19, నవంబర్ 2023, ఆదివారం

కర్మ సిద్ధాంతం

 ::::::::::::::::::::

కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి..? 1 . శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తూ భగవద్గీతలో కేవలం కర్మ చేయటం వరకే నీ వంతు.. కర్మ ఫలాన్ని నాకు వదిలేయి.. అని అర్జునునికి చెబుతాడు.. అర్థం..? కర్మలను చేయటంతో మనిషిలో అరిషడ్వర్గాలలో ఏదో ఒకటి ప్రకోపించే అవకాశం ఉంది.. తద్వారా అహంకారం కలిగి కర్మయోగ సాధనలో అంతరాయాలు కలుగుతాయి.. కాబట్టి కృతజ్ఞత వలన కలిగే అతి ముఖ్యమైన ఫలితం.. అహంకారం అదుపులో ఉండటం..


2. ఎప్పుడైతే కృతజ్ఞత మనసులో బలంగా పాతుకుంటుందో.. జీవన విధానంలో అంతర్భాగమవుతుందో.. అప్పుడు మనలో ఇతరులకు సహాయం చేసే గుణం పెరుగుతుంది.. ఎందుకంటే.. మనం పొందే ఫలాలకు కారణమైన మూలం వేరు.. అని తెలుసుకుంటాము కాబట్టి.. ఇవ్వటంలో ఉన్న ఔన్నత్యం తొందరగా గ్రహిస్తాము.. తద్వారా ఇతరులకు సహాయం చేయడం మన జీవనశైలిలో ముఖ్య భాగమవుతుంది..

        :::::::::::::::::::::::::::::::::::::::::

         *☘️నేటి మంచి మాట☘️*

        :::::::::::::::::::::::::::::::::::::::::

మనం ఎప్పుడైతే ఇతరులకు ఇవ్వటం మొదలు పెడతామో.. అప్పుడు మనకు మరింత దేవుని సహాయం అందుతుంది.. అంటే.. మనం ఆధ్యాత్మికయానంలో ఎంతో ముఖ్యమైన అడుగు వేసినట్లు లెక్క.. గుణింపబడిన ఆనందం మన సొంతమవుతుంది.. తద్వారా ఆత్మప్రకాశవంతమవుతుంది.. నేను నాది అన్న మాయా భావానలు.. లేదా అజ్ఞానం తొలగి మనం ఆత్మజ్ఞానులమవుతాము.. 


జీవన్ముక్తిని పొందే యత్నంలో సఫలీకృతులమవుతాము..

మరి కృతజ్ఞత ఎలా అలవడుతుంది..? మనిషి తాను చేసే సత్సాంగత్యము, ఇతరులకు సేవ చేయడం ద్వారా.. మరియు సేవా దృక్పథంతో అంతర్ముఖులమవ్వటం ద్వారా.. ప్రతి మహానుభావునిలోనూ తప్పక కనిపించే లక్షణం కృతజ్ఞత.. మంచి నీళ్లు ఇచ్చినా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరస్తాడు..

, , , , , , , , , , , , , ,

కామెంట్‌లు లేవు: