*శరన్నవరాత్రులు*
*దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. అందుకు నిదర్శనంగా ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులు జరుపుకుంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం సంప్రదాయం.*
*అమ్మవారి వివిధ రూపాలు...*
*1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి - శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి*
*2వ రోజు - ఆశ్వయుజ విదియ - శ్రీ బాలా త్రిపురసుందరీదేవి*
*3వ రోజు - ఆశ్వయుజ తదియ - శ్రీ గాయత్రి దేవి*
*4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి*
*5వ రోజు - ఆశ్వయుజ పంచమి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి - లలిత పంచమి*
*6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి*
*7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి*
*8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి*
*9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి*
*10వ రోజు - ఆశ్వయుజ దశమి - శ్రీ రాజరాజేశ్వరి - విజయదశమి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి