16, అక్టోబర్ 2020, శుక్రవారం

హిందూ ధర్మం** 27

 **దశిక రాము**


*హిందూ ధర్మం** 27


మన సంస్కృతిలో జీవితంలో ఒక్కసారి వివాహం అయిందంటే, ఇక మళ్ళీ విడిపోవడం ఉండదు, విడాకులు మనం పెట్టుకున్న పద్ధతి కానీ, ధర్మంలో లేదు. సుఖమయినా, దుఃఖమైన, byకష్టమైనా, నష్టమైనా, అన్నీ జీవిత భాగస్వామితోనే. మన దగ్గర వివాహం విషయంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సారీరిక సంబంధం కాదు, అది ఆత్మానుబంధం. జన్మజన్మలకు అదే వ్యక్తిని తప్ప, వేరే వ్యక్తిని తన జీవితభాగస్వామిగా ఎవరు కనీసం ఊహించుకోరు కూడా. భారతీయ సంస్కృతిలో ఒక వ్యక్తిక, తాను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న వ్యక్రి (జీవిత భాగస్వామి)తో తప్ప వేరెవరితోనూ శారీరిక సంబంధం (సెక్స్) కలిగి ఉండకూడదు. అట్లాగే వివాహానికి ముందు కూడా అటువంటి సంబంధాలు ఎవరితోనూ ఉండకూడదు. దాన్ని ధర్మం ఒప్పుకోదు. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దాని వల్ల పరబ్రహ్మం యొక్క దర్శనం కలుగుతుంది, జీవితంలో గొప్ప స్థానానికి ఎదుగుతారు. బ్రహ్మచర్యాన్ని సక్రమంగా పటించావారికి దేవతలు కూడా శిరసు వంచి నమస్కరిస్తారు. ధర్మం అట్లాగే చెబుతుంది. 


పాశ్చ్యాతుల సంస్కృతి వేరు. వారికి వివాహం అన్న సంస్కారం ఒకటి లేదు. మనలాగా వావివరుసులు తక్కువ. పరదేశస్థులకు ఇద్దరి మధ్య ఉన్నది ఒక ఒప్పదం మాత్రమే. కేవలం శరీర సంబంధం మాత్రమే. అధిక శాతం వారు కలిసి జీవించేది శారీరికమైన సుఖం కోసమే. అది వాళ్ళ విషయం. 


మనమే చేస్తున్నాం? గొప్పదైన మన సంస్కృతిని వదిలేసుకుని, వాళ్ళ సంస్కృతిని అందిపుచ్చుకుంటున్నాం. మెల్లమెల్లగా మనకూ, వారికి మధ్య తేడాను చెరిపేస్తున్నాం. విచ్చలవీడిగా తిరిగేస్తున్నాం, తొందరపడి తప్పు చేస్తున్నాం. బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడేం తెలియదు, కొంత వయసు పైబడ్డాక అప్పుడు అర్ధమవుతుంది ఏం కోల్పోయామో. కొన్ని ప్రకటనలు చూస్తే, 'మీ జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉండండి. లేనిపక్షంలో, తప్పు చేస్తే సురక్షితంగా చేయండి్' అని ఉంటాయి. ఏంటండి ఇది? ఒకేఒక్క ప్రశ్న వేసుకోండి? అసలు మనం తప్పు చేయడమెందుకు? ధర్మం అంటుంది మీ ఇంద్రియాలను నిగ్రహించుకోండి. మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. క్షణికమైన సుఖ్ల కోసం, ఆవేశపడి, మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి, మీ శక్తిని, సమయాన్ని వృధా చేసుకోకండి. అదే ఇంద్రియ నిగ్రహం. 

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: