11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

బాలుడిని మేము సేవింతుము

 శ్లోకం:☝️

    *చాతుర్త్యైక నిధానసీమ*

*చెపలా పాంగ్ చ్చటామంథరం l*

    *లావణ్యామృత వీచి*

*లాలిత దృశం లక్ష్మీ కటాక్షదృతం ll*

    -శ్రీకృష్ణ కర్ణామృతం


భావం: గొప్ప నైపుణ్యములకు కారణములై, చలించుచున్న క్రీగంటి కాంతులచే శోభించు వాడును; దివ్య ప్రకాశములనే అమృతవీచికల చేత కదులుతున్న నేత్రములు గలవాడును; సైకత శ్రేణులలో వివరించుటకు అనురాగ శక్తులు గలవాడును; మన్మధుని  పుట్టుకకు కారణమైనవాడును; సమస్త సౌందర్యరాశియును, శ్రీదేవి కటాక్ష వీక్షణముల చేత ఆధరింపబడేవాడును అగు నల్లని బాలుడిని మేము సేవింతుము.🙏

మధ్వనవమి

 హిందుతత్వ గురువులలో త్రిమూర్తులుగా పరిగణించబడే వారిలో మొదటి గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా రెండవ గురువైన శ్రీ రామానుజాచార్యుల వారు విష్టాద్వైత సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. ఈ గురువులలో మూడవ గురువు మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 


1317వ సంవత్సరం మాఘమాసం 9వ రోజున శ్రీ మధ్వాచార్యులు కర్ణాటకలోని శ్రీ అనంతేశ్వర ఆలయంలో తన శిష్యులకు ఐతరేయ ఉపనిషద్ భాష్యాన్ని బోధిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆయనపై పూలవర్షం కురిసింది. తర్వాత ఆ పూల కుప్పలో వెతికి చూడగా మధ్వాచార్యులు అదృశ్యమయ్యారు అని శిష్యులు తెలుసుకున్నారు. మధ్వాచార్యులు బదరీకాశ్రమంలో ప్రవేశించిన రోజుగా (మోక్షం పొందిన రోజు) పరిగణించబడుతున్న మాఘమాసంలో 9వ రోజును మధ్వనవమిగా జరుపుకుంటారు. హనుమంతుడు మరియు భీముని తర్వాత మధ్వాచార్యులను వాయు దేవుడి మూడవ అవతారంగా భావిస్తారు. 


మధ్వాచార్యులు కర్ణాటకలోని ఉడిపికి దగ్గరలో గల పజక అనే గ్రామంలో జన్మించారు. శ్రీ మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని లేదా ద్వంద్వ తత్వశాస్త్రాన్ని ప్రతిపాదించారు. ద్వైత సిద్దాంతం ప్రకారం విష్ణువు (పరమాత్మ) మరియు జీవులు (జీవాత్మ) రెండూ వేర్వేరు. మనం చూసే ప్రపంచం నిజమైనది. విష్ణువు మాత్రమే స్వతంత్ర వాస్తవికత. అన్ని జీవులు మరియు నిర్జీవులు విష్ణువుపై ఆధారపడి ఉంటాయి. జీవాత్మలు మరియు ప్రపంచం విష్ణువుపై ఆధారపడి ఉంటాయి మరియు విష్ణువు నుండి వేరుగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అద్వైత సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా ద్వైత సిద్దాంతం ఉంటుంది.  


ద్వైత సిద్దాంతం ప్రకారం భక్తి ఒక్కటే మోక్షాన్ని పొందే సాధనం. సర్వసంగ పరిత్యాగం, భక్తి మరియు ప్రత్యక్ష జ్ఞానముతో భగవంతుని సేవించడం, ధ్యానం మోక్షప్రాప్తికి దారి తీస్తుంది. సాధకుడికి భగవంతుని దర్శనం కావాలంటే వేదాల అధ్యయనం, ఇంద్రియాలపై నియంత్రణ, వైరాగ్యం మరియు పరిపూర్ణ స్వీయ శరణాగతితో తనను తాను సిద్ధం చేసుకోవాలని ద్వైత సిద్దాంతం చెబుతుంది.  


శ్రీ మధ్వాచార్యులు ద్వైత సిద్దాంత ప్రతిపాదకులే కాకుండా ఒక సామాజిక మరియు మత సంస్కర్త కూడా. మోక్షం మార్గం అందరికీ తెరిచి ఉందని మరియు కొన్ని వర్ణాలకు లేదా పుట్టుకతో పరిమితం కాదని ప్రకటించారు. శ్రీ మధ్వాచార్యులు ప్రసిద్ధ ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించారు. మధ్వాచార్యుల బోధనలు చాలా మంది అనుచరులను ఆకర్షించాయి మరియు కర్ణాటకలో భాగవత లేదా భక్తి సంప్రదాయాలను పునరుద్ధరించాయి. మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి శ్రీ మధ్వాచార్యుల గురుపరంపరకు చెందిన వారు. 


: నాగరాజు మున్నూరు

బ్రాహ్మణ కన్య వృత్తాంతము

 _*మాఘమాసం*_

      🚩 _*శుక్రవారం*_🚩

_*ఫిబ్రవరి 11వ తేది 2022*_


 🌹 _*మాఘ పురాణం*_🌹 

🌴 _*10 వ అధ్యాయము*_🌴


🕉🌹🕉️🌹🌹🕉️🌹🕉️


*ఋక్ష కయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము*


☘☘☘☘☘☘☘☘️


పూర్వము భృగుమహాముని వంశమునందు ఋక్షకయను కన్య జన్మించి , దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు , పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి , విరక్తితో ఇల్లువిడిచి గంగానది తీరమునకుపోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుటవలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠ మందేవుండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి *"తిలోత్తమ"* అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై *"ఓయీ ! మీకేమి  కావలయునో కోరుకొనుము"* అని అనగా , *"స్వామీ మాకు ఇతరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము"* అని వేడుకొనగా , బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యెను.


బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులును మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాదిక్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి , ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి , దేవతలందరినీ తరిమివేసిరి , ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని *"మహానుభావా ! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి నానాభీబత్సము చేయుచున్నారు. కాన వారి మరణమునకు యేదైనా ఉపాయమాలోచించు"* మని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి  *"అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు యితరులెవరి వల్లను మరణము గలుగదని వరము నిచ్చియున్నాను. వారు వర గర్వముతో చాల అల్లకల్లోలము చేయుచున్నారు. కాన , నీవుపోయి నీచాకచక్యముతో వారికి మరణము కలుగునటుల ప్రయత్నించుము"* అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు వున్న అరణ్యమున ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమునూ విని ఆ దానవసోదరులు అటు నిటు తిరుగునట్లామెననుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండీరి , నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసురులారా ! మిమ్ములను పెండ్ళియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరియెడల సమాన ప్రేమతోనున్నాను. కాని ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కాని నాకోరిక యొకటి యున్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను  స్వంతముకాగలను అని చెప్పెను.


ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతునని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి , గ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి , ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి , మద్దరాలనెత్తిరి , దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధము చేసిరి గదాయుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరిఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలూ తెగి క్రిందపడినవి , ఇద్దరూ చనిపోయిరి.


తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినందా తెలియపర్చగా బ్రహ్మ సంతోషించి , *"తిలోత్తమా ! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన , నీవు దేవలోకమునకు వెళ్ళుము , దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు"* వని పంపెను.


      🌹🌷 *సేకరణ*🌷🌹

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🌹🙏🙏🌹🙏🙏

తేనె పూసిన కత్తి

 ✍

 _కొన్ని పదాలు పైకి ప్రగతి శీలం గాను, ఆదర్శవంతంగానూ కనిపిస్తాయి. నిజానికి ఆ పదాలు తేనె పూసిన కత్తి లాంటివి. అలాంటి పదాలను పదే పదే ఉపయోగించడం వెనుక అమాయక హిందువులను దెబ్బతీసే మహా కుతంత్రం ఉన్నది. అలాంటి వాటిలో ఐదు పదాలను గురించి నేను మీకు వివరిస్తాను. ఈ పదాలను పదేపదే వాడే నాయకులతో మేధావులతో అత్యంత అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన_ .


 *సెక్యులర్/లౌకిక:* 

---------------------

ఈ పదం 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో లేదు. ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ రద్దు అయిన సమయంలో ఎలాంటి చర్చ లేకుండా రాజ్యాంగ ప్రవేశిక లో బలవంతంగా చేర్చడం జరిగింది.

ఈ సెక్యులర్ అనే పదాన్ని ఉపయోగించి... హిందూ పురాతన సంస్కృతిని వెలుగులోకి రానివ్వకుండా.... భారతీయ వీరులను అవమానించే తీరులో రాయబడ్డ పుస్తకాలతో.....ఈ దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 _కాబట్టి తిరిగి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సెక్యులర్ అనే పదాన్ని తొలగించేందుకు మనం పోరాటం చేయాలి._ 


 *ఫెడరల్/సమాఖ్య:* 

------------------------

అనేక రాష్ట్రాలు కలిసి ఒక ఒప్పందం ద్వారా దేశంగా ఏర్పడితే అటువంటి దేశాన్ని ఫెడరల్ అని అంటారు. దీనికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉదాహరణ.

  భారత రాజ్యాంగంలో ఫెడరల్ అనే పదమే లేదు. కానీ మాటిమాటికీ అనేకమంది కుహనా మేధావులు, కొంత మంది రాజకీయ నాయకులు ఫెడరల్ ప్రభుత్వము  అని పదే పదే వాడుతున్నారు.

  దీని వెనుక కూడా భయంకరమైన కుట్రకోణం ఉన్నది. ఫెడరల్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము బలహీనంగా ఉంటూ రాష్ట్రాలపై అధికారాన్ని కలిగి ఉండదు. కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనం చేసి వేర్పాటువాద ఉద్యమాలను బలోపేతం చేయడమే ఈ కుహనా మేధావుల అసలు లక్ష్యం.

దేశ విచ్ఛిన్నానికి దారి తీసే రాజ్యాంగంలో లేని ఫెడరల్ అనే పదాన్ని మాటిమాటికి ఉపయోగించడం దేశానికి ప్రమాదకరం _కాబట్టి ఇటువంటి భావజాలాన్ని తిప్పికొట్టాలి_ .


 *లిబరల్/ఉదారవాద:* 

------------------------------

మైనారిటీలను బుజ్జగించడం కోసం.... వెయ్యేళ్ళ పాటు వలసవాద ప్రభుత్వాలు భారతదేశ ప్రజలను నాశనం చేసిన తీరును కప్పిపుచ్చడం కోసం..... హిందువులను రెండవ తరగతి పౌరులుగా ఉంచడం కోసం.... _లిబరల్ అనే పదాన్ని ఉపయోగిస్తూ  హిందుత్వాన్ని వెలుగులోకి రాకుండా ఈ నక్కజిత్తుల కుహనా మేధావులు అడ్డుపడుతున్నారు_ .


*హిందూ-- ముస్లిం భాయ్ భాయ్* :

--------------------------------------------

భారతీయ తాత్విక గ్రంధము లైన ఉపనిషత్తుల ప్రకారం సకల మానవులు సోదరులే. ఇందులో భిన్నాభిప్రాయం లేదు. కానీ ఖురాన్ ప్రకారం ప్రపంచంలోని ముస్లింలు మాత్రమే సోదరులు. హిందువులను వారు హీనజాతి గా భావిస్తూ కాఫీర్లు అని పిలుస్తారు.

 _కాబట్టి ఈ అర్థంలేని సిద్ధాంతం అనవసరమైనది_ .


*గంగా- జమున తెహజీబ్:* 

----------------------------------

క్రైస్తవ ,ఇస్లాం మతాలు పుట్టడానికి  వేల సంవత్సరాల ముందే... గంగా జమున నదులు హిందువులకు అత్యంత పవిత్రమైన నదులు. అయితే ఈ పదాన్ని హిందూ ముస్లిం ఐక్యత కోసం వాడుతుంటారు. ముస్లింల శాస్త్రాల ప్రకారం నదులపై వారికి ఎటువంటి పవిత్రమైన ఆరాధనా భావం లేదు. భారత స్వతంత్ర ఉద్యమం లో బ్రిటిష్ వాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవడం కోసం ఈ పదాన్ని వాడేవారు. కానీ ఇస్లాం మతం కోసం వారికి మరొక దేశం కావాలని రక్తపాతాన్ని సృష్టించి పాకిస్తాన్ దేశాన్ని ముస్లింలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి గంగా జమున తెహజీబ్ అనే పదం మిథ్య.... భ్రాంతి అనే విషయం స్పష్టమైపోయింది.

    _*దేశ విభజన నుండి నేటి వరకు కూడా జరిగిన నరమేధాన్ని చూసి కూడా ఈ పదాన్ని ఇప్పటికీ ప్రయోగించడం అంటే దాని వెనుక కుట్ర కోణం ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి* ._ 


--SBR TALKS