16, అక్టోబర్ 2020, శుక్రవారం

సుభాషితం


సుభాషితం* 🌹🌹🙏


*యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిమ్*

*లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిమ్ కరిష్యతి (హితోపదేశం)*


అర్థము:-స్వయముగా ప్రజ్ఞ లేనివాడికి శాస్త్రము వలన ప్రయోజనం మేమీ వుండజాలదు.

కండ్లు లేనివాడికి అద్దము వలన లాభమేముంటుంది?


🙏🌹🌹🙏🌹🌹🙏


🌸 *సుభాషితమ్* 🌸


శ్లో|| కోsర్థాన్ ప్రాప్య న గర్వితో విషయిణః కస్యాపదోsస్తం గతాః |

స్త్రీభిః కస్య న ఖండితం భువి మనః కో నామ రాఙ్ఞాం ప్రియః ||


తా|| సంపదలు పొంది గర్వించనిదెవ్వడు? విషయలంపటంలో పడి ఆపదలు పొందనిదెవ్వడు? స్త్రీలవల్ల భగ్నహృదయుడు కానిదెవ్వడు? యాచనతో గౌరవాన్ని పొందేది ఎవ్వడు? దుర్మార్గుల వలలో పడి క్షేమంగా బయటపడింది ఎవ్వడు?

(వీటి నుండి తప్పించుకోవడం మానవమాత్రుడికి సాధ్యం కాదు)


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*

కామెంట్‌లు లేవు: