చింతపండు ఉపయోగాలు -
* చింతపండు గుజ్జు మంచి విరేచనకారిగా పనిచేయును .
* చిన్నచిన్న గాయాలకు చీము పట్టకుండా చింతపండును యాంటిసెప్టిక్ గా వాడవచ్చు .
* అతిగా మద్యము సేవించినప్పుడు మరియు ఉమ్మెత్త వంటి విషపదార్ధాలు సేవించినప్పుడు విరుగుడుగా చింతపండు సేవించవచ్చు .
* వేసవి కాలంలో చింతపండు గుజ్జు తలకు రాసుకుంటూ ఉంటే వేసవిలో వడదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది .
* మజ్జిగలో ఒక చెంచా చింతపండు గుజ్జు , అరటిగుజ్జు కలిపి తాగితే విరేచనాలు , పొట్టనొప్పి తగ్గును .
* చింతపండు నానవేసిన నీటిలో కొద్దిగా తేనె కాని , పంచదార కాని కలిపి తాగితే వాంతులు తగ్గుటయే కాక దప్పిక తీరును . ఇంక మూత్రములో మంట , చురుకు కూడా తగ్గును .
* ఒక చెంచా చింతపండు గుజ్జులో కొద్దిగా బెల్లము , జీలకర్ర కలిపి ప్రతిరోజు రెండుపర్యాయములు చొప్పున తీసుకుంటూ ఉంటే వాంతులు , వాంతి వచ్చునట్లుగా ఉండటం , బద్దకం తగ్గును .
* చింతపండు , ఉప్పు , మిరియాలు కలిపి బాగా నమిలి తింటూ ఉంటే అజీర్తి తగ్గి ఆకలి పెరుగును .
* లేత చింతకాయలను , లేత మామిడికాయలతో కలిపి ఉడికించి తినుచున్న వడదెబ్బకు , కడుపుబ్బరానికి , విరేచనాలకు మంచి మందుగా పనిచేయును .
* లేత చింతచిగురు వేడిచేసి ఒక గుడ్డలో వేసి కాపడం పెట్టుచున్న కీళ్లనొప్పులు తగ్గును .
* లేతచిగురు నూరి రసం తీసి నీటిలో కలిపి గొంతువరకు పుక్కిలి పట్టిన గొంతునొప్పి తగ్గును .
* చింతకుల నుండి తీసిన రసాన్ని కురుపులు , గాయాలు శుభ్రపరచుటకు యంటిసెప్టిక్ లా వాడవచ్చు .
* చింతాకులను నీడన ఎండించి పొడిగొట్టి ఆపొడిని కురుపులుకు పైపూతగా ఉపయోగించవచ్చు .
* చింతాకులను మెత్తని పేస్టులా నూరి గజ్జికి పైపూతగా ఉపయోగించవచ్చు .
* నల్లమందు అధికంగా తీసుకున్నప్పుడు సంభవించే అనర్దాలకు తాజా చింతాకు రసాన్ని విరుగుడుగా ఉపయోగించవచ్చు .
* చింత పువ్వుల రసాన్ని ఊపిరితిత్తుల వ్యాధి ( Bronchitis ) కి మందుగా ఉపయోగించవచ్చు .
* చింతచెట్టు యొక్క బెరడుతో తయారుచేసిన కషాయాన్ని గొంతుదాక పుక్కిలి పట్టిన గొంతునొప్పి తగ్గును .
గమనిక -
చింతపండుని మితిమీరి వినియోగించే కొందరికి పొట్టలో యాసిడ్ ( ఎసిడిటి ) అధికమైన నొప్పి , దగ్గు లాంటివి వచ్చును . చింతపండు అధికంగా సేవించు మగవారిలో సంసారపరమైన సమస్యలు వచ్చును.
మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి