16, అక్టోబర్ 2020, శుక్రవారం

79వ పద్యం

 👆79వ పద్యం

శా.

కాసంతైన సుఖంబొనర్చునొ? మనఃకామంబు లీడేర్చునో

వీసంబైనను వెంటవచ్చునొ? జగద్విఖ్యాతి గావించునో?

దోసంబుల్ వెడ బాపునో? వలసినం దోడ్తో మిముం జూపునో?

ఛీ! సంసార దురాశ యే లుడుపవో? శ్రీకాళహస్తీశ్వరా!


చతురః సఖి ! మే భర్తా యల్లిఖతి చ తత్ పరో న వాచయతి

తస్మాదప్యధికో మే స్వయమపి లిఖితం స్వయం న వాచయతి.



" సఖీ నా భర్త చాలా నేర్పుగలవాడు ; అతడు వ్రాసినది మరొకరెవరూ చదువలేరు ".


"నా భర్త ఇంకా చతురుడు ; తాను వ్రాసింది తానే చదవలేడు".


శుభోదయము !

కామెంట్‌లు లేవు: