19, నవంబర్ 2023, ఆదివారం

ఒబేసిటీని తగ్గించుటకు

 ఒబేసిటీని తగ్గించుటకు ఆయుర్వేద ఔషధాలు -


     అంతకు ముందు పోస్టులో ఒబేసిటీ గురించి మీకు వివరించాను. ఇప్పుడు అది తగ్గించుకొనుటకు కొన్ని సులభ యోగాలు మీకు వివరిస్తాను.


 సులభ యోగాలు  -


 *  దేహశ్రమ అధికంగా చేయుట , మైధున ప్రక్రియ ఎక్కువ చేయుట .


 *  అధిక దూరం నడవడం , జాగరణ చేయుట అనగా తక్కువ సమయం నిద్రించుట .


 *  యావలు , చామలు వంటి సిరిధాన్యాలు వాడవలెను. నీరు ఎక్కువుగా ఉన్న అన్నము భుజించటం.


 *  ఉదయాన్నే తేనెతో గోరువెచ్చని నీటిని తాగవలెను.


 *  ఉదయాన్నే వేడి అన్నంగాని గంజి గాని తాగవలెను.


 *  చవ్యము , జీలకర్ర, శొంటి, మిరియాలు , పిప్పిళ్లు , ఇంగువ, సౌవర్చ లవణం , చిత్రమూలం వీటిని సత్తుపిండి, నీరు, మజ్జిగ యందు కలిపి తీసికొనవలెను.


 *  వాయువిడంగములు, శొంటి, యవాక్షారం , ఎర్రచిత్రమూలం, యావలు , ఉసిరిక రసం వీటి చూర్ణాలను మజ్జిగతో కలిపి సేవించినను శరీరం నందు కొవ్వు కరుగును.


 *  త్రికటు చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన బాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణమును ఆహారం తీసుకున్న తరువాత ఒక పావు స్పూన్ మజ్జిగ లో కలిపి ఉదయం , రాత్రి సమయాలలో తీసికొనవలెను.


 *  మారేడు లేత ఆకులను తీసుకుని నూరి ఉదయం , సాయంకాల సమయాలలో శరీరానికి బాగా పట్టించి ముఖ్యంగా చంకలు , గజ్జలు వంటి బాగాలలో పట్టించి గంట సమయం తరువాత స్నానం చేయుచున్న శరీరంలోని కొవ్వు పేరుకొని పోవడం వలన శరీరం నుంచి వచ్చు దుర్గంధం హరించును .


 *  గోమూత్రం ప్రతినిత్యం 10ml నుంచి 15ml వరకు ఒక కప్పు నీటిలో ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న శరీరం సన్నబడును.


       ఒబేసిటీ తగ్గించుకొనుటకు ఔషధ సేవన ఒక్కటే సరిపోదు . మనం తినే ఆహారంలో కూడా మార్పులు చేసుకోనవలెను . 


       

  పాటించవలసినవి  -


      పాతబియ్యం , వెదురు బియ్యం, చామలు , కొర్రలు , ఆళ్ళు , జొన్నలు , యావలు , ఉలవలు, పెసలు , కందులు, మాసూరపప్పు, తేనె , పేలాలు, ఎక్కువ కారం, చేదు గల పదార్దాలు, వగరు కలిగిన పదార్దాలు, మజ్జిగ,  వేయించిన వంకాయ (నూనె తక్కువ) , ఆవనూనె ఆహరంలో ఉపయోగించటం , పాయసం, ఆకుకూరలు , వేడినీరు తాగుట, ఎండ యందు తిరుగుట, ఏనుగు , గుర్రపు స్వారీ చేయుట , అధిక శ్రమ చేయుట , స్త్రీ సంగమం , నలుగు పెట్టుకొనుట , శనగలు, చిరు శనగలు , త్రికటుకములు, వాము తినటం, 


 పాటించకూడనివి  - 


     చన్నీటి స్నానం, శాలి బియ్యం, గొధుమలు, అతిగా సుఖపడటం , పాలు , మీగడ , పెరుగు , పన్నీరు , మినుములు , కడుపు నిండా భోజనం , చెమట పట్టని ప్రదేశాలలో పని, చేపలు , మాంస పదార్దాలు , ఎక్కువసేపు నిద్రించడం , సుగంధ పదార్దాలు అతిగా వాడటం , తియ్యటి పదార్దాలు అతిగా తినటం , చద్ది అన్నం , చెరుకు రసంతో చేయబడిన అన్నం . 


       పైన చెప్పబడిన నియమాలు తప్పక పాటించినచో శరీరం నందు కొవ్వు తగ్గి శరీరం నాజూకుగా అవ్వును.


    మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


   ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్          


             9885030034

                   

    

      కాళహస్తి వేంకటేశ్వరరావు .


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు. 


         9885030034

కామెంట్‌లు లేవు: