16, సెప్టెంబర్ 2023, శనివారం

సంస్కృత భారతీ* *3*

 *సంస్కృత భారతీ*

              *3*

    *తృతీయ పాఠః*

*మానుష సంబంధాః*

పితా= తండ్రి, మాతా= తల్లి, భ్రాతః/సహోదరః = అన్న/తమ్ముడు,

సహోదరీ = అక్క/చెల్లెలు, అగ్రజః = అన్న, అగ్రజా / భగినీ = అక్క, అనుజః = తమ్ముడు, అనుజా = చెల్లెలు,

 భావుకః/ ఆవుత్తః = బావ, ప్రజావతీ = వదిన, 

దేవరః = మరిది(వదినకు), శ్యాలకః = భావమరిది( (బావకు), మాతులః = మేనమామ, మాతులీ/మాతులానీ = మేనత్త (మేనమామ భార్య),మాతులేయః = మేనమామ కొడుకు, పితృవ్యః = పినతండ్రి (బాబయ్య), పితృవ్యా = పిన్ని(బాబయ్య భార్య), మాతృష్వసా =పిన్నమ్మ/ పిన్ని( తల్లి యొక్క చెల్లెలు), పితృష్వసా = మేనత్త (తండ్రి యొక్క చెల్లెలు), శ్వశురః = మామగారు, శ్వశ్రూ = అత్తగారు, భాగినేయః = మేనల్లుడు,

భాగినేయా = మేనకోడలు,

 భ్రాతృజః = అన్న లేదా తమ్ముని కొడుకు, భ్రాతృజా = అన్న(తమ్ముని) కూతురు. 

పితామహః = తండ్రి యొక్క తండ్రి, పితామహీ = తండ్రి యొక్క తల్లి, మాతామహః = తల్లి యొక్క తండ్రి, మాతామహీ = తల్లి యొక్క తల్లి, ఇదేవిధంగా ప్రపితామహః,ప్రపితామహీ అనగా పితామహుని తల్లిదండ్రులు. మాతుః పితామహః,మాతుః పితామహీ అంటే మాతామహుని తల్లిదండ్రులు మాతుః ప్రపితామహః అంటే తల్లి యొక్క పితామహుని తండ్రి, మాతుః ప్రపితామహీ అంటే తల్లి యొక్క పితామహుని తల్లి., పౌత్రః = మనుమడు, ప్రపౌత్రః = మునిమనుమడు,.నప్త్రః = మునిమనుమడి కొడుకు, వీరి స్త్రీ రూపాలు(మనుమరాలు, మునిమనుమరాలు, మునిమనుమడి కూతురు)పౌత్రీ,ప్రపౌత్రీ, నప్త్రీ

సఖా = మిత్రము(పుల్లింగము), 

( *కానీ వ్యావహారికముగా తెలుగు లో స్నేహితుని మిత్రుడు అని సంబోధిస్తున్నారు,కానీ మిత్రుడు అంటే సూర్యుడు అని అర్థం, ఎందుకంటే సంస్కృతమున మిత్రః అంటే సూర్యుడు అని అర్థం*) కానీ సమాసమేర్పడినప్పుడు విసర్గాంతమవుతుంది. ఉదాహరణకు రామసఖః, కృష్ణసఖః...ఇలా.

 సఖీ = మిత్రురాలు. 

*సాధారణగమనిక*:-- సంస్కృత పుం లింగ శబ్దాలు సాధారణంగా విసర్గాంతాలుగా ఉంటాయి, వాటిని తెలుగు లోనికి పుంలింగ శబ్దాలు గా మార్చి తే చివర "డు" చేరుతుంది, ఉదాహరణకు రామః అనేది రాముడు, శంభుః అనేది శంభుడు,మిత్రః అనే ది మిత్రుడు......ఇలా మారతాయి., సంస్కృత స్త్రీలింగ శబ్దాలు దీర్ఘాంతాలుగా ఉంటాయి, ఉదాహరణకు సీతా, గౌరీ,రాణీ... సంస్కృత నపుంసక లింగశబ్దాలు సాధారణంగా పూర్ణాంతాలుగా ఉంటాయి. అంతే కాకుండా సంస్కృతంలో ఏ లింగ శబ్దమైననూ తెలుగు లో పుంలింగశబ్దమైతే "డు" అంతం గానూ, నపుంసక తెలుగు పదం గా మారితే "ము" అంతం గానూ మారతాయి.

**శుభం భూయాత్***

**** *కొంపెల్ల శ్రీనివాస శర్మ***

కామెంట్‌లు లేవు: