16, అక్టోబర్ 2020, శుక్రవారం

గొలుసుకట్టు చెరువుల హైదరాబాద్

 180కి పైగా గొలుసుకట్టు చెరువుల హైదరాబాద్


ఇంటర్నెట్లో దొరికిన సమాచారం మేరకు కొన్ని చెరువుల లిస్ట్. 


ఒక్క హైదరాబాద్ లో ఇన్ని చెరువులా అని ఆశ్చర్యపోతారేమో గానీ అదే నిజం. హుస్సేన్, ఉస్మాన్, హిమయత్ సాగర్లతో పాటూ 

మంత్రాల చెరువు, 

కొత్త చెరువు, 

ఐడీపీఎల్ చెరువు, 

హస్మత్‌పుర చెరువు, 

బాలాజీనగర్ చెరువు, 

కౌకూర్ చెరువు, 

సూరారం చెరువు, 

లింగంచెరువు, 

వెన్నెలగడ్డ చెరువు, 

ప్రగతినగర్ చెరువు, 

కాప్రా చెరువు, 

కీసర చెరువు, 

పూడురు చెరువు, 

ఎల్లమ్మపేట చెరువు, 

మేకంపూర్ చెరువు, 

నల్లచెరువు, 

పల్లె చెరువు, 

దుర్గం చెరువు, 

రామంతపూర్ చెరువు, 

సఫీల్ గూడ చెరువు, 

అల్వాల్ చెరువు, 

సరూర్ నగర్ చెరువు, 

అమీనాపూర్ చెరువు,

జీడిమెట్ల చెరువు,

బంజారా చెరువు (బంజారాహిల్స్)

షామీర్ పేట్ చెరువు

నారాయణరెడ్డి కత్వా, 

బాచారం కత్వా, 

హీరా కత్వా, 

రాయిన్‌చెరువు, 

మాలోనికుంట, 

అంట్ల మాసమ్మకుంట,

మైసమ్మ చెరువు, 

పెద్ద చెక్‌ డ్యాం, 

మెట్టు కత్వా, 

బుంగ కత్వా, 

బూబాగడ్డ చెక్‌ డ్యాం, 

ఎర్రబండ చెక్‌డ్యాం, 

బంధంకుంట, 

బైరాంఖాన్‌ చెరువు, 

ఈదులచెరువు, 

దిల్‌వార్‌ఖాన్‌ చెరువు, 

పోల్కమ్మ చెరువు, 

అంతాయపల్లి చెరువు, 

కుంట్లూర్‌ చెరువు, 

కంబాలకుంట, 

మాసబ్‌ చెరువు,

వడ్లకుంట, 

కొత్త చెరువు, 

బందకుంట, 

అమీర్‌పేట, 

యూసుఫ్‌గూడ చెరువు, 

శ్యామలకుంట సనత్‌నగర్‌, 

మైసమ్మకుంట, 

చాపల చెరువు


ఇవే గాక 

తుమ్మల కుంట, చింతలకుంట, పుప్పలకుంట, కూర్మ చెరువు, కుత్బుల్లాపూర్‌ చెరువు, కోమ కుంట, కోమార్‌కుంట, గొల్లవాని కుంట, భజన్‌సాహికుంట, బొంగలకుంట, షాన్‌ కీసమున కుంట, హెచ్‌ఎంటి కాలనీ చెరువు, క్వారీ కుంట, క్యామ్‌లాల్‌ లే అవుట్‌ చెరు వు, బండకుంట, సుదర్శన్‌ చెరువు, అంజయ్య చెరువులు పూర్తిగా కనిపించకుండా పోయాయి.


ఇప్పుడు నగరం నీళ్లు రోడ్లపై పారుతోంది. ఇళ్లలోకి వస్తుంది అనేవాళ్ళు గమనించాల్సింది నగరమే చెరువులోకి చొచ్చుకొని పోయిందని. డ్రైనేజీలో పాడేసిన బాటిళ్లను చూపించి వరదలకు కారణం, మన బాధ్యాతారాహిత్యం అనేవాళ్ళూ కూడా ఇదే గుర్తించుకోవాలి. చెరువులను ఆక్రమించిన కట్టిన కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిన వారిదే నేరమంతా. అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసిన పాలకులదే పాపమంతా.


నగరంలో మంచి నీటి చెరువులు (హుస్సేన్ సాగర్ తో సహా) మురికికూపాలు అవుతు ఉన్నాయి.

కామెంట్‌లు లేవు: