🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
*మన మహర్షుల చరిత్రలు.*
*🌹ఈరోజు 44 వ నారద మహర్షి గురించి తెలుసుకుందాము!🌹*
🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️
🍁విష్ణుమూర్తి నాభికమలం నుంచి బ్రహ్మని పుట్టించి సృష్టి చెయ్యమన్నాడు .
☘️బ్రహ్మ చాల సంవత్సరాలు తపస్సుచేసి సనకగునందనుల్ని , సనాతన సనత్కుమారుల్ని పుట్టించాడు .
🍁పులహుడు , కళ్ళ నుంచి యత్రికత్రువులు , ముక్కు నుంచి అరుణుణ్ణి పుట్టిస్తే వాళ్ళు మొత్తం క్షత్రియ కులాన్ని పుట్టించారు .
☘️బ్రహ్మ నుదిటి నుంచి ఏకాదశ రుద్రులు , చెవులనుండి పులస్త్యుడు ఎడమ భాగం నుంచి స్వాయంభువ అనే మనువు శతరూప అనే సుందరి ముఖము నుంచి అంగిరసుడు ,
🍁ఎడమచేతి వైపు నుంచి భృగుదక్షలు ,
గ్రీవము నుండి నారదుడు పుట్టారు . నారదుడు ఎలా పుట్టాడో తెలిసింది కదా !
☘️నారదుడు సరస్వతీదేవి దగ్గర సంగీత విద్య నేర్చుకున్నాడు .
వాయుదేవత నుంచి ' మహతి ' అనే వీణని తీసుకుని బ్రహ్మలోకానికి వచ్చి , తన గానంతో బ్రహ్మని సంతోషపెట్టాడు .
🍁బ్రహ్మ నారదుడికి విష్ణుభక్తిని గురించి చెప్పి , ఎప్పుడూ హరిభక్తుడిగా ఉండాలని చెప్పి అష్టాక్షరీ మంత్రం ఉపదేశం చేశాడు .
☘️ఒకసారి బ్రహ్మ కొడుకులందర్నీ పిలిచి పెళ్ళి చేసుకుని , సంతానాన్ని కనండి , మీకు భార్యల్ని సృష్టిస్తాను అన్నాడు . నారదుడు నేను పెళ్ళి చేసుకోను , హరి భక్తుడిగానే ఉండిపోతానన్నాడు .
🍁తండ్రినైన నా మాట వినలేదు కాబట్టి నువ్వు తత్త్వజ్ఞానం మర్చిపోయి గంధర్వుడుగా పుట్టి , ఆడవాళ్ళతో తిరుగుతూ వుంటావని శపించాడు బ్రహ్మ .
☘️నన్ను శపించావు కాబట్టి , యిల్ల కాల్లను పూజులు లేకుంట పోతాయని నారదుడు బ్రహ్మని శపించాడు .
🍁గంధర్వరాజొకడు తనకి ఎంత ధనం వున్న పిల్లలు లేరని వసిష్ఠ మహర్షిని ఏదయినా ఉపాయం చెప్పమన్నాడు . వసిష్ఠుడు శివపంచాక్షరీ మంత్రం కవచంతో సహా చెప్పి రోజూ చేసుకోమన్నాడు .
☘️ఆ గంధర్వరాజు భక్తితో శివుణ్ణి ధ్యానించాడు . శివుడు ప్రత్యక్షమై నీకు విష్ణుభక్తుడు కొడుకుగా పుడతాడని చెప్పాడు .
🍁కొంతకాలానికి గంధర్వరాజుకి ఒక కొడుకు పుట్టాడు . వసిష్ఠుడు అతనికి ఉపబర్షణుడు అని పేరు పెట్టి శ్రీహరి మంత్రం ఉపదేశించాడు .
ఈ ఉపబర్షణుడే మన నారదుడు .
☘️ఒకసారి ఉపబర్హణుడు గండకీ నదీతీరంలో శ్రీహరిని ధ్యానిస్తుండగా గంధర్వకన్యలు యాభయిమంది అతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు . అందులో అందరికన్న పెద్దది మాలావతి .
🍁విశ్వగ్రష్టలైన బ్రహ్మలు దేవసత్రయాగం చేస్తుంటే ఉపబర్హణుడు భార్యలో సహా వెళ్ళాడు . అక్కడ విష్ణుగాధలు పాడుతూ వుండగా అతడు భార్యల్ని మర్చిపోయి
☘️రంభ చీర పట్టుకు లాగి విశ్వసష్టలతో భూలోకంలో శూద్రుడుగా పుట్టేలా శాపం పొందాడు. ఈ విషయం భార్యలకి చెప్పి ప్రాణాలు విడిచాడు ఉపబర్షణుడు .
🍁మాలావతి నా భర్త ఈ రోజు బ్రతకకపోతే యమధర్మం నశించి , ఈశ్వర జ్ఞానం కూడ నశించిపోవాలని శపిస్తుంది . విష్ణుమూర్తి దేవతలు ఎంత చెప్పినా మాలావతి వినలేదు .
☘️అందరూ బ్రహ్మని సలహా అడిగారు . బ్రహ్మ దేవతలో ఇతడు పూర్వజన్మలో నా కొడుకు నారదుడు . నా శాపం వల్ల లక్ష సంవత్సరాలు గంధర్వుడుగా ఉండాలి . ఇంకా వెయ్యి సంవత్సరాలు మిగిలివుంది కాబట్టి ,
🍁ఇప్పుడు తిరిగి బ్రతుకుతాడని చెప్పాడు . ఉపబర్హణుడు మళ్ళీ బ్రతికి వెయ్యి సంవత్సరాలు భార్యలతో గడిపి తర్వాత శ్రీహరిని తల్చుకుని శరీరం వదిలేశాడు .
☘️ఆ రోజుల్లో కన్యాకుబ్దాన్ని ద్రుమిళుడనే యాదవ రాజు పాలించేవాడు . అతడికి పిల్లలు లేరు .
🍁కశ్యప మహర్షి అనుగ్రహంతో యాదవరాజు భార్య కళావతి గర్భవతి అయ్యాక ఆమెని ఒక బ్రాహ్మణ కుటుంబానికి అప్పగించి గంగాతీరానికి వెళ్ళిపోయాడు .
☘️కళావతికి హరిభక్తుడైన కొడుకు పుట్టాడు . అతడు పుట్టగానే కన్యాకుబ్జంలో వానలు పడి కరువు తగ్గిపోయింది . జ్ఞానసంపన్నుడు , జలమిచ్చినవాడు కనుక నారదుడు అని పేరు పెట్టారు .
🍁యోగులందరికీ సేవ చేస్తూ , విష్ణుకథలు వింటూ పెరుగుతున్నాడు నారదుడు .
తల్లి మరణించాక నారదుడు పరమాత్ముణ్ణి చూడాలని ఒక రావి చెట్టు క్రింద కూర్చుని శ్రీహరిని ప్రార్థించాడు .
☘️విష్ణుమూర్తి “ నారదా ! నువ్వీ జన్మలో నా అసలు స్వరూపాన్ని చూడలేవు . అయినా ప్రళయం వచ్చినపుడు మళ్ళీ చేసే సృష్టిలో ఉత్తముడిగా పుడతావ ” ని వరమిచ్చాడు .
🍁విష్ణుమూర్తి చెప్పినట్లు బ్రహ్మ ప్రాణం వల్ల మళ్ళీ ఉత్తముడుగా దేవలోకంలో పుట్టాడు . బ్రహ్మ ఒకనాడు నారదుణ్ణి పిలిచి పెళ్ళి చేసుకుని పిల్లల్ని పొందితే పున్నామ నరకం నుంచి తప్పించుకున్న వాడివీ ,
☘️నా మాట విన్నవాడివీ కూడా అవుతావన్నాడు . ముందు నేను కైలాసం వెళ్ళి శివుణ్ణి చూసి , నరనారాయణుల్ని చూసి వారి అనుమతి తీసుకుని చేసుకుంటాను అన్నాడు నారదుడు .
🍁నాకీ పన్లు చేసుకునే శక్తినిమ్మని బ్రహ్మని అడిగాడు . నారదుడు కైలాసం వెళ్ళి శివుణ్ణి చూసి శ్రీహరి మంత్రం , స్తోత్రకవచం , పూజా విధానం , గృహస్థధర్మం తెలుసుకుని బదరికావనం వెళ్ళి అక్కడ నారాయణ మహర్షిని చూసి తత్వాన్ని ఉపదేశించమన్నాడు .
☘️నీకు ఇప్పుడే చెప్పినా అర్థం కాదు . కొంతకాలం తపస్సుచేసుకోమన్నాడు నారాయణ మహర్షి .
🍁నారదుడు శ్వేతద్వీపానికి వెళ్ళి ఒంటరిగా విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి విష్ణుమూర్తి అద్భుత రూపాన్ని చూశాడు .
☘️విష్ణుమూర్తి నారదుడికి తత్వాన్ని గురించి చెప్పాడు .నారదుడు ఆనందంతో బదరికావనం వచ్చి జరిగిందంతా నారాయణ ఋషికి చెప్పి
🍁మహర్షీ ! బ్రహ్మ నన్ను పెళ్ళిచేసుకుని పిల్లల్ని కనమని చెప్తున్నాడు . అది ఎంతవరకు మంచిది అన్నాడు . నారదా ! పురుషుడితో ప్రకృతి కలిసే ఉంటుంది .
☘️శివుడికి దుర్గ , విష్ణువుకి లక్ష్మి ఇలాగే నీకు కూడ నీ పూర్వజన్మలో భార్య అయిన మాలావతే భార్యగా వస్తుంది . నీకు పెళ్ళి తప్పదు వెళ్ళిరా అని నారాయణ మహర్షి చెప్పాడు .
🍁నారదుడు హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు . ఇంద్రుడు అప్సరసల్ని పంపినా అతడు చలించలేదు .
☘️కామం జయించానని విష్ణుమూర్తి దగ్గర చెప్పాడు నారదుడు . విష్ణుమూర్తి అది నీ గొప్పకాదు , శివుడి కటాక్షం వల్ల జరిగిందన్నాడు .
🍁అంబరీషుడు తనకూతురు " శ్రీమతి ” కి స్వయంవరం ప్రకటించాడు . నారదుడు తన స్నేహితుడు పర్వతరాజుతో కలిసి అక్కడికి బయలుదేరుతూ ఒకరికి తెలియకుండా ఒకరు అవతలివాడికి కోతిమొహం రావాలని విష్ణుమూర్తిని కోరుకున్నారు .
☘️స్వయంవరంలో " శ్రీమతి ” విష్ణువుని వరిస్తే వీళ్ళిద్దరి కోతిమొహాలు చూసి అందరూ నవ్వారు . నారదుడికి గర్వభంగం అయింది .
🍁నారదుడు సృంజయుడి కూతురు సుకుమారి పూర్వజన్మలో తన భార్య అయిన మాలావతి అని తెలుసుకుని ఆమెనే పెళ్ళి చేసుకున్నాడు .
☘️నారదుడు తన మామగారైన సృంజయునికి తేజోవంతుడైన కొడుకు కలగాలనీ , అతడి మలమూత్రాలు , చమట అన్నీ బంగారమవుతాయనీ వరమిచ్చాడు .
అతడి పేరు సువర్ణజ్జీవి .
🍁దక్షుడికి ఇంకోసారి నారదుడి పైన చాలా కోపం వచ్చింది - తన పిల్లలకి తత్త్వజ్ఞానం చెప్పి సంసారంలోకి రాకుండా వంశవృద్ధి జరగకుండా చేశాడు కాబట్టి
☘️కలహప్రియుడని పిలువబడతాడనీ
ఏ లోకంలోనూ ఉండడానికి చోటుండదని , నారదుణ్ణి శపించాడు దక్షుడు . నారదుడు అతని మాటల్ని పట్టించుకోలేదు .
🍁వ్యాసుడు వేదాలు చదివే అర్హత లేని స్త్రీలకోసం , శూద్రులకోసం మహాభారతం రాసికూడా ఆత్మానందం కలగట్లేదని నారదుణ్ణి అడిగితే విష్ణుభక్తి వల్లనే కలుగుతుందని చెప్పాడు .
☘️వ్యాసుడు శ్రీమద్భాగవతాన్ని రాసి తన కుమారుడైన శుకుడితో చదివించి ఆత్మానందం పొందాడు .
🍁ప్రాచీనబర్షి అనే రాజుకి , చేసిన యజ్ఞాలు చాలు శివుణ్ణి ధ్యానిస్తూ అన్ని విషయాలమీద విరక్తిని పెంచుకోమని బోధించాడు నారదుడు .
☘️ఇంద్రుడు తన దగ్గరున్న అప్సరసలలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారని నారదుణ్ణి అడిగాడు . దుర్వాసుణ్ణి ఎవరు తపస్సు నుంచి బయటకి తీసుకువస్తే వాళ్ళు అందంగా వున్నట్లని చెప్పాడు నారదుడు .
🍁అప్సరసలు అందరూ భయపడ్తుంటే “ వవు " అనే అప్సరస గర్వంతో వెళ్ళి దుర్వాసుడితో పక్షిగా పుట్టమని శాపం పొందింది .
☘️నారదుడికి విష్ణుభక్తులందరిలో తనే గొప్పవాడినని గర్వం వచ్చింది . ఒకసారి శ్వేతద్వీపానికి వెళ్ళి అందర్లో విష్ణువెవరో గుర్తించలేక ప్రార్థించాడు .
🍁విష్ణువు కనిపించి నీ కంటే విష్ణుభక్తులు లేరు కదా ! నన్ను గుర్తుపట్టలేకపోవడమేమిటి ? అని ఒక సరస్సు చూపించి దాంట్లో స్నానం చెయ్యమన్నాడు .
☘️వెంటనే నారదుడు చారుమతి అనే అమ్మాయిగా మారి కాశిరాజు దగ్గర పెరిగి పెళ్ళి చేసుకుని కొడుకుల్ని కన్నాడు . కొడుకులందరు యుద్ధంలో మరణించినప్పుడు చారుమతి పేరుతో వున్న నారదుడు అగ్నిలో పడగానే నారదుడి రూపం మళ్ళీ వచ్చేస్తుంది .
🍁దాంతో విష్ణుమాయ విష్ణువుకి తప్పించి ఎవరికీ తెలియదని గర్వం పోగొట్టుకున్నాడు నారదుడు .
చిత్రకేతుడనే రాజు కొడుకు పోయినందుకు ఏడుస్తుంటే నారదుడు అవన్నీ పూర్వజన్మ కర్మలనీ ,
☘️చచ్చినవాడు మళ్ళీ తిరిగి తన దగ్గరకి రాడనీ చెప్పి విష్ణుతత్వాన్ని బోధించాడు .
ధర్మరాజు నారదుణ్ణి ఏరూపంలో హరిని పూజించవచ్చని అడిగితే
🍁కామంతో గోపికలు , భయంతో కంసుడు , శతృత్వంతో శిశుపాలుడు , ప్రేమతో మీ సోదరులు హరిని పూజ చేస్తూనే వున్నారు కదా ! ఎలాగయినా విష్ణువుని పొందవచ్చని చెప్పాడు నారదుడు .
☘️నారదుడు మూడులోకాల్లోనూ తిరుగుతూ ఎంతోమందికి , భక్తి , జ్ఞానం , వైరాగ్యం గురించి చెప్పాడు . సృంజయుడికి షోడశమహరాజుల చరిత్ర ,
🍁హిరణ్యకశిపుడి భార్యని ఇంద్రుడు చంపబోతుంటే ప్రహ్లాదుడు పుట్టబోతున్నాడని , ధ్రువుడికి విష్ణుభక్తిని గురించి ,
☘️శ్రీరామలక్ష్మణులు ఇంద్రజిత్తుడి నాగాస్త్రానికి బంధింపబడే విష్ణుతత్త్వం చెప్పి గరుత్మంతుడ్ని తల్చుకోమని , భీష్ముడికి కంబాదుల కథ ,
🍁ధర్మరాజుకి కర్ణుడి కథ , ఇంద్రుడికి భృగువనే బ్రాహ్మణుని కథ , వసుదేవుడికి విదేహర్షభుడికథ , శ్రీకృష్ణుడికి అనిరుద్ధుడి కథ , వ్యాసుడికి ఆత్మానందం గురించి చెప్పాడు .
☘️నారదుడు దుష్టశిక్షణకి , శిష్టరక్షణకి ఇద్దరికీ లింకులు పెట్టి కలహం కుడా మంచికే చేశాడు . శ్రీకృష్ణుడికి రుక్మిణి గురించి చెప్పి వాళ్ళ పెళ్ళి జరిగేలా చేశాడు .
🍁కంసుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోవడానికి కూడా నారదుడే కారణం . నారదుడు నారద పురాణం , కల్కిపురాణం , వామనపురాణం , బ్రహ్మ వైవర్తపురాణం , శ్రీమధ్భాగవతపురాణం అన్నీ వ్యాసుడితో రాయించాడు .
☘️నారద , బ్రహ్మల మధ్య జరిగిన వాదనే శివపురాణంలో వున్న జ్ఞానసంహిత .
నారదుడికి వేదశాస్త్రాలు , సంగీతం , వాద్యం అన్నీ తెలిసికూడ బ్రహ్మజ్ఞానం మాత్రం సనత్కుమారుడి దగ్గర తెలుసుకున్నాడు .
🍁శుక మహర్షికి నారదుడే విష్ణుతత్వాన్ని గురించి చెప్పి మహాయోగిని చేశాడు .
విష్ణుమూర్తిని గురించి అంతా తెలుసు అనుకున్న నారదుడికి విష్ణుమూర్తి ఎక్కడున్నాడో తెలియలేదు చూడండి .
☘️ఒకసారి నారదుడు స్నానం చేస్తుంటే తాబేలు కనిపించింది . నారదుడు దాన్ని చూసి ఎక్కడ ఏం జరుగుతున్నా నువ్వు ఈ నీళ్ళలో ఆ తిరుగుతున్నావు అదృష్టవంతుడివన్నాడు .
🍁ఈ గంగాజలం లేకపోతే నేనెక్కడుంటాను గొప్ప నదికే వుంది అంది . నారదుడు నదిని నువ్వు చాలా గొప్ప అన్నాడు .
☘️నదంది నాకంటే పెద్దది సముద్రం వుందిగా ! అని . సముద్రం దగ్గరికెళ్తే నాదేముంది భూదేవి లేకపోతే నేనెక్కడ ఉంటాను అంది .
🍁భూదేవి కులపర్వతాలే నాకంటే గొప్ప అంది . కులపర్వతాలన్నీ మమ్మల్ని సృష్టించిన బ్రహ్మదే అంతా అన్నాయి . బ్రహ్మ నాదేం లేదు లోకానికి ఆధారమైన వేదాలదే అంతా అన్నాడు .
☘️వేదాలు యజ్ఞాలు లేకపోతే మాదేం లేదు అన్నాయి . యజ్ఞాలు మాకు విష్ణువే పరమాత్మ అతడే మమ్మల్ని నడిపిస్తున్నాడు అన్నాయి .
🍁చివరికి నారదుడు విష్ణుమూర్తి దగ్గరకి వెళ్ళి పూజించాడు .
తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాడన్నమాట .
☘️వసుదేవుడికి పుట్టిన శ్రీకృష్ణుడు రాజ్యం చేస్తూ నారదుడితో మహాభోగినయి కూడా అందరితో నిందలుపడ్తున్నాను అంటే నారదుడు శ్రీకృష్ణుడు ఎలా ఉండాలో చెప్పాడు .
🍁నారదుడు సమంగమునిని చూసి ఇంత నిశ్చింతగా ఎలా ఉన్నావని అడిగాడు . ఏం జరిగినా వారి కర్మలవల్లే కదా . సుఖానికి పొంగిపోవడం ,
☘️దుఃఖానికి క్రుంగిపోవడం నాకు లేదు కనక ఇలా ఉన్నానని సమంగముని నారదుడికి చెప్పాడు .
రాజులా ఆచరించవలసిన ధర్మాల గురించి నారదుడిని అడిగాడు గాలవుడు . దైవాన్ని పూజించడం , తల్లిదండ్రుల్ని ఆరాధించడం ,
🍁అతిథుల్ని ఆదరించడం , అహంకారం వదిలెయ్యడం , నిజం చెప్పడం అని నారదుడు గాలవుడికి చెప్పాడు .
☘️నారదా ! నువ్వు అన్ని లోకాలకి పూజ్యుడవి కదా నీ నమస్కారం తీసుకుందుకు అర్హులు ఎవరు ? అనడిగాడు కృష్ణుడు .
🍁వాయువు , వరుణుడు , ఇంద్రుడు , అగ్ని , లక్ష్మీనారాయణులు బ్రహ్మ మొదలైన వాళ్ళందర్నీ చెప్పి తన వినయం ప్రకటించుకున్నాడు నారదుడు .
☘️నారదుడు దేవకీదేవికి అన్నదానం గురించి చెప్పాడు . నారదసూత్రాల్లో భక్తిమార్గం తప్ప వేరే మార్గం భగవంతుణ్ణి చేరడానికి లేదని చెప్పాడు .
🍁నారదుడు చెప్పిన నారదస్మృతిలో తెలుసుకోవలసిన ధర్మాలు ఎన్నో ఉన్నాయి . శిల్పశాస్త్ర గ్రంథాన్ని కూడా నారదుడు రాశాడు .
☘️ నారదుడు సర్వశాస్త్రవేత్త , బ్రహ్మజ్ఞాని కూడా . ఇదండీ నారదుడి కథ !! నారదుడి గురించి మనం తెలుసుకున్నది చాలా తక్కువ . అసలు నారదుడు కలవని ఋషులు గానీ , దేవతలు గానీ , భగవంతుడు గానీ ఉన్నారా !
🍁 ఎంతమంది దగ్గరో జ్ఞానం సంపాదించి ఎంతమందికో పంచిపెట్టాడు . ఎన్నో జన్మలెత్తాడు . ఎవరితో పోట్లాడినా , ఎవరి మధ్య కలహం రేపినా అన్నీ మంచి కోసమే చేశాడు .
☘️ కానీ , అసూయతో చెయ్యలేదు . అదీ .. నారద మహర్షి ప్రత్యేకత !
రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..
*సేకరణ* : శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్
🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి