7, అక్టోబర్ 2022, శుక్రవారం

ఏమి నేర్పింది

 *ఆ కాలం*

*ఏమి నేర్పింది*??


*పొలం గట్లపై నడిపించి, తడబడకుండా *నిలదొక్కుకోవటం*

నేర్పింది.


*వాగు పక్కన నీటి చెలిమలు తీయించి,*

*శోధించే తత్వం* 

నేర్పింది.


*సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,*

*అన్వేషణ* 

నేర్పింది.


*తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో,*

*జీవితం* 

*పూలపాన్పు కాదని నేర్పింది.*


*చిన్న చిన్న దెబ్బలు తగిలితే,*

*నల్లాలం ఆకు పసరు పోయించి,*

*చిన్న చిన్న ఇంటి వైద్యం* *చిట్కాలు* 

నేర్పింది.


*చెట్టుమీద మామిడికాయ*

*గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని* 

*ఛేదించడం* 

నేర్పింది.


*నిండు బిందెను*

*నెత్తి మీద పెట్టి*, 

*నీళ్లు మోయించి*,

*జీవితమంటే*

*బరువు కాదు*..

*బాధ్యత* 

అని నేర్పింది.


*బావి నుండి బొక్కెనతో నీళ్లు* *తోడించి*,

*బాలన్స్ గా* 

*బరువు* 

*లాగటం నేర్పింది*.


*ఇంటి ముంగిటకు అతిథి దేవతలు*

*హరిదాసులు గంగిరెద్దులను రప్పించి*,

*ఉన్న దాంట్లో కొంత *పంచుకునే* 

గుణం నేర్పింది.


*విస్తరిలో,*

*అన్నం అంచులు దాటి కింద* *పడిపోకుండా*

*తినే*

*ఒద్దికను*

నేర్పింది.


*ఒక్క పిప్పర్మెంట్ ను, బట్ట వేసి కొరికి ముక్కలు చేసి*,

*కాకి ఎంగిలి పేరుతో*

*స్నేహితులతో*

*పంచుకోవటం* 

నేర్పింది.


*ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేక్కాయలు తెంపే *ఓర్పును* 

నేర్పింది.


*దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ *మెళకువలు* 

నేర్పింది.


*అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యా వరుసలతో*,

*ఊరు ఊరంతా ఒక కుటుంబమనే* *ఆత్మీయత* 

నేర్పింది.


*ధైర్యంగా* 

*బ్రతికే పాఠాలను నేర్పిన*

*మన బాల్యానికి*

*జీవితాంతం* 

*రుణపడి ఉందాం*.

గుణగణాఢ్యుల తోడ

శ్లోకం:☝️

*గుణవజ్జన సంసర్గాత్*

  *యాతి స్వల్పోపి గౌరవమ్ l*

*పుష్పమాలానుషంగేణ*

  *సూత్రం శిరసి ధార్యతే ll*


భావం: ఎలా పూవుల సంసర్గముతో (పూలమాలగా మారి) దారము కూడా భగవంతునిజేరి నివాసమేర్పరచుకొంటుందో లేక స్తీల శిరస్సునలంకరిస్తుందో, అలా విజ్ఞులతో సాంగత్యము చేత అల్పునికీ పండితులతో సమానముగా ఆదర సత్కారాలు లభిస్తాయి!🙏

 గుణగణాఢ్యుల తోడ తా కూడి మెలగ

కొలది గౌరవ మేనియు కలుగు నిలను

కుసుమమాలను దారమ్ము కూడు కతన 

శిరముపై చేరి నిలచెడు గరిమ పొందు 


గోపాలుని మధుసూదనరావు

 నగ్న సత్యాలు


గుడికి వెళ్లే మగవాళ్ల సంఖ్య, జిమ్ కు వెళ్లే ఆడవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది


10:03 P.M.


చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంటు


ఆసుపత్రులు చచ్చిపోయినాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు


10:04 PM.


మనం సంతోషంలో ఉన్నపుడు పాటలను వినాలి! బాధలో ఉన్నపుడు ఆపాటలను అర్ధం చేసుకోవాలి!


10:04 P.M.


అనాధ ఆశ్రమంలో పేదవారి చిన్నపిల్లలు ఉంటారు!. వృద్ధా ఆశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు! 22K


10:04 PM.


చిరునవ్వు చాలావరకు సమస్యలు పరిష్కరిస్తుంది! మౌనం అసలు సమస్యలు రాకుండా నివారిస్తుంది! Dislike


10:04 PM.


పూజలుచేసి దేవుడికోసం మనం వెతుకుతాం దానంచేస్తే ఆయన మనకోసం వెతుక్కుంటూ వస్తాడు.


10:04P.M.


తినటానికి భోజనం లేని స్థాయి నుంచి! తినటానికి సమయంలేని స్థాయివరకు! ఎదగటమే విజయం.


10:04 PM.


Share

పద్మపాద

 పద్మపాద,పద్మాసన,పద్మనేత్రి

పద్మహస్త,పద్మవదన,పద్మ పూజ్య,

పద్మనాభప్రియాంగనపద్మజ నుత

పద్మగంధియె,ననుబ్రోవ ప్రణతిశతము.


రాయప్రోలుసీతారామశర్మ

భీమవరం--9701764878.

మన మహర్షుల చరిత్రలు.

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

    *మన మహర్షుల చరిత్రలు.*         


*🌹ఈరోజు 44 వ నారద మహర్షి గురించి తెలుసుకుందాము!🌹*


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️


🍁విష్ణుమూర్తి నాభికమలం నుంచి బ్రహ్మని పుట్టించి సృష్టి చెయ్యమన్నాడు . 


☘️బ్రహ్మ చాల సంవత్సరాలు తపస్సుచేసి సనకగునందనుల్ని , సనాతన సనత్కుమారుల్ని పుట్టించాడు .


🍁పులహుడు , కళ్ళ నుంచి యత్రికత్రువులు , ముక్కు నుంచి అరుణుణ్ణి పుట్టిస్తే వాళ్ళు మొత్తం క్షత్రియ కులాన్ని పుట్టించారు .


☘️బ్రహ్మ నుదిటి నుంచి ఏకాదశ రుద్రులు , చెవులనుండి పులస్త్యుడు ఎడమ భాగం నుంచి స్వాయంభువ అనే మనువు శతరూప అనే సుందరి ముఖము నుంచి అంగిరసుడు ,


🍁ఎడమచేతి వైపు నుంచి భృగుదక్షలు , 

గ్రీవము నుండి నారదుడు పుట్టారు . నారదుడు ఎలా పుట్టాడో తెలిసింది కదా !


☘️నారదుడు సరస్వతీదేవి దగ్గర సంగీత విద్య నేర్చుకున్నాడు . 

వాయుదేవత నుంచి ' మహతి ' అనే వీణని తీసుకుని బ్రహ్మలోకానికి వచ్చి , తన గానంతో బ్రహ్మని సంతోషపెట్టాడు .


🍁బ్రహ్మ నారదుడికి విష్ణుభక్తిని గురించి చెప్పి , ఎప్పుడూ హరిభక్తుడిగా ఉండాలని చెప్పి అష్టాక్షరీ మంత్రం ఉపదేశం చేశాడు .


☘️ఒకసారి బ్రహ్మ కొడుకులందర్నీ పిలిచి పెళ్ళి చేసుకుని , సంతానాన్ని కనండి , మీకు భార్యల్ని సృష్టిస్తాను అన్నాడు . నారదుడు నేను పెళ్ళి చేసుకోను , హరి భక్తుడిగానే ఉండిపోతానన్నాడు .


🍁తండ్రినైన నా మాట వినలేదు కాబట్టి నువ్వు తత్త్వజ్ఞానం మర్చిపోయి గంధర్వుడుగా పుట్టి , ఆడవాళ్ళతో తిరుగుతూ వుంటావని శపించాడు బ్రహ్మ .


☘️నన్ను శపించావు కాబట్టి , యిల్ల కాల్లను పూజులు లేకుంట పోతాయని నారదుడు బ్రహ్మని శపించాడు .


🍁గంధర్వరాజొకడు తనకి ఎంత ధనం వున్న పిల్లలు లేరని వసిష్ఠ మహర్షిని ఏదయినా ఉపాయం చెప్పమన్నాడు . వసిష్ఠుడు శివపంచాక్షరీ మంత్రం కవచంతో సహా చెప్పి రోజూ చేసుకోమన్నాడు . 


☘️ఆ గంధర్వరాజు భక్తితో శివుణ్ణి ధ్యానించాడు . శివుడు ప్రత్యక్షమై నీకు విష్ణుభక్తుడు కొడుకుగా పుడతాడని చెప్పాడు . 


🍁కొంతకాలానికి గంధర్వరాజుకి ఒక కొడుకు పుట్టాడు . వసిష్ఠుడు అతనికి ఉపబర్షణుడు అని పేరు పెట్టి శ్రీహరి మంత్రం ఉపదేశించాడు . 

ఈ ఉపబర్షణుడే మన నారదుడు . 


☘️ఒకసారి ఉపబర్హణుడు గండకీ నదీతీరంలో శ్రీహరిని ధ్యానిస్తుండగా గంధర్వకన్యలు యాభయిమంది అతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు . అందులో అందరికన్న పెద్దది మాలావతి .


🍁విశ్వగ్రష్టలైన బ్రహ్మలు దేవసత్రయాగం చేస్తుంటే ఉపబర్హణుడు భార్యలో సహా వెళ్ళాడు . అక్కడ విష్ణుగాధలు పాడుతూ వుండగా అతడు భార్యల్ని మర్చిపోయి


☘️రంభ చీర పట్టుకు లాగి విశ్వసష్టలతో భూలోకంలో శూద్రుడుగా పుట్టేలా శాపం పొందాడు. ఈ విషయం భార్యలకి చెప్పి ప్రాణాలు విడిచాడు ఉపబర్షణుడు .


🍁మాలావతి నా భర్త ఈ రోజు బ్రతకకపోతే యమధర్మం నశించి , ఈశ్వర జ్ఞానం కూడ నశించిపోవాలని శపిస్తుంది . విష్ణుమూర్తి దేవతలు ఎంత చెప్పినా మాలావతి వినలేదు .


☘️అందరూ బ్రహ్మని సలహా అడిగారు . బ్రహ్మ దేవతలో ఇతడు పూర్వజన్మలో నా కొడుకు నారదుడు . నా శాపం వల్ల లక్ష సంవత్సరాలు గంధర్వుడుగా ఉండాలి . ఇంకా వెయ్యి సంవత్సరాలు మిగిలివుంది కాబట్టి , 


🍁ఇప్పుడు తిరిగి బ్రతుకుతాడని చెప్పాడు . ఉపబర్హణుడు మళ్ళీ బ్రతికి వెయ్యి సంవత్సరాలు భార్యలతో గడిపి తర్వాత శ్రీహరిని తల్చుకుని శరీరం వదిలేశాడు .


☘️ఆ రోజుల్లో కన్యాకుబ్దాన్ని ద్రుమిళుడనే యాదవ రాజు పాలించేవాడు . అతడికి పిల్లలు లేరు .


🍁కశ్యప మహర్షి అనుగ్రహంతో యాదవరాజు భార్య కళావతి గర్భవతి అయ్యాక ఆమెని ఒక బ్రాహ్మణ కుటుంబానికి అప్పగించి గంగాతీరానికి వెళ్ళిపోయాడు .


☘️కళావతికి హరిభక్తుడైన కొడుకు పుట్టాడు . అతడు పుట్టగానే కన్యాకుబ్జంలో వానలు పడి కరువు తగ్గిపోయింది . జ్ఞానసంపన్నుడు , జలమిచ్చినవాడు కనుక నారదుడు అని పేరు పెట్టారు .


🍁యోగులందరికీ సేవ చేస్తూ , విష్ణుకథలు వింటూ పెరుగుతున్నాడు నారదుడు . 

తల్లి మరణించాక నారదుడు పరమాత్ముణ్ణి చూడాలని ఒక రావి చెట్టు క్రింద కూర్చుని శ్రీహరిని ప్రార్థించాడు . 


☘️విష్ణుమూర్తి “ నారదా ! నువ్వీ జన్మలో నా అసలు స్వరూపాన్ని చూడలేవు . అయినా ప్రళయం వచ్చినపుడు మళ్ళీ చేసే సృష్టిలో ఉత్తముడిగా పుడతావ ” ని వరమిచ్చాడు . 


🍁విష్ణుమూర్తి చెప్పినట్లు బ్రహ్మ ప్రాణం వల్ల మళ్ళీ ఉత్తముడుగా దేవలోకంలో పుట్టాడు . బ్రహ్మ ఒకనాడు నారదుణ్ణి పిలిచి పెళ్ళి చేసుకుని పిల్లల్ని పొందితే పున్నామ నరకం నుంచి తప్పించుకున్న వాడివీ , 


☘️నా మాట విన్నవాడివీ కూడా అవుతావన్నాడు . ముందు నేను కైలాసం వెళ్ళి శివుణ్ణి చూసి , నరనారాయణుల్ని చూసి వారి అనుమతి తీసుకుని చేసుకుంటాను అన్నాడు నారదుడు . 


🍁నాకీ పన్లు చేసుకునే శక్తినిమ్మని బ్రహ్మని అడిగాడు . నారదుడు కైలాసం వెళ్ళి శివుణ్ణి చూసి శ్రీహరి మంత్రం , స్తోత్రకవచం , పూజా విధానం , గృహస్థధర్మం తెలుసుకుని బదరికావనం వెళ్ళి అక్కడ నారాయణ మహర్షిని చూసి తత్వాన్ని ఉపదేశించమన్నాడు .


☘️నీకు ఇప్పుడే చెప్పినా అర్థం కాదు . కొంతకాలం తపస్సుచేసుకోమన్నాడు నారాయణ మహర్షి .


🍁నారదుడు శ్వేతద్వీపానికి వెళ్ళి ఒంటరిగా విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి విష్ణుమూర్తి అద్భుత రూపాన్ని చూశాడు .


☘️విష్ణుమూర్తి నారదుడికి తత్వాన్ని గురించి చెప్పాడు .నారదుడు ఆనందంతో బదరికావనం వచ్చి జరిగిందంతా నారాయణ ఋషికి చెప్పి


🍁మహర్షీ ! బ్రహ్మ నన్ను పెళ్ళిచేసుకుని పిల్లల్ని కనమని చెప్తున్నాడు . అది ఎంతవరకు మంచిది అన్నాడు . నారదా ! పురుషుడితో ప్రకృతి కలిసే ఉంటుంది . 


☘️శివుడికి దుర్గ , విష్ణువుకి లక్ష్మి ఇలాగే నీకు కూడ నీ పూర్వజన్మలో భార్య అయిన మాలావతే భార్యగా వస్తుంది . నీకు పెళ్ళి తప్పదు వెళ్ళిరా అని నారాయణ మహర్షి చెప్పాడు .


🍁నారదుడు హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు . ఇంద్రుడు అప్సరసల్ని పంపినా అతడు చలించలేదు . 


☘️కామం జయించానని విష్ణుమూర్తి దగ్గర చెప్పాడు నారదుడు . విష్ణుమూర్తి అది నీ గొప్పకాదు , శివుడి కటాక్షం వల్ల జరిగిందన్నాడు . 


🍁అంబరీషుడు తనకూతురు " శ్రీమతి ” కి స్వయంవరం ప్రకటించాడు . నారదుడు తన స్నేహితుడు పర్వతరాజుతో కలిసి అక్కడికి బయలుదేరుతూ ఒకరికి తెలియకుండా ఒకరు అవతలివాడికి కోతిమొహం రావాలని విష్ణుమూర్తిని కోరుకున్నారు .


☘️స్వయంవరంలో " శ్రీమతి ” విష్ణువుని వరిస్తే వీళ్ళిద్దరి కోతిమొహాలు చూసి అందరూ నవ్వారు . నారదుడికి గర్వభంగం అయింది . 


🍁నారదుడు సృంజయుడి కూతురు సుకుమారి పూర్వజన్మలో తన భార్య అయిన మాలావతి అని తెలుసుకుని ఆమెనే పెళ్ళి చేసుకున్నాడు .


☘️నారదుడు తన మామగారైన సృంజయునికి తేజోవంతుడైన కొడుకు కలగాలనీ , అతడి మలమూత్రాలు , చమట అన్నీ బంగారమవుతాయనీ వరమిచ్చాడు . 

అతడి పేరు సువర్ణజ్జీవి .


🍁దక్షుడికి ఇంకోసారి నారదుడి పైన చాలా కోపం వచ్చింది - తన పిల్లలకి తత్త్వజ్ఞానం చెప్పి సంసారంలోకి రాకుండా వంశవృద్ధి జరగకుండా చేశాడు కాబట్టి 


☘️కలహప్రియుడని పిలువబడతాడనీ 

ఏ లోకంలోనూ ఉండడానికి చోటుండదని , నారదుణ్ణి శపించాడు దక్షుడు . నారదుడు అతని మాటల్ని పట్టించుకోలేదు . 


🍁వ్యాసుడు వేదాలు చదివే అర్హత లేని స్త్రీలకోసం , శూద్రులకోసం మహాభారతం రాసికూడా ఆత్మానందం కలగట్లేదని నారదుణ్ణి అడిగితే విష్ణుభక్తి వల్లనే కలుగుతుందని చెప్పాడు .


☘️వ్యాసుడు శ్రీమద్భాగవతాన్ని రాసి తన కుమారుడైన శుకుడితో చదివించి ఆత్మానందం పొందాడు .


🍁ప్రాచీనబర్షి అనే రాజుకి , చేసిన యజ్ఞాలు చాలు శివుణ్ణి ధ్యానిస్తూ అన్ని విషయాలమీద విరక్తిని పెంచుకోమని బోధించాడు నారదుడు . 


☘️ఇంద్రుడు తన దగ్గరున్న అప్సరసలలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారని నారదుణ్ణి అడిగాడు . దుర్వాసుణ్ణి ఎవరు తపస్సు నుంచి బయటకి తీసుకువస్తే వాళ్ళు అందంగా వున్నట్లని చెప్పాడు నారదుడు . 


🍁అప్సరసలు అందరూ భయపడ్తుంటే “ వవు " అనే అప్సరస గర్వంతో వెళ్ళి దుర్వాసుడితో పక్షిగా పుట్టమని శాపం పొందింది . 


☘️నారదుడికి విష్ణుభక్తులందరిలో తనే గొప్పవాడినని గర్వం వచ్చింది . ఒకసారి శ్వేతద్వీపానికి వెళ్ళి అందర్లో విష్ణువెవరో గుర్తించలేక ప్రార్థించాడు .


🍁విష్ణువు కనిపించి నీ కంటే విష్ణుభక్తులు లేరు కదా ! నన్ను గుర్తుపట్టలేకపోవడమేమిటి ? అని ఒక సరస్సు చూపించి దాంట్లో స్నానం చెయ్యమన్నాడు . 


☘️వెంటనే నారదుడు చారుమతి అనే అమ్మాయిగా మారి కాశిరాజు దగ్గర పెరిగి పెళ్ళి చేసుకుని కొడుకుల్ని కన్నాడు . కొడుకులందరు యుద్ధంలో మరణించినప్పుడు చారుమతి పేరుతో వున్న నారదుడు అగ్నిలో పడగానే నారదుడి రూపం మళ్ళీ వచ్చేస్తుంది .


🍁దాంతో విష్ణుమాయ విష్ణువుకి తప్పించి ఎవరికీ తెలియదని గర్వం పోగొట్టుకున్నాడు నారదుడు .

చిత్రకేతుడనే రాజు కొడుకు పోయినందుకు ఏడుస్తుంటే నారదుడు అవన్నీ పూర్వజన్మ కర్మలనీ ,


☘️చచ్చినవాడు మళ్ళీ తిరిగి తన దగ్గరకి రాడనీ చెప్పి విష్ణుతత్వాన్ని బోధించాడు .

ధర్మరాజు నారదుణ్ణి ఏరూపంలో హరిని పూజించవచ్చని అడిగితే 


🍁కామంతో గోపికలు , భయంతో కంసుడు , శతృత్వంతో శిశుపాలుడు , ప్రేమతో మీ సోదరులు హరిని పూజ చేస్తూనే వున్నారు కదా ! ఎలాగయినా విష్ణువుని పొందవచ్చని చెప్పాడు నారదుడు . 


☘️నారదుడు మూడులోకాల్లోనూ తిరుగుతూ ఎంతోమందికి , భక్తి , జ్ఞానం , వైరాగ్యం గురించి చెప్పాడు . సృంజయుడికి షోడశమహరాజుల చరిత్ర , 


🍁హిరణ్యకశిపుడి భార్యని ఇంద్రుడు చంపబోతుంటే ప్రహ్లాదుడు పుట్టబోతున్నాడని , ధ్రువుడికి విష్ణుభక్తిని గురించి ,


☘️శ్రీరామలక్ష్మణులు ఇంద్రజిత్తుడి నాగాస్త్రానికి బంధింపబడే విష్ణుతత్త్వం చెప్పి గరుత్మంతుడ్ని తల్చుకోమని , భీష్ముడికి కంబాదుల కథ ,


🍁ధర్మరాజుకి కర్ణుడి కథ , ఇంద్రుడికి భృగువనే బ్రాహ్మణుని కథ , వసుదేవుడికి విదేహర్షభుడికథ , శ్రీకృష్ణుడికి అనిరుద్ధుడి కథ , వ్యాసుడికి ఆత్మానందం గురించి చెప్పాడు .


☘️నారదుడు దుష్టశిక్షణకి , శిష్టరక్షణకి ఇద్దరికీ లింకులు పెట్టి కలహం కుడా మంచికే చేశాడు . శ్రీకృష్ణుడికి రుక్మిణి గురించి చెప్పి వాళ్ళ పెళ్ళి జరిగేలా చేశాడు .


🍁కంసుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోవడానికి కూడా నారదుడే కారణం . నారదుడు నారద పురాణం , కల్కిపురాణం , వామనపురాణం , బ్రహ్మ వైవర్తపురాణం , శ్రీమధ్భాగవతపురాణం అన్నీ వ్యాసుడితో రాయించాడు .


☘️నారద , బ్రహ్మల మధ్య జరిగిన వాదనే శివపురాణంలో వున్న జ్ఞానసంహిత .

నారదుడికి వేదశాస్త్రాలు , సంగీతం , వాద్యం అన్నీ తెలిసికూడ బ్రహ్మజ్ఞానం మాత్రం సనత్కుమారుడి దగ్గర తెలుసుకున్నాడు . 


🍁శుక మహర్షికి నారదుడే విష్ణుతత్వాన్ని గురించి చెప్పి మహాయోగిని చేశాడు .

విష్ణుమూర్తిని గురించి అంతా తెలుసు అనుకున్న నారదుడికి విష్ణుమూర్తి ఎక్కడున్నాడో తెలియలేదు చూడండి .


☘️ఒకసారి నారదుడు స్నానం చేస్తుంటే తాబేలు కనిపించింది . నారదుడు దాన్ని చూసి ఎక్కడ ఏం జరుగుతున్నా నువ్వు ఈ నీళ్ళలో ఆ తిరుగుతున్నావు అదృష్టవంతుడివన్నాడు . 


🍁ఈ గంగాజలం లేకపోతే నేనెక్కడుంటాను గొప్ప నదికే వుంది అంది . నారదుడు నదిని నువ్వు చాలా గొప్ప అన్నాడు . 


☘️నదంది నాకంటే పెద్దది సముద్రం వుందిగా ! అని . సముద్రం దగ్గరికెళ్తే నాదేముంది భూదేవి లేకపోతే నేనెక్కడ ఉంటాను అంది . 


🍁భూదేవి కులపర్వతాలే నాకంటే గొప్ప అంది . కులపర్వతాలన్నీ మమ్మల్ని సృష్టించిన బ్రహ్మదే అంతా అన్నాయి . బ్రహ్మ నాదేం లేదు లోకానికి ఆధారమైన వేదాలదే అంతా అన్నాడు .


☘️వేదాలు యజ్ఞాలు లేకపోతే మాదేం లేదు అన్నాయి . యజ్ఞాలు మాకు విష్ణువే పరమాత్మ అతడే మమ్మల్ని నడిపిస్తున్నాడు అన్నాయి . 


🍁చివరికి నారదుడు విష్ణుమూర్తి దగ్గరకి వెళ్ళి పూజించాడు . 

తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాడన్నమాట . 


☘️వసుదేవుడికి పుట్టిన శ్రీకృష్ణుడు రాజ్యం చేస్తూ నారదుడితో మహాభోగినయి కూడా అందరితో నిందలుపడ్తున్నాను అంటే నారదుడు శ్రీకృష్ణుడు ఎలా ఉండాలో చెప్పాడు . 


🍁నారదుడు సమంగమునిని చూసి ఇంత నిశ్చింతగా ఎలా ఉన్నావని అడిగాడు . ఏం జరిగినా వారి కర్మలవల్లే కదా . సుఖానికి పొంగిపోవడం , 


☘️దుఃఖానికి క్రుంగిపోవడం నాకు లేదు కనక ఇలా ఉన్నానని సమంగముని నారదుడికి చెప్పాడు . 

రాజులా ఆచరించవలసిన ధర్మాల గురించి నారదుడిని అడిగాడు గాలవుడు . దైవాన్ని పూజించడం , తల్లిదండ్రుల్ని ఆరాధించడం , 


🍁అతిథుల్ని ఆదరించడం , అహంకారం వదిలెయ్యడం , నిజం చెప్పడం అని నారదుడు గాలవుడికి చెప్పాడు . 


☘️నారదా ! నువ్వు అన్ని లోకాలకి పూజ్యుడవి కదా నీ నమస్కారం తీసుకుందుకు అర్హులు ఎవరు ? అనడిగాడు కృష్ణుడు . 


🍁వాయువు , వరుణుడు , ఇంద్రుడు , అగ్ని , లక్ష్మీనారాయణులు బ్రహ్మ మొదలైన వాళ్ళందర్నీ చెప్పి తన వినయం ప్రకటించుకున్నాడు నారదుడు .


☘️నారదుడు దేవకీదేవికి అన్నదానం గురించి చెప్పాడు . నారదసూత్రాల్లో భక్తిమార్గం తప్ప వేరే మార్గం భగవంతుణ్ణి చేరడానికి లేదని చెప్పాడు . 


🍁నారదుడు చెప్పిన నారదస్మృతిలో తెలుసుకోవలసిన ధర్మాలు ఎన్నో ఉన్నాయి . శిల్పశాస్త్ర గ్రంథాన్ని కూడా నారదుడు రాశాడు . 


☘️ నారదుడు సర్వశాస్త్రవేత్త , బ్రహ్మజ్ఞాని కూడా . ఇదండీ నారదుడి కథ !! నారదుడి గురించి మనం తెలుసుకున్నది చాలా తక్కువ . అసలు నారదుడు కలవని ఋషులు గానీ , దేవతలు గానీ , భగవంతుడు గానీ ఉన్నారా ! 


🍁 ఎంతమంది దగ్గరో జ్ఞానం సంపాదించి ఎంతమందికో పంచిపెట్టాడు . ఎన్నో జన్మలెత్తాడు . ఎవరితో పోట్లాడినా , ఎవరి మధ్య కలహం రేపినా అన్నీ మంచి కోసమే చేశాడు .


☘️ కానీ , అసూయతో చెయ్యలేదు . అదీ .. నారద మహర్షి ప్రత్యేకత !

రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..


*సేకరణ* : శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్ 


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️

ఆరు సుఖాలు

 ॐ ఆరు సుఖాలు 


అర్థాగమో నిత్య మరోగితా చ 

ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ I 

వశ్యశ్చ పుత్రోఽర్థకరీ చ విద్యా 

షడ్జీవ లోకస్య సుఖాని రాజన్ ॥ 

                - విదురనీతి 


1. సంపదలు ఆగమ రూపంగా వస్తూ ఉండాలి. అవి ఉన్నదాన్ని నాశనం చేసి రాకూడదు. 

2. వాటిని అనుభవించడానికి మనం నిత్యమూ ఆరోగ్యంగా ఉండాలి. 

    రోగిష్ఠి వారికి సంపదలున్నా అనుభవించే యోగ్యత ఉండదు. 

3. మనకు నచ్చిన ప్రియురాలైన భార్య ఉండాలి. 

    ప్రియురాలు అంటే పరలోక సుఖాన్ని అందించేది అని అర్థం. 

    అందఱు భార్యలూ ప్రియురాండ్రు కాలేరు. 

    ఇది ఈ లోకంలో భర్తచేసే ధార్మిక కార్యక్రమాలన్నిటికీ భార్యగా సహకరించడం వలన, వాటి ధర్మఫలం భర్తకి లభిస్తుంది. 

    (భర్తకు లభించే పుణ్యంలో సగం భార్యకి చెందుతుంది) 

4. ఆమె ఎప్పుడూ భర్తకి ఇష్టమైన విధంగా పలికే హృదయజ్ఞురాలైనది కావాలి. అప్పుడే అర్థాంగి (better half) అవుతుంది. 

    (కుమ్మరి పురుగులా, కందిరీగలా అస్తమానూ దొలిచేదీ, గొణిగేదీ కాకూడదు 

        - ధూళిపాల వారి వ్యాఖ్య). 

5. తన మాట విని, తనకు అనుకూలంగా నడుచుకునే వశ్యుడైన పుత్రుడు మరొక గొప్ప సౌఖ్యం. 

    మన సంపదకు ముఖ్య వారసుడూ, అనుభోక్తా, ఆహ్లాద కారుడూ అయిన కుమారుడు కలిగి ఉంటే, అది ఉన్నతమైన సంపద. 

6. విద్యావంతులమై, ఆ విద్య మనకు ప్రయోజనకారి ఐనప్పుడు అది అసలైన సంపద. అది సౌఖ్యకారిణి అవుతుంది. 

    ఎంతటి వేదశాస్త్ర పండితుడైనా, మునిగిపోతున్న నావనుండి ఉరికి ఈతతో రక్షించుకో గలిగినప్పుడే ప్రయోజనం. మన జీవనాన్ని సురక్షితం చెయ్యాలి విద్య. 


    మనకు ఎన్ని సంపదలున్నా, మన పనులు మనమే చేసుకోవలసివస్తే, అది సంపదలోకి లెఖ్ఖరాదు. దాసదాసీ జనులవల్ల మన సంపద అనుభవంలోకి వస్తుంది. 

    కొన్ని దేశాలలో ఈ విధానం లేక, వాటిననుసరించే మన దేశంలోనూ అది ప్రవేశించింది. తద్వారా ఇతరుల ఉపాధికి గండిపడుతోంది. 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

పవిత్రం చెయ్యటానికే

 MVR REDDY


భగవాన్ రమణ మహర్షి


మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టంలేని సంఘటనలు జరిగినా ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి, శరీరం మరణించిన తరువాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చెయ్యటానికి, దానిని పద్ధతిలో పెట్టటానికి భగవంతుడు చేసే సంకల్పమే కాని, నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధపెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చెయ్యటానికే అలా చేస్తున్నాడు.

తస్మాత్ జాగ్రతః!


తస్మాత్ జాగ్రతః!


కో ధావతి తం చ ధావతి ఫణీ సర్పం శిఖీ ధావతి వ్యాఘ్రా ధావతి కేకినం విధివశాద్వ్యాధో ఒపి తం ధావతి స్వస్వాహార విహార సాధన విధౌ సర్వే జనా వ్యాకులాః కాల స్తిష్ఠతి పృష్ఠతః కచధరః కేనాపి నో దృశ్యతే.


పురుగును తినుటకు వెనుక నుండి కప్ప పరు గెత్తుకొని వచ్చుచున్నది. ఆ కప్పను తినుటకు దాని వెనుక నుండి పాము పరుగెత్తుకొనివచ్చు చున్నది. ఆ పామును తినుటకు నెమలి పరుగెత్తుకొనివచ్చుచున్నది. ఆ నెమలిని తినుటకు పెద్ద పులి దాని వెనుక చంపుటకు పరు గెత్తుకొనివచ్చుచున్నది. ఆ పెద్దపులిని బోయవాడు పరు గెత్తుకొనివచ్చుచున్నాడు. ఈ ప్రకారముగ జీవరాసులన్నియు వాని వాని ఎదుటనున్న ఆహార విహార సాధనవస్తువులను సంపాదించు ప్రయత్నమందు నిమగ్నములై యున్నవే కాని, వెనుక తట్టు జుట్టుపట్టుకొని ఈడ్చుకొనిపోవుటకు సిద్ధముగ నున్న యమధర్మ రాజును మాత్రము అవి చూచుట లేదు. ఆహా! ఎట్టి విచిత్రము !


(కావున జనులు తమవెనుక కాచుకొనియున్న మృత్యువును గమ నించి, అమృత్యువును జయించి అమరత్వ పదవి నొందుటకు వలసిన ఆత్మ జ్ఞానాది సాధనలను శీఘ్రముగ ఈ జన్మయందే సంపాదించుకొనవలెను )

చింతపండు ఉపయోగాలు -

 చింతపండు ఉపయోగాలు - 


 * చింతపండు గుజ్జు మంచి విరేచనకారిగా పనిచేయును . 


 *  చిన్నచిన్న గాయాలకు చీము పట్టకుండా చింతపండును యాంటిసెప్టిక్ గా వాడవచ్చు . 


 * అతిగా మద్యము సేవించినప్పుడు మరియు ఉమ్మెత్త వంటి విషపదార్ధాలు సేవించినప్పుడు విరుగుడుగా చింతపండు సేవించవచ్చు . 


 * వేసవి కాలంలో చింతపండు గుజ్జు తలకు రాసుకుంటూ ఉంటే వేసవిలో వడదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది . 


 *  మజ్జిగలో ఒక చెంచా చింతపండు గుజ్జు , అరటిగుజ్జు కలిపి తాగితే విరేచనాలు , పొట్టనొప్పి తగ్గును . 


 *  చింతపండు నానవేసిన నీటిలో కొద్దిగా తేనె కాని , పంచదార కాని కలిపి తాగితే వాంతులు తగ్గుటయే కాక దప్పిక తీరును . ఇంక మూత్రములో మంట , చురుకు కూడా తగ్గును . 


 *  ఒక చెంచా చింతపండు గుజ్జులో కొద్దిగా బెల్లము , జీలకర్ర కలిపి ప్రతిరోజు రెండుపర్యాయములు చొప్పున తీసుకుంటూ ఉంటే వాంతులు , వాంతి వచ్చునట్లుగా ఉండటం , బద్దకం తగ్గును . 


 *  చింతపండు , ఉప్పు , మిరియాలు కలిపి బాగా నమిలి తింటూ ఉంటే అజీర్తి తగ్గి ఆకలి పెరుగును . 


 * లేత చింతకాయలను , లేత మామిడికాయలతో కలిపి ఉడికించి తినుచున్న వడదెబ్బకు , కడుపుబ్బరానికి , విరేచనాలకు మంచి మందుగా పనిచేయును . 


 *  లేత చింతచిగురు వేడిచేసి ఒక గుడ్డలో వేసి కాపడం పెట్టుచున్న కీళ్లనొప్పులు తగ్గును . 


 *  లేతచిగురు నూరి రసం తీసి నీటిలో కలిపి గొంతువరకు పుక్కిలి పట్టిన గొంతునొప్పి తగ్గును . 


 *  చింతకుల నుండి తీసిన రసాన్ని కురుపులు , గాయాలు శుభ్రపరచుటకు యంటిసెప్టిక్ లా వాడవచ్చు . 


 *  చింతాకులను నీడన ఎండించి పొడిగొట్టి ఆపొడిని కురుపులుకు పైపూతగా ఉపయోగించవచ్చు . 


 *  చింతాకులను మెత్తని పేస్టులా నూరి గజ్జికి పైపూతగా ఉపయోగించవచ్చు . 


 *  నల్లమందు అధికంగా తీసుకున్నప్పుడు సంభవించే అనర్దాలకు తాజా చింతాకు రసాన్ని విరుగుడుగా ఉపయోగించవచ్చు . 


 *  చింత పువ్వుల రసాన్ని ఊపిరితిత్తుల వ్యాధి ( Bronchitis ) కి మందుగా ఉపయోగించవచ్చు . 


 *  చింతచెట్టు యొక్క బెరడుతో తయారుచేసిన కషాయాన్ని గొంతుదాక  పుక్కిలి పట్టిన గొంతునొప్పి తగ్గును . 


 గమనిక - 


     చింతపండుని మితిమీరి వినియోగించే కొందరికి పొట్టలో యాసిడ్ ( ఎసిడిటి ) అధికమైన  నొప్పి , దగ్గు లాంటివి వచ్చును . చింతపండు అధికంగా సేవించు మగవారిలో సంసారపరమైన సమస్యలు వచ్చును. 


       మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

తమలపాకు ఉపయోగాలు -

 ఆయుర్వేదం నందు తమలపాకు ఉపయోగాలు - 


 * తమలపాకు కొంచెం చేదు , కారం రుచి కలిగియుండును. 


 * బెంగాల్ నుంచి వచ్చే తమలపాకు కంటే దక్షిణ భారతదేశం నందు దొరుకు దళసరిగా కొంచం నలుపురంగు కలిగినవి వైద్యం నందు ఎక్కువ ఉపయోగంగా ఉంటాయి . 


 * తమలపాకు ఉపయోగించడం వలన నోటిజిగట, దుర్గంధం , శ్లేష్మము , వాతము , గుండెల్లో భారము , అజీర్ణం పొగొట్టును.


 * ఆకలి తక్కువ ఉన్నవారు దీనిని ఉపయోగించుట వలన ఆకలి పెరుగును. 


 * దేహములో ఉండే దుష్ట పదార్ధాలని తీసివేయను . 


 * గొంతుక , రొమ్ముని శుభ్రపరచును.


 * జ్వరం , దగ్గు, శ్లేష్మము ఉన్న సమయంలో తమలపాకు వెచ్చచేసి రసము తీసి సేవించిన ఉపయుక్తముగా ఉండును. మోతాదు 15ml లేదా 3 టీస్పూన్స్ రెండుపూటలా వాడవలెను . 


 * కొంతమందికి మెదడు గట్టిపడటం జరిగి ఉత్సాహముగా ఉండరు. వారికి పైన చెప్పిన మోతాదులో రెండుపూటలా ఇవ్వడం వలన వారిలో అద్భుత ఫలితాలు కనిపిస్తాయి .


 * శిశువులకు విరేచనం కానప్పుడు తమలపాకు తొడిమను ఆముదములో ముంచి బిడ్డల మలద్వారం ద్వారా లొపలికి చొప్పించిన విరేచనం అగును. 


 * గొంతులో పుండు వచ్చినపుడు తమలపాకుకి ఆవనూనె రాసి వెచ్చచేసి గొంతుక మీద వేసి కట్టిన గొంతుక పుండు మానును.


 * హిస్టీరియా వ్యాధిగ్రస్తులకు దీని రసంలో కొంచం కస్తూరి కలిపి ఇచ్చిన నయం అగును. 


 * మూత్రం బంధించినప్పుడు తమలపాకుల కు ఆముదం రాసి వెచ్చచేసి పొట్టపైన వేసినచో కేవలం 10 నిమిషాలలో మూత్రం బయటకి వచ్చును . ఇది నేను ప్రయోగించాను.


 * చిన్న పిల్లలకు దగ్గు , జలుబు బాగాచేసి గాలిపీల్చుకోవడం ఇబ్బంది అవుతున్నప్పుడు పైన చెప్పిన విధంగా ఆకులకు ఆముదం రాసి వెచ్చచేసి రొమ్ముపైన వేయాలి .


 * పక్కనొప్పి , లివర్ గట్టిపడటం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆకులకు ఆముదం రాసి వెచ్చచేసి కుడిపక్కన చంక క్రింద , లివరు భాగంలో వేయుచున్న ఆ సమస్యలు తీరును. 


 * స్త్రీల చన్నులపై వేడిచేసి వేసిన పాలు హరించును . గవదలపైన వేసిన టాన్సిల్స్ హరించును . 


 గమనిక - 


 * ఎండినవి , పురుగు పట్టినవి వైద్యానికి వాడరాదు.


 * స్త్రీలు ఎక్కువ ఉపయోగించరాదు. గర్భాశయ సమస్యలు వస్తాయి. 


 * సున్నం వేసిన ఆకులు వైద్యానికి పనికిరావు. 


        మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

ఆదర సత్కారాలు

 శ్లోకం:☝️

*గుణవజ్జన సంసర్గాత్*

  *యాతి స్వల్పోపి గౌరవమ్ l*

*పుష్పమాలానుషంగేణ*

  *సూత్రం శిరసి ధార్యతే ll*


భావం: ఎలా పూవుల సంసర్గముతో  (పూలమాలగా మారి) దారము కూడా భగవంతునిజేరి నివాసమేర్పరచుకొంటుందో లేక స్తీల శిరస్సునలంకరిస్తుందో, అలా విజ్ఞులతో సాంగత్యము చేత అల్పునికీ పండితులతో సమానముగా ఆదర సత్కారాలు లభిస్తాయి!🙏