16, అక్టోబర్ 2020, శుక్రవారం

సంస్కృత సూక్తి*

 *సంస్కృత సూక్తి*


*ఆచారో హంత్యలక్షణమ్*


సదాచారం అవలక్షణాలను దూరం చేస్తుంది.              


శ్రీ కృష్ణ శతకము*


*పరుసము సోకిన యినుమును*

*వరుసగ బంగారమైన! వడుపున జిహ్వన్*

*హరి! నీ నామము సోకిన*

*సురవందిత! నేను నటుల! సులభుడ కృష్ణా!*


దేవతలచేత నమస్కరింపబడినవాడా! ఓ కృష్ణా! స్పర్శవేది తగిలిన ఇనుము బంగారముగా మారినట్లు, నీ నామము నా నాలుకకు ఒకసారి సోకిన నేను కూడ సులువుగా మోక్షము పొందగలను.


*శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: