*సున్నితస్తులకు జ్ఞానోదయం*
🎊💦🌹🦚🦜💦🎊
*👌ఓరోజు బుద్ధ భగవానుడు బిక్షాటన చేస్తున్నాడు*
ఓ ఇంటావిడ కోపంగా బయటకు వచ్చి బుద్ధున్ని చూసి "దుక్కలా వున్నావు, పనీ చేసుకుని బతకొచ్చుగా... అడుక్కోకపోతే
నీవు సోమరి కాక నీ శిష్యులని అలానే చేస్తున్నావు,తిట్ట సాగింది.
బుద్ధ భగవానుడు చిరునవ్వుతో విన సాగారు.
ఆమె బుద్దున్ని తిట్టే తిట్లను విని శిష్యులు కోపంతో ఊగుతున్నారు.
బుద్దుడు వారిని వారించారు..
తరువాత బుద్దుడు ఆమెతో మాతా!
చిన్న సంశయం,అడగమంటావా ?
అడుక్కో...
నీ సంశయం తీరుస్తాలే అంది.
బుద్దుడు తన చేతిలోని బిక్షాపాత్రను చూపుతూ ..తల్లీ!
నేను నీకు ఓ వస్తువును ఇస్తే, నీవు ఆ వస్తువు ను తిరస్కరిస్తే ఆ వస్తువు ఎవరికి చెందుతుంది?
నేను తీసుకోకుండా తిరస్కరించాను కాబట్టి ఆ వస్తువు నీకే చెందుతుంది.. అంది
అయితే... తల్లీ!
"నేను నీ తిట్లను స్వీకరించడం లేదు "
అంటే నీవు తిట్టిన తిట్లన్నీ నీకే చెందుతాయి ......అన్నారు.
ఈ సంఘటన తో బుద్దుడు
మనకు గోప్ప బోధను చేసారు
అలా మనల్ని కించపరిచి వేళాకోళం చేసేవారు మనచుట్టూ చాలామందే ఉంటారు,
కొంతమంది బహిరంగంగా, మరి కొందరు చాటుగా మనల్ని విమర్శిస్తుంటారు.
వాటిని మనం పట్టించుకోనంత కాలం నీదారి సుగమనమే..
ఎప్పుడైతే పట్టించుకుంటావో ఆ క్షణమే నీ పతనానికి పునాది రాయి పడ్డట్టు.
*పదిమంది నీ గురించి విమర్శించుకుంటున్నారంటే నీ ఎదుగుదల మెుదలైనట్టే.*👍
🎊💦🦚🌹🦜💦🎊
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి