16, అక్టోబర్ 2020, శుక్రవారం

**అద్వైత వేదాంత పరిచయం**

 **దశిక రాము**


**అద్వైత వేదాంత పరిచయం**


4.1 బ్రహ్మచర్య ఆశ్రమం:

  మొదటిదశ బ్రహ్మచర్య దశ.ఇందులో విద్య నేర్చుకుంటాము.విద్య ఏమిటి? ఎందుకు?

  ఇప్పటి నిర్వచనం మారిపోయింది. సంపాదన కోసం. అర్థ, కామాల కోసమే విద్య అయిపోయింది. శాస్త్రం కూడా విద్య నేర్చుకోమనే చెప్తుంది. మనం తదనుగుణమైన విద్యని నేర్చుకోవాలి. ఇది శాస్త్రం ప్రకారం రెండో ఉద్దేశం. కాని దురదృష్టవశాత్తూ అదే ప్రాధమిక అవసరం అయి కూర్చుంది.శాస్త్రం ప్రకారం విద్య అంటే ఒక వ్యక్తిని తీర్చిదిద్దేది,మంచి నడవడికని పెంపొందించేది,తను నేర్చుకుని తనని తానూ, సంఘాన్నీ 

ఉద్ధరించేటట్టు చేసేది. ఒక లంచగొండి, మోసగాడు సంఘంలో అడుగుపెడితే సమాజం భ్రష్టుపడుతుంది. స్వామి చిన్మయానంద అందంగా ఈ నిర్వచనాన్ని యిచ్చారు. పశుప్రవృత్తి ఉన్న మనిషి, సంస్కారం ద్వారా మనిషి ప్రవృత్తిని పెంపొందించుకోవాలి. అప్పుడు మనిషిప్రవృత్తి నుంచి దైవప్రవృత్తి పెంపొందించుకోగలుగుతాడు.

  గనులలో దొరికే ఖనిజాలు విలువైనవే కానీ వాటిని యధాతధంగా వాడలేము. వాటిని సానపట్టి, పనికివచ్చే లోహంగా తయారుచేయాలి. అలాగే మనం కూడా తల్లిగర్భం నుంచి పుట్టగానే సానబట్టని, నిక్షిప్తమైన శక్తి 

ఉన్న వాళ్ళమన్నమాట. మనని గురుకుల వాసంకి పంపిసానబట్టాలి. అందుకే సంస్కృతం లో జన: అంటే అనాగరిక స్థితి నుంచి నాగరికత స్థాయికి ఎదగటం. ఈ పని విద్య చేస్తుంది.

  మాతుర్‌ అగ్రే అధి జననం ద్వితీయం మౌంజి బంధనాత్‌,

  తత్రస్య మాతా గాయత్రి పితా తు ఆచార్య ఉచ్యతే.

  మొదటి తల్లిదండ్రులు జన్మనిచ్చినవారు. గాయత్రీ మంత్రజపం బోధిస్తాడు గురువు. గాయత్రీ మంత్రం విద్యకి ప్రామాణికం. అందువల్ల గురువు తండ్రి, విద్య తల్లి. ఈ రెండో తల్లిదండ్రులు మనని సంస్కరిస్తారు.

  విద్యార్థి దశని బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. ఇక్కడ బ్రహ్మ అంటే శాస్త్రం లేదా వేదాలు.బ్రహ్మచారి అంటే దాని గురించి ఆలోచించేవాడు. బ్రహ్మణి వేదే చరతి. చరతి అంటే నడిచేవాడు. వేదశాస్త్రంలో మానసికంగా పయనించే వాడు. ఈ దశని బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు.

  సంస్కరించబడటానికి అవసరమైన విద్య ఏది? శాస్త్రం ఏం చెపుతుంది? శాస్త్రం మూడు విషయాలు చెపుతుంది.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: