19, నవంబర్ 2023, ఆదివారం

HAPPY MEN'S DAY-2023

 ఈ రోజు మా మగాళ్ల దినోత్సవం.

*అని సంతోషించే లోపే...*


_మరుగుదొడ్ల దినోత్సవం కూడా_ 

ఉందని గుర్తు చేశాడు.😢😢😢


మా బాధలు ఎవరు పట్టించుకుంటారు, 

ఏడవలేక పైకి నవ్వుతూ తిరిగే మేము 

మాకు మేమే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. 


ఈ క్రింది విధంగా 

మా బాధలు ఎవరు అర్దం చేసుకుంటారు..


🙏అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు *నవంబర్19.2021* .🙏


⚡ నువ్వు అలిగితే... 

*ఆడపిల్లవా... అని హేళన*.


⚡నువ్వు ఏడిస్తే... 

*ఏడ్చేవాడిని నమ్మొద్దని హేళన.*


⚡సరదాగా బయటతిరిగితే... *తిరుగుబోతు అని  బిరుదు*


⚡బాధ మరిచిపోవడానికి తాగితే... 

*తాగుబోతు అని బిరుదు.*


⚡అమ్మ చెప్పినట్లు వింటే 

*అమ్మ చాటు కొడుకు అని*


⚡భార్య చెప్పినట్లు వింటే 

*పెళ్ళాం చాటు మొగుడని*


⚡చెల్లె, అక్క, బావ, బాబాయ్, మాట వింటే *చేతకాని చవట అని.*


⚡దోస్తులతో బయట తిరిగితే

*జులాయి అని.*


⚡ఎక్కువ మాట్లాడితే *పోకిరి అని.*


⚡తక్కువ మాట్లాడితే *నల్లికుట్లోడు అని*


నీవు ఏమి చేసినా, 

ఎలా ఉన్నా తప్పు పట్టే లోకంలో,


ఇంటా-బయట అన్ని రకాల 

బాధలు భరిస్తూనే, అవమానాలు సహిస్తూనే...

 బాధ్యతలు మోస్తూనే...


 కొడుకుగా, తండ్రిగా, భర్తగా, సోదరుడిగా, మేనమామగా, అల్లుడిగా, ప్రేమికుడిగా, స్నేహితుడిగా 

*నిరంతరం ప్రేమను పంచుతూ...*


*అనునిత్యం త్యాగాలు చేస్తూ...నే*

ఉన్న...

ఓ..."మగ"ధీరుల్లారా...


⚡విధి వంచిత,

 ప్రియురాలు-భార్యాభాధిత,

 జనబాధిత,

 అప్పుబాధిత...మొ'...


శోకా...తప్త హృదయుల్లారా...


బాధా సర్పదష్టుల్లారా...


⚡ఏ బాధాలేకుండా ఉంటున్న మహర్జాతకుల్లారా...(కొందరు)


⚡బాధనిపిస్తే మనసారా ఏడ్వలేని 

*నిస్సహాయ పురుషుల్లారా...*


⚡బ్రతుకు సమరం లో చితికిపోయిన 

*అభినవ గరళకంఠుల్లారా...*


⚡జీవితంలో సమస్యలతో

 *కుస్తీ పడుతున్న మల్లయోధుల్లారా...*


⚡కుటుంబం కోసం గస్తీ కాస్తున్నా 

*ఇంటి సైనికుల్లారా...*


⚡కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడుతున్న 

*జీతంలేని నిరంతర శ్రామికుల్లారా...*


⚡ వచ్చింది...

నీ కోసం ఓ రోజు నీకూ కేటాయించారు...

ఓ రోజు...

ఈ రోజైనా...

అన్నీ...మరిచి...

నీ...కోసం...నీవు... *కాసేపైనా...*

సమయాన్ని కేటాయించుకొని 

సంతోషంగా గడుపుతావని... ఆశిస్తూ...


*అంతర్జాతీయ  పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు...*


HAPPY MEN'S DAY-2023


సర్వే 'మగ' జనా సుఖినోభవంతు🙏...


సేకరణ

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



ఇక్ష్వాకు శశాదుల కథ

ఈ సూర్యవంశంలో మనువు తరువాత అతని పౌత్రుడు ఇక్ష్వాకుడు (క్షువంతుని కొడుకు ?)

వంశకర్తగా విఖ్యాతి వహించాడు. ఆదిలో ఇతడికి సంతానం లేదు. నారదుడు చేసిన ఉపదేశంతో

దేవీదీక్షను స్వీకరించి తీవ్రతపస్సు చేశాడు. నూర్గురు పుత్రుల్ని పొందాడు. వారిలో వికుక్షి జ్యేష్ఠుడు.

అందరూ బలపరాక్రమసంపన్నులే. గుణవంతులే. ఇక్ష్వాకు మహారాజు అయోధ్యను రాజధానిగా చేసుకుని

పరిపాలన సాగించాడు. తన పుత్రుల్లో శకుని ప్రభృతులను యాభైమందిని తన రాజ్యానికి ఉత్తరాపథ

ప్రాంతానికి రక్షకులుగా నియమించాడు. మరో నలభై ఎనిమిది మందిని దక్షిణాపథానికి రక్షకులుగా

పంపించాడు. మిగిలిన ఇద్దరినీ తనకు అంగరక్షకులుగా నియమించుకున్నాడు.

(అధ్యాయం - 8. శ్లోకాలు-56)

ఒకరోజున ఇక్ష్వాకుడు తన పితృదేవతలకు శ్రాద్ధం పెడుతూ, పెద్దకొడుకు వికుక్షిని పిలిచి

అడవికి వెళ్ళి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు. అతడు ఆయుధం ధరించి అరణ్యంలోకి వెళ్ళి

వరాహాలనూ మృగాలనూ కుందేళ్ళనూ వేటాడి బాగా అలిసిపోయాడు. ఆకలి భరించలేక శ్రాద్ధం మాట

మరిచిపోయి ఒక కుందేలును (శశము) భుజించాడు. మిగిలిన మాంసాన్ని తెచ్చి తండ్రికి అందించాడు.

దానిని సంప్రోక్షించి పితృదేవతలకు నివేదించబోతూ గురువర్యుడు వసిష్ఠుడు ఇది భుక్తశేషమని

గుర్తించాడు. కోపం వచ్చింది. ఇది శ్రాద్ధానికి అర్హం కాదని ప్రకటించాడు. భుక్తశేషం తు న శ్రాద్ధే

ప్రోక్షణీయమితి స్థితిః అని ఖండితంగా విన్నవించాడు. ఇక్ష్వాకుడు వికుక్షిని పిలిచి ఏమి జరిగిందీ

తెలుసుకున్నాడు. విధిలోపం చేశాడు కనక దేశంనుంచి బహిష్కరించాడు. అప్పటినుంచీ వికుక్షికి

శశాదుడు అనే పేరు స్థిరపడింది

కర్మ సిద్ధాంతం

 ::::::::::::::::::::

కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి..? 1 . శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తూ భగవద్గీతలో కేవలం కర్మ చేయటం వరకే నీ వంతు.. కర్మ ఫలాన్ని నాకు వదిలేయి.. అని అర్జునునికి చెబుతాడు.. అర్థం..? కర్మలను చేయటంతో మనిషిలో అరిషడ్వర్గాలలో ఏదో ఒకటి ప్రకోపించే అవకాశం ఉంది.. తద్వారా అహంకారం కలిగి కర్మయోగ సాధనలో అంతరాయాలు కలుగుతాయి.. కాబట్టి కృతజ్ఞత వలన కలిగే అతి ముఖ్యమైన ఫలితం.. అహంకారం అదుపులో ఉండటం..


2. ఎప్పుడైతే కృతజ్ఞత మనసులో బలంగా పాతుకుంటుందో.. జీవన విధానంలో అంతర్భాగమవుతుందో.. అప్పుడు మనలో ఇతరులకు సహాయం చేసే గుణం పెరుగుతుంది.. ఎందుకంటే.. మనం పొందే ఫలాలకు కారణమైన మూలం వేరు.. అని తెలుసుకుంటాము కాబట్టి.. ఇవ్వటంలో ఉన్న ఔన్నత్యం తొందరగా గ్రహిస్తాము.. తద్వారా ఇతరులకు సహాయం చేయడం మన జీవనశైలిలో ముఖ్య భాగమవుతుంది..

        :::::::::::::::::::::::::::::::::::::::::

         *☘️నేటి మంచి మాట☘️*

        :::::::::::::::::::::::::::::::::::::::::

మనం ఎప్పుడైతే ఇతరులకు ఇవ్వటం మొదలు పెడతామో.. అప్పుడు మనకు మరింత దేవుని సహాయం అందుతుంది.. అంటే.. మనం ఆధ్యాత్మికయానంలో ఎంతో ముఖ్యమైన అడుగు వేసినట్లు లెక్క.. గుణింపబడిన ఆనందం మన సొంతమవుతుంది.. తద్వారా ఆత్మప్రకాశవంతమవుతుంది.. నేను నాది అన్న మాయా భావానలు.. లేదా అజ్ఞానం తొలగి మనం ఆత్మజ్ఞానులమవుతాము.. 


జీవన్ముక్తిని పొందే యత్నంలో సఫలీకృతులమవుతాము..

మరి కృతజ్ఞత ఎలా అలవడుతుంది..? మనిషి తాను చేసే సత్సాంగత్యము, ఇతరులకు సేవ చేయడం ద్వారా.. మరియు సేవా దృక్పథంతో అంతర్ముఖులమవ్వటం ద్వారా.. ప్రతి మహానుభావునిలోనూ తప్పక కనిపించే లక్షణం కృతజ్ఞత.. మంచి నీళ్లు ఇచ్చినా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరస్తాడు..

, , , , , , , , , , , , , ,

కర్మ యోగ సంబంధ 43 పుస్తకాలు

 *కర్మ యోగ సంబంధ 43 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో!. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

కర్మ యోగం www.freegurukul.org/g/KarmaYogam-1


కర్మయోగం www.freegurukul.org/g/KarmaYogam-2


కర్మయోగ విజ్ఞానము www.freegurukul.org/g/KarmaYogam-3


యోగ సమన్వయము-2-కర్మయోగం www.freegurukul.org/g/KarmaYogam-4


అనుదిన ధర్మాలు www.freegurukul.org/g/KarmaYogam-5


కర్మ సిద్దాంతం www.freegurukul.org/g/KarmaYogam-6


తత్వ దృష్టి-2-అనుష్టాన వేదాంతము www.freegurukul.org/g/KarmaYogam-7


గీతా రహస్యము అను కర్మయోగ శాస్త్రము-2 www.freegurukul.org/g/KarmaYogam-8


భారతీయ సంస్కారములు www.freegurukul.org/g/KarmaYogam-9


దినచర్య-1 www.freegurukul.org/g/KarmaYogam-10


నిత్యానుష్ఠానము www.freegurukul.org/g/KarmaYogam-11


నిత్య సాధన చంద్రిక www.freegurukul.org/g/KarmaYogam-12


నిత్యానుష్ఠాన చంద్రిక www.freegurukul.org/g/KarmaYogam-13


పునర్జర్మ విచారము www.freegurukul.org/g/KarmaYogam-14


సందేహాలు www.freegurukul.org/g/KarmaYogam-15


నిత్య పారాయణ సుత్తములు www.freegurukul.org/g/KarmaYogam-16


మంచితనమునకు మంచిఫలాలు www.freegurukul.org/g/KarmaYogam-17


జీవిత నావ www.freegurukul.org/g/KarmaYogam-18


జీవ కారుణ్యము www.freegurukul.org/g/KarmaYogam-19


కామము,ప్రేమ,పరివారము www.freegurukul.org/g/KarmaYogam-20


హిందూ లా www.freegurukul.org/g/KarmaYogam-21


అపర సిద్ధాంతము www.freegurukul.org/g/KarmaYogam-22


ఋగ్వేద సంధ్యా వందనం www.freegurukul.org/g/KarmaYogam-23


యజుర్వేద సంధ్యావందనం www.freegurukul.org/g/KarmaYogam-24


సంధ్యా వందనం - యజ్ఞోపవీత ధారణం www.freegurukul.org/g/KarmaYogam-25


సంధ్యాతత్త్వ సుభోధిని www.freegurukul.org/g/KarmaYogam-26


బ్రహ్మ చర్యం www.freegurukul.org/g/KarmaYogam-27


బ్రహ్మ చర్య విజ్ఞానము www.freegurukul.org/g/KarmaYogam-28


వివాహ తత్త్వము www.freegurukul.org/g/KarmaYogam-29


పెండ్లి సందడి- వివాహ పద్ధతి www.freegurukul.org/g/KarmaYogam-30


గృహస్థ ధర్మావళి www.freegurukul.org/g/KarmaYogam-31


గృహస్థాశ్రమం లో ఎలా వుండాలి www.freegurukul.org/g/KarmaYogam-32


స్నానము-భోజనము-తాంబూలము www.freegurukul.org/g/KarmaYogam-33


గృహస్థ ధర్మావళి www.freegurukul.org/g/KarmaYogam-34


పాణిగ్రహణం www.freegurukul.org/g/KarmaYogam-35


వీర శైవ పురోహిత www.freegurukul.org/g/KarmaYogam-36


యమలోక వార్తలు www.freegurukul.org/g/KarmaYogam-37


ప్రతి సాంవత్సరీక మహేశ్వరారాధన విధి www.freegurukul.org/g/KarmaYogam-38


జనుల-ఋషిగోత్ర-ప్రవరలు www.freegurukul.org/g/KarmaYogam-39


ఆర్ష ధర్మము www.freegurukul.org/g/KarmaYogam-40


కృష్ణ యజుర్వేద సంధ్యావందనం www.freegurukul.org/g/KarmaYogam-41


విశ్వకర్మ విశిష్టత www.freegurukul.org/g/KarmaYogam-42


సమగ్ర ఆబ్దిక ప్రయోగం www.freegurukul.org/g/KarmaYogam-43



కర్మ యోగం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join   

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

6వ అధ్యాయము

 🎻🌹🙏*కార్తిక పురాణం - 6వ అధ్యాయము - దీపదానవిధి - మహాత్మ్యం*

🌸🌿🌸🌿🌸🌿

ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువును, పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టివానికి అశ్వమేథయాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గాని, గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి  నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.


సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |

దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||


అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా, "అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు, సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!" యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ బోభోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.


లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట


పూర్వ కాలమున ద్రవిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.


ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచు౦డెడిది.


అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి "అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"వని వుపదేశమిచ్చెను.


ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాసవ్రతములో అంత మహత్మ్యమున్నది.


ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము...

విష్ణుసహస్ర నామ స్తోత్రం

 *💐విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత💐*

                        *-- ౦ --*

💐💐👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌💐💐



*రోజుకు కనీసం ఒక్క సారైనా..!* 

*విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి..!*

*ఉత్తమ ఫలితాలు పొందండి..!*


*మంత్రాల గనికి మూల మంత్రం..!*

*శ్రీ విష్ణుసహస్రనామం..!*


*ఓం..! నమో.! నారాయణాయ ..!*


*ఓం..! నమో..! భగవతే..! వాసుదేవాయ..!*


*ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది..!*


*విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన..!* 

*అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును..!* *ఆయురారోగ్యము కలుగును..!*

*పాపములు తొలగును..!* 


స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం. 

మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి


విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. 


అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 


అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?


*1. అదృష్టం*


*2. ఆర్థిక ఇబ్బందులు వుండవు.* 


*3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.* 


*4. కోరిన కోరికలు నెరవేరుతాయి.*


*5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.*


విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.


*అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను:-*

*108 మార్లు జపించవలెను..!*

*పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:-*


*1. విద్యాభివృద్ధికి :-*

      14వ శ్లోకం.

సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||


*2. ఉదర రోగ నివృత్తికి:-*

       16వ శ్లోకం.

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||


*3. ఉత్సాహమునకు:-*

       18వ శ్లోకం.

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||


*4. మేధాసంపత్తికి:-*

       19వ శ్లోకం.

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |

అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||


*5. కంటి చూపునకు:-*

       24వ శ్లోకం.

అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |

సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||


 *6. కోరికలిడేరుటకు:-*

         27వ శ్లోకం.

అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |

సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||


*7. వివాహ ప్రాప్తికి:-*

       32వ శ్లోకం.

భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |

కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||


*8. అభివృద్ధికి:-*

       42వ శ్లోకం.

వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |

పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||


*9. మరణ భీతి తొలగుటకు:-*

        44వ శ్లోకం.

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||


*10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-*

         46వ శ్లోకం.

విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |

అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||


 *11. జ్ఞానాభివ్రుద్ధికి:-*

           48వ శ్లోకం.

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |

సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||


*12. క్షేమాభివృధ్ధికి:-*

           64వ శ్లోకం

అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |

శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||


*13. నిరంతర దైవ చింతనకు:-*

          65వ శ్లోకం.

శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |

శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||


*14. దుఃఖ నివారణకు:-*

           67వ శ్లోకం.

ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |

భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||


*15. జన్మ రాహిత్యమునకు:-*

          75వ శ్లోకం.

సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |

శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||


*16. విద్యా ప్రాప్తి కి :-*

       80వ శ్లోకం.

అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|

సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||


 *17. శత్రువుల జయించుటకు:-*

            88వ శ్లోకం.

సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !

న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||


*18. భయ నాశనమునకు:-*

           89వ శ్లోకం.

సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |

అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||


*19. సంతాన ప్రాప్తి కి :-*

       90వ శ్లోకం.

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|

అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||


*20. మంగళ ప్రాప్తికి:-*

         96వ శ్లోకం.

సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |

స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||


*21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-*

          97 & 98వ శ్లోకం.

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |

శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||


*22. దుస్వప్న నాశనమునకు:-*

            99వ శ్లోకం.

ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |

వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||


*23. పాపక్షయమునకు:-*

           106వ శ్లోకం.

ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |

దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||


*24.సర్వ రోగ నివారణకు:-*

     103వ శ్లోకం.

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః

తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||


*25. సుఖ ప్రసవమునకు:-*

    107వ శ్లోకం.

శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|

రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||

శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి..!


విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను..!

                   *-- 0 --*

    *ఓం..! నమో..! వాసుదేవాయ.!*

💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐

పురుషాంకారం

 బుడుగు - పురుషాంకారం - 


పురుషాంకారం ఈమధ్య పెరిగిపోతోందని మీటింగ్ లో లావుపాటి పక్కింటి పిన్నిగారి నేస్తులందరూ ఆడాళ్ళూ కలిసి చెప్పేసుకుని, స్టేజీ ఎక్కి మైక్ ముందు ఓ అని తెగ మాట్టాడేస్తున్నారు.


పురుషాంకారం-అంటే ఏంటో నాకు తెలీదు. ఏమో నేనేమైనా చిన్నవాన్నా చితక వాన్నా, నా అంత వాడిని నేను.

 


సరే కాస్త నాకంటే పెద్దాడు కదా అని మా నాన్న గోపాళాన్ని అడిగా. ఈ పురుషాంకారం అంటే ఏంటని? మరేం లేదు బుడుగూ- మగవాళ్ళు తామే గొప్పోళ్ళమనీ ఆడవాళ్లు అంటే మా రాధ లాంటి వాళ్ళు తమ మాటే వినాలని అనుకోడం అని టూకీగా చెప్పేసాడు. 


‘ఓహో !’ అనేసి వచ్చేసా నేను.కానీ అలాటి పురుషా0కారం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు అంటే నా బుఱ్ఱకు తెలీలేదసలు...అలా ఎవరైనా ఉంటారా అని నా అవమానం . అవమానం- అంటే  నాకు తెలీదనుకో. 


మా బామ్మ ఏంచెప్పినా అందరమూ వింటాము, లేదా అలా కుదరదు ఇలా చేద్దామని మా రాధ,  గోపాళం, బాబాయ్ చక్కగా చెబుతారు కదా మరి. అమ్మ నవ్వితే ఎంత బాగుంటుందో తెలుసా?మాట్టాడినా కూడా మా రాధ చాలా బాగుంటుంది,అసలమ్మకి కోపం రాదుకూడా. మా గోపాళం కూడా ఏమనడు కదా మా రాధని..


ఇంక మా లావుపాటి పక్కింటి పిన్ని గారి ముగుడు పిన్నిగారు చెప్పిందే వింటాడు వాడికి ఆవిడంటే చాల బయ్యం లే. నేనన్నా కూడా అంతులేని బయ్యము! 


వాడు అప్పుడెప్పుడో ఓసారి దొడ్డి గోడ వెనుక చుట్ట  తాగుతుంటే నేను చూసేసాగా...పిన్నిగారికి చెప్తానని బెదిరించా.


లావుపాటి పిన్ని గారికి

చెప్పొద్దని బ్రతిమాలుకుని కాణీ ఇచ్చాడా. అపుడపుడూ  

వాడి దగ్గర కాణీ, ముక్కాణీ తీసుకుంటుంటా ఇలా బెదిరించడాన్ని బ్లాక్ మెయిల్ అంటారట. మా బాబాయ్ అంటుంటే విన్నా . అదంటే నాకూ తెలియదు. ఒక్కో మారు నాకీ పెద్దవాళ్ళ మాటలస్సలు అర్దం కావు బాబూ....ఎక్కడైనా హౌరా మెయిల్ ఉంటుంది, మెడ్రాస్ వెళ్ళే మెయిల్ ఉంటుంది కానీ ఈ బ్లాక్ మెయిల్ ఏంటో నాకు అసలు తెలియదు!!!


ఆ ఇంతకీ ఏం చెప్తున్నాను? ఈ మధ్య పెద్దాడినైపోతున్నా కదూ గబుక్కున గ్యాపకం రావట్లేదు. ఆ పురుషాంకారం గురించి కదూ! 


ఇంకా అప్పుడెప్పుడో మేం మెడ్రాస్ వెళ్ళామా? మాదీ మెడ్రాసేలే ఓసారెళ్లి ఫదిరోలన్నాం కదా .

అప్పుడు రైల్ లో శశి కనబడింది కదా! దాని ముగుడూ ఎంత బాగా చూసుకున్నాడో శశిని. రైల్ ఆగగానే పరిగెత్తి వచ్చేసేవాడు.అప్పటికీ నేను చెప్పాను-: 


ఉరేయ్ శశి ముగుడూ నేను నీ శశిని బాగా చూసుకుంటా లే ..ఇలా అస్తమానూ పరిగెత్తి రాకూ” అని...అయినా వినడే నామాట- నేనేమన్నా చిన్నవాడినా చితకవాడినా?నా అంతవాడు నేడు లేడు..కానీ నా సంగతి వీళ్ళెవరికీ తెలీటం లేదసలు. లాభంలేదు గభాల్న పెద్దాడినైపోవాలి అనేసుకున్నాను.


అదన్నమాట ఈ పురుషాంకారం లేదు కానీ-స్త్రీ అంకారం మాత్రం బాగా కనిపిస్తోంది.ఎలాగంటే-మా ఇంట్లో అమ్మని అడిగే అన్నీ చేస్తారు. నన్ను మాత్తరం ప్రతీదానికీ వెధవా, బడుద్ధాయి అనేస్తారు ఘబుక్కున. నా అంత వాడిని అలా అనేస్తే నాకు ఎంత అనుమానం? ఒక్కోమారు సీగాన పెసూనాంబ ఎదురుగా కూడా అనేస్తుంటారు . అప్పుడు నాకు చాల ఖోపం వచ్చేస్తుంది కూడా. ఈ పెద్దాళ్ళున్నారే మనల్ని పెద్దగా చూడరసలు .


నాకూ, మా సీగాన పెసూనాంబకీ గొడవో, దెబ్బలాటో అయిందనుకో ఎప్పుడూ నన్ను సపోటా చేసే మాబామ్మ కూడా సీగానపెసూనాంబ కే సపోటా ఇచ్చేసి పాట్రీ మార్చేస్తుంది కూడా.


ఓసారేమైందంటే-వేసంగి సెలవులు కదా మా ఇంటి ముందు కిరికెట్టు అట అడుకుంటున్నాం. మొగ పిల్లలం ఆడుతాం రావోద్దంటే వినకుండా సీగానపెసూనాంబ కూడా ఆడటానికి వచ్చింది. అసలే కొత్తగా వేసిన తార్రోడ్డు మీద దబ్బున పడిపోయింది..


ఇంకేముంది పెద్దగా నోరెత్తి ఆ ఆ అని అరుస్తూ వెళ్తోంది-అప్పుడే బయటికొచ్చిన మా బామ్మ సీగానపెసూనాంబని చూసి ఇంటోకి తీసుకెళ్ళింది. 


కళ్ళు తుడిచి, ముణుకు కి తొక్క లేచిందని కడిగి మందు వేసింది. నేవెళ్లి చూసేసరికి తడిగుడ్డ కడుతోంది. సీగాన పెసూనాంబ ఏడుపాపింది కానీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అమ్మేమో పాలకోవా తినిపిస్తోంది. “ఆడపిల్లలకి అలాటి ఆటలేంటిరా వెధవకానా “అనేసింది మా బామ్మ. 


“వద్దంటే వినకుండా అదే వచ్చింది బామ్మా –“మొన్న మేము ఆడుతుంటే క్యాచ్ చెయ్యబోయి నా వేలికి బాల్ గట్టిగా తగిలింది ఎంత నొప్పెట్టిందో . అయినా ఏడవలేదు తెల్సా ఇంటో ఎవరికీ చెప్పలేదు కూడా -అన్నా...... “వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ లా-పాయింట్ లాగింది-“బామ్మ- బేటు గట్టిదా ? రోడ్డు గట్టిదా?” అంటూ..


నేను చెప్తున్నా రోడ్డే గట్టిది అయితే?అని  అమ్మ. బామ్మా ముసిముసిగా నవ్వేసి –ఇంకా బోల్డు చాకిలేట్టులూ, కోవాబిళ్ళలూ ఇచ్చేసి సీగానపెసూనాంబని వాళ్ళింటికి దిగబెట్టేసింది మా రాధ. 


అవునూ- బేటు గట్టిదా ? రోడ్డు గట్టిదా?అని అన్దేమిటి? పాపం అదింకా ఎప్పుడు పెద్దదవుతుందో? ఏమన్నా అంటే- పురుషాoకారం అంటారెందుకు? అసలు ఆడపిల్లల్కే అంతా సపోటా చేస్తారు..ఏంటో ఇంకా నాకు తెలియని ఎన్నో విషయాలున్నాయన్నమాట!!

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.19.11..2023

ఆది వారం (భాను వాసరే) 

*************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

కార్తీక మాసే శుక్ల పక్షే షష్ఠీ సంయుక్త సప్తమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు 

శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  కార్తీక మాసే  శుక్ల పక్షే  షష్ఠీ సంయుక్త సప్తమ్యాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.11

సూ.అ.5.21

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

కార్తీక మాసం 

శుక్ల పక్షం షష్ఠి ఉ. 7.49 వరకు. 

తదుపరి సప్తమి తె. 5.39 వరకు. 

ఆది వారం. 

నక్షత్రం శ్రవణం రా.11.54 వరకు. 

అమృతం మ. 2.09 ల 3.39 వరకు. 

దుర్ముహూర్తం సా.3.52 ల 4.37:వరకు. 

వర్జ్యం  ఉ. 6.39 వరకు. 

వర్జ్యం రా. 3.38 ల 5.08 వరకు. 

యోగం వృద్ధి రా. 1.13 వరకు. 

కరణం తైతుల ఉ.7.49 వరకు. 

కరణం గరజి సా. 6.43 వరకు. 

సూర్యోదయము ఆరోగ్య ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30  వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30  వరకు. 

***********

పుణ్యతిధి కార్తీక శు.సప్తమి.

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

M3 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

తెలుగు నేల

 తెలుగు నేల


అలతి పదమ్ముల నన్నమాచార్యుండు 

          హరికీర్తనమ్ముల నల్లె నిచట

భద్రాద్రిరాముని ప్రస్తుతించియు నిట  

         రమ్యతన్  కీర్తించె రామదాసు 

మువ్వగోపాలుపై మురిపెంపు పదములు  

          బల్కి క్షేత్రయ్యిట బడసె ముక్తి

స్వరబ్రహ్మ త్యాగయ్య వరలినభక్తితో

          దివ్యకీర్తనముల తీర్చె నిచట

వసుధ వరలెడి గాన విద్వాంసులకును

జానపదులకు సంగీతజ్ఞానులకును 

భక్తి సంగీత జ్ఞానమ్ము పంచినట్టి

దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగు నేల



శ్రీవేంకటేశ్వర క్షేత్రమ్ము వెలసియు

        విశ్వమ్ము నందున వినుతి చెందె

లక్ష్మీనృసింహుని సుక్షేత్రరాజమై 

         విలసిల్లె యాదాద్రి విభవముగను 

భవ్యగోదావరీ  పావనతీరాన

         భద్రాద్రినిలయము పరిఢవిల్లె

దివ్య ద్వాదశలింగతీర్థమై నటువంటి

          శ్రీశైలలింగ మీ  క్షితిని వెలసె

సకల హరిహరక్షేత్రాల సంగమంబు

భవ్య పావన వాహినీ ప్రాంతయుతము

హరిత కానన విరిసస్య భరిత మైన 

దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగునేల


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

⚜ శ్రీ నారాయణ సరోవరం

 🕉 మన గుడి : నెం 243


⚜ గుజరాత్ : కచ్





⚜ శ్రీ నారాయణ సరోవరం


💠 నారాయణ్ సరోవర్ లేదా నారాయణ్‌సర్ అనేది  ఒక పవిత్ర తీర్థయాత్ర స్థలం. 

ఇది భారతదేశంలోని గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని లఖ్‌పత్ తాలూకాలో ఉంది.  పురాతన కోటేశ్వరాలయం వాయువ్య దిశలో కేవలం 4 కి.మీ దూరంలో ఉంది. 

ఈ ఆలయం శైవ, వైష్ణవ సంప్రదాయానికి చెందిన  అభిమాన క్షేత్రాలలో ఒకటిగా వర్గీకరించబడింది.


💠 కోటేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సమీపంలో ఉన్న ఇది భారతదేశంలోని హిందువుల పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మరియు కచ్‌లో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.


💠 ఈ గ్రామానికి పవిత్ర నారాయణ్ సరోవర్ సరస్సు పేరు వచ్చింది.  టిబెట్‌లోని మానస సరోవరం, కర్ణాటకలోని పంపా, గుజరాత్‌లోని బిందు సరోవర్ మరియు రాజస్థాన్‌లోని పుష్కర్‌లతో పాటు హిందూమతంలోని 5 పవిత్ర సరస్సులలో నారాయణ్ సరోవర్ సరస్సు ఒకటి.  


💠 హిందూ పురాణాల ప్రకారం, ఈ సరస్సు పురాణ ప్రాంతంలో కరువు కాలంతో ముడిపడి ఉంది, ఋషుల  ప్రార్థనలకు ప్రతిస్పందనగా విష్ణువు ప్రత్యక్షమై తన బొటనవేలుతో భూమిని తాకి, సరస్సును సృష్టించాడు, ఇక్కడ స్నానం చేయడానికి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.  


💠 ఈ నారాయణవన పరిసర ప్రాంతాలన్నీ శివకేశవుల పాదస్పర్శతో పునీతంయ్యాయని స్థలపురాణాల ద్వారా మనకు తెలుస్తోంది.

ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలువబడుతున్నాడు.

ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది. 


⚜ స్థలపురాణం ⚜


💠 ఒకసారి పరమ శివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు.

స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, అశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడేస్తాడు. దాంతో కోపగించుకున్న శివడు అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు.


💠 రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్ళిపోయాడని కథనం.

ఇలా శివుడు నారాయణవన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా శ్రీ కృష్ణపరమాత్మ మదుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుక్కున్నాడనీ అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువబడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.


💠 ఈ సరస్సు చుట్టూ 7 రాతి దేవాలయాలు ఉన్నాయి, అవి శ్రీ త్రికామ్రైజీ, లక్ష్మీనారాయణ్, గోవర్ధన్నాథ్‌జీ, ద్వారకానాథ్, ఆదినారాయణ్, రాంచోడ్రైజీ మరియు లక్ష్మీజీ.

ఇవి మహారావు దేశాల్జీ భార్యచే నిర్మించబడ్డాయి.  

దీని ప్రకారం 1734లో, ఆమె మొదట లక్ష్మీనారాయణ మరియు త్రికామ్రే ఆలయాలను ద్వారకా ఆలయాల తరహాలో నిర్మించగా, వాఘేలీ మహాకున్వర్ నిర్మించిన ఇతర 5 ఆలయాలు ఆలస్యంగా నిర్మించిన కళ్యాణ్‌రాయ్ ఆలయంతో పాటుగా నిర్మించబడ్డాయి.  

వీటిని సమిష్టిగా నారాయణ్ సరోవర్ దేవాలయాలు అని పిలుస్తారు.


💠 ఈ ఆలయాలలో నవంబర్ లేదా డిసెంబరులో జరిగే వార్షిక జాతరలో ఈ సరస్సు విపరీతమైన జనాన్ని ఆకర్షిస్తుంది.  

నారాయణ్ సరోవర్ నుండి 2 కి.మీ దూరంలో ఉన్న శ్రీ కోటేశ్వర్ మహాదేవ్ మందిర్ పురాతన పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించవచ్చు.


💠త్రికామ్రే ఆలయంలో,కోటేశ్వర్‌లో 72 అడుగుల పొడవు 68 వెడల్పు మరియు 61 ఎత్తుతో, 5 అడుగుల 9 అంగుళాల ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై ఉంది.

12  అడుగుల ఎత్తైన స్తంభాలపై గోపురాలు ఉంటాయి. 

మందిరంలో, వెండి సింహాసనంపై, త్రికామ్రే యొక్క నల్లని పాలరాతి విగ్రహం ఉంది.  

విగ్రహ సింహాసనం క్రింద విష్ణువు యొక్క గరుడ యొక్క నల్ల పాలరాతి బొమ్మ ఉంది.

ఒక కాలు మీద మోకాళ్లపై చేతులు జోడించబడి ఉంటుంది.  


💠 ఇక్కడ రెండు వార్షిక జాతరలు జరుగుతాయి.

ఒకటి ఏప్రిల్-మే మరియు మరొకటి 10వ తేదీ నుండి కార్తీకం (నవంబర్-డిసెంబర్-డిసెంబర్) వరకు, పశ్చిమ భారతదేశం నుండి, వేలాది మంది యాత్రికులు ఈ నది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించేందుకు వస్తారు.


💠 యాత్రికుల కోసం వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

1981లో, గ్రామం చుట్టూ ఉన్న ప్రాంతం నారాయణ్ సరోవర్ అభయారణ్యంగా గుర్తించబడింది.  ఎర్ర జింకలు లేదా చింకారాలు అభయారణ్యంలో కనిపిస్తాయి.


 💠 గుజరాత్ లోని భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణవన సరోవరం ఉంది.

ధర్మేశ్వరాలయం

 🎻🌹🙏ఈ కార్తీకమాస సందర్బంగా వారణాసిగా పిలువబడే ప్రసిద్ధ ఆలయాలు కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం 


కాశీలోని ఆ ఆలయాల గురించి.. ఈ మాసమంతా అందులోని రోజుకో ఆలయ విశిష్టత తెలుసుకుని భక్తి పారవశ్యంతో తరిద్దాము..


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


     🌹    ధర్మేశ్వరాలయం     🌹


🌸పార్వతీ దేవి కాశీలో ఉన్న ప్రముఖ శివ లింగములను గూర్చి చెప్పుమని శివుని అడిగెను. శివుడు ఆనందంగా చెప్పసాగెను. ఒకానొకప్పుడు యమరాజు ఆనందవనం (కాశీ) లో శివ లింగమును ప్రతిష్ఠించి శివుని ప్రత్యక్షము చేసుకొనుటకై తీవ్రమైన తపస్సు చేసెను. అమితమగు శీతోష్ణస్థితులకు కూడా చలించక తపస్సు కొనసాగించెను.


🌿యమరాజు యొక్క తపస్సు తీవ్రత అంతకంతకు పెరిగెను. ఒంటి కాలు మీద నిల్చొని ఎన్నో సంవత్సరములు, కాలి బ్రొటనవేలు మీద నిల్చొని మరెన్నో సంవత్సరములు కఠోరమగు తపస్సు చేసెను.


🌸చివరకు శివుడు ప్రత్యక్షమై 'ధర్మరాజు' అని యమరాజుకి బిరుదునిచ్చెను (సంధ్యావందనం వంటి కొన్ని మంత్రములలో యమాయ ధర్మ రాజాయ... అని చదువుచుందురు). యమరాజు స్థాపించిన లింగమునకు ధర్మేశ్వర్ లింగమని ఆ శివుడే పేరు పెట్టెను.


🌿శివుని దివ్య రూపమును ప్రత్యక్షముగా చూసిన యమరాజు నోట మాట రాక ఏమియునూ అడుగలేకుండెను. మునిగియుండెను. యమరాజు సంభ్రమాశ్చర్యములతో నుంచుని ఉండగా..


🌸అంతట శివుడు కల్పించుకొని, 'నువ్వు దర్మనిర్ణేతవై, మరణించిన వారందరి ఔర్వదేహిక గతికి సరియైన న్యాయ నిర్దేశనం చేయవలెను. పాపములు చేసిన వారు శిక్షలననుభవించునట్లు, పుణ్య కర్మలు చేసిన వారు స్వర్గమునకు వెళ్లునట్లు పక్షపాత రహితంగా నిర్ణయము చేయవలెను.


🌿కాశీలో నివసిస్తూ నిత్య పూజాది పుణ్య కర్మలు చేసినవారి పాపములు (ఎన్ని జన్మలందైనను) ప్రక్షాళనమగునట్లుగా పరిగణించవలెను. పాపములు చేసిన వారికి యమరాజుగా, పుణ్య కర్మలు చేసిన వారికి ధర్మరాజుగా ఉండవలెను', అని చెప్పెను.


🌸ధర్మ కూపంలో స్నానమాచరించి ధర్మేశ్వర లింగమును పూజించిన పాపములు వారి ప్రక్షాళనమవును. యమరాజు శివుడు చెప్పినట్లు చేయుటకు అంగీకరించెను. (కాశీ ఖండం, 78 వ అధ్యాయం). కాశీలో నివసిస్తూ, దైనందినంగా పూజాది నిత్య కర్మలు చేసేవారి పాపములు ప్రక్షాళనమవునని ఇప్పటికీ నమ్ముదురు.


    🌹  ధర్మేశ్వర్ ఉన్న స్థలం   🌹


🌿వారణాసి యందున్న మీర్ ఘాట్ డోర్ నంబర్: డి-2/21 లో ధర్మేశ్వర్ లింగమును దర్శించవచ్చు. ప్రసిద్ధమైన దశాశ్వమేధ్ ఘాట్ నుండి వెళ్లవచ్చు. భక్తులు, దశాశ్వమేధ్ విశ్వనాథ్ వీధి దాకా రిక్షాలో వెళ్ళి, అక్కడి నుంచి విశాలాక్షి గౌరి (విశాలాక్షి) మందిరము యొక్క దారిగుండా నడుస్తూ చేరుకోవచ్చు.


🌸విశ్వేశ్వరుని (విశ్వనాథుని) దర్శనం సంపూర్ణం చేసుకొన్న భక్తులు, అక్కడి నుండి సరస్వతి పాటక్ గేట్ వైపు నడుస్తూ విశాలాక్షి మందిరానికి వెళ్లే దారిలో ధర్మేశ్వర్ ని చేరవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీర్ ఘాట్ దాకా పడవలో వెళ్లి, అక్కడి మెట్లెక్కి చేరుకోవచ్చు.


🌿లింగ పురాణమందున్న 3, 7వ అధ్యాయములలో ధర్మేశ్వర్ లింగమును పూజించిన భక్తుల కోరికలన్నియూ నెరవేరునని స్తుతించబడెను. ధర్మేశ్వర్, ధర్మ కూపం, విశాలాక్షి మందిరాలున్న ప్రదేశమంతా ఒక గొప్ప శక్తి పీఠం. ఆ ప్రదేశములో చేసిన ఎటువంటి ప్రార్ధనలు లేక పూజలైనను, అత్యంత ఫలదాయకములు.


🌸ఈ మందిరం ఉదయం 5:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు తెరచియుంచబడును. ఉదయం 5:00 గంటలకు, సాయంత్రం 7:00 గంటలకు హారతులనిచ్చెదరు.


🌿కార్తీక మాసం శుక్ల పక్ష అష్టమి (అమావాస్య తరువాత ఎనిమిదవ రోజు) రోజున ధర్మేశ్వర్ లింగమును పూజించటం అత్యంత శుభప్రదమని నమ్ముదురు.


🌸ఈ మందిరమునకు సమీపమున ధర్మ కూపం (బావి) ఉన్నది. ధర్మ కూపమందు స్నానం చేసి శ్రీ శ్రాద్ధ కర్మలు చేసిన, గయలో శ్రాద్ధ కర్మలు చేసినదానికి సమానమగు ఫలం కలుగును.


🌿రేపు మరో  ప్రసిద్ధ ఆలయాన్ని ప్రస్తావిస్తూ చక్కటి విశేషాలని మరో కొత్త పోస్టులో చూద్దాము..స్వస్తి..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కార్తిక పురాణం - 6వ అధ్యాయము

 🎻🌹🙏*కార్తిక పురాణం - 6వ అధ్యాయము - దీపదానవిధి - మహాత్మ్యం*

🌸🌿🌸🌿🌸🌿

ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువును, పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టివానికి అశ్వమేథయాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గాని, గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి  నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.


సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |

దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||


అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా, "అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు, సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!" యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ బోభోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.


లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట


పూర్వ కాలమున ద్రవిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.


ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచు౦డెడిది.


అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి "అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"వని వుపదేశమిచ్చెను.


ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాసవ్రతములో అంత మహత్మ్యమున్నది.


ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము...

సుభాషితమ్

 🪔🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*న శరీర మలత్యాగాత్* 

*నరో భవతి నిర్మలః l*

*మానసేతు మలే త్యక్తే*

*నరో భవతి నిర్మలః ll*


భావం: 

శరీర మాలిన్యాలను స్నానాదులచే కడిగేసినంత మాత్రాన నిర్మలత్వం సిద్ధించదు మనో మాలిన్యాలను తొలగిస్తేనే నిర్మలత్వం సిద్ధిస్తుంది! అప్పుడే వాసనాదులచే కలిగే ప్రారబ్ధాలు తొలగిపోతాయి


👉 *ఆత్మ సంస్థం మనః కృత్వా నకించి దపి చింతయేత్* ll


*భావం: నిరంతరం ఆత్మ తో రమించేవానికి [అమనస్కునికి] చింతలే [కలగవు] మిగలవు!బ్రహ్మానందమేమిగులుతుంది.

కార్తిక పురాణము

 *కార్తిక పురాణము - ఆరవ అధ్యాయము*


వశిష్ఠుడు మరల ఇట్లనెను ఓ జనకమహారాజా! కార్తీకమాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోను, గంధముతోను, పంచామృతములతోను, స్నానము చేయించువాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును పొందును.


సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈమాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి, వత్తిని చేసి, బియ్యపుపిండితోగాని, గోధుమపిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను.ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను జేయించి, బంగారముతో వత్తిని చేయించి, బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ బోజనముగావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆదీపమును దానము చేయవలెను.


*శ్లో!! సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపచ్ఛుభావహం!

దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ!!*


దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకము. కనుక నేనిప్పుడు దీపదానమును చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక.


ఈ ప్రకారముగా స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీకమాసమందు ఆచరించిన యెడల అనంతఫలమును పొందుదురు.దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును ఆయుష్షును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు.


కార్తీక దీపదానమువలన మనోవాక్కాయములచేత చేయబడిన తెలిసి, తెలియక చేసిన పాపములు నశించును.ఈవిషయమందు పురాతనపు కథ యొకటి ఉన్నది వినుము.


పూర్వకాలమున ద్రవిడదేశమందు సుత బంధువిహీనయైనయొక స్త్రీ గలదు.ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది.ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది.చద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలయిన పనులను చేసెడిది.వారు ఇచ్చే కానుకల్ని యితరులకు అమ్మి డబ్బు కూడబెట్టింది.ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది.


ఆస్త్రీ ఏనాడూ ఇంటిలో వంట చేయలేదు.ఏనాడూ ఇంటిలో దీపాన్ని వెలిగించలేదు, విష్ణు పాదారవిందములనుధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు,ఏకాదశినాడు ఉపవాసము చేయలేదు.


అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు, పరులకు పెట్టలేదుఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగమువలన శ్రీరంగమునకుబోవు కోరికగల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని జూచి, ‘అయ్యో! ఈ చిన్నది అన్యాయంగా నరకములపాలు కాగలదని’ దయగలిగి ఆమెతో ఇట్లనియె.


“మూఢురాలా! నామాటలను వినుము, విని చక్కగా ఆలోచించుము.ఈ దేహము సుఖదుఃఖములతో గూడినది.చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుఃఖములకు నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా, పంచభూతములు చూరులందుపడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును.ఈ దేహము నీటిమీది బుడగవలె నశించును.ఇది నిశ్చయము.నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి.ఇది అగ్నిలోపడిన మిడుతవలె నశించును.కాబట్టి, మోహమును విడువుము.సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగుహరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడువుము.ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీకమాసమందు ప్రాతః స్నానమాచరించుము.విష్ణుప్రీతిగా దానము చేయుము.బ్రాహ్మణునకు దీపదానము చేయుము.అట్లుచేసిన యెడల అనేక జన్మముల పాపములు నశించును సందేహమువలదు”.


ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ స్త్రీ ఆ మాటలు నమ్మి, విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీకవ్రతమును ఆరంభించెను.


సూర్యోదయ సమయాన శీతోదకస్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణశ్రవణము ఈప్రకారముగా కార్తీకమాసము నెల రోజులు చేసి బ్రాహ్మణభోజన సమారాధన చేసెను. నెలరోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆస్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భమందు రోగముజనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతినొందినది.

తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖములను పొందినది.


కాబట్టి కార్తీకమాసమందు అన్నిటికంటె దీపదానము అధిక పుణ్యప్రదము.కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా!ఈ రహస్యమును నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసారబంధనమును త్రెంచుకుని వైకుంఠము పొందుదురు.


*ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షష్ఠాధ్యాయసమాప్తః*

దానగుణ విశిష్టత!

 శుభోదయం🙏


దానగుణ విశిష్టత!


ఈరోజు దానగుణం ఎంతవిశిష్టమైనదో తెలిసికుందాము. 


                      శా:- ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, నంశోత్తరీయంబుపై, 

                              పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై , నూత్నమ 

                                ర్యాదంజెందు కరంబుక్రిందగుట, మీదై  నాకరమబుంటమే          

                                 ల్గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు వాపాయమే? 

                     

                  శ్రీమదాంధ్రమహాభాగవతము - పోతన- వామనచరిత్రము 


            వివరణ:- దేవతావిరోధియగు బలిచక్రవర్తని మూడడుగులదానమును వామనుడు అడుగుసందర్భము . 

                           వచ్చినది శ్రీహరియని శుక్రాచార్యులవారు గ్రహించి దానమువలన కలుగు పరిణామము నూహించి 

                            బలిని వలదని వారింపగా బలియన్నమాటలను కవినిపుణముగా వర్ణించినాడు అంత్యప్రాసలతో 

                             నందగించిన పోతనకవితాసౌందర్యము తోబాటుగా బలి పరమౌదార్యమును తెలిసికొనుటకు

                             ప్రయత్నంచేద్దాము. 


                                                   వచ్చినవాడు'హరి'దానమీయవలదు అనివారించు శుక్రునితో " శ్రీసతి శిరోజాలంకృతిపై, మేనుపై, భుజములపైనుడు ఉత్తరీయముపైనను ,పాదపద్మములపైనను,బుగ్గలపైనను,  పయోధరములపైనను  నూత్నమర్యాదలతో సంచరించు నాశ్రీహరి హస్తము క్రిందగుట, మీదుగా నాహస్తమగుట 

ఆహా !ఎంతటి అదృష్టము. ఈరాజ్యము శాశ్వతమా? శరీరము అపాయరహితమా? ఏదియేమైనను ఇంతటిమంచి 

అవకాశమునువిడువను దానమవస్యముగా నిత్తునని యట్లేయొనరించినాడు .ఆహా!బలియెంతటిమహనీయుడు.

                దానముమిగులగప్పది .వేదములు" నకర్మణా నప్రజయా నధనేన దానేనైకేనామృతత్వమానసుః" నీవు 

     చేయుపనులవలనగానీ, నీసంతానముచేతగానీ, నీకున్నధనముచేతగానీ అమృతత్వాన్ని (అమరత్వము)పొందలేవు. 

      దానగుణం ఒకటి ఉంటేచాలును అమృతత్వం పొందగలవు. అంటోంది. కాబట్టిఉత్తమ గుణాలలో మిన్నయైన దాన

        గుణాన్ని అందరూ అలవరచుకోవటం ఉత్తమం.అది మనకు సమాజానికీ చాలామేలు చేస్తుంది .🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సుభాషితమ్

 🪔🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*న శరీర మలత్యాగాత్* 

*నరో భవతి నిర్మలః l*

*మానసేతు మలే త్యక్తే*

*నరో భవతి నిర్మలః ll*


భావం: 

శరీర మాలిన్యాలను స్నానాదులచే కడిగేసినంత మాత్రాన నిర్మలత్వం సిద్ధించదు మనో మాలిన్యాలను తొలగిస్తేనే నిర్మలత్వం సిద్ధిస్తుంది! అప్పుడే వాసనాదులచే కలిగే ప్రారబ్ధాలు తొలగిపోతాయి


👉 *ఆత్మ సంస్థం మనః కృత్వా నకించి దపి చింతయేత్* ll


*భావం: నిరంతరం ఆత్మ తో రమించేవానికి [అమనస్కునికి] చింతలే [కలగవు] మిగలవు!బ్రహ్మానందమేమిగులుతుంది.

ఒబేసిటీని తగ్గించుటకు

 ఒబేసిటీని తగ్గించుటకు ఆయుర్వేద ఔషధాలు -


     అంతకు ముందు పోస్టులో ఒబేసిటీ గురించి మీకు వివరించాను. ఇప్పుడు అది తగ్గించుకొనుటకు కొన్ని సులభ యోగాలు మీకు వివరిస్తాను.


 సులభ యోగాలు  -


 *  దేహశ్రమ అధికంగా చేయుట , మైధున ప్రక్రియ ఎక్కువ చేయుట .


 *  అధిక దూరం నడవడం , జాగరణ చేయుట అనగా తక్కువ సమయం నిద్రించుట .


 *  యావలు , చామలు వంటి సిరిధాన్యాలు వాడవలెను. నీరు ఎక్కువుగా ఉన్న అన్నము భుజించటం.


 *  ఉదయాన్నే తేనెతో గోరువెచ్చని నీటిని తాగవలెను.


 *  ఉదయాన్నే వేడి అన్నంగాని గంజి గాని తాగవలెను.


 *  చవ్యము , జీలకర్ర, శొంటి, మిరియాలు , పిప్పిళ్లు , ఇంగువ, సౌవర్చ లవణం , చిత్రమూలం వీటిని సత్తుపిండి, నీరు, మజ్జిగ యందు కలిపి తీసికొనవలెను.


 *  వాయువిడంగములు, శొంటి, యవాక్షారం , ఎర్రచిత్రమూలం, యావలు , ఉసిరిక రసం వీటి చూర్ణాలను మజ్జిగతో కలిపి సేవించినను శరీరం నందు కొవ్వు కరుగును.


 *  త్రికటు చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన బాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణమును ఆహారం తీసుకున్న తరువాత ఒక పావు స్పూన్ మజ్జిగ లో కలిపి ఉదయం , రాత్రి సమయాలలో తీసికొనవలెను.


 *  మారేడు లేత ఆకులను తీసుకుని నూరి ఉదయం , సాయంకాల సమయాలలో శరీరానికి బాగా పట్టించి ముఖ్యంగా చంకలు , గజ్జలు వంటి బాగాలలో పట్టించి గంట సమయం తరువాత స్నానం చేయుచున్న శరీరంలోని కొవ్వు పేరుకొని పోవడం వలన శరీరం నుంచి వచ్చు దుర్గంధం హరించును .


 *  గోమూత్రం ప్రతినిత్యం 10ml నుంచి 15ml వరకు ఒక కప్పు నీటిలో ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న శరీరం సన్నబడును.


       ఒబేసిటీ తగ్గించుకొనుటకు ఔషధ సేవన ఒక్కటే సరిపోదు . మనం తినే ఆహారంలో కూడా మార్పులు చేసుకోనవలెను . 


       

  పాటించవలసినవి  -


      పాతబియ్యం , వెదురు బియ్యం, చామలు , కొర్రలు , ఆళ్ళు , జొన్నలు , యావలు , ఉలవలు, పెసలు , కందులు, మాసూరపప్పు, తేనె , పేలాలు, ఎక్కువ కారం, చేదు గల పదార్దాలు, వగరు కలిగిన పదార్దాలు, మజ్జిగ,  వేయించిన వంకాయ (నూనె తక్కువ) , ఆవనూనె ఆహరంలో ఉపయోగించటం , పాయసం, ఆకుకూరలు , వేడినీరు తాగుట, ఎండ యందు తిరుగుట, ఏనుగు , గుర్రపు స్వారీ చేయుట , అధిక శ్రమ చేయుట , స్త్రీ సంగమం , నలుగు పెట్టుకొనుట , శనగలు, చిరు శనగలు , త్రికటుకములు, వాము తినటం, 


 పాటించకూడనివి  - 


     చన్నీటి స్నానం, శాలి బియ్యం, గొధుమలు, అతిగా సుఖపడటం , పాలు , మీగడ , పెరుగు , పన్నీరు , మినుములు , కడుపు నిండా భోజనం , చెమట పట్టని ప్రదేశాలలో పని, చేపలు , మాంస పదార్దాలు , ఎక్కువసేపు నిద్రించడం , సుగంధ పదార్దాలు అతిగా వాడటం , తియ్యటి పదార్దాలు అతిగా తినటం , చద్ది అన్నం , చెరుకు రసంతో చేయబడిన అన్నం . 


       పైన చెప్పబడిన నియమాలు తప్పక పాటించినచో శరీరం నందు కొవ్వు తగ్గి శరీరం నాజూకుగా అవ్వును.


    మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


   ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్          


             9885030034

                   

    

      కాళహస్తి వేంకటేశ్వరరావు .


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు. 


         9885030034

 ఈ రోజు పంచాంగం 19.11.2023  Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస శుక్ల పక్ష: షష్థి తదుపరి  సప్తమి తిధి భాను వాసర: శ్రవణం  నక్షత్రం వృద్ధి యోగ: తైతుల తదుపరి గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.


షష్థి ఉదయం 07:22 వరకు తదుపరి సప్తమి రా.తె 05:21 వరకు.

శ్రవణం రాత్రి 10:47 వరకు.

సూర్యోదయం : 06:27

సూర్యాస్తమయం : 05:36

వర్జ్యం : రాత్రి 02:33 నుండి 04:04 వరకు.

దుర్ముహూర్తం : సాయంత్రం 04:07 నుండి 04:51 వరకు. 


రాహుకాలం : సాయంత్రం 04:30  నుండి 06:00 వరకు.


యమగండం : మద్యాహ్నం   12:00 నుండి 01:30 వరకు.


శుభోదయ:, నమస్కార: