16, అక్టోబర్ 2020, శుక్రవారం

అభిమానం

 *అభిమానం సురాపానం*

*గౌరవం రౌరవం సమమ్*

*ప్రతిష్ఠా సూకరీవిష్టా* *త్రయం త్యక్త్వా హరిం భజేత్*


నేను అనెడి దేహాభిమానము కల్లు వంటిది. గౌరవాభిలాష రౌరవ నరకముతో సమమైనది. ప్రతిష్ఠ యనునది పంది మలము వంటిది. కనుక ఈ మూడింటిని వదలి భగవంతుని (హరిని) భజించవలయును.🙏

Agreement to sell -

Srinivas Nehta Adv Ccc: *TELANGANA HIGH COURT*

Agreement to sell - Oral - Two companies - Normally when two companies want to enter into an agreement for sale and purchase of land, they must enter into a written agreement, but not by way of an oral agreement. (2020(2) Civil Court Cases 609 (Telangana)


*SUPREME COURT OF INDIA*

Attempt to commit an offence begins when accused commences to do an act with necessary intention. (2019(3) Apex Court Judgments 790 (S.C.)


*SUPREME COURT OF INDIA*

Dishonour of cheque - Cross examination of prosecution witnesses is not sufficient to rebut the presumption of consideration. (2019(4) Criminal Court Cases 637 (S.C.)


*MADRAS HIGH COURT*

Dishonour of cheque - Partnership Firm - Notice not given to partnership firm and even partnership firm not made as an accused - Complaint not maintainable. (2020(1) Civil Court Cases 813 (Madras)


*PATNA HIGH COURT*

Divorce decree - Expunging of remarks - Remarks casting aspersion and stigma on personal character of wife - Remarks expunged from judgment. (2020(1) Civil Court Cases 423 (Patna)


*RAJASTHAN HIGH COURT*

Ex parte decree - Setting aside - Substituted service - Summons issued once but not received back - Summons not sent by registered post despite such a direction - Mere fact that plaintiff entered into another wedlock is not a reason for sustaining ex parte decree - Ex parte decree rightly set aside. (2020(2) Civil Court Cases 700 (Rajasthan)


*PUNJAB & HARYANA HIGH COURT*

Fraud - Proof - To prove plea of fraud, plaintiff has to lead affirmative evidence. (2019(2) Civil Court Cases 297 (P&H)


*PUNJAB & HARYANA HIGH COURT*

Dishonour of cheque - Loan of 23.94 lakhs - Failure to prove financial capacity - Accused rightly acquitted. (2020(3) Civil Court Cases 539 (P&H)

[16/10, 8:18 pm] Srinivas Nehta Adv Ccc: SUPREME COURT OF INDIA JUDGEMEMT Dt. 15-10-2020. ( related to Domestic violence) 

Protection of Women from Domestic Violence Act, 2005. “Shared household” in Section 2(s) need not be the joint family household or household or in which husband has a share. Judgment in S.R. Batra and Anr. Vs. Taruna Batra, (2007) 3 SCC 169 overruled

Supreme Court 15:10:2020.

Satish Chander Ahuja vs Sneha Ajuja

Civil Appeal 2483/2020

Decided on 15 October 2020.

Justice Ashok Bhushan.

Justice R. Subhash Reddy

Justice M.R. Shah

Judgment link:

https://main.sci.gov.in/supremecourt/2020/689

Relevant paragraphs. 48. ....In the suit filed by the appellant for mandatory and permanent injunction, appellant pleaded that he is the sole owner of the house and prayed for removal of respondent, his daughter-in-law from the first floor of the house. The respondent had filed a written statement in the suit and claimed that the suit property is a shared household where the respondent had right to reside. The submission of learned counsel for the appellant is that the premises is not a shared household since the husband of the respondent neither has any share in the suit premises nor suit premises is a joint family property.

55....From the above definition, following is clear:- (i) it is not requirement of law that aggrieved person may either own the premises jointly or singly or by tenanting it jointly or singly; (ii) the household may belong to a joint family of which the respondent is a member irrespective of whether the respondent or the aggrieved person has any right, title or interest in the shared household; and (iii) the shared household may either be owned or tenanted by the respondent singly or jointly.

62..... The use of the expression “at any stage has lived” is for the above purpose and not with the object that wherever the aggrieved person has lived with the relatives of husband, all such houses shall become shared household, which is not the legislative intent. The shared household is contemplated to be the household, which is a dwelling place of aggrieved person in present time.

63. The words “lives or at any stage has lived in a domestic relationship” have to be given its normal and purposeful meaning. The living of woman in a household has to refer to a living which has some permanency. Mere fleeting or casual living at different places shall not make a shared household. The intention of the parties and the nature of living including the nature of household have to be looked into to find out as to whether the parties intended to treat the premises as shared household or not.

64.... the right to residence under Section 19 is not an indefeasible right of residence in shared household especially when the daughter-in-law is pitted against aged father-in-law and mother-in-law. The senior citizens in the evening of their life are also entitled to live peacefully not haunted by marital discord between their son and daughter-in-law. While granting relief both in application under Section 12 of Act, 2005 or in any civil proceedings, the Court has to balance the rights of both the parties.

84. In view of the foregoing discussions, we answer issue Nos. 1 and 2 in following manner:-

(i) The definition of shared household given in Section 2(s) cannot be read to mean that shared household can only be that household which is household of the joint family of which husband is a member or in which husband of the aggrieved person has a share.

(ii) The judgment of this Court in S.R. Batra Vs. Taruna Batra (supra) has not correctly interpreted Section 2(s) of Act, 2005 and the judgment does not lay down a correct law

ప్రజలకు ఏం చేయాలి

👋





 

దశావతారాలు

 ఇది అద్భుతం 

దశావతారాలను

ఒక్క చిత్రంలో దర్శింపచెషిన

ఘనుఁడు ఈ చిత్రకారుడు




గోత్రము

 srinidhi: 

*గోత్రము , ప్రవర , వివాహ నిబంధనలు:*


గోత్రమంటే నిజానికి ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.


ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...


సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.


కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను.


గౌతముడు , మరియు ఆపస్తంబుడి ప్రకారము , సగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు....చేసుకోకూడదు... ఎందుకంటే , ఒకే గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటీ వారవుతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో , అక్కా తమ్ముళ్ళో, తంరీ కూతుళ్ళొ , తల్లీ కొడుకుల వరస కలవారొ అవుతారు...సగోత్రీకులంటే ఎవరు ? నిర్ణయ సింధువు ప్రకారము ,

ఏ రెండు కుటుంబాలకు గానీ " ప్రవర " పూర్తిగా కలిస్తే వారు సగోత్రీకులు అవుతారు. ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,

|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు

ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత

---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ

..శర్మన్ అహం భో అభివాదయే ||


పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.

బౌధాయనుల ప్రకారమైతే , సమాన గోత్రము లేక ' సగోత్రము ' అని నిర్ణయించడానికి కింది కొలమానము ఉపయోగించాలి.

మొదట , ఇద్దరి గోత్రమూ ఒకటే కావాలి. తర్వాత ,

* ఎవరికైతే ఒకడే ఋషి ఉంటాడో , అదే ఋషి ప్రవరలో గల కన్య తో వివాహము తగదు.

* ఎవరికైతే ముగ్గురు ఋషులు ఉంటారో , ఆ ముగ్గురిలో ఏ ఇద్దరైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

* ఎవరికైతే ఐదుగురు ఋషులు ఉంటారో , ఆ ఐదుగురిలో ఏ ముగ్గురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

* ఎవరికైతే ఏడుగురు ఋషులు ఉంటారో , ఆ ఏడుగురిలో ఏ ఐదుగురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

ఇదీ , సగోత్రము అవునా కాదా అని నిర్ణయించే పద్దతి. అంతటితో అయిపోలేదు... అవి కాక, ఇంకొన్ని కూడా చూడాలి..

మాతృ గోత్రాన్ని వర్జించాలి. అంటే , తల్లి పుట్టింటి గోత్రాన్ని కూడా పరిగణించి , ఆ ప్రకారముగా సగోత్రమైతే వివాహమాడరాదు.

ఏఎ గోత్రాలకు యే యే ప్రవరలు అన్నది చాలా పెద్ద చిట్టానే ఉన్నది... ఇక్కడ రాయడము వీలు పడదు.

ఇక నిబంధనల సడలింపులు

ఈ విషయములో సడలింపులు అంటు ఏవీ లేవు.

గోత్రము తెలియనిచో , తనని తాను ఎవరికో ఒకరికి ఇచ్చుకొని , వారి గోత్ర ప్రవరుడు కావాలి. తెలిసినచో , ఈ పద్దతి తగదు.

తెలిసి కానీ తెలియక కానీ సగోత్రీకులతో వివాహము జరిగి సంసారం చేస్తే , ప్రాయశ్చిత్తం చేసుకొని , ఆ కన్యని తల్లిలా ఆదరించాలి.

తెలిసి చేస్తే , గురు తల్ప వ్రతం చేసి , శుధ్ధుడై , ఆ భార్యని తల్లి లా ఆదరించాలి. ఆమెకు తానే ఆఖరి కొడుకు.


తెలియక చేస్తే , మూడు చాంద్రాయణ వ్రతాలు చెయ్యాలి.( చాంద్రాయణం అనగా , ఒక నెలలోని శుక్ల పక్షం లో మొదటి రోజు ఒక ముద్ద మాత్రమే అన్నం తినాలి. రెండో రోజు రెండు ముద్దలు , మూడో రోజు మూడు, ఇలా పౌర్ణమికి పదిహేను ముద్దలు మాత్రమే తినాలి. తర్వాత, కృష్ణ పక్షం లో ఒక్కో ముద్ద తగ్గిస్తూ తినాలి. అమావాశ్య కు పూర్తి ఉపవాసం ఉండాలి... ఇలా ఒక నెల చెస్తే అది ఒక చాంద్రాయణం. ) ఈ ప్రాయశ్చిత్తం తాను శుధ్ధుడవటానికి మాత్రమే... ఇది ఒక వెసులుబాటు కాదు.

[16/10, 8:04 pm] srinidhi: #మర్మమైన_ఆలయం_మహానంది.

ఎవరైనా సిద్ధమా????ఒక సోదరుడు అడిగాడు ఈ పోస్ట్,ఎవరైనా సరే ఛాలెంజ్ గా ప్రయత్నించవచ్చు,

ఎంతమంది స్నానం చేసినా స్వచ్ఛత గుణాన్ని కొల్పోని చెరువు(కోనేరు)!!!

నీళ్లు ఎక్కడనుండి వస్తున్నాయో ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేక పోయారు!ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోవచ్చు నాస్తికులు....


#నంద్యాల్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నడిబొడ్డున, మహానంది అనే పవిత్ర గ్రామం ఉంది,ఇక్కడ శివుడు తన వాహనమైన నంది (పవిత్రమైన ఎద్దు) తో ఆయా రూపాల్లో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించే భక్తులను ఆశీర్వదిస్తాడు.

 

మహానందికి ప్రాచీన యుగాల చరిత్ర ఉంది మరియు శివుని లింగ రూపాన్ని మహానంది వద్ద #నందిశ్వర అని పిలుస్తారు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉంటుంది, ఈ ప్రదేశం వెనుక చాలా బయటపడని మరియు దాచిన #రహస్యాలు ఉన్నాయి. ఈ స్థలాన్ని చోళులు, పల్లవులు మరియు విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. కానీ "ఈ దేవాలయాలను ఎవరు నిర్మించారు" అనే ప్రశ్నకు ఎవరూ ఖచ్చితంగా సమాధానం చెప్పలేరు.  


ఈ పవిత్ర ఆలయాన్ని నిర్మించిన వ్యక్తిని ఇప్పటివరకూ ఎవరూ గుర్తించలేదని చరిత్రలో ఏ ఆధారం కూడా ఇప్పటివరకూ దొరకలేదు.ఈ లింగం చరిత్ర కూడా మంత్రముగ్దులను చేస్తుంది.ఈ ప్రదేశం యొక్క ఆసక్తికరమైన అంశం #ఆలయం_లోపల_చెరువు(కోనేరు)

పరిసరాల్లో నీటి కొరత సాధారణం.  

ఏ సీజన్ అయినా, ఈ చెరువులోని(కొనేటిలోని) నీటి ప్రవాహం ఎప్పుడూ ఒకే ప్రవాహంతోనే ఉంటుంది మరియు చెరువు(కోనేరు)యొక్క నీటి మట్టం ప్రతి రోజు కూడా అదే విధంగా ఉంటుంది.  


ప్రధాన(కోనేటి) చెరువులోని నీరు లోతైన రహస్యం, నీరు #ఎక్కడ_నుండి_వస్తున్నదో ఎవరికీ కనుగొనబడలేదు.ప్రధాన ఆలయం యొక్క లోపలినుండి నీరు వస్తోందని,ఐనా దానికి ఆధారాలు లేవని చెప్పాలి. ప్రతిరోజూ ఎంతమంది భక్తులు స్నానం చేసినా నీరు ఎప్పుడూ స్వచ్చం గా ఉంటుంది. నీరు ఎల్లప్పుడూ చక్కగా మరియు శుభ్రంగా ఉంటుంది.  


నీటిలో ఔషధ విలువలు ఉన్నాయి కనుక ప్రజలు వ్యాధుల నుండి బయటపడటానికి ఈ నీటిని తాగుతారు.ఈ ప్రధాన చెరువుకు(కోనేటి కి) నీటి ప్రవాహం మరియు నీటి ఉష్ణోగ్రత ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది మరియు రహస్యాన్ని తెలుసుకొనే అవకాశం ఇస్తుంది.

ఇప్పటికీ నిజం పరిష్కరించబడలేదు, 

కాని చెరువు యొక్క అందం వివరించలేనిది.

 నీటి ప్రవాహం తెలియదు మరియు ఈ ఆలయం సందర్శించడానికి ఇది ఒక పవిత్రమైన కారణమని నమ్ముతారు.


పరశురామ్ పరశురామ్

[16/10, 8:04 pm] srinidhi: *🌹. దసరా నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు…. 🌹*


ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించ వలెను.


*🌻. నవదుర్గలు :*


ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||

నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.


*🌻. నవదుర్గా ధ్యాన శ్లోకములు 🌻*


*🌷. శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)*

నైవేద్యం : కట్టు పొంగలి


శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


*🌷. బ్రహ్మ చారిణి ( గాయత్రి ):*

నైవేద్యం : పులిహోర


శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


*🌷. చంద్రఘంట ( అన్నపూర్ణ )*

 నైవేద్యం : కొబ్బరి అన్నము


శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||


*🌷. కూష్మాండ ( కామాక్షి )*

నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు


శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||


*🌷. స్కందమాత ( లలిత )*

నైవేద్యం : పెరుగు అన్నం


శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||


*🌷. కాత్యాయని(లక్ష్మి)*

నైవేద్యం : రవ్వ కేసరి


శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||


*🌷. కాళరాత్రి ( సరస్వతి )*

నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని


శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||


*🌷. మహాగౌరి( దుర్గ )*

నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)


శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||


*🌷. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )* 

నైవేద్యం : పాయసాన్నం


శ్లో|| సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||


*🌷. దుర్గా ధ్యాన శ్లోకము :*


శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥

🌹 🌹 🌹 🌹 🌹

సేకరణ

సుభాషితం


సుభాషితం* 🌹🌹🙏


*యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిమ్*

*లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిమ్ కరిష్యతి (హితోపదేశం)*


అర్థము:-స్వయముగా ప్రజ్ఞ లేనివాడికి శాస్త్రము వలన ప్రయోజనం మేమీ వుండజాలదు.

కండ్లు లేనివాడికి అద్దము వలన లాభమేముంటుంది?


🙏🌹🌹🙏🌹🌹🙏


🌸 *సుభాషితమ్* 🌸


శ్లో|| కోsర్థాన్ ప్రాప్య న గర్వితో విషయిణః కస్యాపదోsస్తం గతాః |

స్త్రీభిః కస్య న ఖండితం భువి మనః కో నామ రాఙ్ఞాం ప్రియః ||


తా|| సంపదలు పొంది గర్వించనిదెవ్వడు? విషయలంపటంలో పడి ఆపదలు పొందనిదెవ్వడు? స్త్రీలవల్ల భగ్నహృదయుడు కానిదెవ్వడు? యాచనతో గౌరవాన్ని పొందేది ఎవ్వడు? దుర్మార్గుల వలలో పడి క్షేమంగా బయటపడింది ఎవ్వడు?

(వీటి నుండి తప్పించుకోవడం మానవమాత్రుడికి సాధ్యం కాదు)


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*

శారదా నవరాత్రులు

 శారదా నవరాత్రులు: ఇంద్రకీలాద్రి.


మొదటి రోజు అలకారం 1.


స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి.


శరన్నావరాత్రులలో పాడ్యమినాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. దుష్ట రాక్షసుడైన మహిషాసురుడ్ని వధించిన దుర్గాదేవి కీలుడికిచ్చిన వరం కారణంగా భూలోకంలో కృష్ణానదీ తీరంలో వున్న కీల పర్వతం మీద వెలిసింది. అలా వెలసిన ఆ తల్లి ధగధగాయమానంగా కోటి సూర్య ప్రభలతో ప్రకాశిస్తూ, బంగారు వర్ణంలో మెరిసిపోతుందట. అలాంటి దివ్య మంగళమైన ఆ దేవి దివ్య స్వరూపాన్ని దర్శించిన దేవతలంతా దుర్గామాతను ‘కనకదుర్గా’ అని పిలిచారట. ఆనాటినుంచి దుర్గాదేవి కనకదుర్గగా ప్రఖ్యాతి చెందింది. కీలపర్వతం కాస్తా ఇంద్రకీల పర్వతంగా పేరుపొందింది. ఆ విధంగా కనకదుర్గ ప్రభలతో వెలసిన కనకదుర్గాదేవిని స్మరించుకోవడానికి దసరా మొదటి రోజున దుర్గాదేవికి కనకదుర్గ అలంకారాన్ని చేస్తారు. ఆ అలంకారంలో దుర్గాదేవి అష్ట భుజాలతో ‘తారాకాంతి తిరస్కారి నాసా భరణ భాసురా’ అన్నట్టు, తేజోమయ ముక్కుపుడకని ధరించి నిండైన పసిడి వర్ణ ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ కనకదుర్గగా దర్శనిమిస్తుంది.


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె


ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో


నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా


యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.


నైవేద్యం : చలివిడి,వడపప్పు,పాయసం.

ఇంట్లో_పూజ_ఎవరు_చేయాలి

 #ఇంట్లో_పూజ_ఎవరు_చేయాలి?


👉🏼యజమాని ఉత్తరీయం.. గోచీపోసి పంచె.. కట్టుకోవాలి.

సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది. 

కానీ నిత్యపూజ చేయడం అనేది పురుషుడు చేయాలి, అంటే యజమాని నిత్యపూజ చేయాలి. 

సంకల్పంలోనే ఉంది "ధర్మపత్నీ సమేతస్య" అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. 

అంటే దాని అర్థం ఇంట్లో పూజ.. ఇంటి యజమాని చేయాలి అని. 

ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా?...

అందువలన పురుషుడు ఒళ్ళు వంచి ప్రతిరోజూ పూజ చేయ్యాలి. 


అదేవిదంగా నైమిక్తిక తిథులలో గాని, 

వ్రతమప్పుడు గాని పూజ చేసేటప్పుడు ధర్మపత్నీ, పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి.


ఇక #వస్త్రధారణ విషయానికి వస్తే👇 ప్రధానంగా..

ఆడపిల్ల అయితే.. లంగా+వోణీ,

వివాహిత అయితే చీర కట్టుకోవాలి. 

అమ్మవారికి అవే కదా ప్రధానం.


మరి పురుషుల విషయానికి వస్తే👇 

పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది.

"వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ" అనగా... 

వికచ్ఛః అంటే గోచీ పెట్టుకోలేదు, 

అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం లేదు అని. 

గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబర అవుతుంది. కాబట్టీ... పురుషుడికి ఉత్తరీయం ఉండాలి, అలాగే గోచీపోసి పంచె కట్టుకోవాలి. 

వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి, గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని "కచ్ఛము" అంటారు. 

అందుకే... వేదం చదువుకున్న పెద్దలు, 

వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు. చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప, అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. 

కాబట్టి పురుషులు ఈ రెండు పద్దతులు తప్పనిసరిగా పాటించాలి.  


ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలంటే👇 

1) ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. 

2) కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది, అమంగళకరుడు యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. 

3) అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. 


ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే👇

 యజమాని యందు, పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు. 

ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నది చూసి, ఎందుకంటే యజమానికి అయన పెద్దరికం భుజంమీద ఉన్న ఉత్తరీయం వలనే.


👹కాబట్టీ చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు.

దేవాలయంలోనైనా అంతే. 

దేవాలయంలో వెళ్తే ఎదో చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పించుకోకుండ మనంతట మనమే తీసి కూర్చోవాలి. 


ఇలా ఎందుకంటే... దేవాలయం అనే మన మనశరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి, ఆత్మకు పరమాత్మ, పరమాత్మకు ఆత్మ కనపడాలి. 

అలా చెయ్యకపోతే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు అని అర్ధం. 


అందువలన పురుషులు(యజమాని) పూజ చేసేటపుడు ఉత్తరీయం వేసుకోవాలి, #గోచీపోసి_పంచె_కట్టుకోవాల్సిందే.       

                

*👉🏼ధర్మస్య విజయోస్తు🙌🏼*

*👉🏼అధర్మస్య నాశోస్తు🙌🏼*

*👉🏼ప్రాణిషు సద్భావనాస్తు🙌🏼*

*👉🏼విశ్వస్య కళ్యాణమస్తు🙌🏼*


అక్షరదోషం లేకుండా... లిఖించిన ఈ సమాచారం మీకు గూగుల్ లోకాదు, ఇంకెక్కడా దొరకదు. మన ఈ గ్రూపులోని పోస్టులను సర్చింగ్ కూడా చేయవచ్చు.

కనుక మన భారతీయ సాంప్రదాయాలు ప్రతీ పోస్టుని లైక్ తో పాటూ, షేర్ చేసి అందరికీ అందించడంద్వారా #విధ్యాదాన_ఫలితాన్ని పొందండి👐 https://www.facebook.com/groups/311867715891087/?ref=share HINDHU DHARMAM

LIKE చేసి, (...) పైన నొక్కి, SEE FIRST select చెయ్యండి, రేపటి పంచాంగ విశేషాలు ఈరోజే తెలుసుకోండి🙏

ధర్మసూక్ష్మములు

 ధర్మసూక్ష్మములు


పరమాచార్య స్వామి వారితో ఒక భక్తుడు ఇలా అన్నాడు, “పెరుగన్నం ఎక్కువగా మిగిలిపోయింది. దాన్ని ఆవుకు పెట్టాను. అది ఎంతో తృప్తిగా ఆరగించింది”.

వెంటనే స్వామివారు, “పెరుగన్నం కాని, పాలు కలిపిన అన్నం కాని ఆవుకు పెట్టరాదు. పెరుగు పాల నుండి వస్తుంది, పాలు ఆవు నుండి వస్తాయి.”


ఆ భక్తుడు బాధపడుతూ, “నేను అపచారం చేశాను, నన్ను క్షమించండి పెరియవా” అని వేడుకున్నాడు.


“సరే జరిగిపోయింది; ఇక ఎప్పుడూ అలా చెయ్యకు. ఇతర ప్రాణులకు పాలు, పెరుగు లేదా నెయ్యి కలిపిన అన్నం పెట్టవచ్చు. కాని గోవులకు మాత్రం పెట్టరాదు”.


మనస్సులో నటుకునేలా ధర్మసూక్ష్మములను చెప్పడం కేవలం పరమాచార్య స్వామివారికి మాత్రమే సాధ్యం.


**************************************************


పరమాచార్య స్వామివారు చిన్న కాంచీపురంలో ఉన్నప్పుడు, ప్రతిరోజూ తప్పక వరదరాజ స్వామి దేవాలయ ప్రదక్షిణ చేసేవారు. ఒకరోజు ఉదయం దేవాలయ ప్రదక్షిణ పూర్తైన తరువాత, చుట్టూ ఉన్న భక్తులు విష్ణు సహస్రం పఠిస్తుండగా మహాస్వామి వారు ఒక వీధిలో నడిచి వెళ్తున్నారు.


ఒక ఇంటి ముందర చిన్న అమ్మాయి ముగ్గు వేస్తూ ఉంది.


పరమాచార్య స్వామివారు ఆగారు. “నువ్వు ముగ్గు చాలా బాగా వేశావు. భేష్! కాని ముగ్గును కేవలం బియ్యపు పిండితో మాత్రమే వెయ్యాలి. అప్పుడే ఈగలు, చీమలు, పక్షులు ఆ పిండిని తింటాయి; ముగ్గు వేసిన నీవైపు సంతోషంతో చూస్తాయి. ముగ్గు పిండితో ముగ్గు వెయ్యడం వల్ల ఏ జీవికి ఉపయోగం లేదు, తెలిసిందా?” అని అన్నారు.


ఆ అమ్మాయి సరే అన్నట్టు తలాడించి, స్వామివారికి పంచాంగ సంస్కారం చేసింది.


పరమాచార్య స్వామివారి ఈ ఆదేశం కేవలం ఆ అమ్మాయికి మాత్రమేనా లేక అందరు ఆడ పిల్లలకా? ఈ విషయం తల్లులు కాస్త గమనించాలి.


--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

ఆధ్యాత్మిక వేదిక*

 🚩🕉️ *హిందూ ఆధ్యాత్మిక వేదిక*🕉️🚩

=====================


*అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!*


పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.  

 

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.


*పురాణగాథ*

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.


ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.


ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.


చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.  


బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.  


బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

శ్రీవ్యాసభుజంగస్తోత్రం

 శ్రీవ్యాసభుజంగస్తోత్రం 


1) శిష్యకోటివంద్యమానభానుకోటిభాస్వరం 

   వేదవేదాంగభాజ్యబ్రహ్మనిష్ఠాపరం

   సంభ్రమాశ్చర్యజనకచారుధర్మవిగ్రహం  

   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||


2) యోగభాష్యబ్రహ్మసూత్రవిద్యాప్రదాయకం 

   బదరికాక్షేత్రవాసశ్రీబాదరాయణం 

   భాగవతభారతరచనానైపుణ్యం 

   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||




3) శుకశౌనకాదిపూజ్యమృదుపాదపంకజం 

   మన్వంతరాతీతసుఖచిరజీవినం

   అష్టాదశపురాణరచనావైదూష్యం 

   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||


4) ఉపాసనాకర్మజ్ఞానభక్తిమార్గబోధకం 

   సమయదక్షిణాచారదృఢదీక్షాపరం 

   మనోవేగశ్లోకనిర్మాణప్రావీణ్యం   

   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||







5) శివకేశవ స్వరూప పరబ్రహ్మతత్త్వం 

   భస్మత్రిపుండ్రభూషరుద్రాక్షధారిణం 

   అజ్ఞానతిమిరభేద్యప్రజ్ఞానభాస్కరం 

   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||


      సర్వం శ్రీవ్యాసమునీంద్ర దివ్యచరణారవిందార్పణమస్తు

పద్మవ్యూహం

 *‘పద్మవ్యూహం’ రహస్యం ఏంటి?* 


పద్మవ్యూహం శత్రు దుర్భేద్యం. అతిరథ మహారథులకే అంతుపట్టని రహస్యం. లోపలికి వెళ్ళిన కొద్దీ చావును దరికి చేర్చే మృత్యుబిలం. వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని *‘చక్రవ్యూహం’* అని కూడా వ్యవహరిస్తారు. ఏడు వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం.

 *అసలు ఏంటీ పద్మవ్యూహం? దాని గురించి అభిమన్యుడికి ఎలా తెలుసు? కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్ళాడు? ఎందుకు తిరిగి రాలేకపోయాడు?*


*ద్రోణుడికి అవమానం*


భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు నియమితుడయ్యాడు. ఆపై రెండు రోజులు యుద్ధం జరిగినా ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడాడు. దీనికి సిగ్గుపడి ‘నేను ఈరోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను. అది దేవతలు కూడా భేదించలేనిది. మహావీరుడైతే తప్ప దాన్ని భేదించటానికి ప్రయత్నించలేడు’ అని ద్రోణుడు ప్రకటించాడు. అదే పద్మవ్యూహం.


*పద్మవ్యూహం నిర్మాణం ఇలా..*


కౌరవ సేనలను తామరపువ్వు ఆకారంలో నిలిపాడు ద్రోణుడు. వివిధ దేశాధిపతులు తామరపువ్వులోని రేకుల మాదిరి నిలిచారు. వారి కుమారులు పువ్వు మధ్యభాగంలో కేసరిలా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన, వారి మధ్య దుర్యోధనుడూ ససైన్యంగా నిలిచారు. సైంధవుడూ, అశ్వత్థామా, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు, వారి కుమారులూ తమ స్థానాల్లో నిలిచారు. మహా వీరులైన పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించటం సాధ్యం కాలేదు. (ఆ రోజు అర్జునుడిని సంశప్తకులు వ్యూహాత్మకంగా యుద్ధభూమికి దక్షిణంగా తీసుపోయారు) 

లోపలికి వెళ్లడం వారికి మాత్రమే తెలుసు

దిక్కుతోచని పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుడుని పంపక తప్పలేదు. ‘కుమార అభిమన్యా..! ఈ పద్మవ్యూహంలో చొరబడటం నీకూ, నీ తండ్రి అర్జునుడూ, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడుకి మాత్రమే తెలుసు. మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించు’ అని కోరాడు. అభిమన్యుడు సమరోత్సాహంతో ‘నా తండ్రి నాకీ వ్యూహాన్ని ఛేదించే లోపల ప్రవేశించడం వరకూ చెప్పాడు. అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను’ అన్నాడు. ‘ఆ మాత్రం చాలు కుమారా! నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే, నీ వెనువెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం’ అని సంతోషంగా ధర్మరాజు అన్నాడు. పక్కనే ఉన్న భీముడు కూడా ‘కుమారా! నువ్వు వూహ్యాన్ని ఛేదిస్తే చాలు. నీ వెంటనే నేనూ, దృష్టద్యుమ్నుడూ, ద్రుపదుడూ, సాత్యకీ, విరాటుడూ పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రు సేనలను మట్టుపెడతాం’ అని భరోసా ఇచ్చాడు. ‘పద్మవ్యూహం రచించిన ద్రోణుడు మెచ్చుకునేలా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలనం చేస్తాను. అందరూ ప్రశంసించేలా రణరంగంలో వీర విహారం చేస్తాను’ అని సంకల్పం చెప్పిన అభిమన్యుడు అన్నంత పనీ చేశాడు. వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏ మాత్రం జంకలేదు. తన సారథి సుమిత్రుణ్ణి ద్రోణుడి వైపు రథం పోనివ్వమన్నాడు.


*మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి..*

అప్పుడు సుమిత్రుడు అభిమన్యుణ్ని మరోసారి ఆలోచించుకోమంటూ ఇలా హితవు పలికాడు. ‘నువ్వు బాలుడివి. నీ ఎదుట ఉన్నది ద్రోణుని సైన్యం. వారు అతిరథ మహారథులు. అత్యంత క్రూరాత్ములు. నీ చేతిలో మరణించేవారు కాదు’ అని అన్నాడు. సారథి సందేహాలను కొట్టి పారేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి చొచ్చుకుని పోయాడు అభిమన్యుడు. కౌరవ సేనలను కత్తికో కండగా నరకడం మొదలు పెట్టాడు. అతడి ధాటికి కురు సేన కకావికలమైంది. పద్మవ్యూహం చెల్లా చెదురైంది. కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. బాణాల దెబ్బతో మూర్ఛిల్లపోయేలా చేశాడు. శల్యుణ్ణీ, దుశ్యాసనుణ్ణీ కూడా స్పృహ తప్పేలా చేశాడు. మరోవైపు అభిమన్యునికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అప్పుడు వారికి కౌరవుల బావమరిది జయద్రధుడు (సైంధవుడు) అడ్డు తగిలాడు. ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలువరించే వరాన్ని పరమేశ్వరుడి నుంచి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగించింది. మరోవైపు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధనుణ్ణే పారిపోయేలా చేశాడు. అతడి కొడుకైన లక్ష్మణ కుమారుడినీ, కోసల దేశాధీశుడైన బృహద్బలుణ్ణీ సంహరించాడు. యోధులపరంగా వ్యూహపరంగా బలమైన కౌరవ సేనలను ఎదుర్కోవటం కష్టమనే భావనను పటాపంచలు చేశాడు. 


*అందరూ ఒక్కటై.. మోసం చేసి..*


యుద్ధంలో వీర విహారం చేస్తున్నఅభిమన్యుడిని కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెప్పగా, కౌరవ యోధులు యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై ఒక్కుమ్మడిగా దాడి చేశారు. నిరాయుధుణ్ణీ, విరథుణ్ణీ చేశారు. బాణ వర్షం కురపించారు. అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకుని గిరగిరా తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు. అన్ని వైపుల నుంచీ చుట్టు ముట్టి ఆ ఆయుధాన్నీ ముక్కలు చేయగా, గదాయుధంతో పోరు సాగించాడు. అప్పటికే ఒంటరి పోరుతో అలసిపోయాడు. ఇంతలో దుశ్శాసనుని కుమారుడు అతడిని ఎదుర్కొన్నాడు. వారిద్దరికీ ఘోర సమరం జరిగింది. ఇద్దరి శరీరాల నుంచి రక్తం ధారలు కట్టింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు. ముల్లోకాలను వెలిగించే సూర్యుడు అస్తమించినట్లైంది. అడవిని బూడిద చేసిన దావాగ్ని ఆరిపోయింది. మహాసముద్రం ఇంకిపోయింది. విగత జీవుడైనప్పటికీ అభిమన్యుడిపై కౌరవులకు ఇంకా కసి తీరలేదు. వారంతా కలిసి అతడి శరీరాన్ని నిర్దయగా పొడిచి పొడిచి క్రూరంగా వ్యవహరించారు. అభిమన్యుడి మరణవార్త విని దుర్యోధనుడు తెగ సంబరపడిపోయాడట. ఇది చూసిన యుయుత్సుడు దుర్యోధనుడిపై మండిపడుతూ ‘ఏం చూసుకుని ఆనంద పడుతున్నావు. ఒక బాలుడిని, అదీ కుట్ర చేసి చంపడం మీ విజయమా’ అని ప్రశ్నించాడట.

అభిమన్యుడికి ఎలా తెలుసు?

యుద్ధవ్యూహాల్లో ఎంతో ప్రత్యేకత ఉన్న పద్మవ్యూహం పెద్ద రహస్యం, చిక్కుముడిగా ఉండిపోవటానికి కారణం దాన్ని భేదించే నైపుణ్యం కేవలం నలుగురికే తెలిసి ఉండటం. అందులో అర్జునుడు కూడా ఒకడు. పద్మవ్యూహంలో ప్రవేశించటం గురించి అభిమన్యుడి తల్లి, కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా, సుభద్ర ‘ఊ కొడుతూ’ నిద్రపోయింది. అయితే, ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ‘ఊ కొట్టడం’ మొదలు పెట్టాడు. అది గమనించని అర్జునుడు పద్మవ్యూహాంలోకి ఎలా వెళ్లాలో చెప్పేశాడు. ఏడు వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రుదుర్భేద్యమైనది పద్మవ్యూహాన్ని గజ వధ ద్వారా లోపలికి వెళ్లాలని అర్జునుడు రహస్యం చెప్పాడు. అయితే, సుభద్ర నిద్రపోవటం గమనించిన అర్జునుడు చెప్పడం మానేశాడట. 


*ఇతిహాసమైనా ఇప్పటికీ ఎన్నో రూపాల్లో..*

 *ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు ‘పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు’ అంటారు. అదేవిధంగా, ఎవరినైనా తమ తెలివితేటలతో ఆధీనులుగా చేసుకున్నా, ‘నా పద్మవ్యూహంలో చిక్కాడు’ అంటూ సామెతగా వాడతారు. తెలుగులోనూ మహాభారత కథతో తెరకెక్కిన చిత్రాల్లో అభిమన్యుడి వీర, పరాక్రమాలను మనం చూశాం.* *తెలుగులో 1926లో ప్రచురించిన ‘పద్మవ్యూహాము’ అనే నాటక పుస్తకంలో పద్మవ్యూహం చిత్ర రూపంలో కనిపిస్తుంది. దీనిని సోమరాజు రామానుజరావు రాశారు.* *కర్ణాటకలోని హలిబేడు హోయసలేశ్వర* *దేవాలయం(12వ శతాబ్ది)లో అభిమన్యుడు* *పద్మవ్యూహంలో* *అడుగుపెడుతున్న దృశ్యాన్ని శిల్పరూపంలో చెక్కి శాశ్వతత్వం కల్పించారు.* 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నిత్యానందకరీ

 *🔥ఓం శ్రీ మాత్రే నమః🔥*



*నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ|*


*నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ|*


*ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ|*


*భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||*


 *నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను-* *అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు,* *ఘోరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును* *పవిత్రము చేసిన దానవు, కాశీ పట్టణమునకు రాణివి,* *దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము తల్లీ.* *🕉️🔱🌞🌎🏵️🚩

నవరాత్రులు

 దేవీ నవరాత్రులు


🍁🍁🍁🍁


అశ్వనీ నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసం - ఆశ్వయుజ మాసం.. 

కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసం - కార్తీక మాసం. 


ఆశ్వయుజ , కార్తీక మాసములే శరదృతువు. శ్రీదేవి అంటే - ప్రకృతిలోని చైతన్య శక్తి... ప్రకృతి స్వరూపాలనన్నింటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి, ఒకే ఒక చైతన్య 

పరతత్త్వ శక్తి యందు నిలిపితే జన్మ సాఫల్యాన్ని పొందుతాడు. తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవుల యందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి, చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసికొంటే దివ్యానుభూతిని పొందుతాడు.


‘సర్వరోగోపశమనం సర్వోపద్రవ నాశనం

శాన్తిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభమ్


సర్వ రోగములను, సర్వ ఉపద్రవములను పోగొట్టి, సర్వారిష్టాల్ని పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది - నవరాత్రి వ్రతం అని పేర్కొన్నది స్కాంధ పురాణం..


‘నవ’ అంటే తొమ్మిదని, క్రొత్త అని సామాన్యార్థాలు... కానీ, నవ అంటే పరమేశ్వరుడని, ‘రాత్రి’ అంటే పరమేశ్వరి అని నిర్ణయ సింధువు తెలుపుతోంది.


కనుక, నవరాత్రి వ్రతమంటే - పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థము. నవరాత్రి వ్రతమంటే తొమ్మిది రాత్రులు చేయు వ్రతమని చెపుతారు.


 ‘‘సూయతే స్తూయతే ఇతి నవః’’ అనగా నవ శబ్దమునకు స్తుతింపబడుచున్న వాడని అర్థము. పరమాత్మ ‘నవ’ స్వరూపుడు. శబ్ద రూపమైన వేదం - ప్రకృష్టమైన ‘నవ్య స్వరూపం’. అదే ప్రణవ స్వరూపం.

 ‘‘నవో నవో భవతి జాయ మానః’’ పరమాత్మ నిత్య నూతనుడు. అందరి చేత స్తోత్రింప బడుచున్నవాడు. 


శివశక్తులకు భేదం లేదు. అందుకే జగన్మాతకు ‘శివా’ అనే నామం కూడా ఉంది.

జగజ్జనని - ‘రాత్రి’ రూపిణి.. 

పరమేశ్వరుడు - పగలు. జగన్మాత ఆరాధనే- రాత్రి వ్రతం.... రాత్రి దేవియే- మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి వంటి రూప నామములతో పూజింపబడుతోంది. అందుకే మాతకు ‘కాళరాత్రి’ అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి, పగలు తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము తీసికొని తొమ్మిది తిథులు అనగా పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీదేవికి పూజ చేస్తారు.


‘పాడ్యమి’ అంటే ‘బుద్ధి’ అని చెప్పబడింది. మనుష్యుల బుద్ధియే శారదాదేవి... పాడ్యమి నుండి శారదా దేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది.. సర్వ శుభములను చేకూర్చుతుంది. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ‘ఉత్సవం’ అంటారు. ఇది పెద్ద ఉత్సవం - మహోత్సవం... ఇది - దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాల అంతరార్థం.


పసుపు, కుంకుమ, పూలు, పరిమళ సుగంధ ద్రవ్యములు మొదలైన మంగళకరమైన వస్తువుల యందు, ఆవు నేతి యందు ప్రజ్వలిస్తూ ప్రకాశించే ‘జ్యోతి’ స్వరూపం లోనూ, గోమాత యందు, ముత్తయిదువ ల యందు, త్యాగబుద్ధి కలవారి యందు భాసిల్లుతుంది - మంగళగౌరీ దేవి... సర్వ కార్య దిగ్విజయమునకు మంగళగౌరీ పూజ చెప్పబడింది. అందుకే వివాహంలో నూతన వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు.


త్రిపురాసుర సంహారానికి బయలుదేరే ముందు గౌరీదేవిని అర్చించి విజయాన్ని పొందాడు పరమ శివుడు. ‘గౌరీ కల్యాణం వైభోగమే’ అంటూ అనాదిగా పెద్ద ముత్తయిదువలు శుభములు పల్కుతూ కల్యాణ సమయంలో గానం చేయటం మన సంప్రదాయం.


హిమాలయ పర్వత శ్రేణిలో తెల్లని కాంతితో ఆవిర్భవించిన చల్లని తల్లి గౌరీదేవి...

 ‘గౌరీ గిరి రాజ కుమారీ గాన వన మయూరీ గంభీర కౌమారీ...’... అంటూ ‘గౌరీ’ రాగంలో, ముత్తుస్వామి దీక్షితులు గానం చేసిన కీర్తన నవరాత్రి పూజలో మొదటి రోజు అర్చనకు స్ఫూర్తినిస్తుంది.


చలించని మనస్సు, భ్రమించని దృష్టి వలన ఏకాగ్రత సాధ్యమవుతుంది. నిష్కామబుద్ధితో తోటివారికి తోడ్పడుతూ, సమస్త జీవుల పట్ల దయ, ప్రేమ, కరుణలను చూపిస్తూ, విద్యుక్త దర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ, విశ్వ కల్యాణాన్ని కాంక్షిస్తే - ఏకాగ్రత సాధ్యమవుతుంది... అదే ‘ధ్యానం’. 

ధ్యాన యోగాన్ని ప్రసాదించేది - జగన్మాత శరన్నవరాత్రి పూజ.


యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై సమస్తస్యై నమో నమః


ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కున జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం... త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప... ఆ జగన్మాతకు సేవచేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన అద్భుత వరం.


నవరాత్రులలో దేవిని నవ మూర్తులు గానూ, నవశక్తులు గానూ ఆరాధిస్తారు. అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్ధిష్ట నిర్ణయంగా కనిపించదు. వరుస క్రమంలో మార్పులు ఉంటాయి.. తిథి, నక్షత్రాలను బట్టి ఆనాటి రూప విశేషం ఉంటుంది. ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచరాలను బట్టి వేరువేరుగా ఉంటాయి.. .. శృంగేరి పీఠంలో, విజయవాడ కనకదుర్గ దేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, అలాగే తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మూెత్సవాలు జరుగుతుంటాయి..


 కాబట్టి, ఆయా ప్రాంతాల వారీగా అమ్మవారి రూపాలు మారుతుంటాయి...


శ్రీమాత్రే నమః🙏


🍁🍁🍁🍁

శ‌క్తి పీఠాలు

 🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు - 2 🌹


🌴. ప్రదేశాల సంక్షిప్త వివరాలు 🌴

📚. ప్రసాద్ భరద్వాజ 


హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. వాటి వివ‌రాలు మీ కోసం.. 


🌻. 1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.


🌻. 2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.


🌻. 3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.


🌻. 4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.


🌻. 5. జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.


🌻. 6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.


🌻. 7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.


🌻. 8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.


🌻. 9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.


🌻. 10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.


🌻. 11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.


🌻. 12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.


🌻. 13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.


🌻. 14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.


🌻. 15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.


🌻. 16. మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.


🌻. 17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.


🌻. 18. సరస్వతి - జమ్ము, కాశ్మీర్ - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉందంటారు.

🌹 🌹 🌹 🌹 🌹

జ్ఞానోదయం

 *సున్నితస్తులకు జ్ఞానోదయం*

🎊💦🌹🦚🦜💦🎊


 *👌ఓరోజు బుద్ధ భగవానుడు బిక్షాటన చేస్తున్నాడు* 


   ఓ ఇంటావిడ కోపంగా బయటకు వచ్చి బుద్ధున్ని చూసి "దుక్కలా వున్నావు, పనీ చేసుకుని బతకొచ్చుగా... అడుక్కోకపోతే


నీవు సోమరి కాక నీ శిష్యులని అలానే చేస్తున్నావు,తిట్ట సాగింది.


బుద్ధ భగవానుడు చిరునవ్వుతో విన సాగారు.


ఆమె బుద్దున్ని తిట్టే తిట్లను విని శిష్యులు కోపంతో ఊగుతున్నారు.

బుద్దుడు వారిని వారించారు.. 


తరువాత బుద్దుడు ఆమెతో మాతా! 

చిన్న సంశయం,అడగమంటావా ?


అడుక్కో...

నీ సంశయం తీరుస్తాలే అంది. 


  బుద్దుడు తన చేతిలోని బిక్షాపాత్రను చూపుతూ ..తల్లీ! 


నేను నీకు ఓ వస్తువును ఇస్తే, నీవు ఆ వస్తువు ను తిరస్కరిస్తే ఆ వస్తువు ఎవరికి చెందుతుంది? 


నేను తీసుకోకుండా తిరస్కరించాను కాబట్టి ఆ వస్తువు నీకే చెందుతుంది.. అంది


అయితే... తల్లీ! 

 "నేను నీ తిట్లను స్వీకరించడం లేదు "

అంటే నీవు తిట్టిన తిట్లన్నీ నీకే చెందుతాయి ......అన్నారు.

 

ఈ సంఘటన తో బుద్దుడు 

మనకు గోప్ప బోధను చేసారు


అలా మనల్ని కించపరిచి వేళాకోళం చేసేవారు మనచుట్టూ చాలామందే ఉంటారు, 


కొంతమంది బహిరంగంగా, మరి కొందరు చాటుగా మనల్ని విమర్శిస్తుంటారు.


వాటిని మనం పట్టించుకోనంత కాలం నీదారి సుగమనమే..


ఎప్పుడైతే పట్టించుకుంటావో ఆ క్షణమే నీ పతనానికి పునాది రాయి పడ్డట్టు.


*పదిమంది నీ గురించి విమర్శించుకుంటున్నారంటే నీ ఎదుగుదల మెుదలైనట్టే.*👍


    🎊💦🦚🌹🦜💦🎊

శరన్నవరాత్రులు

 *శరన్నవరాత్రులు*



*దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. అందుకు నిదర్శనంగా ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులు జరుపుకుంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం సంప్రదాయం.*


 *అమ్మవారి వివిధ రూపాలు...*


*1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి - శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి*


*2వ రోజు - ఆశ్వయుజ విదియ - శ్రీ బాలా త్రిపురసుందరీదేవి*


*3వ రోజు - ఆశ్వయుజ తదియ - శ్రీ గాయత్రి దేవి*


*4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి*


*5వ రోజు - ఆశ్వయుజ పంచమి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి - లలిత పంచమి*


*6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి*


*7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి*


*8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి*


*9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి*


*10వ రోజు - ఆశ్వయుజ దశమి - శ్రీ రాజరాజేశ్వరి - విజయదశమి*

దేవాలయల విశేషాలు

 🌺 *ఆశ్ఛర్య పరచే మన దేవాలయల విశేషాలు* 🌺



 *సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయo** 

 *హాసంబా దేవాలయం* , *హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.* 



*నీటితో దీపం వెలిగించే దేవాలయం* 


 *మధ్యప్రదేశ్. ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇకనుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.* 


 *స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం* 


 *1. కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.* 

 *2. బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.* 


*12 ఏళ్లకు ఒకసారి*

 **పిడుగుపడే తిరిగి అతుక్కునే*దేవాలయం*


 *బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.* 



*సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:* 

 *1. నాగలాపురం వేదనారాయణ స్వామి* *దేవస్థానం.* 

 *2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.* 

 *3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.* 

 *4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం* . 

 *5. మొగిలీశ్వర్.* 

 *6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.* 


*నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:* 

 *1. మహానంది* 

 *2. జంబుకేశ్వర్* 

 *3. బుగ్గరామలింగేశ్వర్* 

 *4. కర్ణాటక కమండల గణపతి.* 

 *5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.* 

 *6. బెంగళూర్ మల్లేశ్వర్* 

 *7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం* 

 *8. సిద్ధగంగా* 


*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 

 *1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.* 

 *2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్.*  

 *3. మంజునాథ్.* 


*శ్వాస తీసుకునే* 

 *కాళహస్తీశ్వర్* 



*సముద్రమే వెనక్కివెళ్లే* 

 *1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్.* 

2. *40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.* 


*స్త్రీవలె నెలసరి* అయ్యే 

 *1. అస్సాం కామాఖ్యా* *అమ్మవారు,*  

 *2. కేరళ దుర్గామాత.* 


*రంగులు మారే ఆలయం.* 

1. *ఉత్తరాయణం,* *దక్షిణాయనంలో రంగులు* *మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.* 

2. *పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.* 

 *పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.* 


*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 

 *1. కాణిపాకం,*  

 *2. యాగంటి బసవన్న,*  

 *3. కాశీ తిలభండేశ్వర్,*  

 *4. బెంగుళూరు బసవేశ్వర్* 

 *5. బిక్కవోలు లక్ష్మీగణపతి* 


*స్వయంభువుగా* 

 *సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.* 

*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 

 *1. బదరీనాథ్,*  

 *2. కేదారనాథ్* ( *ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది* )

 *3. గుహ్యకాళీమందిరం.* 


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 

 *హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.* 



*ఒంటి స్తంభంతో*

 *యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.* 


*రూపాలు మారే*


 *ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.* 




*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 

 *1. హేమాచల నరసింహ స్వామి.* 

 *2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి* 


*మనిషి వలె గుటకలు*  

 *వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.* 


*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 


*ఛాయా విశేషం* 

 *1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.* 

 *2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.* 

 *3. బృహదీశ్వరాలయం* 


*నీటిలో తేలే*

 *విష్ణువు (టన్నుల బరువుంటుంది ), నేపాల్* 


*ఇంకా...* 

 **తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వర్, కంచి,* 

 *చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం etc* 


*పూరీ* 

 *పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడపడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే పూరి ప్రసాదం.* 


 *ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత*


 *దేవాలయాలు మాత్రమే* . *ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి నమ్మండి దేవుడు నడయాడే నేల ఇది.🕉🌺🙏🙏*

ప్రహ్లాద

 *\!/ ఓం నమో వెంకటేశాయః.\!/* 

 **_అందరికీ శుభోదయం...**_ 

         *నారసింహ విజయము* 

+++++++++++++++++++++

                 శ్రీ ప్రహ్లాద భక్తి    

************************

179శ్లోకము   

**************************

" పంచాననోద్ధూత పావకజ్వాలలు;

భూనభోంతరమెల్లఁ బూరితముగ;

దంష్ట్రాంకురాభీల ధగధగాయితదీప్తి;

నసురేంద్రు నేత్రము లంధములుగఁ;

గంటకసన్నిభోత్కట కేసరాహతి;

నభ్రసంఘము భిన్నమై చలింపఁ;

బ్రళయాభ్రచంచలాప్రతిమ భాస్వరములై;

ఖరనఖరోచులు గ్రమ్ముదేర;"


 *భావము* : “ ఉగ్ర నరసింహస్వామి యొక్క సింహముఖం నుండి జనించిన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలలో వెలువడిన అగ్నిజ్వాలలతో భూమ్యాకాశాలు నిండిపోయాయి. ఆయన కోరల ధగ ధగ కాంతులు హిరణ్యకశిప రాక్షసుని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అంధుణ్ణి చేశాయి. ముళ్ళల్లా ఉన్న ఆయన కేసరాల విదలింపులకు ఆకాశంలోని మేఘపంక్తులు చెల్లాచెదరైపోయాయి. ఆ నరహరి కాలిగోరుల నుండి వెలువడే తీక్షణములైన కాంతులు, ప్రళయకాలపు మేఘాలలోని మెరుపు తీగలలా మెరుస్తున్నాయి.”


+++++++++++++++++++++

 *విష్ణుసహస్రం* .... అర్థం, పరమార్థం.

+++++++++++++++++++++

582) శాంత: - శాంతి స్వరూపుడు.

+++++++++++++++++++++

 *ఈ ఉదయం శ్రీహరి కీర్తన* 

+++++++++++++++++++++

" ఎంతని పొగడెదమమ్మా "

+++++++++++++++++++++

తులసీ

 : *శ్రీ తులసీ మాహాత్మ్యమ్*

(తులసి కోయునపుడు అనుసంధానము చేయదగిన శ్లోకము)


*తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవ ప్రియే!*

*కేశవార్థం లునామి త్వాం వరదాభవ! శోభనే!*


శుభాలను ఇచ్చే ఓ తులసీ! నీవు పరమాత్మకు ఎప్పుడును చాలా ఇష్టమైన దానవు. నీవు అమృత జన్మవు. అందువలన నిన్ను కేశవార్చనకై తుంచుచున్నాను శుభాలను ఇవ్వమ్మా!.


*శ్రీకృష్ణార్పణమస్తు*

[: _*

శ్రీ దేవి భాగవతం - 62 వ అధ్యాయము*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*వ్యాసమునిచంద్రు డిట్లనియె :* ఈ ప్రకారముగ రామలక్ష్మణులు విచారించి మౌనముగ నుండిరి. అంతలో గగన సీమనుండి నారద భగవాను డేతెంచెను. ఆ మహర్షి షడ్జాది స్వరములతో నొప్పారు మహతీ వీణను మీటుచు బృహద్రథ సామగానము సేయుచు రాముని సమీపించెను. తేజశ్శాలి యగు రాము డతనిని వీక్షించి యతనికి శుభాసనము నర్ఘ్యపాద్యములు నొసంగి పరమపూజ లాచరించి యంజలి ఘటించి యతని యనుమతితో నతని సన్నిధి నుపవిష్టు డయ్యెను. రాముడు తన తమ్మునితో గూడి మదిలో గుందుచు దిగులుతో గూరుచున్న శ్రీరాముని మహర్షి కుశల మడిగెను: ఓ రాఘవేంద్రా! ఒక ప్రాకృత నరుని పగిది శోకింతు వేల? క్రూరుడు రావణుడు సీతను హరించుట నే నెఱుంగుదును. అతడు తన చావు తా నెఱుగలేక మోహవశమున సీత నపహరించెను. ఇదంతయును నేను సురలోక మందుండియే వింటిని. ఓ కాకుత్థ్సా! నరాధిపా! నీవు రావణ వినాశమునకే యవతరించితివి. అందులకే యతడు సీత నపహరించెను. పూర్వజన్మమున సీత యొక ముని కుమారిగ జన్మించెను. ఆమె వనములందు ఘోర తప మొనరించుచు రావణుని కంటబడెను. అత డామెను తనకు భార్యగ గమ్మని వేడుకొనెను. కాని, యామె యతనిని తిరస్కరించెను. అత డామె కేశపాశములు బట్టి బలిమితో లాగెను. ఓ రామా! ఆ దుష్టాత్ముని స్పర్శము చేత తన శరీరము కళంకితమైనదని యెంచి యామె తన తనువు చాలింపదలచెను. ఆమె వెంటనే కోపమునంఓరీ దురాత్మా! నేను నీ వినాశమునకై భూమిపై నయోనిజగ సంభవింపగలను'' అని శపించి యామె తన మేను చాలించెను.


ఆ యీ సీత లక్ష్మ్యంశ సంభూతురాలు. నాగుపామును పూలమాల యను భ్రాంతితో బట్టినట్లుగ నతడు తన కులనాశనమునకు సీత నపహరించెను. ఓ సుజన మనోనయనాభిరామా! రామా! అతని సర్వనాశమునకే నీవును సంభవించితివి. ఎల్లదేవతలును ప్రార్థింపగా జన్మములేని నీవు నారాయణాంశమున నజుని వంశమునందు అవతరించింతివి. మహాబాహూ! ధైర్యము వహింపుము. అచ్చట సీతయును ధర్మరతయు సతియునై అవశయై రేయింబవళ్ళు నిన్నే తన మదిలో ధ్యానించుచు నున్నది. దేవేంద్రుడు స్వయముగ నొక పాత్రలో నమృత మధురములైన కామధేనువు పాలు పోసి త్రాగుట కామె కంపించెను. ఆ దివ్య గోక్షీరము త్రాగుటచే నా కమలదళనయన యాకలి దప్పులు పాసి సుఖ ముండెను. ఇదంతయును నేను గంటిని. రాఘవా! రావణుడు చచ్చుటకు నీకొక వ్రతము దెల్పుదును. అదేమన, నీ వాశ్వయుజ మాసమున శ్రద్ధతో శ్రీదేవీ నవరాత్ర వత్ర మాచరింపుము. రామా! నవరాత్రములం దుపవసింపుము. దేవిని జపహోమాది విధులతో బూజింపుము. నీకు సర్వసిద్ధులు కరతలామలకము లగును. దేవికి యాగ పశువును బలి యొసంగుము. జపదశాంశము వేల్చుము. దీనివలన నీ వధిక శక్తిమంతుడవు గాగలవు. పూర్వము శ్రీ మహావిష్ణువు శివుడు బ్రహ్మ సురలోకమందలి యింద్రుడును యథావిధిగ నీ దేవీ నవరాత్ర వ్రతము జరిపిరి. నీలమేఘశ్యామా! రామా! ఈ నవరాత్ర వ్రతమును సుఖములు బొందువారు సేయవలయును. కష్టములలో బాధపడువారు చేయుట మరింత యవసరము. తొల్లి వసిష్ఠుడు భృగువు కశ్యపుడు విశ్వామిత్రుడు నీ దేవీ నవరాత్ర వ్రతము సల్పి సుఃంచి రనుటలో లేశమయినను సందియము లేదు. మునుపు బృహస్పతి భార్య యపహరింపబడెను. అపు డత డీ దేవీ నవరాత్ర వ్రత మాచరించెను. నీవును రావణ వధార్థము దీని నాచరింపుము. మున్ను దేవపతి వృత్ర సంహారమునకును శివుడు త్రిపుర వినాశమునకును ఈ దేవీ నవరాత్ర వ్రత మాచరించిరి.



సీతాపతి! మహామతీ! శ్రీహరి తొలిసారిగ మధు సంహారమునకు మేరుగిరిపై శ్రీదేవీ మహావ్రతము యథావిధిగ నప్రమత్తతతో నొనరించెను. రామభద్రుడిట్లనియెను : ఓ దయానిధీ! సర్వజ్ఞా! ఆ మహాదేవి యెవరు? ఆమె పేరేమి? ఆమె యెట్లు ప్రాదుర్భవించెను? ఆమె ప్రభావ మెట్టిది? ఆ దేవీ వ్రతమేది? నా కంతయు యథావిధి నెఱిగింపుము. నారదు డిట్లనియెను. ఓ రామా! శ్రద్ధగ నాలింపుము. ఆ దేవి నిత్య - సనాతని - ఆద్యశక్తి- విశ్వపూజిత-సర్వదుఃఖనాశని - అభీష్ట ప్రదాయిని. గడ్డిపోచ మొదలుకొని బ్రహ్మవఱకు గల సకల జంతువుల కామె కారణభూతురాలు. ఆమె చేతనశక్తి తోడులేనిచో నెవడును కదలనైన నోపడు. బ్రహ్మలోని పుట్టించు శక్తియు విష్ణు నందలి పాలనశక్తియు రుద్రుని యందలి సంహారశక్తియు నివన్నియు నా మహాశక్తి యొక్క ప్రతిరూపములే. ఆ మహాశక్తియే పరాశివశక్తి యన చెలువు మీరును. ఈ రేడు లోకాలలో సదసదాత్మక రూపమున భాసిల్లు ప్రతి చిన్న వస్తువులోని శక్తియు నా పరాచైతన్య మహాశక్తి నుండియే కలుగుచున్నది. ఈ సకల సృష్టికి పూర్వము హరిహరబ్రహ్మలు సూర్యుడు సురపతి భూమి గిరులు మొదలగు దేవతలు ఎవరును - ఏమియు నుండలేదు. అట్టి సమయమున ఆ పరమ ప్రకృతి శక్తి పరమపురుషునితోడి పరమ బ్రహ్మానంద సంగమమున పరిపూర్ణయై నిర్గుణ శివ స్వరూపమున విలసిల్లెను. సృష్టి ప్రారంభమున నా ప్రకృతి మహాశక్తి సగుణ రూపము దాల్చును. ఆ శక్తి యీ భువనత్రయమును సృజించును. బ్రహ్మాదులను పుట్టించి, వారిని సర్వశక్తి సంపన్నులను జేయుము. ఆ యెల్ల లోకముల నేలెడి తల్లి - మహావిద్య - వేదాద్య - వేదకారిణి - యని యెఱిగినవాడు జన్మమరణ సంసార సాగర బంధనముల నుండి విముక్తు డగును. ఆ మహాదేవి యొక్క గుణకర్మ విభాగములు బట్టి బ్రహ్మాదు లామెకు పెక్కు నామము లుంచిరి. ఆ దేవీ నామము లనంతములు. అకారాది క్షకారాంతములగు స్వర వర్ణఘటనలతో నా దేవీ సుధామధుర నామములు శతసహస్రాధికములు గలవు.



అనగా రాముడిట్లనియెను: ఓ దేవర్షీ! నా కా దేవీ వ్రత విధానము సంక్షేమముగ దెల్పుము. నే నిపుడే శ్రద్ధా భక్తులతో దేవీ వ్రత మాచరింతును. అన నారదుడిట్లనియెను. ఓ రామభద్రా! ఒక సమతల ప్రదేశమున నొక పీఠమేర్పరచవలయును. దానిపై జగదంబికను స్థాపించవలయును. ఉపవసించి యథావిధిగ దేవీ నవరాత్ర వ్రత మాచరింప వలయును. ఈ దేవీ శుభవ్రత మహోత్సవమునం దాచార్యుడుగ నేనే యుందును. నాకు దేవీ కార్య నిర్వహణమున నమితోత్సాహము గల్గుచుండును.''



వ్యాసుడిట్లనియెను: ముని పలుకులు విని అవి లోన గట్టిగ నమ్మి మహావీరుడగు రాము డొక యున్నతమైన పీఠము చేయించెను. దానిపై నంబికను ప్రతిష్ఠించెను. రాము డా గిరిపై నుండగనే యంతలో నాశ్వయుజ మాసము సమీపించెను. శ్రీరాముడు యథావిధిగ దేవీ నవరాత్ర పూజ లోనరించెను. రాము డుపవాసముతో నుత్తమ దేవీ వ్రత మాచరించెను. యథా విధిగ పూజా హోమ బలి విధానము లొనరించెను. ఆ యిరువు రన్నదమ్ములును నారదానుమతముతో దేవీ వ్రతము సలిపిరి. అష్టమినాడు నడిరేయి శ్రీ భగవతీదేవి వారి భక్తిభావమునకు సుప్రసన్నయై సింహాసనాసీనయై గిరిశిఖర మందుండి వారికి దర్శన భాగ్య మొసంగి మేఘగంభీర నాదమున సానుజుడగు రామున కిట్లనియెను:


రామా! రామా! ఓ మహాబాహూ! నీ వొనరించిన వ్రతమునకు సంతుష్టి జెందితిని. నీ మన మందలి యేదేని వరము గోరుకొనుము. నీవు నారాయణాంశ సంభూతుడవు. పావన మను వంశ పంజాతుడవు. అమరులు నిన్ను రావణ వధార్థము ప్రార్థించిరి. మున్ను నీవు మత్స్యరూపము దాల్చి క్రూర దనుజుని హతమార్చితివి. దేవతల మేలు గోరి వేదములను గాపాడితివి. కూర్మ రూపము దాల్చి మందరగిరి నెత్తితివి. పాలసంద్రము మధించునపుడు విబుధులకు సంతసము గల్గించితివి. వరాహావతార మెత్తి కొనకోఱలపై భూమిని ధరించితివి. హిరణ్యాక్షుని వధించితివి. భీకర నరసింహావతారము ధరించి హిరణ్యకశిపుని పరిమార్చితివి. రామా! భాగవతోత్తముడగు ప్రహ్లాదుని గాచితివి. వామన రూపమున బలి గర్వ మడగించితివి. దేవకార్యము నిమిత్త మింద్రునకు సోదరుడ వైతివి. విష్ణువంశమున జమదగ్నికి తనయుడవై యుద్భవించితివి. క్షత్రియుల నెల్ల సంహరించితివి. బ్రాహ్మణులకు భూమి నంతయును దాన మొసంగితివి. ఓ కాకుత్థ్సా! అట్టి నీవే యిపుడు దశరథుని నందనుడవై యవతరించితివి. రావణ పీడితులైన దేవత లెల్లరును నిన్ను శరణు వేడిరి. ఇచటి కపివీరులు దేవాంశజులు. మహాబలవంతులు. వీరు నీకు సాయ మొనరింపగలరు.


నీ యీ రూపములన్నియును నా మహాశక్తితో సంపన్నములై సంభవించినవి. లక్ష్మణుడు శేషు నంశమున నుద్భవించెను. అతడు రావణుని కుమారుని పరిమార్చగలడు. నా మాటలందు నీ కెంతమాత్రమును సందేహము వలదు. ఇదే విధముగ నీవు వసంత నవరాత్రములను జరిపి శ్రద్ధతో దేవీపూజ లొనరింపుచుండవలయును. నీవా పాపాత్ము డగు రావణాసురుని దునుమాడి భూమిపై పదునొక్కండు వేలేండ్లు సుఖశాంతులతో రామరాజ్యము నెలకొల్పుదువు. ఆ పిదప నీవు స్వర్గలోక మేగుదువు అని యీ విధముగ దేవి పలికి యంతర్ధాన మొందెను. శ్రీరాముడు సంతుష్టాంతరంగు డయ్యెను. శ్రీరాము డీ విధముగ శ్రీ మద్దేవీ నవరాత్ర వ్రతము పరిసమాప్తము గావించి దశమినాడు విజయా (దశమీ) పూజ లొనరించి అనేక దాన ధర్మము లొనరించెను. జైత్రయాత్ర సాగించెను. ఆ రణశూరుడు కోదండ రాముడు నగు రాముడు కపిపతి యగు సుగ్రీవ బలము సాయముతో లక్ష్మణుని గూడి పరమశక్తి ప్రేరితుడై పూర్ణకాముడై సముద్రముపై సేతువు గట్టెను. సురవైరి యగు రావణు నంతమొందించెను. సుగుణకీర్తిధాముడై స్థిరముగ విలసిల్లెను. ఏ పుణ్యాత్ముడు డీ యుత్తమోత్తమమైన దేవీ చరిత్ర మాకర్ణించునో యతడు విపుల భోగములంది పిదప పరమసౌఖ్యము లనుభవించును. ఎన్నెన్నో పురాణములు విపులములు గలవు. కాని యవన్నియు శ్రీ మద్దేవీ భాగవతముతో సరిపోలజాలవనియు నా దృఢ విశ్వాసము అని వ్యాసముని జనమేజయునితో పలికెను.



*ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమందు ముప్పదవ యధ్యాయము.*



*ఇట్లు శ్రీ దేవీభాగవతమందలి తృతీయస్కంధమున 1746 శ్లోకములను శ్రీ వ్యాస మహర్షి రచించెను.*


*శ్రీ దేవీ భాగవత తృతీయ స్కంధము సమాప్తము.*


*రేపటి నుండి చతుర్థ స్కంథము ప్రారంభం*

గొలుసుకట్టు చెరువుల హైదరాబాద్

 180కి పైగా గొలుసుకట్టు చెరువుల హైదరాబాద్


ఇంటర్నెట్లో దొరికిన సమాచారం మేరకు కొన్ని చెరువుల లిస్ట్. 


ఒక్క హైదరాబాద్ లో ఇన్ని చెరువులా అని ఆశ్చర్యపోతారేమో గానీ అదే నిజం. హుస్సేన్, ఉస్మాన్, హిమయత్ సాగర్లతో పాటూ 

మంత్రాల చెరువు, 

కొత్త చెరువు, 

ఐడీపీఎల్ చెరువు, 

హస్మత్‌పుర చెరువు, 

బాలాజీనగర్ చెరువు, 

కౌకూర్ చెరువు, 

సూరారం చెరువు, 

లింగంచెరువు, 

వెన్నెలగడ్డ చెరువు, 

ప్రగతినగర్ చెరువు, 

కాప్రా చెరువు, 

కీసర చెరువు, 

పూడురు చెరువు, 

ఎల్లమ్మపేట చెరువు, 

మేకంపూర్ చెరువు, 

నల్లచెరువు, 

పల్లె చెరువు, 

దుర్గం చెరువు, 

రామంతపూర్ చెరువు, 

సఫీల్ గూడ చెరువు, 

అల్వాల్ చెరువు, 

సరూర్ నగర్ చెరువు, 

అమీనాపూర్ చెరువు,

జీడిమెట్ల చెరువు,

బంజారా చెరువు (బంజారాహిల్స్)

షామీర్ పేట్ చెరువు

నారాయణరెడ్డి కత్వా, 

బాచారం కత్వా, 

హీరా కత్వా, 

రాయిన్‌చెరువు, 

మాలోనికుంట, 

అంట్ల మాసమ్మకుంట,

మైసమ్మ చెరువు, 

పెద్ద చెక్‌ డ్యాం, 

మెట్టు కత్వా, 

బుంగ కత్వా, 

బూబాగడ్డ చెక్‌ డ్యాం, 

ఎర్రబండ చెక్‌డ్యాం, 

బంధంకుంట, 

బైరాంఖాన్‌ చెరువు, 

ఈదులచెరువు, 

దిల్‌వార్‌ఖాన్‌ చెరువు, 

పోల్కమ్మ చెరువు, 

అంతాయపల్లి చెరువు, 

కుంట్లూర్‌ చెరువు, 

కంబాలకుంట, 

మాసబ్‌ చెరువు,

వడ్లకుంట, 

కొత్త చెరువు, 

బందకుంట, 

అమీర్‌పేట, 

యూసుఫ్‌గూడ చెరువు, 

శ్యామలకుంట సనత్‌నగర్‌, 

మైసమ్మకుంట, 

చాపల చెరువు


ఇవే గాక 

తుమ్మల కుంట, చింతలకుంట, పుప్పలకుంట, కూర్మ చెరువు, కుత్బుల్లాపూర్‌ చెరువు, కోమ కుంట, కోమార్‌కుంట, గొల్లవాని కుంట, భజన్‌సాహికుంట, బొంగలకుంట, షాన్‌ కీసమున కుంట, హెచ్‌ఎంటి కాలనీ చెరువు, క్వారీ కుంట, క్యామ్‌లాల్‌ లే అవుట్‌ చెరు వు, బండకుంట, సుదర్శన్‌ చెరువు, అంజయ్య చెరువులు పూర్తిగా కనిపించకుండా పోయాయి.


ఇప్పుడు నగరం నీళ్లు రోడ్లపై పారుతోంది. ఇళ్లలోకి వస్తుంది అనేవాళ్ళు గమనించాల్సింది నగరమే చెరువులోకి చొచ్చుకొని పోయిందని. డ్రైనేజీలో పాడేసిన బాటిళ్లను చూపించి వరదలకు కారణం, మన బాధ్యాతారాహిత్యం అనేవాళ్ళూ కూడా ఇదే గుర్తించుకోవాలి. చెరువులను ఆక్రమించిన కట్టిన కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిన వారిదే నేరమంతా. అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసిన పాలకులదే పాపమంతా.


నగరంలో మంచి నీటి చెరువులు (హుస్సేన్ సాగర్ తో సహా) మురికికూపాలు అవుతు ఉన్నాయి.

మహనీయుల మాట

 మహనీయుల మాట🕉️


నువ్వు ఎలా ఉన్నావనేది ముఖ్యంకాదు.

నీ ధ్యేయం గొప్పగా ఉండేలా చూసుకో.

మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ,

మనిషి కనపడాల్సిన పని లేదు.


🌷నేటి మంచి మాట🌷


ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు,

మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజ రూపం.!

నీతో మాట్లాడటం మానేసిన ప్రతి ఒక్కరూ,

నీ గురించి మాట్లాడటం మొదలుపెడతారు..!

మీ బలహీనతను ప్రపంచానికి ఎప్పుడూ చూపించవద్దు,

ఎందుకంటే దానితో ఆడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు*


🌸🌸🌸🌸🌸🌸🌸🌸

బతుకమ్మ పండుగ

 బతుకమ్మ పండుగా ఎలా మొదలైందో తెలుసా..?*



🌹🌹🌺🌻🌼🌸🌼🌻🌺🌹


ఈ రోజుతో తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ మొదలు కానుంది. ఒక మనిషికి, పకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదియ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి సేదతీరేవాడు…. కానీ ఈ బిజీ జీవితాలలో మనుషులతోనే కలువలేకపోతున్న మనిషి ఇక పకృతితో ఎలా కలుస్తాడు. బతుకమ్మ పండగకి మాత్రం కచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి పకృతితో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ యొక్క గొప్పతనం.


ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నది:


ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదలు కారాదనీ, కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.


ఈ పండుగను తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలతో బతుకమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ.


తొమ్మిది రూపాల బతుకమ్మల పేర్లు:


1. ఎంగిలిపూల బతుకమ్మ

2. అటుకుల బతుకమ్మ

3. ముద్దపప్పు బతుకమ్మ

4. నాన బియ్యం బతుకమ్మ

5. అట్ల బతుకమ్మ

6.అలిగిన బతుకమ్మ

7. వేపకాయల బతుకమ్మ

8. వెన్నముద్దల బతుకమ్మ

9. సద్దుల బతుకమ్మ (చివరిరోజు)


*ఎంగిలి పువ్వుల బతుకమ్మ:* 


బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. అలా ఎందుకంటారు అంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటి వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలాంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు, ఇచ్చుకుంటారు.


*అటుకుల బతుకమ్మ:*


రెండవ రోజునాడు ఉదయానే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో వేస్తారు.

రెండవ రోజు అటుకులు వాయనంగా పెడుతారు.


*ముద్దపప్పు బతుకమ్మ:*


మూడవ రోజు బతుకమ్మను మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో అలంకరించి తామర పాత్రలలో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరం పై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గరో లేక నాలుగు బాటలు కాడ అందరూ కలసి ఆడవారు ఆడుకొని చెరువులో వేసి వస్తారు.

మూడవ రోజు వాయనంగా సత్తుపిండి,పేసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడుతారు.


*నానబియ్యం బతుకమ్మ:*


నాలుగవ రోజు నానబియ్యం ఫలహారంగా పెడుతారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు.వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.


*అట్ల బతుకమ్మ:


ఈ ఐదవ రోజు తంగేడు, గునుగు,చామంతి,మందార, గుమ్మడి పూలను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడుతారు.

ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడుతారు.


*అలిగిన బతుకమ్మ:*


ఈ రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను అలంకరించారు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్దా తగలడంతో అపచారం జరిగిందని ఆరవ రోజు బతుకమ్మను ఆడరు.


*వేపకాయల బతుకమ్మ:*


ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతారాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు.

ఈ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు.


*వెన్న ముద్దలా బతుకమ్మ:*


ఎనిమిదవ రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆట,పాటల మధ్య చెరువులో వేస్తారు.

ఈ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.


*సద్దుల బతుకమ్మ:*


ఇదే చివరి పండుగా రోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు ఆడవారు చాలా ఉత్సాహంగా ఆడుతారు, పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను వేసిన తరవాత గౌరమ్మను పూజించి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు.


చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్న వారి సొంత ఊరికి చేరుకొని ఆడపిల్లలు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో వదులుతారు.


పాజిటివ్ ఎనర్జీ

 💦 *పాజిటివ్ ఎనర్జీ ఎలా పెంచుకోవాలి* 💦


👉 మన తల్లి తండ్రులు ,గురువుల ఆశీర్వాదం తీసుకోవడం వలన...


👉 కష్టాల్లో ఉన్న వాళ్లకు తోచిన సహాయం చేయడం వల్ల


👉 ఎల్లప్పుడూ మంచిగా ఆలోచించడం వలన


👉 మన వల్ల ఇతరులు సంతోష పడినప్పుడు


👉 మొక్కలకు నీళ్ళు పోసినప్పుడు


👉 పుణ్య క్షేత్రాల ను దర్శించడం వల్ల


👉 స్వార్థం, అసూయ,కోపం, ద్వేషం లేనపుడు మనలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.


👉 అన్నదానం చేయడం వల్ల


👉 ఇతరుల మంచి కోరుకోవడం వలన మన యొక్క పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరుగుతుంది.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

మహాభారతము ' ...52 .

 మహాభారతము ' ...52 . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం..


ద్యూతక్రీడా భవనం లోకి పాండవులు ప్రవేశించారు. అక్కడకు విచ్చేసిన వారందరినీ ఆదరంగా పలుకరించి, పెద్దలకు నమస్కరించి, తమకు కేటాయించిన ఆసనాలలో కూర్చున్నారు.  


కౌరవుల ప్రతినిధిగా శకుని, ధర్మరాజును పలుకరించి, ' ద్యూతక్రీడను మొదలు పెడదామా ? ' అని అడిగాడు. చివరి ప్రయత్నంగా ధర్మరాజు శకునితో, ' శకుని మామా ! మనకు వినోదం కావాలంటే, ఆడడానికి అనేకక్రీడలు వున్నాయి. ఈద్యూతక్రీడ ఆడాలనే ఆలోచన యెవరికివచ్చింది ? దీనిలో క్షత్రియ పరాక్రమంచూపించే అంశం యేమీలేదే ! పైగా కుటిలమైన ఆలోచనలు చేసి గెలవడానికి యీ క్రీడలో యెంతో ఆస్కారముంది. మీరు చూపించుతున్న వుత్సాహం చూస్తుంటే, మీరేదో కుటిలమైన ఆలోచనతో మమ్ములను ద్యూతక్రీడకు ఆహ్వానించినట్లుగా అనిపిస్తున్నది. ఇప్ప టికైనా మించిపోయినది యేమీలేదు. మరియొకసారి పెద్దలందరూ ఆలోచించవలసినదిగా మా మాటగా చెప్పండి.' అని శకునితో ధర్మరాజు నిర్మొహమాటంగా చెప్పాడు.  


ధర్మజుని మాటలకు శకుని త్వరితంగా అడ్డుపడ్డాడు. ఈమాటలు భీష్మాది పెద్దలు వింటే, అసలుకే మోసం వస్తుందని, ధర్మజునితో ' యుధిష్ఠరా ! జూదం అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడి సాగే ఆట. ఇరు పక్షాలకీ సమమైన భయాందోళనలు వుంటాయి,గెలుపు విషయమై. కాబట్టి సందేహించకు. ' అన్నాడు. ' మేము న్యాయంగా సంపాదించినా సంపదను మీరు అన్యాయంగా మానుండి గెలిచి, మీ విందులు, వినోదాలకు, మీ భోగలాలసకు వినియోగించుదామని చూస్తున్నారు. ' అన్నాడు ధర్మరాజు.


అయితే అందుకు యేమాత్రం తగ్గకుండా శకుని, ' మీకు ద్యూతక్రీడా నైపుణ్యము, తెగువ, దైవం పై నమ్మకం వుంటే యీ క్రీడ ఆడడానికి మీనమేషాలు లెక్కపెట్టరు. మీకు మాపై అనుమానం వుంటే, మీకు నైపుణ్యం లేదని ఒప్పుకుని, ధృతరాష్ట్రుని అనుమతితో మీరు శీఘ్రమే వెళ్లిపోవచ్చును, యెప్పుడు కావాలంటే అప్పుడు, ఆటమధ్యలో. అంతేకాని, మాపై అనవసర నిందారోపణలుచేయడం వుచితంకాదు.' అని కుటిలమైన నవ్వుతో ధర్మజుని రెచ్చగొట్టాడు శకుని.  


' శకునీ ! ఆహ్వానంపై వచ్చి తిరిగివెళ్ళే ప్రసక్తే లేదు. కానిమ్ము. విధి బలీయమైనది. దుర్యోధనా ! ఆట మొదలుపెట్టు. ' అన్నాడు ధర్మజుడు. ' నా వంతున మామ శకుని ఆడతాడు. పందెం వొద్దడానికి నేను సిద్ధం. ' అన్నాడు దుర్యోధనుడు. ' నీ తరఫున యింకొకరు ఆడడం నియమవిరుద్ధం. ఆలోచించు. ఆపై నీకెలా తోస్తే అలాగే చేద్దాము. ' అన్నాడు ధర్మజుడు.


ఇంతలో సభలోకి ధృతరాష్ట్రుడు, అయిష్టంగానే విదురుడు, బీష్మ, ద్రోణ మొదలైన పెద్దలు వచ్చి కూర్చున్నారు. అందరికీ యిది ఒక కాలక్షేప సామూహిక క్రీడ అనే భావం కలుగజేసి శకుని వారిని రప్పించాడు. ఒక్క విదురునికీ, ధర్మజునికీ మాత్రమే తెలుసు, ఇందులో కుటిలనీతి దాగున్నదని.  


ఇక ఆట మొదలైంది. ముందుగా ధర్మరాజు మణిమయమైన సువర్ణమాలను పందెం గా వొడ్డి ఓడిపోయాడు. శకుని పాచికలు పట్టుకుని, చేతిని అస్తవ్యస్తంగా పోనిచ్చి ద్యూత క్రీడ కు విరుద్ధంగా ఆడాడు. ధర్మజుడు చూసికూడా బంగారమే కదా పోనీలే అని కేవలం శకునిని హెచ్చరించి వూరుకున్నాడు. బంగారము, ధనరాశులను గుమ్మరించాడు రెండవసారి. అదికూడా ఓడిపోయాడు. ముచ్చటగా మూడవసారి, తన విలువైన చైత్రరథం పణంగాపెట్టి ఓడిపోయాడు.  


క్రమక్రమంగా ధర్మరాజు జూదమనే వూబిలో దిగిపోయాడు. తరువాతి పందెంలో లెక్కకు మిక్కిలి దాసదాసీజనాన్ని పందెంలో ఒడ్డి వారినికూడా ఓడిపోయాడు. ఆతరువాత అసంఖ్యాకమైన సేవకులను కూడా ఓడిపోయాడు.


శకుని పాచికలు అధర్మంగా విసురుతూనే వున్నాడు, పాండవుల సంపదను కొల్లగొడుతున్నారు. ఇదంతా చూస్తున్న విదురునిలో ఆవేశం కట్టలు త్రెంచుకున్నది. 


స్వ స్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.

తీర్థాల రవి శర్మ

9989692844

ముహూర్తములు

 రౌద్ర-శ్వేత-మైత్ర-సారభట-సావిత్రి-విరోచన-జయదేవ-అభిజిత్‌-రావణ- *విజయ*-నంది-వరుణ-యమ-సౌమ్యభవులు పదిహేను

 

పగటి పూట ముహూర్తములు

నర్సింగ్ కోర్సులలో

 నర్సింగ్ కోర్సులలో అడ్మిషన్స్ జరుగుచున్నవి

తెలియనివాళ్ళు తెలుసుకొని apply చేస్తారు కదా

SC.ST.BC. Minority/ విద్యార్థులకు 

ఉచిత విద్య!

ANM (నర్సింగ్), 

MLT - మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్.

CPM - అగ్రికల్చర్.

ET - ఎలక్ట్రికల్ టెక్నీషియన్.

PT - ఫిజియోథెరపీ.

DAIRY - వెటర్నరీ అసిస్టెంట్.

 and

PARAMEDICAL DIPLOMA COURSES - 

DOA - అప్తాల్మిక్ అసిస్టెంట్.

DMLT - మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్.

DANS - అనస్థీషియా టెక్నీషియన్.

DMST - ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్.

DMPHA - హెల్త్ అసిస్టెంట్.

DECG - కార్డియాలజీ.

DRGA - రేడియోగ్రఫిక్ and

DOM - అప్తోమెట్రిక్.

ఇప్పుడు మన

SHREYA GROUP OF INSTITUTIONS , HANAMAKONDA, WARANGAL.

నర్సింగ్ అలానే డిప్లొమా కోర్సులు చదవాలని ఆశక్తి వుండి ఆర్థికంగా వెనుకబడిన వారికి తెలియజేయండి.

10th మరియు

INTER ANY GROUPS (Regular or Open) PASS అయిన విద్యార్థిని విద్యార్థులకు

VOCATIONAL, and PARAMEDICAL courses Free Education 

వివరాలకు:

Cell :9177631014,

9849819819,

7396494644.

ముఖ్య గమనిక:

Sc, St, Bc & Minority విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కూడా కలదు. 

నో కాలేజ్ ఫీజు.

ఇతర గ్రూపులకు పంపండి

పేద విద్యార్దులకు సహాయంచేయండి.


సేకరణ

శివగంగ- కర్ణాటక

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*శివగంగ- కర్ణాటక లో శివలింగం గూర్చి తెలుసుకుందాం.*

☘☘☘☘☘☘☘☘  

*అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *శివాలయంలో '1600' సంవత్సరాల నుండి జరుగుతున్న అద్భుతం సైన్స్ కు అందని వాస్తవం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *నెయ్యి- అభిషేకం” చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారుతుంది...శివానుగ్రహం... తన ఉనికిని పరమేశ్వరుడు చెబుతున్నట్టే ఉండే ధార్మిక దివ్య చైతన్య రహస్యం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *కర్ణాటక రాష్ట్రం తుముకూరు గంగాధరేశ్వర స్వామి ఆలయం లో జరిగే మర్మమైన విషయం అంతుపట్టని శివవైభవం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శివలింగంపై నెయ్యితో అభిషేకం చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారడం అభిషేకం సమయంలో భక్తులు ప్రత్యక్షంగా చూసే వరం.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*వెన్నగా మారే నెయ్యికి ఔషధ శక్తులు ఉన్నాయని, అనేక రోగాలను నయం చేస్తాయని కూడా భక్తులు విశ్వసిస్తారు.*

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *ఈ అద్భుతం 1600 సంవత్సరాల నుండి ఆలయంలో జరుగుతోంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు.. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సందర్శించి వారి కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని చూసితీరాల్సిందే.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *ఈ ఆలయం కర్ణాటక రాజధాని నుండి 54 కిలోమీటర్లు, శివగంగే పర్వత శిఖరంపై తుమకూరు నుండి 19 కిలోమీటర్లు 804.8 మీటర్లు లేదా 2640.3 అడుగుల ఎత్తులో ఉంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*పవిత్ర పర్వతం శివలింగ ఆకారంలో ఉంది మరియు స్థానికంగా "గంగా" అని పిలువబడే ఒక నీటిధార ప్రవహిస్తుంది, తద్వారా ఈ ప్రదేశానికి దాని పేరు వస్తుంది. కొండపై చారిత్రాత్మక శిలమైన నంది లేదా బసవన్న నిటారుగా ఉన్న శిల పైన చెక్కబడినది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శివయ్య కొలువైఉన్న పర్వతం శివలింగాకృతిని పోలి ఉంటుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *పర్వతం నుండి నిత్యం పారే జలాధార శివయ్య శిరస్సు నుండి జాలువారే గంగమ్మ ను తలిపిస్తుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *పర్వతం పై కొలువైఉన్న దేవాలయాలు, ప్రమధగణాలు సాక్షాత్ కైలాస శిఖరం పై ఉన్న భావనకు వేదికలవుతాయి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *పర్వతం చుట్టూ ప్రవహించే నీటిలో స్నానం పుణ్యప్రదమని,సకలపాప హరణమని భక్తులు విశ్వసిస్తారు.అభిషేక సమయంలో పరమేశ్వరునికి సమర్పించే నెయ్యి వెన్నగా మారడం అద్భుతమైన అనుగ్రహం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇలా అనేక విశిష్ఠతల సమాహారం శివగంగ దివ్య క్షేత్రం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *ఈ క్షేత్రాన్ని 'దక్షిణ కాశీ' గా పిలుస్తారు.*

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*పర్వతశిఖరం పైన గంగాధరేశ్వరుడు దేవాలయం, హున్నమదేవి ఆలయం,పాతాళగంగా ఆలయం,నందీశ్వరుడు కొలువై ఉన్నారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *ఈ శిఖరం పైనే శారదాంబ ఆలయం ఈ ఆలయం చూస్తూ అగస్త్య తీర్ధ, కపిల తీర్ధ,కన్వ తీర్ధ,పాతాళ గంగ సరస్సులు ఉన్నాయి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మకర సంక్రాంతి సందర్భంగా, ఆలయం సాయంత్రం సూర్యరశ్మి నంది కొమ్ముల మధ్య ఒక ఆర్క్ గుండా వెళుతుంది మరియు గుహ లోపల ఉన్న లింగంపై నేరుగా పడి లోపలి విగ్రహాన్ని ప్రకాశిస్తుంది. ఈ దృగ్విషయం పురాతన వాస్తుశిల్పుల సాంకేతిక నైపుణ్యం యొక్క రుజువు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *ఈ ఆలయం యొక్క మరొక ప్రాముఖ్యత ఏమిటంటే, దేవుడి కోసం ఆలయంలో వెలిగించిన దీపం తప్ప వేరే విద్యుత్ శక్తి లేదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ప్రజలు ఈ వెలుగులో మాత్రమే స్వామి వారిని చూస్తారు. చెక్కిన అనేక మంటపాలు కూడా ఉన్నాయి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*వీడియో చూడండి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

జగన్ గారు చేసింది

 జగన్ గారు చేసింది కరెక్ట్.





ఇది శాసనవ్యవస్థకి న్యాయవ్యవస్థకి ఎంతమాత్రం పోరాటంకాదు


ఆంద్రప్రదేశ్ ప్రజలైనా, తెలంగాణప్రజలైనా

130 కోట్ల మంది ప్రజల సమస్య


ఇది ఒక న్యాయమైనసమస్య న్యాయస్థానం లోనే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ప్రరిష్కరించాలేతప్ప మరింత జటిలం చేయొద్దు... తెలంగాణన్యాయవాదులు

హిందూ ధర్మం** 67

 **దశిక రాము**


**హిందూ ధర్మం** 67


  (రాజర్షి విశ్వామిత్రుడు)


వెళ్తూ వెళ్తూనే అస్త్రాలు సంధించడం మొదలుపెట్టాడు. వశిష్ట ఆశ్రమం మొత్తం తలగబడిపోయింది. అక్కడున్న ఋషులందరూ తలొక దిక్కుకు పరిగెత్తారు. వశిష్టుని శిష్యులు, చివరకు జంతువులు, పక్షులు కూడా భయంతో పరుగులు తీశాయి. ఆ ఆశ్రమం ఎవరు లేక నిశబ్దంగా మారి, శ్మశానాన్ని తలపిస్తోంది. అప్పటికే వశిష్టుడు భయపడకండి, భయపడకండి, నేను ఉన్నాను, విశ్వామిత్రుడిని నశింపజేస్తానని చెప్తున్నా ఎవరు వినలేదు.


అప్పుడు మహా తప్పశాలి, తేజోవంతుడు, బ్రహ్మమానాసపుత్రుడైన వశిష్టుడు విశ్వామిత్రునితో 'ఓం మూఢుడా! ఎంతో కాలం నుంచి పోషింపబడిన ఆశ్రమాన్ని నాశనం చేసి, దురాచారివి అయ్యావు, ఇక నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను' అన్నారు. ఎంతో కాలం నుంచి ధర్మప్రభోదం చేస్తూ జాగ్రత్తగా ఋషులను, జంతువులను, పక్షులను, చెట్లను పోషించుకుంటూ వచ్చాను. అవి ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ వచ్చాయి. ఎక్కడికైనా ఎగరగల స్వేచ్ఛ ఉన్నపక్షులు నీకు ఏం హాని చేశాయి? ప్రపంచాన్ని ఇప్పుడే చూసిన లేగదూడలు నీకెం అపకారం చేశాయి. నీకు అడిగింది ఇచ్చే మొక్కల మీద నీ ప్రతాపం ఎందుకు? సర్వజనుల శాంతి కోసం నిత్యం తపించే ముని శ్రేష్టులు నీకు ఏం ద్రోహం చేశారు. నీకు మదమెక్కి ఈ పని చేశావు. నీ గొడవ నాతో అయినప్పుడు నన్నే ధైర్యంగా ఎదురుకో. అంతేకానీ ఇతరులపై నీ ప్రతాపమా? అంటూ వశిష్టమహర్షి వేగంగా తన దండాన్నితీసారు. అది ప్రళయకాలపు అగ్నిలా ఉంది, మరొక యమదండమేమో అనుపిస్తోంది.


వశిష్టుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఇదిగో దీన్ని ఎదురుకో అంటూ అస్త్రాలను సంధించడం మొదలుపెట్టాడు. వశిష్టమహర్షి అపరకాలదండాన్ని, తన బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకుని, నీతిలేని క్షత్రియుడా! నేను ఇక్కడే నిల్చుంటాను. నువ్వు ఎన్ని అస్త్రాలైనా ప్రయోగించు, అన్నిటికి నాశనం చేసి, నీ దర్పాన్ని నశింపజేస్తాను. తపశ్శక్తి చేత పొందిన దైవబలం, బ్రహ్మబలం ముందు క్షత్రియబలమెంత? చూడు నా తపోబలం ప్రతాపం చూపిస్తాను అన్నారు.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ

హిందూ ధర్మం** 27

 **దశిక రాము**


*హిందూ ధర్మం** 27


మన సంస్కృతిలో జీవితంలో ఒక్కసారి వివాహం అయిందంటే, ఇక మళ్ళీ విడిపోవడం ఉండదు, విడాకులు మనం పెట్టుకున్న పద్ధతి కానీ, ధర్మంలో లేదు. సుఖమయినా, దుఃఖమైన, byకష్టమైనా, నష్టమైనా, అన్నీ జీవిత భాగస్వామితోనే. మన దగ్గర వివాహం విషయంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సారీరిక సంబంధం కాదు, అది ఆత్మానుబంధం. జన్మజన్మలకు అదే వ్యక్తిని తప్ప, వేరే వ్యక్తిని తన జీవితభాగస్వామిగా ఎవరు కనీసం ఊహించుకోరు కూడా. భారతీయ సంస్కృతిలో ఒక వ్యక్తిక, తాను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న వ్యక్రి (జీవిత భాగస్వామి)తో తప్ప వేరెవరితోనూ శారీరిక సంబంధం (సెక్స్) కలిగి ఉండకూడదు. అట్లాగే వివాహానికి ముందు కూడా అటువంటి సంబంధాలు ఎవరితోనూ ఉండకూడదు. దాన్ని ధర్మం ఒప్పుకోదు. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దాని వల్ల పరబ్రహ్మం యొక్క దర్శనం కలుగుతుంది, జీవితంలో గొప్ప స్థానానికి ఎదుగుతారు. బ్రహ్మచర్యాన్ని సక్రమంగా పటించావారికి దేవతలు కూడా శిరసు వంచి నమస్కరిస్తారు. ధర్మం అట్లాగే చెబుతుంది. 


పాశ్చ్యాతుల సంస్కృతి వేరు. వారికి వివాహం అన్న సంస్కారం ఒకటి లేదు. మనలాగా వావివరుసులు తక్కువ. పరదేశస్థులకు ఇద్దరి మధ్య ఉన్నది ఒక ఒప్పదం మాత్రమే. కేవలం శరీర సంబంధం మాత్రమే. అధిక శాతం వారు కలిసి జీవించేది శారీరికమైన సుఖం కోసమే. అది వాళ్ళ విషయం. 


మనమే చేస్తున్నాం? గొప్పదైన మన సంస్కృతిని వదిలేసుకుని, వాళ్ళ సంస్కృతిని అందిపుచ్చుకుంటున్నాం. మెల్లమెల్లగా మనకూ, వారికి మధ్య తేడాను చెరిపేస్తున్నాం. విచ్చలవీడిగా తిరిగేస్తున్నాం, తొందరపడి తప్పు చేస్తున్నాం. బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడేం తెలియదు, కొంత వయసు పైబడ్డాక అప్పుడు అర్ధమవుతుంది ఏం కోల్పోయామో. కొన్ని ప్రకటనలు చూస్తే, 'మీ జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉండండి. లేనిపక్షంలో, తప్పు చేస్తే సురక్షితంగా చేయండి్' అని ఉంటాయి. ఏంటండి ఇది? ఒకేఒక్క ప్రశ్న వేసుకోండి? అసలు మనం తప్పు చేయడమెందుకు? ధర్మం అంటుంది మీ ఇంద్రియాలను నిగ్రహించుకోండి. మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. క్షణికమైన సుఖ్ల కోసం, ఆవేశపడి, మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి, మీ శక్తిని, సమయాన్ని వృధా చేసుకోకండి. అదే ఇంద్రియ నిగ్రహం. 

🙏🙏🙏

సేకరణ

శరన్నవరాత్రులలోఅమ్మవారి అలంకరణలు

 🌹🌹శరన్నవరాత్రులలోఅమ్మవారి అలంకరణలు ముహూర్తాలు🌹🌹


17 - 10 - 2020

శరద్రుతువులో ఆశ్వీయుజమాసం ప్రారంభం మొదలుకొని తొమ్మిది రాత్రులు నవరాత్రలుగా జరిపి , పదవరోజు ఉదయం శమీ పూజతో ఉద్వాసన చేయడం పరిపాటి. వివిధ రోజులలో వివిధ పద్ధతులలో అలంకారాలు నివేదించి అమ్మవారికి వివిధ పద్ధతులలో పూజించి రకరకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందటం పరిపాటి. నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు అంగ్ల తేది ప్రకారం 17 అక్టోబర్ 2020 దేవి శరన్నవరాత్రారంభం.


🙏17 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి , శనివారం మొదటి రోజున *'#బాలాత్రిపుర #సుందరీ'* అలంకారం.


ముహూర్తం :- కలశస్థాపన శుభ సమయం ఉదయం 7:38 నిమిషాల నుండి 11:29 వరకు, మధ్యాహ్నం 11:29 నుండి 12:16 వరకు.


నైవేద్యం - పులగం🙏


🙏18 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ విదియ, ఆదివారం రెండవ రోజున '#గాయత్రీదేవి' అలంకారం.


ఉదయం 8:05 - 8:35 , సాయంత్రం 6:18 - 6: 56


నైవేద్యం - పులిహోర🙏


🙏19 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ తదియ, సోమవారం మూడవ రోజున '#మహాలక్ష్మిదేవి' అలంకారం


ఉదయం 9 :05 - 9 :30 , సాయంత్రం 5 :35 - 6:30


నైవేద్యం - వడపప్పు, పానకం🙏


🙏20 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ చవితి, మంగళవారం నాల్గవ రోజున '#అన్నపూర్ణ' అలంకారం.


ఉదయం 7 :02 - 7 :40 , సాయంత్రం 5 :05 - 5 : 32


నైవేద్యం - పరమాన్ణం, బూరెలు🙏


🙏21 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పంచమి, బుధవారం ఐదవ రోజున '#లలితాదేవి' అలంకారం.


ముహూర్తం:- సరస్వతీ ఆవాహనం ఉదయం 6:05 - 7:53 ( మూల 1 వ పాదం )


సరస్వతీ దేవి మూల నక్షత్ర పూజ ఉదయం 7:54 - 8:58


సరస్వతీ దేవి సాయాహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:39 వరకు


నైవేద్యం - పెసర బూరెలు, పరమాన్నం🙏


🙏22 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ షష్టి, గురువారం ఆరవ రోజున '#శాకంబరీదేవి' అలంకారం.


ముహూర్తం:- త్రిరాత్ర కలశస్థాపన సమయం ఉదయం 6:05 - 7:32


పూర్వాషాడ సాయహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:38


పూర్వాషాడప్రదోష పూజ సాయంత్రం 5:39 - 8:02


నైవేద్యం - శాకాన్నం (కూర అన్నం)🙏


🙏23 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, శుక్రవారం ఏడవ రోజున '#సరస్వతీదేవి' అలంకారం.


ఉదయం 6 :20 - 7 :05 , సాయంత్రం 5 :39 - 6:20


నైవేద్యం - కదంబం ప్రసాదం.🙏


🙏24 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, శనివారం ఎనిమిదవ రోజున #దుర్గాష్టమి '#దుర్గాదేవి' అలంకారం.


ముహూర్తం:- ఉదయం 7;38 - 8:59, మధ్యాహ్నం 11:28 - 12:14 , సాయంత్రం 5:37 - 7:11


నైవేద్యం - నిమ్మకాయ పులిహోర


24 -10 -2020 సరస్వతీదేవి ఉద్వాసన ముహూర్త సమయం ఉదయం 7:38 - 8:59🙏


🙏25 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ నవమి, ఆదివారం తొమ్మిదవ రోజున '#మహిషాసురమర్దినీ' అలంకారం.


ఉదయం 8:45 - 9:15 , సాయంత్రం 6:12 - 6: 37


నైవేద్యం -చలివిడి, వడపప్పు, పానకం.


అక్టోబర్ 25


విజయదశమి పూజ ప్రారంభ ముహూర్త సమయం ఉదయం 8:40 - 11:57


శమీ పూజ, ఆయుద పూజలు ఉదయం 10:25 - మధ్యాహానం 12:14


అపరాజితా దేవి పూజా సమయం మధ్యాహ్నం 1:00 - 3:18


విజయ దశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:46 - 2:32


విజయ దశమి పర్వదినాన దుర్గాదేవి ఉద్వాసన సాయంత్రం 5:36 - 8:00 లేదా🙏


🌹26 అక్టోబర్ సోమవారం ఉదయం 6:06 - 8:24🌹🌹

నవదుర్గా

 నవదుర్గా

ఆశ్వయుజ శు.పాడ్యమి  

శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి) నైవేద్యం : కట్టు పొంగలి

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


ఆశ్వయుజ శు.విదియ 

బ్రహ్మ చారిణి ( గాయత్రి ): నైవేద్యం : పులిహోర

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


ఆశ్వయుజ శు.తదియ 

చంద్రఘంట ( అన్నపూర్ణ ) నైవేద్యం : కొబ్బరి అన్నము

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||


ఆశ్వయుజ శు.చవితి 

కూష్మాండ ( కామాక్షి ) నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||


ఆశ్వయుజ శు.పంచమి 

స్కందమాత ( లలిత ) నైవేద్యం : పెరుగు అన్నం

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||


ఆశ్వయుజ శు.షష్టి  

కాత్యాయని (లక్ష్మి) నైవేద్యం : రవ్వ కేసరి

శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||


ఆశ్వయుజ శు.సప్తమి 

కాళరాత్రి ( సరస్వతి ) నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||


ఆశ్వయుజ శు.అష్టమి 

మహాగౌరి ( దుర్గ ) నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||


ఆశ్వయుజ శు.నవమి

సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి ) నైవేద్యం : పాయసాన్నం

శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

శ్రీకృష్ణ స్వామికి

 ఉడిపి శ్రీకృష్ణ స్వామికి *బంగారు కాసులూ, నవరత్నా లతో* జరిగన ఆభిషేక సేవ ,స్వయంగా వెళ్లినా , ఇంత స్పష్టంగా చూడలేము.🙏🙏🙏🙏






నైవేద్యం