16, అక్టోబర్ 2020, శుక్రవారం

శివామృతలహరి

 శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


శా||

గోరాజున్ మృగరాజు వాహనములై కూర్మిన్ బ్రవర్తిల్లగా

రేరాజున్ ఫణిరాజు భూషణములై ప్రేమన్ ప్రదర్శింపగా

నీరుం జిచ్చు హలాహలమ్మమృతమున్ నెయ్యంబు వాటింప గౌ

రీ రమ్యాంగ భవత్సమత్వమలరున్ శ్రీ సిద్ధలింగేశ్వరా !


భావం;

స్వామీ నీ వాహనమైన నందీశ్వరుడు,అమ్మవారి వాహనం మృగరాజైన సింహము ఇద్దరూ పరస్పర విరోధులైనా ఎంతో ఒద్దికగా ప్రవర్తిస్తున్నారు.

వెన్నెల కురిపించే చంద్రుడు,విషం కక్కే నాగరాజు ఎంతో ప్రేమ గా మసలుకొంటూ నీ ఆభరణాలుగా శోభిల్లుతున్నారు.

నీ శిరస్సుపై పింపిళ్ళాడుతున్న గంగాఝరి, నీ మూడవ కంటిలో ప్రజ్వరిల్లుతున్న ప్రళయాగ్ని , మరియు నీ కఠంలో దాగిఉన్న హాలాహలం,నీ చెంతనున్న అమృతం.( శివుడి శిరస్సుపై ధరించిన చంద్రుడు కూడా అమృతం కురిపిస్తాడు, శివుడు అమృత హస్తము, అమృత హృదయం గలవాడు.) 

అన్నీ కూడా స్నేహాన్ని ప్రదర్శిస్తూ

నీ సన్నిధిలో సమత్వాన్ని పాటిస్తున్నాయి కదా!

అదే నీ దగ్గరున్న గొప్పతనం కదయ్యా! గౌరీ దేవిని అందంగా శరీరంలో ధరించిన అర్ధనారీశ్వరుడైన శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!


సుబ్బు శివకుమార్ చిల్లర. 

కామెంట్‌లు లేవు: