ఉండే గోపురం 30వ శతాబ్దం నాటి వైభవాన్ని, నైపుణ్యాన్ని కళ్లముందు ఉంచుతుంది.


5)ఇందులో మనవాల మమునిగల్‌ దేవాలయం ఉంది. ఛోళ స్టయిల్‌లో నిర్మితమై ఉంటుంది.


4)ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడి గోడలన్నీ అందమైన శిల్పాలతో నిండి ఉంటాయి. వీణ వాయిస్తున్నస్త్రీ, పక్కనే రామచిలుక ఉండే శిల్పాన్ని చూసి ఎవరైనా సరే మంత్రముగ్ధులవుతారు. ఈ ప్రాకారంలోనే మ్యూజియం ఉంటుంది. శ్రీరంగంకు వచ్చినవారు తప్పక చూడాల్సిన మ్యూజియం ఇది. ఎన్నో అమూల్యమైన వస్తువులు ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. దీన్ని వెల్లయిగోపుర అని పిలుస్తారు. దక్షిణ భాగంలో శేషరాయర్‌ మండపం ఉంటుంది ఈ మండపానికి ఎదురుగా వేయి స్తంభాల హాల్‌ ఉంటుంది. ఇందులో దేవతల ప్రతిమలు ఉంటాయి. ఇక్కడ ఏకాదశి రోజున పండుగ నిర్వహిస్తారు.


3)ఇందులో కార్తికేయ గోపురం ఉంటుంది. గరుడ మండపం ఉంటుంది. ఆలయంలో అతి సుందరమైన మండపం ఇది. ఈ ప్రాకారంలో వెస్ట్రన్‌వింగ్‌ కిచెన్స్‌, బియ్యం నిలువచేసుకునే గదులుంటాయి. తూర్పువైపున చంద్రపుష్కరిణి ఉంటుంది.


2)ఈ ప్రాకారంలో భక్తులకు పాలు, ప్రసాదం పంపిణీ చేస్తారు.


1)ఇక్కడి గోపురాన్ని నాజికెట్టన్‌ గోపురం అంటారు. ఇరువైపులా ఉండే ప్రతిమలు శంఖనిధి, పద్మనిధిగా పిలుస్తారు. ఈశాన్యభాగంలో యాగశాల, తొండమాన్‌ మండపం ఉంటాయి. ఈ మండపంలో సీలింగ్‌ భాగం ప్రతిమలు పేయింటింగ్స్‌లో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తూర్పు భాగంలో అర్జున మండప, కిలి మండపగా పిలిచే రెండు మండపాలుంటాయి.


ఎలా చేరుకోవాలి?


తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగంకు ప్రతీ పదినిమిషాలకు ఒక బస్సు వెళుతుంది. దూరం 9 కి.మీ. 15 నిమిషాల్లో చేరుకోవచ్చు.

తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్‌, ఎయిర్‌పోర్టు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీరంగంకు 15 కి.మీదూరం ఉంటుంది. శ్రీరంగంలోనూ రైల్వేస్టేషన్‌ ఉంది. స్టేషన్‌కు అరకిలోమీటరు దూరంలో ఆలయం ఉంటుంది.

రైలులో వెళ్లాలనుకుంటే హైదరాబాద్‌ నుంచి ముందుగా చెన్నై చేరుకోవాలి. అక్కడి నుంచి తిరుచిరాపల్లి వరకు మరో రైలులో చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులో, క్యాబ్‌లో శ్రీరంగం చేరుకోవచ్చు.

విశాఖపట్టణం నుంచి విజయవాడ మీదుగా చెన్నై చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి చేరుకోవచ్చు.

హైదరాబాద్‌ నుంచి చెన్నై దూరం 770 కి.మీ. స్లీపర్‌క్లాస్‌ చార్జీ రూ.395. ప్రయాణ సమయం 15 గంటలు.

విశాఖపట్టణం నుంచి చెన్నై దూరం 781కి.మీ స్లీపర్‌క్లా్‌సచార్జీ రూ. 425.ప్రయాణ సమయం 15 గంటలు.

చెన్నై నుంచి తిరుచిరాపల్లి దూరం 350 కి.మీ స్లీపర్‌క్లాస్‌ చార్జీ రూ.215.ప్రయాణ సమయం 5.30 గంటలు.

దర్శనవేళలు

సాధారణ దర్శనం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.15 వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి 6.45 వరకు పూజ జరుగుతుంది.ఈసమయంలో దర్శనానికి అనుమతించరు. ఉదయం 6గంటల నుంచి 7.15 వరకు విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవలో పాల్గొనాలనుకుంటే రూ.50టిక్కెట్‌కొనుగోలు చేయాలి. శీఘ్రదర్శనం కావాలనుకుంటే 250 టిక్కెట్‌ కొనుగోలు చేయాలి.


వసతి

వసతి సౌకర్యాలకు ఇబ్బంది లేదు. దేవాలయ వసతి గృహాలున్నాయి. ప్రైవేటు హోటల్స్‌, లాడ్జీలు ఉన్నాయి. దేవాలయం ప్రధాన ప్రవేశ ద్వారంకు సమీపంలోనే హోటల్స్‌ ఉన్నాయి. వసతి, భోజనంకు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. కావాలనుకుంటే దర్శనం చేసుకుని తిరిగి తిరుచిరాపల్లి వెళ్లి స్టే చేయవచ్చు. 

అక్కడ ఐదు నక్షత్రాల హోటల్స్‌ నుంచి సాధారణ లాడ్జీల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి.


   శ్రీరంగనాధస్వామి నమో నమః🙏🌹


    👉సేకరణ:-

      🌿#శుభమస్తు🌿

 🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

ఎవ్వరికీ నచ్చవు

 *1916*

*కం*

తీయంగా మాట్లాడుచు

మాయలతో మోసగించ మనుజులు మెవ్వున్.

హేయంబగు నిట్టిసరణి

న్యాయము కాదని త్యజించ నచ్చవు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తియ్యగా మాట్లాడుచూ మాయలుచేసి మోసగించేవారిని మనుషులు మెచ్చుకుంటారు. హేయమైన ఈ పధ్ధతి న్యాయం కాదని విడిచిపెట్టి నచో నీవు ఎవ్వరికీ నచ్చవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

వినాయక చవితి సందేశాలు

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                సందేశం - 1/11        


ఏకవింశతి (21) పత్రి  


    వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మనం 21 రకాల పత్రితో  పూజిస్తాం. 

    ఆ పత్రికీ, వాటి వృక్షభాగాలకీ అనేక ఔషధ విలువలు ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పుకుందాం.  

  (ముఖపుస్తకం నుంచి చొప్పకట్ల సత్యనారాయణగారి సౌజన్యంతో)


21 రకాల పత్రి - ఔషధ గుణాలు


1) మాచీపత్రం : ఇది మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. 

    మన ఇళ్ళ చుట్టుప్రక్కల, రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. 

    ఇది నేత్రరోగాలకు అద్భుత నివారిణి. మాచీపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. 

    ఇది చర్మరోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందర్లో నివారణ అవుతుంది. 

    రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు.


2) బృహతీ పత్రం. 

    భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడపడైతే అక్కడ పెరుగుతుంది బృహతీ పత్రం. 

    దీనినే మనం 'వాకుడాకు', 'నేలమునగాకు' అని పిలుస్తాం.     

    ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, ఆస్తమానీ, దగ్గునూ, సైనసైటిస్‌నూ తగ్గిస్తుంది. 

    అరుగుదలను పెంచుతుంది,     

    గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.     

    బృహతీపత్ర చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. 

    బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. 

    రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది. 

    ఇంకా బృహతీపత్రానికి అనేకానేక ఔషధీయ గుణాలున్నాయి.


3) బిల్వపత్రం : దీనికే మారేడు అని పేరు. శివుడికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం. 

    ఇది మధుమేహానికి (షుగర్‌కు) దివ్యౌషధం. ఈ వ్యాధి గలవారు రోజు రెండు ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

    మారేడు గుజ్జును ఎండబెట్టి పోడిచేసుకుని, రోజూ ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని త్రాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. 


4) దూర్వాయుగ్మం(గరిక) : గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. 

    తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. 

    దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. 

    ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. 

    మగవారికి సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. 

    కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. 

    చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 

    ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. 

    గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. 

    హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.            


5) దత్తూర పత్రం : దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. 

    ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాతా దోషాలను హరిస్తుంది. కానీ 'నార్కోటిక్' లక్షణాలు కలిగినది కనుక వైధ్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడడు. 

    మానిసక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి, ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటు మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది.      

    దీని ఆకులు, వ్రేర్లు, పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగినవే అయినా, దీని గింజలు(విత్తనాలు) మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి. 

    జ్వరాలు, అల్సర్లు, చర్మరోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం.


6) బదరీ పత్రం : దీనినే రేగు అని పిలుస్తాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపం. 

    చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళ పైబడి 12 ఏళ్ళలోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. 

    ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంతవరకు తినిపించాలి, 

    కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది. 


7) అపామార్గ పత్రం: దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం. 

    దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులూ, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులూ నివారణమవుతాయి. 

    దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. 

    స్తూలకాయానికి, వాంతులకు, పైల్స్‌కు, ఆమం(టాక్షిన్స్) వలన వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. 

    ఉత్తెరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. నొప్పి తగ్గిపోతుంది. 

    పిల్లలు చెడుమార్గంలో వెళ్తున్నారని, చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి, దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు. 

    రోజు ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడకు వెళ్ళినా, ఆహారానికి లోటు ఉండదు. ఆహరం దొరకని ఎడారిలో కూడా ఎవరో ఒకరు పిలిచి భోజనం పెడతారట. అది ఉత్తరేణి మొక్క మహిమ. 

    ఇంకా ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. 

    ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.


8) తులసి: 'తులానాం నాస్తు ఇతి తులసి' - ఎంత చెప్పుకున్నా, తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మీ స్వరూపం, విష్ణు మూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.


    కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. 

    కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తులసి వాసనకు దోమలు దరిచేరవు. 

    తులసి ఆకులు, వేర్లు, కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. 

    చర్మరోగాలను నయం చేస్తుంది. 

    తులసి ఆకులు నమలడం చేత పంటి చిగుళ్ళకున్న రోగాలు నయమవుతాయి. 

    అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. 

    తులసిరసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 

    తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని(టాక్సిన్స్/విషాలను) విశేషంగా తీసివేస్తుంది. 

    ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక్క తులసి చెట్టు మాత్రమే రోజుకు 22 గంటల పాటు ప్రాణవాయువు(ఆక్సిజెన్)ను విడుదల చేస్తుందని తేలింది. 


    కానీ పురాణ కధ ఆధారంగా గణపతిని తులసిదళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు. 


9) చూత పత్రం : మామిడి ఆకులను సంస్కృతంలో చూత పత్రం అని అంటారు. మామిడి మంగళకరమైనది.


    లేతమామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది.   

    మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడిచేసి ఔషధంగా పూస్తే కాళ్ళపగుళ్ళు, చర్మవ్యాధులు ఉపశమిస్తాయి. 

    చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. 

    చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. 

    మామిడి దేవతావృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా, అది మేలే చేస్తుంది. 

    మామిడి చెట్టును సాధ్యమైనంతవరకు కాపాడాలని, ఇంటి ఆవరనలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే, ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తు శాస్త్రం గట్టిగా చెప్తోంది. 

    ఏ శుభకార్యంలోనైనా, కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్ళను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి.


10) కరవీర పత్రం : దినినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. 

    సాధారణంగా పూజకు కోసిన పువ్వులు, అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే ఫర్వాలేదు కానీ, మరొకచోట(అది దేవుడుముదైనా, పూజ స్థలంలోనైనా సరే) క్రింద పడితే ఇక పూజకు పనిరావు. కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో క్రింద పడినా, నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. 

    గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది.


11) విష్ణుక్రాంత పత్రం : మనం వాడుకభాషలో అవిసె అంటాం. 

    దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. 

    ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. 

    విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.


12) దాడిమీ పత్రం : అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసుమప్రభ' అనే నామం కనిపిస్తుంది. 

    దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. 

    దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అదుపులో ఉంచుతుంది. 

    దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. 

    దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

    దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాన్లో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. 

    దీని ఆకులకు నూనె రాసి వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.


13) దేవదారు : ఇది వనాలలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. 

    దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవు. 

    దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.


14) మరువక పత్రం : మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. 

    మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.


15) సింధువార పత్రం : వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. 

    రెండింటిలో ఏదైనా వావిలి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. 

    ఈ ఆకులను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.


16) జాజి పత్రం: జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అన్ని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. 

    ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. 

    జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. 

    జాజి కాషాయన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. 

    జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. 

    కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. 

    జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.


17) గండకీపత్రం: దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. 

    థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. 

    అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 

    చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.


18) శమీ పత్రం: దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. 

    జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. 

    జమ్మిపూలను చక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. 

    జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.


19) ఆశ్వత్థపత్రం: సంస్కృతంలో అశ్వత్థం అంటే, తెలుగులో రావి అంటాం. 

    తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమాట. 

    రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. 

    రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితీ కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. 

    అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను సమిధలుగా వాడుతారు. 

    రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. 

    దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. 

    రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. 

    రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.


20) అర్జున పత్రం: మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. 

    మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. 

    భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా ఇది పెరుగుతుంది. 

    ఇది శరీరానికి చలువ చేస్తుంది. 

    కఫ, పైత్య దోషాలను హరిస్తుంది కానీ, వాతాన్ని పెంచుతుంది. 

    పుండు నుంచి రక్తం కారడాన్ని త్వరగా ఆపుతుంది. 

    మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. 

    దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.


21) అర్క పత్రం: జిల్లేడు ఆకు. 

    జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. 

    జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది, కానీ జిల్లేదు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. 

    ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాదులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. 

    జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్త శుద్ధిని చేస్తుంది. 


                   =x=x=x= 


    — రామాయణం శర్మ

              భద్రాచలం

పుణ్యకర్మల

ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸


*ಸತ್ಯಪಿ ಚ ಸುಕೃತಕರ್ಮಣಿ*

*ದುರ್ನೀತಿಶ್ಚೇತ್ ಶ್ರಿಯಂ ಹರತ್ಯೇವ |*

*ತೈಲೈಃ ಸದೋಪಯುಕ್ತಾಂ ದೀಪಶಿಖಾಂ* 

*ವಿದಲಯತಿ ಹಿ ವಾತಾಲಿಃ ||*

(ಭೋಜಪ್ರಬಂಧ)


ಪುಣ್ಯದ ಬಲವಿದ್ದರೂ ಸಹ ಪಾಪಕರ್ಮವನ್ನು ಮಾಡಿದರೆ ಅದು ಸಂಪತ್ತನ್ನು ಹೋಗಲಾಡಿಸುತ್ತದೆ. ದೀಪದ ಜ್ವಾಲೆ ಎಣ್ಣೆಯನ್ನು ಬಳಸುಕೊಳ್ಳುತ್ತಿದ್ದರೂ ಬಿರುಗಾಳಿ ದೀಪವನ್ನು ಆರಿಸಿಬಿಡುತ್ತದೆ.


*🌷🌺🙏ಶುಭದಿನವಾಗಲಿ!🙏🌺🌷*

 నూనె పుష్కలముగా ఉన్నను సుడిగాలి దీప కళికను ఎటుల ఆర్పివేయునో, అటులనే పుణ్యకర్మల బలమెంత ఉన్నను, పాప కర్మలచే మన సంపదలన్నియు ఆవిరైపోవును.

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝


*పాదపానాం భయం వాతాత్*

*పద్మానాం శిశిరాద్భయమ్*।

*పర్వతానాం భయం వజ్రాత్*

*సాధూనాం దుర్జనాద్భయమ్*॥


𝕝𝕝తా𝕝𝕝

వృక్షములు గాలి చేత భీతిల్లును. పద్మములు శిశిరఋతువు చేత భీతిల్లును..... పర్వతములకు ఇంద్రుడియొక్క వజ్రాయుధమన్న భయము. సాధువులకు దుర్జనులన్నచో భయము ఏర్పడును.



భయము వృక్షములకు పవనంబు వలనను

భయము మంచు వలన పద్మములకు

పర్వతముల కెల్ల భయము యింద్రుని వల్ల 

భయము  సాధువులకు  పాపి  వలన


✍️గోపాలుని మధుసూదన రావు శర్మ 🙏

 *మనం మనకోసం..*

                    *మనవాళ్ళ కోసం..*


                     *ఒకరిని ఇష్టపెట్టో..*

               *మరొకరిని కష్ట పెట్టో..*

           *సంపాదిచుకున్న భౌతిక సంపద*


           *ఈరోజు మనదిలా కనిపించినా*

         *అది రేపటి రోజున వేరొకరి సొంతం.*


                 *కాని.. మనం తెలిసో,*

                   *తెలియకో చేసిన*

               *పాప పుణ్యాలు మాత్రం*

             *మన ఖాతాలో కర్మఫలంగా*

              *జన్మ జన్మలకు ఉంటాయి.!*

శుభోదయం

శ్రీమదాంధ్ర మహాభారతము

 **************************************

     శ్రీమదాంధ్ర మహాభారతము

**************************************


ఘనుడౌ నన్నయభట్టు తా గరిమ

           తో గావించె నాంధ్రంబునన్

మునిరాట్ వ్యాసుని  ప్రోక్తమై బుధ జ 

         నామోదంబునైయున్న  శ్రీ

ఘనమౌ భారతసంహితన్ , జనులు 

          భాగ్యంబంచు శ్లాఘించగా , 

వినుతించన్ కవివర్యులంద రిల

         లో వేదంబుగా నెంచియున్

       

ఇన్నూరేండ్లు గతించిపోవ పిదప

            న్నీనేలపై భవ్యమౌ 

పెన్నా తీరమునన్ జనించి ధృతితో 

             పెంపొంది తిక్కన్న ,యా

పన్నుండైన హరీశునిన్ దలచుచున్

             పర్వంబులన్ సర్వము

న్నెన్నంగన్ పరిపూర్తి జేసె కవితన్ 

            వేనోళ్ళ కీర్తించగన్ 


ఒక శత వత్సరంబులకు 

            నుర్విని నెఱ్ఱన జన్మ మొందియున్

సకలము నందునన్ మిగిలి

           సాగకనున్న నరణ్యభాగమున్  

సుకవిత తోడ గూర్చియును

           శోభను దెచ్చెను , భారతాఖ్య మీ 

రకముగ పూర్తి నొందియును 

         రాగము తోడుత  దక్కె జాతికిన్ 


వాగనశాసనుండు కవి 

           వంద్యుడుతిక్కన  యెఱ్ఱనార్యుడున్

న్నాగమ సారమైన తొలి

          యాంధ్రకవిత్వము  సృష్టిజేసియున్

రాజితమైన భారతము 

          రంజిల నిచ్చిరి యాంధ్రజాతికిన్       

సాగగ మూడు వందలగు

          సాలుల దక్కెను గ్రంథ మీవిధిన్


******************************************

✍️గోపాలుని మధుసూదన రావు 🙏

*******************************************

విఘ్నేశ్వరునికి అవతారాలు

 విఘ్నేశ్వరునికి కూడా ఆ విష్ణుమూర్తి లాగానే కొన్ని అవతారాలు ఉన్నాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ అవతారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం


1.ఏకదంతుడు (Ekadantha)


మదాసురు డనే రాక్షసుడిని చ్యవనుడనే రుషి సృష్టించడం జరిగింది. రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడు హ్రీం అనే మంత్రాన్ని పఠించడం వలన అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని వద్దకు వెళ్ళి ఉపాయం అడుగుతారు. అప్పుడు ఆయన విఘ్నేశ్వరుని ప్రార్థించమని చెబుతారు. అప్పుడు దేవతలందరు విఘ్నేశ్వరుని ప్రార్దిస్తారు. అప్పుడు వారి ప్రార్ధనకి అలకించిన ఏకదంతునిగా అవతరించి మదాసురుడిని జయిస్తాడు.


2.గజాననుడు (Gajanana)


కుబేరుని యొక్క ఆశ నుండి లోభాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఆ లోభాసురుడు శివపంచాక్షరితో పారాయణం చేసి ఆ శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే కలిగే వరాన్ని అందుకుంటాడు. అప్పుడు అతని చేష్టలకి అంతులేకుండా పోయింది. లోభాసురుడు శివుని యొక్క కైలాసాన్ని కూడా తన స్వాధీనంలో చేసుకోవాలి చూస్తారు.  అప్పుడు దేవతలు అందరు రైభ్యుడనే రుషి ని శరణు కోరుతారు. అప్పుడు ఆయన విఘ్నేశ్వరుని శరణు కోరమని చెబుతారు. అలా సకల దేవతల ప్రార్థనలకు విఘ్నేశ్వరుడు 'గజాననుడి'గా అవతరించి లోభాసురుని ఓడిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. గజాననుడు అంటే ఏనుగు యొక్క ముఖం కలిగిన వాడు అని అర్థం.


3.వక్రతుండుడు (Vakratunda)


పూర్వం ఇంద్రుడు చేసిన తప్పు వలన మాత్సర్య సురుడు పుడతాడు. అతని రాక్షసత్వానికి ముల్లోకాలు అల్లాడిపోయిన దేవతలంతా దత్తాత్రేయుని శరణు కోరుతారు. అప్పుడు ఆయన విఘ్నేశ్వరుని ప్రార్థించమని చెప్పారు వారి ప్రార్ధనకు విఘ్నేశ్వరుడు వక్రతుండునిగా అవతరించాడు. అప్పుడు లోభాసురుడిని ఓడిస్తాడు. విఘ్నేశ్వరుడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా మరియు మాత్సర్య సురుడు మనస్సులోని ఈర్ష్య ప్రతీకగా చెప్పుకోవచ్చు.


4.మహోదరుడు (Mahodarudu)


పరమ శివుడు తపస్సు లో మునిగిపొతాడు. అప్పుడు పార్వతి దేవి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారుతుంది. ఆయన తపస్సుకు భంగం కలిగేలా చేస్తుంది. అప్పుడు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగింది అన్న అయోమయంలో మహిషాసురుడు అనే రాక్షసుడులా జన్మిస్తాడు. అతడు ముల్లోకాధిపత్యాన్ని సాదిస్తాడు. దీంతో తన ఆగడాలను అపదానికి వినాయకుడు మహోదరుడిగా అవతరించి విఘ్నేస్వరుడు తనను అంతమొందిస్తాడు..

శంబరుడు అనే రాక్షసుని సహయంతో మమతాసురుడు ముల్లోకాలను


5. విఘ్న రాజు (Vigna Raju) 


 పీడిస్తుంటాడు. అప్పుడు దేవతలందరు పరమేశ్వరుని ప్రార్థిస్తారు. అప్పుడు నాగుపాముని వాహనం చేసుకుని విఘ్నరాజు అవతారంలో వచ్చి మమతాసురుడిని మట్టుబెట్టినట్టు మన పురాణాలు చెబుతున్నాయి.


6. వికటుడు (Vikatudu)


పూర్వం కామాసురుడనే రాక్షసుడు తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతాడు.

కామాసురుడనే రాక్షసుడు అప్పటి నుంచి ముల్లోకాలకు తన ఆధిపత్యం సాగిస్తున్నాడు. అప్పుడు ఆ రాక్షసుడి బారి నుండి కాపాడుకునేందుకు దేవతలందరు వెళ్లి విఘ్నేశ్వరుని వేడుకొనగా అప్పుడు ఆయన వికటుడు అవతారంగా ప్రత్యక్షమై ఆ కామాసురుడనే రాక్షసుడుని అంతమొందిస్తాడు.


7. దూమ్రావర్ణుడు (Dumravarnudu)


అహంకరాసురుడిని రాక్షసుడి

పాలనతో విసుగు చెందిన దేవతలు అందరు ఆ రాక్షసుడి పాలన నుంచి రక్షించమని విఘ్నేశ్వరుని వేడుకొనగా అప్పుడు ఆయన దూమ్రవర్ణుడు

అవతారంలో వచ్చిఅహంకరాసురుడిని చంపినట్లు పురాణాలు చెబుతున్నాయి.


8. లంబోదరుడు (Lambodhara)


లంబోదరుడు అవతారం దేవతల అందరి కోసం క్రోదాసురుడు అనే రాక్షసుడిని మట్టుబెట్టడానికి అవతరించాడు. క్రోదం ఎల్లప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో విజయం సాధిస్తే సంతోషం.. ఓడితే ఉద్వేగాలు కలుగుతూ ఉంటాయి అని మన పురాణాలు చెబుతున్నాయి.


సేకరణ

నవగ్రహ పురాణం - 56 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 56 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿


*కేతుగ్రహ జననం - 1*



నారదమహర్షి ఆకాశమార్గాన ప్రయాణం చేస్తూ హిమాలయ ప్రాంతంలో నేల మీదికి దిగాడు. ఆయన రాకకోసమే నిరీక్షిస్తున్నట్టు భూదేవి ఆయన ముందు నిలబడింది. *"మాతా !"* నారదమహర్షి ఆశ్చర్యంగా అన్నాడు.


*"ఆకాశ మార్గాన నిన్ను చూశాను నారదా ! నింగి నుండి నేలకు దిగుతావేమో అని ఎదురు చూస్తున్నాను...”* *“నారాయణ ! జనని ముఖాన ఏదో విచారం..."* నారదుడు భూదేవిని చూస్తూ అన్నాడు.


*"విచారం లేకుండా ఎలా ఉంటుంది నారదా ! అందరి భారమూ సహించి , మోయాల్సింది నేనే కదా ! సృష్టికర్త సృజన నిర్విరామంగా సాగుతోంది. ఫలితంగా మను సంతతి నా మీద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. నా మీద భారం మోయలేనంతగా పెరిగింది నారదా ! నువ్వు వెంటనే వెళ్ళి ఆ బ్రహ్మదేవుడికి నా బాధ వివరించు. నా భారాన్ని తగ్గించే యోచన చేయమను !"*


*"నారాయణ ! భూభారం పెరిగితే ప్రమాదమేనని మా జనకులూ , ఆయన జనకులూ అనుకుంటూ ఉంటే విన్నాను ! ఇప్పుడే సత్యలోకానికి వెళ్తాను !"* అంటూ నారదుడు నింగికి ఎగిరాడు.


నారదుడు బ్రహ్మ దర్శనం చేసుకున్నాడు. భూమి ఉపద్రవాల అంచుకు చేరిందనీ , అందుకు కారణం ప్రాణుల సంఖ్య భయంకరంగా పెరిగిపోవడమేననీ వివరించాడు. భూదేవి సందేశాన్ని వినిపించాడు.


*"సమస్య తీవ్రమైందే , కుమారా !"* బ్రహ్మ సాలోచనగా అన్నాడు.


*"కొంత కాలం సృష్టి కార్యానికి విరామం ఇస్తే...”* నారదుడు సూచించాడు. 


సరస్వతి చిన్నగా నవ్వింది. *"దాని వల్ల ప్రయోజనం లేదు , నారదా ! ఇప్పటికే ఉన్న ప్రాణుల వల్లనే కదా భూభారం పెచ్చు పెరిగింది !”*


*“ఔను ! ఉన్న ప్రాణుల సంఖ్య పెరగకుండా చూడటం ప్రస్తుత సమస్యకు పరిష్కారం కాదు , కుమారా ! ఉన్న సంఖ్య తరగాలి !"* బ్రహ్మ ఆలోచిస్తూ అన్నాడు.


*"ప్రాణుల సంఖ్య తగ్గించడానికి ఏం చేయాలో తీవ్రంగా ఆలోచించాలి. ఆలోచిస్తాను !"* బ్రహ్మ మళ్ళీ అన్నాడు. *"నువ్వు వెళ్ళి భూమాతకు తెలియజేయి నారదా !".* 


*"ఆజ్ఞ!"* అన్నాడు నారదుడు.


బ్రహ్మ ఆలోచనా సముద్రంలో మునిగిపోయాడు. కాలం గడుస్తోంది కానీ , ఆయనకు పరిష్కారం తట్టలేదు. దాంతో ఆయనలో ఆగ్రహం పెచ్చరిల్లింది. మితిమీరిన ఆయన ఆగ్రహం వల్ల ఆయన నాలుగు ముఖాల నుండి అగ్ని జ్వాలలు వెలువడ్డాయి. ఆ మంటల మూలంగా ప్రాణులకే కాకుండా , లోకాలలోని అచేతన పదార్థాలకూ ప్రమాదం ఏర్పడింది. సకల లోకాలలో సర్వనాశనం తాండవం చేసే పరిస్థితి తలయెత్తింది. బ్రహ్మ తన తీవ్రాలోచనలో ఉండిపోయాడు.


బ్రహ్మ ముఖాల నుండి వెలువడే అగ్నిజ్వాలల ప్రమాదాన్ని ఊహించిన పరమశివుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆలోచనా ధ్యానాన్ని భగ్నం చేశాడు.


*"సృష్టికర్తా ! మీ ఆలోచనను ఉపసంహరించి , తద్వారా అగ్నికీలలను అణగార్చండి. మీ కర్తవ్యం సృష్టి ; సంహారం కాదు !"* శివుడు అన్నాడు.  *"ఆ సంహార కార్యానికి మరొక తగిన శక్తిని సృష్టించండి. భూభారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రాణుల సంఖ్యను నియంత్రించడానికి మీరు చేయాల్సిన పని అది మాత్రమే. ఇక , నేను సంహారకర్తను , లయకారకుణ్ణి. నా విధి కూడా చంపడం కాదు. చనిపోయిన ప్రాణులకు విశ్రాంతి ప్రసాదించడం !".*


పరమశివుడి సూచన సృష్టికర్తకు నచ్చింది. శ్రీహరి ఉద్దేశం కూడా అదే ! తాను కేవలం సృష్టికర్త ! తన విద్యుక్త ధర్మం ప్రాణులను పుట్టించడం , చంపడం కాదు !


ఆలోచనలను ఉపసంహరించిన బ్రహ్మలోంచి ఒక స్త్రీ మూర్తి ఆవిర్భవించింది. ఆమె శరీరం ఎరుపు , నలుపు , పసుపు వర్ణాల మేళవింపులో ఉంది. ఆవిర్భవించిన వెంటనే ఆమె దక్షిణం వైపు అభిముఖంగా నిలుచుంది.


*“నేనెవరు ?"* అందామె బ్రహ్మను చూస్తూ.


*“నీ పేరు మృత్యువు ! ఒక మహాకార్యనిర్వహణ కోసం నిన్ను సృష్టించాను. సృష్టిలోని ప్రాణులను సంహరించడమే నీ కర్తవ్యం. వెళ్ళు ! ఆ కార్యంలో నిమగ్నురాలివై పో !"* అన్నాడు బ్రహ్మ.


బ్రహ్మ వాక్కు వినగానే మృత్యువు దీనంగా ఏడవడం ప్రారంభించింది. ఆమె కళ్ళల్లోంచి అశ్రువులు జలజల రాలాయి. బ్రహ్మ ఆ కన్నీటి బిందువులను తన దోసిట్లో పట్టుకున్నాడు.


*"నన్ను క్షమించండి. ప్రాణులను చంపడం అధర్మం. ఆ పనిని నేను చేయను. వెళ్తున్నాను ! తపస్సు చేసుకుంటాను !"* అంటూ , మృత్యువు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. 


బ్రహ్మ పరమశివుడి వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు. శివుడు చిరునవ్వు నవ్వాడు. *"స్త్రీ సహజమైన వాత్సల్య లక్షణంతో మృత్యు దేవత అలా అంది. నెమ్మదిగా ఆమెకు నచ్చజెప్పి , కార్యోన్ముఖురాలిని చేయండి !”*


బ్రహ్మ వద్ద నుండి వెళ్లిపోయిన మృత్యుదేవత 'ధేనుకాశ్రమం' అనే ప్రదేశంలో తపస్సు ప్రారంభించింది. కొన్నాళ్ళు జరిగాక బ్రహ్మదేవుడు ఆమె ముందు సాక్షాత్కరించాడు.


*“స్వామీ...”* అంది మృత్యువు ఆశ్చర్యంగా.


*“నీకు నిర్దేశించిన కార్యక్రమానికి నిన్ను నువ్వు అంకితం చేసుకునే దాకా , నేను నీకు ప్రత్యక్షమవుతూనే ఉంటాను. నీ ఆవిర్భావానికి మూలం ప్రాణుల సంహార సంకల్పం. ఆ సంకల్పం వికల్పం కాకూడదు ; కాదు. ఈ విధి నీకు విధిస్తున్న విధి నుండి నువ్వు తప్పించుకోలేవు !"* బ్రహ్మ మృత్యువు ముఖంలో గూడుకట్టుకుంటున్న విచారాన్ని చూస్తూ క్షణకాలం ఆగాడు.


*"మృత్యుదేవీ ! జాగ్రత్తగా ఆలకించు. నీ చేతులతో నువ్వు ప్రాణులను వధించే అవసరం ఉండదు. ఆ రోజు నువ్వు కన్నీళ్ళు కార్చావు. ఆ అశ్రువుల్ని నేను దోసిట పట్టుకున్నాను. గుర్తుంది కదా ! ఒక్కొక్క అశ్రుకణం ఒక్కొక్క రోగంగా రూపొంది , ప్రాణులను మరణాలకు తరలిస్తాయి. ఆ కార్యాన్ని అధివీక్షించి , క్రమ పరచడమే నీ విధి. నా ఆదేశాన్ని శిరసా వహించు. నీ విధిని స్వీకరించు. కర్తవ్యాన్ని ఆచరించడం ప్రారంభించు !"* అన్నాడు గంభీరంగా బ్రహ్మ.


నిరాకరించలేని తన నిస్సహాయత అర్థమైందా మృత్యుదేవతకు. ఆ ఆలోచన కలిగిన మరుక్షణం ఆమెలోంచి వేడి నిట్టూర్పూ సెగలు కక్కుతూ వెలువడింది. పతాకాల ఆకారంతో వెలువడిన ఆ నిట్టూర్పులోంచి ఒక బాలుడు ఆవిర్భవించాడు.


బ్రహ్మ ఆ బాలుణ్ణి చిరునవ్వుతో చూసి , చూపుల్ని మృత్యువు వైపు మరల్చాడు. *“నీ మూలంగా ఈ బాలుడు జన్మించాలన్న ఆశయంతోనే , నిన్ను ఆనాడు నా సన్నిధి నుండి వెళ్ళనిచ్చాను. ఈ బాలుడు నీ కుమారుడు !"*


బ్రహ్మమాటలు వినగానే మృత్యువు బాలుణ్ణి చేతుల్లోకి తీసుకొని ఎదకు హత్తుకుంది. *"కేతువు ఆకారంలో జన్మించిన నీ కుమారునికి 'కేతువు' అని నామకరణం చేస్తున్నాను. బాలకుణ్ణి పెంచి , పెద్దవాణ్ణి చేయి !”* అన్నాడు బ్రహ్మ.


మృత్యువు తలను అడ్డంగా ఊపింది. *"నా కర్తవ్యం కఠినాతి కఠినమైంది. పుత్రపోషణకూ , దానికీ సమన్వయం కుదరదు ; కుదుర్చుకోలేను. బాలకుణ్ణి మీరే స్వీకరించండి !"*


బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. *"నీ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంది. నీ కేతువు రాక్షస లక్షణాలతో జన్మించాడు. రాక్షస సంతతిని పొందిన కశ్యప ప్రజాపతి ఆ బాలకుణ్ణి పెంచడానికి తగినవాడు. కశ్యపుడు నీ పుత్రుడిని తన పుత్రుడిగా స్వీకరించి , పోషిస్తాడు. 'కేతువు' కశ్యపుడికి అందేలా చూడు !"*


*"ధన్యోస్మి !”* అంది మృత్యువు కేతువును ముద్దుపెట్టుకుంటూ.

అందరూ కలిసి ఉండాలనుకునేటప్పుడు

 *1915*

*కం*

ఒక రకమగు వారలెపుడు

నొకకడ సమకూరుచుండు నుర్విజ గణమున్.

సకలజనుల సమకూర్పున(ఒకకడగొన)

నకటవికటమెంచు చుండ నమరరు సుజనా.

*భావం*:-- ఓ సుజనా!భూజనులలో ఒకరకమైన వారంతా ఒకచోట చేరుదురు. అందరూ ఒకే చోట చేసేటప్పుడు వారి మధ్య విభేదాలు (అకటవికటములు) ఎంచుకుంటే ఇమడలేరు.

*సందేశం*:-- అందరూ కలిసి ఉండాలనుకునేటప్పుడు విభేదాలకు  తావివ్వరాదు. మనస్సు లో భేదభావాలు తొలగకపోతే జన సమాకలనం అసాధ్యం.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

అశ్వ‌గంధ

 *1.అశ్వ‌గంధ*

అశ్వ‌గంధ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గిస్తుంది. ఇది చూర్ణం, ట్యాబ్లెట్ల రూపంలో ల‌భిస్తుంది.


*2. వాము*

వాము గింజ‌లు మ‌న వంట ఇంట్లోనే ఉంటాయి. ఇవి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. గ్యాస్‌, అసిడిటీ, వాంతికి వ‌చ్చినట్లు ఉండ‌డం, వికారం త‌గ్గుతాయి. వాము గింజ‌ల‌ను నేరుగా ఒక టీస్పూన్ మోతాదులో న‌మిలి మింగ‌వ‌చ్చు. లేదా నీటిలో వేసి మ‌రిగించి డికాష‌న్‌ను తాగ‌వ‌చ్చు.


*3. బ్ర‌హ్మి*

ఇది పొడి, ట్యాబ్లెట్ల రూపంలో ల‌భిస్తుంది. చిన్నారుల్లో జ్ఞాప‌శ‌క్తిని పెంచుతుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.


*4. యాల‌కులు*

యాల‌కులు కూడా మ‌న వంట ఇంట్లోనే ఉంటాయి. వీటితో బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.


*5. జీల‌క‌ర్ర*

అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో జీల‌క‌ర్ర బాగా ప‌నిచేస్తుంది. అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. షుగ‌ర్ లెవ‌ల్స్‌, బీపీ త‌గ్గుతాయి. ఇవి కూడా మ‌న కిచెన్‌లోనే ఉంటాయి. జీల‌క‌ర్ర‌ను క‌షాయం చేసి తాగితే మంచిది.


*6.తుల‌సి*

తుల‌సి మొక్క మ‌న ఇంటి చుట్టు ప‌క్క‌ల పెరుగుతుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. వికారం, జీర్ణ స‌మ‌స్య‌లు, అసిడిటీ త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తుల‌సి ఆకుల ర‌సాన్ని రోజూ తీసుకోవ‌చ్చు.


*7.వేప*

వేప చెట్లు కూడా మ‌న ఇంటి చుట్టు ప‌క్క‌లే పెరుగుతాయి. వీటి ఆకుల‌ను తింటుంటే జీర్ణ స‌మ‌స్య‌లు తగ్గుతాయి. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ అదుపులోకి వ‌స్తాయి. వేప ఆకుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసి కూడా వాడ‌వ‌చ్చు.


*8. ప‌సుపు*

ఇది మ‌నంద‌రి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని నీటిలో వేసి మ‌రిగించి డికాష‌న్ రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా వేడి పాల‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు. ప‌సుపు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.


*9. అతి మ‌ధురం*

ఇది చూర్ణం రూపంలో ల‌భిస్తుంది. అజీర్ణం, వాపులు, జీర్ణాశ‌య అల్స‌ర్లు, చ‌ర్మంపై ద‌ద్దుర్ల‌ను, వాపుల‌ను త‌గ్గిస్తుంది. దీన్ని నెయ్యి, తేనె, వేడినీళ్ల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు.


*10. అల్లం*

ఇది కూడా మ‌నంద‌రి ఇళ్ల‌లో ఉంటుంది. అల్లం ర‌సంను సేవించ‌వ‌చ్చు. లేదా అల్లం వేసి మ‌రిగించిన నీటిని తాగ‌వ‌చ్చు. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. వికారం, వాంతులు త‌గ్గుతాయి.


పైన తెలిపిన 10 ఆయుర్వేద మూలిక‌ల‌ను మాత్రం ఎల్ల‌ప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి. దీంతో ఎప్పుడు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.


*ఇట్లు,*

*మీ ఆయుర్వేద వైద్యులు,*

*Dr. వెంకటేష్ 9392857411.*

ప్రకృతి పరవశం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

       🌷 *శు భో ద యం 🌷* 


  *బాల గోపాలుని మురళీగానం* 

         ----------------------------------

             *ప్రకృతి పరవశం!* 


ఉ: కానల నుండుచున్ సరస గాన వివేక విహీన జాతలై

వీనుల నేఁడు కృష్ణముఖ వేణు రవామృత ధారసోకినన్

మేనులు మేఁతలున్ మఱచి మెత్తని చూడ్కి మృగీ మృగావళుల్

మానిని ! చూడవమ్మ! బహుమానము చేసె, కృతార్ధ చిత్తలై ;


భాగ 8స్కం థం 785 ప:


బాలగోపాలుడు వేణువునూదుతుంటే ఆనాద మాధుర్యానికి ప్రకృతి యెంత పులకించి పోయిందో కిన్నర మిధునం దర్శిస్తూ  దానిని వర్ణిస్తున్నారు.

అసలు సంగీతమంటే యేమోతెలియని మృగాలు (అడవిలోజంతువులు) చేష్ఠలుడిగి తన్మయంగా చిత్రీకృత దృశ్యాలవలె నిలబడి పరవశంతో వింటున్నాయట!


మరోచిత్రం!


ఉ: తల్లుల చన్నుఁ బ్రాలు మును ద్రావు తరిన్ ,దమ కర్ణవీధులన్ 

వల్లభమైన మాధవుని వంశ రవామృత ధార చొచ్చినన్ 

ద్రుళ్ళక పాలురాఁ దివక దూఁటక మానక, కృష్ణుమీఁద దృ

గ్వల్లులు చేర్చి , నిల్చె నదె వత్సము లంగనలార!గంటిరే?


దూడలు తల్లి పొదుగు లోముట్టె దూర్చి పాలుతాగ బోతున్నాయి. ఇంతలో నల్లనయ్య మురళీరవం చెవిని సోకింది. అంతే అవి పాలుచేపేందుకు చేసేప్రయత్నం మాని యిటునటు త్రుళ్ళక మొగమును కృష్ణుని వయిపు తిప్పి వేణు రవాన్ని వింటానికి ఉత్సాహం చూపుతున్నాయట! యెంత ప్రకృతి విరుధ్ధం!


మరోవిచిత్రం!


మ: మమతన్ మోములు మీఁది కెత్తుకొని రోమంథంబు సాలించి హృ

త్కమలాగ్రంబున కృష్ణునిల్పి మురళీ గానామృత శ్రేణి క

ర్ణములన్ గ్రోలుచు మేఁత మాని గళితానందా శ్రులై చిత్రితో

పమ లై గోవులు చూచు చున్న వదిగో పద్మాక్షి ! వీక్షించి తే?


ఎంతో ప్రేమతో మోరలు పైకిలేపి హృదయకమలంలో కృష్ణుని దివ్యమంగళ విగ్రహం నెలకొలిపి మురళీగానామృతమును చెవులతో పానం చేస్తూ మేతమాని ఆనందాశ్రువులు కన్నులనుండి జాలువారగా చిత్రితోపమంగా నిలచి పోయి కృష్ణుని చూచు చున్నాయట!


మరో విచిత్రం!


మ: జగతీ జంబుల శాఖ లెక్కి మురళీ శబ్దామృత స్యందముల్ 

మిగుల్ వీనులఁ ద్రావి , వ్రేగుపడు నెమ్మిం గృష్ణరూపంబు చి

త్తగమై యుండగ నడ్డబెట్టు క్రియ నేత్రంబుల్ దగన్ మూసి యీ

ఖగముల్ సొక్కెడిఁ జూచితే మునిజనాకారంబులన్ గామినీ!!


పక్షులుగూడా పరవశములై తమలోనున్న కృష్ణుని రూపం బయటకు రాకుండా తలుపులు మూసినాయా?అనే రీతిగా కన్నులు మూసి మునులవలె మురళీగానాన్ని ఆశ్వాదిస్తున్నాయట!


నదులు సరోవరాలు తమ తరంగ హస్తాలతో పద్మములను దెచ్చి కృష్ణునకు పాదార్ఛనలు గావించేరీతిగా ఉన్నాయట! ఇదీ మురళీ గాన ప్రభావంతో అక్కడి చరాచర ప్రకృతి పరవశం!


" శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ! "- అన్నారు విజ్ఙులు!


కృష్ణుని మురళీ గానంలో నాదం ఉన్నది. అది సామ వేదం .విశ్వ ప్రేమవాదం .అదే కారణం ప్రకృతి మురిసిపోయి

మూగనోము పట్టటానికి. ఆఅదృష్టం అలనాడు నంద గోకులానికి దక్కింది. మన హృదయాలు కూడా పరిశుధ్ధమై ప్రేమ పూరితములై త్యాగ మయములై "ఆనందంతో నిండిన గోకులంగా (గోశబ్దానికి యింద్రియాలు అనే అర్ధంకూడా ఉంది)మారినప్పుడు ఆమురళీ గానం మనకు గూడా వినిపిస్తుందేమో? ప్రయత్నిద్దాం!

*సేకరణ:-  శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్* 

🙏🙏👌👌💐🌷💐💐💐🌷🌷💐🌷💐💐💐💐💐💐

మొలలబాధ

 తీవ్రమయిన మొలలబాధ నుంచి విముక్తి కలిగించే అతి సులభ యోగం  - 


    తుత్తురి బెండ ఆకులు 3 తీసుకుని మంచి వంట ఆముదం లో వేయించి ఆ ఆకులని చపాతీలో పెట్టుకుని తిని ఆ ఆముదం తాగవలెను. ఆముదం మోతాదు ఒక స్పూన్ చాలును. ఇలా ప్రతిరోజు రాత్రి సమయం లో చేసిన 3 నుంచి 5 సార్లు వాడేలోపు మొలలు అదృశ్యం అవుతాయి.  బాగా మరిగించిన నీటిలో మునగ ఆకు వేసి ఆ ఆవిరిని ఆసనానికి పట్టించిన మొలల నొప్పి అదృశ్యం అగును. 


 ఇది నా అనుభవపూర్వకం ...


  గమనిక  - 


      తుత్తురి బెండని పిచ్చి బెండ , అతిబల ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఇది ఖాళి స్థలాలలో పెరుగును . 


 

    మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

విలువలు తెలియని చోట

 *1914*

*కం*

నీ విలువల నెరుగని కడ

నీ విలువగు సమయమెల్ల నిస్సారమగున్.

నీ విలువలు నీకు తెలియ

నీ వెల్లపుడట్టికడల నిలువవు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నీ విలువలు తెలియని చోట నీవు వెచ్చించే కాలమంతా వ్యర్థ మవుతుంది. నీ విలువలు నీకు తెలిస్తే నీవే నీకు విలువ లేని చోట ఉండవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ**

జ్యోతిష్యం చెప్పబడును

 ⚜️[ 8074538053]⚜️

⚜8074538053⚜

   || జ్యోతిష్యం చెప్పబడును ||


మహిషాసురమర్ధిని జ్యోతిష నిలయం 


√నమ్మినవారు దురం కావటం👬


√నిందలూ, అవమానాలు రావటం


√ఇతరులు అపార్థం చేసుకోవడం


√వివాహాం ఆలస్యంగా అవ్వటం👰🤵


√ఉద్యోగం సమస్య 👮


√పిల్లల పుట్టకపోవడం🤱🤰


√వ్యక్తిగత  జతక సమాచారం కోరకు


⚜️[8074538053]⚜️


••••••••ఓం శ్రీ మాత్రే నమః••••••••••


✓వ్యాపార వశీకరణ లేక నష్టం


✓రావల్సిన ఆస్థి, ధనం రాకపోవడం


✓భార్యా భర్తలు మధ్య వశీకరణ👫


✓విద్యా, విదేశి ప్రయణం, ఉద్యొగం 


✓కుటుంబ సభ్యుల  మధ్య విబేధాలు👨‍👩‍👦‍👦


✓అరోగ్య సమస్యలకు 


✓ప్రేమా సమస్యలకు 💏


ఇటువంటి  సమస్యలకూ ప్రత్ర్యకం గా 


చేయబడును ⚜8074538053⚜


🌷ఉన్నదీ వున్నట్లు గా చెప్పబడును🌹⚜8074538053⚜


👉.మీరు అనేక మంది జ్యోతిష్యులను సంప్రదించి నిరాశ చెంది ఉన్నారా అయితే చివరగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి పూర్తి పరిష్కారం లభిస్తుంది దయచేసి టైం పాస్ కోసం సరదా కోసం కాల్ చేయకండి మేము కోరేది కూడా మీ మంచి గురించే..  📲📲[[8074538053]]

ధనప్రాప్తి-మారేడు ఆకు*

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి9494550355


*ధనప్రాప్తి-మారేడు ఆకు*


ధన మూల మిదం జగత్ అనే సామెత అందరికీ తెలిసినదే ధనం చుట్టూ ఈ ప్రపంచం తిరుగుతుంది అనేది అక్షర సత్యం. ప్రతి ఒక్కరి అవసరాలు తీరడం అనేది ధనం తోనే ముడిపడి ఉందని చెప్పాలి. అటువంటి ధనము లభించాలి వృద్ధి చెందాలి అని భావించేవారు మారేడు దళం తో చిన్న పరిహారం చేయండి. మారేడు దళానికి ధనానికి అవినాభావ సంబంధం ఉంది. శ్రీ మహాలక్ష్మి దేవి మారేడు చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ మారేడు చెట్టుగా మారిపోయింది అని శ్రీ సూక్తం లో తెలియజేస్తుంది. అటువంటి మారేడు దళము పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కలియుగంలో ఈశ్వరో ఐశ్వర్య కారకః అని శాస్త్రం తెలియజేస్తున్నది అనగా ఈశ్వరుడు ఐశ్వర్యానికి కారకుడు అని అర్థం. ఈశ్వరుడికి అత్యంత ప్రతిపాత్రమైనది ఈ బిల్వదళము. ఈ బిల్వదలంతో ఒక చిన్న పరిహారం చేసిన ఎడల శ్రీ మహాలక్ష్మి మరియు పరమేశ్వరుని అనుగ్రహంతో ధనానికి ఈ విధమైన లోటు లేకుండా ఐశ్వర్యంతులవుతారని శాస్త్ర వచనం. ఏదైనా ఒక గురువారం నాడు శుచిగా మారేడు చెట్టు వద్దకు వెళ్లి చెట్టు మొదట్లో నీళ్లు పోయండి. తరువాత మారేడు చెట్టుకి గంధం రాసి బొట్టు పెట్టి అగరబత్తులు వెలిగించండి. చెట్టు మొదట్లో ఆవు నెయ్యి దీపం వెలిగించి తాంబూలం సమర్పించండి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మారేడు చెట్టుని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఇప్పటినుండి ఆర్థికంగా అన్నీ కలిసి రావాలని ధనం అభివృద్ధి చెందాలని మనసులో కోరుకుని ఒక మారేడు ఆకు కోసి ఇంటికి తెచ్చుకోండి. దానిని లామినేషన్ చేయండి ఇలా చేస్తే ఆకు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. ఈ ఆకుని మీ పూజా మందిరంలో ఉంచండి లేదా మీ పర్సులో కానీ జేబులో కానీ ఉంచుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ధనానికి లోటు ఉండదు ఎల్లప్పుడూ ధనం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవాలయంలో మారేడు చెట్టు నుండి ఆకును సేకరించాలని కున్నప్పుడు దేవాలయం నుండి ఉచితంగా ఏ వస్తువు ఇంటికి తెచ్చుకోరాదు. దేవాలయంలో అర్చకునికి దక్షిణ సమర్పించిన తరువాత మారేడు చెట్టు వద్దకు వెళ్లి పైన చెప్పిన నియమాలు పాటించి మారేడు ఆకును సేకరించాల్సి ఉంటుంది. దేవాలయం బయట ఎక్కడైనా మారేడు చెట్టు నుండి మారేడు దళాని  సేకరించాలంటే ఎవరికి దక్షిణ సమర్పించాల్సిన అవసరం లేదు. పై విధానాన్ని పాటించండి. ఐశ్వర్య ప్రాప్తిని పొందండి


జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*9494550355*


PlZ Forward the message

రామాయణమ్ 326

 రామాయణమ్ 326

....

మదించిన ఏనుగుల సమూహానికి రెక్కలు వచ్చి గాలిలోకి ఎగిరితే ఎలా ఉంటుందో అలాగా ఆకాశమంతా నిండిపోయి ప్రయాణం చేస్తున్నారు వానరవీరులు.

.

ముందు ఎగురుతున్న హనుమంతుని అపురూపంగా చూసుకుంటూ ఆయన మీదనుండి దృష్టి మరల్చకుండా గాలిని తోసుకుంటూ ఆధారమేలేని ఆకాశంలో రయ్యిమంటూ దూసుకు పోతున్నారు .

.

ఇక కిష్కింధ కొంతదవ్వున ఉన్నదనగా వారికి ఫలపుష్పాదులతో నయనానందకరంగా నందనవనాన్ని మరపిస్తున్న మధువనం కనపడ్డది .

.

అది సుగ్రీవునికి అత్యంత ఇష్టమైన వనం దానిని ఆయన మేనమామ దధిముఖుడు సంరక్షిస్తూ ఉన్నాడు.

.

ఆ వనాన్ని చూడగానే మధువులు గ్రోలి విజయోత్సవాలు జరుపుకోవాలన్న కోరిక వారిలో పెచ్చరిల్లింది . కోరిక పుట్టినదే తడవుగా అంగదుని అనుమతి కోరి ఆయన సమ్మతి మీద మధువనంలో ప్రవేశించారు వానరవీరులంతా .

.

రావడము రావడమే చెట్లమీద విరుచుకు పడ్డారు అందరూ.

.

పండ్లు తెంపి పొట్టపట్టినంతా తిని వాటితో బంతులాడేవాడొకడు!

తేనెతుట్టెలు తెంపి మధువులు గ్రోలి మత్తెక్కి ఊగేవాడొకడు

తోకనెత్తుకొని ఠీవిగ అటునిటు పరుగులెత్తేవాడింకొకడు

.

గంతులు వేసేవాడొకడు గొంతునిండా తేనెలు తాగేవాడొకడు

.

బారుగా చెట్లు ఎక్కేవాడొకడు 

వాడికి ఎదురుగా సర్రున దిగేవాడింకొకడు

.

కొమ్మలు పట్టుకొని వేలాడేవాడొకడు

అంత ఎత్తునుండి ధబ్బున నేలమీద దూకేవాడింకొకడు

.

చెట్టుమీదనుండి మరియొక చెట్టుమీదకు దూకేవాడొకడయితే

గుట్టలుగా పండ్లు తెంపి నేలపై విసిరేవాడింకొకడు

.

ఒకడివీపుమీద మరియొకడు స్వారీచేస్తుంటే వాడి మూపుమీద ఎక్కి ఊపున దూకేవాడు ఇంకొకడు.

.

పూలు కోసి ,కసుకాయలు తెంపి విసురుగా విసరివేస్తూ ఒకడు..

లేచిగుళ్ళు తెంపివేసి కొమ్మలు విరిచివేసి వికవిక నవ్వేవాడొకడు వాడిని చూసి పకపకనవ్వేవాడొకడు వారివురినీ చూసి పళ్ళికిలించి సకిలించేవాడింకొకడు.

.

మొత్తం వనమంతా ధ్వంసంచేస్తూ ఒకరినొకరు పరిహసించుకొంటూ ,హసిస్తూ కుప్పిగంతులు వేసి పాటలు పాడుకొంటూ ఉన్న వానరమూక ను చూసి కావలి వాళ్ళు వారించబోతే వారిని చావచితకకొట్టి పారిపోయేటట్లు చేయగా వారు వెళ్ళి దధిముఖుని వద్ద మొరపెట్టుకొన్నారు.

.

దధిముఖుడు మద్దిచెట్లు,తాడిచెట్లు,పెద్దపెద్దబండరాళ్ళు ఆయుధాలుగా పట్టుకొన్న బంట్లు వెంటరాగా హనుమదాదులు ఉన్నచోటికి వచ్చివారిని వారించబోగా,.

.

ఆ దధిముఖుడిని పట్టి ముఖముపైకొట్టి గడ్డము మీద గ్రుద్ది నేలపై పడద్రోసి ముష్టిఘాతాలతో అతని ఒడలంతా పొడిచిపొడిచి విడిచిపెట్టినాడు అంగదుడు.

.

ఆ దెబ్బలకు ఓర్వలేక పోయిపోయి సుగ్రీవుని ముందు వడలిపోయిన ఒడలుకలవాడై తీవ్రగాయాలతో రుధిరధారలు కారుతుండగా వానరరాజుముందు అంజలి ఘటించి నిలుచున్నాడు దధిముఖుడు.

.

వూటుకూరు జానకిరామారావు

16 సెప్టెంబర్, 2023

 🔔🔔 *_PVSN MURTHY_* 🔔🔔                                  🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీరస్తు.                          శుభమస్తు.                                                        అవిఘ్నమస్తు.  

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱                                                                   🙏    *ఓం శ్రీ గురుభ్యోనమః*    🙏 

         🙏  *శుభోదయం*  🙏 

🌿🎋 *16 సెప్టెంబర్, 2023,  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,  దక్షిణాయణం, వర్షఋతువు, నిజశ్రావణ మాసం,కృష్ణపక్షం, శని వారం(స్థిరవాసరం)* 🎋🌿               

 తిధి                   : భాద్రపద శు. పాడ్యమి ఉ. 7.53. తదుపరి విదియ.        నక్షత్రం                  : ఉత్తర ఉ. 7.32. తదుపరి హస్త.         అమృతం              : తె. 3.01 ల. 4.45 వరకు.

దుర్ముహూర్తం        : ఉ. 5.50 ల. 7.28 వరకు.

వర్జం                      : సా. 4.38 ల. 6.22 వరకు.                                                                

 రాహుకాలం           : ఉ. 9.00 ల. 10.30 వరకు.                   

యమగండం            : మ. 1.30 ల. 3.00 వరకు.                               సూర్యోదయం        : 5.51.             

సూర్యాస్తమయం   : 6.02.                                                                                  🎋🌿 *2 తిథి, అనాధ్యాయః, చంద్ర దర్శనం, ఉత్తర శృంగం సమార్ఘ:*    🌿🎋                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  🌼🌼🌼🌼🙏🙏🙏🌼 🌼🌼🌼 

🕉🕉🕉🕉 *శుభమస్తు*  🕉🕉🕉

🔯🔯🔯🔯🔯🔯 🔯🔯🔯🔯

వృక్షములు

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝


*పాదపానాం భయం వాతాత్*

*పద్మానాం శిశిరాద్భయమ్*।

*పర్వతానాం భయం వజ్రాత్*

*సాధూనాం దుర్జనాద్భయమ్*॥


,*తా𝕝𝕝 వృక్షములు గాలి చేత భీతిల్లును..... పద్మములు శిశిరఋతువు చేత భీతిల్లును..... పర్వతములకు ఇంద్రుడియొక్క వజ్రాయుధమన్న భయము.....*

*సాధువులకు దుర్జనులన్నచో భయము ఏర్పడును*.....

భయము వృక్షములకు పవనంబు వలనను

భయము మంచు వలన పద్మములకు

పర్వతముల కెల్ల భయము యింద్రుని వలన

భయము సాధువులకు పాపి వలన

🧘‍♂️🙏🪷 ✍️🙏

సంస్కృత భారతీ* *3*

 *సంస్కృత భారతీ*

              *3*

    *తృతీయ పాఠః*

*మానుష సంబంధాః*

పితా= తండ్రి, మాతా= తల్లి, భ్రాతః/సహోదరః = అన్న/తమ్ముడు,

సహోదరీ = అక్క/చెల్లెలు, అగ్రజః = అన్న, అగ్రజా / భగినీ = అక్క, అనుజః = తమ్ముడు, అనుజా = చెల్లెలు,

 భావుకః/ ఆవుత్తః = బావ, ప్రజావతీ = వదిన, 

దేవరః = మరిది(వదినకు), శ్యాలకః = భావమరిది( (బావకు), మాతులః = మేనమామ, మాతులీ/మాతులానీ = మేనత్త (మేనమామ భార్య),మాతులేయః = మేనమామ కొడుకు, పితృవ్యః = పినతండ్రి (బాబయ్య), పితృవ్యా = పిన్ని(బాబయ్య భార్య), మాతృష్వసా =పిన్నమ్మ/ పిన్ని( తల్లి యొక్క చెల్లెలు), పితృష్వసా = మేనత్త (తండ్రి యొక్క చెల్లెలు), శ్వశురః = మామగారు, శ్వశ్రూ = అత్తగారు, భాగినేయః = మేనల్లుడు,

భాగినేయా = మేనకోడలు,

 భ్రాతృజః = అన్న లేదా తమ్ముని కొడుకు, భ్రాతృజా = అన్న(తమ్ముని) కూతురు. 

పితామహః = తండ్రి యొక్క తండ్రి, పితామహీ = తండ్రి యొక్క తల్లి, మాతామహః = తల్లి యొక్క తండ్రి, మాతామహీ = తల్లి యొక్క తల్లి, ఇదేవిధంగా ప్రపితామహః,ప్రపితామహీ అనగా పితామహుని తల్లిదండ్రులు. మాతుః పితామహః,మాతుః పితామహీ అంటే మాతామహుని తల్లిదండ్రులు మాతుః ప్రపితామహః అంటే తల్లి యొక్క పితామహుని తండ్రి, మాతుః ప్రపితామహీ అంటే తల్లి యొక్క పితామహుని తల్లి., పౌత్రః = మనుమడు, ప్రపౌత్రః = మునిమనుమడు,.నప్త్రః = మునిమనుమడి కొడుకు, వీరి స్త్రీ రూపాలు(మనుమరాలు, మునిమనుమరాలు, మునిమనుమడి కూతురు)పౌత్రీ,ప్రపౌత్రీ, నప్త్రీ

సఖా = మిత్రము(పుల్లింగము), 

( *కానీ వ్యావహారికముగా తెలుగు లో స్నేహితుని మిత్రుడు అని సంబోధిస్తున్నారు,కానీ మిత్రుడు అంటే సూర్యుడు అని అర్థం, ఎందుకంటే సంస్కృతమున మిత్రః అంటే సూర్యుడు అని అర్థం*) కానీ సమాసమేర్పడినప్పుడు విసర్గాంతమవుతుంది. ఉదాహరణకు రామసఖః, కృష్ణసఖః...ఇలా.

 సఖీ = మిత్రురాలు. 

*సాధారణగమనిక*:-- సంస్కృత పుం లింగ శబ్దాలు సాధారణంగా విసర్గాంతాలుగా ఉంటాయి, వాటిని తెలుగు లోనికి పుంలింగ శబ్దాలు గా మార్చి తే చివర "డు" చేరుతుంది, ఉదాహరణకు రామః అనేది రాముడు, శంభుః అనేది శంభుడు,మిత్రః అనే ది మిత్రుడు......ఇలా మారతాయి., సంస్కృత స్త్రీలింగ శబ్దాలు దీర్ఘాంతాలుగా ఉంటాయి, ఉదాహరణకు సీతా, గౌరీ,రాణీ... సంస్కృత నపుంసక లింగశబ్దాలు సాధారణంగా పూర్ణాంతాలుగా ఉంటాయి. అంతే కాకుండా సంస్కృతంలో ఏ లింగ శబ్దమైననూ తెలుగు లో పుంలింగశబ్దమైతే "డు" అంతం గానూ, నపుంసక తెలుగు పదం గా మారితే "ము" అంతం గానూ మారతాయి.

**శుభం భూయాత్***

**** *కొంపెల్ల శ్రీనివాస శర్మ***

ఎక్కువ పొడవుగా

 శ్లోకం:


 నాత్యన్తం సరళైర్భావ్యం గత్వా పశ్య వనస్థలీమ్ ।


ఛిద్యన్తే సరళాస్తత్ర కుబ్జాస్తిష్టన్తి పాదపాః ।।

           

         చాణక్య నీతిశాస్త్రం


పద విభాగం


న అత్యన్తం, సరళైః, భావ్యం, గత్వా, పశ్య, వనస్థలీమ్,

ఛిద్యన్తే, సరళాః, తత్ర, కుబ్జాః, తిష్టన్తి, పాదపాః,


తాత్పర్యం:


ఈ శ్లోకం చాణక్యుడి నీతి శాస్త్రం లోనిది.


మరీ ఎక్కువ పొడవుగా ఎదగడం మంచిది కాదు. అడవి ప్రదేశాలకి వెళ్ళి చూడుము. అక్కడ మరీ ఎక్కువ పొడవుగా పెరిగిన చెట్లని నరికి వేస్తున్నారు. అక్కడ పొట్టిగా మరుగుజ్జుగా పెరిగిన చెట్లన్నీ నిక్షేపంగా అలాగే ఉన్నాయి.


ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు జన బాహుళ్యానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు.


కుళ్ళు కుతంత్రాలతో నిండిన ఈ స్వార్థ పూరిత ప్రపంచంలో, మనిషి మనుగడకై దిశానిర్దేశం చేస్తున్నాడు. మరీ ఎక్కువ ఋజు వర్తనమైన ప్రవర్తనతో ఈ ప్రపంచంలో జీవించడం అనేది సాధ్యమైన పనికాదు. సంఘంలోని స్వార్ధపూరితమైన మనుషులు, దుష్ట శక్తులు అటువంటి వారికి జీవనమే కష్టసాధ్యం చేస్తారు. మనుగడే అసాధ్యమై పోతుంది. అది ఎలాగా అంటే అడవిలో నిట్ట నిటారుగా పెరిగిన చెట్లని నరికి వేసినట్టు గా.

పంచాంగం 16.09.2023 Saturday,

 ఈ రోజు పంచాంగం 16.09.2023 Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: ప్రతిపత్తి తిధి స్థిర వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం శుక్ల యోగ: బవ తదుపరి బాలవ కరణం ఇది ఈరోజు 

పాడ్యమి పగలు 09:16 వరకు.

ఉత్తరఫల్గుని ఉదయం 07:34 వరకు .

సూర్యోదయం : 06:07

సూర్యాస్తమయం : 06:14

వర్జ్యం : సాయంత్రం 04:49 నుండి 06:35 వరకు.

దుర్ముహూర్తం : ఉదయం 06:07 నుండి 07:44 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30  వరకు.


యమగండం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

 ***********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 16.09.2023

శని వారం (స్థిర వాసరే) 

******************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ  సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

___________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

వర్ష ఋతౌ

భాద్రపద మాసే శుక్ల పక్షే ప్రతి పత్తిథౌ (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

స్థిర వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ, 

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 


సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు 

శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

వర్ష ఋతౌ  భాద్రపద మాసే  శుక్ల పక్షే ప్రతిపత్తిథౌపరి ద్వితీయాయాం

స్థిర వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.51

సూ.అ.6.00

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం వర్ష ఋతువు

భాద్రపద మాసం 

శుక్ల పక్షం పాడ్యమి ఉ. 7.50 వరకు. 

శని వారం. 

నక్షత్రం ఉత్తర ఫల్గుణి ఉ. 7.50 వరకు. 


అమృతం రా.తె.2.59 ల 4.43 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 5.51 ల 7.28 వరకు.

యోగం శుక్లం తె.5.06 వరకు. 

కరణం బవ  ఉ. 7.50 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.. 

రాహు కాలం ఉ.9.00 .ల 10.30 వరకు. 

గుళిక కాలం ఉ.6.00 ల 7.30 వరకు. 

యమగండ కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

***********

పుణ్యతిధి భాద్రపద శు.విదియ.

************

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

నవగ్రహా పురాణం🪐* . *27వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *27వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 9*


*"గురువుగారూ ! చంద్రుడి జననం గురించి చక్కగా చెప్పారు. పతివ్రత అయిన శీలవతి జీవితం బాగుపడింది. అనసూయకు సంతానం కలిగింది. ఆ రెండు మార్పులకు మూలం మాండవ్య మహర్షి శాపం ! శూలానికి గుచ్చబడిన ఆ మాండవ్య మహర్షి ఏమయ్యాడో మీరు చెప్పడం మరిచిపోయారు !"* చిదానందుడు గురువు నిర్వికల్పానందతో అన్నాడు.


నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *“మరిచిపోలేదు నాయనా ! మనం శ్రవణం చేస్తున్న నవగ్రహ చరిత్రతో ఆ మహర్షికి అనుబంధం అంతమాత్రమే ! అంచేత చెప్పకుండా దాటవేశాను.”*


*"ఆయన గురించి తెలుసుకోవాలని ఉత్కంఠగా వుంది , గురువుగారూ !”* విమలానందుడు అన్నాడు.


*"సరే. క్లుప్తంగా చెప్తాను. 'శూలప్రోతం' శిక్ష అనుభవిస్తున్న మాండవ్యుడు నిరపరాధి అని తెలుసుకున్న రాజు , ఆయనను శూలం నుండి కిందకు దింపించాడు. అయితే కంఠం దాకా పోయిన ఆ శూలం లాగితే రాలేదు. పదునుగా ఉన్న అగ్రభాగం ఆయన శరీరంలోని కంఠభాగంలో విరిగి , అలాగే వుండిపోయింది. అప్పట్నుంచీ ఆయన ‘ఆణిమాండవ్యుడు’గా ప్రసిద్ధి చెందాడు. మరొక విశేషమేమంటే - ఆ మాండవ్య మహర్షి శాపం వల్లే యమధర్మరాజు ద్వాపరయుగంలో భూలోకంలో 'విదురుడు'గా జన్మించాడు !”* అంటూ ముగించాడు నిర్వికల్పానంద.


*“గురువుగారూ... ఇప్పుడు కుజగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తారా ?”* సదానందుడు అడిగాడు.


*"కుజుడు ఎవరికి జన్మించాడు. గురువు గారూ ?”* శివానందుడు అడిగాడు


నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *"నవగ్రహాల గురించి ఆలకించాలని మీరంతా చాలా ఆత్రుతగా వున్నారు. ఇప్పుడు , ఇక్కడ మన ఆశ్రమంలో జరుగుతున్నట్టే - కుజుడి జననం గురించి చర్చ సత్యలోకంలోనూ జరిగింది. సరస్వతీ బ్రహ్మలు పద్మాసనాల మీద కూర్చుని వున్నారు. బ్రహ్మగారి మానసపుత్రుడూ , విశ్వవార్తాహరుడూ అయిన నారదుడు. చేరుకుని , తన జననీ జనకులకు నమస్కరించాడు..."* అంటూ కథనం ప్రారంభించాడు.


*"కావాలంటే మన నారదుణ్ని అడగండి !”* అంది సరస్వతి చిరునవ్వు నవ్వుతూ. *"ఏమిటి జననీ ?"* నారదుడు కుతూహలాన్ని అణచుకోకుండా అడిగాడు.


*"అది కాదు , నారదా ! మీ జనకుల అంశ అనసూయ కడుపు పంటగా చంద్రుడు జన్మించాడు కదా ! ఈ బ్రహ్మదేవుల కన్నా , ఆ బాలుడే అందంగా ఉన్నాడు అన్నాను. నేను కాదంటున్నారు ప్రాణేశ్వరులు!"* సరస్వతి నవ్వుతూ అంది.


*"పసిగుడ్డుతో మాకు పోలికా !"* బ్రహ్మ నవ్వు దాచుకుంటూ అన్నాడు. *"నువ్వు చెప్పు నారదా... ఈయనగారు అందంగా ఉన్నారా , ఆ బాలుడు అందంగా ఉన్నాడా ?"* సరస్వతి బ్రహ్మను వాలుగా చూస్తూ నారదుణ్ణి అడిగింది.


*“నారాయణ ! అమ్మ ముందు అసత్యం పలకరాదు ! చంద్రుడే అందగాడు !"* అంటూ నారదుడు ఓరకంటితో బ్రహ్మ ముఖాలను పరిశీలించాడు.


బ్రహ్మ చిరునవ్వులు కురిపిస్తున్నాడు. *“ఆ మాత్రం మాకు తెలియదా ఏమిటి ? చంద్రుడు అందచందాలలో అందరినీ తలదన్నే విధంగా ఉండాలని అతని జననానికి పూర్వమే మేము సంకల్పించాం కదా !"*


*"సత్యలోక ప్రభువుల నోట సత్యం పలికించడానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో చూశావా , నారదా !”* సరస్వతి నవ్వుతూ అంది. నారదుడూ , బ్రహ్మ శృతి కలిపారు. *"నారదా ! బాలచంద్రుడు ఎలా ఉన్నాడు ?"* సరస్వతి కుతూహలంగా అడిగింది. *"ఇంకా అనసూయ స్తన్యం త్రాగుతూనే ఉన్నాడా ?”*


*“నారాయణ ! మాతా... మీరు కాలగణనను నిర్లక్ష్యం చేసినట్టున్నారు. మన చంద్రుడిప్పుడు పాలు తాగే పసివాడు కాడు. అరణ్యంలో తిరుగాడుతూ దర్భలూ , సమిధలూ ఏరి తెస్తున్నాడు. తండ్రి అత్రి మహర్షి అధ్యాపకత్వంలో వేద శాస్త్రాలు ఔపోసన పడుతున్నాడు !”* నారదుడు వివరించాడు.


*"అలాగా !"* సరస్వతి ఆశ్చర్యంతో అంది. *"మరి నవగ్రహాలలో మూడవ గ్రహం ఆవిర్భవించాలి కదా !"*


*"ఔను ! ఆ కార్యం పరమేశ్వరుడి ద్వారా జరిగితే బావుంటుంది...”* బ్రహ్మ సాలోచనగా అన్నాడు. 


*"పరమేశ్వరుడా... !"* ఆశ్చర్యపోయింది సరస్వతి.


*"శ్రీమహావిష్ణువు నుండి మొదటి గ్రహదేవత సూర్యుడు అవతరించాడు. మా అంశతో రెండవ గ్రహదేవత చంద్రుడు ఉదయించాడు. త్రిమూర్తులలో ఇక మిగిలింది. శివుడే ! ఆయన మూలంగా మూడవ గ్రహం ఆవిర్భవిస్తే...”*


*“నారాయణ !"* నారదుడు ఉత్సాహంగా అడ్డు తగిలాడు. *"జనకా ! అయితే , వెళ్ళి కైలాసవాసుణ్ని హెచ్చరించమని ఆజ్ఞా !"*


*"మా జనకుల సంకల్పమూ , మా సంకల్పమూ అదే , పుత్రా !"* బ్రహ్మ అన్నాడు. నారదుడు ఆలస్యం చేయకుండా నిష్క్రమించాడు.


🐏🐏 *రేపటి నుండి కుజగ్రహ జననం ప్రారంభం*


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐