16, సెప్టెంబర్ 2023, శనివారం

విఘ్నేశ్వరునికి అవతారాలు

 విఘ్నేశ్వరునికి కూడా ఆ విష్ణుమూర్తి లాగానే కొన్ని అవతారాలు ఉన్నాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ అవతారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం


1.ఏకదంతుడు (Ekadantha)


మదాసురు డనే రాక్షసుడిని చ్యవనుడనే రుషి సృష్టించడం జరిగింది. రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడు హ్రీం అనే మంత్రాన్ని పఠించడం వలన అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని వద్దకు వెళ్ళి ఉపాయం అడుగుతారు. అప్పుడు ఆయన విఘ్నేశ్వరుని ప్రార్థించమని చెబుతారు. అప్పుడు దేవతలందరు విఘ్నేశ్వరుని ప్రార్దిస్తారు. అప్పుడు వారి ప్రార్ధనకి అలకించిన ఏకదంతునిగా అవతరించి మదాసురుడిని జయిస్తాడు.


2.గజాననుడు (Gajanana)


కుబేరుని యొక్క ఆశ నుండి లోభాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఆ లోభాసురుడు శివపంచాక్షరితో పారాయణం చేసి ఆ శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే కలిగే వరాన్ని అందుకుంటాడు. అప్పుడు అతని చేష్టలకి అంతులేకుండా పోయింది. లోభాసురుడు శివుని యొక్క కైలాసాన్ని కూడా తన స్వాధీనంలో చేసుకోవాలి చూస్తారు.  అప్పుడు దేవతలు అందరు రైభ్యుడనే రుషి ని శరణు కోరుతారు. అప్పుడు ఆయన విఘ్నేశ్వరుని శరణు కోరమని చెబుతారు. అలా సకల దేవతల ప్రార్థనలకు విఘ్నేశ్వరుడు 'గజాననుడి'గా అవతరించి లోభాసురుని ఓడిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. గజాననుడు అంటే ఏనుగు యొక్క ముఖం కలిగిన వాడు అని అర్థం.


3.వక్రతుండుడు (Vakratunda)


పూర్వం ఇంద్రుడు చేసిన తప్పు వలన మాత్సర్య సురుడు పుడతాడు. అతని రాక్షసత్వానికి ముల్లోకాలు అల్లాడిపోయిన దేవతలంతా దత్తాత్రేయుని శరణు కోరుతారు. అప్పుడు ఆయన విఘ్నేశ్వరుని ప్రార్థించమని చెప్పారు వారి ప్రార్ధనకు విఘ్నేశ్వరుడు వక్రతుండునిగా అవతరించాడు. అప్పుడు లోభాసురుడిని ఓడిస్తాడు. విఘ్నేశ్వరుడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా మరియు మాత్సర్య సురుడు మనస్సులోని ఈర్ష్య ప్రతీకగా చెప్పుకోవచ్చు.


4.మహోదరుడు (Mahodarudu)


పరమ శివుడు తపస్సు లో మునిగిపొతాడు. అప్పుడు పార్వతి దేవి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారుతుంది. ఆయన తపస్సుకు భంగం కలిగేలా చేస్తుంది. అప్పుడు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగింది అన్న అయోమయంలో మహిషాసురుడు అనే రాక్షసుడులా జన్మిస్తాడు. అతడు ముల్లోకాధిపత్యాన్ని సాదిస్తాడు. దీంతో తన ఆగడాలను అపదానికి వినాయకుడు మహోదరుడిగా అవతరించి విఘ్నేస్వరుడు తనను అంతమొందిస్తాడు..

శంబరుడు అనే రాక్షసుని సహయంతో మమతాసురుడు ముల్లోకాలను


5. విఘ్న రాజు (Vigna Raju) 


 పీడిస్తుంటాడు. అప్పుడు దేవతలందరు పరమేశ్వరుని ప్రార్థిస్తారు. అప్పుడు నాగుపాముని వాహనం చేసుకుని విఘ్నరాజు అవతారంలో వచ్చి మమతాసురుడిని మట్టుబెట్టినట్టు మన పురాణాలు చెబుతున్నాయి.


6. వికటుడు (Vikatudu)


పూర్వం కామాసురుడనే రాక్షసుడు తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతాడు.

కామాసురుడనే రాక్షసుడు అప్పటి నుంచి ముల్లోకాలకు తన ఆధిపత్యం సాగిస్తున్నాడు. అప్పుడు ఆ రాక్షసుడి బారి నుండి కాపాడుకునేందుకు దేవతలందరు వెళ్లి విఘ్నేశ్వరుని వేడుకొనగా అప్పుడు ఆయన వికటుడు అవతారంగా ప్రత్యక్షమై ఆ కామాసురుడనే రాక్షసుడుని అంతమొందిస్తాడు.


7. దూమ్రావర్ణుడు (Dumravarnudu)


అహంకరాసురుడిని రాక్షసుడి

పాలనతో విసుగు చెందిన దేవతలు అందరు ఆ రాక్షసుడి పాలన నుంచి రక్షించమని విఘ్నేశ్వరుని వేడుకొనగా అప్పుడు ఆయన దూమ్రవర్ణుడు

అవతారంలో వచ్చిఅహంకరాసురుడిని చంపినట్లు పురాణాలు చెబుతున్నాయి.


8. లంబోదరుడు (Lambodhara)


లంబోదరుడు అవతారం దేవతల అందరి కోసం క్రోదాసురుడు అనే రాక్షసుడిని మట్టుబెట్టడానికి అవతరించాడు. క్రోదం ఎల్లప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో విజయం సాధిస్తే సంతోషం.. ఓడితే ఉద్వేగాలు కలుగుతూ ఉంటాయి అని మన పురాణాలు చెబుతున్నాయి.


సేకరణ

కామెంట్‌లు లేవు: