16, అక్టోబర్ 2020, శుక్రవారం

సౌందర్య లహరి**

 సౌందర్య లహరి**


శ్లోకము - 26

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)


విరిఞ్చిః పంచత్వం వ్రజతి హరి రాప్నోతి విరతిం

వినాశం కీనాశో భజతి ధనదోయాతి నిధనమ్,

వితంద్రీ మహేన్ద్రీ వితతిరపి సమ్మీలిత దృశా

మహా సంసారేస్మి న్విహరతి సతి త్వత్పతిరసౌ !!


తల్లీ ! జగజ్జననీ ! మహాప్రళయం సంభవించిన సమయంలో

బ్రహ్మ పంచత్వం (మృతి) పొందుతున్నాడు. మహావిష్ణువు 

విరామాన్ని గాంచుతూన్నాడు. యముడు నాశమవుతున్నాడు.

కుబేరుడు కాలధర్మం పొందుతున్నాడు. పదునల్గురు మనువులు, పదునల్గురు ఇంద్రులు కన్నుమూస్తున్నారు. కానీ ఓపతివ్రతా ! ఈ సహస్రదళ కమలంలో కన్పట్టుతూ నీ భర్త సదాశివుడు విశృంఖలుడై స్వేచ్చగా విహరిస్తున్నాడు.


ఓం కళ్యాణ్యైనమః

ఓం కమలాయైనమః

ఓం అచింత్యాయైనమః

🙏🙏🙏 

కామెంట్‌లు లేవు: