28, సెప్టెంబర్ 2021, మంగళవారం

Future Telugu Movies

 *Future Telugu Movies names inspired by IT & Software::*


1. Intlo bava, 

    Office lo java

2. "C" veerudu 

    "C++" sundari

3. Nee password naku telusu

4. Program raddam raa....!

5. Intlo virus, 

    Vantintlo antivirus

6. C drive lo illalu, 

    Pen drive lo priyuralu

7. Floppy days!

8. Kotha Software lokam!

9. Jhummandi virus!

10. Circuitaa majakaa

11. Microsoft Vakitlo 

      Windows chettu!

12.Campus Placements

      Ki Daredi

13. Chip Jaari 

      Gallanthayyindhe...!

14. Attaku Android, pellaniki Windows...!

15. Eenati program, enatido..!

16. Coding Kannayya...

17. Program paparayudu..

18. Hacking jarigina raathri

19. Neram naadi kaadu program di..

20. Firewall veerudu, Hacking sundari


😂😂😂


1, 5, 7, 17, 19,20 Super Titles but super duper hit will is number 6 😂🤣


😃😃😃

శ్రీమద్భాగవతము

 *28.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2275(౨౨౭౫)*


*10.1-1397-వ.*

*10.1-1398*


*చ. "అనఘ! యయాతి శాపమున యాదవ వీరులకున్ నరేశ్వరా*

*సనమున నుండరాదు; నృపసత్తమ! రాజవు గమ్ము భూమికిన్;*

*నినుఁ గొలువంగ నిర్జరులు నీ కరిఁబెట్టుదు రన్య రాజులం*

*బనిగొను టెంత; రమ్ము జనపాలనశీలివి గమ్ము వేడ్కతోన్."* 🌺



*_భావము: మాయా రూపి యగు శ్రీకృష్ణుని నమ్మోహన వాక్యములకు మోహితులై, దేవకీవసుదేవులు బలరామ కృష్ణులను తమ ఒళ్ళో కూర్చోబెట్టుకుని, మనసారా ఆలింగనము చేసికొని, తమ కన్నీటితో వారిని తడిపి, వల్లమాలిన ప్రేమతో మాటలు రాక మైమరచిపోయారు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు తాతగారైన ఉగ్రసేనుని చూచి, "తాతగారు! యయాతి యొక్కశాప ఫలితముగా యాదవులకు సింహాసనార్హత లేదు. కావున ఓ రాజశ్రేష్టుడా! నీవు ఈ రాజ్యమునకు రాజువు. నిన్ను సేవించటానికి దేవతలే నీ వద్దకు వచ్చి కప్పము కడతారు. ఇక ఇతర రాజులను నియంత్రించటమెంత పని? జనరంజకంగా రాజ్యపాలన చెయ్యి."_* 🙏



*_Meaning: Devaki and Vasudeva were mesmerised by the kind and soothing words of Sri Krishna, hugged and took them into their lap. As tears rolled down their eyes, with overwhelming joy and affection towards their sons, they could not utter a single word._* 

*_Thereafter Sri krishna pleasingly glanced at Ugrasena, Sri Krishna's maternal grandfather (Father of kamsa), and told him: "Dear grandfather, Yadavas are barred from holding the position of king due to the curse of Yayathi. Even celestial beings would serve you by paying their share of taxes to you, there wouldnt be any difficulty in controlling these earthly powers. You are the best of kings, continue to rule over this Magadha kingdom and provide peace and happiness to these subjects."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

మనసును మార్చే యంత్రం

 మాటలే కదా ధైర్యం 

మనసును మార్చే యంత్రం 


ఒకరోజు చిన్న పిల్లవాడు బడి నుండి పరిగెత్తుకుంటూ అమ్మదగ్గరకు వచ్చాడు 

అమ్మా ఇదిగో ఈ లెటర్ టీచర్ నీకు ఇమ్మన్నారు అని చెప్పాడు 

ఆవిడ ఆ లెటర్ చదివింది మరుక్షణం గట్టిగా చదివింది బాబుకు వినబడేలా 


మేడం మీ బాబు చాలా తెలివైనవాడు 

అందరికంటే ఎక్కువ తెలివైనవాడవడంతో మా స్కూల్కు అంతటి అర్హత లేదు 

మీరే మీ బాబును దగ్గరుండి పెద్ద పెద్ద పుస్తకాలు తెప్పించి చదివించండి అని ముగించింది 


ఆ మాటలు బాబు గట్టిగా నమ్మాడు 

అమ్మ నేర్పిన చదువు నేర్చుకున్నాడు 

గ్రంధాలయాల్లోని పుస్తకాలన్నీ చదివేశాడు 

ప్రపంచమే అతడిని తిరిగి చూసేలా అయ్యాడు 


ఆ పిల్లాడు ఎవరో కాదు బల్బ్ నూ కనిపెట్టిన థామస్ ఆళ్వా ఎడిసన్ 

అనుకున్నది సాధించాడు అమ్మ పక్కనే ఉంది 


ఒకరోజు అమ్మ శాశ్వత సెలవు తీసుకుంది 

అమ్మ గదిలో వెళ్ళి కూర్చున్నాడు అక్కడ అతనికి ఒక లెటర్ కనిపించింది 

అది అతని చిన్నప్పుడు లెటర్ 

అందులో గురువు చెప్పిన విషయం ఆశ్చర్యమేసింది 


మీ బాబుకు సరైన మానసిక ఎదుగుదల లేదు 

మీ బాబు ఇక్కడ ఉంటె మిగతా పిల్లలు చెడిపోతారు 

ఇక నుండి బాబును బడికి పంపకండి అని 


అమ్మ దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా చదివి చెప్పింది 

అమ్మ మాటలో ఎంత నమ్మకం పెంచుకున్నాడు


మనం ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి అనేందుకు ఉదాహరణ ఈ విషయం 

Positive mind never fails 

negative mind never lets అనిపిస్తుంది ఎడిసన్ గురించి తెలుసుకున్నాక .....

అంతా భ్రమ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

    *🌷అంతా మన భ్రమ!🌷* 

               🌷🌷🌷

💁🏻‍♂️ *కర్మ_కర్మణా_నశ్యతి*🙏


గంగా హారతి రోజున *గంగ* లో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక *ఋషి* కి ఒక సందేహం వచ్చింది!

*వెంటనే గంగానదినే అడిగాడట!*


*"అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు? తల్లీ!* అని. 


అందుకా తల్లి *"నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను"* 

అని బదులిచ్చిందట. 


*అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపా లన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో?*

అనుకొని!


సముద్రాన్నే అడిగాడు!

*ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?!* అని!


దానికా సముద్రుడు 


*నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను'* 

అని బదులిచ్చాడట. 


అరే!!! *ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది!* 

అని అనుకుంటూ! 

*ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని!*  

అని అడగగా!!!


అవి పకపకా నవ్వి!  

*'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'!*

అని బదులివ్వగా...


ఓహో!!! 

*ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!*


అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! *కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!!* గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!

                 

*ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః*

*ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే*


*పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.*


*ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును! అని... తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!*


*ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!?*

అని ఈ శ్లోకం అర్థం.


*కర్మ కర్మణా నశ్యతి కర్మ!*

అంటే *కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది*

🙏

శ్రీరమణీయం* *-(225

 _*శ్రీరమణీయం* *-(225)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"ఆధ్యాత్మిక సాధన అంటే అంతా అంతర్ ప్రయాణమేనా ?"*_


_*అవును. మనిషికున్న ప్రత్యేకత ఏమిటంటే మనసు ద్వారా బాహ్య ప్రపంచంతోపాటు అంతర్ముఖం కాగలగటం. అంటే వివేకంతో నిరంతరం విశ్లేషణ ద్వారా ఈ జగత్తుకి, తనకీ మూలంగా ఉన్న ఒక సత్యపదార్ధం ఉందని మనిషి గ్రహించగలడు. దాన్నే అంతర్దర్శనమని, ఆత్మదర్శనమని అంటారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి అనుగ్రహించిన దివ్య విశ్వరూప సందర్శనం అంతా అంతర్ ప్రయాణమే తప్ప బాహ్య ప్రయాణం కాదు. అందువల్లనే వేరెవరికి విశ్వరూప సందర్శనం కాలేదు. సత్యవస్తువు ఈశ్వరుడిగా ఉంటే అందుండి వెలువడిన చైతన్యం మన దేహంగా, మనసుగా, ప్రకృతి యావత్తుగా మారింది. చైతన్యంలోని ఒక కిరణం మన మనసు. దాన్ని మనం ప్రస్తుతం ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవించటం కోసం ఉపయోగిస్తున్నాం. సృష్టిలోని సకల ప్రాణులు ఇదే చేస్తున్నాయి. మరి మనిషికున్న ప్రత్యేకతే అంతర్ముఖం కావటం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'అంతర్దర్శనమే దివ్య చక్షువు !'*- 


🕉🌞🌎🌙🌟🚩

ఆచార్య సద్భావన*

 *ఆచార్య సద్భావన*


మన హృదయంలో నిజమైన ప్రేమ ఉంటే మనమెప్పుడూ విషాదాన్ని చెందము. 

భగవంతునికి సన్నిహితంగా ఉండగలిగేవారు సంతోషంగా కాక మరెలా ఉండగలరు.


అచంచల భక్తి, విశ్వాసాలను నిలుపుకోకపోతే మన అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని దూరం చేసుకుంటాం. 

మనలో ప్రశ్నలు, సందేహాలు ఉండకూడదు.


ప్రేమ, విశ్వాసాలతో సాగుతూ ఎటువంటి ఎదురు ప్రశ్నలు లేకుండా ఉండగలిగితే మహోన్నత శాంతి లభిస్తుంది. 

ఆ శాంతికి ఎటువంటి గాయాలనైనా మాన్పగల అద్భుత శక్తి ఉంది.


అది ఉల్లాస పరుస్తుంది, ఉత్తేజాన్నిస్తుంది. 

అంతేకాదు మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.


*శుభంభూయాత్*

============================

గోత్రం అంటే ఏమిటి?*

 *గోత్రం అంటే ఏమిటి?* 

సైన్సు ప్రకారము 

మన పూర్వీకులు

గోత్ర విధానాన్ని ఎలా 

ఏర్పాటు చేశారో గమనించండి.


మీరు పూజలో కూర్చున్న 

ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? 

మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు??


గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 

*జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం 

పొందిన అధునాతన శాస్త్రమే!


గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?


మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 


వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? 


కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?


వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? 

తర్కం ఏమిటి?


ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.  

మన గోత్ర వ్యవస్థ వెనుక 

జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!


గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది.  

మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం


గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం.


జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి, 

వీటిల్లో సెక్స్ క్రోమోజోములు

 (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. 

ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని ( gender) నిర్ణయిస్తుంది.


గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అబ్బాయి అవుతాడు.


XY లో - X తల్లి నుండి 

మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.


ఈ Y ప్రత్యేకమైనది మరియు 

అది X లో కలవదు. 

కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. 

ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు ... అలా..).


మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. 


ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి...

గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా ఉండకూడదు 

ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.....


ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది..... కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.


ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.


కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన 

లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు...


మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇది

మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు..


మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు.


అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి ...... ప్రవర తో సహా చెప్పండి.

ధన్యవాదాలు.. 💐💐🙏🙏

సంస్కృత మహాభాగవతం

 *28.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - తొమ్మిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - కురురపక్షి (లకుముకిపిట్ట) మొదలుకొని 'భృంగి' అను కీటకము వరకు గల ఏడుగురు గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*బ్రాహ్మణ ఉవాచ*


*9.1 (ప్రథమ శ్లోకము)*


*పరిగ్రహో హి దుఃఖాయ యద్యత్ప్రియతమం నృణామ్|*


*అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్యస్త్వకించనః॥12544॥*


*అవధూతయగు దత్తాత్రేయుడు వచింపసాగెను* యదుమహారాజా! సహజముగా మానవులు తమకుఇష్టమైన వస్తువులు సమకూర్చుకొనుటకు ఆరాటపడుచుందురు. కాని అది వారికి దుఃఖహేతువే యగును. అకించనుడైన (దేనినీ సంగ్రహించెడి స్వభావములేని) విద్వాంసుడు అనంతసుఖమును పొందును. శ్రేయస్సును కోరుకొనువాడు దేనినీ 

పరిగ్రహింపరాదు.


*9.2 (రెండవ శ్లోకము)*


*సామిషం కురరం జఘ్నుర్బలినో యే నిరామిషాః|*


*తదామిషం పరిత్యజ్య స సుఖం సమవిందత॥12545॥*


(ఈ విషయమున ఒక కురరపక్షిని దృష్టాంతముగా తెలుపుచున్నాడు). ఒకానొక కురరపక్షికి ఒక మాంసపుముక్క లభించెను. అప్పుడు ఆ మాంసమును ఆశించునట్టి బలమైన పక్షులు కొన్ని ఆ మాంసము ముక్కకొరకు ఆ కురరపక్షిపై విఱుచుకొనిపడి హింసింపసాగినవి. అంతట ఆ పక్షి తన నోటిలోని మాంసపుముక్కను వదలివేసి, తనను తాను రక్షించుకొని హాయిగా నుండెను. కనుక 'వస్తుసంగ్రహము ఆపదలకు మూలము' అని ఎరుంగవలయును.


*9.3 (మూడవ శ్లోకము)*


*న మే మానావమానౌ స్తో న చింతా గేహపుత్రిణామ్|*


*ఆత్మక్రీడ ఆత్మరతిర్విచరామీహ బాలవత్॥12546॥*


*9.4 (నాలుగవ శ్లోకము)*


*ద్వావేవ చింతయా ముక్తౌ పరమానంద ఆప్లుతౌ|*


*యో విముగ్ధో జడో బాలో యో గుణేభ్యః పరం గతః॥12547॥*


పసిబాలుడు ఏమాత్రమూ చింతలేకుండా తనలోతాను ఆనందించుచుండును. అట్లే నేనును ఆత్మానందమును అనుభవించుచుందును. నాకు మానావమానములు జోలియే పట్టదు ( ఆ రెండింటియందును సమచిత్తుడనై యుందును). నాకు సాంసారికములైన చింతలు ఏవియును లేవు. ఎట్టి మాయామర్మములెరుగని బాలురు, లేక గుణాతీతులు (సత్త్వరజస్తమో గుణములకు అతీతులు) ఐనవారు మాత్రమే చింతారహితులై హాయిగా నుందురు. ఆ రెండు కోవలకు చెందినవారు మాత్రమే పరమానందమును పొందుదురు.


*9.5 (ఐదవ శ్లోకము)*


*క్వచిత్కుమారీ త్వాత్మానం వృణానాన్ గృహమాగతాన్|*


*స్వయం తానర్హయామాస క్వాపి యాతేషు బంధుషు॥12548॥*


*9.6 (ఆరవ శ్లోకము)*


*తేషామభ్యవహారార్థం శాలీన్ రహసి పార్థివ|*


*అవఘ్నంత్యాః ప్రకోష్ఠస్థాశ్చక్రుః శంఖాః స్వనం మహత్॥12549॥*


*9.7 (ఏడవ శ్లోకము)*


*సా తజ్జుగుప్సితం మత్వా మహతీ వృడితా తతః|*


*బభంజైకైకశః శంఖాన్ ద్వౌ ద్వౌ పాణ్యోరశేషయత్॥12550॥*


*9.8 (ఎనిమిదవ శ్లోకము)*


*ఉభయోరప్యభూద్ఘోషో హ్యవఘ్నంత్యాః స్మ శంఖయోః|*


*తత్రాప్యేకం నిరభిదదేకస్మాన్నాభవద్ధ్వనిః॥12551॥*


ఒకానొకప్పుడు ఒక కన్యను వరించుటకై కొంతమంది ఆ కన్య ఇంటికి వచ్చిరి. అప్పుడు ఆ ఇంటిలోని పెద్దలు (తల్లిదండ్రులు మొదలగువారు) బయటికి వెళ్ళియుండిరి. అందువలన ఆమెయే వారికి అతిథి సత్కారములను చేసెను. రాజా! ఆ వచ్చిన అతిథులకు ఆహారమును సిద్ధపరచుటకై ఆమె ఇంటిలోపల ధాన్యమును ఒంటరిగా దంపసాగెను. అప్పుడు ఆ చేతికి గల గాజులు పెద్దగా ధ్వని చేయసాగెను. అంతట బుద్ధిశాలియైన ఆ కన్య స్వయముగా ధాన్యమును దంచుట అవమానముగా భావించి మిగుల సిగ్గుపడెను. అందువలన ఆమె తన చేతులకుగల గాజులను ఒక్కొక్కటిగా పగులగొట్టెను. అంతట ఒక్కొక్క చేతియందు రెండేసి గాజులు మాత్రమే మిగిలియుండెను. పిమ్మట ఆమె ఆ ధాన్యమును దంచుటకు మొదలిడగా ఆ రెండుగాజులును ధ్వనింపసాగెను. అంతట ఆ కన్య చేతులయందలి ఒక్కొక్క గాజును పగులగొట్టెను. అప్పుడు ఒక్కొక్క చేతికి ఒక్కొక్క గాజు మాత్రమే మిగిలియుండెను. పిమ్మట ఆమె ధాన్యమును దంచినను ఎట్టి శబ్దమూ రాకుండెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*421వ నామ మంత్రము* 28.9.2021


*ఓం వ్యాహృత్యై నమః*


వ్యాహృతిమంత్ర (భూర్భువస్సువః) స్వరూపురాలు అయిన పరమేశ్వరికి నమస్కారము.


ఉచ్చారణ స్వరూపురాలయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వ్యాహృతిః* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం వ్యాహృత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకులు తమ సాధనయందు పరిపూర్ణత సాధించి ఆ పరమేశ్వరియొక్క కృపాకటాక్షవీక్షణములచే ఆయురారోగ్యములు, సిరిసంపదలు, జ్ఞానసంపదలతోబాటు కైవల్యసాధనకు కావలసిన దీక్షాపటుత్వమును పొందగలరు.


వ్యాహృతి అంటే సామాన్యార్థం ఉచ్చారణం. వ్యాహృతి యనగా ఒకానొక మంత్ర విశేషరూపము. సప్తవ్యాహృతులు అని ఏడు వ్యాహృతులు గలవు. అవి:- 1. భూః, 2. భువః, 3. సువః, 4. మహః, 5. జనః, 6. తపః, 7. సత్యమ్. ఈ యేడు వ్యాహృతులు బ్రాహ్మణులు ప్రాణాయామముతో పఠించదగినవి. 


భూః, భువః, స్వః అనే మూడు శబ్దాలు వ్యాహృతి త్రయం. హోమాదులలో పూర్ణాహుతికి ముందు ఈ మూడు శబ్దాలతో హవిస్సులను వ్రేల్చడం విధాయకం. భూర్భువస్సువర్లోక పాలకులు అగ్ని, వాయు, సూర్యులు. ఈ ముగ్గురే వసు, రుద్ర, ఆదిత్య రూపులు. శ్రాద్ధకర్మలలో ఈ ముగ్గురు పితరులని శాస్త్రము చెప్పుచున్నది. 


సంధ్యావందనంలో సప్తవ్యాహృతులను పలకవలసి ఉంటుంది. అవి : భూః, భువః, స్వః/సువః, మహః, జనః, తపః, సత్యం.


గాయత్రీ మంత్రంలోని మూడు వ్యాహృతులు భూః, భువః, సువః ఈ వ్యాహృతులకే త్రికము అని పేరు. ఈ మూడు బ్రహ్మ యొక్క జ్ఞానదేహము నుండి వ్యవహరింపబడుటచే *వ్యాహృతులు* అని అన్నారు. సృష్టి స్థితి లయాల శక్తుల పేర్లే ఈ మూడు వ్యాహృతులు. *భూః* అనగా బ్రహ్మ, *భువః* అనగా ప్రకృతి; *సువః* అనగా జీవుడు. మూడు లోకాలు ఈ వ్యాహృతులకు సంకేతం. అగ్ని, వాయువు, సూర్యులకు ఈ వ్యాహృతులు ప్రతినిధులు. అంతేకాదు. *భూః* అనగా భూమి, *భువః* అనగా ఆకాశం, *సువః* అనగా స్వర్గంగా చెప్పబడ్దాయి. *ఈ వ్యాహృతులను జపిస్తే వేదాలను చదివిన ఫలం కలుగుతుంది అని చెబుతారు* అందువల్లనే గాయత్రీ మంత్రానికి చేర్చబడ్డాయి. అంటే గాయత్రీ సారం వ్యాహృతి త్రయం.


మూడు వ్యాహృతులే కాదు, సప్త వ్యాహృతుల ఉద్భవానికి గాయత్రి మూలం. పరమాత్మను చేరటానికి ఈ ఏడు వ్యాహృతులు ఏడు సోపానాలు. మంత్ర జపానుష్టాన సమయంలో, సప్త వ్యాహృతుల స్పందన దేహంలోని షట్చక్రాలపై కలుగుతుంది. సర్వ వ్యాపకాలైన సప్త వ్యాహృతులు, సర్వ కర్మలందు ప్రాణాయామంగా ఉపయోగించ బడతాయి. ఈ క్రింది పట్టిక సప్త వ్యాహృతుల విశిష్టత, శక్తి తెలుపుతుంది.


 

1. *భూః* అగ్ని - భూలోకం - మూలాధారం - గాయత్రి ఛందస్సు - భౌతిక వికాసం.


2. *భువః* వాయువు - భువర్లోకం - స్వాధిష్టానచక్రం - ఉష్ణిక్ ఛందస్సు - ప్రాణాయామం.


3. *సువః* సూర్యుడు - స్వర్గలోకం - మణిపూర చక్రం - అనుష్టుప్ ఛందస్సు - చిత్తవికాసం.


4. *మహః* బృహస్పతి - అనాహతచక్రం - బృహతి ఛందస్సు - బుద్ది వికాసం.


5. *జనః* వరుణుడు - జనలోకం - విశుద్ఢచక్రం - పంక్తి ఛందస్సు - మానసిక వికాసం. 


6. *తపః* - ఇంద్రుడు - తపోలోకం - ఆజ్ఞాచక్రం - త్రిష్టుప్ ఛందస్సు - ఆధ్యాత్మిక వికాసం.


7. *సత్యము* విశ్వదేవతలు - సత్యలోకం - సహస్రారచక్రం జగతి ఛందస్సు - పరమపదం


ఇక లోకాల వివరణ చెప్పాల్సి వస్తే

1. *భూలోకం*- పుణ్యపురుషులకు, మనుష్యులకు నివాస స్థానం. సుమేరువు ధ్యానస్థలం. సుమేరువు నందలి ఉద్యానవనాలు, మిశ్రవనం,నందనం, చైత్రరథం, సుధర్మ దేవసభ. సుదర్శనం పట్టణం. వైజయంతం రాజసౌధం.


2. *భువర్లోకం* - గ్రహాలు, నక్షత్రాలు, నిర్ణీత కక్షలో సుమేరువుపై తిరుగుతూ ఉంటాయి.


3. *స్వర్గలోకం* - ఈ లోకం ప్రజాపతికి చెందినది. సంకల్ప సిద్ధులైన దేవతల నివాసం. ఈ లోకం అప్సరసలకు కూడా నివాసస్థానమే


4. *మహర్లోకం*- ఈ లోకంలోని దేవతలు సర్వసమర్థులు, వెయ్యికల్పాలు ఆయుష్షుగా కలవారు.


5. *జనోలోకం* ఇది బ్రహ్మలోకం. ఇక్కడ నివశించువారు భూతేంద్రియాలను వశం చేయగల సమర్థులు.


6. *తపోలోకం* - అధికమైన ఆయుషు గల జ్ఞానులు ఈ లోకవాసులు.


7. *సత్యలోకం* - ఈ లోకవాసులు అనికేతులు. ఆత్మయే ఆశ్రమంగా కలవారు. ప్రకృతిని వశం చేసుకొని,సృష్టి ఉండేంతవరకు జీవించి ఉంటారు.


ఈ మూడు వ్యాహృతుల ముందు మూడు ప్రణవములు, చివర ప్రణవం, మంత్రానికి ముందు, చివర ప్రణవములు- మొత్తం ఆరు. ఈ గాయత్రీ మంత్రం షడోంకార గాయత్రి. ఈ మంత్రోపాసన చేసినచో సమస్త వాజ్ఞ్మయము తెలియును.. కానీ, ఈ ఉపాసన బ్రహ్మచారులు, గృహస్థులు చేయకూడదు.


*గాయత్రీ మహా విజ్ఞానం*


*ఓం* పరమాత్మ స్వరూపం

*భువః*- కర్మయోగం

*భూః* - ఆత్మజ్ఞానం

*తత్* - జీవన విజ్ఞానం

*సువః*-స్థిర యోగం

*వరేణ్యం*- శ్రేష్ఠమైన

*సవితం*- శక్తి సంపుటి

*దేవస్య* - దివ్య దృష్టి

*భర్గో* -నిర్మలమైన

*ధియో* - వివేకం

*ధీమహి* -సద్గుణాలు

*ప్రచోదయాత్*- సేవ

*యోనః* -సంయమనం


గాయత్రీ మంత్రంలోని తొమ్మిది పదాలు నవరత్నాలు. పదునెనిమిది విద్యలలో మీమాంస శ్రేష్ఠమైనది. మీమాంస కంటే తర్కశాస్త్రం కంటే పురాణాలు, పురాణాల కంటే ధర్మశాస్త్రం గొప్పది. వేదాలు ధర్మశాస్త్రం కంటే గొప్పవైతే, ఉపనిషత్తులు వేదాలు కన్నా ఉత్తమమైనవి. గాయత్రీ మంత్రం,ఉపనిషత్తుల కంటే అత్యంత శ్రేష్ఠమైనది. 


*న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌* అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము *గయ*, *త్రాయతి* అను పదములతో కూడుకొని ఉంది. *గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ* అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. *త్రాయతే* అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి ఇరువది నాలుగు అక్షరములతో ఇరువది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణమును వ్రాసెను.


*వ్యాహృతి* అను శబ్దమునకు ఇంత వివరణ ఈయవలెనని అనిపించినది. పరమేశ్వరి ఉచ్చారణ స్వరూపురాలు, ఒకానొక మంత్రస్వరూపురాలు మరియు వ్యాహృతి మంత్రస్వరూపురాలు గనుక ఆ తల్లి *వ్యాహృతిః* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వ్యాహృత్యై నమః* అని యనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*422వ నామ మంత్రము* 28.9.2021


*ఓం సంధ్యాయై నమః*


సంధ్యోకాలోపాస్య దేవతా స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


బ్రహ్మ మానస పుత్రికయైన సంధ్యాదేవి స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.


ఇడా, పింగళ, సుషుమ్నా నాడీత్రయ స్వరూపురాలైన లలితాంబకు నమస్కారము.


ఒక సంవత్సరం వయసుగల బాలికాస్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సంధ్యా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం సంధ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, శాంతిసౌఖ్యములు సంప్రాప్తమగును.


సూర్యుని యందలి చైతన్యమునకును, పరబ్రహ్మస్వరూపిణియైన తనకు (పరమేశ్వరికిని) అభేదభావన చేయుటయే సంధ్య గనుక అమ్మవారు *సంధ్యా* యని అనబడినది. 'సూర్యునియందలి చైతన్యమును బ్రహ్మాదులతోను, మహాభూతముల తోను, వాటి అంశములతోను అభేదముగా (ఒకటే యనుభావముతో) అనుసంధానముచేయుటచే మొదట సచ్చిదానందరూప పరమాత్మకు నేను దాసుడను అనెడి బుద్ధి ఉపాసకునకు గలుగును. తరువాత నేనే ఆ పరమాత్మ అనెడు బుద్ధి కలుగును. అట్టి అభేదభావనకు *సంధ్య* అని పేరు' అని వేదవేత్తలు చెప్పుచున్నారు. అందుకే పరమేశ్వరి చైతన్యాభిన్నస్వరూపురాలు అయినది గనుక *సంధ్యా* యని అనబడినది. బ్రహ్మకంటె వేరైనదిగా గాయత్రీ మంత్రమును పొందకూడదు గనుకను, ఏ విధిగానైనను నేనే గాయత్రిని అని ఉపాసన చేయవలయునని వ్యాసులవారు అనడం జరిగినది. 'కర్మసాక్షిణి యగు పరమాత్మ యొక్క చైతన్యశక్తి బ్రహ్మవిష్ణురుద్రాది రూపములను పొంది అనేక విధములుగా ప్రకాశించుచున్నది. అట్టి పరమేశ్వరిని (పరమాత్మను) దేవతలు *సంధ్య* యని చెప్పుచున్నారని భరద్వాజస్మృతియందు గలదు. 'ఓ పరమేశ్వరీ! ఆగమములన్నియు నిన్ను నాల్గవపాదముతోడను గూడిన సంధ్యామయ గాయత్రీ యని చెప్పుచున్నారు. నీవే మహాకర్మలన్నిటికి సుఖము నిచ్చుచున్నావు అని పండితులు పలికిరి. అట్టి గాయత్రీ స్వరూపిణియైన పరమేశ్వరి *సంధ్యా* యని అనబడినది. అలాగే మాధవుడు 'సంధ్యా (ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య) సమయములలో ఉపాసించిన దేవత ఈ *సంధ్య* యను దేవత. అట్టి సంధ్యా స్వరూపిణియైన పరమేశ్వరి *సంధ్యా* యని అనబడినది. బ్రహ్మదేవుడు ధ్యానము చేయుచుండగా ఆయన మనస్సునుండి అందమయిన ఒక స్త్రీ మూర్తి ఉద్భవించినది. ఆమెయే బ్రహ్మమానస పుత్రికయైన సంధ్య. అట్టి సంధ్యాస్వరూపిణియైన పరమేశ్వరి *సంధ్యా* యని అనబడినది. ఈ విషయము భగవతీ పురాణమునందు కూడా చెప్పబడినది. అట్టి బ్రహ్మమానస పుత్రిక యైన సంధ్య తపస్సు చేసి ఆ శరీరమును విడచి అరుంధతిగా జన్మించినది. మహాకాళి యని పేరుగల ఇడానాడియు, మహాలక్ష్మి యని పేరుగల పింగళనాడియు, ఏకవీర యని పేరుగల సుషుమ్నా నాడియు, నాడీత్రయమని అనబడగా, అట్టి నాడీ త్రయస్వరూపురాలైనది ఈ సంధ్య. అట్టి సంధ్యా స్వరూపురాలైన శ్రీమాత *సంధ్యా* యని అనబడినది. ఒక సంవత్సరము గల కన్యకను సంధ్యగా దౌమ్యుడు కన్యా ప్రకరణమందు చెప్పెను. అట్టి కన్యాస్వరూపురాలైన పరమేశ్వరి *సంధ్యా* యని అనబడినది. చిచ్చక్తి స్వరూపిణియైన పరమేశ్వరి సంధ్యాస్వరూపిణియై, ప్రాతః కాల సంధ్యయందు గాయత్రిగా, మధ్యాహ్న సంధ్యయందు సావిత్రిగా, సాయం సంధ్యయందు సరస్వతిగా ఆరాధింప బడుచుండుటచే అమ్మవారు *సంధ్యా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం సంధ్యాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

Contact numbers in Hyderabad

 Contact numbers in Hyderabad in case of emergency 

Hyderabad Flood helpline  

For any emergency Dial 100 / 112


      Toll Free Number for Emergency Services: 211111111

    

  GHMC Disaster Dept Emergency: 9000113667


      GHMC tree cutting: 6309062583


      GHMC ( water loging ): 9000113667


      NDRF : 8333068536


   GHMC 

Disaster helpline : 97046018166


Central Electricity complaint number toll free 1912


Osmania General Hospital 040-23538846,

040-24600146


Gandhi Hospital 040-27505566


NDRF RRC, Shaikpet Sport Complex, Hyderabad, Telangana 04023565666 08333068536 08333068547


Contact room helpline- 

9490617444

Please call only in case of any emergency.

ఏడుకొండల వాడి పెళ్లి భోజనాలు!*

 *ఏడుకొండల వాడి పెళ్లి భోజనాలు!*


పెళ్లి విందు తయారీ : 


స్వామివారి కల్యాణం చదివితే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాలలో కల్యాణం చెయ్యడమెంత కష్టమో తెలుస్తుంది!

 

👉 కుబేరుడు నుండి అప్పు దొరికి, అన్ని పెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఒక ఎత్తు , వచ్చేవాడు మన ఇంటికి భోజనానికిలేక వస్తాడా ? 

ఇప్పటి కిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు? అనుకున్నారు. స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే, "నేను చేస్తాను స్వామి! కానీ వంటపాత్రలేవి?" అన్నాడు అగ్నిదేవుడు. 


👉 అగ్నిదేవుడు వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.


👉నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.


👉అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి . కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు . 


👉ఒక్కో తీర్ధంలో/సరోవరంలో ఒక్కో

    వంటకం వండుతారు. 


👉స్వామి పుష్కరిణిలో అన్నం, 

👉పాపనాశనంలో పప్పు, 

👉ఆకాశగంగలో బెల్లం పరమాన్నం,

👉 దేవతీర్థంలో కూరలు,

👉తుబురతీర్ధంలో పులిహోర, 

👉కుమార తీర్ధంలో భక్ష్యాలు, అంటే

     బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు

     వంటివి, 

👉పాండుతీర్ధంలో పులుసు, 

👉ఇతర తీర్ధాల్లో లేహ్యాలు మొదలైనవి

    తయారు చేయమని స్వయంగా

    శ్రీనివాసుడే అగ్నిదేవుడిని

    ఆజ్ఞాపిస్తాడు. 


👉అన్నిటిలోనూ పప్పులు,

     పులుసులు , చక్కెర పొంగళ్లు , కట్టు

     పొంగళ్లు , జీలకర్ర పొంగళ్లు , ఎన్నో

     రకాల పొంగళ్ళు , పులిహోర

     పొంగళ్ళు చేసారు . వడ్డన చేయాలి

     కూర్చోమని అన్నారు .  


👉భోజనాల బంతులు వేంకటాచలం

     నుండి శ్రీశైలం వరకు వేశారు .


👉భోజనాలు సిద్ధం అయిన తరువాత

     నివేదనకు ఏర్పాట్లు చేశాడు

     బ్రహ్మదేవుడు.


👉"నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరీకి వడ్డన.

 "నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి. 

మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.   

 

👉ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు.


👉 తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిపిస్తాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి. 


👉ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి,

నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు. 


👉చక్కగా అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది. ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు.


🛎 భోజనాలు వడ్డన :


 👉ముందు విస్తళ్ళపై నీరు చల్లి, తుడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు. వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, "అందరికి ఉన్నంతలో ఏర్పాట్లు చేశాను, లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి" అని శ్రీనివాసుడు వేడుకున్నాడు.


 👉అందరి భోజనాలు ముగిశాక, అందరికి దక్షిణ, తాంబూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం.


👉అందరూ భోజనాలు చేసి , బ్రేవుమని త్రేన్చి కూర్చున్నారు . అందరినీ "భోజనమైందా?" అని పేరు పేరునా అడిగిన తరువాత శ్రీనివాసుడు, వకుళమాత, మన్మథుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భొజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది.


అందరి భోజనాలు పూర్తయ్యాక, రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగ పెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. ...!


 🙏🙏గోవిందా! గోవిందా! 🙏🙏


(సేకరణ)

శ్వాస ప్రాధాన్యత

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*🍁శ్వాస ప్రాధాన్యత 🍁*

             🌷🌷🌷

మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు...


100 నుండి 120 సం.౹౹లు బ్రతుకుతాడు. 


తాబేలు నిమిషానికి "3 సార్లు శ్వాస" తీస్తుంది...

500 సం. లు బ్రతుకుతుంది.


ఐతే "శ్వాస"లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.?


దీనిని .

సశాస్త్రీయంగా వివరిస్తాను...

అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.


మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. 


ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి.

వీటినే సెల్స్ అంటాం.


ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా (హరిత రేణువు)

"అనే ప్రత్యేక కణ వ్యవస్థ''ఉంటుంది.


ఈ మైటోకాండ్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. 

దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది.


ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తోంది

ఇలా శరీరం లోని

కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...


ఇలా ఒక్కొక్క కణం నిముషానికి... 

15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.


ఎందుకంటే మనం నిముషానికి "15" సార్లు శ్వాస తీసు కుంటాం కాబట్టి...


ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...


ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.


ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో...


ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది......


ఉదాహరణకు మన గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి. అనుకుంటే...


ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్ము.

మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమేఆ స్థలం లో కణాలు తయారవు తాయి.*


పాత వాటిని ఖాళీ చేస్తేనే...

కొత్తవి రాగల్గుతాయి. 

        

అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్య మైనది.


ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో... 


వారి శరీరం నిండా ఈ మృతకణాలు (toxins) నిండిపోయి...

సరిగా ఉష్ణం జనించక......

తీవ్ర రోగాల బారిన పడతారు...


కనుక ఈ టాక్సిన్ లను .....

బయటికి పంపే డిటాక్సీఫీకేషన్..

(విసర్జన)

చాలా ముఖ్యం.


ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది. 


అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...


5 రోజులు జీవిస్తుంది......


13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...


7 రోజులు జీవిస్తుంది......


ఈ విధం గా మనం.. శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ...


మన కణాలు పని చేసే కాలం పెరుగుతుంది. 


ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...

త్వరగా పాడై పోతుందో

పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పని చేస్తుందో

అలాగే ఈ కణాలు కూడాను...


భారతీయ యోగులు ...

కణం యొక్క జీవిత కాలాన్ని...

3 నుండి 21 రోజుల వరకు...

పెంచి...

2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.


మనం శ్వాసను ఎక్కువ తీసు కునే కొద్దీ...


శరీరం లోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...

ఆ కణం త్వరగా పాడైపోతుంది. 

       

ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస"ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......


మన శరీరం లోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...


ఎందు కంటే......


అవయవాలు "అంటే"...

కణాల సముదాయమే.


ఇలా మన లోని ప్రతీ అవయవం యొక్క...

ఆయుష్షు పెరిగితే...


మన ఆయుష్షు కూడా పెరిగి నట్టే కదా.!!


మనం ఒక్క "శ్వాస,ను తగ్గించ గల్గితే...

20 సంవత్సరాల ఆయుష్షును...

పెంచు కోవచ్చు...


యోగులు...

ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...


తాము...

ఏ రోజు... మరణించేదీ...

ముందే చెబుతారు...🙏 *Good Morning Sir*

అనాయాస మరణం

 *ఆచార్యులు..అనాయాస మరణం..*


2011 వ సంవత్సరం లో..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధనామహోత్సవానికి మరో నాలుగురోజుల వ్యవధి వుందనగా..ఒక శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు..ఒక పెద్దాయన నేరుగా నేను కూర్చున్న చోటుకి వచ్చి..ఏ ఉపోద్ఘాతమూ లేకుండా...


 ఈ స్వామివారు జీవించి ఉండగా చూసావా?..అప్పుడు నీ వయసెంత?..నీతో స్వామివారు ఎప్పుడైనా మాట్లాడారా.? " అంటూ ఒకదాని తరువాత ఒకటి చొప్పున వరుసగా ప్రశ్నలు అడుగుతున్నారు.. ఆ పెద్దాయన కు సుమారు డెబ్భై ఏళ్ళ పైబడి వయసుంటుంది..నిలబడే వున్నారు..నుదుటిమీద తిరునామం చక్కగా దిద్దుకొని వున్నారు..సంప్రదాయబద్ధమైన పంచెకట్టు..భుజం మీద జరీ కండువా..ముఖం లో ఏదో తెలియని తేజస్సు కనబడుతున్నది..నేను జవాబు చెపుదామని నోరు తెరిచేలోపలే..మళ్లీ అందుకొని.."స్వామివారు నీకు గురూపదేశం ఏమైనా చేసారా..?" అన్నారు.


ఆయనను ఒక్కక్షణం ఆగమని సైగ చేసాను..ముందు స్థిమితంగా కూర్చోమని చెప్పాను..నా ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు.."మీరెవరు..? మీ పేరేమిటి?..మీరు ఎక్కడినుండి వచ్చారు..? ఈ ప్రశ్నలకు ముందు జవాబివ్వండి...మీ అన్ని సందేహాలకూ సమాధానం చెపుతాను.." అన్నాను..


నావంక తీక్షణంగా చూసారు.."నా పేరు రాఘవాచార్యులు..మా స్వగ్రామం చదలవాడ..కానీ మా నాన్నగారి వివాహం అయ్యాక ఇల్లరికం వెళ్లారు..1930, 31 ప్రాంతాల్లో చెన్నై లో స్థిరపడ్డాము..మేమంతా అక్కడే పుట్టి పెరిగాము..అక్కడే ఉద్యోగం చేసి, రిటైర్ కూడా అయ్యాను..అవధూతల క్షేత్రాలను దర్శించటం నాకు ఇష్టం..మొన్న గొలగమూడి వెంకయ్యస్వామి వారి మందిరానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఈ క్షేత్రం గురించి విన్నాను.. కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన అవధూత మందిరం ఇది అని తెలుసుకున్నాను..ఈ స్వామివారి చరిత్ర గురించిన పుస్తకం ఒకటి అక్కడి భక్తులదగ్గర లభ్యమైంది..ఏకబిగిన చదివేశాను..చదివిన తరువాత వుండబట్టలేక..నేరుగా ఇక్కడికి వచ్చాను..ఆ పుస్తకం వ్రాసిన ప్రభావతి గారి కుమారుడు నువ్వేనని మీ సిబ్బంది చెప్పారు..నిన్ను అడిగి విషయం తెలుసుకుందామని నీ దగ్గరకు వచ్చాను.." అన్నారు..


వారిని స్థిమితపడమని చెప్పి..శ్రీ స్వామివారిని నేను మొదటిసారి కలిసిన దగ్గరనుంచీ..శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందేవరకూ నాకు శ్రీ స్వామివారితో కలిగిన అనుభవాలను క్లుప్తంగా చెప్పాను..శ్రద్ధగా విన్నారు..


"అయితే నీకు ప్రత్యేకించి ఉపదేశం ఏమీ చేయలేదా..? " అన్నారు..

"లేదండీ..కాకపోతే..ఈ క్షేత్రాన్ని ముందు ముందు నేనే నిర్వహించాల్సివస్తుంది అని సూచనప్రాయంగా అప్పట్లో చెప్పారు..ఆరోజు నాకున్న అవగాహనారాహిత్యం వల్ల సరిగ్గా గ్రహించలేకపోయాను..ఇప్పుడు ఆలోచిస్తే..స్వామివారు చెప్పిన మాటలకు అర్ధం గోచరిస్తోంది.." అన్నాను..


"ఒక్కసారి స్వామివారి సమాధి వద్దకు వెళ్ళనిస్తావా..?" అన్నారు..

"ఈరోజు శనివారం..ఒక్క శనివారం నాడు మాత్రం తన సమాధి వద్దకు ఎవరూ రావొద్దని శ్రీ స్వామివారు సిద్ధిపొందే ముందు స్వహస్తాలతో వ్రాసి పెట్టారండీ..మీరు ఈరాత్రికి ఇక్కడ నిద్రచేయండి..రేపుదయాన్నే శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్లొచ్చు.." అన్నాను..


ఒక్కక్షణం ఆలోచించి.."సరే.." అన్నారు..ఇంతలో మా సిబ్బంది ఆరోజు సాయంత్రం జరుపబోయే పల్లకీసేవ గురించి మైక్ లో చెపుతున్నారు..అది విని.."ఈ సాయంత్రం పల్లకీసేవ ఉన్నదా..? నేనూ పాల్గొంటాను.." అన్నారు..


రాఘవాచార్యులు గారు ఆ సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొన్నారు..పల్లకీసేవ పూర్తయిన తరువాత..నా దగ్గరకు వచ్చి..మా అర్చకస్వాములు కొన్ని మంత్రాలు చదివేటప్పుడు స్వరం తప్పుగా ఉన్నదనీ..దానిని సరిచేసుకోమనీ..కొన్ని సూచనలు ఇచ్చారు..తప్పకుండా సరిచేసుకుంటామని వారికి చెప్పాను..తృప్తిగా నవ్వారు..భోజనం చేయమని అడిగాను..శనివారం నాటి రాత్రికి ఉపవాసం ఉంటానని చెప్పారు..ఒక గ్లాసు పాలు తెప్పించి ఇచ్చాను..తీసుకున్నారు.


ప్రక్కరోజు ఉదయాన్నే 5గంటలకల్లా స్నానం చేసి మందిరం లోకి వచ్చారు..శ్రీ స్వామివారికి జరిగే ప్రభాతసేవ అంతా శ్రద్ధగా చూసారు..హారతులు పూర్తయిన తరువాత..వారిని శ్రీస్వామివారి సమాధి దర్శనానికి వెళ్ళిరమ్మన్నాను..సమాధి మందిరం లోపలికి వెళ్లి..సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని..ఐదు నిమిషాలు నిలబడ్డారు..అర్చకస్వామి వద్ద హారతి తీసుకొని..మరొక్కమారు శ్రీ స్వామివారి విగ్రహానికి నమస్కారం చేసుకొని...నేరుగా నేను కూర్చున్న చోటుకు వచ్చారు..


"నాయనా ప్రసాద్..నిజమైన సాధకుడి సమాధిని దర్శించానయ్యా..ఒడలు పులకరించాయి..శ్రీ స్వామివారి సాధన తాలూకు ప్రకంపనలు ప్రత్యక్షంగా అనుభవించాను..నా మనసులో ఈ స్వామివారి రూపం స్థిరంగా నిలబడిపోయింది..నువ్వు చాలా అదృష్టవంతుడవు..ఇటువంటి మహనీయుడి సాన్నిహిత్యాన్ని అనుభవించావు.." అంటూ నా రెండు చేతులూ పట్టుకొని కళ్ళకు అద్దుకున్నారు..ఆయన కళ్లలోంచి కన్నీళ్లు వస్తున్నాయి..బాగా చలించిపోయినట్టు వున్నారు.."ఈ జీవితానికి ఇంకేం కావాలి?..సాధకుడి తపోభూమిని దర్శించాను..అనాయాసేన మరణాన్ని కోరుకున్నాను.." అని తనలో తాను అనుకుంటున్నట్లు గా అన్నారు..


రాఘవాచార్యులు గారు ఆరోజు మధ్యాహ్నం చెన్నై తిరిగి వెళ్లిపోయారు..ఆ తరువాత రెండునెలల్లో మరో రెండుసార్లు వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..ప్రతిసారీ అదే తాదాత్మ్యం పొందారు..రాబోయే దత్తజయంతికి స్వామివారి వద్దకు వస్తాను అన్నారు కానీ దత్తజయంతి ముందురోజు పరమపదించారు..నిజంగానే ఆయన కోరుకున్న విధంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండా సుఖమైన నిద్రలో మరణించారు..ధన్యజీవి!!


శ్రీ రాఘవాచార్యులు గారి మాటలు ఇప్పటికీ నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523 114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీమద్భాగవతము

 *27.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2274(౨౨౭౪)*


*10.1-1395-వ.*

*10.1-1396-*


*శా. కారాశాలల మా నిమిత్తము మిముం గంసుండు గారింపఁగా*

*వారింపంగ సమర్థతల్ గలిగియున్ వారింపఁగా లేక ని*

*ష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్యసంచారులన్*

*సారాతిక్షములార! మమ్ముఁ గొఱతల్ సైరించి రక్షింపరే."* 🌺 🙏



*_భావము: "ఇన్ని ధర్మములు తెలిసియున్నవారము మేము. అయినా మా కారణంగా ఈ దుష్ట కంసుడు మిమ్మల్ని చెరసాలలో బంధించి, బాధిస్తున్నా, వాడిని అడ్డుకోగల సమర్థత ఉండి కూడా ఊరక ఉండిపోయాము ఇన్నాళ్లు. మేము క్రూరులము, నిర్దయులము, కుటిలాత్ములము. మిక్కిలి శ్రేష్ఠులు, క్షమాబుద్ధి కలవారలగు మీరు మా నిష్ప్రయోజకత్వమును సహించి మన్నించండి."_* 🙏



*_Meaning: We are the reason for Kamsa to imprison you and torture you. But in spite of having the knowledge and the capacity to ward off his wicked deeds, we remained mute spectators. We are cruel, insincere and merciless. You are kind hearted and magnanimous. Kindly pardon our inaction and bless us.”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*