7, అక్టోబర్ 2022, శుక్రవారం

గుణగణాఢ్యుల తోడ

శ్లోకం:☝️

*గుణవజ్జన సంసర్గాత్*

  *యాతి స్వల్పోపి గౌరవమ్ l*

*పుష్పమాలానుషంగేణ*

  *సూత్రం శిరసి ధార్యతే ll*


భావం: ఎలా పూవుల సంసర్గముతో (పూలమాలగా మారి) దారము కూడా భగవంతునిజేరి నివాసమేర్పరచుకొంటుందో లేక స్తీల శిరస్సునలంకరిస్తుందో, అలా విజ్ఞులతో సాంగత్యము చేత అల్పునికీ పండితులతో సమానముగా ఆదర సత్కారాలు లభిస్తాయి!🙏

 గుణగణాఢ్యుల తోడ తా కూడి మెలగ

కొలది గౌరవ మేనియు కలుగు నిలను

కుసుమమాలను దారమ్ము కూడు కతన 

శిరముపై చేరి నిలచెడు గరిమ పొందు 


గోపాలుని మధుసూదనరావు

కామెంట్‌లు లేవు: