16, అక్టోబర్ 2020, శుక్రవారం

ప్రహ్లాద

 *\!/ ఓం నమో వెంకటేశాయః.\!/* 

 **_అందరికీ శుభోదయం...**_ 

         *నారసింహ విజయము* 

+++++++++++++++++++++

                 శ్రీ ప్రహ్లాద భక్తి    

************************

179శ్లోకము   

**************************

" పంచాననోద్ధూత పావకజ్వాలలు;

భూనభోంతరమెల్లఁ బూరితముగ;

దంష్ట్రాంకురాభీల ధగధగాయితదీప్తి;

నసురేంద్రు నేత్రము లంధములుగఁ;

గంటకసన్నిభోత్కట కేసరాహతి;

నభ్రసంఘము భిన్నమై చలింపఁ;

బ్రళయాభ్రచంచలాప్రతిమ భాస్వరములై;

ఖరనఖరోచులు గ్రమ్ముదేర;"


 *భావము* : “ ఉగ్ర నరసింహస్వామి యొక్క సింహముఖం నుండి జనించిన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలలో వెలువడిన అగ్నిజ్వాలలతో భూమ్యాకాశాలు నిండిపోయాయి. ఆయన కోరల ధగ ధగ కాంతులు హిరణ్యకశిప రాక్షసుని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అంధుణ్ణి చేశాయి. ముళ్ళల్లా ఉన్న ఆయన కేసరాల విదలింపులకు ఆకాశంలోని మేఘపంక్తులు చెల్లాచెదరైపోయాయి. ఆ నరహరి కాలిగోరుల నుండి వెలువడే తీక్షణములైన కాంతులు, ప్రళయకాలపు మేఘాలలోని మెరుపు తీగలలా మెరుస్తున్నాయి.”


+++++++++++++++++++++

 *విష్ణుసహస్రం* .... అర్థం, పరమార్థం.

+++++++++++++++++++++

582) శాంత: - శాంతి స్వరూపుడు.

+++++++++++++++++++++

 *ఈ ఉదయం శ్రీహరి కీర్తన* 

+++++++++++++++++++++

" ఎంతని పొగడెదమమ్మా "

+++++++++++++++++++++

కామెంట్‌లు లేవు: