27, జూన్ 2022, సోమవారం

చిల్లగింజల గురించి

 చిల్లగింజల గురించి సంపూర్ణ వివరణ  - 


      ఈ చిల్లగింజలను సాధారణ భాషలో ఇండుప గింజ , నిర్మలి అని కూడా పిలుస్తారు . మురికిగా ఉన్న నీటిని తేటగా చేయుటకు ఈ గింజను వాడతారు. వర్షాకాలములో నదీ ప్రవాహములలో , వాగులలో వచ్చు నీరు బురద , కల్మషముతో కూడి ఉండును. ఆ నీటిని నిర్మలముగా చేయుటకు నీరు పట్టి ఉన్న బిందెలలో ఈ చిల్లగింజని అరగదీసి వచ్చిన గంధమును నీటిలో కలుపుతారు. ఇది నీటిలోని బురద , కల్మషములను శుద్ది చేయుటయే కాక నీటిలో గల అనేకరకాల విషపదార్ధాలను కూడా నిర్మూలించును అని ఆధునిక పరిశోధనలు రుజువుచేసినవి . 


               ఈ చిల్లగింజలు నీటిలో కలిగిన రసాయనిక విషపదార్ధాలనే కాకుండా పరమాణు జన్యుమైన విషపదార్ధాలను కూడా నిర్మూలించును. ఇది కేవలం నీటిని శుభ్రపరచడం మాత్రమే కాకుండా అనేకరకాలైన వ్యాధులను కూడా నయం చేయును . ముఖ్యంగా మూత్రాశయ సంబంధ వ్యాధులను తగ్గించి మూత్రమును జారీ అయ్యేట్టు చేయును . మూత్రాశయం నందలి రాళ్లను కరిగించును. మధుమేహమును తగ్గించును . మధుమేహరోగులు చిల్లగింజలు , చండ్ర చెక్క , వేగిసచెక్క ఈ మూడింటితో తయారుచేసిన కషాయం నిత్యం వాడుట వలన మధుమేహము తగ్గును. కామెర్ల నందు కూడా పనిచేయును . వాపులు తగ్గును. తరచుగా వచ్చు జలుబు తగ్గును. శరీరం బరువు తగ్గి సన్నబడేలా చేయును . నేత్రములకు మంచిది . 


              చిన్నపిల్లల్లో మరియు పెద్దవారిలో తరచుగా కనిపించే నులిపురుగుల సమస్యను నిర్మూలించును. చర్మవ్యాధులు నందు పనిచేయును . చర్మవ్యాధుల యందు నిమ్మగింజలతో కలిపి వాడుచున్న మంచి ఫలితం కనిపించును. తెలంగాణ ప్రాంతములో తాంబూలం నందు వక్కతో పాటు చిల్లగింజల ముక్కలు కూడా వాడుట సాంప్రదాయముగా ఉన్నది. ప్రతిరోజు చిల్లగింజను వాడుట వలన మూత్రాశయములో రాళ్లు ఏర్పడకుండా మూత్రం సాఫీగా జారి అయ్యేలా చేస్తుంది . 


  

          మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కాలజ్ఞాని

 కాకి కాలజ్ఞాని అంటారు ఎందుకో కాస్త పరిశోధనాత్మక తో మననం చేసుకుందాం...

 వేకువ జామునే (బ్రహ్మ ముహూర్తంలో) మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి..

 కావు కావు నీ భంధాలు సిరి సంపదలు ఏవీ నీవి కావు అంటూ అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ  అందరినీ తట్టి లేపేది కాకి.. 

ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి  ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసులుతున్నదే కాకి..

 శత్రువులను గుర్తించి వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు....


ఆడ కాకి మగ కాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి

 అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం ఓ గొప్ప విషయం...

 ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుముగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే.... 

సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన  కాకులదే; 

అంతేకాదు

 సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా...!!

 కాకులు లేని ప్రదేశం లేదు 

ఈ భువిపై కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వఠవృక్షాలుగా పెరుగుతాయి

 అలా పచ్చని పకృతి విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే

 అందుకే కాకులు దూరని కారడవి అంటారు....

 కాకులు అరుస్తోంటే  ఎవరో కావలసిన భంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తూంది అనేవారు పెద్దలు ....  

అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించేముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి

 సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికిచేరి గ్రహణం విడిచాక కాకులు స్నానమాచరించి బయట ఎగుతాయి 

 అందుకే కాకి కాలజ్ఞాని అంటారు....!!!


దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు...

 భోజనం చేసేముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు;

 మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఈ పక్షి కాకి.

 ఎక్కువ కాలం జీవిస్తూంది కనుక కాకై కలకాలం జీవించడం శాస్త్రం లో కూడా విశదీకరించారు .....!!! 

కాకి కూజలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చిన తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకికి....!!

సెల్ టవర్ రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న ఈ కాకి గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ  కాకి బావ కధలు బిడ్డలకు చెప్పండి అని  తల్లి తండ్రులను పెద్దలను కోరుతూ...!!

భారతీయుల సనాతన ధర్మం విశిష్టత ఆవశ్యకత నేటి జనం మనం ఆచరించాల్సినవే

 ఇవన్నీ సంఘజీవనం సేవాతత్పరత మంచి స్నేహభావాలతో ఈర్ష్య  ద్వేషాలు లేకుండా కలసి మెలసి అన్యోన్యంగా అసమాతలకతీమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము.....!

ఉత్సవానికి వస్తావా?

 ఉత్సవానికి వస్తావా?


అవి నేను కాలేజిలో చదువుకుంటున్న రోజులు. అప్పుడు పరమాచార్య స్వామివారు అంటే తెలుసు కాని, వారిపై ప్రత్యేకమైన భక్తీ ఏమి లేదు. హఠాత్తుగా ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చారు మహాస్వామి. కాని అది ఎదో ఊహ అని కొట్టిపారేయలేను. వారు తరచుగా స్వప్న దర్శనం ఇస్తూనే ఉన్నారు.


మరి ఆ స్వప్న దర్శనాలను గౌరవించాలి కదా? అందుకే ప్రతి గురువారం ఉపవాసం చెయ్యడం ప్రారంభించాను. అప్పటినుండి ప్రతి గురువారమూ నాకు దర్శనభాగ్యం ప్రసాదించేవారు. అది చాలా సంతోషకరమైన విషయం. కాని ఎంతోకాలం నిలువలేదు.


మహాస్వామివారు కలలో రావడం ఆగిపోయింది. నా వల్ల ఏమి తప్పు జరిగిందో అర్థం కాలేదు. ఆ రోజు గురువారం. నా మంచంపై కూర్చుని నిద్రకుపక్రమిస్తూ కళ్ళుమూసుకుని, “కనీసం ఈరోజైనా మీ దర్శనభాగ్యం నాకు కలగాలి” అని వేడుకున్నాను.


ఊహు! పెరియవ రాలేదు.


రెండురోజుల తరువాత పరమాచార్య స్వామివారు నా కలలో కన్పించారు. “ఇంతకుముందు పరమాచార్య స్వామివారు తరచుగా నాకు స్వప్న దర్శనం ఇచ్చేవారు. ఈమధ్య అస్సలు రావడం లేదు” అని బాధతో స్వామివారిని అడిగాను.


మహాస్వమైవారు చిన్నగా నవ్వి, “నాకు వయసైపోయింది కదా! నేను ఇప్పుడు ముసలివాణ్ణి. నేను దిన్ని మోసుకుని అంట దూరం రాలేను కనుక నువ్వే నా దర్శనానికి రా” అని దండం వైపు చూపిస్తూ చెప్పారు.


“పరమాచార్య స్వామి అనుగ్రహం నేను తప్పక రాగాలను”


“మరి ఉత్సవానికి వస్తావా?”


“మీ అనుగ్రహం ఉంటే తప్పక వస్తాను పెరియవ”


కల చదిరిపోయింది. నాకు ఏమి అర్థం కాలేదు. నేను ఏ ఉత్సవానికి వెళ్ళాలి? దానికి పరమాచార్య స్వామి దర్శనానికి సంబంధం ఏమిటి?


కాని ఆ ఆశ్చర్యకర సంఘటన మరుసటి రోజునే జరిగింది. మా పెద్దమ్మ చెన్నైలో ఒక వివాహానికి వెళ్ళాల్సి ఉంది. తనతో రమ్మని నాకు చెప్పింది. “నీవు కూడా వస్తే, అలాగే కాంచీపురం వెళ్లి పరమాచార్యుల దర్శనం చేసుకుందాము” అని చెప్పింది.


నేను వెంటనే అంగీకరించాను.


మరుసటిరోజు కంచి మఠం ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకోగానే, ఊరెరిగింపుగా వచ్చిన కామాక్షి అమ్మవారు అక్కడ నిలబడి ఉంది. అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. అమ్మవారి చుట్టూ ముగ్గురు పెరియవలూ(మహా పెరియవ, పుదు పెరియవ, బాల పెరియవ) ప్రదక్షిణం చేస్తున్నారు.


“ఏమిటి ఈరోజు విశేషం” అని అక్కడున్న ఒకావిడని అడిగాను.


“నీకు తెలియదా? కామాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవం జరుగుతోంది” అని చెప్పిందావిడ.


నాకు కలిగిన ఆశ్చర్యం ఆనందం గురించి చెప్పాల్సిన పనిలేదు. “ఉత్సవానికి వస్తావా?” అన్నది కేవలం కల కాదు. అది దైవ సంకల్పం.


--- జానా కణ్ణన్, మైలాపూర్. మహా పెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 5


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం