*జయ జయ జగదంబ శివే*
*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*
*జయ జయ మహేశదయితే*
*జయ జయ చిద్గగన కౌముదీధారే||*
🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
🌷 మూకపంచశతి 🌷
🌷 ఆర్యాశతకము 🌷
🌹5.
పంచ శర శాస్త్ర బోధన
పరమాచార్యేణ దృష్టిపాతేన
కాంచీసీమ్ని కుమారీ
కాచన మోహయతి కామజేతారమ్
🌺భావం : కాంచీపురసీమ యందు ఒకానొక కుమారి కొలువైయున్నది.ఆమె కామారియైన శివుని మోహింపజేయుచున్నది. మన్మథుడు కామశాస్త్రవిశారదుడు.ఆతని అస్త్రములను నిర్వీర్యములను జేసి ఆతని బూది గావించిన ఆ సదాశివుని,కేవలము తన కడగంటి చూపులతో కామాక్షి ప్రేమపాశబద్ధుని గావించుటచే కామశాస్త్రబోధకు పరమాచార్యత్వము అమ్మవారి కటాక్షము నకే ఆరోపింపబడుచున్నది.
🌼మరింత గూఢార్థమున పంచశర శాస్త్రము అనగా కాదివిద్యాశాస్త్రము (శ్రీ విద్య).ఈ విద్య పంచశరునకు ఆ పంచశరయగు అమ్మవారి ఉపాసనలభించినది.హయగ్రీవుడు ,అగస్త్యుడు, మన్మథుడు ఇలా ఎంతమంది భక్తుల ద్వారా ఈలోకమున ఆవిద్య ప్రవర్తిల్లినను ,తొలిగురుత్వము మాత్రము అమ్మవారి కటాక్షము నందేయున్నది.ఉభయవిధ కామశాస్త్రబోధనము లోను పరమాచార్యత్వము అమ్మవారిదే !
జీవుడు శివుడగుట ,శివుడు జీవుడగుట రెండునూ అమ్మవారి కటాక్షము వలననే సంభవమగును.
🙏అమ్మా! శరణు ,శరణు 🙏
🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱
🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹
సశేషం....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి