29, మార్చి 2023, బుధవారం

సద్వినియోగపరచుకోగలరు

 *గాలి బుడగ జీవితం అంటే ఇదే!*



శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి....

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.

1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్త మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

శ్వాస - చక్రాలు:-

ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై 

➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు

➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు

➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు

➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు

➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు

➡️ ఆజ్ఞా చక్రము నందు  - 1000 సార్లు

➡️ సహస్రారము నందు - 1000 సార్లు 

అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.


శ్వాస - అంగుళాలు:-

సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు.  శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.

➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.

➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.

➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే -  బ్రహ్మానందం కలుగుతుంది.

➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.

➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.

➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.

➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.

➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే -  అదృశ్యం అవ్వగలరు.

   మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు.  అలాంటి వారు అమరులు అవుతారు.

శ్వాస - సృష్టి వయస్సు:-

 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన

➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.

➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.

➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.

➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) -  43,20,000 సంవత్సరాలు.

శ్వాస - సాధన:-

సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.


     మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు.  ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు.  దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.


     84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.💐



సేకరణ రాధ 🙏

శ్రగేరి శారద పీఠః జగదగురువులుప్రణాళి

 శ్రగేరి శారద పీఠః జగదగురువులుప్రణాళి (CE)


1. శ్రీ శంకర భగవత్పాద 820 (విదేహ-ముక్తి)


2.శ్రీ సురేశ్వరాచార్య 820 – 834


3.శ్రీ నిత్యబోధగన్ 834-848


4.శ్రీ జ్ఞానఘన్ 848 – 910


5.శ్రీ జ్ఞానోత్తం 910 – 954


6.శ్రీ జ్ఞానగిరి 954 – 1038


7.శ్రీ సింహగిరి 1038 – 1098


8.శ్రీ ఈశ్వర తీర్థ 1098 – 1146


9. శ్రీ నృసింహ తీర్థ 1146 – 1229


10. శ్రీ విద్యా తీర్థ 1229 – 1333


11. శ్రీ భారతీ తీర్థ 1333 - 1380


12.శ్రీ విద్యారణ్య 1380 – 1386


13.శ్రీ చంద్రశేఖర భారతి I 1386 – 1389


14.శ్రీ నృసింహ భారతి I 1389 – 1408


15.శ్రీ పురోషోత్తమ భారతి I 1408 – 1448


16.శ్రీ శంకర భారతి 1448 – 1455


17.శ్రీ చంద్రశేఖర భారతి II 1455 – 1464


18.శ్రీ నృసింగ్ భారతి II 1464 – 1479


19.శ్రీ పురోషోత్తం భారతి II 1479 – 1517


20. శ్రీరామచంద్ర భారతి 1517 – 1560


21.శ్రీ నృసింగ్ భారతి III 1560 – 1573


22.శ్రీ నృసింహ భారతి IV 1573 – 1576


23. శ్రీ నృసింగ్ భారతి V 1576 – 1600


24.శ్రీ అభినవ్ నృసింగ్ భారతి 1600 – 1623


25.శ్రీ సచ్చిదానంద భారతి I 1623 – 1663


26.శ్రీ నృసింగ్ భారతి VI 1663 – 1706


27.శ్రీ సచ్చిదానంద భారతి II 1706 – 1741


28.శ్రీ అభినవ్ సచ్చిదానంద భారతి I 1741 – 1767


29.శ్రీ నృసింగ్ భారతి VII 1767 – 1770


30.శ్రీ సచ్చిదానంద భారతి III 1770 – 1814


31.శ్రీ అభినవ్ సచ్చిదానంద భారతి II 1814 – 1817


32.శ్రీ నృసింగ్ భారతి VIII 1817 – 1879


33.శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి 1879 – 1912


34.శ్రీ చంద్రశేఖర్ భారతి III 1912 – 1954


35.శ్రీ అభినవ్ విద్యాతీర్థ 1954 – 1989


36. శ్రీ భారతీ తీర్థ 1989 - ప్రస్తుతం


37. శ్రీ విధుశేఖర్ భారతి - ఉత్తరాధికారి

మనవెంట నడిచిన దేవుడు.

 Our Life – Ramayana: ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిది రామాయణం. ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు. విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు. ధర్మం పోత పోస్తే రాముడు. ఆదర్శాలు రూపుకడితే రాముడు. అందం పోగుపోస్తే రాముడు. ఆనందం నడిస్తే రాముడు. వేదోపనిషత్తులకు అర్థం రాముడు. మంత్రమూర్తి రాముడు. పరబ్రహ్మం రాముడు. లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు.


ఎప్పటి త్రేతా యుగ రాముడు? ఎన్ని యుగాలు దొర్లిపోయాయి? అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే.


చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట – శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట – రమాలాలి – మేఘశ్యామా లాలి.

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు – శ్రీరామ రక్ష – సర్వ జగద్రక్ష.

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట – అయ్యో రామా.

వినకూడని మాట వింటే అనాల్సిన మాట – రామ రామ.

భరించలేని కష్టానికి పర్యాయపదం – రాముడి కష్టం.

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే – రాముడు.

కష్టం గట్టెక్కే తారక మంత్రం – శ్రీరామ.

విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట – శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట – అన్నమో రామచంద్రా!

వయసుడిగిన వేళ అనాల్సిన మాట – కృష్ణా రామా!

తిరుగులేని మాటకు – రామబాణం.

సకల సుఖశాంతులకు – రామరాజ్యం.

ఆదర్శమయిన పాలనకు – రాముడి పాలన.

ఆజానుబాహుడి పోలికకు – రాముడు.

అన్నిప్రాణులను సమంగా చూసేవాడు – రాముడు.


రాముడు ఎప్పుడు మంచి బాలుడే.

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా – రామా కిల్డ్ రావణ ;

రావణ వాజ్ కిల్డ్ బై రామా.


ఆదర్శ దాంపత్యానికి – సీతారాములు.

గొప్ప కొడుకు – రాముడు.

అన్నదమ్ముల అనుబంధానికి – రామలక్ష్మణులు.

గొప్ప విద్యార్థి – రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు).

మంచి మిత్రుడు – రాము (గుహుడు చెప్పాడు).

మంచి స్వామి రాముడు (హనుమ చెప్పాడు).

సంగీత సారం రాముడు (రామదాసు , త్యాగయ్య చెప్పారు).

నాలుకమీదుగా తాగాల్సిన నామం రాముడు (పిబరే రామ రసం – సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పాడు).

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం – రాముడు .

నోరున్నందుకు పలకాల్సిన నామం – రాముడు .

చెవులున్నందుకు వినాల్సిన కథ – రాముడు .

చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు – రాముడు .

జన్మ తరించడానికి – రాముడు , రాముడు , రాముడు .

రామాయణం పలుకుబళ్లు


మనం గమనించంగానీ… భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ , ప్రతిబింబిస్తూ ఉంటుంది . తెలుగులో కూడా అంతే.


ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది .

చెప్పడానికి వీలుకాకపోతే – అబ్బో అదొక రామాయణం .

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే – సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే – అదొక పుష్పకవిమానం .

కబళించే చేతులు , చేష్ఠలు కబంధ హస్తాలు .

వికారంగా ఉంటే – శూర్పణఖ .

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే – అంగదుడి అంగలు .

మెలకువలేని నిద్ర – కుంభకర్ణ నిద్ర .

పెద్ద ఇల్లు – లంకంత ఇల్లు.

ఎంగిలిచేసి పెడితే – శబరి.

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే – ఋష్యశృంగుడు.

అల్లరి మూకలకు నిలయం – కిష్కింధ కాండ.

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ – అగ్ని పరీక్షలే.

పితూరీలు చెప్పేవారందరూ – మంథరలే.

యుద్ధమంటే – రామరావణ యుద్ధమే.

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ – రావణ కాష్ఠాలే.

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు. ఒక ఊళ్లో పడుకుని ఉంటారు. ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు. ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు. ఒంటిమిట్టది ఒక కథ. భద్రాద్రిది ఒక కథ . అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణం – చెబితే మహా భారతం.

మిత్రులెవరు

 శ్లోకం:☝️

*కిం మిత్రమంతే సుకృతం న లోకాః*

*కిం ధ్యేయమీశస్య పాదం న శోకాః |*

*కిం కామ్యమవ్యాజసుఖం న భోగాః*

*కిం జల్పనీయం హరినామ నాన్యత్ ||*


భావం: మిత్రులెవరు? వ్యక్తులు కాదు మన సత్కర్మలే మిత్రులు. పరిశీలింపవలసినవి, పరిగణించవలసినవి, పరమాత్ముని పాదాలు కానీ మనల్ని చుట్టుకొన్న కష్టాలు కావు. కోరవలసినది అనిర్వచనీయమైన ఆనందముగానీ అల్పమైన క్షణిక సుఖాలు కాదు. ఫలప్రదమైనది భగవన్నామ స్మరణము కాని అన్యవిషయాలు కావు.🙏

గీత చదవండి

 *రండి భగవద్గీత నేర్చుకుందాం* 📖

*ఉచిత ఆన్‌లైన్ తరగతులు 👩‍🏫👩‍💻*

         

*మంగళవారం, 18-ఏప్రిల్-2023 నుండి ప్రారంభం*

స్థాయి 1️⃣ - 25 వ బ్యాచ్ - రజత వర్గం 


🌻 *20 రోజుల్లో 2 అధ్యాయాలు* శుద్ధ సంస్కృత ఉచ్చారణ తో చదవడం నేర్చుకుందాం. 

🌻 పఠన పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారికి *"గీతా గుంజన్"* ఈ-ప్రశస్తి పత్రం ఇవ్వబడును. 

🌻 భగవద్గీతను సంపూర్ణంగా నేర్చుకొనుటకు తరువాత 3 స్థాయిలకు (3 Levels) ప్రవేశం ఉచితం.

🌻 వారానికి 5 రోజులు, ప్రతి రోజు కేవలం 40 నిమిషాలు మాత్రమే

🌻 మీ సౌలభ్యం 18 టైమ్ స్లాటల నుండి ఎంపిక చేసుకోవచ్చు (ఉదయం 5:00 గం॥ నుండి రాత్రి 2:00 గం॥ వరకు IST)

🌻 గీత తరగతులు 13 భాషల్లో అందుబాటులో ఉన్నాయి (हिंदी, English, मराठी, ગુજરાતી, తెలుగు, தமிழ், ಕನ್ನಡ, മലയാളം, বাংলা, ଓଡିଆ, नेपाली, অসমীয়া, सिंधी)

🌿 *ప్రత్యేకం:* నిత్య దైనందిన జీవితంలో భగవద్గీతను ఆచరించుటకు, చాలా సులభమైన మరియు ఆసక్తికరమైన వారాంతపు (శనివారం-ఆదివారం) గీత అర్థ వివేచనము 


*మీ మొబైల్ నుండి ఫారము పురించండి, వెంటనే WhatsApp సమూహంలో చేరండి*

reg.learngeeta.com 


*🌸 || గీత చదవండి, చదివించండి, జీవితంలో   అన్వయించండి || 🌸* 


ప్రచార విభాగము

*లర్న్ గీతా, గీతా పరివార్*🚩

సుభాషితము



             _*సుభాషితము*_


*ఆరోగ్యం ధృఢగాత్రత్వం*

*ఆనృణం అఘమోచనమ్!*

*అపారవశ్యం నైశ్చింత్యం*

*ఆస్తిక్యం స్వర్గ ఏవ హి!!*


తా𝕝𝕝

*ఆరోగ్యం, గట్టి శరీరం, ఋణం లేకపోవడం, పాపముక్తి, పరతంత్రం లేకపోవడం, నిశ్చింతత, ఆస్తికత - ఇవన్నీ సాక్షాత్తు స్వర్గముతో సమానమైనవే కదా !*

============================


 𝕝𝕝శ్లో𝕝𝕝


*వనాని దహతే వహ్నేః*

*సఖా భవతి మారుతః।*

*స ఏవ దీపనాశాయ*

*కృశే కస్యాస్తి సౌహృదమ్॥*


తా𝕝𝕝 

*అడవిని దహించే సమయంలో  అగ్నికి వాయువు స్నేహితుడౌతాడు.....ఆ అగ్ని కృశించి చిన్న దీపంలా వెలిగేటప్పుడు ఆ వాయువే దాన్ని నశింపజేస్తున్నాడు*.... *ఇలాంటి వారికి స్నేహ మేమిటి??*


                  _*సూక్తిసుధ*_


*సమయమునందు ఉపకరించునవి:* 

వయస్సున పుట్టిన పుత్రుడును కాలమునందు పెట్టిన పైరును నాణ్యముగల వాని వద్దనుంచిన ధనమును, బాల్యమునందు అభ్యసించిన విద్యయు సత్పురుషుల సఖ్యమును మంచివానికి చేసిన ఉపకారమును సమయమునందు ఉపకరించును.



*సమయమునందు ఉపకరింపనివి:*

ముదిమిని పుట్టిన పుత్రుడును, అకాలమునందు పెట్టిన పైరును, మోసగాని వద్ద ఉంచిన ధనము, పుస్తకమందున్న విద్యయును, కపటము గలవాని సఖ్యమును, చెడువానికి చేసిన ఉపకారమును, దేశాంతరమునందున్న పుత్రుని సంపదయును, అప్పిచ్చిన ధనమును సమయమునందు ఉపకరింపవు.

ఈశ్వరేచ్ఛ

 నేను లేకపోతే


అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని


కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! 

 ఆశ్చర్య చకితుడయ్యాడు. 


'"నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను  రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు! 


బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని. 


 సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. 


అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో... వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. 


**మరింత ముందుకు వెళితే 

త్రిజట ....తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను ....అనీ చెప్పింది. 

అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. 

తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు


అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను ...అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.... అనుకున్నాడు. 


హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు... హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. 

అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. 

అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని. 


ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే .... విభీషణుడు ఆ మాట చెప్పగానే... రావణుడు  ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్ట0డి' అన్నాడు.


అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. "ప్రభువు నాకే చెప్పి ఉంటే... నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! "ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.


పరమాశ్చర్యం ఏంటంటే... వాటన్నిటికే ఏర్పాట్లు... రావణుడే స్వయంగా చేయించాడు. 

అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు ....తనకు"లంకను చూసి రా"అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది! 


అందుకే ప్రియ మిత్రులారా! ఒకటి గుర్తుంచుకోండి. 


ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం .

అందువల్ల 


నేను లేకపోతే ఏమవుతుందో


అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు 

'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు. 


భగవంతుడి కోటానుకోట్ల దాసులలో 

అతి చిన్నవాడను అని ఎఱుక కలిగి ఉందాం.

రాముడిని ఎందుకు ఆరాధించాలి -*

*రాముడిని ఎందుకు ఆరాధించాలి -*?


ఆయన 

రాముడు సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ ...


1) ధర్మం అంటే ఏమిటి? - అమరకోశం ప్రకారం ధ్రియతేవా జన ఇతి ధర్మం 

2) మనకు తెలిసినది ధర్మం కాదు - మనం ఆచరించేదాన్ని ధర్మం అంటారు

3) ధర్మం ఎక్కడ నుండి వచ్చింది? 

4) ధర్మం వేదాల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. 

5) ఈ వేదాలు అపౌరిషేయం - అవి శివుని ఊపిరి. 

6) వేదాలు తప్ప ధర్మం అంటే ఏమిటో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు .

7) శ్రీరామాయణంను వేదం అని కూడా అంటారు. శ్రీరామాయణం వినడం/చదవడం & వేదాలు వినడం/చదవడం - రెండూ ఒకటే.

8) రావణుడిని చంపడం రామావతారం యొక్క ఏకైక లక్ష్యం అయితే, రావణుడిని చంపిన తరువాత శ్రీరాముడు తన అవతారాన్ని ముగించాలి. 

9) కానీ రాముడు 11,000 సంవత్సరాలు భూమిపై ఉండి, భార్యను కలిగి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు.

10) ధర్మాన్ని అనుసరించి మనిషి జీవితాన్ని ఎలా గడపవచ్చో చూపించాడు.


రామో విగ్రహావాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


1) సీతారాముల కంటే ఆదర్శ దంపతులు ఈ విశ్వంలో లేరు

2) భార్య, తండ్రి, తల్లి & కుటుంబ సభ్యులను ఎలా ప్రేమించాలో రాముడు చూపించాడు. 

3) రాముడు ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చూపించాడు (శ్రీరామ రాజ్యం) 

4) కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా గడపాలో రాముడు చూపించాడు. 

5) శ్రీరామ పట్టాభిషేకం / కళ్యాణం చేయడం అంటే ఈ భూమి మొత్తాన్ని ఆయనకు అప్పగించడం. 

6) తాను దేవుడని రాముడు ఎప్పుడూ అంగీకరించలేదు.

7) రాముడు మనిషిగా పుట్టి తన జీవితాంతం మనిషిగా మాత్రమే జీవించాడు.

8) ధర్మాన్ని అనుసరించే వారికి - చెట్లు,జంతువులు దేవతలు & మొత్తం ప్రకృతి కూడా వారికి సహాయం చేస్తాయి.


శ్రీరామ నవమి

 - 30 Mar, గురువారం


రామో విగ్రహావాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


ఒకప్పుడు పార్వతి దేవి ఈ ప్రశ్నను శివుడికి వేసింది -

 

విష్ణు సహస్రనామం చాలా సులభంగా చదివిన ప్రయోజనం ప్రజలకు ఎలా లభిస్తుంది? 

 

అప్పుడు శివుడు ఇలా సమాధానమిచ్చాడు - ఈ క్రింది శ్లోకం ద్వారా లభిస్తుంది - 


‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’ 


అక్షరాలను సంఖ్యలుగా మార్చినట్లయితే, అప్పుడు


 రా = 2 & మా = 5 

 

రామ రామ రామ 


2 × 5 × 2 × 5 × 2 × 5 = 1000.


రామో విగ్రహావాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


*శ్రీరామాయణం ఎలా పుట్టింది*


1) ఎవరు గుణవంతుడు? 

2) ఎవరు గొప్పపరాక్రమము కలిగినవాడు?

3) ఎవరు ధర్మము తెలిసినవాడు?

4) ఎవరు కృతజ్ఞుడు?

5) ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు?

6) ఎవరి సంకల్పము అత్యంత దృఢమైనది?

7) ఎవరు మంచి నడవడి కలవాడు?

8) ఎవరు అన్ని ప్రాణులకు హితము గూర్చే వాడు

9) ఎవరు విద్వాంసుడు?

10) ఎవరు ఎంతటి కార్యాన్నయినా సాధించేవాడు?

11) ఎవరు చూసే వారికి ఎల్లప్పుడు సంతోషము కలిగించేవాడు?

12) ఎవరు ధైర్యము గలవాడు?

13) ఎవరు కోపమును జయించిన వాడు?

14) ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణకుతారు?

15) ఎవరు అసూయలేనివాడు?

16) ఎవరు కాంతి కలవాడు?


ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి ! 

ఆ మనిషి భూమిమీద ఎప్పుడయినా నడయాడినాడా?


అసలు అలాంటివాడు ఒకడుండటం సాధ్యమయ్యేపనేనా?

అలాంటి వాడినెవరినయినా బ్రహ్మగారు సృష్టించారా? 


*ఇలా వాల్మీకి మహర్షి నారద మునిని అడిగారు - పై ప్రశ్నలకు సమాధానం శ్రీరామాయణం యొక్క మూలం*.


రామో విగ్రహవాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


 *శ్రీరామాయణం నుండి సమాజంలో ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలు*


1) ఎటువంటి నియమ నిబంధనలను పాటించకుండా కొంతమంది సంతోషంగా జీవిస్తున్నట్లు మనం చూస్తాము. 

2) అవినీతికి గురైన & చట్టవిరుద్ధంగా డబ్బు సంపాదించేవారు

3) చెడు అలవాట్లు ఉన్నవారు చాలా ఆనందిస్తున్నారు.


4) ధర్మంగా సంపాదించే ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు & ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

5) ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఉపయోగం ఏమిటి? 


6) ధర్మాన్ని ఆచరించడం వ్యవసాయం సాగు చేయడం లాంటిది.

7) విత్తనాలు నాటే వాడు చివరికి పంటను ఖచ్చితంగా పొందుతాడు.


8) కానీ అధర్మం ఇంటికి చిన్న అగ్నిని పట్టుకోవడం లాంటిది.

9) ఇది చిన్న అగ్ని అని మనం విస్మరిస్తే, అది మొత్తం ఇంటిని కాల్చేస్తుంది. 


*మనం ధర్మాన్ని పాటిస్తే, ధర్మం మనలను రక్షిస్తుంది*..


రామో విగ్రహవాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


1) కొన్ని కోట్ల కోట్ల కోట్ల జన్మల తరువాత, మానవ పుట్టుక బహుమతిగా ఉంటుంది.

2) ఇందులో, భారతదేశంలో జన్మించడం ఇంకా కష్టం.

3) ఇందులో, సనాతన ధర్మంలో జన్మించడం ఇంకా కష్టం.

4) ఇందులో, అన్ని అవయవాలతో పుట్టడం ఇంకా కష్టం.

5) ఇందులో, రామ నామం చెప్పడం ఇంకా కష్టం.

6) ఇందులో, మానవ విలువలను కలిగి ఉన్న మంచి కుటుంబంలో జన్మించడం చాలా కష్టం.

7) ఇందులో, పరోపకార విలువలతో మంచి తల్లిదండ్రులను కలిగి ఉండటం ఇంకా కష్టం.

8) ఇందులో, భక్తి ఆలోచన కలిగి ఉండటం ఇంకా కష్టం.

9) ఇందులో శ్రీరామాయణం వినడం, రాముడి గురించి తెలుసుకోవడం ఇంకా కష్టం. 


*10) వశిష్ట మహర్షి శ్రీరామ అనే పేరును ఉంచడానికి దశరథ మహారాజు - ఇక్ష్వాక రాజ్యంలో వేల సంవత్సరాలు గడిపారు*


రామో విగ్రహవాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


*రాముడి గురించి ఎవరికి తెలుసు?*


శివుడికి / సీతమ్మకి / హనుమకి - ఈ ముగ్గురికి మాత్రమే రాముడి గురించి పూర్తిగా తెలుసు

 

మీరు రాముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?


శ్రీరామాయణం వినండి / శ్రీరామాయణం చదవండి

 

*మనం శ్రీరామాయణం వింటే -*


1) మన మాటలు మారుతాయి 

2) మన భాష మారుతుంది 

3) మన జీవితం మారుతుంది 

4) మన విధి మారుతుంది 

5) మన జీవన విధానం మారుతుంది 

6) మన ప్రాధాన్యతలు మారుతాయి 

7) మన పాత్ర మారుతుంది 

8) మన అలవాట్లు మారుతాయి 

9) మన సంబంధాలు మారుతాయి 

10) మన వైఖరి మారుతుంది


*శ్రీరామాయణం సాహిత్యానికి ఆ శక్తి ఉంటుంది*


కాబట్టి అందరికీ 

సర్వేజనాసుఖినోభవంతు !!

కోవిడ్ కొత్త మార్గదర్శకాలివే..

 *కోవిడ్ కొత్త మార్గదర్శకాలివే..*



1. వెంటిలేషన్ తక్కువగా ఉన్న చోట పెద్ద ఎత్తున గుమిగూడకుండా జాగ్రత్త పడాలి. దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వారి మరింత అప్రమత్తంగా ఉండాలి.

2.బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఖర్చీఫ్ వాడాలి.

3.చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. పబ్లిక్ ప్లేసెస్లో ఉమ్మివేయకూడదు. టెస్టింగ్ సంఖ్యను పెంచాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి.

4.లక్షణాలు కనిపిస్తే ఎవరినీ కలవకుండా జాగ్రత్తపడాలి.


పంచ సూత్రాలు..


అన్ని రాష్ట్రాలు 5 సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఇటీవలే ఆదేశించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇవే సూత్రాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి మాక్ డ్రిల్ కూడా చేస్తామని కేంద్రం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతుందని తెలిపింది. వీటితోపాటు కొవిడ్, ఇన్ఫ్లుయెంజా మందులు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని ఆదేశించింది కేంద్రం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇవి తప్పకుండా అందుబాటులో ఉండాలని చెప్పింది. ఒకవేళ ఉన్నట్టుండి బాధితుల సంఖ్య పెరిగితే..అందుకు తగ్గట్టుగా పడకలు ఉన్నాయో లేదో ముందే జాగ్రత్త పడాలని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 220 కోట్లకుపైగా వ్యాక్సిన్లు అందించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.


"ప్రస్తుతానికి హాస్పిటలైజేషన్ పెరుగుతున్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. ఏదేమైనా ప్రికాషనరీ డోస్లు తీసుకోవాలి. వీటి సంఖ్య పెంచాలి. టెస్టింగ్ల సంఖ్య కూడా పెంచాలి. ఎప్పటికప్పుడు వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాలి"


- కేంద్ర ఆరోగ్య శాఖ

*సేకరణ*