19, నవంబర్ 2023, ఆదివారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



ఇక్ష్వాకు శశాదుల కథ

ఈ సూర్యవంశంలో మనువు తరువాత అతని పౌత్రుడు ఇక్ష్వాకుడు (క్షువంతుని కొడుకు ?)

వంశకర్తగా విఖ్యాతి వహించాడు. ఆదిలో ఇతడికి సంతానం లేదు. నారదుడు చేసిన ఉపదేశంతో

దేవీదీక్షను స్వీకరించి తీవ్రతపస్సు చేశాడు. నూర్గురు పుత్రుల్ని పొందాడు. వారిలో వికుక్షి జ్యేష్ఠుడు.

అందరూ బలపరాక్రమసంపన్నులే. గుణవంతులే. ఇక్ష్వాకు మహారాజు అయోధ్యను రాజధానిగా చేసుకుని

పరిపాలన సాగించాడు. తన పుత్రుల్లో శకుని ప్రభృతులను యాభైమందిని తన రాజ్యానికి ఉత్తరాపథ

ప్రాంతానికి రక్షకులుగా నియమించాడు. మరో నలభై ఎనిమిది మందిని దక్షిణాపథానికి రక్షకులుగా

పంపించాడు. మిగిలిన ఇద్దరినీ తనకు అంగరక్షకులుగా నియమించుకున్నాడు.

(అధ్యాయం - 8. శ్లోకాలు-56)

ఒకరోజున ఇక్ష్వాకుడు తన పితృదేవతలకు శ్రాద్ధం పెడుతూ, పెద్దకొడుకు వికుక్షిని పిలిచి

అడవికి వెళ్ళి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు. అతడు ఆయుధం ధరించి అరణ్యంలోకి వెళ్ళి

వరాహాలనూ మృగాలనూ కుందేళ్ళనూ వేటాడి బాగా అలిసిపోయాడు. ఆకలి భరించలేక శ్రాద్ధం మాట

మరిచిపోయి ఒక కుందేలును (శశము) భుజించాడు. మిగిలిన మాంసాన్ని తెచ్చి తండ్రికి అందించాడు.

దానిని సంప్రోక్షించి పితృదేవతలకు నివేదించబోతూ గురువర్యుడు వసిష్ఠుడు ఇది భుక్తశేషమని

గుర్తించాడు. కోపం వచ్చింది. ఇది శ్రాద్ధానికి అర్హం కాదని ప్రకటించాడు. భుక్తశేషం తు న శ్రాద్ధే

ప్రోక్షణీయమితి స్థితిః అని ఖండితంగా విన్నవించాడు. ఇక్ష్వాకుడు వికుక్షిని పిలిచి ఏమి జరిగిందీ

తెలుసుకున్నాడు. విధిలోపం చేశాడు కనక దేశంనుంచి బహిష్కరించాడు. అప్పటినుంచీ వికుక్షికి

శశాదుడు అనే పేరు స్థిరపడింది

కామెంట్‌లు లేవు: